చెన్నె: టీమిండియా క్రికెటర్ అక్షర్ పటేల్ అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. చెపాక్ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్ 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. తద్వారా టీమిండియా నుంచి అరంగేట్రంలోనే 5 వికెట్లు ఫీట్ అందుకున్న తొమ్మిదో ఆటగాడిగా..ఆరవ టీమిండియా స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. కాగా దిలీప్ దోషి తర్వాత రెండో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా డెబ్యూలోనే 5 వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు టీమిండియా నుంచి అరంగేట్రం టెస్టులో 5వికెట్ల ఫీట్ అందుకున్న స్పిన్నర్లలో వివి కుమార్(1960-61), దిలీప్ దోషి(1979-80), నరేంద్ర హిర్వాణి(1987-88), అమిత్ మిశ్రా(2008-09), రవిచంద్రన్ అశ్విన్(2011-12)లు ఉన్నారు.
మ్యాచ్ అనంతరం అక్షర్‌పటేల్ మాట్లాడుతూ..'డెబ్యూ టెస్టులోనే ఐదు వికెట్లు తీయడం ఆనందం కలిగించింది. డెబ్యూ టెస్టూతోనే ఈ ఫీట్ సాధించడం నాకు చాలా స్పెషల్. చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉండడంతో మా పని చాలా సులువైంది.ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంలో ముగ్గురు స్పిన్నర్లే వికెట్లు తీయడం అరుదుగా జరుగుతుంటుంది. నా స్పీడ్‌ను కంట్రోల్ చేసుకుంటూ బంతిని పదును పెడుతూ వికెట్లను రాబట్టగలిగాను. సీనియర్ బౌలర్ అశ్విన్‌తో పాటు కుల్దీప్ కూడా బౌలింగ్ టెక్నిక్‌లో సలహాలు ఇవ్వడం మరింత కలిసివచ్చింది. ఏది ఏమైనా మొదటిటెస్టులో ఓటమి పాలయిన వేదికలోనే రెండో టెస్టులో గెలిచి ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్నామంటూ.' సంతోషాన్ని పంచుకున్నాడు. కాగా అక్షర్ పటేల్ టీమిండియా తరపున 38 వన్డేల్లో 45 వికెట్లు, 11 టీ20ల్లో 9 వికెట్లు తీశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ జట్టు 317 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. 482 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 164 పరుగులకే చాప చుట్టేసింది.
చదవండి: అశ్విన్ దెబ్బకు వార్నర్‌తో సమానంగా స్టోక్స్
ఎట్టకేలకు కుల్దీప్ నవ్వాడు..!
'5 వికెట్లు.. ఈ డెబ్యూ చాలా స్పెషల్'
Published Tue, Feb 16 2021 1:27 PM | Last Updated on Tue, Feb 16 2021 2:28 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment