Mike Hussey
-
‘అతడికి దూకుడు ఎక్కువ.. సూపర్ బ్యాటర్’
యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మైక్ హస్సీ ప్రశంసలు కురిపించాడు. బౌలర్లపై దూకుడు ప్రదర్శిస్తూ అతడు బ్యాటింగ్ చేసే విధానం చూడముచ్చటగా ఉంటుందని కొనియాడాడు. ఇక టీమిండియా వంటి పటిష్ట జట్టుపై ఓపెనర్‌గా అరంగేట్రం చేసే అవకాశం రావడం గొప్ప విషయం అని పేర్కొన్నాడు.ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం భారత్‌తో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్టు సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో ఓడిపోయిన కంగారూలు.. అడిలైడ్‌లో గెలుపొందారు. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేశారు. అయితే, ఇరుజట్ల మధ్య బ్రిస్బేన్ టెస్టు ‘డ్రా’ గా ముగిసింది. ఈ క్రమంలో భారత్- ఆసీస్ మధ్య మెల్బోర్న్లో నాలుగు, సిడ్నీలో ఐదో టెస్టు జరుగనున్నాయి.కొత్త కుర్రాడికి చోటుఇందుకు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా శుక్రవారం జట్టును ప్రకటించింది. పెర్త్ టెస్టుతో అరంగేట్రం చేసిన ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీని తప్పించి.. సామ్ కొన్‌స్టాస్‌ను జట్టులోకి ఎంపిక చేసింది. ఒకవేళ డిసెంబరు 26 నుంచి జరిగే ‘బాక్సింగ్ టెస్టు’ (నాలుగో మ్యాచ్)లో తుది జట్టు తరఫున కొత్త కుర్రాడు బరిలోకి దిగితే చరిత్రే.వారిద్దరి తర్వాతడెబ్బై ఏళ్ల తర్వాత.. అంతర్జాతీయ టెస్టు ఆడే అవకాశం దక్కించుకున్న ఆసీస్ టీనేజ్ బ్యాటర్‌గా కొన్‌స్టాస్ ఘనత వహిస్తాడు. 1953లో ఇయాన్ క్రెయిగ్ 17 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ తరఫున స్పెషలిస్ట్ బ్యాటర్‌గా అరంగేట్రం చేశాడు. అయితే 2011లో ప్యాట్ కమిన్స్ (ప్రస్తుత కెప్టెన్) 18 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసినప్పటికీ అతను స్పెషలిస్టు బౌలర్(పేసర్)!ఈ నేపథ్యంలో మైక్ హస్సీ ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడుతూ.. ‘‘మెక్‌స్వీనీ పట్ల కాస్త కఠినంగానే వ్యవహరించారన్న మాట వాస్తవం. అతడిపై నాకు సానుభూతి ఉంది. అయితే, కొన్‌స్టాస్ తక్కువేమీ కాదు. బిగ్‌బాష్ లీగ్‌లో అతడి ఆట నన్ను ఆకట్టుకుంది.ఇంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదుఅద్భుతమైన సందర్భంలో కొన్‌స్టాస్ అరంగేట్రం చేయబోతున్నాడు. 19 ఏళ్ల వయసులోనే టీమిండియా మీద.. అది కూడా బాక్సింగ్ డే టెస్టులో ఓపెనింగ్ బ్యాటర్‌గా అవకాశం. వావ్.. ఇంతకంటే గొప్ప విషయం ఇంకేం ఉంటుంది’’ అని కొన్‌స్టాస్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.కాగా ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలతో పాటు ఆసీస్ ‘ఎ’, బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లలో కొన్‌స్టాస్ నిలకడగా రాణిస్తున్నాడు. భారత్ ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టులో అజేయ అర్ధ శతకం (73 నాటౌట్) బాదాడు కొన్‌స్టాస్.అదే విధంగా.. అడిలైడ్‌లో డే-నైట్ టెస్టుకు ముందు భారత్‌తో జరిగిన సన్నాహక పింక్ బాల్ (రెండు రోజుల మ్యాచ్) పోరులో ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తరఫున శతకం (107) సాధించాడు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుర్ర బ్యాటర్.. శనివారం సిడ్నీ సిక్సర్‌తో మ్యాచ్ పూర్తయ్యాక ఆసీస్ టెస్టు జట్టుతో కలుస్తాడు.చదవండి: BGT: అతడిపైనే వేటు వేస్తారా?.. సెలక్టర్లపై ఆసీస్ మాజీ కెప్టెన్ ఫైర్ -
IPL 2023: బెన్ స్టోక్స్ విషయంలో సీఎస్కేకు బిగ్ షాక్
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభంకానుండగా తమ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద షాకే తగిలింది. గతకొంతకాలంగా మోకాలి సమస్యతో బాధపడుతున్న స్టోక్స్.. ఐపీఎల్ 16వ ఎడిషన్‌ను కేవలం బ్యాటర్‌గానే ప్రారంభిస్తాడని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పష్టమైన ప్రకటన చేశాడు. లీగ్ సెకండాఫ్ సమయానికి స్టోక్స్ పూర్తిగా కోలుకుంటే బౌలర్‌గా సేవలందిస్తాడని హస్సీ పేర్కొన్నాడు. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న స్టోక్స్ ఆల్‌రౌండర్‌గా ఇరగదీస్తాడిన భావిస్తే, ఇలా జరిగిందేంటి అని సీఎస్కే యాజమాన్యం తలలుపట్టుకుంది. వాస్తవానికి స్టోక్స్ 2023 సీజన్ మొత్తానికే అందుబాటులో ఉండడని తొలుత ప్రచారం జరిగింది. అయితే స్టోక్స్‌కు కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి ఐపీఎల్ ప్రారంభ సమయానికంతా రెడీ చేశారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఫిట్నెస్ సరిగ్గా లేనప్పుడు, ఆదరాబాదరాగా అతన్ని ఎందుకు ఆడించాలని సీఎస్కే అభిమానులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆల్‌రౌండర్‌గా పొడిచేస్తాడనే కాదా అతన్ని రూ. 16.25 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుందని నిలదీస్తున్నారు. అసలే గత సీజన్‌ను ఆఖరి నుంచి రెండో స్థానంతో ముగించినందుకు ఫీలవుతున్న తమిళ తంబిలకు స్టోక్స్ పంచాయితీ పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే, మార్చి 31న డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌తో సీఎస్కే తమ ఐపీఎల్-2023 జర్నీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఐకానిక్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. -
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రుతురాజ్..?
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్. ప్రస్తుతం సీఎస్కే క్యాంప్‌లో జరుగుతున్న అతిపెద్ద చర్చ ఇది. 2023 సీజన్లో జట్టు కెప్టెన్సీ భారాన్ని మోయమని అతికష్టం మీద ధోనిని ఒప్పించిన సీఎస్కే యాజమాన్యం, నెక్స్ట్ ఏంటీ అన్న విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. ధోని ఉండగానే భవిష్యత్ కెప్టెన్‌ను తయారు చేసుకోవాలని భావించిన యాజమాన్యం.. గత సీజన్లో జడేజాకు కెప్టెన్సీ అప్పగించి చేతులు కాల్చుకుంది. దీంతో ఈసారి అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో వారికి రుతురాజ్ గైక్వాడ్ రూపంలో భవిష్యత్ ఆశాకిరణం కనిపించాడు. తాజాగా ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ కెప్టెన్సీ స్కిల్స్‌ను, ఫామ్‌ను పరిగణలోకి తీసుకున్న టీమ్ మేనేజ్మెంట్.. ధోని తర్వాత సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు అతనికే అప్పజెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో రుతురాజ్‌కు ధోని, జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ సైతం మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. హస్సీ అయితే ఏకంగా రుతురాజ్ పేరును నేరుగా యాజమాన్యం ముందుంచినట్లు తెలుస్తోంది. రుతురాజ్‌ను గత రెండు సీజన్లుగా క్షుణ్ణంగా గమనిస్తున్న హస్సీ.. అతనిలో నాయకత్వ లక్షణాలు పుష్కళంగా ఉన్నాయని, అతనైతేనే ధోని వారసుడిగా అంచనాల మేరకు రాణిస్తాడని రెకమెండ్ చేసినట్లు సమాచారం. రుతురాజ్ అద్భుతమైన బ్యాటర్ అని, ఈ విషయం ఇదివరకే చాలాసార్లు ప్రూవైందని, అతను ఒత్తిడిలో ధోనిలా కూల్‌గా ఉంటాడని, పరిస్థితులను నిశితంగా పరిశీలించడంలో అతనో దిట్ట అని హస్సీ.. మేనేజ్మెంట్కు ఓ నివేదిక సైతం పంపినట్లు సీఎస్కే వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. హస్సీ నివేదికతో పాటు ధోని సపోర్ట్, ఇటీవలి కాలంలో రుతురాజ్ ఫామ్, మహారాష్ట్ర కెప్టెన్‌గా అతని సక్సెస్‌ను పరిగణలోకి తీసుకున్న టీమ్ మేనేజ్మెంట్ 2024 సీజన్ నుంచి సీఎస్కే సారధ్య బాధ్యతలు రుతురాజ్‌కే అప్పజెప్పాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా, తాజాగా ముగిసిన విజయ్ హజారే టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు బాదిన రుతురాజ్.. ఈ టోర్నీలో గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 8 సెంచరీలు బాది భీకరమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. 2020లో లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ పుణే కుర్రాడు.. 2021 సీజన్లో సీఎస్కేను ఒంటి చేత్తో గెలిపించాడు. ఆ సీజన్లో 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అందుకున్న రుతురాజ్.. ఐపీఎల్ 2022 సీజన్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. -
IPL 2022: డెవాన్ కాన్వేను దిగ్గజ ఆటగాడితో పోలుస్తున్న నెటిజన్లు
Devon Conway Compared With Mike Hussey: ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (మే 7) జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓపెనర్ డెవాన్ కాన్వే (49 బంతుల్లో 87; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లోనూ కాన్వే ఇదే తరహాలో రెచ్చిపోయి వరుస హాఫ్ సెంచరీలు బాదాడు. ఈ నేపథ్యంలో కాన్వేపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు, విశ్లేషకులు ఈ న్యూజిలాండ్ ఆటగాడిని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీతో పోలుస్తున్నారు. మైక్ హస్సీతో పోల్చడంపై కాన్వే స్పందిస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌తో పాటు విశ్వ వేదికపై ఘన చరిత్ర కలిగిన హస్సీ లాంటి దిగ్గజ ఆటగాడితో తనను పోల్చడం ఎంతో ప్రత్యేకమైందని చెప్పుకొచ్చాడు. హస్సీ మార్గదర్శకంలో తాను మరింత రాటుదేలానని, హస్సీతో సన్నిహితంగా మెలగడం ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని పేర్కొన్నాడు. హస్సీ లాంటి అనుభవం కలిగిన వ్యక్తి నుంచి బ్యాటింగ్‌కు సంబంధించి ఎన్నో టెక్నిక్స్ నేర్చుకున్నానని.. ఇవి తన కెరీర్ ఉన్నతి తప్పక తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. నేను అమితంగా ఆరాధించే వ్యక్తితో తనను పోల్చడం గొప్ప అనుభూతిని కలిగిస్తుందని తెలిపాడు. తన పరిధిలో ఉన్న ఏ సవాలునైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఇందుకు సీఎస్కే జట్టు నుంచి తనకు గొప్ప సహకారం లభిస్తుందని వివరించాడు. ఇటీవల జరిగిన తన వివాహ సమయంలో జట్టు సభ్యులందరూ తనకెంతగానో సహకరించారని, తన జీవితంలో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని జట్టు సభ్యులంతా దగ్గరుండి జరిపించారని గుర్తు చేసుకున్నాడు. కాగా, దక్షిణాఫ్రికాతో పుట్టి న్యూజిలాండ్ క్రికెటర్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన డెవాన్ కాన్వే.. 2022 ఐపీఎల్ సీజన్‌తో సీఎస్కేతో జతకట్టాడు. సీఎస్కే యాజమాన్యం కాన్వేను కోటి రూపాయల బేస్ ప్రైజ్‌కు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన అనంతరం గర్ల్ ఫ్రెండ్ కిమ్ వాట్సన్‌తో వివాహం కోసం అతను కొన్ని రోజులు బయోబబుల్‌ను విడిచి వెళ్లాడు. వివాహం అనంతరం జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కాన్వే వీర లెవెల్లో రెచ్చిపోతూ వరుస హాఫ్ సెంచరీలు సాధిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. వివాహం అనంతరం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 55 బంతుల్లో 85 పరుగులు చేసిన కాన్వే.. ఆతరువాత ఆర్సీబీపై 37 బంతుల్లో 56, తాజాగా డీసీపై 49 బంతుల్లో 87 పరుగులు స్కోర్ చేశాడు. చదవండి: ఐపీఎల్ హంగామా నడుస్తున్నా నేనున్నానని గుర్తు చేస్తున్న పుజారా..! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అంతా అతని వల్లే జరిగిందన్న పూరన్.. ఆర్సీబీతో మ్యాచ్‌పై హస్సీ ఏమన్నాడంటే..?
