ఐదో టెస్టు: పేలవంగా భారత్ బౌలింగ్ | team india gets struggle in fifth test | Sakshi
Sakshi News home page

ఐదో టెస్టు: పేలవంగా భారత్ బౌలింగ్

Published Sat, Aug 16 2014 7:24 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM

ఐదో టెస్టు: పేలవంగా భారత్ బౌలింగ్ - Sakshi

ఐదో టెస్టు: పేలవంగా భారత్ బౌలింగ్

ఓవల్:ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టులో భారత్ బౌలర్లు పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఆరంభమైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి టీమిండియి వెన్నువిరిస్తే.. మన బౌలర్లు మాత్రం ఆకట్టుకోలేకపోయారు. కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసి ఇంగ్లండ్ ను ఆధిక్యంలోకి నెట్టారు. ఈ సిరీస్ లో ఒక టెస్టు మినహా మిగతా టెస్టు మ్యాచ్ ల్లో విఫలమైన భారత బౌలర్లు తమ తీరు మారదన్నట్లు బంతులు సంధిస్తున్నారు. ప్రస్తుతం 197 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నఇంగ్లండ్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయారు. భారత బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యానికి ఈసారి ఫీల్డింగ్ కూడా తోడైంది.

 

ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇచ్చిన క్యాచ్ లను భారత ఆటగాళ్లు వదిలేసి జట్టును మరింత సంక్లిష్టంలోకి నెట్టారు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు అలెస్టర్ కుక్ ఇచ్చిన రెండు క్యాచ్ లను స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రహానే, మురళీ విజయ్ లు జారవిడిచారు. అనంతరం కుక్ (79) పరుగులు చేసి స్లిప్ లో మురళీ విజయ్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం బ్యాలెన్స్(64), ఇయాన్ బెల్(5) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. భారత బౌలర్లు ఆరూన్ కు రెండు వికెట్లు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement