టీమిండియా సారథి రోహిత్ శర్మ- ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్
India vs England 1st Test Day 3 Updates: టీమిండియాతో తొలి టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. హైదరాబాద్‌లో శనివారం నాటి ఆట పూర్తయ్యే సరికి 77 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్ అద్భుత సెంచరీ కారణంగా ఈ మేరకు మెరుగైన స్కోరు సాధించింది.
మూడో రోజు హైదరాబాద్ టెస్టు ఆసక్తికరమైన మలుపులు తిరిగింది. ఆరంభంలో టీమిండియా, ఆ తర్వాత ఇంగ్లండ్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఓ దశలో మ్యాచ్ ఇండియా వైపే మొగ్గు చూపినా.. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ పోరాడడంతో ఆ జట్టుకు 126 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.
మూడో రోజు ఆట ముగిసే సరికి పోప్ 148, రెహాన్ అహ్మద్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ రెండు, జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 316/6 స్కోరు చేసిన ఇంగ్లండ్ ప్రస్తుతం భారత జట్టు కంటే 126 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఆరో వికెట్ డౌన్..
275 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన బెన్ ఫోక్స్‌ను.. అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి రెహాన్ ఆహ్మద్ వచ్చాడు. అతడితో పాటు ఓలీ పోప్(125) పరుగులతో ఉన్నాడు.
ఒలీ పోప్ టాప్ క్లాస్ సెంచరీ
60.2: జడేజా బౌలింగ్‌లో మూడు పరుగులు తీసి శతకం పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ వన్‌డౌన్ బ్యాటర్ ఒలీ పోప్. ఇంగ్లండ్ స్కోరు: 245/5 (61)
200 పరుగుల మార్కు అందుకున్న ఇంగ్లండ్
52 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 200-5
ఆధిక్యంలోకి ఇంగ్లండ్..
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగుల ఆధిక్యంలోకి వచ్చింది. 50 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. క్రీజులో పోప్(81), బెన్ ఫోక్స్(10) పరుగులతో ఉన్నారు.
టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 172/5 (42)
ఒలీ పోప్ 67, బెన్ ఫోక్స్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 18 పరుగులు వెనుబడి ఉంది.
స్టోక్స్ అవుట్
36.5: అశ్విన్ బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్(6). ఇంగ్లండ్ స్కోరు: 163/5 (36.5). టీమిండియా ఇంకా 27 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. స్టోక్స్ స్థానంలో బెన్ ఫోక్స్ క్రీజులోకి వచ్చాడు. పోప్ 60 పరుగులతో ఆడుతున్నాడు.
28.3: పోప్ హాఫ్ సెంచరీ
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
27.4: .జడేజా బౌలింగ్‌లో బెయిర్‌స్టో బౌల్డ్(10). బెన్‌స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 140/4 (27.4)
27 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 136/3
బెయిర్ స్టో ఆరు, పోప్ 46 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా ఆధిక్యం 54 పరుగులు
ఇంగ్లండ్ స్కోరు: 122/3 (24).. టీమిండియాకు 68 పరుగుల ఆధిక్యం
బెయిర్‌స్టో 3, ఒలీ పోప్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు.
దెబ్బకు దెబ్బ కొట్టిన బుమ్రా
రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్‌లో రూట్(2) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. బెయిర్‌స్టో క్రీజులోకి వచ్చాడు. 21 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 117-3. కాగా అంతకు ముందు రూట్ బుమ్రాను బౌల్డ్ చేసిన సంగతి తెలిసిందే.
బుమ్రా మ్యాజిక్.. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
18.5: బుమ్రా బౌలింగ్‌లో బెన్ డకెట్(47) క్లీన్‌బౌల్డ్. దెబ్బకు ఎగిరిపడ్డ వికెట్. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. పోప్ 31 పరుగులతో ఆడుతున్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 113/2 (18.5). టీమిండియాకు ఇంకా 77 పరుగుల ఆధిక్యం
నిలకడగా ఆడుతున్న డకెట్, పోప్
16.3: డకెట్, పోప్ కలిసి 43 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. స్కోరు: 97-1(17). టీమిండియా ఆధిక్యం 93 రన్స్.
భోజన విరామ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 89/1 (15)
ఒలీ పోప్ 16, బెన్ డకెట్ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 101 పరుగులు వెనుకబడి ఉంది
12 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 67/1
డకెట్ 30, పోప్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.
క్రాలే దూకుడుకు బ్రేక్.. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
9.2: అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటైన ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే. 33 బంతుల్లోనే 31 పరుగులతో జోరు మీదున్న క్రాలేకు అశూ అడ్డుకట్ట వేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. అతడి స్థానంలో ఒలీ పోప్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 45/1 (9.2)
7 ఓవర్లలో స్కోరు: 33-0
క్రాలే 25, డకెట్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.
6.3: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన క్రాలే
5.5: అశ్విన్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన క్రాలే
5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 13-0
ఓపెనర్లు జాక్ క్రాలే 10, బెన్ డకెట్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఇంగ్లండ్ ఇంకా 177 పరుగులు వెనుకబడి ఉంది.
హైలైట్స్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 246
టీమిండియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు: 436
టీమిండియా ఆలౌట్.. ఓవరాల్‌గా 190 పరుగుల ఆధిక్యం
120.6: రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ బౌల్డ్. పదో వికెట్ కోల్పోయిన టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోరు: 436 (121). మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండు వికెట్లు తీయగా... రెహాన్ అహ్మద్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
వచ్చీ రాగానే బుమ్రా బౌల్డ్
119.4: జడ్డూ స్థానంలో క్రీజులోకి వచ్చిన బుమ్రా జో రూట్ బౌలింగ్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. అక్షర్ పటేల్ 44 పరుగులతో ఆడుతున్నాడు. టీమిండియా స్కోరు: 436/9 (120). 190 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
జడ్డూ అవుట్.. ఎనిమిదో వికెట్ డౌన్
119.3: జో రూట్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా వెనుదిరిగిన రవీంద్ర జడేజా. 87 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడ్డూ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. అతడి స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు.
టీమిండియా ఆధిక్యం 190 రన్స్
118.6: ఫోర్ బాదిన అక్షర్
179 పరుగుల ఆధిక్యంలో టీమిండియా
113: జడేజా 84, అక్షర్ పటేల్ 36 పరుగులతో క్రీజులో ఉన్నారు.
భారత్- ఇంగ్లండ్ మధ్య మొదలైన మూడో రోజు ఆట
రవీంద్ర జడేజా 83, అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 423-7(112).
రెండో రోజు హైలైట్స్
►శుక్రవారం నాటి ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోరు: 421/7
►కేఎల్ రాహుల్(86), జడేజా అర్ధ సెంచరీలు
►రాణించిన కేఎస్ భరత్(41), అక్షర్ పటేల్
ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్
టీమిండియా- ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభమైంది. హైదరాబాద్ వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే.
భారత బౌలర్ల విజృంభణతో 246 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన రోహిత్ సేన ప్రస్తుతం 175కు పైగా పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
తుదిజట్లు:
టీమిండియా
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ టామ్ హార్ట్లే, మార్క్ వుడ్, జాక్ లీచ్.
చదవండి: మొదటి టెస్టు మన చేతుల్లోకి...
Comments
Please login to add a commentAdd a comment