Captain MS Dhoni
-
యువరాజ్ వస్తాడా?
భారత వన్డే జట్టు ఎంపిక నేడు న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ న్యూఢిల్లీ: ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కొత్త సెలక్షన్ కమిటీ తొలిసారి నేడు సమావేశం కాబోతోంది. న్యూజిలాండ్‌తో ఈ నెల 16 నుంచి జరిగే ఐదు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు ఎంపిక నేడు జరగనుంది. వన్డే కెప్టెన్ ధోని నేతృత్వంలోని జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అరుుతే ప్రస్తుతం రాహుల్, ధావన్ ఇద్దరూ గాయాలతో ఉండటంతో కొత్త ఓపెనర్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నారుు. అరుుతే ప్రస్తుతం టెస్టు జట్టుతో ఉన్న గంభీర్ కూడా రేసులోనే ఉన్నాడు. అరుుతే యువరాజ్ సింగ్ మళ్లీ వన్డే జట్టులోకి వస్తాడా? అనేదే ఆసక్తికరం. దులీప్ట్రోఫీ సందర్భంగా కుంబ్లేతో మాట్లాడిన యువరాజ్ సింగ్ ఇటీవల ఎన్సీఏకు వెళ్లి ఫిట్నెస్ టెస్టులో పాల్గొని పాసయ్యాడు. ఈ నేపథ్యంలో వన్డేల్లోకి యువరాజ్ పునరాగమనం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు రైనా కూడా పునరాగమనం కోసం ఎదురు చూస్తున్నాడు. అశ్విన్, జడేజాలతో పాటు మూడో స్పిన్నర్‌గా యజువేంద్ర చహల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇర్ఫాన్ పఠాన్, హార్దిక్ పాండ్యా, స్టువర్ట్ బిన్నీ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ స్లాట్ కోసం పోటీ పడుతున్నారు. ఒకట్రెండు మార్పులు మినహా పెద్దగా సంచలనాలు లేకుండానే ఎమ్మెస్కే సారథ్యంలోని కొత్త సెలక్టర్లు పని పూర్తి చేసే అవకాశం ఉంది. -
ప్రయోగాల వేళ...
► ఉత్సాహంతో కొత్త కుర్రాళ్లు ► సత్తా నిరూపించుకునేందుకు సిద్ధం ► నేడు జింబాబ్వేతో తొలి వన్డే ప్రతిభాన్వేషణ... ప్రయోగాలు... భవిష్యత్తు కోసం సన్నద్ధత... సత్తా నిరూపించుకునే అవకాశం... పేరు ఏదైనా కావచ్చు... భారత ‘జూనియర్’ జట్టు ఇప్పుడు జింబాబ్వే ‘సీనియర్’ టీమ్‌తో పోటీకి సిద్ధమైంది. దేశవాళీ క్రికెట్లో, ఐపీఎల్‌తో గుర్తింపు తెచ్చుకున్న అనేక మంది ఆటగాళ్లకు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదిక లభించింది. నేటినుంచి జరిగే సిరీస్‌లో కొత్త కుర్రాళ్లకు ఇదో మంచి అవకాశం కాగా... ఈ జట్టును ధోని నడిపిస్తుండటం వారిలో మరింత స్ఫూర్తి పెంచే అంశం. అనుభవం లేకపోయినా భారత్ ఫేవరెట్‌గా కనిపిస్తుండగా, సొంతగడ్డపై జింబాబ్వే ఏ మాత్రం పోటీనివ్వగలదో చూడాలి. హరారే: కెప్టెన్ ధోని ఒక్కడే 275 వన్డేలు ఆడితే, మిగతా 15 మంది కలిపి ఆడిన మ్యాచ్‌లు 83 మాత్రమే. జింబాబ్వేతో సిరీస్‌లో తలపడే భారత జట్టు అనుభవం ఏమిటో చెప్పే లెక్క ఇది. అయితే ఐపీఎల్ ద్వారా కావాల్సినంత అనుభవం సంపాదించిన వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలరు. ఇప్పుడు ఈ జట్టు జింబాబ్వేలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు (శనివారం) తొలి మ్యాచ్ జరుగుతుంది. మరో వైపు జింబాబ్వే మాత్రం సిరీస్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధమై తన నంబర్‌వన్ జట్టునే బరిలోకి దించుతోంది. 2013, 2015లో కూడా ద్వితీయ శ్రేణి జట్టుతోనే జింబాబ్వేలో పర్యటించిన భారత్ ఆ రెండు సార్లూ వన్డే సిరీస్‌లను 5-0, 3-0తో క్లీన్ స్వీప్ చేయడం విశేషం. తుది జట్టులో ఎవరు భారత జట్టులో ఐదుగురు ఆటగాళ్లు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. కేఎల్ రాహుల్ ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. మరికొందరు జింబాబ్వేలో పర్యటించడం ఇదే తొలిసారి. అయితే ఈ జూనియర్ బృందంతోనే ఫలితాలు సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌కు పూర్తి స్థాయి కోచ్‌గా వ్యవహరిస్తున్న సంజయ్ బంగర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. ధోనిని పక్కన పెడితే...రాయుడు, అక్షర్ పటేల్ చెప్పుకోదగ్గ సంఖ్యలో మ్యాచ్‌లు ఆడారు. ఆరంభంలో ఆకట్టుకొని తర్వాత సెలక్టర్ల విశ్వాసం కోల్పోయిన వీరిద్దరు మళ్లీ రాణిస్తే రెగ్యులర్ స్థానం కోసం పోటీ పడవచ్చు. అదే విధంగా తన చివరి వన్డేలో అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలిపించిన మనీశ్ పాండే కూడా తన స్థానం సుస్థిరం చేసుకోవాలంటే ఇక్కడ బాగా ఆడటం అవసరం. రెగ్యులర్ టీమ్‌లో రైనా స్థానాన్ని భర్తీ చేయాలంటే పాండేతో పాటు కరుణ్ నాయర్‌కు కూడా మంచి అవకాశం లభించింది. బుమ్రా స్ట్రైక్ బౌలర్‌గా బాధ్యతలు నిర్వర్తించనుండగా, ధావల్ సహకరిస్తాడు. మూడో పేసర్ కోసం ఉనాద్కట్, బరీందర్ మధ్య పోటీ ఉంటుంది. ఇక యజువేంద్ర చహల్ తన ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తే...భవిష్యత్తులో లెగ్‌స్పిన్నర్‌గా ప్రధాన జట్టుకూ ఎంపికయ్యే అవకాశం ఉంది. సంచలనంపై ఆశలు ఈ సిరీస్ ఆరంభానికి ముందే జింబాబ్వే తమ కోచ్ వాట్మోర్, కెప్టెన్ హామిల్టన్ మసకద్జలను తప్పించింది. వారి స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఎన్తిని, క్రీమర్లపై తీవ్ర ఒత్తిడి ఉంది. గాయంతో దూరమైన పన్యగర మినహా జింబాబ్వే తమ అత్యుత్తమ జట్టునే సిరీస్ కోసం ఎంపిక చేసింది. అయితే గత ఏడాది కాలంగా ఆ జట్టు ప్రదర్శన తీసికట్టుగా ఉంది. టి20 ప్రపంచకప్‌లో సూపర్ 10కు అర్హత కూడా సాధించలేకపోయిన జింబాబ్వే వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అఫ్ఘానిస్థాన్కంటే దిగువగా ఉంది. వేర్వేరు కారణాలతో ఆ జట్టు ప్రపంచ క్రికెట్‌తో పోటీ పడలేక వెనుకబడిపోయింది. జట్టు తాజా ఫామ్ చూస్తే కనీసం 50 ఓవర్లు పూర్తిగా ఆడగలదా అనే సందేహం కూడా కనిపిస్తోంది. అయితే సికందర్ రజా, సీన్ విలియమ్స్, హామిల్టన్ మసకద్జా, చిగుంబురా, ఇర్విన్ జట్టులో ఇప్పటికీ కీలక ఆటగాళ్లు. టీమ్ జయాపజయాలు వీరిపైనే ఆధారపడి ఉన్నాయి. తొలి వన్డేలో బరిలోకి దిగితే చిగుంబురా జింబాబ్వే తరఫున ఆండీ, గ్రాంట్ ఫ్లవర్ తర్వాత 200 వన్డేలు ఆడిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు. జట్లు భారత్: ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మన్దీప్ సింగ్, మనీశ్ పాండే, చహల్, ఫజల్, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్, ఉనాద్కట్, బుమ్రా, రిషి ధావన్, బరీందర్, జయంత్ యాదవ్ జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), చిబాబా, చిసోరో, మద్జివా, హామిల్టన్ మసకద్జా, పీటర్ మూర్, రిచ్మండ్, సిబాందా, ట్రిపానో, చటారా, చిగుంబురా, ఇర్విన్, మరుమా, వెలింగ్టన్ మసకద్జా, ముపరివ, ముజరబని, సికందర్ రజా, సీన్ విలియమ్స్. ధోని ఏం చేస్తాడు? జింబాబ్వేతో సిరీస్ తర్వాత ఈ సీజన్లో భారత్ పెద్ద సంఖ్యలో టెస్టు మ్యాచ్‌లే ఆడనుంది. సొంతగడ్డపై కొన్ని వన్డేలు, టి20లు ఉన్నా వాటికి చాలా సమయం, మధ్యలో విరామం ఉంది. కాబట్టి కెప్టెన్‌గా ధోని అంతర్జాతీయ క్రికెట్లో కనిపించేది తక్కువే. ఇప్పుడు పసికూనవంటి జట్టును నడిపించేందుకు అతను సిద్ధమయ్యాడు. జింబాబ్వేతో సిరీస్ గెలిస్తే అందులో పెద్దగా విశేషం ఏమీ కనిపించకపోవచ్చు. ధోని కెప్టెన్సీకి అదనంగా కలిసొచ్చేదీ ఏమీ లేదు. కానీ పొరపాటున ఏదైనా తేడా రావడమో, మ్యాచ్ ఓడటమో జరిగితే అతని పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోవచ్చు. ఈ ఒక్క సిరీస్‌తోనే నాయకత్వానికి ముప్పు వచ్చే సమస్య లేదు గానీ... కోహ్లి ఫామ్ నేపథ్యంలో ఇప్పటికే ధోనికి పొగ పెడుతున్నవారి సంఖ్య మరింత పెరిగిపోతుంది. కాబట్టి జట్టులో జూనియర్లే ఉన్నా రెండు సిరీస్‌లు గెలవడమే ధోని లక్ష్యం. 11 ఏళ్ల తర్వాత అతను జింబాబ్వే గడ్డపై సిరీస్ ఆడుతుండటం విశేషం. -
రిజిస్ట్రేషన్ పొరపాటుతో ధోనికి జరిమానా
కోటి రూపాయల విలువైన తన హమ్మర్-హెచ్2 కారు రిజిస్ట్రేషన్‌లో పొరపాటుగా స్కార్పియోగా రావడంతో భారత క్రికెట్ కెప్టెన్ ధోని జరిమానా కట్టాల్సి వస్తోంది. 2009లో జరిగిన ఈ టైపింగ్ పొరపాటు కారణంగా రూ.4 లక్షల రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించాల్సిన ధోని కేవలం రూ.53 వేలను మాత్రమే కట్టాడు. ‘2010 వరకు అతడు పన్ను చెల్లించాడు. అయితే నిబంధనలప్రకారం వన్ టైమ్ ట్యాక్స్‌తో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది’ అని రాంచీ డీటీవో పాశ్వాన్ తెలిపారు. -
అలసత్వం తగదు
