Mark Wood
-
ఇంగ్లండ్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. స్టార్ క్రికెటర్‌కు గాయం
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ మార్క్ వుడ్ గాయం కారణంగా ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. గత నెలలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వుడ్‌కు తొడ కండరాలు పట్టేశాయి. దీంతో అతడు ముందు జాగ్రత్త చర్యగా శ్రీలంకతో జరగుతున్న టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. అయితే తొడ కండరాల గాయం నుంచి కోలుకుని తిరిగి ప్రాక్టీస్ మొదలు పెట్టిన వుడ్ మళ్లీ గాయపడ్డాడు. బౌలింగ్ చేసే క్రమంలో మోచేయి నొప్పి రావడంతో అతడు అస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేసుకున్నాడు. అయితే స్కానింగ్‌లో కూడి మోచేయి జాయింట్ ఎముక విరిగినట్లు నిర్ధారణైంది. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు 5 నుంచి 6 నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పాకిస్తాన్, న్యూజిలాండ్ పర్యటనలకు అతడు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని మార్క్ వుడ్ సైతం ధ్రువీకరించాడు. తన మోచేయిలో ఎముక బ్రేక్ ఉందని తెలియడంతో ఆశ్చర్యపోయాను అని వుడ్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మొత్తానికి ఆటకు ఉండనున్నట్లు వుడ్ తెలిపాడు. అదేవిధంగా 2025లో మరింత ఫిట్నెస్తో తిరిగి వస్తానాని వుడ్ వెల్లడించాడు. వుడ్ మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీతో తిరిగి మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. -
Eng vs SL: మూడేళ్ల తర్వాత.. తుదిజట్టులో తొలిసారి
శ్రీలంకతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ బోర్డు తమ తుదిజట్టును ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టులో ఒక మార్పుతో లార్డ్స్‌లో బరిలోకి దిగనున్నట్లు తెలిపింది. పేసర్ మార్క్‌వుడ్ స్థానాన్ని ఓలీ స్టోన్‌తో భర్తీ చేసినట్లు వెల్లడించింది. కాగా 2021లో చివరగా ఇంగ్లండ్ తరఫున టెస్టు ఆడిన ఓలీ స్టోన్.. మూడేళ్ల తర్వాత పునరాగమనం చేయనుండటం విశేషం.లంకతో తొలి టెస్టులో మార్క్‌వుడ్ గాయపడిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో భాగంగా కండరాల నొప్పితో విలవిల్లాడిన ఈ ఫాస్ట్‌బౌలర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో 20 ఏళ్ల పేసర్ జోష్ హల్‌ను అతడి స్థానంలో జట్టుకు ఎంపిక చేసిన ఇంగ్లండ్ బోర్డు.. హల్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది. ఓలీ స్టోన్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం కల్పించింది.కాగా రైటార్మ్ పేసర్ అయిన 30 ఏళ్ల ఓలీ స్టోన్.. 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 3 టెస్టుల్లో 10, ఎనిమిది వన్డేల్లో 8 వికెట్లు తీశాడు. ఒకే ఒక్క టీ20 ఆడినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా సొంతగడ్డపై శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.ఈ క్రమంలో మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. పర్యాటక లంక నుంచి గట్టి పోటీ ఎదురుకాగా.. ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్(128 బంతుల్లో 62) పట్టుదలగా నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.ఇరు జట్ల మధ్య లండన్‌లో లార్డ్స్ మైదానంలో ఆగష్టు 29- సెప్టెంబరు 2 వరకు రెండో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ దూరం కాగా.. అతడి స్థానంలో ఓలీ పోప్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అతడికి డిప్యూటీగా యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఎంపిక చేసింది ఇంగ్లండ్ బోర్డు.శ్రీలంకతో లండన్ వేదికగా రెండో టెస్టు ఇంగ్లండ్ తుదిజట్టులారెన్స్, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఓలీ స్టోన్, షోయబ్ బషీర్. -
మార్క్ వుడ్‌కు గాయం.. ఇంగ్లండ్ జట్టులో 6 అడుగుల 7 అంగుళాల ఫాస్ట్ బౌలర్
శ్రీలంకతో తాజాగా ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ గాయం బారిన పడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో వుడ్ మూడో రోజు నుంచి బౌలింగ్ చేయలేదు. వుడ్ స్థానంలో ఇంగ్లండ్ సెలెక్టర్లు 20 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ జోష్ హల్‌ను ఎంపిక చేశాడు. హల్.. శ్రీలంకతో తదుపరి జరుగబోయే రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్ జట్టులో సభ్యుడిగా ఉంటాడు. Josh Hull - the 6'7 left arm pacer has been added to England's squad for Test series Sri Lanka. pic.twitter.com/FVdogR3toZ— Mufaddal Vohra (@mufaddal_vohra) August 25, 2024కౌంటీల్లో లీసెస్టర్‌షైర్‌కు ఆడే హల్కు భీకరమైన ఫాస్ట్ బౌలర్‌గా పేరుంది. 6 అడుగుల 7 అంగుళాలు ఉండే హల్కు అతని ఫైట్ చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇటీవల శ్రీలంకతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హల్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో రెండో టెస్ట్ ఆగస్ట్ 29 నుంచి మొదలవుతుంది. మూడో టెస్ట్ సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా జరుగనుంది.కాగా, ఓల్డ్ ట్రఫర్డ్ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. ధనంజయం డిసిల్వ (74), మిలన్ రత్నాయకే (72) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. జేమీ స్మిత్ (111) సెంచరీతో కదంతొక్కడంతో 358 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. కమిందు మెండిస్ (113) సెంచరీతో రాణించడంతో 326 పరుగులు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. -
నిప్పులు చెరిగిన మార్క్ వుడ్.. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ ఓవర్
ఇంగ్లండ్ స్పీడ్ గన్ మార్క్ వుడ్ వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్ తొలి ఓవర్లో వుడ్ బుల్లెట్ లాంటి బంతులతో నిప్పులు వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలోనే ఇది ఫాస్టెస్ట్ ఓవర్‌గా (సగటున గంటకు 94.40 మైళ్ల వేగం) రికార్డైంది. ఈ ఓవర్లో (93.9, 96.1, 95.2, 92.2, 96.5, 95.2) వుడ్ ప్రతి బంతిని 90 మైళ్లకు పైగా వేగంతో సంధించాడు.Mark Wood is steaminnnnggg fireeeee 🔥 pic.twitter.com/DlQTEQFZ11— CricTracker (@Cricketracker) July 19, 2024వుడ్ తన మరుసటి ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో ఓ బంతిని ఏకంగా 97.1 మైళ్ల వేగంతో సంధించాడు. వుడ్ ఈ ఓవర్లోనూ (95, 93, 95, 96, 97.1, 94) ప్రతి బంతిని 90 మైళ్లకు పైగా వేగంతో విసిరాడు. వుడ్ సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఇంచుమించు ఇలాంటి వేగంతో ఓ ఓవర్ వేశాడు. 2023 జులై 19న ఆస్ట్రేలియాతో జరిగిన హెడింగ్లే టెస్ట్‌లో వుడ్ 92.8, 90.2, 92.5, 92.5, -, 91.6 మైళ్ల వేగంతో బంతులను సంధించాడు.M A R K W 🔥🔥Dpic.twitter.com/fJB1SdSpqI— CricTracker (@Cricketracker) July 19, 2024ప్రస్తుతం తరం బౌలర్లలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు ఉన్న వుడ్.. తన కెరీర్లో ఫాస్టెస్ట్ బాల్‌ను 2022లో పాకిస్తాన్‌పై విసిరాడు. నాడు ముల్తాన్ టెస్ట్‌లో వుడ్ గంటకు 98 మైళ్ల వేగంతో బంతిని సంధించాడు. ఇదే అతని కెరీర్లో ఫాస్టెస్ట్ డెలివరీ. ఓవరాల్‌గా క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు పాక్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2003 వరల్డ్‌కప్‌లో అక్తర్.. సౌతాఫ్రికాపై ఓ బంతిని 100.23 మైళ్ల వేగంతో సంధించాడు.19th July 2023: Mark Wood bowled one of the fastest overs at Old Trafford against Australia19th July 2024: Mark Wood bowled the fastest over ever by an England bowler at home.He's just unbelievable 🔥 pic.twitter.com/dR8Qv9m0cW— CricTracker (@Cricketracker) July 19, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకు ఆలౌటైంది. ఓలీ పోప్ (121) సెంచరీ.. బెన్ డకెట్ (71), బెన్ స్టోక్స్ (69) అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్ 3, జేడన్ సీల్స్, కెవిన్ సింక్లెయిర్, కవెమ్ హాడ్జ్ తలో 2, షమార్ జోసఫ్ ఓ వికెట్ పడగొట్టారు.రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్.. 46 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ 48, మికైల్ లూయిస్ 21, కిర్క్ మెక్కెంజీ 11 పరుగులు చేసి ఔట్ కాగా..అలిక్ అథనాజ్ 48, కవెమ్ హాడ్జ్ 37 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, అట్కిన్సన్ ఓ వికెట్ పడగొట్టారు. వెస్టిండీస్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 246 పరుగులు వెనుకపడి ఉంది. -
ఇటీవలే రిటైర్మెంట్: తిరిగి ఇంగ్లండ్ జట్టుతో చేరిన ఆండర్సన్
ఇంగ్లండ్ మాజీ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ కొత్త అవతారం ఎత్తనున్నాడు. మళ్లీ ఇంగ్లిష్ జట్టుతో మమేకం కానున్నాడు. ఈ దిగ్గజ పేసర్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తొలి టెస్టు అనంతరం(శుక్రవారం) ఆండర్సర్ ఆటగాడిగా తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించాడు. లార్డ్స్ వేదికగా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అతడు.. అదే మైదానంలో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు.కొత్త పాత్రలో ఆండర్సన్ఇరవై ఒక్క సుదీర్ఘ టెస్టు కెరీర్లో ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఏకంగా 704 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు ఆండర్సన్.ఇక అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరొందిన జేమ్స్ ఆండర్సన్ సేవలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావించింది. ఈ క్రమంలో అతడు ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.అప్పటి వరకేనా?వెస్టిండీస్‌తో మిగిలిన రెండు టెస్టులు ముగిసే వరకు అతడు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది. కాగా నాటింగ్‌హాం వేదికగా జూలై 18- 22 వరకు రెండో టెస్టు, జూలై 26- 30 వరకు ఇరు జట్ల మధ్య మూడో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక తొలి టెస్టులో విండీస్‌ను ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో ఓడించిన ఇంగ్లండ్ 1-0తో సిరీస్‌లో ఆధిక్యంలో ఉంది. కాగా రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది. ఆండర్సర్ స్థానంలో మార్క్‌వుడ్ జట్టులోకి వచ్చాడు.వెస్టిండీస్‌లో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టుజాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్. -
T20 WC 2024: 47 పరుగులకే ఆలౌట్.. వరల్డ్‌కప్‌లోనే అతిపెద్ద విజయం
టీ20 ప్రపంచకప్-2024 గ్రూప్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఒమన్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసి సూపర్-8 ఆశలను సజీవం చేసుకుంది.కాగా వరల్డ్‌కప్-2024లో భాగంగా ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్‌లతో కలిసి ఇంగ్లండ్ గ్రూప్-బిలో ఉంది. అయితే, తొలి రెండు మ్యాచ్‌లలో ఈ డిఫెండింగ్ చాంపియన్‌కు చేదు అనుభవాలే ఎదురయ్యాయి.స్కాట్లాండ్తో మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోగా.. రెండో మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో సూపర్-8కు అర్హత సాధించాలంటే ఒమన్‌తో శుక్రవారం(ఉదయం 12.30 నిమిషాలకు ఆరంభం) నాటి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో నిలిచింది.ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు ఆదిల్ రషీద్(4/11), జోఫ్రా ఆర్చర్(3/12), మార్క్ వుడ్(3/12) చెలరేగడంతో ఒమన్ 47 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు 13.2వ ఓవర్లోనే ఆలౌట్ అయింది. View this post on Instagram A post shared by ICC (@icc)టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద విజయం ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం పందొమ్మిది బంతుల్లోనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్(3 బంతుల్లో 12), కెప్టెన్ జోస్ బట్లర్(8 బంతుల్లో 24 నాటౌట్), జానీ బెయిర్ స్టో(2 బంతుల్లో 8 నాటౌట్) దంచికొట్టారు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ విల్ జాక్స్(7 బంతుల్లో 5) పర్వాలేదనిపించగా.. 3.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. ఎనిమిది వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తుగా ఓడించింది. 101 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించి మెన్స్ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అతిపె ద్ద విజయం నమోదు చేసింది. అలా అయితేనే సూపర్-8కుకాగా గ్రూప్-డి నుంచి ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 బెర్తు ఖరారు చేసుకోగా.. ఇంగ్లండ్ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాలి. అంతేగాకుండా స్కాట్లాండ్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో తప్పక ఓడిపోవాలి.లేదంటే ఇంగ్లండ్ సూపర్-8 చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఒకవేళ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచి, స్కాట్లాండ్ ఓడినా నెట్‌రన్‌రేటు కీలకం(ఇంగ్లండ్ 3 పాయింట్లు, +3.081), స్కాట్లాండ్ ఐదు పాయింట్లు +2.164))గా మారుతుంది. చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? View this post on Instagram A post shared by ICC (@icc) -
మార్క్ వుడ్ రాకాసి బౌన్సర్.. పాక్ బ్యాటర్ వణికిపోయాడు..!
ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 సందర్భంగా పాక్ బ్యాటర్ ఆజమ్ ఖాన్‌కు ఓ భయానక అనుభవం ఎదురైంది. మార్క్ వుడ్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో ఆజమ్‌కు దిమ్మతిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయ్యింది. నిప్పులు చెరిగే వేగంతో ముఖంపైకి దూసుకొచ్చిన బౌన్సర్‌ను ఎదుర్కొలేక ఆజమ్ వికెట్ సమర్పించుకున్నాడు.ఆజమ్ అదృష్టం కొద్ది బంతి గ్లవ్స్‌కు తాకి వికెట్‌కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఒకవేళ బంతి ఆజమ్ ఖాన్ శరీరం లేదా తలకు తాకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఆజమ్ ఔటయ్యాక కాసేపు షాక్‌లో ఉండిపోయాడు. అంతలా రాకాసి బౌన్సర్ అతన్ని బయపెట్టింది. పాక్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ రెండో బంతిని ఎదుర్కొనే క్రమంలో ఆజమ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. వుడ్ రాకాసి బౌన్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.WHAT A BALL BY MARK WOOD.🤯- This is Brutal from Wood...!!!!! 🔥 pic.twitter.com/9kTgDdrxpi— Tanuj Singh (@ImTanujSingh) May 30, 2024మ్యాచ్ విషయానికొస్తే.. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్‌స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరుగా రాణించగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్‌స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి. -
అద్భుతమైన ర్యాంప్ షాట్ ఆడిన సర్ఫరాజ్.. సహనం కోల్పోయిన మార్క్ వుడ్
IND VS ENG 5th Test Day 2: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో రోజు ఆటలో టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సర్ఫరాజ్ కేవలం 55 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో కెరీర్లో మూడో అర్ధశతకాన్ని సాధించాడు. తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్దసెంచరీలు (62, 68 నాటౌట్) చేసిన సర్ఫరాజ్.. తన రెండో టెస్ట్‌లో విఫలమైనా (14, 0) తిరిగి మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనే మెరుపు అర్దసెంచరీతో సత్తా చాటాడు. టీ విరామం సమయానికి సర్ఫరాజ్ 56 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా పడిక్కల్ (44) క్రీజ్‌లో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 376 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110) ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు కుప్పకూలింది. Showing his shots 🔥pic.twitter.com/h4I1Jks4lt — CricTracker (@Cricketracker) March 8, 2024 ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, రెండో రోజు ఆటలో మార్క్ వుడ్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఖాన్ ఆడిన అద్భుతమైన ర్యాంప్ షాట్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఈ షాట్‌కు టీమిండియా అభిమానులు ముగ్దులవుతున్నారు. సర్ఫరాజ్ ఖాన్‌కు ఇది ట్రేడ్ మార్క్ షాట్. ఇతను చాలా సందర్భాల్లో ఇలాంటి షాట్లు ఆడాడు. నాలుగో టెస్ట్‌లో దృవ్ జురెల్ సైతం వుడ్ బౌలింగ్‌లో ఇదే తరహా ర్యాంప్ షాట్ ఆడాడు. సర్ఫరాజ్ ర్యాంప్ షాట్‌ను అద్భుతంగా ఆడటంతో సహనం కోల్పోయిన వుడ్ అతనిపై స్లెడ్జింగ్‌కు దిగాడు. వుడ్ స్టెడ్జింగ్ను ఏమాత్రం పట్టించుకోని సర్ఫరాజ్ తన సహజశైలిలో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. -
రోహిత్ అవుటా? నిజమేనా..? ఇంగ్లండ్ బౌలర్ రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్‌తో ధర్మశాల టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ. వన్‌డౌన్ బ్యాటర్, శతక వీరుడు శుబ్‌మన్ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 171 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో.. 135/1 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా.. భోజన విరామ సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. మరో వికెట్ నష్టపోకుండా 264 పరుగుల వద్ద నిలిచి.. ఓవరాల్‌గా అప్పటికి 46 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, లంచ్ బ్రేక్ తర్వాత మళ్లీ మైదానంలో దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. విరామం తర్వాత తొలి బంతికే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. రోహిత్ శర్మ(103)ను అనూహ్య రీతిలో బౌల్డ్ చేశాడు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ బంతి అందుకున్న పేస్ ఆల్‌రౌండర్ స్టోక్స్.. ‘మ్యాజిక్’ బాల్‌తో హిట్‌మ్యాన్‌ను పెవిలియన్‌కు పంపాడు. స్టోక్స్ సంధించిన గుడ్‌లెంగ్త్ బాల్‌ను షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ విఫలమయ్యాడు. బ్యాట్ అంచును తాకిన బంతి అనూహ్యంగా స్టంప్స్‌ను ఎగురగొట్టింది. ఊహించని ఈ పరిణామంతో రోహిత్ అవాక్కు కాగా.. ఇంగ్లండ్ శిబిరంలోనూ ఆశ్చర్యం వ్యక్తమైంది. ఐపాడ్లో మ్యాచ్ చూస్తున్న కోచ్ బ్రెండన్ మెకల్లమ్ నోటిపై చేతిని ఆనించి విస్మయం వ్యక్తం చేయగా.. ఫీల్డ్‌లో ఉన్న పేసర్ మార్క్ వుడ్ తలపై రెండు చేతులు పెట్టుకుని.. ‘‘ఏంటిది? నిజమేనా? నమ్మలేకపోతున్నా!’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా రోహిత్ శర్మ అవుటైన మరుసటి ఓవర్(63)లోనే శుబ్‌మన్ గిల్(110) కూడా పెవిలియన్ చేరాడు. జేమ్ ఆండర్సన్ వికెట్ల ఖాతాలో 699వ వికెట్‌గా వెనుదిరిగాడు. 𝐈𝐍𝐒𝐓𝐀𝐍𝐓 𝐈𝐌𝐏𝐀𝐂𝐓 ft. skipper Stokes 🤯#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/DPHz8Bfdvl — JioCinema (@JioCinema) March 8, 2024 -
రాకాసి బౌన్సర్.. రోహిత్ కంటే గొప్పగా ఈ షాట్‌ను ఎవరూ ఆడలేరు..!
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. తొలుత ఇంగ్లండ్‌ను 218 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఆతర్వాత బ్యాటింగ్‌లోనూ చెలరేగి భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (57) మెరుపు అర్దశతకం చేసి ఔట్ కాగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. రోహిత్‌కు జతగా శుభ్‌మన్ గిల్ (26) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు కేవలం 83 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. 151.2kmph delivery from Mark Wood. But Rohit Sharma says I'll play my favourite shot and send it out of the ground. 🫡pic.twitter.com/cuajTdxVHH — Mufaddal Vohra (@mufaddal_vohra) March 7, 2024 ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్ ఆడిన ఓ షాట్ రోజు మొత్తానికి హైలైట్‌గా నిలిచింది. మార్క్ వుడ్ సంధించిన ఓ రాకాసి బౌన్సర్‌కు రోహిత్ తగు రీతిలో సమాధానం చెప్పాడు. 151.2 కిమీ వేగంతో నిప్పులు గక్కుతూ వచ్చిన ఆ బౌన్సర్‌కు హిట్‌మ్యాన్ తన ఫేవరెట్ పుల్‌షాట్ ఆడి భారీ సిక్సర్‌గా మలిచాడు. రోహిత్ ఆడిన ఈ సాహసోపేతమైన షాట్‌ను చూసి బౌలర్, ఫీల్డర్లు సహా మైదానంలో ఉన్న వాళ్లంతా నోరెళ్లబెట్టారు. హిట్‌మ్యాన్ అభిమానులు ఈ షాట్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ తమ ఆరాధ్య ఆటగాడిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏదిఏమైనా ప్రస్తుత తరం క్రికెటర్లలో రోహిత్ కంటే గొప్పగా ఈ షాట్‌ను ఎవ్వరూ ఆడలేరన్న విషయాన్ని ఒప్పుకోవాలి. -
శభాష్ హిట్‌మ్యాన్.. క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అద్భుత రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో (ఇంగ్లండ్) మార్క్ వుడ్ క్యాచ్ పట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో ఏ ఇతర ఆటగాడు మూడు ఫార్మాట్లలో 60కు పైగా క్యాచ్‌లు అందుకోలేదు. డబుల్ సెంచరీలు, సిక్సర్ల రికార్డులు ఎక్కువగా నెలకొల్పే రోహిత్‌కు క్యాచ్‌ల పరంగా ఇది అతి పెద్ద రికార్డని చెప్పవచ్చు. WHAT A CATCH BY CAPTAIN ROHIT SHARMA...!!!! 🔥 - The Magician Ravi Ashwin picked 2 wickets in an over on his 100th Test Match. pic.twitter.com/WawmeAxQ1H — CricketMAN2 (@ImTanujSingh) March 7, 2024 కాగా, ధర్మశాల టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) దెబ్బకు 218 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. షోయబ్ బషీర్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
టీమిండియాతో ఐదో టెస్ట్.. ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ధర్మశాల వేదికగా టీమిండియాతో రేపటి నుంచి (మార్చి 7) ప్రారంభం కాబోయే ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు ఇవాళ ప్రకటించారు. ఇంగ్లండ్ తమ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఒకే ఒక మార్పు చేసింది. నాలుగో టెస్ట్‌లో ఆడిన ఓలీ రాబిన్సన్ స్థానంలో మార్క్ వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇంగ్లండ్ అదనపు పేసర్‌ను బరిలోకి దించుతుందని అంతా ఊహించారు. అయితే ఇంగ్లండ్ మేనేజ్మెంట్ పేసర్ స్థానంలో మరో పేసర్కే అవకాశం ఇచ్చింది. మొత్తంగా ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ టీమ్ ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. మార్క్ వుడ్‌తో పాటు వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ బరిలోకి దిగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తుది జట్టుకు ఎంపికయ్యారు. రాబిన్సన్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన వుడ్.. ప్రస్తుత సిరీస్‌లో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. హైదరాబాద్, రాజ్‌కోట్ మ్యాచ్‌ల్లో ఆడిన వుడ్ ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చకపోవడంతో నాలుగో టెస్ట్‌కు ఎంపిక కాలేదు. ఈ రెండు మ్యాచ్‌ల్లో వుడ్ 55.5 సగటున కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. రాబిన్సన్ విషమానికొస్తే.. ఈ సిరీస్‌లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడిన అతను పేలవ ప్రదర్శన కనబర్చి తుది జట్టులో (ఐదో టెస్ట్) స్థానం కోల్పోయాడు. ఈ సిరీస్‌లో నాలుగో టెస్ట్ ఆడిన రాబిన్సన్ కేవలం 13 ఓవర్లు మాత్రమే వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఆ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో రాబిన్సన్కు బౌలింగ్ కూడా ఇవ్వలేదు. నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
#Dhruv Jurel: ‘తోపు బౌలర్ అయితే.. నాకేంటి?’.. వీడియో
India vs England, 3rd Test- #Dhruv Jurel: రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురెల్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా భారత తుదిజట్టులో స్థానం సంపాదించిన అతడు.. ఎనిమిదో స్థానంలో ఆడాడు. రెండోరోజు ఆటలో భాగంగా శుక్రవారం కుల్దీప్ యాదవ్ అవుటైన తర్వాత.. అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు జురెల్. వెంటనే రవీంద్ర జడేజా(112) వికెట్ కూడా పడటంతో రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి రాగా అతడితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. సింగిల్‌తో ఖాతా తెరిచి.. సిక్సర్‌తో సత్తా చాటి ఈ క్రమంలో కాస్త డిఫెన్సివ్‌గా ఆడిన ధ్రువ్ జురెల్.. తాను ఎదుర్కొన్న పదకొండో బంతికి పరుగుల ఖాతా తెరిచాడు. తొలుత రెండు సింగిల్స్ తీసిన ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. ఆ తర్వాత ఆడిన షాట్ తొలి సెషన్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లండ్ ఫాస్ట్‌బౌలర్ మార్క్ వుడ్ గంటకు 146 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని.. ధ్రువ్ జురెల్ అద్భుత రీతిలో సిక్సర్‌గా మలిచాడు. ఆఫ్ స్టంప్‌నకు ఆవల పడిన బంతిని ర్యాంప్ షాట్‌తో స్టాండ్స్‌కు తరలించాడు. తోపు బౌలర్ అయితే నాకేంటి? ఇందుకు సంబంధించిన వీడియో అభిమానులను ఆకర్షిస్తోంది. బౌన్సర్లు వేయడంలో దిట్ట అయిన మార్క్ వుడ్ బౌలింగ్‌లో స్టార్ బ్యాటర్లు సైతం షాట్లు ఆడేందుకు వెనుకాడితే.. జురెల్ మాత్రం ..‘‘నువ్వు ఎంత తోపు బౌలర్ అయినా.. నేను సరైన రీతిలో షాట్ కొడితే సిక్సరే’’ అన్నట్లు అదరగొట్టాడంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా మూడో టెస్టులో మొత్తంగా 104 బంతులు ఎదుర్కొన్న ధ్రువ్ జురెల్ 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 46 పరుగులు చేశాడు. అరంగేట్ర హాఫ్ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా జురెల్‌తో పాటు అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 62 రన్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అర్థ శతకం బాదిన విషయం తెలిసిందే. కాగా రాజ్‌కోట్ టెస్టులో రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(112) సెంచరీలు.. సర్ఫరాజ్ హాఫ్ సెంచరీలు.. జురెల్(46), అశ్విన్(37) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 445 పరుగులు చేసింది. చదవండి: Dhruv Jurel Life Story In Telugu: తండ్రి కార్గిల్ యుద్ధంలో.. బంగారు గొలుసు అమ్మిన తల్లి త్యాగం! Nerveless Jurel 🥶#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/nYn053BM5I — JioCinema (@JioCinema) February 16, 2024 -
Day 2: జురెల్ హిట్.. బుమ్రా మెరుపులు! డకెట్ సెంచరీ.. హైలైట్స్
India vs England 3rd Test Day 2 Updates: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య రాజ్‌కోట్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. టీమిండియా 445 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యే సరికి ఇంగ్లండ్ 35 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. టీమిండియా కంటే 238 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్, సెంచరీ వీరుడు బెన్ డకెట్ 133, నాలుగో నంబర్ బ్యాటర్ జో రూట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకు ముందు భారత ఆటగాళ్లలో ధ్రువ్ జురెల్(46), జస్ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 26 పరుగులు) బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ అత్యధికంగా నాలుగు, రెహాన్ అహ్మద్ రెండు.. అదే విధంగా జేమ్స్ ఆండర్సన్ , టామ్ హార్లే, జో రూట్ ఒక్కో వికెట్ తీశారు. రెండు వందల పరుగుల మార్కు అందుకున్న ఇంగ్లండ్ 34: డకెట్ 131, జో రూట్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 29.6: సిరాజ్ బౌలింగ్‌లో ఒలీ పోప్(39) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. జో రూట్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 182-2(30). బెన్ డకెట్ సెంచరీ 25.5: సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్ స్కోరు: 148-1(26). డకెట్ 106, పోప్ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 20వ ఓవర్ ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు:115/1 (20) డకెట్ 78, పోప్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. 500 వికెట్ల క్లబ్లో అశ్విన్ 89 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో రజత్ పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి జాక్ క్రాలే (15) ఔటయ్యాడు. అశ్విన్‌కు ఇది 500వ టెస్ట్ వికెట్. బెన్ డకెట్‌కు (68) జతగా ఓలీ పోప్ క్రీజ్‌లోకి వచ్చాడు. Etched in history🎯5⃣0⃣0⃣*#INDvENGpic.twitter.com/vKKoMxlPDM — Chennai Super Kings (@ChennaiIPL) February 16, 2024 టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ స్కోరు: 31/0 (6) డకెట్ 19, క్రాలే 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 25-0 డకెట్ 14, క్రాలే ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ 326/5 ఓవర్‌నైట్ స్కోరుతో భారత జట్టు శుక్రవారం నాటి ఆట మొదలుపెట్టింది. ఆరంభంలోనే కుల్దీప్ యాదవ్(4), రవీంద్ర జడేజా(112) వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ క్రమంలో ధ్రువ్ జురెల్(46), రవిచంద్రన్ అశ్విన్(37) ఇన్నింగ్స్‌ను మళ్లీ గాడిన పడేశారు. చివర్లో బుమ్రా 28 బంతుల్లో 26 పరుగులు(3 ఫోర్లు, ఒక సిక్స్) చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మార్క్ వుడ్ బౌలింగ్‌లో బుమ్రా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో టీమిండియా ఆఖరి వికెట్ కోల్పోయింది. 130.5 ఓవర్లలో 445 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్లు మార్క్ వుడ్ 4, ఆండర్సన్ ఒకటి.. స్పిన్నర్లు రెహాన్ అహ్మద్ రెండు, టామ్ హార్లే ఒకటి, జో రూట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. 💥 goes Bumrah, this time with the BAT 🤩#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSerie pic.twitter.com/zq1VB1vmZw — JioCinema (@JioCinema) February 16, 2024 తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 123.5: హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురెల్ అవుటయ్యాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 415/9 (124) ఎనిమిదో వికెట్ డౌన్ 119.6: అశ్విర్ రూపంలో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి అశూ(37) నిష్క్రమించాడు. జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. జురెల్ 39 పరుగులతో ఆడుతున్నాడు. స్కోరు: 408-89(120). నాలుగు వందల పరుగుల మార్కు అందుకున్న టీమిండియా అశ్విన్ 36, జురెల్ 32 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. భారత్ స్కోరు 400-7(117) లంచ్ బ్రేక్ ఇంగ్లండ్‌తో మూడో టెస్టు రెండో రోజు భోజన విరామ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 388 పరుగుల వద్ద నిలిచింది. ఆల్‌రౌండర్ అశ్విన్ 25, అరంగేట్ర వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం 133 బంతుల్లో 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 109 ఓవర్లలో టీమిండియా స్కోరు: 375-7 అశ్విన్ 24, జురుల్ 20 పరుగులతో ఆడుతున్నారు. 110 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి నిలకడగా ముందుకు సాగుతున్నారు. ఆచితూచి ఆడుతున్న అశ్విన్, జురెల్ రెండోరోజు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఆటగాళ్లు ఆల్‌రౌండర్ అశ్విన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ ఆచితూచి ఆడుతున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ.. అశూ 18, జురెల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్కోరు: 359/7 (103) ఏడో వికెట్ డౌన్ సెంచరీ వీరుడు రవీంద్ర జడేజా రూపంలో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. జో రూట్ బౌలింగ్‌లో 112 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడ్డూ బౌల్డ్ అయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 331-7(91) ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా రెండో రోజు ఆట ఆరంభమైన కాసేపటికే టీమిండియాకు షాకిచ్చాడు ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్. అతడి బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ధ్రువ్ జురెల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 331/6 (90) మొదటిరోజు హైలైట్స్ రోహిత్ శర్మ(131), రవీంద్ర జడేజా(110- నాటౌట్) సెంచరీలు అరంగేట్రంలోనే అర్ధ సెంచరీతో అదరగొట్టిన సర్ఫరాజ్(62) వీలుకాని పరుగుకు పిలుపునిచ్చిన జడేజా కారణంగా సర్ఫరాజ్ రనౌట్ ఇంగ్లండ్ బౌలర్లలో పేసర్ మార్క్‌వుడ్‌కు మూడు, స్పిన్నర్ టామ్ హార్లేకు ఒక వికెట్ కుల్దీప్ యాదవ్ 1, రవీంద్ర జడేజా 110 పరుగులతో క్రీజులో ఉన్నారు. తుదిజట్లు: భారత్ యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్(అరంగేట్రం), రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్- అరంగేట్రం), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్. ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్. -
Ind Vs Eng: ఏంటిది గిల్? ఏం చేశావు?.. పాపం రోహిత్!
టీమిండియా యువ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చేసిన పరుగులు 24, 0. ఫలితంగా బ్యాటింగ్ టెక్నిక్ సరిగా లేదంటూ మాజీ క్రికెటర్లు, విశ్లేషకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా తానేంటో నిరూపించుకున్నాడు గిల్. తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా 147 బంతులు ఎదుర్కొని 104 విలువైన పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పూర్తి చేశాడు. ఈ క్రమంలో మూడో టెస్టులోనూ శుబ్‌మన్ గిల్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ.. విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇస్తాడని భావిస్తే తుస్సుమనిపించాడు. రాజ్‌కోట్ టెస్టులో 9 బంతులు ఎదుర్కొన్న గిల్.. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ సంధించిన అద్భుతమైన డెలివరీని సరిగ్గా అంచనా వేయలేక వికెట్ సమర్పించుకున్నాడు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి 5.4 ఓవర్ వద్ద గిల్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ.. ‘‘ఏంటిది గిల్? ఏం చేశావు?’’ అన్నట్లుగా నిరాశగా గిల్ వైపు ఓ లుక్కిచ్చాడు. కాగా గిల్ కంటే ముందు ఓపెనర్ యశస్వి జైస్వాల్(10) మార్క్ వుడ్ బౌలింగ్‌కు తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ గిల్ తనకు సహకరిస్తాడని భావిస్తే రోహిత్ శర్మకు నిరాశే మిగిలింది. అతి జాగ్రత్తగా ఆడేందుకు ప్రయత్నించిన గిల్ ఇలా అవుట్ కావడంతో అభిమానులు సైతం అతడి ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు. A 🔥 start to the 3rd #INDvENG Test from Mark Wood! Who'll lead the fightback for #TeamIndia?#BazBowled #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/vrdcRevF05 — JioCinema (@JioCinema) February 15, 2024 -
Rohit Sharma: రాకాసి బౌన్సర్.. నీకేం కాలేదు కదా రోహిత్!
ఇంగ్లండ్‌తో మూడో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. రాజ్‌కోట్ వేదికగా గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. మూడో టెస్టుతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్ వెటరన్ పేసర్ మార్క్ వుడ్ ఆదిలోనే టీమిండియాను దెబ్బకొట్టాడు. నాలుగో ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ యశస్వి జైస్వాల్(10), ఆరో ఓవర్ నాలుగో బంతికి వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(0)ను పెవిలియన్‌కు పంపాడు. A 🔥 start to the 3rd #INDvENG Test from Mark Wood! Who'll lead the fightback for #TeamIndia?#BazBowled #JioCinemaSports #IDFCFirstBankTestSeries pic.twitter.com/vrdcRevF05 — JioCinema (@JioCinema) February 15, 2024 ఆ తర్వాత స్పిన్నర్ టామ్ హార్లే బౌలింగ్‌లో(8.5 ఓవర్) రజత్ పాటిదార్(5) కూడా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 33 వికెట్లకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను ఆదుకునే బాధ్యత కెప్టెన్ రోహిత్ శర్మపై పడింది. The Hitman is packing a punch in some style 💪 Watch Rohit Sharma lead the charge, LIVE on #JioCinema, #Sports18 & #ColorsCineplex 🚀#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/5F4o7InOyM — JioCinema (@JioCinema) February 15, 2024 ఈ క్రమంలో ఆచితూచి ఆడుతున్న హిట్‌మ్యాన్‌కు 10వ ఓవర్లో ప్రమాదం తప్పింది. మార్క్ వుడ్ సంధించిన రాకాసి బౌన్సర్ రోహిత్ హెల్మెట్‌కు బలంగా తాకింది. రోహిత్‌ను ట్రాప్ చేసేందుకు ముగ్గురు ఫీల్డర్లను సెట్ చేసుకున్న వుడ్.. డీప్ బౌన్సర్ వేశాడు. అయితే, రోహిత్ షాట్(పుల్) ఆడకుండా బంతిని వదిలేశాడు. అది అతడి హెల్మెట్‌ను బలంగా తాకడంతో కంగారుపడ్డ మార్క్ వుడ్.. ‘‘నీకైతే ఏం కాలేదు కదా!’’ అని క్షేమసమాచారం అడిగి తెలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ దానిని సెంచరీగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. 39 ఓవర్లు ముగిసే సరికి రవీంద్ర జడేజా 41, రోహిత్ శర్మ 73 పరుగులతో క్రీజులో ఉన్నారు. Crazy scenes at cricket. !! Mark Wood has placed three fielders in the deep for the bouncer but Rohit Sharma is not playing the pull shot and is leaving the ball. pic.twitter.com/xxDdeAmnzB — Vishal. (@SPORTYVISHAL) February 15, 2024 -
అతడిపై వేటు.. మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
India vs England, 3rd Test: టీమిండియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తమ తుదిజట్టును ప్రకటించింది. రాజ్‌కోట్ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. కాగా యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌పై వేటు పడగా.. రైటార్మ్ పేసర్ మార్క్ వుడ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో.. ఒకే ఒక్క ఫాస్ట్‌బౌలర్ మార్క వుడ్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. తర్వాతి మ్యాచ్‌లో దిగ్గజ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌కు పిలుపునిచ్చింది. మార్క్‌వుడ్ స్థానాన్ని ఆండర్సన్‌తో భర్తీ చేయడంతో పాటు.. గాయపడిన సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో షోయబ్ బషీర్‌తో అరంగేట్రం చేయించింది. ఈసారి ఇద్దరు పేసర్లతో ఈ క్రమంలో విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఆండర్సన్ ఐదు వికెట్లు తీయగా.. బషీర్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. కానీ ఈ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో.. రాజ్‌కోట్ వేదికగా ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లతో బరిలో దిగాలని భావించిన ఇంగ్లండ్.. బషీర్‌పై వేటు వేసి మార్క్ వుడ్‌ను మళ్లీ పిలిపించింది. ఇక టీమిండియా- ఇంగ్లండ్ మధ్య గురువారం(ఫిబ్రవరి 15) నుంచి గుజరాత్‌లోని రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది. టీమిండియాతో మూడో టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లే, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్. చదవండి: Virat Kohli-Anushka Sharma: ఓ బ్యాడ్ న్యూస్.. ఓ ‘గుడ్’ న్యూస్! -
IND VS ENG 1st Test: చరిత్రలో తొలిసారి..!
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ జట్టు ఓ వినూత్న ప్రయోగం చేసింది. ఆ జట్టు తొలిసారి ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఏకైక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగింది. హైదరాబాద్ టెస్ట్‌లో ఇంగ్లండ్.. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఒక్కడినే బరిలోకి దించి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఈ మ్యాచ్‌లో వుడ్‌ను బరిలోకి దించినా, తొలి రోజు ఆటలో అతనిచే కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయించింది. తొలి రోజు ఇంగ్లండ్ మొత్తంగా 23 ఓవర్లు వేయగా.. అందులో 21 ఓవర్లు స్పిన్నర్లు టామ్ హార్ట్లీ (9), జాక్ లీచ్ (9), రెహాన్ అహ్మద్‌లే (3) షేర్ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఇలా ముగ్గురు స్పిన్నర్లతో టెస్ట్ మ్యాచ్ బరిలోకి దిగడం కూడా చాలా అరుదు. హైదరాబాద్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉందని భావించి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. తొలి రోజు ఆటను బట్టి చూస్తే ఇంగ్లండ్ అంచనా కరెక్టే అయినప్పటికీ.. భారత్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి కీలకమైన స్టోక్స్ వికెట్ సహా రెండు వికెట్లు తీయడం విశేషం. కాగా, భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నిన్న (జనవరి 25) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే భారత స్పిన్నర్లు ధాటికి ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టోక్స్ (70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. జాక్ క్రాలే 20, బెన్ డకెట్ 35, ఓలీ పోప్ 1, జో రూట్ 29, బెయిర్‌స్టో 37, ఫోక్స్ 4, రెహాన్ అహ్మద్ 13, టామ్ హార్ట్లీ 23, మార్క్ వుడ్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. జడేజా, అశ్విన్ తలో మూడు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాశించగా.. అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 24 పరుగులు చేసి జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. యశస్వి జైస్వాల్ (76), శుభ్‌మన్ గిల్ (14) క్రీజ్‌లో ఉన్నారు. భారత్.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 127 పరుగులు వెనుకపడి ఉంది. -
దుబాయ్ క్యాపిటల్స్‌లోకి వార్నర్, వుడ్.. అఫ్రిది, షాదాబ్ ఖాన్ మరో జట్టుతో..!
యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20 సీజన్-2 (2024) కోసం ఆయా ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు తమ పాత ఆటగాళ్లను కొందరిని రిటైన్ చేసుకోవడంతో పాటు కొత్తగా 50 మంది ఆటగాళ్లతో డీల్ కుదుర్చుకున్నాయి. అబుదాబీ నైట్‌రైడర్స్ 8, డెజర్ట్ వైపర్స్ 6, దుబాయ్ క్యాపిటల్స్ 11, గల్ఫ్ జెయింట్స్ 5, ఎంఐ ఎమిరేట్స్ 8, షార్జా వారియర్స్ 12 మంది ఆటగాళ్లను తమ పంచన చేర్చుకున్నాయి. కొత్తగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్లలో డేవిడ్ వార్నర్ (దుబాయ్ క్యాపిటల్స్), మార్క్ వుడ్, షాదాబ్ ఖాన్ (డెజర్ట్ వైపర్స్), షాహీన్ అఫ్రిది (డెజర్ట్ వైపర్స్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (గల్ఫ్ జెయింట్స్), అంబటి రాయుడు (ఎంఐ ఎమిరేట్స్), కోరె ఆండర్సన్ (ఎంఐ ఎమిరేట్స్), మార్టిన్ గప్తిల్ (షార్జా వారియర్స్) లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఆటగాళ్ల ఎంపిక సంబంధించిన మొత్తం తంతును ఆయా ఫ్రాంచైజీలు ఇవాళ (ఆగస్ట్ 21) పూర్తి చేశాయి. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. DP వరల్డ్ ILT20 సీజన్ 2 కోసం ఆయా ఫ్రాంచైజీ ఆటగాళ్ల పూర్తి జాబితా.. అబుదాబి నైట్ రైడర్స్ కొత్త ఆటగాళ్లు: బ్రాండన్ మెక్‌ముల్లెన్, డేవిడ్ విల్లీ, జేక్ లింటాట్, జోష్ లిటిల్, లారీ ఎవాన్స్, మైఖేల్ పెప్పర్, రవి బొపారా, సామ్ హైన్ రిటెన్షన్స్: అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, చరిత్ అసలంక, జో క్లార్క్, సాబిర్ అలీ, సునీల్ నరైన్, మర్చంట్ డి లాంజ్, మతియుల్లా ఖాన్ డెజర్ట్ వైపర్స్ కొత్త ఆటగాళ్లు: ఆడమ్ హోస్, ఆజం ఖాన్, బాస్ డి లీడ్, మైఖేల్ జోన్స్, షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిది రిటెన్షన్స్: అలెక్స్ హేల్స్, అలీ నసీర్, కొలిన్ మున్రో, దినేష్ చండిమాల్, గుస్ అట్కిన్సన్, ల్యూక్ వుడ్, మతీష పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, టామ్ కర్రన్, వనిందు హసరంగ దుబాయ్ క్యాపిటల్స్ కొత్త ఆటగాళ్లు: ఆండ్రూ టై, దసున్ షనక, డేవిడ్ వార్నర్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, రహ్మానుల్లా గుర్బాజ్, నువాన్ తుషార, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్ రిటెన్షన్స్: దుష్మంత చమీర, జో రూట్, రాజా అకిఫ్, రోవ్‌మన్ పావెల్, సికందర్ రజా గల్ఫ్ జెయింట్స్ కొత్త ఆటగాళ్లు: డొమినిక్ డ్రేక్స్, జోర్డాన్ కాక్స్, కరీం జనత్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, సౌరభ్ నేత్రవల్కర్ రిటెన్షన్స్: అయాన్ అఫ్జల్ ఖాన్, కార్లోస్ బ్రాత్‌వైట్, క్రిస్ జోర్డాన్, క్రిస్ లిన్, గెర్హార్డ్ ఎరాస్మస్, జేమ్స్ విన్స్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, రిచర్డ్ గ్లీసన్, సంచిత్ శర్మ, షిమ్రాన్ హెట్‌మైర్ ఎంఐ ఎమిరేట్స్ కొత్త ఆటగాళ్లు: అకీల్ హోసేన్, అంబటి రాయుడు, కోరె అండర్సన్, కుశాల్ పెరీరా, నోస్తుష్ కెంజిగే, ఓడియన్ స్మిత్, విజయకాంత్ వియాస్కాంత్, వకార్ సలాంఖైల్ రిటెన్షన్స్: ఆండ్రీ ఫ్లెచర్, డేనియల్ మౌస్లీ, డ్వేన్ బ్రేవో, ఫజల్ హాక్ ఫారూకీ, జోర్డాన్ థాంప్సన్, కీరన్ పొలార్డ్, మెక్కెన్నీ క్లార్క్, ముహమ్మద్ వసీమ్, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, జహూర్ ఖాన్ షార్జా వారియర్స్ కొత్త ఆటగాళ్లు: క్రిస్ సోల్, డేనియల్ సామ్స్, దిల్షన్ మధుశంక, జేమ్స్ ఫుల్లర్, జాన్సన్ చార్లెస్, కుశాల్ మెండిస్, లూయిస్ గ్రెగొరీ, మహేశ్ తీక్షణ, మార్క్ వాట్, మార్టిన్ గప్తిల్, సీన్ విలియమ్స్, కైస్ అహ్మద్ రిటెన్షన్స్: క్రిస్ వోక్స్, జో డెన్లీ, జునైద్ సిద్ధిక్, మార్క్ దెయాల్, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కోహ్లర్-కాడ్మోర్ -
యాషెస్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ బంతి.. ఖవాజాకు మైండ్ బ్లాక్
ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ దెబ్బకు ఉస్మాన్ ఖవాజా మైండ్ బ్లాక్ అయింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు మూడో టెస్టు ఆడుతున్నాయి. తొలిరోజు ఆటలో భాగంగా టాస్ గెలిచిన స్టోక్స్ ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. స్టోక్స్ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇంగ్లండ్ బౌలర్లు తొలి సెషన్లోనే చెలరేగిపోయారు. లంచ్ విరామ సమయానికి నాలుగు వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బతీశారు. స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు తీసినప్పటికి.. హైలెట్ అయింది మాత్రం మార్క్ వుడ్ అని చెప్పొచ్చు. యాషెస్ సిరీస్‌లో మార్క్ వుడ్‌కు ఇదే తొలి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే గంటకు 90 మైళ్ల వేగంతో బంతులు విసురుతూ ఆసీస్‌కు చాలెంజ్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను ఔట్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖవాజాను ఔట్ చేసిన 13వ ఓవర్లో మార్క్‌వుడ్ ప్రతీ బంతిని గంటకు 90 మైళ్ల వేగంతో విసరడం విశేషం. గుడ్‌లైన్ అండ్ లెంగ్త్‌తో సంధించిన మార్క్‌వుడ్ ఆఖరి బంతిని ఇన్‌స్వింగర్ వేశాడు. బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని ఖవాజా కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి లెగ్ స్టంప్‌ను గిరాటేసింది. 96.5 మైళ్ల వేగం(గంటకు 152 కిమీ)తో వచ్చిన బంతి దెబ్బకు స్టంప్ ఎగిరి కింద పడింది. ఇక యాషెస్ చరిత్రలో మార్క్ వుడ్ వేసిన బంతి రెండో ఫాస్టెస్ట్ డెలివరీగా నిలిచింది. ఇంతకముందు ఆసీస్ స్టార్ మిచెల్ జాన్సన్ 2013 యాషెస్ సిరీస్‌లో గంటకు 97 మైళ్ల వేగం(గంటకు 156.7 కిమీ)తో బంతిని విసిరాడు. ఇప్పటికి ఈ రికార్డు యాషెస్ చరిత్రలో పదిలంగా ఉంది. అంతకముందు స్టువర్ట్ బ్రాడ్.. వార్నర్‌ను(4 పరుగులు), వందో టెస్టు ఆడుతున్న స్మిత్(22 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక మార్నస్ లబుషేన్‌ను(21 పరుగుల) క్రిస్ వోక్స్ పెవిలియన్ చేర్చాడు. లంచ్ అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ప్రస్తుతం 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసిది. మిచెల్ మార్ష్ 30, ట్రెవిస్ హెడ్ 17 పరుగులతో ఆడుతున్నారు. It's full and straight and far too quick for Usman Khawaja 🌪️ Australia are 2 down and Mark Wood is on fire! 🔥 #EnglandCricket | #Ashes pic.twitter.com/y5MAB1rWxd — England Cricket (@englandcricket) July 6, 2023 చదవండి: #SteveSmith: వందో టెస్టులో స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు #GlennMcGrath: ఇంగ్లండ్‌కు ఆసీస్ దిగ్గజం చురకలు.. 'బజ్‌బాల్ కాదది కజ్బాల్' -
లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో బిగ్ షాక్.. స్టార్ ఆటగాడు దూరం!
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ తన స్వదేశానికి వెళ్లిపోయాడు. తన భార్య సారా లోన్స్డేల్ బిడ్డకు జన్మనివ్వడంతో వుడ్ ఇంగ్లండ్‌కు పయనం అయ్యాడు. ఈ నేపథ్యంలో తుది దశ ఐపీఎల్ మ్యాచ్‌లకు వుడ్ దూరం కానున్నాడు. కాగా ఈ టోర్నీ ఆరంభానికి ముందే వుడ్ తన నిర్ణయాన్ని లక్నో ఫ్రాంచైజీకి తెలియజేశాడు. ఇక ఈ విషయాన్ని వుడ్ కూడా సృష్టం చేశాడు. ఈ ఏడాది టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడిన వుడ్ 11 వికెట్లు పడగొట్టాడు. "నా భార్య పండింటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అందుకే స్వదేశానికి వెళ్లాలి అనుకుంటున్నాను. మళ్లీ కచ్చితంగా తిరిగి రావడానికి ప్రయత్నిస్తాను. నన్ను క్షమించిండి. ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాను. ఆడిన మ్యాచ్‌ల్లో వికెట్లు కూడా పడగొట్టాను. లక్నో వంటి ఫ్రాంచైజీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. నా సహచర ఆటగాళ్లు, మెనెజ్‌మెంట్ అందరూ సపోర్ట్‌గా ఉంటారు. ఈ సీజన్లో మా జట్టు మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను" అని లక్నో పోస్ట్ చేసిన వీడియోలో వుడ్ పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే లక్నోకు కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కాగా.. ఇప్పుడు వుడ్ కూడా జట్టును వీడడం లక్నో మెనెజ్‌మెంట్‌ను మరింత కలవరపెడుతుంది. ఈ ఏడాది సీజన్లో 11 మ్యాచ్‌లు ఆడిన లక్నో ఐదింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. చదవండి: #Venkatesh Iyer: క్లిష్ట పరిస్థితుల్లో తానున్నాంటూ బాధ్యత తీసుకున్నాడు! సంతోషంగా ఉంది! -
RCB VS LSG: ఇదెక్కడి ఫాస్ట్ బౌలింగ్ రా బాబు.. రాకెట్ వేగాన్ని తలపిస్తూ..!
ఐపీఎల్-2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మార్క్ వుడ్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టిన వుడ్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్లో ఏకంగా జెట్ స్పీడ్‌తో బంతులు సంధించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో వుడ్ వేసిన 7 బంతులు (ఓ వైడ్ కలుపుకుని) 150 కిమీకి పైగా వేగంతో బౌల్ చేశాడు. తొలి బంతి (వైడ్) 150కిమీ వేగంతో వేసిన వుడ్ ఆ తర్వాత బంతులను153, 151, 150, 150, 151.7, 150కిమీల వేగంతో బౌల్ చేశాడు. ఓవర్లో ప్రతి బంతి ఇంత వేగంతో బౌల్ చేయడమనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇటీవలి కాలంలో వుడ్ మాత్రం ప్రతి బంతిని దాదాపు ఇంతే వేయడం బౌల్ చేయడం విశేషం. ఆర్సీబీతో మ్యాచ్‌లో తొలి ఓవర్ నుంచే రాకెట్ వేగంతో బౌలింగ్ చేసిన వుడ్.. తొలి ఓవర్లో 14 పరుగులు, రెండో ఓవర్లో 5 పరుగులు, మూడో ఓవర్లో 9 పరుగులు, నాలుగో ఓవర్లో 9 పరుగులు సమర్పించుకుని, నాలుగో ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. అమిత్ మిశ్రా, మార్క్ వుడ్‌కు తలో వికెట్ దక్కింది. ఛేదనలో ఆదిలోనే వికెట్లు కోల్పోయిన లక్నో.. 11.1 ఓవర్ల తర్వాత సగం వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. -
'నమ్మకంతో రిటైన్ చేసుకున్నారు.. తిరిగిచ్చేయాలి'
ఇంగ్లండ్ బౌలర్ మార్క్‌వుడ్ ఐపీఎల్ 16వ సీజన్లో తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లు కలిపి ఎనిమిది వికెట్లు పడగొట్టిన మార్క్‌వుడ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 14 పరుగులకే ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక సీఎస్కేతో మ్యాచ్‌లో లక్నో ఓడిపోయినప్పటికి మార్క్‌వుడ్ విఫలం కాలేదు. సీఎస్కే మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. Photo: IPL Website ఈసారి పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు) రేసులో తానున్నట్లు స్పష్టం చేశాడు. అయితే మార్క్‌వుడ్ అడుగు ఐపీఎల్లో నాలుగేళ్ల క్రితమే పడింది. అప్పట్లో సీఎస్కే తరపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన మార్క్‌వుడ్ నాలుగు ఓవర్లు వేసి 49 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అంతే ఆ తర్వాత ఐపీఎల్లో కనబడకుండా పోయిన మార్క్‌వుడ్‌ను 2022లో లక్నో సూపర్ జెయింట్స్ రూ.7.5 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ మోచేతి గాయంతో గతేడాది సీజన్‌కు దూరమైన మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా దూరం కావాల్సి వచ్చింది. ఇక ఈ ఏడాది మినీ వేలానికి ముందు మార్క్‌వుడ్‌ను లక్నో రిటైన్ చేసుకుంది. ఇక మార్క్‌వుడ్.. శుక్రవారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మార్క్‌వుడ్ ఒక చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. 'లక్నోకు నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. గతేడాది ఒక్క మ్యాచ్ ఆడకపోయినప్పటికి లక్నో జట్టు నాపై నమ్మకంతో రిటైన్ చేసుకుంది. అందుకే వారి నమ్మకాన్ని తిరిగి ఇచ్చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఈసారి ఆటను ఎంతో ప్రేమిస్తున్నా. కెప్టెన్ కేఎల్ రాహుల్ నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. జట్టు మేనేజ్మెంట్ కూడా నా రోల్ విషయంలో క్లియర్‌గా ఉంది. వారు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది ఇస్తున్నా. ఇక ఇంగ్లండ్ తరపున టి20, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్ ఆడిన నేను ఐపీఎల్లో మాత్రం ఆకట్టుకోలేదు. నాలుగేళ్ల క్రితమే ఐపీఎల్లో అవకాశమొచ్చినా నిరూపించుకోవడంలో విఫలమయ్యా. దీంతో క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్లో నా బిజినెస్ అసంపూర్తిగా ఉండిపోయింది. అందుకే ఈసారి ఐపీఎల్లో నేనేంటో నిరూపించుకొని బిజినెస్‌ను పూర్తి చేస్తా'' అంటూ తెలిపాడు. చదవండి: భళా అర్జెంటీనా.. ఆరేళ్ల తర్వాత అగ్రస్థానం -
ఐపీఎల్ సీజన్..లక్నో శుభారంభం
-
ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే భయపెట్టాడు!
ఐదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు వుడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో వుడ్ అద్భుతమైన ప్రదర్శరన కనబరిచాడు. లక్నో విజయంలో వుడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఈ ఇంగ్లీష్ పేసర్ ఐదు వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. వుడ్ ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా, మిచెల్ మార్ష్‌ను అద్భుతమైన బంతులతో క్లీన్ బౌల్డ్ చేశాడు. కాగా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా వుడ్ రికార్డులకెక్కాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో 9వ బౌలర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌కు ముందు చివరగా 2018 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. అనంతరం ఐపీఎల్-2022 మెగా వేలంలో వుడ్‌ను రూ.7.50 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. అయితే గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయినప్పటికీ ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు వుడ్‌ను లక్నో రీటైన్ చేసుకుంది. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఉమేశ్ యాదవ్.. ఒకే ఒక్కడు!