Andy Flower
-
నవశకం.. కొత్త కెప్టెన్ అతడే!.. ఆర్సీబీ హెడ్‌కోచ్ వ్యాఖ్యలు వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. మూడుసార్లు ఫైనల్ చేరినా ఒక్కసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టైటిల్ గెలవలేకపోయింది. ప్రత్యర్థి జట్ల ఎత్తులకు చిత్తై.. ఆఖరి మెట్టుపై బోల్తా పడి ట్రోఫీని చేజార్చుకుంది. దీంతో.. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆరంభం నుంచే టీమిండియా సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli) కెరీర్లో ఐపీఎల్ టైటిల్ లేని లోటు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది.ఆర్సీబీ ముఖచిత్రంగా కోహ్లిఅయితే, ఈసారి మాత్రం ఆర్సీబీ తలరాత మారుతుందంటున్నాడు ఆ జట్టు హెడ్‌కోచ్ ఆండీ ఫ్లవర్(Andy Flower). అదే విధంగా కొత్త కెప్టెన్ గురంచి కూడా సంకేతాలు ఇచ్చాడు. కాగా ఆర్సీబీకి భారీ ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం కోహ్లినే అనడంలో సందేహం లేదు. తన ఇమేజీ ద్వారా ఆర్సీబీ ముఖచిత్రంగా మారిపోయిన ఈ రన్‌మెషీన్.. 2011లో తొలిసారి కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు.ఆ తర్వాత రెండేళ్లకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా నియమితుడైన కోహ్లి.. 2016లో జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. కానీ తుదిపోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓడిపోయి.. రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ఆ తర్వాత కూడా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ భారాన్ని, పని ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో 2021లో సారథ్య బాధ్యతల నుంచి కోహ్లి వైదొలిగాడు.డుప్లెసిస్ సారథ్యంలోఈ క్రమంలో సౌతాఫ్రికా వెటరన్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్(Faf Du Plesis) ఆర్సీబీ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. 2024 వరకు నాయకుడిగా జట్టును ముందుండి నడిపించాడు. అయితే, మెగా వేలానికి ముందు ఆర్సీబీ డుప్లెసిస్‌ను వదిలేసింది. ఆక్షన్ సమయంలోనే అతడిని కొనేందుకు ఆసక్తి చూపలేదు.ఈ నేపథ్యంలో ఆర్సీబీకి ఐపీఎల్-2025లో కొత్త కెప్టెన్ రావడం ఖాయమైంది. అతడు మరెవరో కాదు.. కోహ్లినే అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడిన ఆండీ ఫ్లవర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.నవశకం ఆరంభం‘‘నవశకం ఆరంభం కాబోతోంది. మూడేళ్ల సైకిల్లో ఊహించిన ఫలితాన్ని రాబట్టబోతున్నాం. అందరూ అనుకున్నదే నిజమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు అందుకు సంబంధించిన చర్చ జరుగలేదని మాత్రం చెప్పగలను’’ అని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. అదే సమయంలో.. కోహ్లికే మరోసారి పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఆండీ ఫ్లవర్ సంకేతాలు ఇచ్చాడు. మరోవైపు.. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మొ బొబాట్ సైతం కెప్టెన్సీ అంశం గురించి ఇంకా చర్చించలేదని చెప్పినా.. పరోక్షంగా కోహ్లి వైపే తాము మొగ్గుచూపే ఛాన్స్ ఉందని తెలియజేశాడు.తిరుగులేని కింగ్కాగా ఐపీఎల్ కెరీర్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లి 8004 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది శతకాలతో పాటు.. 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా 705 ఫోర్లు, 272 సిక్సర్లు ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ఉన్నాయి. రైటార్మ్ మీడియం పేసర్ అయిన కోహ్లి ఐపీఎల్లో నాలుగు వికెట్లు కూడా తీయడం విశేషం. మూడేళ్ల షెడ్యూల్ ఇదేఇదిలా ఉంటే.. గతేడాది ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. ఫైనల్లో మాత్రం అడుగుపెట్టలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే ఇంటిబాట పట్టింది. ఇక బీసీసీఐ ఇప్పటికే మూడేళ్ల ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్-2025.. మార్చి 14- మే 25 వరకు.. ఐపీఎల్-2026.. మార్చి 15- మే 31 వరకు.. ఐపీఎల్- 2027.. మార్చి 14- మే 30 వరకు నిర్వహించనున్నారు. చదవండి: 'డబ్బులు తీసుకున్న కుక్కలు మొరుగుతూనే ఉంటాయి'.. భజ్జీ పోస్ట్ వైరల్ -
క్రికెట్ చరిత్రలో ఓ ఆశ్చర్య ఘటన..!