న్యూజిలాండ్ స్పిన్నర్ల ప్రతిభ కంటే మా బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యమే ఓటమికి ప్రధాన కారణం... తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత కెప్టెన్ ధోని అభిప్రాయం ఇది. అవును... మాకు ఎదురే లేదనే దృక్పథంతో క్రీజులోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపికలో చేసిన ఘోరమైన తప్పుల వల్లే కివీస్ చేతిలో అనూహ్య పరాభవం ఎదురయింది. అయితే తొలి మ్యాచ్‌లోనే ఇలాంటి షాక్ తగలడం కూడా ఒక రకంగా మంచిదే. అలసత్వం లేకుండా ఆడాలనే విషయం అర్థమైతే విజయాల బాటలోకి వెళ్లొచ్చు. నాగ్‌పూర్ నుంచి సాక్షి క్రీడాప్రతినిధి టి20 ప్రపంచకప్ తొలిసారి 2007లో భారత్ గెలిచినప్పుడు... ఆ టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలోనే భారత్ ఓడిపోయింది. కానీ కప్ గెలిచింది..! ఈసారి కూడా మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం... అంటే కప్ గెలుస్తాం... ఓ భారత క్రికెట్ అభిమాని, ఆశాజీవి అభిప్రాయం ఇది. మంచిదే ఇంత సానుకూల దృక్పథం క్రికెటర్లలో కూడా ఉంటే అంతకంటే కావలసింది లేదు. ఆటన్నాక గెలుపోటములు సహజం. కానీ ఎలాంటి దృక్పథం కనబరుస్తున్నామనేదే ముఖ్యం. గతంలో దారుణమైన పేస్ బౌలింగ్ పిచ్‌లు ఎదురైన ప్రతిసారీ భారత కెప్టెన్ లేదా టీమ్ డెరైక్టర్ నేరుగా తమ అసహనాన్ని ప్రదర్శించారు. కానీ ఈసారి మాత్రం నాగ్‌పూర్ పిచ్ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయలేని పరిస్థితి. ‘తొలి రోజు నుంచి బంతి స్పిన్ తిరగకూడదని ఏ రాజ్యాంగంలో రాసుంది?’ అంటూ దక్షిణాఫ్రికాతో నాగ్‌పూర్‌లో టెస్టు విజయం తర్వాత రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. కాబట్టి పిచ్ గురించి ఏమీ మాట్లాడకుండా... తర్వాతి మ్యాచ్‌ల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించే భారత బృందం కసరత్తులు చేస్తోంది. అడుగడుగునా నిర్లక్ష్యం భారత జట్టులో నెహ్రా, బుమ్రా మినహా అందరూ బ్యాటింగ్ చేయగలవారే. అయినా అందరూ కలిసి చేసింది కేవలం 79 పరుగులు. మరో 11 బంతులు మిగిలుండగానే ఇన్నింగ్స్ ముగియడం అంటే టి20లో దారుణమైన వైఫల్యంగా భావించాలి. పరిస్థితిని గమనించి, పిచ్‌ను అర్థం చేసుకుని షాట్స్ ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. స్వీప్ ఆడబోయి ఎల్బీగా అవుట్ కావడం శిఖర్ ధావన్‌కు ఇది మొదటిసారేం కాదు. పదేపదే ఇలాగే అవుటవుతున్నాడు. తొలి ఓవర్లో పెద్దగా స్పిన్ కాని బంతికే వికెట్ ఇవ్వడం ద్వారా ధావన్ భారీ తప్పు చేశాడు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ అంత ముందుకు వెళ్లి ఆడాల్సిన అవసరం అసలే లేదు. రెండు ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన తర్వాత వచ్చిన రైనా ఆడిన షాట్ నిర్లక్ష్యానికి పరాకాష్ట. చాలా క్యాజువల్‌గా బంతిని పుష్ చేసి వెనుదిరిగాడు. ఇక యువరాజ్, జడేజాల షాట్లలోనూ నిర్లక్ష్యమే ఎక్కువగా ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని విషయాన్ని గ్రహించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ అండర్సన్ దూకుడు తగ్గించుకుని ఆడాడుగానీ, భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ అలాంటి పరిణతి చూపలేకపోయారు. కిం కర్తవ్యం..? ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన కొంపలు మునిగిపోవు. కానీ ఒక్క బ్యాట్స్‌మన్ చివరి వరకూ నిలబడితే గెలిచే చోట ఓడిపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లందరికీ కావలసినంత అనుభవం ఉంది. ఐపీఎల్లో ప్రతి ఒక్కరూ హీరోలే. కాబట్టి ఈ ఓటమి నుంచి వీలైనంత తొందరగానే కోలుకోవచ్చు. ఇక తర్వాతి మ్యాచ్ ఆడాల్సింది పాకిస్తాన్‌తో. సహజంగానే దేశంలో ఈ మ్యాచ్ గురించి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పాకిస్తాన్‌తో ఆడే సమయంలో ఆటగాళ్లంతా రెట్టింపు కష్టపడతారు. కాబట్టి రెండో మ్యాచ్ సమయానికి కోలుకోవచ్చు. పాక్‌తో మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్‌లో బ్యాటింగ్ పిచ్ సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా మన ఆటతీరుకు అనుకూలించే వికెట్. అయితే చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుని కివీస్‌తో పరాజయాన్ని వీలైనంత త్వరగా మరచిపోవాలి. ఇకపై ప్రతి మ్యాచ్ చావోరేవోలాంటిదే. ఇలాంటి సమయంలో ధోనిసేన మరింత మెరుగ్గా ఆడుతుందని ఆశిద్దాం. టోర్నీలో తొలి మ్యాచ్ ఓడితే ఆపై అన్ని మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని కోసం మానసికంగా సిద్ధమయ్యాం. ప్రతీ మ్యాచ్ చావోరేవోలాగా మారిపోవడం వల్ల ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. ఈ ఓటమి ఒకందుకు మంచిదే. మాకూ, దేశానికి మేలు చేసింది. ఎందుకంటే జట్టు పరంగా, అభిమానులపరంగా అందరికీ ఒక హెచ్చరిక లభించినట్లయింది. ఇప్పుడు సరిగ్గా సమస్య ఏమిటి, లోపం ఎక్కడుంది తెలిసింది కాబట్టి మేం ఇకపై ఏం చేయాలో తెలుస్తుంది. దాని ప్రకారం వ్యూహాలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది. - ధోని -
షమీ సత్తా చూపిస్తాడా?
