Debut Match
-
'అమ్మ.. నీ ప్రార్థనలు ఫలించాయి; చల్లగా ఉండు బిడ్డా'
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తరపున ముకేశ్ కుమార్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా కిర్క్ మెకెంజీ రూపంలో ముకేశ్ కుమార్ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. 32 పరుగులు చేసిన మెకెంజీ ముకేశ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమిండియా తరపున అంతర్జాతీయ అరేగంట్రం చేసిన 395వగా ఆటగాడిగా ముఖేష్ కుమార్ నిలిచాడు.కాగా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ముఖేష్ కుమార్‌కు చోటు దక్కడం లేదు. అయితే రెండో టెస్టుకు గాయం కారణంగా పేసర్ శార్ధూల్ ఠాకూర్ దూరం కావడంతో.. ముఖేష్ ఎంట్రీకి మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే టీమిండియా తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ముకేశ్‌కుమార్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్‌కాల్‌లో తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''హలో అమ్మా.. నీ ప్రార్థనలకు ఈరోజు సమాధానం దొరికింది. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో పేర్కొన్నాడు. ముకేశ్ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్లో ఎదిగే ప్రయత్నం చెయ్యు.. నా దీవెనలు ఎప్పుడు నీ వెంట ఉంటాయి'' అంటూ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ వీడియో రూపంలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. 2015లో బెంగాల్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ముఖేష్ అడుగుపెట్టాడు. 2018-19 రంజీ సీజన్లో తన సత్తా ఎంటో క్రికెట్ ప్రపంచానికి ముఖేష్ తెలియజేశాడు. ఆ సీజన్లో కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో 6 వికెట్లు పడగొట్టి.. బెంగాల్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ముఖేష్ తన కెరీర్లో వెనక్కి తిరిగి చూడలేదు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 39 మ్యాచ్‌లు ఆడిన అతడు 149 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2023 మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వచ్చిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించాడు. అనంతరం డబ్ల్యూటీసీ ఫైనల్- 2023కి స్టాండ్ బైగా కూడా ఎంపికయ్యాడు. No Dream Too Small! 🫡 Mukesh Kumar's phone call to his mother after his Test debut is all heart ❤️#TeamIndia | #WIvIND pic.twitter.com/Sns4SDZmi2 — BCCI (@BCCI) July 21, 2023 Mukesh Kumar's maiden Test wicket! A moment for him to savour. A video for you to savour. #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/fpCQSf1LsF — FanCode (@FanCode) July 22, 2023 చదవండి: #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా! -
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా అన్నీ ఇక్కడే!
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్.. ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఆదివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ద్వారా జో రూట్ ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. ఇక రూట్ బ్యాటింగ్‌కు రాకముందే ఒక రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటో తెలుసా.. జో రూట్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం సహా ఐపీఎల్ డెబ్యూ కూడా భారత్‌లోనే జరగడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్లో జో రూట్ తన టెస్టు డెబ్యూను నాగ్‌పూర్ వేదికగా.. వన్డే డెబ్యూను రాజ్‌కోట్ వేదికగా.. ముంబై వేదికగా టి20ల్లో అరంగేట్రం చేశాడు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఈ మూడు సందర్భాల్లోనూ ప్రత్యర్థి టీమిండియానే కావడం విశేషం. ఇక తాజాగా జైపూర్ వేదికగా ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇంతవరకు ఏ అంతర్జాతీయ క్రికెటర్ తన అరంగేట్రాన్ని ఈ విధంగా చూడలేదు. ఒక్క రూట్‌కు మాత్రమే ఇది సాధ్యమైంది. అందుకే క్రికెట్ అభిమానులు.. ''రూట్ పేరుకే ఇంగ్లండ్ ప్లేయర్.. కానీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా అన్ని అరంగేట్రంలు ఇక్కడే చేశాడు.. కాబట్టి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే రూట్ మనోడే'' అంటూ కామెంట్ చేశారు. Test Debut: Nagpur ODI Debut: Rajkot T20I Debut: Mumbai#TATAIPL Debut: Jaipur Joe Root's practically Indian by this point 😅#RRvSRH #IPLonJioCinema pic.twitter.com/jcCnBjNFvk — JioCinema (@JioCinema) May 7, 2023 చదవండి: జైశ్వాల్ సరికొత్త చరిత్ర.. రెండో పిన్న వయస్కుడిగా రికార్డు -
అరంగేట్రంలోనే అదుర్స్.. ఐపీఎల్ చరిత్రలో నాలుగో ఆటగాడిగా
విండీస్ హార్డ్ హిట్టర్ కైల్ మేయర్స్‌కు ఇదే తొలి ఐపీఎల్. సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న మేయర్స్ డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 38 బంతుల్లో 73 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో ఉన్నంతసేపు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడిన మేయర్స్ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. డెబ్యూ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. Photo: Jio Cinema Twitter ఇంతకముందు బ్రెండన్ మెక్కల్లమ్(కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ, 2008)) 158* పరుగులు తొలి స్థానంలో ఉండగా.. మైక్ హస్సీ(సీఎస్కే వర్సెస్ పంజాబ్, 2008) రెండో స్థానంలో, షాన్ మార్ష్ 84* పరుగులు(పంజాబ్ కింగ్స్ వర్సెస్ డెక్కన్ చార్జర్స్ ,2008) మూడో స్థానంలో ఉన్నాడు. తాజాగా కైల్ మేయర్స్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 73 పరుగులు చేసి ఔరా అనిపించాడు. A sneak peek of some brute force from Barbados 🇧🇧 If you're in Lucknow, watch your head! Watch #LSGvDC LIVE & FREE on #JioCinema across all telecom operators 🙌#IPL2023 #TATAIPL2023 #IPLonJioCinema pic.twitter.com/tQ2ekEF0lX — JioCinema (@JioCinema) April 1, 2023 చదవండి: IPL 2023: తొలిరోజే అట్టర్‌ప్లాఫ్.. ఏకిపారేసిన అభిమానులు -
24 బంతుల్లో 17 డాట్‌బాల్స్.. సూపర్ ఎంట్రీ
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో భోణీ కొట్టింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. టి20 క్రికెట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా అతను నిలిచాడు. బిష్ణోయ్ అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చదవండి: IND VS WI: సూర్య మాటకు కట్టుబడిన వెంకటేశ్ అయ్యర్.. వీడియో వైరల్ మ్యాచ్‌లో అతని ‘గూగ్లీ’లను ఆడలేక ఇబ్బంది పడిన విండీస్ బ్యాటర్లు ఒకే ఒక ఫోర్ కొట్టగలిగారు. బిష్ణోయ్ వేసిన 24 బంతుల్లో అసలు పరుగే ఇవ్వని ‘డాట్ బాల్స్’ 17 ఉండటం విశేషం. మొదటి మ్యాచ్‌లో సహజంగానే ఉండే ఒత్తిడి వల్ల క్యాచ్ అందుకునే క్రమంలో బౌండరీ లైన్‌ను తాకి సిక్స్ ఇచ్చిన అతను 6 వైడ్లు వేశాడు. అయితే ఓవరాల్‌గా చూస్తే బిష్ణోయ్ ప్రదర్శన సూపర్ అనే చెప్పొచ్చు. రాజస్తాన్‌కు చెందిన బిష్ణోయ్ 42 దేశవాళీ టి20 మ్యాచ్‌లలో 6.63 ఎకానమీతో 49 వికెట్లు పడగొట్టాడు. 2020 అండర్–19 ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లలో సీనియర్ జట్టు తరఫున జట్టుకు తొలి ఆటగాడిగా బిష్ణోయ్ గుర్తింపు పొందాడు. Congratulations to Ravi Bishnoi who is all set to make his debut for Team India.@Paytm #INDvWI pic.twitter.com/LpuE9QuUkk — BCCI (@BCCI) February 16, 2022 -
ఎంఎస్ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు
17 years of Dhonism: ఎంఎస్ ధోని.. ఒక చరిత్ర.. టీమిండియాకు దొరికిన ఒక వరం.. రెండు ప్రపంచకప్‌లు అందించిన గొప్ప కెప్టెన్.. మంచి వికెట్ కీపర్.. సూపర్ ఫినిషర్.. గొప్ప మార్గనిర్దేశకుడు.. ఇలా చెప్పుకుంటే పోతే ఇంకా వస్తూనే ఉంటాయి. టీమిండియా కెప్టెన్‌గా దశాబ్దం పాటు క్రికెట్‌ను ఒక ఊపు ఊపిన ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి డిసెంబర్ 23నాటికి(ఇవాళ్టికి) 17 ఏళ్లు పూర్తయింది. ధోని అరంగేట్రం ఎలా జరిగిందన్నది అందరికి తెలిసిన విషయమే. అయినా సరే ధోని గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్న బోర్ కొట్టదు. అందుకే మరోసారి ప్రస్తావించుకోవాల్సిన సమయం ఇది. -సాక్షి, వెబ్‌డెస్క్ అది 2004వ సంవత్సరం.. టీమిండియా కెప్టెన్‌గా రాహుల్ ద్రవిడ్ వ్యవహరిస్తున్నాడు. దీనికి తోడూ అప్పటికే గంగూలీ తెచ్చిన పిచ్చి ప్రయోగంలో భాగంగా ద్రవిడ్ కీపర్‌గానూ వ్యవహరించేవాడు. అటు కెప్టెన్‌గా.. ఇటు వికెట్ కీపర్‌గా ఒత్తిడి మీద పడుతుండడంతో ద్రవిడ్ బ్యాటింగ్‌లో లోపాలు కనిపించాయి. ద్రవిడ్ ఇలా అన్ని బ్యాలెన్స్ చేయలేనని.. ఒక మంచి వికెట్ కీపర్ అవసరం ఉందంటూ బీసీసీఐకి తెలిపాడు. దీంతో ఈ సమస్యను అధిగమించేందుకు బీసీసీఐ ఒక నిఖార్సైన వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ కోసం ఎదురుచూస్తుంది. అప్పటికే దినేశ్ కార్తీక్, పార్థివ్ పటేల్ లాంటి వికెట్ కీపర్లు ఉన్నారు. ఇక అంతకుముందు రెండు నెలల క్రితం( 2004 సెప్టెంబర్ నెలలో) దినేశ్ కార్తిక్ టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ముందు అతన్నే బంగ్లాదేశ్ టూర్‌కు ఎంపికచేయాలని బీసీసీఐ భావించింది. కానీ ఇండియా - ఏ తరపున ఒక జులపాల జుట్టు ఉన్న వ్యక్తి వికెట్ కీపర్‌గా.. బ్యాట్స్‌మన్‌గా అదరగొడుతున్నాడనే వార్త వచ్చింది. వెంటనే ధోనిని పిలిచి బంగ్లాదేశ్ టూర్‌కు సెలక్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అలా అంతర్జాతీయ క్రికెట్లో ధోని తొలి అడుగు పడింది. అలా 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే ధోని అరంగేట్రం అనుకున్నంత గొప్పగా ఏం జరగలేదు. ఆ మ్యాచ్‌లో ధోని ఎదుర్కొన్న తొలి బంతికే బంగ్లా బౌలర్ తపస్ బైస్యా రనౌట్ చేశాడు. దీంతో ధోని గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే ధోనిపై సెలక్టర్లు నమ్మకముంచి పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. ఆ సిరీస్ ధోనికి టర్నింగ్‌పాయింట్ అవుతుందని ఎవరు ఊహించలేదు. విశాఖపట్నం వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో 123 బంతుల్లోనే 148 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ''జులపాల జట్టు.. బలమైన దేహదారుడ్యంతో అతను బంతిని కసితీరా బాదుతుంటే మేము చాలా ఎంజాయ్ చేశామంటూ..టీమిండియాకు నిఖార్సైన వికెట్ కీపర్ దొరికాడంటూ'' అప్పటి మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు పేర్కొనడం వైరల్‌గా మారింది. ఇక శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ధోని కెరీర్లో మరో కీలక మలుపు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొంది మూడోస్థానంలో వచ్చిన ధోని తుపాను ఇన్నింగ్స్ ఆడాడు. లంక విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఒంటిచేత్తో ఏకిపారేశాడు. 145 బంతుల్లో 183 పరుగులు సుడిగాలి ఇన్నింగ్స్‌తో అందరిని ఆకట్టకున్నాడు. ఇక్కడినుంచి ధోనికి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అప్పటినుంచి కీలక బ్యాటర్‌గా ఎదుగుతూ.. మంచి ఫినిషర్‌గా తనదైన ముద్ర వేశాడు. ఇక బ్యాటింగ్ సంగతి పక్కనబెడితే.. 2007లో ద్రవిడ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం.. తీసుకున్న తొలి ఏడాదిలోనే టి20 ప్రపంచకప్ అందించడం.. ఇక 28 సంవత్సరాల నిరీక్షణ తర్వాత టీమిండియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్‌గా ధోని నిలిచాడు. 2013లో టీమిండియాకు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ అందించిన ధోని ఇప్పటివరకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన తొలి కెప్టెన్‌గా.. ఒకే ఒక్కడిగా ఉన్నాడు. ఇక 2009లో టెస్టుల్లోనూ టీమిండియాను 600 రోజులపాటు నెంబర్‌వన్‌గా నిలిపాడు. ఇక చివరిసారి 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ధోని ఆఖరిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించాల్సిన సమయంలో ధోని రనౌటయ్యాడు. యాదృశ్చికంగా రనౌట్‌తో కెరీర్‌ను ఆరంభించిన ధోని.. అదే రనౌట్‌తో కెరీర్‌ను ముగించాడు. ఇక కెప్టెన్‌గా లెక్కలేనన్ని ఘనతలు.. బ్యాట్స్‌మన్‌గా.. ఫినిషర్‌గా రికార్డలు.. అవార్డులు అందుకున్న ధోని ఆగస్టు 15, 2020లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాడు. టీమిండియా కెప్టెన్‌గా ధోనిని ఐసీసీ ముచ్చటపడిందేమో అన్నట్లుగా 2006, 2008, 2009, 2010,2011,2012,2013.. మొత్తంగా ఏడుసార్లు ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిపాడు. ఇక 2011లో ధోని ఐసీసీ స్పిరిట్ క్రికెట్ అవార్డు అందుకున్నాడు. #17YearsOfDhonism #MSDhoni#Dhonism #MSD @AbhigyaSingh11@Yuvraj96237914 Always Remember Who was there When NoBody Else Was....🙂🤏🙂🤏 pic.twitter.com/sDSGsl856F — Naman Sharma (@namansharma1819) December 23, 2021 -
డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు
Alex Carey Suprass Rishab Pant And 5 Others Set New Test Record Debut.. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ డెబ్యూ టెస్టులోనే అదరగొట్టాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టు ద్వారా క్యారీ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బ్యాటర్‌గా 12 పరుగులు చేసిన క్యారీ పెద్దగా ఆకట్టుకోకున్నా వికెట్ కీపర్‌గా మాత్రం అదుర్స్ అనిపించాడు. ఆడుతున్న తొలి టెస్టులోనే కీపర్‌గా 8 క్యాచ్‌లు అందుకొని చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి టెస్టులోనే అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న తొలి వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ రికార్డు సాధించాడు. చదవండి: Nathon Lyon: వికెట్ కోసం ఏడాది ఎదురుచూపులు.. ఇప్పుడు చరిత్ర ఇంతకముందు రిషబ్ పంత్(టీమిండియా) సహా క్రిస్ రీడ్, బ్రియాన్ టేబర్, చమర దనుసింఘే, పీటర్ నెవిల్, అలన్ నాట్లు తమ డెబ్యూ టెస్టులో వికెట్ కీపర్‌గా ఏడు క్యాచ్‌లు అందుకున్నారు. అయితే దక్షిణాఫ్రికా క్రికెటర్ క్వింటన్ డికాక్ ఒక టెస్టులో వికెట్ కీపర్‌గా తొమ్మిది క్యాచ్‌లు తీసుకున్నప్పటికీ అతనికి డెబ్యూ టెస్టు కాకపోవడం విశేషం. చదవండి: BBL 2021: సూపర్ క్యాచ్ పట్టాననే సంతోషం లేకుండా చేశారు ఇదే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలాన్‌ను ఔట్ చేయడం ద్వారా టెస్టుల్లో 400వ వికెట్ల మార్కును చేరుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్లు తీసిన ఆసీస్ మూడో బౌలర్‌గా.. ఓవరాల్‌గా 17వ బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా తరపున లియోన్ కంటే ముందు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్(708 వికెట్లు), గ్లెన్ మెక్‌గ్రాత్(563 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇక ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ప్రారంభించింది.ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టును నాలుగు రోజుల్లో ముగించింది. ఆసీస్ ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంగ్లండ్ విధించిన 20 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ఒక వికెట్ కోల్పోయి 5.1 ఓవర్లలో చేధించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు డిసెంబర్ 16- 20 వరకు అడిలైడ్ వేదికగా జరగనుంది. చదవండి: వన్డే వరల్డ్‌కప్ 2019.. అంబటిని జట్టులోకి తీసుకోవాల్సింది.. కానీ సెలక్టర్లే Click Video For Here: Alex Carey Suprass Rishab Pant And 5 Others https://t.co/vMdRHsexqM — sakshi analytics (@AnalyticsSakshi) December 11, 2021 Alex Carey becomes the first player in men's Tests to take eight catches on debut! #Ashes https://t.co/H7QXaUzvGY — cricket.com.au (@cricketcomau) December 11, 2021 -
అరంగేట్ర మ్యాచ్‌లో రికార్డులు సృష్టించిన శ్రేయస్ అయ్యర్..
