చెన్నై: రాజస్తాన్ రాయల్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 14వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. భారత్‌తో జరిగిన సిరీస్‌లో గాయంతోనే బరిలోకి దిగిన ఆర్చర్ వన్డే సిరీస్ మధ్యలోనే శస్త్ర చికిత్స కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. ఆర్చర్ చేతి వేలికి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించగా.. ఐపీఎల్ తొలి అంచె పోటీలకు ఆర్చర్ దూరమైనా.. రెండో అంచె పోటీలకు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. కానీ ఆర్చర్ గాచం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని తాజాగా వైద్యులు నిర్థారించారు. దీంతో ఐపీఎల్ 14వ సీజన్‌కు ఆర్చర్ పూర్తిగా దూరమైనట్లు ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ బెన్ స్టోక్స్ గాయపడి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక బయోబబూల్‌లో ఉండలేనంటూ లియామ్ లివింగ్‌స్టోన్ అర్థంతరంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. తాజాగా ఆర్చర్ కూడా దూరమవ్వడంతో రాజస్తాన్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక ఐపీఎల్ 14వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ఫేలవ ప్రదర్శన కొనసాగిస్తుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములు.. ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. గురువారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
చదవండి: రాజస్తాన్ రాయల్స్‌కు కొత్త ఆటగాడు.. రాత మారుతుందా!
ఇలా అయితే ఐపీఎల్ నుంచి మొదటగా వెళ్లేది వాళ్లే
Comments
Please login to add a commentAdd a comment