రోహిత్ శర్మ- బెన్ స్టోక్స్
India vs England 3rd Test Day 2 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా 445 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ 35 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
టీమిండియా కంటే 238 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్, సెంచరీ వీరుడు బెన్ డకెట్ 133, నాలుగో నంబర్ బ్యాటర్ జో రూట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు భారత ఆటగాళ్లలో ధ్రువ్ జురెల్(46), జస్‌ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 26 పరుగులు) బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ అత్యధికంగా నాలుగు, రెహాన్ అహ్మద్ రెండు.. అదే విధంగా జేమ్స్ ఆండర్సన్ , టామ్ హార్లే, జో రూట్ ఒక్కో వికెట్ తీశారు.
రెండు వందల పరుగుల మార్కు అందుకున్న ఇంగ్లండ్
34: డకెట్ 131, జో రూట్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
29.6: సిరాజ్ బౌలింగ్‌లో ఒలీ పోప్(39) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 182-2(30).
బెన్ డకెట్ సెంచరీ
25.5: సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 148-1(26). డకెట్ 106, పోప్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.
20వ ఓవర్ ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు:115/1 (20)
డకెట్ 78, పోప్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 500 వికెట్ల క్లబ్‌లో అశ్విన్
89 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి జాక్ క్రాలే (15) ఔటయ్యాడు. అశ్విన్‌కు ఇది 500వ టెస్ట్ వికెట్. బెన్ డకెట్‌కు (68) జతగా ఓలీ పోప్ క్రీజ్‌లోకి వచ్చాడు.
Etched in history🎯5⃣0⃣0⃣*#INDvENGpic.twitter.com/vKKoMxlPDM
— Chennai Super Kings (@ChennaiIPL) February 16, 2024
టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 31/0 (6)
డకెట్ 19, క్రాలే 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.
5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 25-0
డకెట్ 14, క్రాలే ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు.
ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్
326/5 ఓవర్‌నైట్ స్కోరుతో భారత జట్టు శుక్రవారం నాటి ఆట మొదలుపెట్టింది. ఆరంభంలోనే కుల్దీప్ యాదవ్(4), రవీంద్ర జడేజా(112) వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్(46), రవిచంద్రన్ అశ్విన్(37) ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిన పడేశారు.
చివర్లో బుమ్రా 28 బంతుల్లో 26 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్) చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మార్క్ వుడ్ బౌలింగ్‌లో బుమ్రా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో టీమిండియా ఆఖరి వికెట్ కోల్పోయింది. 130.5 ఓవర్లలో 445 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్లు మార్క్ వుడ్ 4, ఆండర్సన్ ఒకటి.. స్పిన్నర్లు రెహాన్ అహ్మద్ రెండు, టామ్ హార్లే ఒకటి, జో రూట్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
💥 goes Bumrah, this time with the BAT 🤩#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSerie pic.twitter.com/zq1VB1vmZw
— JioCinema (@JioCinema) February 16, 2024
తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా
123.5: హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురెల్ అవుటయ్యాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 415/9 (124)
ఎనిమిదో వికెట్ డౌన్
119.6: అశ్విర్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి అశూ(37) నిష్క్రమించాడు. జస్‌ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. జురెల్ 39 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 408-89(120).
నాలుగు వందల పరుగుల మార్కు అందుకున్న టీమిండియా
అశ్విన్ 36, జురెల్ 32 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. భారత్ స్కోరు 400-7(117)
లంచ్ బ్రేక్
ఇంగ్లండ్‌తో మూడో టెస్టు రెండో రోజు భోజన విరామ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద నిలిచింది. ఆల్‌రౌండర్ అశ్విన్ 25, అరంగేట్ర వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం 133 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
109 ఓవర్లలో టీమిండియా స్కోరు: 375-7
అశ్విన్ 24, జురుల్ 20 పరుగులతో ఆడుతున్నారు. 110 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి నిలకడగా ముందుకు సాగుతున్నారు.
ఆచితూచి ఆడుతున్న అశ్విన్, జురెల్
రెండోరోజు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు ఆల్‌రౌండర్ అశ్విన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆచితూచి ఆడుతున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. అశూ 18, జురెల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 359/7 (103)
ఏడో వికెట్ డౌన్
సెంచరీ వీరుడు రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. జో రూట్ బౌలింగ్‌లో 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడ్డూ బౌల్డ్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 331-7(91)
ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే టీమిండియాకు షాకిచ్చాడు ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్. అతడి బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 331/6 (90)
మొదటిరోజు హైలైట్స్
రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(110- నాటౌట్) సెంచరీలు
అరంగేట్రంలోనే అర్ధ సెంచరీతో అదరగొట్టిన సర్ఫరాజ్(62)
వీలుకాని పరుగుకు పిలుపునిచ్చిన జడేజా కారణంగా సర్ఫరాజ్ రనౌట్
ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్ మార్క్‌వుడ్‌కు మూడు, స్పిన్నర్ టామ్ హార్లేకు ఒక వికెట్
కుల్దీప్ యాదవ్ 1, రవీంద్ర జడేజా 110 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తుదిజట్లు:
భారత్
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.
Comments
Please login to add a commentAdd a comment