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా సోమవారం (ఏప్రిల్ 11) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి గుజరాత్ టైటాన్స్‌ను ఓటమిని పరిచయం చేసింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ ఫ్రాంచైజీ.. అరంగేట్రంలోనే హ్యాట్రిక్ విజయాలు సాధించి దూసుకుపోతుండగా, సన్‌రైజర్స్ జీటి విజయాల పరంపరకు అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. భువీ (2/37), నటరాజన్ (2/34), మార్కో జన్సెన్ (1/27), ఉమ్రాన్ మాలిక్ (1/39) రాణించడంతో గుజరాత్ టైటాన్స్‌ను 162 పరుగులకే కట్టడి చేయగలిగింది. ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు అభినవ్ శర్మ (42), కేన్ విలియమ్సన్ (57) శుభారంభాన్ని అందించగా, ఆఖర్లో పూరన్ (18 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (8 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్) చెలరేగి ఎస్ఆర్హెచ్ను విజయతీరాలకు చేర్చారు. Finishing in style ✅ The Brian Lara influence 🙌 2⃣ wins in a row 🔥 The player-coach duo of @nicholas_47 & the legendary @BrianLara chat after @SunRisers' successful run-chase against #GT. 👍 👍 - By @ameyatilak Full interview 📹 🔽 #TATAIPL | #SRHvGT https://t.co/VPyVK8aiKp pic.twitter.com/AGZmrGWjWk — IndianPremierLeague (@IPL) April 12, 2022 ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి సన్‌రైజర్స్ విజయంలో కీలకపాత్ర పోషించిన పూరన్, మ్యాచ్ అనంతరం ఆ జట్టు బ్యాటింగ్ కోచ్, దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ ప్రస్థానంపై పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన జట్టు తిరిగి గాడిలో పడటానికి బ్యాటింగ్ కోచ్ లారానే ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. A face-off with familiar faces! 📹 Once we cross the line, it's bat v ball challenge! Watch the match preview with Huss!#CSKvRCB #WhistlePodu #Yellove 🦁💛 @amazonpay pic.twitter.com/XmfVV5T03l — Chennai Super Kings (@ChennaiIPL) April 12, 2022 ఈ వీడియోతో పాటు ఇవాళ (ఏప్రిల్ 12) ఆర్సీబీతో జరుగబోయే మ్యాచ్‌పై సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ ఏమన్నాడో (ప్రివ్యూ) చూడొచ్చు. ఇందులో సీఎస్కే ఆటగాళ్ల ప్రాక్టీస్, ఇతరత్రా దృశ్యాలు ప్రధానంగా ఆకట్టుకోగా, జట్టు మాజీ సభ్యుడు డుప్లెసిస్‌ను సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆప్యాయంగా కౌగిలించుకోవడం హైలైట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్లో ఇవాళ మరో ఆసిక్తికర పోరు జరుగనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో సీఎస్కే, ఆర్సీబీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సీజన్లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన ఆర్సీబీ మరో విజయం కోసం ఉరకలేస్తుండగా.. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచిన సీఎస్కే ఎలాగైనా బోణీ కొట్టాలని పట్టుదలగా ఉంది. చదవండి: ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ రికార్డును సమం చేసిన సన్‌రైజర్స్ బౌలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Pak Vs Aus: అప్పుడు మైక్ హస్సీ.. ఇప్పుడు వేడ్.. పాక్‌కు చుక్కలే!
T20 World Cup 2021 Pak Vs Aus: Matthew Wade Innings Resembles Mike Hussey in 2010: టీ20 వరల్డ్‌కప్-2021 రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా మెరుపు దాడి చూసినవారికి 2010 టి20 ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్యే జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ గుర్తుకు రాకమానదు. పాక్ 191 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 7 వికెట్లకు 197 పరుగులు సాధించింది. నవంబరు 11న మాథ్యూ వేడ్ తరహాలో మైక్ హస్సీ చివర్లో చెలరేగి జట్టును గెలిపించాడు. ఇప్పుడు పాక్ ప్రధానాస్త్రం షాహిన్ అఫ్రిది ఓవర్లో వేడ్ 3 సిక్సర్లు బాదగా... నాడు పాక్ టాప్ స్పిన్నర్ అజ్మల్ వేసిన చివరి ఓవర్లో హస్సీ వరుసగా 6, 6, 4, 6 విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో ఆసీస్ విజయం కోసం చివరి 5 ఓవర్లలో 70 పరుగులు కావాల్సి ఉండగా...ఈ సారి ఆసీస్‌కు ఆఖరి 5 ఓవర్లలో 62 పరుగులు అవసరమయ్యాయి. రెండు సార్లు కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించిన చాంపియన్ తరహా ఆటను ప్రదర్శించిన కంగారూలదే పైచేయి అయింది. పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు చేరుకుంది. నవంబరు 14న న్యూజిలాండ్‌తో జరిగే తుదిపోరులో ఆస్ట్రేలియా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. చదవండి: Eng Vs Nz: ఆ రెండు జట్లే మమ్మల్ని ఓడించగలవు.. హా.. మరి మేము బూర్జ్ ఖలీఫా చూడటానికి వచ్చాం! -
T20 World Cup: భారత్‌లో వద్దు: హస్సీ
సిడ్నీ: ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వేదికను మార్చాలని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటిం గ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయపడ్డాడు. భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా యూఏఈలో టీ20 వరల్డ్ కప్ ఏర్పాటు చేయాలని హస్సీ కోరాడు. ఎనిమిది జట్లతో బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్‌ను నిర్వహించినా కరోనా కేసులు వచ్చాయని... 16 జట్లతో ప్రపంచకప్‌ను నిర్వహించడం కష్టసాధ్యమని హస్సీ వ్యాఖ్యానించాడు. కాగా వివిధ జట్ల ఆటగాళ్లు, కోచ్‌లకు కరోనా సోకడంతో బీసీసీఐ, ఐపీఎల్-2021ను నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇక హస్సీకి రెండుసార్లు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో క్వారంటైన్ అనంతరం మాల్దీవులు వెళ్లిన అతడు అక్కడి నుంచి దోహా మీదుగా స్వదేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. ఇక కరోనా బారిన పడటం గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ సోకిన 10 రోజుల తర్వాత మళ్లీ టెస్టు చేయించుకుంటే పాజిటివ్ రావడంతో కాస్త భయం వేసింది.. కానీ బీసీసీఐ నాకు ధైర్యం చెప్పింది. ప్రస్తుతానికి కోలుకున్నా గానీ శరీరం కాస్త బలహీనంగానే ఉంది. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి నాకు కొంచెం సమయం పట్టొచ్చు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: ఆరోజు బస్సులో అతని పక్కనే కూర్చున్నా.. అందుకే -
ఆరోజు బస్సులో అతని పక్కనే కూర్చున్నా.. అందుకే
సిడ్నీ: కరోనా మహమ్మరి సెగతో ఐపీఎల్ 14వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లతో పాటు ఎస్ఆర్హెచ్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమిత్ మిశ్రాలు కరోనా బారీన పడ్డారు. ఇటు సీఎస్కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీకి కూడా కరోనా సోకడంతో లీగ్‌ను రద్దు చేయక తప్పలేదు. అలా ఐపీఎల్ 14వ సీజన్లో కరోనా బారిన పడ్డ వారిలో సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కూడా ఉన్నాడు. హస్సీకి రెండు సార్లు కరోనా పాజిటివ్ రావడంతో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉండి కోలుకున్న అతను ఇటీవలే మాల్దీవ్స్ నుంచి తన సొంత దేశం ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. తాజాగా హస్సీ తన ఆరోగ్య పరిస్థితిపై ఫాక్స్ స్పోర్ట్స్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ' కరోనా నుంచి కోలుకున్న ఇంకా శరీరం కాస్త వీక్‌గానే ఉంది. మళ్లీ నార్మల్ కండీషన్‌కు రావడానికి నాకు కొంచెం టైమ్ పట్టొచ్చు. కరోనా సోకిన 10 రోజుల తర్వాత మళ్లీ టెస్టు చేయించుకుంటే పాజిటివ్ రావడంతో కాస్తంత భయపడ్డా.. కానీ బీసీసీఐ నాకు ధైర్యం చెప్పింది. బహుశా నాకు బాలాజీ ద్వారానే కరోనా వచ్చి ఉండొచ్చు. ఆరోజు బస్సులో తాను బాలాజీ పక్కనే కూర్చున్నా.. అప్పటికే బాలాజీకి కరోనా లక్షణాలు ఉన్నాయి. కానీ ఆ విషయం మా ఇద్దరికి తెలియదు. బాలాజీతో కబుర్లు చెబుతూ కాస్త సరదాగా గడిపాను... బహుశా అప్పుడు ట్రాన్స్మిషన్ ద్వారా కరోనా సోకి ఉండొచ్చు. ఏదైతేనేం కరోనాను జయించి నా దేశానికి చేరుకున్నా. నేను సిడ్నీ ఎయిర్‌పోర్టులో దిగగానే నా కుటుంబసభ్యులు, పోలీసులు, మెడికల్ సిబ్బంది నన్ను రిసీవ్ చేసుకున్న విధానం బాగా నచ్చింది. అంటూ చెప్పుకొచ్చాడు. 2004 నుంచి 2013 వరకు ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన మైక్ హస్సీ 79 టెస్టుల్లో 6,235 పరుగులు; 185 వన్డేల్లో 5,442 పరుగులు; 38 టీ20ల్లో 721 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్లో సీఎస్కేకు ప్రాతినిధ్యం వహించిన హస్సీ 59 మ్యాచ్‌లాడి 1977 పరుగులు చేశాడు. చదవండి: మైకెల్ హస్సీకి మళ్లీ కరోనా పాజిటివ్ AUS VS ENG: యాషెస్ సిరీస్ షెడ్యూల్ విడుదల -
స్వదేశానికి చేరుకున్నఆసీస్ క్రికెటర్లు
సిడ్నీ: ఐపీఎల్-2021లో పాల్గొన్న ఆసీస్ క్రికెటర్లు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. భారత్‌లో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో ఆసీస్ క్రికెటర్లు రెండు వారాలు పాటు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం సిడ్నీ చేరుకున్నారు. 38 మంది ఆసీస్ ఆటగాళ్లు సహా కోచింగ్ స్టాఫ్ ఆస్ట్రేలియాలో ల్యాండ్ అయ్యారు. ప్రముఖ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్ వెల్, సిడ్నీ విమానశ్రాయానికి చేరుకున్నట్టు ఆస్ట్రేలియా మీడియా తెలిపింది. విమానశ్రాయానికి చేరుకున్న ఆటగాళ్లు నేరుగా సిడ్నీలో ఓ హాటల్లో 14 రోజులు క్వారంటైన్లో ఉంటారని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా బారిన పడిన ఆసీస్ మాజీ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ మైక్ హస్సీ పూర్తిగా కోలుకోవడంతో స్వదేశాకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి:సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు) -
Mike Hussey: ఎట్టకేలకు స్వదేశానికి..
చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ ఎట్టకేలకు స్వదేశానికి బయలు దేరాడు. మాల్దీవుల నుంచి ఆదివారం దోహా మీదుగా హస్సీ ఆస్ట్రేలియాకు పయనమయ్యాడని, సోమవారం అక్కడికి చేరుకుంటాడని చెన్నై జట్టు సీఈవో కేఎస్ విశ్వనాథన్ ట్విటర్లో పేర్కొన్నాడు. ఇక మాల్దీవుల్లో ఉన్న ప్యాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ సహా ఇతర ఆస్ట్రేలియా ఆటగాళ్లు బీసీసీఐ ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకోనున్నారు. సిడ్నీలోని ఓ హోటల్లో క్వారంటైన్ పూర్తి చేసుకున్న అనంతరం వారు ఇళ్లకు వెళ్లే అవకాశం ఉంది. కాగా భారత్‌లో కరోనా మహమ్మారి ప్రకంపనల నేపథ్యంలో ఐపీఎల్-2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. చదవండి: సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు -
‘హోం వర్క్’ చేసి సంతకాలు పెట్టండి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా లీగ్‌లలో పాల్గొనే ముందు అన్ని అంశాలు చూసుకొని, మున్ముందు రాబోయే సమస్యలను అంచనా వేసి సంతకాలు పెట్టాలని ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం (ఏసీఏ) తమ ఆటగాళ్లను హెచ్చరించింది. కరోనా నేపథ్యంలో ఆస్ట్రేలియా దేశంలోకి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ఐపీఎల్లో ఆడుతున్న ఆసీస్ క్రికెటర్లంతా ఒక రకంగా చిక్కుకుపోయారు. నేరుగా స్వదేశం వెళ్లలేక ఇప్పుడు మాల్దీవుల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. దీనినే ఏసీఏ గుర్తు చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) వాయిదా పడిన సమయంలో కూడా లిన్, క్రిస్టియాన్, కటింగ్ కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. ‘భవిష్యత్తులో ఇలాంటి స్థితి రాకూడదని కోరుకుంటున్నా. అయితే ఒప్పందాలపై సంతకాలు చేసే ముందు కాస్త హోంవర్క్ చేసుకుంటే మంచిది. కరోనా కారణంగా ఇప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది. మన దేశంలో అయితే అంతా బాగుండి మీరంతా ఎంతో స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. సరిహద్దులు మూసేసి ప్రయా ణాలపై ఆంక్షలు పెడతారని ఆటగాళ్లూ ఊహించలేదు. అయితే ఇలాంటివి జరిగినప్పుడు ఆందోళన పెరగడం సహజం’ అని ఏసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్బర్గ్ అన్నారు. మైక్ హస్సీ మినహా.... కరోనా పాజిటివ్‌గా తేలిన చెన్నై బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ మినహా మిగతా ఆస్ట్రేలియన్లంతా మాల్దీవులకు చేరుకున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించిన ఆస్ట్రేలియా బోర్డు (సీఏ)... ప్రభుత్వ ఆంక్షల్లో సడలింపులు వచ్చేవరకు వారంతా మాల్దీవులలోనే ఉండి ఆస్ట్రేలియాకు బయల్దేరతారని చెప్పారు. హస్సీ మాత్రం కోలుకున్న తర్వాత ఇక్కడి నుంచి బయల్దేరతాడు. హస్సీ, బౌలింగ్ కోచ్ బాలాజీలను ముందు జాగ్రత్తగా సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఢిల్లీ నుంచి చెన్నైకి తరలించింది. ఇక్కడ తమకు అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉన్నాయని... అవసరమైతే చెన్నైలో చికిత్స అందించడం సులువవుతుందని సీఎస్కే వర్గాలు వెల్లడించాయి. ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు చేరుకున్న తర్వాతే ధోని తన ఇంటికి బయల్దేరనున్నాడు. ఎలాంటి ఆంక్షలులేని ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఆటగాళ్లు స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇంగ్లండ్ పర్యటనకు దూరమవుతున్న న్యూజిలాండ్ పేసర్ బౌల్ట్ కూడా స్వదేశం వెళ్లిపోగా... విలియమ్సన్, సాన్‌ట్నర్, జేమీసన్ మాత్రం భారత్‌లోనే ఉండి మే 11న ఇంగ్లండ్‌కు బయల్దేరతారు. ‘మా మెడికల్ పాలసీ పని చేస్తుందా’ భారత్‌లో కరోనా పరిస్థితుల వార్తలు సోషల్ మీడియాలో చదువుతూ భయపడిన ఐపీఎల్ విదేశీ క్రికెటర్లు లీగ్‌లోకి కూడా కరోనా ప్రవేశించడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. భారత ఆటగాళ్లు వారికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించినా విదేశీ క్రికెటర్లలో భయం మరింత పెరిగిపోయిందని సన్‌రైజర్స్ ఆటగాడు శ్రీవత్స్ గోస్వామి అన్నాడు. ‘అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కానీ వైరస్ ఎలా బబుల్‌లోకి వచ్చిందో తెలీదు. ఒక్కసారి కరోనా సహచరుడికి వచ్చిందని తెలిశాక ఆటగాళ్లంతా భయపడిపోయారు. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు అప్పటికే ఇక్కడి పరిస్థితులు, ఆక్సిజన్ సమస్యలు, బెడ్లు లేకపోవడంలాంటి వార్తలు చదివి ఉండటంతో మరింత బెంగ పెరిగిపోయింది. కొందరు క్రికెటర్లయితే నాకు ఇక్కడ కోవిడ్ వస్తే పరిస్థితి ఏమిటి. నా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ భారత్‌లో పని చేస్తుందా అని కూడా అడిగేశారు’ అని గోస్వామి వెల్లడించాడు. దీన్ని బట్టి చూస్తే లీగ్ వాయిదా ప్రకటనకు ముందు క్రికెటర్లలో ఎంతటి అభద్రతా భావం నెలకొందో అర్థమవుతుంది. -
'మాకు ధోని లాంటి ఫినిషర్ కావాలి'
సిడ్నీ : ఆసీస్ జట్టుకు పరిమిత ఓవర్లలో ఎంఎస్ ధోని లాంటి ఫినిషర్ ఉంటే బాగుంటుందని మాజీ ఆటగాడు, ప్రస్తుత ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. ఇప్పుడు జట్టు మేనేజ్మెంట్ ధోనీ లాంటి ఫినిషర్ కోసమే వెతుకుందని అభిప్రాయపడ్డాడు. 'గతంలో మా జట్టులో మైక్ హస్సీ, మైఖేల్ బెవాన్ వంటి ఫినిషర్లు ఉండేవారు. అయితే బెస్ట్ ఫినిషర్‌గా మాత్రం ధోనిని మించిన వారు ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పటికే ధోని ఎన్నోసార్లు అది రుజువు చేశాడు. ఉదాహరణకు 2011 ప్రపంచకప్ చూసుకుంటే మహీ నాలుగో స్థానంలో వచ్చి 90 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాకు కప్‌ను అందించాడు. ఇంగ్లండ్ క్రికెట్లోనూ జాస్ బట్లర్ మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా ప్రసుత్తం మా జట్టుకు కూడా ధోని లాంటి ఫినిషర్ అవసరం ఉంది. జట్టు ఇన్నింగ్స్‌లో ఐదు, ఆరు స్థానాల్లో వచ్చే ఆటగాళ్లు మంచి ఫినిషర్లు అయి ఉండాలి.. అందుకోసం అన్వేషిస్తున్నాం' అంటూ లాంగర్ పేర్కొన్నాడు. (పాకిస్తాన్లో ధోని ఫీవర్!) కాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆసీస్ ఆతిథ్య జట్టుకు క్లీన్‌స్వీప్‌తో సమర్పించేసుకుంది. కాగా సరైన ఫినిషర్ లేకనే జట్టు ఓటమి పాలయిందని పలువురు ఆసీస్ మాజీ క్రికెటర్లు తెలిపారు. అయితే ప్రొటీస్‌తో జరిగిన రెండు, మూడు వన్డేల్లో మిచెల్ మార్ష్ ఆరవ స్థానంలో వచ్చి 32, 36 పరుగులు సాధించాడు. తాజాగా మార్చి 13 నుంచి కివీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఆసీస్ తరపున టెస్టు ఓపెనర్‌గా ప్రాతినిథ్యం వహించిన జస్టిన్ లాంగర్ 105 టెస్టుల్లో 7696 పరుగులు, 8 వన్డేల్లో 160 పరుగులు చేశాడు. కాగా మాథ్యూ హెడెన్‌తో కలిసి ఆసీస్‌కు టెస్టుల్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించి పెట్టాడు.(హోలీ శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా క్రికెటర్లు) -
మీ ఫేవరెట్ వన్డే కెప్టెన్ ఎవరు?
