
ఎందుకు ఆడుతున్నారో తెలుసుకోండి!
న్యూఢిల్లీ: ‘ కొంత మంది డబ్బు కోసం ఆడతారు. కొంత మందికి అమ్మాయిలు కావాలి. మరికొందరికి పార్టీలు, పేరు ప్రఖ్యాతులు ఇష్టం. కొందరు మాత్రమే క్రికెట్‌పై ఇష్టంతో ఆడతారు. ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరు అసలు తాము ఎందుకు ఆడుతున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరంతా నిజాయితీగా ఉండాలని నేను కోరుకుంటా.
మీ అసలు లక్ష్యం ఏమిటో తెలుసుకొని వచ్చే సీజన్‌లోకి అడుగు పెట్టండి’...ఐపీఎల్-2లో బెంగళూరు చేతిలో ఓడి ఫైనల్ అవకాశం కోల్పోయిన అనంతరం తన చెన్నై జట్టు సహచరులతో కెప్టెన్ ధోని చెప్పిన మాటలు ఇవి. టీమ్‌లో ఐకమత్యం లేదని ఊహించిన ధోని, తనదైన శైలిలో స్ఫూర్తి నింపుతూనే, ఒక రకమైన హెచ్చరికతో ఈ ప్రసంగం చేశాడు. మైక్ హస్సీ తన తాజా పుస్తకంలో రాసిన ఆసక్తికర అంశాల్లో ఇదొకటి.