సాక్షి, హైదరాబాద్ : భారత స్టార్ పేస్ బౌలర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా మాములోడు కాదు. అరంగేట్ర మ్యాచుల్లోనే దిగ్గజ ఆటగాళ్లను తన బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టి పెవిలియన్‌కు చేర్చాడు. తొలుత భారత ప్రతిష్టాత్మక లీగ్ ఐపీఎల్‌లో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ కోహ్లిని అవుట్ చేసిన ఈ ముంబై ఆటగాడు.. అరంగేట్ర వన్డేలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. టీ20లో డేంజరస్ బ్యాట్స్‌మన్ అయిన డేవిడ్ వార్నర్‌ను అవుట్ చేశాడు.
షార్ట్ ఫార్మాట్‌లో తనదైన శైలితో స్పెషలిస్ట్ బౌలర్‌గా ముద్ర వేసుకున్న బుమ్రా లాంగెస్ట్ ఫార్మట్‌లో అరంగేట్రం చేయడానికి చాలా రోజులు నిరీక్షించాడు. తాజాగా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనతో ఆ అవకాశం కూడా ఈ ముంబై ఆటగాడికి వచ్చింది. కేప్‌టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు ద్వారా బుమ్రా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో సైతం బుమ్రా దిగ్గజ ఆటగాడు సఫారీ మాజీ కెప్టెన్ డివిలియర్స్‌ను అవుట్ చేసి తొలి వికెట్ దక్కించుకున్నాడు. అయితే అన్ని ఫార్మట్లలో బుమ్రా తొలి వికెట్‌గా కీలక వికెట్లను సాధించడం విశేషం. ఇదే విషయాన్ని ఐపీఎల్‌లో తన జట్టైన ముంబై ఇండియన్స్ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది.
విలక్షణ బౌలింగ్ శైలితో సచిన్ అండతో 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన బుమ్రా.. తన తొలి ఓవర్‌ను భయపడుతూ ప్రారంభించాడు. వేసిన తొలి బంతినే కోహ్లి బౌండరీ తరలించగా.. రెండో బంతికే కోహ్లిని క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. భయపడుతూ పొట్టి క్రికెట్‌లో బౌలింగ్ ప్రారంభించిన బుమ్రా.. అదే బౌలింగ్‌తో బ్యాట్స్‌మన్‌ను బెంబేలిత్తిస్తున్నాడు. ఆస్ట్రేలియాపై 2016లో వన్డే, టీ20లో అరంగేట్రం చేసిన ఈ యార్కర్ల కింగ్ వన్డేల్లో తొలి వికెట్‌గా స్టీవ్ స్మిత్, టీ20లో డేవిడ్ వార్నర్‌లను పెవిలియన్‌కు చేర్చాడు.
Starting with a bang 🔥@Jaspritbumrah93 has made it a habit of claiming big 'first wickets' in his career. #SAvIND pic.twitter.com/XYCdaCQYc9
— Mumbai Indians (@mipaltan) 6 January 2018
Comments
Please login to add a commentAdd a comment