క్రికెట్ చరిత్రలో సెప్టెంబర్ 18వ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. 1997లో ఈ రోజు మొదలైన టెస్ట్ మ్యాచ్‌లో మూడు అన్నదమ్ములు జోడీలు ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహించాయి. నాడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున ఫ్లవర్ సోదరులు (ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్), స్ట్రాంగ్ సోదరులు (పాల్ స్ట్రాంగ్, బ్రియాన్ స్ట్రాంగ్), రెన్నీ సోదరులు (జాన్ రెన్నీ, గావిన్ రెన్నీ) తుది జట్టులో ఆడారు.ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. జింబాబ్వే జట్టులో 12వ నంబర్ ఆటగాడు ఆండీ విట్టల్.. జింబాబ్వే ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉన్న గయ్ విట్టల్‌కు సోదరుడు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఆండీ విట్టల్ కూడా ఆడి ఉంటే నాలుగు బ్రదర్స్ జోడీలు బరిలో ఉండేవి. క్రికెట్ చరిత్రలో మూడు అన్నదమ్ముల జోడీలు ఒకే జట్టు తరఫున ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగడం అదే మొదటిసారి, చివరిసారి. క్రికెట్లో అన్నదమ్ములు జోడీలు చాలానే ఉన్నప్పటికీ.. ఒకే జట్టు తరఫున ఒకే మ్యాచ్‌లో మూడు జోడీలు బరిలోకి దిగింది లేదు.ఒకే మ్యాచ్‌లో ఒకే జట్టు తరఫున బరిలోకి దిగిన అన్నదమ్ముల జోడీలు..హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా (భారత్)షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)టామ్ కర్రన్, సామ్ కర్రన్ (ఇంగ్లండ్)ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ (భారత్)స్టీవ్ వా, మార్క్ వా (ఆస్ట్రేలియా)ఆండీ ఫ్లవర్, గ్రాంట్ ఫ్లవర్ (జింబాబ్వే)గై విట్టల్, ఆండీ విట్టల్ (జింబాబ్వే)పాల్ స్ట్రాంగ్, బ్రియాన్ స్ట్రాంగ్ (జింబాబ్వే)అల్బీ మోర్కెల్, మోర్నీ మోర్కెల్ (సౌతాఫ్రికా)బ్రెండన్ మెక్కల్లమ్, నాథన్ మెక్కల్లమ్ (న్యూజిలాండ్)మైక్ హస్సీ, డేవిడ్ హస్సీ (ఆస్ట్రేలియా)కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్ (పాకిస్తాన్)బ్రెట్ లీ, షేన్ లీ (ఆస్ట్రేలియా)గ్రెగ్ ఛాపెల్, ఇయాన్ ఛాపెల్, ట్రెవర్ ఛాపెల్ (ఆస్ట్రేలియా)జెస్సీ రైట్, ఫ్రాంక్ రైట్, రిచర్డ్ రైట్ (న్యూజిలాండ్)చదవండి: ఇంగ్లండ్ గడ్డపై ఇరగదీస్తున్న చహల్.. తాజాగా మరో మ్యాచ్‌లో..! -
IPL 2024- RCB: విరాట్ కోహ్లి లేకుండానే..
IPL 2024- RCB- బెంగళూరు: ఐపీఎల్ తాజా ఎడిషన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ గురువారం ప్రీ సీజన్ క్యాంప్(శిక్షణా శిబిరం)నకు శ్రీకారం చుట్టింది. అయితే జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కాస్త ఆలస్యంగా శిబిరంలో చేరనున్నాడు. ఫ్రాంచైజీల వ్యవహారాల్ని పరిశీలిస్తున్న బీసీసీఐ ఇందుకు గల కారణాన్ని వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతో ఆటకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి త్వరలోనే జట్టుతో కలుస్తాడని తెలిపింది. కాగా.. తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో కోహ్లి లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరమైన అతడు.. ‘ఆర్సీబీ అన్‌బాక్స్’ ఈవెంట్ సందర్భంగా తిరిగి అభిమానుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కెప్టెన్ వచ్చేశాడు.. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు వెస్టిండీస్ స్టార్ అల్జారీ జోసెఫ్ ప్రీ సీజన్ క్యాంపులో చేరారు. ఇక ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. కొత్త హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్, క్రికెట్ డైరెక్టర్ మో బొబట్లు జట్టుతో చేరి శిబిరాన్ని పర్యవేక్షిస్తున్నారు. సంతోషంగా ఉంది ఈ నేపథ్యంలో కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ.. ‘‘ఆండీ ఫ్లవర్ అద్భుతమైన వ్యక్తి. ఇలాంటి కోచ్ మార్గదర్శనంలో ముందుకు సాగడం మా జట్టు చేసుకున్న అదృష్టం. గొప్ప మనసున్న వ్యక్తి’’ అంటూ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆండీ ఫ్లవర్ సైతం ఆర్సీబీ చరిత్రలోని ఓ నూతన అధ్యాయంలో తాము కూడా భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కాగా చెపాక్ వేదికగా మార్చి 22న ఐపీఎల్ పదిహేడో సీజన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్- ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ మధ్య తాజా ఎడిషన్ తొలి మ్యాచ్ జరుగనుంది. చదవండి: IPL 2024: షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్య! వైజాగ్‌లోనూ -
ఆర్సీబీ హెడ్ కోచ్‌గా ఫ్లవర్
బెంగళూరు: ఐపీఎల్లో ఒక్కసారి కూడా విజేతగా నిలువలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి కోచింగ్ బృందంలో కీలక మార్పు చేసింది. జట్టు హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ కెపె్టన్, కోచింగ్‌లో అపార అనుభవం ఉన్న ఆండీ ఫ్లవర్‌ను ఎంపిక చేసింది. దాంతో ఇప్పటి వరకు హెడ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌తో పాటు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ హోదాలో టీమ్‌ను పూర్తి స్థాయిలో నడిపించిన మైక్ హెసన్‌పై వేటు పడినట్లయింది. నాలుగు సీజన్ల పాటు హెసన్ డైరెక్టర్‌గా పని చేయగా... మూడుసార్లు ప్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు 2023 సీజన్లో ఆరో స్థానంతో ముగించింది. అయితే ఈ ప్రదర్శన ఆర్సీబీ యాజమాన్యానికి సంతృప్తినివ్వలేదు. -
IPL 2024: సన్‌రైజర్స్‌లో కీలక పరిణామం.. హెడ్ కోచ్‌కు ఉద్వాసన..!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి సమయం చాలా ఉండగానే, అన్ని జట్లు సన్నాహకాలు మొదలుపెట్టాయి. తొలుత లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌ను మార్చి తమ ప్రిపరేషన్స్ మొదలయ్యాయని సంకేతాలు పంపగా.. తాజాగా ఆర్సీబీ, సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా అదే పనిలో పడ్డాయి. ఫ్లవర్‌ను తప్పించి లాంగర్‌ను ఎంచుకున్న లక్నో.. లక్నో సూపర్ జెయింట్స్.. తమ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ పదవి నుంచి ఆండీ ఫ్లవర్‌ను తప్పించి, ఆ స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌కు కట్టబెట్టింది. ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ 2022, 2023 సీజన్లలో వరుసగా ప్లే ఆఫ్స్‌కు చేరింది. బ్రియాన్ లారాకు ఉద్వాసన.. కొత్త కోచ్ వేటలో సన్‌రైజర్స్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బ్రియాన్ లారా.. ఆ సీజన్లో ఫ్రాంచైజీపై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ గత సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో ముగించింది. దీంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం లారాపై వేటు వేయాలని భావిస్తుందట. కొత్త కోచ్ రేసులో ఆండీ ఫ్లవర్, మరో విదేశీ ఆటగాడు ఉన్నట్లు సమాచారం. ఫ్లవర్‌కు భలే గిరాకి.. లక్నో సూపర్ జెయింట్స్ వదిలించుకున్న జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్‌కు ఐపీఎల్లో భలే గిరాకి ఉంది. కోచ్‌గా అతని ట్రాక్ రికార్డే ఇందుకు కారణం. లక్నో ఫ్రాంచైజీ ఫ్లవర్‌ను వదిలించుకున్న తర్వాత అతని కోసం రెండు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ అతనిపై కన్నేసినట్లు సమాచారం. ఫ్లవర్‌తో రాయల్స్ బేరసారాలు అంతిమ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్లవర్ ఎంపికకు ఆ జట్టు డైరెక్టర్ సంగక్కర కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆర్సీబీలో కీలక మార్పులు.. 2024 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్లను వారి పదవుల నుంచి తప్పించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. బాంగర్, హెస్సన్‌లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ బాంగర్ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్‌గా నియమించుకుంది. -
IPL: లక్నో సూపర్ జెయింట్స్‌కు కొత్త కోచ్.. ప్రకటించిన ఫ్రాంఛైజీ
ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ కొత్త హెడ్ కోచ్‌ను నియమించుకుంది. ప్రస్తుత కోచ్ ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ 2023 సీజన్‌తో ముగియడంతో, అతని స్థానాన్ని ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌తో భర్తీ చేసింది. ఈ విషయాన్ని ఎల్ఎస్జీ యాజమాన్యం ఇవాళ (జులై 14) అధికారికంగా ప్రకటించింది. ఎల్ఎస్జీకి ఆండీ ఫ్లవర్ చేసిన సేవలను అభినందిస్తూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసిన మేనేజ్మెంట్.. కొత్త కోచ్ పేరును ప్రకటించింది. ఫ్లవర్ కాంట్రాక్ట్‌ను పొడిగించేందుకు సముఖత చూపని లక్నో మేనేజ్మెంట్.. మెంటార్‌గా గౌతమ్ గంభీర్ సేవలను మాత్రం ఎక్స్టెండ్ చేసింది. గంభీర్‌తో పాటు బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌ను, ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ను, అసిస్టెంట్ కోచ్‌గా విజయ్ దాహియాను కొనసాగించింది. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఓ పక్క తమతో పాటు ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓ సీజన్లో విజేతగా, మరో సీజన్లో రన్నరప్‌గా నిలువడంతో ఎల్ఎస్జీ పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే హెడ్ కోచ్‌ను మార్చింది. మున్ముందు ఈ జట్టులో భారీ మార్పులు ఉంటాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను కూడా తప్పించవచ్చని ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్-2024కు మరో ఏడాది సమయం ఉంది కాబట్టి, కెప్టెన్ మార్పు విషయంలో ఎల్ఎస్జీ యాజమాన్యం ఎలాంటి ముందస్తు ప్రకటన చేయకపోవచ్చు. లక్నో కొత్త కోచ్ విషయానికొస్తే.. 52 ఏళ్ల లాంగర్ ఆసీస్‌ను 2021 టీ20 వరల్డ్‌కప్ విజేతగా, బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా (కోచ్‌గా) నిలబెట్టాడు. కోచ్‌గా మంచి ట్రాక్ రికార్డు కలిగిన లాంగర్‌ను ఎల్ఎస్జీ యాజమాన్యం ఏరికోరి ఎంచుకుంది. 1993-2007 మధ్యకాలంలో ఆసీస్ తరఫున 105 టెస్ట్‌లు 8 వన్డేలు ఆడిన లాంగర్.. సక్సెస్ఫుల్ ఓపెనింగ్ బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. వన్డేల్లో పెద్దగా రాణించని లాంగర్ టెస్ట్‌ల్లో సత్తా చాటాడు. 182 ఇన్నింగ్స్‌ల్లో 23 సెంచరీలు, 30 అర్ధసెంచరీల సాయంతో 45.3 సగటున 7696 పరుగులు చేశాడు. -
లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా ఆసీస్ మాజీ ఓపెనర్..?