సిడ్నీ: ‘మీకు రికీ పాంటింగ్, ఎంఎస్ ధోనిల్లో ఫేవరెట్ వన్డే కెప్టెన్ ఎవరు?’ అనే ప్రశ్న ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీకి ఎదురైంది. ఆసీస్ తరఫున పాంటింగ్‌తో కలిసి సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఎంఎస్ ధోని నేతృత్వంలో హస్సీ ఆడాడు. ఈ నేపథ్యంలో హస్సీని ఒక ఇబ్బందికర ప్రశ్న కాస్త ఆలోచనలో పడేసింది. భారత్ క్రికెట్ తరఫున ఒక టీ20 వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్‌కప్‌లను గెలిచిన ఘనత ధోనిది. ఐసీసీ నిర్వహించే ఈ మూడు మెగా టైటిల్స్‌ను ధోని తన కెప్టెన్సీలో అందుకుని దీన్ని సాధించిన ఏకైక భారత కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. ఇక ధోని వన్డే విజయాల సగటు 59.52గా ఉంది. మొత్తం వన్డే ఫార్మాట్లో 199 మ్యాచ్‌లకు గాను 110 విజయాలు అందుకున్నాడు ధోని. ఇక పాంటింగ్ విషయానికొస్తే 2003, 2007 వన్డే వరల్డ్‌కప్‌లను అందించిన ఆసీస్ కెప్టెన్. ఆ జట్టు కెప్టెన్‌గా తన కెరీర్‌గా ముగిసే నాటికి పాంటింగ్ విజయాల సగటు 76.14గా ఉంది. అయితే ఇద్దరి కెప్టెన్లతో ఆడిన క్రికెటర్ హస్సీ. దాంతో హస్సీకి కష్టతరమైన ప్రశ్న ఎదురైనా దానికి మాత్రం క్లియర్‌గా సమాధానం చెప్పాడు. ‘నేను ధోని, పాంటింగ్‌ల సారథ్యంలో మ్యాచ్‌లు ఆడా. ఆ ఇద్దరిలో ఎవరు మీ ఫేవరెట్ కెప్టెన్ అంటే ఏమి చెబుతా. ఇది కచ్చితంగా కఠినతరమైన ప్రశ్నే. కాకపోతే నేనే పాంటింగే నా ఫేవరెట్ కెప్టెన్ అని బదులిస్తా. ఎందుకంటే ధోని కెప్టెన్సీలో నేను వన్డేలు ఆడలేదు. దాంతో నా ఫేవరెట్ వన్డే కెప్టెన్ పాంటింగే అవుతాడు కదా’ అని హస్సీ చెప్పాడు. 2011, 2012 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన సీఎస్కే జట్టులో హస్సీ సభ్యుడిగా ఉన్నాడు. ధోని కెప్టెన్సీలో వరుసగా రెండు టైటిల్స్ సాధించిన సీఎస్కే జట్టులో హస్సీ పాల్గొన్నాడు. -
‘ధోని రహస్యాలను ఎవరికీ చెప్పను’
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని బ్యాటింగ్ రహస్యాలను ఎవరికీ చెప్పనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ వెల్లడించాడు. ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనున్న నేపథ్యంలో హస్సీ వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. ఆసీస్‌తో సహా అన్ని జట్లు ధోని కోసం ఎన్ని వ్యూహాలు రచించినా అవన్నీ విఫలమవడం ఖాయమని పేర్కొన్నాడు. ఇక ప్రతీ మ్యాచ్‌లో ధోని పక్కా ప్రణాళికతో బ్యాటింగ్‌కు దిగడని.. పరిస్థితులను బట్టి తన ఆటతీరును మార్చుకుంటాడని వివరించాడు. ‘తన బలాలు, బలహీనతలు ఏంటో ధోనికి తెలుసు. ధోని బ్యాటింగ్‌లో చాలా తక్కువ బలహీనతలు ఉన్నాయి. వాటిని ఆసీస్‌తో సహా ఎవరికి చెప్పను. అయితే తన బ్యాటింగ్ బలహీనతలు ఏంటో అతడికి తెలుసు. ప్రతీ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో బ్యాటింగ్‌కు దిగడు. మ్యాచ్‌లో జట్టు అవసరాలు, పరిస్థితుల ప్రకారం తన ఆటతీరును మార్చుకుని భాద్యతతో ఆడతాడు. ఇక ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆసీస్ ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆసీస్‌పై అఫ్గానిస్తాన్ పోరాటం నన్ను ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది’అంటూ హస్సీ పేర్కొన్నాడు. -
‘అతను లేకపోవడం టీమిండియాకు లోటే’
సిడ్నీ: గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దూరమైన సంగతి తెలిసిందే. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆసియాకప్‌లో వెన్నెముక గాయానికి గురైన హార్దిక్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు హార్దిక్ పాండ్యాను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో అతను జట్టులో లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపే అవకాశముందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ అన్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత్ విజయావకాశాలపై హాస్సీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘హార్దిక్‌లో గొప్ప నైపుణ్యం ఉంది. ఆస్ట్రేలియాలోని పరిస్థితులకు అతని ఆటతీరు అతికినట్టుగా సరిపోయేది.అతని ఆల్‌రౌండ్ లక్షణాలతో జట్టుకు సమతూకం తెస్తాడు. కానీ గాయం కారణంగా అతను ఆస్ట్రేలియాతో సిరీస్‌కు దూరమవడం భారత జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని హస్సీ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌ను ఎదుర్కోవడం ఈజీ కాదు.. ‘స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్, వార్నర్ లేకుండా టెస్ట్ సిరీస్ గెలిచేందుకు భారత్‌కు మంచి అవకాశముంది. కానీ మిచెల్ స్టార్క్, హజిల్‌వుడ్, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్‌తో కూడిన ఆసీస్ బౌలింగ్ బృందాన్ని తొలిసారి ఎదుర్కొవడం టీమిండియాకు యువ బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. స్వదేశంలో ఆస్ట్రేలియా ఎప్పుడూ ఉత్తమ ఆటతీరే కనబరుస్తుంది. మా జట్టును ఓడించడం అంత సులభం కాదు’ అని అన్నాడు. -
ఎంఎస్ ధోనిపై విమర్శలా?: హస్సీ
చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి మద్దతుగా నిలిచాడు ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో ధోని ఫామ్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో హస్సీ స్పందించాడు. ధోని సరిగ్గా ఆడలేకపోయింది రెండు మ్యాచ్‌లే కదా.. దీనికి అతడిపై అంతగా విమర్శలు గుప్పించడం సరి కాదంటూ హస్పీ పేర్కొన్నాడు. ధోని ఫామ్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు హస్సీ మాట్లాడుతూ... ‘ ఇంగ్లండ్ పర్యటనలో ధోని రెండు ఇన్నింగ్స్‌లే కదా సరిగ్గా ఆడలేకపోయింది. ధోని ఏంటో, ఎలా ఆడతాడో మన అందరికీ తెలుసు. మధ్యలో కొన్ని సార్లు ఏ ఆటగాడైనా గాడి తప్పుతాడు. ఇది అందరికీ జరిగేదే. ధోని తప్పక తిరిగి తన ఫామ్‌ను అందుకుంటాడు. ఎన్నో ఏళ్ల పాటు అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌లు సరిగా ఆడలేదన్న కారణంగా అతడు అందించిన విజయాలను మరిచిపోతే ఎలా. వచ్చే ఏడాది ప్రపంచకప్‌కు అతడి సేవలు భారత జట్టుకు ఎంతో అవసరం. వికెట్ల వెనుక నిల్చుని బౌలర్లకు ధోని ఇచ్చే సలహాలు ఎంతో అమూల్యమైనవి. ధోని ఒక చాంపియన్ అన్న విషయం మరవద్దు’ అని హస్సీ విజ్ఞప్తి చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు హస్సీ బ్యాటింగ్ కోచ్‌గా సేవలు అందించాడు. అంతకుముందు ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ హస్సీ ఆడాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌కు హస్సీ ప్రచార కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడు. -