► వార్మప్‌లో ఆకట్టుకున్న పేసర్ ► బౌన్సర్లు, యార్కర్లతో దూకుడు ► పూర్తి ఫిట్‌గా ఉంటే తుది జట్టులోకి సాక్షి క్రీడావిభాగం మొహమ్మద్ షమీ భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు సంవత్సరం అయింది. ముందుగా మోకాలి గాయంతో జట్టుకు దూరమైన అతను మెరుగైన తర్వాత రెండేసి దేశవాళీ వన్డే, టి20 మ్యాచ్‌లు ఆడి ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. దాంతో ఆసీస్ పర్యటనకు వెళ్లాడు. అక్కడ మైదానంలోకి దిగనే లేదు, కండరాల గాయంతో మళ్లీ అవుట్. పూర్తి ఫిట్‌గా లేకపోయినా టి20 ప్రపంచకప్‌లోగా కోలుకుంటాడనే నమ్మకంతో సెలక్టర్లు అతడిని జట్టులోకి ఎంపిక చేశారు. కెప్టెన్ ధోని గట్టిగా మద్దతు పలకడం కూడా అందుకు కారణం. ఒక రకమైన జూదంగా అందరూ అభివర్ణించినా ధోని, షమీని కోరుకున్నాడు. కొత్త బంతితో ఆరంభంలో వికెట్, చివరి ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో అతని నైపుణ్యంపై కెప్టెన్‌కు అపార నమ్మకం ఉంది. బౌన్సర్లు, యార్కర్లతో కెప్టెన్ తనపై నమ్మకం ఉం చిన ప్రతీసారి షమీ దానిని నిలబెట్టుకున్నాడు. తుది జట్టులో మార్పు లేకుండా వరుస విజయాలతో టీ మిండియా దూసుకుపోతున్నా... షమీ ఫిట్‌గా ఉంటే నెహ్రాను పక్కన పెడతామని ధోని బహిరంగంగానే వ్యాఖ్యానించడం విశేషం. మరి టి20 వరల్డ్ కప్‌లో అతను ఏ మాత్రం ప్రభావం చూపించగలడు, తొలి మ్యాచ్‌కు 100 శాతం పూర్తి ఫిట్‌గా ఉండగలడా! కొనసాగిన ప్రాక్టీస్... ఫిట్నెస్ను పరీక్షించుకునే క్రమంలో ఇటీవల షమీ తీవ్రంగా సాధన చేశాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో భారత మహిళల క్రికెట్ జట్టుకు అతను బౌలింగ్ చేశాడు. ఇతర పురుష జట్లు ఆడిన మ్యాచ్‌లలో కూడా అతను పాల్గొన్నాడు. అందులో ప్రధానంగా ఆరంభ ఓవర్లలో బౌలింగ్ చేయడం, డెత్ ఓవర్లలో పరుగులు నిరోధించడం లేదా చిన్న లక్ష్యాన్ని కాపాడుకునే సమయంలో ప్రధాన పేసర్‌గా పాత్ర... ఇలాంటి పరిస్థితులు సృష్టించుకొని మరీ ఆయా మ్యాచ్‌లలో బౌలింగ్ చేశాడు. ఈ ప్రయత్నంలో మళ్లీ గాయాలకు లోను కాకుండా చాలా జాగ్రత్త పడాల్సి వచ్చింది. షమీ బౌలింగ్‌పై ఎవరికీ సందేహాలు లేవు. వరల్డ్ కప్ సమయానికి ఫిట్ కావడమే అతనికి కీలకంగా మారింది. ఆ ప్రయత్నంలో ఇప్పుడతడు దాదాపు పూర్తి ఫిట్‌గా మారాడు. ఆకట్టుకున్న బౌలింగ్... వెస్టిండీస్‌తో తొలి వార్మప్ మ్యాచ్‌లో షమీ మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు. 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు అద్భుతం కాకపోవచ్చు కానీ ఏడాది కాలంగా ఫిట్నెస్ గాయాలతో బాధపడి పునరాగమనం చేసిన బౌలర్ నుంచి ఇది మంచి ప్రదర్శనే. ఈ మ్యాచ్‌లో ఆరంభంనుంచే అతను నిలకడగా బౌన్సర్లు, యార్కర్లు విసిరాడు. బౌలింగ్ చేస్తున్నంతసేపు అతను ఏ దశలోనూ ఇబ్బందికి లోను కాలేదు. చక్కటి రనప్‌తో పాటు ఆకట్టుకునే యాక్షన్‌తో మంచి లయ కనబర్చాడు. షమీ తమ జట్టు ప్రధాన బౌలర్ అని, సహజంగానే అతనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయని సహచరుడు రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ‘గాయాల నుంచి కోలుకొని, ఇంత కాలం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చి రాణించడం అంత సులువు కాదు. బౌలర్లకైతే మరీ కష్టం. కానీ షమీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అతను అన్ని రకాల బంతులు వేశాడు. మళ్లీ భారత జట్టు తరఫున ఆడుతున్నానని పట్టుదల అతనిలో కనిపించింది. దీని కోసం అతను తీవ్రంగా శ్రమించిన తీరు అభినందనీయం’ అని రోహిత్ ప్రశంసించాడు. పటిష్ట ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాతో కూడా మొహమ్మద్ షమీ మెరుగైన ప్రదర్శన చేస్తే ఇక ప్రధాన టోర్నీలో అతను పునరాగమనం చేయడం ఖాయం. -
ఎందుకు ఆడుతున్నారో తెలుసుకోండి!
న్యూఢిల్లీ: ‘ కొంత మంది డబ్బు కోసం ఆడతారు. కొంత మందికి అమ్మాయిలు కావాలి. మరికొందరికి పార్టీలు, పేరు ప్రఖ్యాతులు ఇష్టం. కొందరు మాత్రమే క్రికెట్‌పై ఇష్టంతో ఆడతారు. ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరు అసలు తాము ఎందుకు ఆడుతున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరంతా నిజాయితీగా ఉండాలని నేను కోరుకుంటా. మీ అసలు లక్ష్యం ఏమిటో తెలుసుకొని వచ్చే సీజన్లోకి అడుగు పెట్టండి’...ఐపీఎల్-2లో బెంగళూరు చేతిలో ఓడి ఫైనల్ అవకాశం కోల్పోయిన అనంతరం తన చెన్నై జట్టు సహచరులతో కెప్టెన్ ధోని చెప్పిన మాటలు ఇవి. టీమ్‌లో ఐకమత్యం లేదని ఊహించిన ధోని, తనదైన శైలిలో స్ఫూర్తి నింపుతూనే, ఒక రకమైన హెచ్చరికతో ఈ ప్రసంగం చేశాడు. మైక్ హస్సీ తన తాజా పుస్తకంలో రాసిన ఆసక్తికర అంశాల్లో ఇదొకటి. -
మనింట్లో ధనాధన్ పండుగ
గత నెల రోజు లుగా భారత జట్టు ఆడుతున్న టి20 మ్యాచ్‌లు, సాధిస్తున్న విజ యాలతో సంబరపడిపోతున్నాం. కానీ వాటన్నింటిని మించిన పోరాటం మన దగ్గర ప్రారంభం కాబోతోంది. టి20 ప్రపంచ సమరానికి భారత్ ఈసారి ఆతిథ్యం ఇస్తోంది. రేపటి నుంచి (మంగళవారం) ప్రపంచకప్ క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. ఎనిమిది దేశాలు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీ పడతాయి. రెండు గ్రూప్‌ల్లో విజేతలుగా నిలిచిన జట్లు ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తాయి. ఇక అసలు టోర్నీలో 8 ప్రధాన జట్లతో పాటు ఈ రెండు జట్లు కూడా ఆడతాయి. దేశవ్యాప్తంగా ఏడు వేదికల్లో జరిగే ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 2007లో టి20 ప్రపంచకప్ తొలిసారి జరిగినప్పుడు ఈ ఫార్మాట్ చాలామందికి కొత్త. కానీ భారత్ ఆ టైటిల్ గెలవడంతో ఐపీఎల్ రూపంలో ప్రపంచం అబ్బురపడేలా టి20 లీగ్ వచ్చింది. దీంతో క్రికెట్ దిశ, దశ మారిపోయాయి. ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. ఇంతకాలం ప్రతి ఏటా ఐపీఎల్‌తో అంతులేని వినోదాన్ని అందుకుంటున్న భారత అభిమానులు ఈ ఏడాది ఐపీఎల్ కంటే ముందే ప్రపంచకప్ పండుగను ఆస్వాదించవచ్చు. తొలిసారి 2007లో టైటిల్ గెలిచిన తర్వాత భారత జట్టు 4 టోర్నీల్లో ఆడినా ఒక్కసారి మళ్లీ కప్‌ను అందుకోలేదు. తొలిసారి సొంతగడ్డపై జరుగుతున్న టి20 ప్రపంచకప్‌ను సాధించి... ధోనిసేన మరోసారి ము వ్వన్నెలను రెపరెపలాడించాలనేది కోట్లాది భారత అభిమానుల ఆశ, ఆకాంక్ష. ఇక రేపటి నుంచి ఈట్ క్రికెట్... స్లీప్ క్రికెట్...! -
ఈ జట్టుతో ప్రపంచంలో ఎక్కడైనా గెలుస్తాం...
ప్రస్తుతం భారత జట్టు కూర్పు అద్భుతంగా ఉందని, ఈ జట్టుతో ప్రపంచంలో ఏ దేశంలో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా టి20ల్లో గెలుస్తామని కెప్టెన్ ధోని అన్నాడు. స్వదేశంలో ఏ జట్టయినా బలంగానే ఉంటుందని, ఆసియాకప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై గెలవాలంటే తాము నాణ్యమైన క్రికెట్ ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతానికి జట్టులో ఎవరికీ ఎలాంటి గాయాలు లేకపోవడం వల్ల ప్రపంచకప్‌కు బాగా సన్నద్ధమైనట్లేనని ధోని అన్నాడు. -
నేనేం మాట్లాడినా వినిపిస్తోంది!
మైక్రోఫోన్‌లపై ధోని అసంతృప్తి మిర్పూర్: మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలో ఏర్పాటు చేసే మైక్రోఫోన్‌లపై భారత కెప్టెన్ ధోని తన అసంతృప్తిని ప్రదర్శించాడు. తాను సహచరులతో పంచుకునే వ్యూహాలు అందరికీ తెలిసిపోతున్నాయని అతను అన్నాడు. ‘జట్టులోని ఒక ఆటగాడు మరో ఆటగాడితో మాట్లాడే సమయంలో మైక్రోఫోన్లు పని చేయకుండా చూస్తామని మ్యాచ్ రిఫరీలు చెబుతున్నారు. కానీ అదేంటో నేను ఏం మాట్లాడినా అవి పట్టేస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా అనుమానాస్పదంగా కనిపిస్తోంది. ఎవరైనా ఆటగాడు అనకూడని మాట అంటే మైక్ పని చేయడం లేదు కదా సమస్య లేదు అనిపిస్తుంది. కానీ నేను మాట్లాడినప్పుడు మాత్రం మైక్ ఆన్‌లోనే ఉంటోంది’ అని ధోని వ్యాఖ్యానించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం కోహ్లిలో ఉందని, అయితే అందరిలోకి అతనే గొప్ప అంటూ పోలికలు తేవడం తనకిష్టముండదని కెప్టెన్ చెప్పాడు. వరల్డ్ టి20 కోసం భారీ షాట్లు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇలాంటి పిచ్ తగినది కాదని పాక్‌తో మ్యాచ్ అనంతరం మహి అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మకు పరీక్షలు... ఆమిర్ బౌలింగ్‌లో స్వల్పంగా గాయపడిన రోహిత్ శర్మకు ముందు జాగ్రత్తగా ఎక్స్‌రే తీశారు. మ్యాచ్ తొలి బంతి నేరుగా రోహిత్ కాలి బొటనవేలిని తాకింది. శ్రీలంకతో మంగళవారం జరిగే మ్యాచ్ సమయానికే అతని గాయంపై స్పష్టత రావచ్చు. -
ధోనికి బ్యాకప్‌గా పార్థీవ్ పటేల్
భారత కెప్టెన్ ధోని వెన్నునొప్పితో బాధపడుతున్నందున... పార్థీవ్ పటేల్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా బంగ్లాదేశ్ పంపుతున్నారు. సోమవారం ప్రాక్టీస్ సందర్భంగా ధోని అసౌకర్యంగా కనిపించాడు. దీంతో ముందు జాగ్రత్తగా పార్థీవ్ను ఆసియాకప్ జట్టులోకి బ్యాకప్‌గా తీసుకున్నారు. అయితే ధోనికి తీవ్ర గాయమేమీ లేదని, అతను తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఉందని జట్టు వర్గాలు తెలిపాయి. -
ధోని కొత్త బ్రాండ్!
‘7’ షూస్ పేరుతో మార్కెట్లోకి న్యూఢిల్లీ: ఇందుగలడందు లేడంటూ వేర్వేరు వ్యాపారాల్లో భాగస్వామిగా కనిపిస్తున్న భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ఎమ్మెస్ ధోని ఇప్పుడు లైఫ్ స్టయిల్ మార్కెట్లోకి కూడా అడుగు పెట్టాడు. ప్రత్యేకంగా క్రీడాకారుల కోసం డిజైన్ చేసిన దుస్తులు, షూస్‌లను ‘7’ పేరుతో అతను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాడు. రితి స్పోర్ట్స్ సంస్థ ఆర్ఎస్ సెవెన్ లైఫ్‌స్టయిల్ పేరుతో వీటిని తీసుకొచ్చింది. ‘7’కు అంతర్జాతీయ ప్రచారకర్తగా ధోని వ్యవహరిస్తున్నట్లు శుక్రవారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకటించారు. అయితే రితి స్పోర్ట్స్‌లో ధోని భాగస్వామి అనే సంగతి తెలిసిందే. ‘నా సొంత ఫుట్‌వేర్ బ్రాండ్ మార్కెట్లో ఉండాలనేది చాలా కాలంగా నా కోరిక. నాకు ఇష్టమైన 7 అంకెతో ఇది రావడం సంతోషకరం. దీని డిజైన్‌ను రూపొందించడంలో, మార్పుచేర్పులలో నేను కూడా భాగం అయ్యాను’ అని ధోని వ్యాఖ్యానించాడు. మరోవైపు ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచన తనకు లేదని ధోని చూచాయగా చెప్పాడు. ‘ఆసియా, వరల్డ్ కప్‌ల తర్వాత ఐపీఎల్ ఉంది. ఆ తర్వాత భారత్ ఎక్కువగా టెస్టులు ఆడినా కనీసం 5-6 వన్డేలు ఆడుతుంది. చాలా వేగంగా సమయం గడిచిపోతుంది. నేను సిద్ధంగా ఉన్నా’ అని ధోని వెల్లడించాడు. -
ధోని ముద్ర ఉంటుందా..?