వచ్చే ఐపీఎల్ సీజన్ (2024) కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆ జట్టు.. తమ హెడ్ కోచ్‌ను మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న ఆండీ ఫ్లవర్ కాంట్రాక్ట్ 2023 సీజన్‌తోనే ముగియడంతో ఆ జట్టు కొత్త కోచ్ అన్వేషణలో పడింది. ఈ పదవి కోసం ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఆసీస్ మాజీ హెడ్ కోచ్, ఆ జట్టు మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై లాంగర్ కాని, ఎల్ఎస్జీ యాజమాన్యం కాని ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఇరు వర్గాల మధ్య మంతనాలు జరుగుతున్నట్లు క్రికెట్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే వచ్చే సీజన్ నుంచి ఎల్ఎస్జీ హెడ్ కోచ్‌గా లాంగర్ వ్యవహరించే అవకాశం ఉంది. 52 ఏళ్ల జస్టిన్ లాంగర్.. ఆసీస్‌ను 2021 టీ20 వరల్డ్‌కప్ విజేతగా, బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్‌ను మూడుసార్లు ఛాంపియన్‌గా (కోచ్‌గా) నిలబెట్టాడు. ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యాల నేతృత్వంలో, ఆండీ ఫ్లవర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గత రెండు సీజన్లలో ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపించింది. ఈ రెండు సీజన్లలో ఆ జట్టు మూడో స్థానంలో నిలిచింది. వ్యాపార దిగ్గజం సంజీవ్ గోయెంకా కొనుగోలు చేసిన ఎల్ఎస్జీ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా, మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా, జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్‌గా, విజయ్ దాహియా అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
టీమిండియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ముందు క్రికెట్ ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం తమ జట్టు బ్యాక్‌రూమ్ కన్సల్టెంట్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను నియమించిది. ఇంగ్లండ్ పరిస్థితుల్లో కోచ్‌గా ఫ్లవర్‌కు అపారమైన అనుభవం ఉండడంతో.. సీఏ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 2009 నుంచి 2014 వరకు ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఫ్లవర్ పనిచేశాడు. అంతకుముందు ఇంగ్లీష్ జట్టుకు డైరక్టర్‌గా పనిచేశాడు. అతడు హెడ్‌కోచ్‌గా ఉన్నప్పడు ఇంగ్లండ్ జట్టు మూడు సార్లు యాషెస్ విజేతగా నిలిచింది. అదే విధంగా ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఫ్లవర్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్‌లో కూడా ఆసీస్ జట్టుకు ఫ్లవర్ బ్యాక్‌రూమ్ కన్సల్టెంట్‌గా ఉండే అవకాశం ఉంది. కాగా జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్. సబ్స్టిట్యూట్స్: సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైస్వాల్, ముఖేష్ కుమార్. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్షాన్ , టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్, మాథ్యూ రెన్షా. -
లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ అసభ్య ప్రవర్తన
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (మే 13) జరిగిన మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ ఆండీ ఫ్లవర్ ప్రవర్తించిన తీరు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో నో బాల్ విషయంలో జరిగిన రసాభస సందర్భంగా ఆండీ ఫ్లవర్.. ఫీల్డ్ అంపైర్లకు మిడిల్ ఫింగర్ (ఓ రకమైన బూతు సంజ్ఞ) చూపించి తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఫ్లవర్ ప్రవర్తించిన తీరును మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తప్పుబడుతున్నారు. అత్యున్నత హోదాలో ఉన్న ఫ్లవర్ ఇలా ప్రవర్తించడమేంటని ఎండగడుతున్నారు. శాంతంగా కనిపించే వ్యక్తి ఇలా ప్రవర్తించడం జిగుప్సాకరంగా ఉందని అంటున్నారు. కోచ్ పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలి కాని ఇలా చిల్లరగా ప్రవర్తించకూడదని అక్షింతలు వేస్తున్నారు. కొందరు లక్నో ఫ్యాన్స్ మాత్రం ఫ్లవర్ అలా ప్రవర్తించడంలో తప్పేమీ లేదని వెనకేసుకొస్తున్నారు. రీప్లేలో క్లియర్‌గా నో బాల్ అని తెలుస్తున్నా, థర్డ్ అంపైర్ తప్పు తీర్పు చెబితే ఏ కోచ్‌కు కోపం రాదని అంటున్నారు. మొత్తంగా చూస్తే మెజారిటీ శాతం ఫ్లవర్ వ్యవహరించిన తీరును తప్పుబడుతున్నారు. కాగా, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో కాసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సందర్భంగా ఓ నో బాల్ విషయంలో థర్డ్ అంపైర్ వ్యవహరించిన తీరుపై ఎస్ఆర్హెచ్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. థర్డ్ అంపైర్‌ని దూషిస్తూ, లక్నో డగౌట్ వైపు నట్లు, బోల్ట్‌లు విసిరారు. దీంతో స్టేడియంలో కొద్ది సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. లక్నో శిబిరంలోని వారు మైదానంలోకి వచ్చారు. మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. ఎస్ఆర్హెచ్ అభిమానుల ప్రవర్తించిన తీరు పట్ల లక్నో బృందంతో పాటు ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు సైతం అసహనం వ్యక్తం చేశారు. అయితే లక్నో శిబిరంలోని వారికి అంపైర్లు సర్ధిచెప్పడంతో వ్యవహారం సద్దుమణిగింది. అనంతరం మ్యాచ్ సజావుగా సాగింది. నిర్ణీత ఓవర్లలో సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఛేదనలో పూరన్ విధ్వంసం సృష్టించడంతో లక్నో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చదవండి: హెచ్‌సీఏను ఏకిపారేసిన సునీల్ గావస్కర్ -
జింబాబ్వే మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ పరిస్థితి విషమం
జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ పరిస్థితి విషమంగా ఉందని ఆ దేశ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ మాజీ క్రీడల మంత్రి డేవిడ్ కోల్టార్ట్ సైతం ట్విట్టర్లో షేర్ చేశారు. స్ట్రీక్ కోలుకుని, తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు ప్రార్థించాలని ఆయన తన దేశ ప్రజలకు, దేశం వెలుపల ఉన్న ప్రార్ధన యోధులకు పిలుపునిచ్చారు. జింబాబ్వేకు పాత్రినిధ్యం వహించిన గొప్ప క్రికెటర్లలో ఒకరైన హీత్ స్ట్రీక్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, అతనికి మనందరి ప్రార్ధనలు చాలా అవసరమని డేవిడ్ కోల్టార్ట్ తన ట్వీట్లో పేర్కొన్నారు. స్ట్రీక్ కోసం, అతని కుటుంబం కోసం ప్రార్ధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్ట్రీక్ సౌతాఫ్రికాలో ఉన్నట్లు సమాచారం. కాగా, జింబాబ్వే ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్రౌండర్లలో ఒకరైన స్ట్రీక్ 1993లో ఆ దేశం తరఫున అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించి 65 టెస్ట్‌లు (216 వికెట్లు, సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు), 189 వన్డేలు (239 వికెట్లు, 13 హాఫ్ సెంచరీలు) ఆడాడు. అతను తన చివరి మ్యాచ్‌ను 2005లో ఆడాడు. స్ట్రీక్ 21 టెస్ట్‌ల్లో, 68 వన్డేల్లో జింబాబ్వే కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. 2021లో స్ట్రీక్ అవినీతికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని, ఎనిమిదేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధానికి గురయ్యాడు. చదవండి: టీమిండియా హెడ్ కోచ్‌గా ముజుందార్! -
IPL 2022: అనస్థీషియా మత్తులోనూ ఐపీఎల్ జపం చేసిన ఇంగ్లండ్ స్టార్ బౌలర్
Mark Wood Hilarious Comments Under Anesthesia Gone Viral: వెస్టిండీస్ పర్యటనలో గాయం (మోచేతికి) బారిన పడి, ఆ సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమైన ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. మోచేతి గాయానికి శస్త్రచికిత్స జరిగిన అనంతరం అతను మాట్లాడిన మాటలు నెట్టింట వైరలవుతున్నాయి. సర్జరీ పూర్తయ్యాక చాలా సమయం వరకు అనస్థీషియా మత్తులో ఉన్న వుడ్.. ఆ సమయంలోనూ ఐపీఎల్ జపం చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. Here’s more of Mark Wood under anaesthetic for you 😂😂😂 💬 I’ll still bowl fast… pic.twitter.com/YFGiWPQN0w — England’s Barmy Army (@TheBarmyArmy) March 28, 2022 వుడ్ ఏం మాట్లాడాడంటే.. నా భుజాలు బాగా నొప్పి పెడుతున్నాయి.. అయినా నేను ఫాస్ట్ బౌలింగ్ చేయగలను అంటూ మూలుగుతూ చెప్పాడు. ఇదే సమయంలో వుడ్.. లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ పేరును జపిస్తూ.. నాకు ఆండీ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం. అతను చాలా మంచోడు అంటూ మత్తులో తన భావాన్ని బయటపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరలవుతుంది. కాగా, ఐపీఎల్ 2022 మెగా వేలంలో మార్క్ వుడ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.7.5 కోట్ల భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, లీగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు అతను గాయపడి ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 150 కిమీ వేగంతో నిలకడగా బౌలింగ్ చేయగల వుడ్‌కు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరపించగల సత్తా ఉంది. వుడ్ గాయం నేపథ్యంలో ఎల్ఎస్జీ.. అతని రీప్లేస్‌మెంట్‌గా ఆసీస్ బౌలర్ ఆండ్రూ టైని తీసుకుంది. చదవండి: కేఎల్ రాహుల్ జట్టులోకి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్.. -
లక్నో హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్.. ఇక కెప్టెన్ మరి !
