రోహిత్ క్లీన్‌బౌల్డ్- ఇంగ్లండ్ బౌలర్ రియాక్షన్ వైరల్(PC: X/BCCI/Jio Cinema)
ఇంగ్లండ్‌తో ధర్మశాల టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. వన్‌డౌన్ బ్యాటర్, శతక వీరుడు శుబ్‌మన్ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 171 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు.
ఈ క్రమంలో.. 135/1 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. మరో వికెట్ నష్టపోకుండా 264 పరుగుల వద్ద నిలిచి.. ఓవరాల్‌గా అప్పటికి 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది.
అయితే, లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ మైదానంలో దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. విరామం తర్వాత తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. రోహిత్ శర్మ(103)ను అనూహ్య రీతిలో బౌల్డ్ చేశాడు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ బంతి అందుకున్న పేస్ ఆల్‌రౌండర్ స్టోక్స్.. ‘మ్యాజిక్’ బాల్‌తో హిట్‌మ్యాన్‌ను పెవిలియన్‌కు పంపాడు.
స్టోక్స్ సంధించిన గుడ్‌లెంగ్త్ బాల్‌ను షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ విఫలమయ్యాడు. బ్యాట్ అంచును తాకిన బంతి అనూహ్యంగా స్టంప్స్‌ను ఎగురగొట్టింది. ఊహించని ఈ పరిణామంతో రోహిత్ అవాక్కు కాగా.. ఇంగ్లండ్ శిబిరంలోనూ ఆశ్చర్యం వ్యక్తమైంది.
ఐపాడ్‌లో మ్యాచ్ చూస్తున్న కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నోటిపై చేతిని ఆనించి విస్మయం వ్యక్తం చేయగా.. ఫీల్డ్‌లో ఉన్న పేసర్ మార్క్ వుడ్ తలపై రెండు చేతులు పెట్టుకుని.. ‘‘ఏంటిది? నిజమేనా? నమ్మలేకపోతున్నా!’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రోహిత్ శర్మ అవుటైన మరుసటి ఓవర్(63)లోనే శుబ్‌మన్ గిల్(110) కూడా పెవిలియన్ చేరాడు. జేమ్ ఆండర్సన్ వికెట్ల ఖాతాలో 699వ వికెట్‌గా వెనుదిరిగాడు.
𝐈𝐍𝐒𝐓𝐀𝐍𝐓 𝐈𝐌𝐏𝐀𝐂𝐓 ft. skipper Stokes 🤯#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/DPHz8Bfdvl
— JioCinema (@JioCinema) March 8, 2024
Comments
Please login to add a commentAdd a comment