
భారత్‌కు కోచ్‌గా రమ్మన్నారు: మైక్ హస్సీ
గతంలో తనను భారత జట్టు కోచ్‌గా వ్యవహరించాలని కోరారని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ వెల్లడించాడు. గత ఏడాది ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఆడుతున్న సమయంలో సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ తనని కలిశాడని, భారత కోచ్‌గా పని చేయాలని కోరారని తన తాజా పుస్తకం ‘విన్నింగ్ ఎడ్జ్’లో హస్సీ తెలిపాడు. అయితే కుటుంబంతో కలిసి కొంత సమయం గడపాలని భావించినందున ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపాడు. అంతకంటే ముందు శ్రీలంక జట్టుకు సహాయక కోచ్‌గా చేయమని జయవర్ధనే కూడా అడిగినట్లు హస్సీ తెలిపాడు.