ఆండీ ఫ్లవర్‌పై వేటు!
లండన్: ఇంగ్లండ్ జట్టు కోచ్ ఆండీ ఫ్లవర్‌పై వేటు పడింది. యాషెస్‌లో ఘోర పరాజయం నేపథ్యంలో అయనను బాధ్యతల నుంచి తప్పించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్ణయం తీసుకుంది. అయితే లాబోర్గులోని ఈసీబీ అకాడమీలో అతనికి ఏదో ఓ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. యాషెస్ వైఫల్యంపై విచారణ జరిపిన పాల్ డౌన్‌టన్ తన నివేదికను ఈసీబీకి సమర్పించారు.
జట్టు సీనియర్ సభ్యులతో పాటు ఫ్లవర్‌తోనూ డౌన్‌టన్ సుదీర్ఘంగా చర్చలు జరిపి ఈ నివేదికను తయారు చేశారు. అయితే గురువారం లార్డ్స్‌లో జరిగిన సమావేశంలో ఫ్లవర్‌కు తప్పుకోవాలని సూచించినట్లు వినికిడి. 2009లో జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఈ జింబాబ్వే మాజీ ఆటగాడు... ఇంగ్లండ్ మూడుసార్లు యాషెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే తొలిసారి 2010లో టి20 ప్రపంచకప్‌ను అందించారు.