Mark Wood Hilarious Comments While Being Under Anesthesia Gone Viral - Sakshi
Sakshi News home page

Mark Wood: అనస్థీషియా మత్తులోనూ ఐపీఎల్‌ జపం చేసిన ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌

Published Thu, Mar 31 2022 4:42 PM | Last Updated on Thu, Mar 31 2022 5:18 PM

IPL 2022: Mark Wood Hilarious Comments While Being Under Anesthesia Gone Viral - Sakshi

Mark Wood Hilarious Comments Under Anesthesia Gone Viral: వెస్టిండీస్‌ పర్యటనలో గాయం (మోచేతికి) బారిన పడి, ఆ సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2022 సీజన్‌ మొత్తానికి దూరమైన ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. మోచేతి గాయానికి శస్త్రచికిత్స జరిగిన అనంతరం అతను మాట్లాడిన మాటలు నెట్టింట వైరలవుతున్నాయి. సర్జరీ పూర‍్తయ్యాక చాలా సమయం వరకు అనస్థీషియా మత్తులో ఉన్న వుడ్‌.. ఆ సమయంలోనూ ఐపీఎల్‌ జపం చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. 


వుడ్‌ ఏం మాట్లాడాడంటే..  నా భుజాలు బాగా నొప్పి పెడుతున్నాయి.. అయినా నేను ఫాస్ట్‌ బౌలింగ్ చేయగలను అంటూ మూలుగుతూ చెప్పాడు. ఇదే సమయంలో వుడ్‌.. లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌ పేరును జపిస్తూ.. నాకు ఆండీ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం. అతను చాలా మంచోడు అంటూ మత్తులో తన భావాన్ని బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం వైరలవుతుంది. 

కాగా, ఐపీఎల్ 2022 మెగా వేలంలో మార్క్ వుడ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.7.5 కోట్ల భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, లీగ్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు అతను గాయపడి ఐపీఎల్‌ అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 150 కిమీ వేగంతో నిలకడగా బౌలింగ్‌ చేయగల వుడ్‌కు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరపించగల సత్తా ఉంది. వుడ్‌ గాయం నేపథ్యంలో ఎల్‌ఎస్‌జీ.. అతని రీప్లేస్‌మెంట్‌గా ఆసీస్‌ బౌలర్‌ ఆండ్రూ టైని తీసుకుంది. 
చదవండి: కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement