ఐపీఎల్-2022కు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మార్క్ వుడ్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వెస్టిండీస్-ఇంగ్లండ్ రెండో టెస్టు సందర్భంగా వుడ్ గాయ పడ్డాడు. అయితే మార్క్ వుడ్ స్ధానాన్ని బంగ్లాదేశ్ స్టార్ పేసర్ టాస్కిన్ ఆహ్మద్‌తో భర్తీ చేయాలని లక్నో ప్రాంఛైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై త్వరలోనే లక్నో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
కాగా ఇప్పటికే లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఇక దక్షిణాఫ్రికాలో పర్యటించిన బంగ్లాదేశ్ జట్టులో టాస్కిన్ ఆహ్మద్ భాగమై ఉన్నాడు. అయితే వన్డే సిరీస్ అనంతరం బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
ఈ క్రమంలో టెస్టు సిరీస్ నుంచి టాస్కిన్ ఆహ్మద్ తప్పుకోనే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జట్టుగా అవతరించింది. ఈ జట్టుకు టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ సారథ్యం వహించనున్నాడు. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో మార్చి28న తలపడనుంది.
చదవండి: IPL 2022- KL Rahul: పంజాబ్ కింగ్స్‌ను వీడటానికి ముఖ్య కారణం అదే: కేఎల్ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment