వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో భోణీ కొట్టింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. టి20 క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 95వ ఆటగాడిగా అతను నిలిచాడు. బిష్ణోయ్ అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే సూపర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
చదవండి: IND VS WI: సూర్య మాటకు కట్టుబడిన వెంకటేశ్ అయ్యర్.. వీడియో వైరల్
మ్యాచ్‌లో అతని ‘గూగ్లీ’లను ఆడలేక ఇబ్బంది పడిన విండీస్ బ్యాటర్లు ఒకే ఒక ఫోర్ కొట్టగలిగారు. బిష్ణోయ్ వేసిన 24 బంతుల్లో అసలు పరుగే ఇవ్వని ‘డాట్ బాల్స్’ 17 ఉండటం విశేషం. మొదటి మ్యాచ్‌లో సహజంగానే ఉండే ఒత్తిడి వల్ల క్యాచ్ అందుకునే క్రమంలో బౌండరీ లైన్‌ను తాకి సిక్స్ ఇచ్చిన అతను 6 వైడ్లు వేశాడు. అయితే ఓవరాల్‌గా చూస్తే బిష్ణోయ్ ప్రదర్శన సూపర్ అనే చెప్పొచ్చు. రాజస్తాన్‌కు చెందిన బిష్ణోయ్ 42 దేశవాళీ టి20 మ్యాచ్‌లలో 6.63 ఎకానమీతో 49 వికెట్లు పడగొట్టాడు. 2020 అండర్–19 ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లలో సీనియర్ జట్టు తరఫున జట్టుకు తొలి ఆటగాడిగా బిష్ణోయ్ గుర్తింపు పొందాడు.
Congratulations to Ravi Bishnoi who is all set to make his debut for Team India.@Paytm #INDvWI pic.twitter.com/LpuE9QuUkk
— BCCI (@BCCI) February 16, 2022
Comments
Please login to add a commentAdd a comment