'ధోనినే తప్పుకుంటాడు'
న్యూఢిల్లీ:వన్డే, ట్వంటీ 20 వరల్డ్ కప్ లతో పాటు చాంపియన్స్ ట్రోఫీను అందుకున్న ఏకైక భారత కెప్టెన్ ధోని. ఇదిలా ఉంచితే, 2019 వరల్డ్ కప్ కు ధోనిని జట్టులో కొనసాగిస్తారా?లేదా? అనేది భారత క్రికెట్ లో గత కొంతకాలంగా నడుస్తున్న ప్రధాన చర్చ.అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ. అసలు ధోని విషయంలో ఎటువంటి చర్చ అవసరం లేదని మరోసారి స్పష్టం చేశాడు. 'వచ్చే వరల్డ్ కప్ వరకూ ధోనికి కొనసాగుతాడా?లేదా?అనేది అతనిపై మాత్రమే ఆధారపడుతుంది. అతను అప్పటివరకూ ఆడగలను అనుకుంటే కచ్చితంగా ఆడతాడు. ఒకవేళ భారత్ కు ఇక ప్రాతినిథ్యం వహించే సత్తా తనలో లేదని భావించిన మరుక్షణమే అక్కడ ధోని ఉండడు. ఇక్కడ ధోని నిజాయితీపై నమ్మకం ఉంచండి. దీని గురించి చర్చ అనవసరం. ధోని 36వ ఒడిలో ఉన్నప్పటికీ ఇంకా పోరాడే తత్వం అతనిలో ఉంది. క్రికెట్ అనే గేమ్ గురించి ధోని ఎంత బాగా తెలుసో.. తాను ఆడాలో లేదా అనేది కూడా ధోనికి అంతే బాగా తెలుసు. క్రికెట్ కెరీర్ కు ఉద్వాసన చెప్పే సమయం వచ్చిందని భావిస్తే వెంటనే వీడ్కోలు చెబుతాడు'అని హస్సీ అభిప్రాయపడ్డాడు. -
'ఫైనల్లో పాక్ ను తేలిగ్గా తీసుకోవద్దు'
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ పోరులో భారత్-పాకిస్తాన్ తలపడనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియా ఒకవైపు.. తొలి సారి టైటిల్ ను ఒడిసి పట్టుకోవాలని భావిస్తున్న పాకిస్తాన్ మరొకవైపు.. వెరసి ఇరు జట్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక్కడ భారత్ టైటిల్ ఫేవరెట్ గా ఉన్నప్పటికీ, పాకిస్తాన్ ను తక్కువ అంచనా వేయకూడదనేది మాజీల అభిప్రాయం. టైటిల్ పోరులో పాకిస్తాన్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ. రేపటి(ఆదివారం) ఫైనల్లో భారత్ ఫేవరెట్. అయితే పాకిస్తాన్ ను తక్కువగా అంచనా వేయకండి. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఫైనల్ కు వచ్చిన క్రమం ప్రతీజట్టును ఆశ్చర్యంలో ముంచెత్తింది. వన్డే ర్యాంకింగ్ లో ఎనిమిదో స్థానం ఉన్న పాకిస్తాన్ అంచనాలకు మించి ప్రదర్శన చేసింది. పాక్ కు ప్రతీ గేమ్ నాకౌట్ గా మారిన తరుణంలో ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఐసీసీ ట్రోఫీల్లో భారత్ పై పాక్ కు మెరుగైన రికార్డు లేకపోవచ్చు..కానీ చాంపియన్స్ ట్రోఫీలో రెండు సార్లు భారత్ ను ఓడించిన ఘనత పాక్ ది. దాంతో భారత్ జాగ్రత్తగా ఆడితేనే టైటిల్ ను నిలబెట్టుకుంటుంది'అని హస్సీ తెలిపాడు. -
ఎవరి గోతిని వారే తీసుకున్నట్లే: మైక్ హస్సీ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో ప్రదర్శనను చూసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కువ అంచనా వేయోద్దంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. జూన్ లో ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే కంగుతినడం ప్రత్యర్ధి జట్ల వంతు అవుతుందన్నాడు. అలా చేస్తే ఎవరి గోతిని వారే తీసుకున్నట్లేనని హితవు పలికాడు. 'కోహ్లీ ఎప్పటికీ కళాత్మక ఆటగాడు. ఐపీఎల్ లో అతడు విఫలమైన మాట వాస్తవమే. కానీ అది ఆ టోర్నీకి మాత్రమే పరిమితమని గుర్తుంచుకోవాలి. కోహ్లీ లాంటి బ్యాట్స్ మెన్ ను ఎక్కువ రోజులు కట్టడి చేయడం ఏ బౌలర్ కు సాధ్యపడదని గుర్తుంచుకోవాలి. ఐపీఎల్ వైఫల్యంతో ఉన్న కోహ్లీ చాంపియన్స్ ట్రోఫీలో అద్బుతాలు సృష్టిస్తాడు. కానీ ఇంగ్లండ్ లో ఆడాలంటే నిలకడ కొనసాగించాలి. అప్పుడే పరుగులు రాబట్టడం సులువు. ఐపీఎల్ లో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఫామ్ కొనసాగించడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ట్రోఫీని ఆసీస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని, ఫైనల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలపడతాయని' వెటరన్ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయపడ్డాడు. -
కోహ్లి ‘ప్రమాదకర వ్యక్తి’
అతనిపై స్లెడ్జింగ్ పనికిరాదు ∙ఆసీస్ జట్టుకు మైక్ హస్సీ హెచ్చరిక మెల్బోర్న్: టెస్టు సిరీస్ కోసం భారత గడ్డపై అడుగు పెట్టక ముందే ఆస్ట్రేలియా జట్టుకు అన్ని వైపుల నుంచి హెచ్చరికలు జారీ అవుతున్నాయి. స్పిన్ బౌలింగ్‌లో ఆడటం నేర్చుకోవాలంటూ ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ సలహా ఇవ్వగా... ఇప్పుడు ఆసీస్ మాజీ ఆటగాడు మైక్ హస్సీ కూడా ఇక్కడ ఎలా వ్యవహరించాలో సూచనలు చేశాడు. ముఖ్యంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అతను చెప్పాడు. కోహ్లిని అత్యంత ప్రమాదకర వ్యక్తిగా హస్సీ అభివర్ణించాడు. ‘ఆస్ట్రేలియా కోణంలో చూస్తే కోహ్లి నుంచే పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అతడిని ఆరంభంలోనే అవుట్ చేయాలి. కోహ్లిని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దు. అదే జరిగితే అతని ఆట మరింత పదునెక్కుతుంది. పోరాట స్వభావం ఉన్న కోహ్లి మైదానంలో సవాళ్లను ఇష్టపడతాడు’ అని హస్సీ వ్యాఖ్యానించాడు. కోహ్లిలాంటి ఆటగాడి కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించి అందుకు అనుగుణంగా ఆడాలే తప్ప దూషణకు దిగి ఆపలేరని, ఈ తరహా ప్రవర్తనతో ఆసీస్ కూడా ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంటుందని అతను హెచ్చరించాడు. అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన జట్టే గెలుస్తుంది తప్ప మాటల యుద్ధంతో కాదని హస్సీ విశ్లేషించాడు. కెప్టెన్ స్మిత్, వార్నర్ రాణించడంపైనే ఆస్ట్రేలియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయన్న హస్సీ... వారు విఫలమైతే మిగతా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగిపోతుందని అన్నాడు. -
ఆస్ట్రేలియా టి20 కోచ్‌గా మైక్ హస్సీ!