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు వన్డే, టి20 జట్ల ఎంపిక నేడు బెంగళూరు : దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్, టి20 సిరీస్‌లకు భారత జట్ల ఎంపిక నేడు (ఆదివా రం) జరుగనుంది. వచ్చే నెల 2 నుంచి ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ముందుగా మూడు టి20ల సిరీస్‌తో పాటు, ఐదు వన్డేల్లో మూడింటికి జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే ఇటీవల శ్రీలంకకు వెళ్లిన భారత టెస్టు జట్టు... కెప్టెన్ విరాట్ కోహ్లి ఆలోచనలకు తగ్గట్టుగా ఐదుగురు బౌలర్లతో వెళ్లి దూకుడును ప్రదర్శించింది. ఇప్పుడు వన్డే, టి20ల్లోనూ జట్టు ఎంపికలో మునుపటిలాగా కెప్టెన్ ఎంఎస్ ధోని తనదైన ముద్రను వేస్తాడా.. లేదా అనేది చర్చనీయాంశంగా ఉంది. లేకపోతే సెలక్టర్లు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుంటే మాత్రం తమదైన శైలిలోనే జట్టును ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు కోహ్లికి అనుకూల ఆటగాళ్లు చోటు దక్కిం చుకున్నా ఆశ్చర్యం లేదు. ఇదే జరిగితే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తిరిగి జట్టులోకి రావచ్చు. మరోవైపు ఐదు నెలల్లో టి20 ప్రపంచకప్ భారత్‌లోనే జరుగనుండడంతో కెప్టెన్ ధోని, సెలక్టర్లు ఈ విషయంపై మరింత దృష్టి సారించనున్నారు. ప్రొటీస్‌తో జరుగబోయే ఈ మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను సన్నాహక సిరీస్‌గా ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి తగ్గట్టుగానే కొన్ని కొత్త ముఖాలను పరీక్షించే అవకాశాలు లేకపోలేదు. వన్డేల్లోకి సీనియర్ల రాక.. భారత్ చివరిసారిగా జింబాబ్వేతో వన్డే సిరీస్ ఆడింది. అయితే సీనియర్ ఆటగాళ్ల విశ్రాంతి కారణంగా రహానే నేతృత్వంలో ద్వితీయ శ్రేణి జట్టు అక్కడకు వెళ్లింది. కెప్టెన్ ధోని, కోహ్లి, రైనా, రోహిత్, అశ్విన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండడంతో వీరి స్థానాలు ఖాయం. ఓపెనర్ శిఖర్ ధావన్, రహానే, రాయుడు ఓకే అయినా వీరిలో ధావన్ తన ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. జింబాబ్వే సిరీస్‌లో మురళీ విజయ్ ఆకట్టుకోవడంతో అతడి పేరును పరిశీలించనున్నారు. ఇక జట్టులో చోటు కోల్పోయిన రవీంద్ర జడేజా పరిస్థితి ఏమిటో తెలియాలి. పేసర్లుగా ధోని నమ్మకస్తులు మోహిత్ శర్మ, భువనేశ్వర్‌లతో పాటు బ్యాకప్‌గా ధవళ్ కులకర్ణి ఉండనున్నారు. ఫామ్‌లో ఉన్న ఇషాంత్‌కు కూడా చాన్స్ ఇవ్వచ్చు. టి20 ఫార్మాట్లో కేదార్ జాదవ్, మనీష్ పాండే ఎంపికయ్యే అవకాశాలున్నాయి. దీంట్లో అశ్విన్‌కు తోడుగా రెండో స్పిన్నర్‌గా హర్భజన్ తీసుకోవడంలో ధోని నిర్ణయమే కీలకం. ఇక భారత్ ‘ఎ’ జట్టులో ఆకట్టుకుంటున్న గురుకీరత్ సింగ్, మయాంక్ అగర్వాల్‌లను పొట్టి ఫార్మాట్‌కు పరిశీలించవచ్చు. -
తొందరపాటు నిర్ణయం కాదు
* ధోని రిటైర్మెంట్పై బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ * కెప్టెన్ నిర్ణయంపై మాజీల ఆశ్చర్యం న్యూఢిల్లీ: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని హఠాత్ నిర్ణయంపై క్రికెట్ ప్రేమికులు ఎంతగా ఆశ్యర్యపోతున్నా... బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ మాత్రం ఇది అతడు చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా చెబుతున్నారు. ఏదైనా రెండు ఫార్మాట్లపైనే దృష్టి పెట్టేందుకు ఒక ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాలనే ఆలోచనలో ధోని ఉన్నట్టు తెలిపారు. ‘అతడు చాలా ప్రాక్టికల్ వ్యక్తి. మెల్బోర్న్లో మ్యాచ్ ముగియగానే నాకు ఫోన్ చేసి టెస్టుల నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. నేను వెంటనే ఏం జరిగింది? గాయపడ్డావా? అని అడిగాను. అతడు చాలా ప్రశాంతంగా... లేదు. అంతా మంచి కోసమే టెస్టులకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాను అని అన్నాడు. ఇదే చివరి నిర్ణయమా..? అని అడిగాను. ‘దానికి కొద్దిసేపు ఆగండి, జట్టు సభ్యులతో నా నిర్ణయం చెబుతాను. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించండి’ అని చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్లీ ఫోన్ చేశాడు. నేను కూడా ఈ విషయాన్ని సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్, బోర్డు అధ్యక్షుడు శివలాల్ యాదవ్‌లకు చెప్పాను. వాస్తవానికి అతడి నిర్ణయంపై నేను కూడా కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను. కానీ ఈ టెస్టుకు ముందు కూడా మేమీ విషయం గురించి మాట్లాడాం. అయితే ఇది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు. ఆటగాళ్లతో రిటైర్మెంట్ గురించి చెప్పినప్పుడు కాస్త భావోద్వేగానికి గురయ్యాడని ఓ క్రికెటర్ నాతో చెప్పాడు. ఇక మిగతా రెండు ఫార్మాట్లకు తనే కెప్టెన్‌గా ఉంటాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని పటేల్ వివరించాడు. కెప్టెన్‌గా