Shreyas Iyer Century in Debut match: టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో పలు రికార్డులు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రేయస్ అయ్యర్ సెంచరీతో మెరిశాడు. తద్వారా అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన 16వ భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. అదే విధంగా డెబ్యూ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. 168 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 105 పరుగులు శ్రేయాస్ అయ్యర్ సాధించాడు. 105 పరుగులు చేసిన అయ్యర్ సౌథీ బౌలింగ్‌లో విల్ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా తొలి రోజు మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ చేతుల మీదుగా టీమిండియా క్యాప్(303)ను శ్రేయస్ అయ్యర్ అందుకున్నాడు. 🎥 A moment to cherish for @ShreyasIyer15 as he receives his #TeamIndia Test cap from Sunil Gavaskar - one of the best to have ever graced the game. 👏 👏#INDvNZ @Paytm pic.twitter.com/kPwVKNOkfu — BCCI (@BCCI) November 25, 2021 చదవండి: IND-A Vs SA- A: టీమిండియా బౌలర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్‌పై కోపంతో ఏం చేశాడంటే.. -
వార్నర్ స్థానంలో వచ్చాడు.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు
Jason Roy Maiden Fifty In SRH Debute Match.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ జేసన్ రాయ్ అద్భుత అర్థ సెంచరీతో మెరిశాడు. కాగా జేసన్ రాయ్‌కు ఎస్ఆర్హెచ్ తరపున ఇదే తొలి మ్యాచ్. కాగా తొలి మ్యాచ్‌లోనే డెబ్యూ అర్థశతకం సాధించిన రాయ్ చరిత్ర సృష్టించాడు. ఫామ్‌లో లేని వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాయ్ ఫోర్లు, సిక్సర్‌తో మెరుపులు మెరిపించాడు. మొత్తం 42 బంతులెదుర్కొన్న జేసన్ రాయ్ 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 82 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్ 36, లామ్రోర్ 29 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ విజయం దిశగా పయనిస్తుంది. 18 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు..
లండన్: న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డెవాన్ కాన్వే అరంగేట్రం ఇన్నింగ్స్‌తోనే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్శించాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో తన అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే డబుల్ సెంచరీ సాధించి, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో టిప్ ఫోస్టర్(287), జాక్ రుడాల్ఫ్(222*), లారెన్స్ రోవ్(214), మాథ్యూ సింక్లెయిర్(214), బ్రెండన్ కురుప్పు(201*)లు టెస్ట్ డెబ్యూలో డబుల్ కొట్టారు. మాథ్యూ సింక్లెయిర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కివీస్ ఆటగాడిగా కాన్వే రికార్డు నెలకొల్పాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కాన్వే మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ డెబ్యూలో బౌండరీతో సెంచరీని, సిక్సర్‌తో ద్విశతకాన్ని సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో లార్డ్స్ మైదానంలో గంగూలీ 25 ఏళ్ల కిందట నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టిన కాన్వే.. తాజాగా డబుల్ సాధించి అరుదైన క్రికెటర్ల క్లబ్‌లోకి చేరాడు. కాగా, ఈ మ్యాచ్‌లో కాన్వే(347 బంతుల్లో 200; 22 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ద్విశతకంతో పోరాడటంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. అతనికి హెన్నీ నికోల్స్(61), నీల్ వాగ్నర్(25 నాటౌట్) సహకరించడంతో కివీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో అరంగేట్రం బౌలర్ రాబిన్సన్ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్ వుడ్ 3, అండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. చదవండి: కోహ్లీతో నన్ను పోల్చకండి.. అతని స్టైల్ వేరు, నా స్టైల్ వేరు -
24 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన ప్రసిద్ద్ కృష్ణ
పూణే: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో అరంగేట్రం బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ(4/54) అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. మంగళవారం ఎమ్సీఏ మైదానం వేదికగా జరిగిన తొలి వన్డేలో కృనాల్ పాండ్యాతో పాటు వన్డే క్యాప్‌ను అందుకున్న ఈ పాతికేళ్ల కర్ణాటక పేసర్.. మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో జేసన్ రాయ్ (46), ప్రమాదకర బెన్ స్టోక్స్ (1)ను ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని ప్రారంభించి, ఆతరువాత మిడిల్ ఓవర్లలో సామ్ బిల్లింగ్స్ (18), టామ్ కర్రన్ (11) వికెట్లు తీసి ఇంగ్లండ్ ఓటమిని ఖరారు చేశాడు. మొత్తం 8.1 ఓవర్లు బౌల్ చేసిన ఆయన.. 54 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతను వన్డే అరంగేట్రంలో ఏ భారత బౌలర్‌కు సాధ్యపడని నాలుగు వికెట్ల ఘనతను సాధించాడు. గతంలో వన్డే అరంగేట్రంలో భారత బౌలర్లు నోయల్ డేవిడ్ (3/21), వరుణ్ అరోణ్ (3/24), హార్దిక్ పాండ్యా (3/31), పీయూస్ చావ్లా (3/37)లు మూడు వికెట్ల ప్రదర్శన చేయగా తాజాగా ప్రసిద్ద్ కృష్ణ ఆ నలుగురు బౌలర్లను వెనక్కునెట్టి నాలుగు వికెట్లు ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచాడు. వీరిలో స్పిన్నర్ నోయల్ డేవిడ్ 1997లో వెస్టిండీస్‌పై చేసిన ప్రదర్శన ఇప్పటి వరకు టాప్‌లో ఉండింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో ప్రసిద్ద్ కృష్ణ ఆ రికార్డును సవరించి 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. భారత బౌలర్ల ధాటికి లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ 42.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (98; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇదే వేదికగా రెండో వన్డే జరుగనుంది. చదవండి: అదరగొట్టిన అరంగేట్రం ఆటగాళ్లు.. టీమిండియాదే తొలి వన్డే -
'5 వికెట్లు.. ఈ డెబ్యూ చాలా స్పెషల్'
చెన్నె: టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. చెపాక్ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్ 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. తద్వారా టీమిండియా నుంచి అరంగేట్రంలోనే 5 వికెట్లు ఫీట్ అందుకున్న తొమ్మిదో ఆటగాడిగా..ఆరవ టీమిండియా స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. కాగా దిలీప్ దోషి తర్వాత రెండో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా డెబ్యూలోనే 5 వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు టీమిండియా నుంచి అరంగేట్రం టెస్టులో 5వికెట్ల ఫీట్ అందుకున్న స్పిన్నర్లలో వివి కుమార్(1960-61), దిలీప్ దోషి(1979-80), నరేంద్ర హిర్వాణి(1987-88), అమిత్ మిశ్రా(2008-09), రవిచంద్రన్ అశ్విన్(2011-12)లు ఉన్నారు. మ్యాచ్ అనంతరం అక్షర్‌పటేల్ మాట్లాడుతూ..'డెబ్యూ టెస్టులోనే ఐదు వికెట్లు తీయడం ఆనందం కలిగించింది. డెబ్యూ టెస్టూతోనే ఈ ఫీట్ సాధించడం నాకు చాలా స్పెషల్. చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండడంతో మా పని చాలా సులువైంది.ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంలో ముగ్గురు స్పిన్నర్లే వికెట్లు తీయడం అరుదుగా జరుగుతుంటుంది. నా స్పీడ్‌ను కంట్రోల్ చేసుకుంటూ బంతిని పదును పెడుతూ వికెట్లను రాబట్టగలిగాను. సీనియర్ బౌలర్ అశ్విన్‌తో పాటు కుల్దీప్ కూడా బౌలింగ్ టెక్నిక్‌లో సలహాలు ఇవ్వడం మరింత కలిసివచ్చింది. ఏది ఏమైనా మొదటిటెస్టులో ఓటమి పాలయిన వేదికలోనే రెండో టెస్టులో గెలిచి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్నామంటూ.' సంతోషాన్ని పంచుకున్నాడు. కాగా అక్షర్ పటేల్ టీమిండియా తరపున 38 వన్డేల్లో 45 వికెట్లు, 11 టీ20ల్లో 9 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ జట్టు 317 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. 482 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 164 పరుగులకే చాప చుట్టేసింది. చదవండి: అశ్విన్ దెబ్బకు వార్నర్‌తో సమానంగా స్టోక్స్ ఎట్టకేలకు కుల్దీప్ నవ్వాడు..! -
ధోని రనౌట్‌కు 16 ఏళ్లు..
ముంబై : ఈ దశాబ్దంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన రోజు ఇదే. డిసెంబర్ 23, 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా ధోని క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రం మ్యాచ్‌ను మంచి మెమొరబుల్‌గా మలుచుకోవాలని ప్రతి ఒక్క ఆటగాడు భావిస్తాడు. కానీ ఎంఎస్ ధోనికి మాత్రం తొలి మ్యాచ్ ఒక పీడకలగా మిగిలిపోయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన ఆనాటి మ్యాచ్‌లో ధోని తాను ఆడిన తొలి బంతికే రనౌట్ అయి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. తపష్ బైష్యా, ఖాలీద్ మసూద్‌లు కలిసి ధోనిని రనౌట్ చేశారు. (చదవండి : దీనిని 'క్యాచ్ ఆఫ్ ది సమ్మర్' అనొచ్చా..) తొలి మ్యాచ్‌లోనే ఇలాంటి ప్రదర్శన చేయడంపై అతను కొంత నిరుత్సాహం వ్యక్తం చేసినా... కొద్దిరోజుల్లోనే అతని విలువేంటనేది టీమిండియాకు అర్థమైంది. అక్కడినుంచి వెనుదిరిగి చూసుకోని ధోని మంచి ఫినిషర్‌గా నిలిచాడు. అంతేగాక క్రికెట్ చరిత్రలోనే గొప్ప కెప్టెన్ల సరసన చోటు సంపాదించాడు. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోపీలను సాధించిపెట్టిన ఘనతను సొంతం చేసుకున్నాడు. కానీ విచిత్రం ఏమిటంటే.. ధోని ఏ రనౌట్‌తో కెరీర్‌ను ప్రారంభించాడో యాదృశ్చికంగా అదే రనౌట్‌తో కెరీర్‌ను ముగించాడు. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో మార్టిన్ గప్టిల్ వేసిన డైరెక్ట్ త్రో ద్వారా రనౌట్ అయ్యాడు. తద్వారా మరోకప్ సాధించనున్నామనే భావనలో ఉన్న కోట్లాది మంది హృదయాలను విషాదంలోకి నెట్టాడు. ఆ తర్వాత ధోని మళ్లీ అంతర్జాతీయ బరిలోకి దిగలేదు. తన రిటైర్మెంట్పై ఎన్నో రకాల వార్తల వస్తున్న నేపథ్యంలో ఆగస్టు 15, 2020న ధోని తన ట్విటర్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అతని అభిమానులను దిగ్బ్రాంతికి లోనయ్యేలా చేశాడు. (చదవండి : 'పంత్‌కు కీపింగ్...సాహాకు బ్యాటింగ్ రాదు') ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై దారుణ ప్రదర్శన కనబరించింది. ధోని కెప్టెన్సీలోని చెన్నై జట్టు 14 మ్యాచుల్లో 6 విజయాలు, 8 ఓటములతో 7వ స్థానంలో నిలిచింది. అయితే ఐపీఎల్ ముగిసిన తర్వాత ధోని ఐపీఎల్‌కు కూడా దూరమవుతాడని అంతా భావించారు. ఈ విషయంపై నేరుగా స్పందించిన ధోని.. 2021 ఐపీఎల్లో ఆడనున్నట్లు తానే స్వయంగా సంకేతాలు ఇచ్చాడు. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో ధోని టీమిండియా తరపున 350 వన్డేలు, 90 టెస్టులు, 98 టీ20లు ఆడాడు. ఇదే రోజుకు మరో విశేషం కూడా ఉంది. క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు సాధించి చరిత్ర సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డేలకు ఇదే రోజు గుడ్‌బై చెప్పాడు. -
‘అప్పుడు ధోని ఏం చెప్పాడంటే?’
వెల్లింగ్టన్: గత నాలుగేళ్లలో టీమిండియా పేస్ దళం పూర్తిగా మారిపోయింది. దేశవిదేశాల్లో రాణిస్తూ.. టీమిండియా సాధించిన అపూర్వ విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అయితే పేస్ దళానికి నాయకత్వం వహిస్తూ.. వికెట్లు పడగొడుతూ.. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ సహచర బౌలర్లకు మార్గ నిర్దేశం చేస్తున్నాడు జస్ప్రిత్ బుమ్రా. జనవరి, 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన బుమ్రా తిరిగి వెనక్కి చూసుకోలేదు. అరంగేట్ర మ్యాచ్‌లోనే పది ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ దక్కించుకున్నాడు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసి ఔరా అనిపించాడు. అయితే ఆనాటి మ్యాచ్ గురుతులను అభిమానులతో బుమ్రా తాజాగా పంచుకున్నాడు. ‘అరంగేట్రపు మ్యాచ్ ప్రతీ ఒక్క క్రికెటర్‌కు జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు. అయితే తొలి మ్యాచ్‌లో ఆ క్రికెటర్‌పై అందరిలోనూ ఎన్నో ఆశలు అంతకుమించి ఎన్నో అంచనాలు ఉంటాయి. దీంతో ఆ అరంగేట్ర ఆటగాడిపై అధిక ఒత్తిడి ఉంటుంది. రాణిస్తే ఫర్వాలేదు.. లేదంటే జట్టులో స్థానమే పోతుంది. ఇలాంటి ఆలోచనలు అరంగేట్రపు మ్యాచ్‌లో నా మదిలో కూడా మెదిలాయి. మ్యాచ్‌లో తొలి బంతి వేయడానికి ముందు ఎవరూ నాదగ్గరికి రాలేదు.. ఏం చెప్పలేదు. కానీ ఎంఎస్ ధోని మాత్రం నేను బౌలింగ్‌కు సిద్దమవుతున్న సమయంలో నా దగ్గరికి వచ్చి నీకు నువ్వులా ఉండు. నీ ఆటను నువ్వు ఎంజాయ్ చేయ్, ఆస్వాదించు’ అంటూ ధోని తనలో ధైర్యం నింపాడని బుమ్రా తెలిపాడు. ఇక వెన్నుగాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమైన బుమ్రా రీఎంట్రీలో పేలవ ఫామ్‌తో నిరుత్సాహపరుస్తున్నాడు. దీంతో అతడిపై అన్ని వైపులా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: ‘ఆ విషయంలో ఆమెకు ఫుల్ లైసెన్స్’ ట్రంప్‌ను ట్రోల్ చేసిన పీటర్సన్, ఐసీసీ ముష్ఫికర్ ‘డబుల్’ చరిత్ర -
బుమ్రా మాములోడు కాదు..!
సాక్షి, హైదరాబాద్ : భారత స్టార్ పేస్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా మాములోడు కాదు. అరంగేట్ర మ్యాచుల్లోనే దిగ్గజ ఆటగాళ్లను తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టి పెవిలియన్‌కు చేర్చాడు. తొలుత భారత ప్రతిష్టాత్మక లీగ్ ఐపీఎల్లో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ కోహ్లిని అవుట్ చేసిన ఈ ముంబై ఆటగాడు.. అరంగేట్ర వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. టీ20లో డేంజరస్ బ్యాట్స్‌మన్ అయిన డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేశాడు. షార్ట్ ఫార్మాట్లో తనదైన శైలితో స్పెషలిస్ట్ బౌలర్‌గా ముద్ర వేసుకున్న బుమ్రా లాంగెస్ట్ ఫార్మట్‌లో అరంగేట్రం చేయడానికి చాలా రోజులు నిరీక్షించాడు. తాజాగా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనతో ఆ అవకాశం కూడా ఈ ముంబై ఆటగాడికి వచ్చింది. కేప్‌టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు ద్వారా బుమ్రా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో సైతం బుమ్రా దిగ్గజ ఆటగాడు సఫారీ మాజీ కెప్టెన్ డివిలియర్స్‌ను అవుట్ చేసి తొలి వికెట్ దక్కించుకున్నాడు. అయితే అన్ని ఫార్మట్లలో బుమ్రా తొలి వికెట్‌గా కీలక వికెట్లను సాధించడం విశేషం. ఇదే విషయాన్ని ఐపీఎల్లో తన జట్టైన ముంబై ఇండియన్స్ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. విలక్షణ బౌలింగ్ శైలితో సచిన్ అండతో 2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన బుమ్రా.. తన తొలి ఓవర్‌ను భయపడుతూ ప్రారంభించాడు. వేసిన తొలి బంతినే కోహ్లి బౌండరీ తరలించగా.. రెండో బంతికే కోహ్లిని క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. భయపడుతూ పొట్టి క్రికెట్లో బౌలింగ్ ప్రారంభించిన బుమ్రా.. అదే బౌలింగ్‌తో బ్యాట్స్‌మన్‌ను బెంబేలిత్తిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై 2016లో వన్డే, టీ20లో అరంగేట్రం చేసిన ఈ యార్కర్ల కింగ్ వన్డేల్లో తొలి వికెట్‌గా స్టీవ్ స్మిత్, టీ20లో డేవిడ్ వార్నర్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. Starting with a bang 🔥@Jaspritbumrah93 has made it a habit of claiming big 'first wickets' in his career. #SAvIND pic.twitter.com/XYCdaCQYc9 — Mumbai Indians (@mipaltan) 6 January 2018 -
25 సంవత్సరాల క్రితం...
న్యూఢిల్లీ : సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం ఈ రోజు ఆస్ట్రేలియా క్రికెట్ స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ అరంగ్రేటం చేసిన రోజు. 1992, జనవరి 2న సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో తన క్రికెట్ జీవితాన్ని ప్రారంభించారు వార్న్. ప్రస్తుత టీమిండియా కోచ్‌ను రవిశాస్త్రి అవుట్ చేయడం ద్వారా తన టెస్టు వికెట్ల ఖాతాను తెరిచారు. మిగిలిన మ్యాచ్‌లలో భారత జట్టుపై వార్న్ అంతగా ప్రభావం చూపలేదు. 1993లో జరిగిన కొన్ని టెస్టు మ్యాచ్‌లలో విఫలమైనా.. యాషెస్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. దీంతో వార్న్ మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 2007లో జరిగిన యాష్స్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ను 708 వికెట్‌గా అవుట్ చేసిన వార్న్.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. వార్న్ పదిహేనేళ్ల క్రికెట్ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2003లో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో క్రికెట్ నుంచి నిషేధానికి గురయ్యాడు. -
రనౌట్‌తో ధోని అరంగ్రేటం!
-
మహేంద్రుడి ప్రస్థానానికి 13 ఏళ్లు..!
టీ20 ప్రపంచకప్.. వన్డేప్రపంచకప్.. చాంపియన్స్ ట్రోఫి..అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్. దాదాపు క్రికెట్లో ఉన్న టైటిల్లన్నీ అందించిన ఏకైక సారథి.. టెస్టులు.. వన్డేలు..టీ20ల్లో కలిపి అత్యధికంగా 331 మ్యాచ్‌ల్లో జట్టుకు నేతృత్వం వహించిన ఏకైక నాయకుడు. అర్జునుడి రథానికి కృష్ణుడిలా.. అతిరథ మహారథుల బృందానికి నాయకుడిగా విజయాలందించిన మహేంద్రుడి ప్రస్థానానికి నేటికి సరిగ్గా 13 ఏళ్లు.. ఈ సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.! మారుమూల చిన్న పట్టణం.. దిగువ మధ్యతరగతి కుటుంబం.. కావల్సినంత ప్రతిభ.. అవకాశాలు పరిమితం.. కష్టాలు.. అపరిమితం.. కుటుంబ బాధ్యతలు.. తండ్రి పడుతున్న కష్టాలు.. క్రికెట్ కెరీర్ కొనసాగించాలా.. ఉద్యోగంలో కొనసాగాలా.. ఇలాంటి పరిస్థితి నుంచి భారతీయ క్రికెట్లో తారజువ్వలా దూసుకొచ్చాడు.. రాంచీ ఆటగాడు..! 13 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు (డిసెంబర్ 23, 2004) బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. చిట్టగాంగ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో.. మైదానంలోకి దిగాడు ధోని.. ఎదుర్కొన్న తొలి బంతికే అవతల ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌తో సమన్వయ లోపం వల్ల రనౌట్‌గా గోల్డెన్ డకౌట్ అయ్యాడు. తరువాతి మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 23 పరుగులే చేశాడు. అనంతరం తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకొని వైజాగ్‌లో పాకిస్థాన్‌పై తొలి సెంచరీ సాధించాడు. ఆనాటి నుంచి నేటి వరకు ధోనికి తిరుగులేదు. ఎన్ని విమర్శలొచ్చిన నోటితో కాకుండా బ్యాట్‌తోనే బదులిచ్చాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా.. యువ ఆటగాళ్లకు అండగా ఉంటూ.. పెదన్నలా వ్యవహిరిస్తున్నాడు. ప్రస్తుతం కెప్టెన్ కోహ్లి.. వైస్ కెప్టెన్ రోహిత్ అయినా.. క్లిష్ట పరిస్థితిల్లో కెప్టెన్సీ వహించేది ధోనినే అని అందరికి తెలిసిన విషయమే. ♦ కెప్టెన్‌గా ధోని.. తొలి టీ20 ప్రపంచకప్‌తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆరంభించిన ధోని.. సారథిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని సారథ్యంలో భారత్ 2007లో టీ20 ప్రపంచకప్, 2010 ఆసియా కప్, 2011 వన్డే ప్రపంచకప్.. 2013 ఛాంపియన్స్ ట్రోఫి.. 2016 ఆసియా కప్‌లు గెలుచుకుంది. టీమిండియాకు ఎన్నో ఘనతలు అందించడం సారథిగా ఎన్నో రికార్డులు నెలకొల్పడంలో ధోనిది భిన్నమైన శైలి. చివరికి విడ్కోలు పలకడంలోనూ అతని దారే వేరు. 2014లో ఊహించని విధంగా టెస్టులకు వీడ్కోలు చెప్పిన ధోని.. ఈ ఏడాది చడీచప్పుడు కాకుండా వన్డే, టీ20 జట్టు సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన తొలి భారతీయ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని. అత్యధిక వన్డేలకు కెప్టెన్సీ చేసిన వారిలో ఆస్ట్రేలియా ఆటగాడు పాంటింగ్(230), న్యూజిలాండ్ ఫేమింగ్ (218)ల తర్వాతి స్థానం ధోని(199)దే. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఆటగాడిగా ధోని(331)నిలిచాడు. కెప్టెన్‌గా అత్యధిక టీ20(72)లు ఆడిన .. అత్యధిక టీ20లు (41) గెలిచిన ఆటగాడు కూడా ధోనినే. 2009లో ధోని నాయకత్వంలో తొలిసారిగా భారత్ టెస్టుల్లో నెం.1 గా నిలిచింది. ♦ వికెట్ కీపర్‌గా .. మహేంద్ర సింగ్ ధోని కీపర్‌గా ఎన్నో రికార్డులు నమోదు చేశాడు. అతను వికెట్ల వెనుక ఉంటే ఏ బ్యాట్స్‌మెన్ క్రీజు దాటాలన్నా ఓసారి ఆలోచించాల్సిందే. 90 టెస్టులాడిన ధోని కీపర్‌గా 256 అవుట్లలో పాలుపంచుకొని ఈ ఫార్మట్‌లో ఐదో కీపర్‌గా గుర్తింపు పొందాడు. ఇందులో 256 క్యాచ్‌లు ఉండగా 38 స్టంప్ అవుట్లున్నాయి. ఇక వన్డేల్లోనైతే ఏకంగా 294 అవుట్లలో 105 స్టంపింగ్స్ ఉండటం విశేషం. దీంతో అత్యధిక స్టంప్ అవుట్లు చేసిన తొలి కీపర్‌గా రికార్డుకెక్కాడు. ఇక టీ20 ల్లో 47 అవుట్లలో 29 స్టంపింగ్లున్నాయి. ♦ ధోని పరుగులు.. 90 టెస్టుల్లో 6 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలతో 4,876 పరుగులు చేశాడు. 312 వన్డేల్లో 10 సెంచరీలు, 67 హాఫ్ సెంచరీలతో 9,898 పరుగులు చేసి 10 వేల క్లబ్లో చేరడానికి 102 పరుగుల దూరంలో ఉన్నాడు. 85 టీ20ల్లో 1 హాఫ్ సెంచరీతో 1,348 పరుగులు చేశాడు. రనౌట్‌తో ధోని అరంగ్రేటం! -
ఇంగ్లండ్ 258/7
మిరాజ్‌కు అరంగేట్రంలోనే 5 వికెట్లు బంగ్లాదేశ్‌తో తొలిటెస్టు చిట్టగాంగ్: బంగ్లాదేశ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ (5/64) అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఇంగ్లండ్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. దీంతో గురువారం మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్సలో 92 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. మొరుున్ అలీ (68; 8 ఫోర్లు, 1 సిక్స్), బెరుుర్ స్టో (52; 8 ఫోర్లు) అర్ధసెంచరీలు సాధించగా, రూట్ (40) రాణించాడు. వోక్స్ (36 బ్యాటింగ్), రిషీద్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆడిన తొలి టెస్టులోనే 5 వికెట్లు తీసిన ఏడో బంగ్లా బౌలర్‌గా 18 ఏళ్ల మిరాజ్ ఘనత సాధించాడు. షకీబుల్ హసన్‌కు 2 వికెట్లు దక్కారుు. ఒక దశలో మిరాజ్ స్పిన్‌కు ఇంగ్లండ్ 106 పరుగులకే 5 వికెట్లు కోల్పోరుు కష్టాల్లో పడింది. ఈ దశలో మొరుున్ అలీ, బెరుుర్ స్టో ఆదుకోవడంతో జట్టు కోలుకుంది.