శ్రీలంకతో స్వదేశంలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే టి20 సిరీస్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు మాజీ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీ కోచ్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి. అదే నెలలో భారత్‌లో జరిగే టెస్టు సిరీస్ కోసం ప్రధాన కోచ్ డారెన్ లీమన్ జట్టు వెంట రానున్నారు. దాంతో శ్రీలంకతో జరిగే టి20 సిరీస్‌కు కోచ్ ఉండాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) హస్సీ పేరును పరిశీలిస్తోంది. 79 టెస్టులు ఆడిన హస్సీ ఈ ఏడాది భారత్‌లో జరిగిన టి20 ప్రపంచకప్ సందర్భంగా ఆస్ట్రేలియా జట్టుకు బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరించారు. -
'ఆ స్థానం కోహ్లిదే'
మెల్బోర్న్: భారత టెస్టు కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ ప్రశంసల వర్షం కురిపించాడు. నిలకడైన ఆట తీరుతో పరుగుల వరద పారిస్తున్న కోహ్లి తనదైన మార్కును సృష్టించుకున్నాడని కొనియాడాడు. భారత క్రికెట్ లో మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తరువాత స్థానం కచ్చితంగా విరాట్దేనన్నాడు. విరాట్ ఫిట్ నెస్‌ను కాపాడుకుంటే సచిన్ సరసన నిలవడం ఖాయమన్నాడు. సమకాలీన క్రికెట్లో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ల మాత్రమే కోహ్లికి పోటీగా నిలుస్తారని హస్సీ అభిప్రాయపడ్డాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి బ్యాట్ తో మెరుస్తున్న ఈ ముగ్గురి ఆటను చూడటాన్ని తాను ఎక్కువ ఇష్టపడతానన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో కోహ్లి 865 పరుగులు నమోదు చేసి ఎవరీకి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇందులో నాలుగు సెంచరీలుండటం విశేషం. ప్రపంచ క్రికెట్ లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిటి లిఖించుకున్న కోహ్లి.. ఐపీఎల్లో బెంగళూరుకు అద్భుతమైన విజయాలను సాధించి పెడుతూ అటు కెప్టెన్ గా, ఇటు ఆటగాడిగా ప్రశంసలందుకుంటున్నాడు. -
ఎందుకు ఆడుతున్నారో తెలుసుకోండి!
న్యూఢిల్లీ: ‘ కొంత మంది డబ్బు కోసం ఆడతారు. కొంత మందికి అమ్మాయిలు కావాలి. మరికొందరికి పార్టీలు, పేరు ప్రఖ్యాతులు ఇష్టం. కొందరు మాత్రమే క్రికెట్‌పై ఇష్టంతో ఆడతారు. ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరు అసలు తాము ఎందుకు ఆడుతున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరంతా నిజాయితీగా ఉండాలని నేను కోరుకుంటా. మీ అసలు లక్ష్యం ఏమిటో తెలుసుకొని వచ్చే సీజన్లోకి అడుగు పెట్టండి’...ఐపీఎల్-2లో బెంగళూరు చేతిలో ఓడి ఫైనల్ అవకాశం కోల్పోయిన అనంతరం తన చెన్నై జట్టు సహచరులతో కెప్టెన్ ధోని చెప్పిన మాటలు ఇవి. టీమ్‌లో ఐకమత్యం లేదని ఊహించిన ధోని, తనదైన శైలిలో స్ఫూర్తి నింపుతూనే, ఒక రకమైన హెచ్చరికతో ఈ ప్రసంగం చేశాడు. మైక్ హస్సీ తన తాజా పుస్తకంలో రాసిన ఆసక్తికర అంశాల్లో ఇదొకటి. -
భారత్‌కు కోచ్‌గా రమ్మన్నారు: మైక్ హస్సీ
గతంలో తనను భారత జట్టు కోచ్‌గా వ్యవహరించాలని కోరారని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ వెల్లడించాడు. గత ఏడాది ఐపీఎల్లో చెన్నై తరఫున ఆడుతున్న సమయంలో సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ తనని కలిశాడని, భారత కోచ్‌గా పని చేయాలని కోరారని తన తాజా పుస్తకం ‘విన్నింగ్ ఎడ్జ్’లో హస్సీ తెలిపాడు. అయితే కుటుంబంతో కలిసి కొంత సమయం గడపాలని భావించినందున ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపాడు. అంతకంటే ముందు శ్రీలంక జట్టుకు సహాయక కోచ్‌గా చేయమని జయవర్ధనే కూడా అడిగినట్లు హస్సీ తెలిపాడు. -
కోచ్ బాధ్యతలకు సిద్ధంగా లేను: హస్సీ
సిడ్నీ: భారత జట్టు కోచ్‌గా తన పేరును ఎంఎస్ ధోని ప్రతిపాదించాడనే కథనాలపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘నిజానికి ఆ సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానో లేదో తెలీదు. అదే నిజమైతే ఎంఎస్‌కు కృతజ్ఞతలు. కానీ నేనింకా క్రికెట్ ఆడుతున్నాను’ అని ప్రస్తుతం బిగ్‌బాష్ టోర్నీ బరిలో ఉన్న హస్సీ స్పష్టం చే శాడు. ప్రస్తుత భారత కోచ్ డంకెన్ ఫ్లెచర్ పదవీకాలం ఈ ప్రపంచకప్ అనంతరం ముగుస్తుంది. ఆయన తర్వాత హస్సీని కోచ్‌గా చేయాలని బీసీసీఐకి ధోని సూచించినట్టు వార్తలు వెలువడ్డాయి.