వైదొలుగుతాడని తెలిసినా మరో రెండేళ్లయినా ఆటగాడిగా కొనసాగుతాడనుకున్నాను. తన సారథ్యంలో జట్టు ఎదిగిన తీరు అమోఘం. అతడు నిర్వర్తించిన పాత్రను వర్ణించేందుకు మాటలు చాలవు. -సునీల్ గవాస్కర్ ధోని నిర్ణయం ఆశ్చర్యకరమే. ఎందుకంటే మరో రెండు, మూడేళ్లు తను టెస్టులు ఆడతాడనుకున్నాను. -వెంగ్‌సర్కార్ ధోని నిర్ణయం అనూహ్యమైంది. సిరీస్ ముగిసేదాకా అతడు వేచి ఉండాల్సింది. -వాడేకర్ ధోని వీడ్కోలు గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆ విషయంపై నేనేమీ వ్యాఖ్యానించను. నో కామెంట్. - హర్భజన్ టెస్టుల్లో అద్భుత కెరీర్‌కు నా అభినందనలు. తర్వాతి లక్ష్యం ప్రపంచ కప్ విజయం కావాలి. -సచిన్ ఎంత పరాక్రమంగా జట్టును నడిపావో, అదే తరహాలో నిష్ర్కమించావు. -రైనా సిరీస్ మధ్యలో ఇలా ప్రకటించి ధోని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే అది అతని ఇష్టం. హ్యాపీ రిటైర్మెంట్. -బేడి చేతలతోనే నిరూపించిన స్ఫూర్తిదాయక కెప్టెన్ ధోని. - ద్రవిడ్ భారత్‌లో క్రికెట్ అభివృద్ధికి ధోని ఎంతో చేశాడు. -బ్రాడ్ ‘పూర్తి ఆధిపత్యంతో జట్టును నడిపించిన నాయకుడిగా ధోనిని గుర్తుంచుకుంటారు. అతడో మ్యాచ్ విన్నర్. కీపింగ్‌లో అద్భుతమైన సాంకేతికత చూపేవాడు. డ్రెస్సింగ్ రూం వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచేలా చూసేవాడు. భారత క్రికెట్ సంధికాలాన్ని విజయవంతంగా అధిగమించాడు.’ - ‘సాక్షి’తో వీవీఎస్ లక్ష్మణ్ -
ఐదో టెస్టు: పేలవంగా భారత్ బౌలింగ్
ఓవల్:ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టులో భారత్ బౌలర్లు పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఆరంభమైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి టీమిండియి వెన్నువిరిస్తే.. మన బౌలర్లు మాత్రం ఆకట్టుకోలేకపోయారు. కేవలం రెండు వికెట్లు మాత్రమే తీసి ఇంగ్లండ్ ను ఆధిక్యంలోకి నెట్టారు. ఈ సిరీస్ లో ఒక టెస్టు మినహా మిగతా టెస్టు మ్యాచ్ ల్లో విఫలమైన భారత బౌలర్లు తమ తీరు మారదన్నట్లు బంతులు సంధిస్తున్నారు. ప్రస్తుతం 197 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నఇంగ్లండ్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయారు. భారత బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యానికి ఈసారి ఫీల్డింగ్ కూడా తోడైంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఇచ్చిన క్యాచ్ లను భారత ఆటగాళ్లు వదిలేసి జట్టును మరింత సంక్లిష్టంలోకి నెట్టారు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు అలెస్టర్ కుక్ ఇచ్చిన రెండు క్యాచ్ లను స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రహానే, మురళీ విజయ్ లు జారవిడిచారు. అనంతరం కుక్ (79) పరుగులు చేసి స్లిప్ లో మురళీ విజయ్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం బ్యాలెన్స్(64), ఇయాన్ బెల్(5) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. భారత బౌలర్లు ఆరూన్ కు రెండు వికెట్లు లభించాయి. -
ఓవల్‌లోనూ ‘ఓల్డ్’ట్రాఫర్డ్!
ఎనిమిది పరుగులకే 4 వికెట్లు కోల్పోలేదని సంతోషించాలా... గత మ్యాచ్‌లాగా కనీసం 150 కూడా చేయలేకపోయారని బాధపడాలా! ఆరు సున్నాలు చుట్టలేదని ఆనందించాలా... ఎనిమిది మంది ఒక్క అంకె స్కోరుకే పరిమితమయ్యారని అయ్యో అనాలా! అలీకి ఈసారి మన టాప్ బ్యాట్స్‌మెన్ చిక్కలేదని చెప్పుకోవాలా... అతను ఒక్క బంతి కూడా వేయక ముందే కుప్పకూలామని అనుకోవాలా! అవును... భారత్ తమ చెత్త ఆటతీరును మార్చుకోలేదు. నిలకడలేమితో ఓల్డ్‌ట్రాఫర్డ్ ప్రదర్శననే గుర్తు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన మన ఆటగాళ్లు వరుస కట్టి పెవిలియన్ వైపు పరేడ్ చేశారు. అయితే... ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మరోసారి కెప్టెన్ ఆపద్బాంధవుడయ్యాడు. టెస్టు క్రికెట్ ఆడాలంటే టెక్నిక్ ఒక్కటే కాదని, తెగువ కూడా ఉండాలని నిరూపించాడు. మొండితనంతో, చివరి బ్యాట్స్‌మన్ అండతో ఆడి కాస్త పరువు దక్కించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 148 ఆలౌట్ ►ధోని ఒంటరి పోరాటం ►82 పరుగులు చేసిన కెప్టెన్ ►ఇంగ్లండ్ 62/0 లండన్: ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. వరుస రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడినా... తీరు మారని టీమిండియా అదే వైఫల్యాన్ని కొనసాగించింది. ఫలితంగా శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన చివరి, ఐదో టెస్టులో తమ తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ ధోని (140 బంతుల్లో 82; 15 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే వీరోచితంగా పోరాడాడు. ఇషాంత్ శర్మ (42 బంతుల్లో 7 నాటౌట్)తో కలిసి ఆఖరి వికెట్‌కు 58 పరుగులు జోడించాడు. ఈ సిరీస్‌లో ధోనికి ఇది నాలుగో అర్ధ సెంచరీ కావడం విశేషం. 28 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ చివరి వికెట్‌గా అవుటయ్యాడు. గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా అతను జట్టులోని ఇతర సభ్యులు చేసిన మొత్తం పరుగులకంటే తానొక్కడే ఎక్కువ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్, జోర్డాన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 62 పరుగులు చేసింది. రాబ్సన్ (65 బంతుల్లో 33 బ్యాటింగ్; 5 ఫోర్లు), కుక్ (49 బంతుల్లో 24 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. తొలి సెషన్: టపటపా టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ వాతావరణంలో తేమను దృష్టిలో ఉంచుకొని మరో ఆలోచన లేకుండా ప్రత్యర్థి బ్యాటింగ్ అప్పగించాడు. భారత తుది జట్టులో పంకజ్, జడేజా స్థానాల్లో ఇషాంత్, బిన్నీలకు చోటు దక్కింది. మైదానం తడిగా ఉండటంతో ఆట అర గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో బంతికే అన్యమనస్కంగా ఆడి గంభీర్ (0) వెనుదిరగడంతో భారత్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత పుజారా (4), కోహ్లి (6), రహానే (0) అతడిని అనుసరించారు. వీటిలో రెండు వికెట్లు జోర్డాన్‌కు దక్కాయి. అంతకుముందు అద్భుత బంతితో పుజారాను బ్రాడ్ అవుట్ చేశాడు. సాధ్యమైనన్ని బంతులు ఎదుర్కొని నిలదొక్కుకునే ప్రయత్నం చేసిన విజయ్ (64 బంతుల్లో 18) కూడా స్లిప్‌లో క్యాచ్ ఇవ్వడంతో 20 ఓవర్ల లోపే భారత్ 5 వికెట్లు కోల్పోయింది. ఓవర్లు: 25, పరుగులు: 43, వికెట్లు: 5 రెండో సెషన్: పోరాడిన ధోని లంచ్ తర్వాత పేలవమైన షాట్‌తో బిన్నీ (5) వెనుదిరగ్గా... ఆ తర్వాత అశ్విన్ (13), భువనేశ్వర్ (5), ఆరోన్ (1) కూడా కెప్టెన్‌కు సహకారం అందించలేకపోయారు. ఈ దశలో భారత్ స్కోరు వంద పరుగులు కూడా దాటదేమో అనిపించింది. అయితే మరో ప్రత్యామ్నాయం లేని ధోని ఎదురు దాడికి దిగాడు. ఏ బౌలర్‌నూ వదలకుండా ఫోర్లతో విరుచుకుపడ్డాడు. స్లిప్‌లో బెల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ఇషాంత్ కెప్టెన్‌కు అండగా నిలిచాడు. టీ విరామం ఆలస్యంగా ప్రకటించినా... ఈ జోడిని విడదీయడంలో ఇంగ్లండ్ బౌలర్లు విఫలమయ్యారు. ఓవర్లు: 31, పరుగులు:82, వికెట్లు: 4 మూడో సెషన్: ఇంగ్లండ్ నిలకడ విరామం తర్వాత ధోని మరో నాలుగు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. ఎట్టకేలకు ఈ సెషన్ ఆరో ఓవర్లో ఇంగ్లండ్ శ్రమ ఫలించింది. బ్రాడ్ బౌలింగ్‌లో మరో భారీ షాట్‌కు ప్రయత్నించిన కెప్టెన్.. లాంగ్‌లెగ్‌లో వోక్స్ చేతికి చిక్కాడు. ఇషాంత్‌తో జోడించిన 58 పరుగుల్లో ధోని ఒక్కడే 50 పరుగులు చేయడం విశేషం. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ జాగ్రత్తగా ఆడింది. భువనేశ్వర్ బౌలింగ్‌లో ఒక సారి కుక్ ఎల్బీగా అవుటయ్యే అవకాశం చిక్కినా... అంపైర్ స్పందించలేదు. దాంతో తొలి రోజును ఇంగ్లండ్ విజయవంతంగా ముగించింది. ఓవర్లు: 5.1, పరుగులు: 23, వికెట్లు: 1 (భారత్) ఓవర్లు: 19, పరుగులు: 62, వికెట్లు: 0 (ఇంగ్లండ్) స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) రూట్ (బి) వోక్స్ 18; గంభీర్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 0; పుజారా (బి) బ్రాడ్ 4; కోహ్లి (ఎల్బీ) (బి) జోర్డాన్ 6; రహానే (సి) అండ్ (బి) జోర్డాన్ 0; ధోని (సి) వోక్స్ (బి) బ్రాడ్ 82; బిన్నీ (సి) కుక్ (బి) అండర్సన్ 5; అశ్విన్ (సి) రూట్ (బి) వోక్స్ 13; భువనేశ్వర్ (సి) బట్లర్ (బి) జోర్డాన్ 5; ఆరోన్ (సి) అండ్ (బి) వోక్స్ 1; ఇషాంత్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (61.1 ఓవర్లలో ఆలౌట్) 148 వికెట్ల పతనం: 1-3; 2-10; 3-26; 4-28; 5- 36; 6-44; 7-68; 8-79; 9-90; 10-148. బౌలింగ్: అండర్సన్ 17-4-51-2; బ్రాడ్ 15.1-4-27-2; జోర్డాన్ 14-7-32-3; వోక్స్ 14-7-30-3; అలీ 1-0-1-0. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (బ్యాటింగ్) 24; రాబ్సన్ (బ్యాటింగ్) 33; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 62 బౌలింగ్: భువనేశ్వర్ 7-1-25-0; ఇషాంత్ 7-2-12-0; ఆరోన్ 3-0-14-0; బిన్నీ 2-0-7-0. ఆ అప్పీల్ చేసి ఉంటే... బ్యాట్స్‌మన్ కచ్చితంగా అవుట్ కాదని తెలిసిన సందర్భాల్లోనూ ఒత్తిడి పెంచేందుకు ప్రత్యర్థి ఫీల్డర్లు పదే పదే అప్పీల్ చేయడం సర్వ సాధారణం. అయితే తొలి రోజు ఇంగ్లండ్ జట్టు ఏ మూడ్‌లో ఉందో గానీ అసలైన అవుట్‌కు కూడా అప్పీల్ చేయలేదు. అది ఆ జట్టుకు మరో 50 పరుగుల నష్టాన్ని కలిగించింది! ధోని 32 పరుగులతో ఉన్నప్పుడు జోర్డాన్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతిని అందుకున్న కీపర్ బట్లర్ పెద్దగా పట్టించుకోకపోగా, ఫీల్డర్లూ మౌనం వహించారు. అయితే ఆ తర్వాత స్నికో మీటర్ పరిశీలనలో బంతి, బ్యాట్‌కు తగిలి కీపర్ చేతుల్లో పడినట్లుగా తేల్చింది. భారత్ స్కోరు 90/9గా ఉన్న ఈ సమయంలో ధోని అవుటై ఉంటే మన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది.