![We Were Locked In Room For 5 Days Mustafizur Rahman On Quarantine - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/11/Mustafizur.jpg.webp?itok=Cf5cZttn)
ఢాకా: బయోబబుల్ తనకు నరకంలా కనిపించిందని బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ తెలిపాడు. కొన్ని నెలలుగా బమోబబూల్‌లో ఉంటూ మ్యాచ్‌లు ఆడడం విసుగు తెప్పించదని పేర్కొన్నాడు. కాగా ముస్తాఫిజుర్ న్యూజిలాండ్ పర్యటన అనంతరం ఐపీఎల్‌లో ఆడేందుకు ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ముస్తాఫిజుర్ ఈ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించి 8 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీశాడు. కాగా ఐపీఎల్ 2021కి కరోనా మహమ్మారి సెగ తగలడంతో సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ముస్తాఫిజుర్, సహచర ఆటగాడు.. ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌లు తమ ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసిన ప్రత్యేక చార్టడ్ ఫ్లైట్‌లో బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న ముస్తాఫిజుర్ ఇన్‌స్టా వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'' ఇంటికి తిరిగివచ్చినందుకు సంతోషంగా ఉంది. గత కొన్ని నెలలుగా బయోబబుల్‌లో ఉండడం ఇబ్బందిగా అనిపించింది. మమ్మల్ని ఇంటికి క్షేమంగా పంపించినందుకు రాజస్తాన్ రాయల్స్‌కు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. అయితే టోర్నీ మధ్యలో ఆటగాళ్లకు కరోనా సోకడంతో మమ్మల్ని ఐదు నుంచి ఆరు రోజుల పాటు ఒకే రూంలో ఉంచారు. ఆ సమయంలో మాత్రం నాకు నరకంగా అనిపించింది. ఇప్పుడు ఇంటికి చేరడంతో కాస్త ప్రశాంతంగా ఉంది. కొన్నిరోజుల పాటు క్రికెట్‌కు విరామమిచ్చి కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: 'జడ్డూ స్థానంలో వచ్చాడు.. ఇప్పుడు అవకాశం రాకపోవచ్చు'
కెప్టెన్‌గా పంత్.. కోహ్లి, రోహిత్‌లకు దక్కని చోటు
Comments
Please login to add a commentAdd a comment