
Photo: IPL Twitter
ఇంగ్లండ్ స్టార్ జో రూట్ రాజస్తాన్ రాయల్స్ తరపున ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకుండా పోయింది. పైగా రాజస్తాన్ రాయల్స్‌కు షాకిచ్చిన ఎస్‌ఆర్‌హెచ్ భారీ విజయాన్ని మూటగట్టుకుంది. దీంతో రూట్‌ను మరిచిపోయారు.
ఇక గురువారం కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ రూట్ ఆడాడు. వాస్తవానికి రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 14 పరుగులిచ్చాడు. ఇక్కడ విచిత్రమేంటంటే రూట్ బ్యాట్‌తో పరుగులు సాధించి ఐపీఎల్‌లో తన ఖాతా తెరుస్తాడని అంతా అనుకున్నారు. కానీ బౌలింగ్‌తో తన ఐపీఎల్ కెరీర్‌ను ఆరంభించాడు.
ఈసారి కూడా రూట్ ఆడిన విషయం వెలుగులోకి రాలేదు. కారణం యశస్వి జైశ్వాల్ చేసిన శివతాండవం. బ్యాటింగ్‌లో నాలుగో స్థానంలో రూట్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉండగా.. జైశ్వాల్, శాంసన్‌లు ఆ అవకాశం ఇవ్వకుండానే మ్యాచ్‌ను ముగించారు. 150 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లలోనే చేధించి రాజస్తాన్ రాయల్స్‌కు అతిపెద్ద విజయాన్ని అందించారు. ఇక రూట్ బ్యాటింగ్ చూసే అవకాశం రాబోయే మ్యాచ్‌లోనైనా వస్తుందేమోనని అభిమానులు ఆశ పడుతున్నారు.
Open your eyes, Joe Root is bowling in the IPL. pic.twitter.com/9L4rEyoJZV
— Rajasthan Royals (@rajasthanroyals) May 11, 2023