
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్.. ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ద్వారా జో రూట్ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ఇక రూట్ బ్యాటింగ్‌కు రాకముందే ఒక రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటో తెలుసా.. జో రూట్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం సహా ఐపీఎల్ డెబ్యూ కూడా భారత్‌లోనే జరగడం విశేషం.
అంతర్జాతీయ క్రికెట్‌లో జో రూట్ తన టెస్టు డెబ్యూను నాగ్‌పూర్ వేదికగా.. వన్డే డెబ్యూను రాజ్‌కోట్ వేదికగా.. ముంబై వేదికగా టి20ల్లో అరంగేట్రం చేశాడు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఈ మూడు సందర్భాల్లోనూ ప్రత్యర్థి టీమిండియానే కావడం విశేషం. ఇక తాజాగా జైపూర్ వేదికగా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.
ఇంతవరకు ఏ అంతర్జాతీయ క్రికెటర్ తన అరంగేట్రాన్ని ఈ విధంగా చూడలేదు. ఒక్క రూట్‌కు మాత్రమే ఇది సాధ్యమైంది. అందుకే క్రికెట్ అభిమానులు.. ''రూట్ పేరుకే ఇంగ్లండ్ ప్లేయర్.. కానీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా అన్ని అరంగేట్రంలు ఇక్కడే చేశాడు.. కాబట్టి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే రూట్ మనోడే'' అంటూ కామెంట్ చేశారు.
Test Debut: Nagpur
— JioCinema (@JioCinema) May 7, 2023
ODI Debut: Rajkot
T20I Debut: Mumbai#TATAIPL Debut: Jaipur
Joe Root's practically Indian by this point 😅#RRvSRH #IPLonJioCinema pic.twitter.com/jcCnBjNFvk
చదవండి: జైశ్వాల్ సరికొత్త చరిత్ర.. రెండో పిన్న వయస్కుడిగా రికార్డు
Comments
Please login to add a commentAdd a comment