ఐపీఎల్-2022లో కొత్త జట్టుగా అవతరించిన లక్నో ఫ్రాంచైజీ.. హెడ్‌కోచ్‌గా జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్‌ను నియమించింది. ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఈ విషయాన్ని దృవీకరించారు. సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.. ‘ఆండీ ఆటగాడిగా, కోచ్‌గా క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మేము అతని వృత్తి పట్ల పట్టుదలని గౌరవిస్తాము. మా జట్టును విజయ పథంలో నడిపిస్తాడాని నేను భావిస్తున్నాను అని అతను పేర్కొన్నాడు. ఇక ఫ్లవర్ మాట్లాడుతూ.. "లక్నో ఫ్రాంచైజీలో చేరినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, ఈ అవకాశం నాకు ఇచ్చినందకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 1993లో నేను తొలిసారిగా భారత పర్యటనకు వచ్చాను. అప్పటినుంచి నేను ఎల్లప్పుడూ భారత్‌లో పర్యటించడం, ఆడడం, ఇక్కడ కోచింగ్‌ని ఇష్టపడతాను. భారత్‌లో క్రికెట్ పట్ల ఉన్న మక్కువ అసమానమైనది. నేను గోయెంకా, జట్టుతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. ఐపీఎల్లో ఆండీ ఫ్లవర్ గత రెండు సీజన్లో పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్‌గా పని చేశాడు. మరో వైపు రిపోర్ట్స్ ప్రకారం పంజాబ్ కింగ్స్ వదిలేసిన కేఎల్ రాహుల్ లక్నో ఫ్రాంచైజీకి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక లక్నో ఫ్రాంచైజీని సంజీవ్ గోయెంకా గ్రూప్ 7090 కోట్లకు దక్కించుకుంది. చదవండి: Rohit Sharma: బెంగళూరులో హిట్‌మ్యాన్.. వన్డే సిరీస్ నాటికి ఫిట్నెస్ సాధించేనా? -
అఫ్గాన్ జట్టు కన్సల్టెంట్‌గా ఆండీ ఫ్లవర్
కాబూల్: టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే అఫ్గానిస్తాన్ జట్టుకు జింబాబ్వే మాజీ కెన్, ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నాడు. 53 ఏళ్ల ఫ్లవర్ 63 టెస్టులు, 213 వన్డేలు ఆడాడు. అఫ్గాన్ టీమ్‌కు లాన్స్ క్లూస్నర్ హెడ్ కోచ్‌గా, షాన్ టెయిట్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి: KS Bharat: కప్ కొట్టి కోహ్లి చేతిలో పెట్టడమే లక్ష్యం -
ఆండీ ఫ్లవర్‌పై వేటు!
లండన్: ఇంగ్లండ్ జట్టు కోచ్ ఆండీ ఫ్లవర్‌పై వేటు పడింది. యాషెస్‌లో ఘోర పరాజయం నేపథ్యంలో అయనను బాధ్యతల నుంచి తప్పించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తీసుకుంది. అయితే లాబోర్గులోని ఈసీబీ అకాడమీలో అతనికి ఏదో ఓ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. యాషెస్ వైఫల్యంపై విచారణ జరిపిన పాల్ డౌన్టన్ తన నివేదికను ఈసీబీకి సమర్పించారు. జట్టు సీనియర్ సభ్యులతో పాటు ఫ్లవర్తోనూ డౌన్టన్ సుదీర్ఘంగా చర్చలు జరిపి ఈ నివేదికను తయారు చేశారు. అయితే గురువారం లార్డ్స్‌లో జరిగిన సమావేశంలో ఫ్లవర్‌కు తప్పుకోవాలని సూచించినట్లు వినికిడి. 2009లో జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈ జింబాబ్వే మాజీ ఆటగాడు... ఇంగ్లండ్ మూడుసార్లు యాషెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే తొలిసారి 2010లో టి20 ప్రపంచకప్‌ను అందించారు.