Sunrisers
-
‘హ్యాట్రిక్’ టైటిల్‌పై సన్‌రైజర్స్ గురి
సెంచూరియన్: భారత్‌కు చెందిన సన్‌రైజర్స్ యాజమాన్యంలోని ఈస్టర్న్ కేప్ జట్టు దక్షిణాఫ్రికా టి20 లీగ్(South Africa T20 League)లో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై కన్నేసింది. ‘ఎస్ఏ20’ పేరిట జరుగుతున్న ఈ టోర్నీలో రెండుసార్లు చాంపియన్ అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్(Sunrisers Eastern Cape team) వరుసగా మూడోసారి ఫైనల్స్‌కు అర్హత పొందింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ 8 వికెట్ల తేడాతో పార్ల్ రాయల్స్‌పై జయభేరి మోగించింది. 2023, 2024 సీజన్లలో సన్‌రైజర్స్ జట్టే టైటిల్స్‌ను గెలుచుకుంది. రెండో క్వాలిఫయర్‌లో మొదట రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రూబిన్ హెర్మన్ (53 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రిటోరియస్ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లు క్రెయిగ్ ఓవర్టన్, జాన్సెన్, ఒటెనీల్, మార్క్రమ్ తలా ఒక వికెట్ తీశారు. తర్వాత సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 19.2 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసి గెలిచింది. టోని డి జొర్జి (49 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మాన్ (48 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించి జట్టును సులువుగా లక్ష్యానికి చేర్చారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో జొబర్గ్ సూపర్‌కింగ్స్‌ను ఓడించిన 24 గంటలకే మరో ప్లేఆఫ్స్ మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ నెగ్గి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. నేడు జరిగే ఫైనల్లో భారత్‌కు చెందిన ముంబై ఇండియన్స్ యాజమాన్యంలోని ఎంఐ కేప్‌టౌన్‌తో తలపడుతుంది. తొలి క్వాలిఫయర్‌లో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నేతృత్వంలోని కేప్‌టౌన్ జట్టు 39 పరుగుల తేడాతో పార్ల్ రాయల్స్‌పై గెలిచింది. -
IPL 2024: పిచ్చెక్కిస్తున్న సన్‌రైజర్స్.. ఈసారి టైటిల్ పక్కా..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఏ రేంజ్లో రెచ్చిపోతున్నారో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనంతగా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇంతటి సమతూకమైన జట్టు బహుశా పొట్టి క్రికెట్ చరిత్రలో ఎక్కడా లేదనే చెప్పవచ్చు. బ్యాటింగ్ విభాగంలో సన్‌రైజర్స్ ప్రదర్శన న భూతో న భవిష్యతి అన్న చందంగా ఉంది. ఈ జట్టులో ఉన్నటువంటి విధ్వంసకర వీరులు యావత్ పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఏ జట్టులోనూ లేరు. ఓపెనర్ల దగ్గరి నుంచి ఎనిమిది, తొమ్మిదో స్థానం ఆటగాళ్ల వరకు అందరూ మెరుపు వీరులే ఉన్నారు.ఓపెనర్లు అభిషేక్, హెడ్ ఊచకోత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీరిద్దరు తమకెదురైన ప్రతి బౌలర్‌ను గడగడలాడిస్తున్నారు. వీరి దెబ్బకు బ్యాటింగ్ రికార్డులు ఒక్కొటిగా బద్దలవుతూ ఉన్నాయి. వీరిద్దరి తర్వాత బ్యాటింగ్‌కు దిగే మార్క్రమ్, క్లాసెన్ విధ్వంసం ఇంకో లెవెల్లో ఉంది. వీరు కూడా తమేమీ తక్కువ కాదు అన్నట్లు విధ్వంసం సృస్టిస్తున్నారు.మార్క్రమ్ గత కొన్ని మ్యాచ్‌లుగా లయ తప్పినట్లు కనిపిస్తున్నా క్లాసెన్ మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి రెచ్చిపోతున్నాడు. ఈ నలుగురితో పాటు యువ ఆల్‌రౌండర్లు నితీశ్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్‌లు కూడా తమ దాకా వస్తే మెరుపులు మెరిపిస్తున్నారు.బౌలింగ్ విభాగంలో సైతం సన్‌రైజర్స్ చాలా పటిష్టంగా ఉంది. స్వింగ్ సుల్తాన్ భునేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇతనికి కమిన్స్, నటరాజన్, ఉనద్కత్ తోడవుతున్నారు. నిన్న లక్నోతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం స్పిన్నర్ విజయ్‌కాంత్ వియాస్కాంత్ పర్వాలేదనిపించాడు. షాబాజ్ అహ్మద్, నితీశ్ రెడ్డి కూడా బంతితో రాణిస్తున్నారు.సన్‌రైజర్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలతో పాటు ఫీల్డింగ్‌లోనూ పటిష్టంగా ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో నితీశ్, సన్వీర్ సింగ్ పట్టిన క్యాచ్‌లే ఇందుకు నిదర్శనం. ఈ సీజన్లో సన్‌రైజర్స్ బెంచ్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఎంతలా అంటే.. బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లతో మరో సమతూకమైన జట్టును తయారు చేయవచ్చు. మొత్తంగా ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ గతంలో ఎన్నడూ లేనట్లు అత్యంత పటిష్టంగా కనిపిస్తూ టైటిల్ దిశగా పరుగులు పెడుతుంది. ఈసారి సన్‌రైజర్స్ టైటిల్ ఎగరేసుకుపోవడం పక్కా అని అభిమానులు ధీమాగా ఉన్నారు. విశ్లేషకులు, మాజీలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. -
RCB: గెలిచి నెలైంది.. ఆ మాత్రం ఉంటుందిలే.. విరాట్‌పై దారుణమైన ట్రోల్స్!
ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీకి ఎట్టకేలకు రెండో విజయం లభించింది. నిన్న సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన అనంతరం ఆ జట్టుకు వరుస పరాజయాల నుంచి ఊరట లభించింది. నిన్నటి మ్యాచ్‌లో డుప్లెసిస్ సేన సన్‌రైజర్స్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించి, పరాభావాల పరంపరకు పుల్‌స్టాప్ పెట్టింది. మార్చి 25న పంజాబ్‌పై సీజన్ తొలి విజయం సాధించిన ఆర్సీబీ.. సరిగ్గా నెల రోజుల తర్వాత ఏప్రిల్ 25న మరో విజయం నమోదు చేసింది. ఈ మధ్యలో ఆ జట్టు డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకుంది. Happiness on Virat Kohli's face after the win. ❤️ pic.twitter.com/RRRZ1ViWux— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024 ఈ విజయం అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, ముఖ్యంగా విరాట్ కోహ్లి చిన్నపిల్లాడిలా సంబురాలు చేసుకోవడం టాక్ ఆఫ్ ద సోషల్‌మీడియాగా మారింది. ఏదో టైటిల్ గెలిచినట్లు ఆనందపడిపోతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. Cameron Green hugging Virat Kohli. ❤️ pic.twitter.com/Zl4StHBu6b— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024 మ్యాచ్ గెలిచి నెల అవుతుంది కదా.. ఆ మాత్రం ఉంటుందిలే అని మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఆర్సీబీ ఆటగాళ్ల విజయోత్సవ సంబురాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలను ఆర్సీబీ వ్యతిరేకులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. RCB REGISTERED A WIN IN THEIR 250TH IPL MATCH. 🫡- A victory against one of the most dangerous sides of IPL 2024. 👌pic.twitter.com/UWn3pZD0OS— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024 నిన్నటి మ్యాచ్‌లో నిదానంగా ఆడినందుకు కూడా విరాట్ కోహ్లి దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. విరాట్ వ్యక్తిగత మైలురాళ్ల కోసమే ఆడతాడన్న విషయం మరోసారి రుజువైందని నెటిజన్లు మండిపడుతున్నారు. The emotional hug between Virat Kohli and Faf Du Plessis after the win. ❤️ pic.twitter.com/cb0PlDhS5z— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2024 రజత్ పాటిదార్ పుణ్యమా అని ఆర్సీబీ గెలిచింది కానీ.. ఫలితం తారుమారు అయ్యుంటే మాత్రం ఆర్సీబీ అభిమానులే కోహ్లిని ఏకిపారేసి ఉండేవారు. నిన్నటి మ్యాచ్‌లో పాటిదార్ 20 బంతుల్లో 50 పరుగులు చేస్తే.. విరాట్ 51 పరుగులు చేసేందుకు 43 బంతులు తీసుకున్నాడు. హాఫ్ సెంచరీకి ముందు విరాట్ చాలా బంతులు వేస్ట్ చేశాడు. అతనిలో వ్యక్తిగత మైలురాళ్లు అధిగమించాలనే ఉద్దేశం స్పష్టంగా బయటపడింది. ఇదే అభిమానులకు చిర్రెత్తిపోయేలా చేసింది.జట్టు కోసం ఎలా ఆడాలో రోహిత్‌ను చూసి నేర్చుకో అంటూ అభిమానులు చురకలంటిస్తున్నారు. మొత్తానికి మాసం తర్వాత లభించిన విజయానికి అతిగా స్పందించడం.. నిదానంగా ఆడటం వంటి కారణాల చేత విరాట్ నిన్నటి నుంచి ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. -
IPL 2024 RCB Vs SRH: ఆర్సీబీ బౌలింగ్.. నభూతో నభవిష్యతి..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ ఎంత ఛండాలంగా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సీజన్లో ఆ జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా కనీస స్థాయి బౌలర్‌గా కనిపించడం లేదు. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న విదేశీ పేసర్లు అల్జరీ జోసఫ్, కెమరూన్ గ్రీన్, రీస్ టాప్లే, లోకీ ఫెర్గూసన్ గల్లీ స్థాయి బౌలర్లకంటే హీనంగా బౌలింగ్ చేస్తుండగా.. స్వదేశీ హీరోలు సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ తామేమీ తక్కువ కాదన్నట్లు పోటీపడి పరుగులు సమర్పించుకుంటున్నారు. సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో అయితే ఆర్సీబీ బౌలర్ల చెత్త ప్రదర్శన శృతి మించిపోయింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు బౌలర్లు తమ కోటా నాలుగు ఓవర్లలో 50పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఇంత మంది ఫిఫ్టి ప్లస్ స్కోర్లు సమర్పించుకోవడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో రీస్ టాప్లే 68, విజయ్‌కుమార్ 64, ఫెర్గూసన్ 52, యశ్ దయాల్ 51 పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీ చెత్త బౌలింగ్ కారణంగా సన్‌రైజర్స్ బ్యాటర్లు పేట్రేగిపోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను నమోదు చేశారు. ఆర్సీబీ బౌలర్ల చెత్త ప్రదర్శనను ఎప్పుడూ వెనకేసుకొచ్చే సొంత అభిమానులే జీర్ణించుకోలేకతున్నారు. ఆర్సీబీ బౌలింగ్.. నభూతో నభవిష్యతి అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో విరాట్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీని గెలిపించలేకపోయారు. ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
IPL 2024 RCB VS SRH: ఓడినా ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేసిన ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్లో నిన్న (ఏప్రిల్ 15) అత్యంత రసవత్తరమైన సమరం జరిగింది. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో ఎన్నో టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్.. ఓ టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన అత్యధిక స్కోర్ (సన్‌రైజర్స్ 287 + ఆర్సీబీ 262 = 549 పరుగులు).. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు (ఆర్సీబీ-22).. ఓ టీ20 మ్యాచ్‌లో నమోదైన అత్యధిక బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81).. ఇలా ఈ మ్యాచ్‌లో చాలావరకు పొట్టి క్రికెట్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇదే మ్యాచ్‌లో మరో భారీ రికార్డు కూడా నమోదైంది. ఆర్సీబీ మ్యాచ్ ఓడినప్పటికీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ (262) చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ముంబై ఇండియన్స్ ఇదే సీజన్లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ (సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ) 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆర్సీబీ.. మరో రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా డ్యూయల్ రికార్డు నమోదు చేసింది. 2017 సీజన్లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 49 పరుగులకే ఆలౌటైంది. ఈ స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌గానూ రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
ఉప్పల్ మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సోల్డ్ అవుట్.. అభిమానులకు మరోసారి నిరాశే
సాక్షి, హైదరాబాద్: నగరంలో క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. మరోసారి ఉప్పల్ మ్యాచ్ టికెట్స్ దొరకకుండా చేసారంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్‌లో ఈ నెల 25న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, మే 2న రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టికెట్లను పేటీఎంలో నిర్వాహకులు విక్రయానికి పెట్టారు. పెట్టిన మరునిమిషమే సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయని అభిమానుల ఆవేదన చెందుతున్నారు. పేటీఎంలో ఎన్ని టికెట్స్ విక్రయిస్తున్నారో సన్‌రైజర్స్ యాజమాన్యం లెక్క చెప్పడం లేదు. టిక్కెట్లు దొరక్క అభిమానుల తీవ్ర నిరాశ చెందుతున్నారు. బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారంటూ మండిపడుతున్నారు. ఇదీ చదవండి: వారెవ్వా.. ఐపీఎల్ చరిత్రలోనే సూపర్ క్యాచ్! రోహిత్ షాక్ (వీడియో) -
సన్‌పోరు సమాప్తం
-
ధోని ఈజ్ బ్యాక్
-
ధోని ఈజ్ బ్యాక్.. పుణే రైజింగ్ విక్టరీ
► రాణించిన రాహుల్ త్రిపాఠి (59) పుణే: సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే ల మధ్య జరిగిన ఉత్కంఠకర మ్యాచ్ లో ధోని విరోచిత బ్యాటింగ్ తో రైజింగ్ పుణే 6 వికెట్ల తేడాతొ విజయం సాధించింది. గత కొద్ది రోజులుగా తనపై విమర్శలు చేస్తున్న విమర్శకులకు ధోని తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. దాదాపు ఓటమి అంచులకు చేరిన జట్టును తన హిట్టింగ్ బ్యాటింగ్ తో విజయాన్ని అందించి మరో మారు మంచి హిట్టరని నిరూపించుకున్నాడు. 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 69 పరుగులు చేసిన ధోని పుణే వరుస పరాజయాలకు బ్రేక్ వేశాడు. ఇక హోం గ్రౌండ్ మ్యాచుల్లో వరుసగా గెలిచి, బయటి గ్రౌండ్ లో ఓడుతున్న సన్ రైజర్స్ కు మరో ఓటమి తప్ప లేదు. చివరి వరకు కట్టు దిట్టంగా బౌలింగ్ చేసిన సన్ రైజర్స్ బౌలర్స్ చివరి ఓవర్లో ధోని బ్యాటింగ్ కు చేతులెత్తెశారు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పుణే కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అజింక్యా రహానే (2) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన పుణే కెప్టెన్ స్మిత్, త్రిపాఠితో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. సిరాజ్ వేసిన 5 ఓవర్ తొలి బంతికి రాహుల్ త్రిపాఠి ఇచ్చిన క్యాచ్ ను బిపుల్ శర్మ మిస్ చేయడంతో సన్ రైజర్స్ తగిన మూల్యం చేల్లించుకుంది. అనంతరం రెచ్చిపోయిన త్రిపాఠి సిరాజ్ బౌలింగ్ లో సిక్స్, ఫోర్ తో చెలరేగి 13 పరుగులు రాబట్టాడు. ఈ దశలో 32 బంతుల్లో త్రిపాఠి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నిలకడగా ఆడుతున్న ఈ జంటను రషీద్ ఖాన్ 11 ఓవర్లో తన అద్భుతమైన బంతితో స్మిత్ ను బోల్డ్ చేశాడు. దీంతో వీరద్దరీ 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని సన్ రైజర్స్ బౌలర్స్ కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆచి తూచి ఆడాడు. ఈ తరుణంలో14 ఓవర్లో రాని పరుగు కోసం ప్రయత్నించిన త్రిపాఠి(59) రషీద్ గుడ్ త్రోకు రనౌట్ అయ్యాడు. వెంటనే బెన్ స్టోక్స్ అవుట్ కావడంతో మ్యాచ్ సన్ రైజర్స్ చేతిలోకి వచ్చింది. చివర్లో సిరాజ్ వేసిన 18 ఓవర్లో ధోని వరుస బంతుల్లో సిక్సర్, ఫోర్ తో విరుచుకుపడటంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. భువనేశ్వర్ వేసిన 19 ఓవర్లలో వరుస బంతులను ధోని బౌండరికి తరలించి, సిక్స్ కొట్టడంతో 19 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో పుణే విజయానికి 11 పరుగులు కావల్సి ఉండగా చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగింది. చివరి బంతిని ధోని బౌండరీకి తరలించడంతో పుణే విజయం సాధించింది. -
గాడిన పడతారా..?
►నేడు పంజాబ్‌తో తలపడనున్న సన్‌రైజర్స్ ►వరుస ఓటములతో హైదరాబాద్ బేజారు హైదరాబాద్: ఐపీఎల్లో మరో రసవత్తర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టోర్నీ అరంభంలో దూకుడు ప్రదర్శించి.. ప్రస్తుతం పరాజయాల బాట పట్టిన హైదరాబాద్–పంజాబ్ జట్ల మధ్య సోమవారం మ్యాచ్ జరుగనుంది. ఈమ్యాచ్‌లో నెగ్గి తిరిగి గాడిలో పడాలని ఇరుజట్లు యోచిస్తున్నాయి. సొంతగడ్డపై అనుకూలత.. ఈ సీజన్లో సొంతగడ్డపై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ విజయం సాధించింది. అనంతరం కోల్‌కతా, ముంబైలతో జరిగిన మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం పంజాబ్‌తో మ్యాచ్ సొంతగడ్డపై జరుగుతుండడం సన్‌రైజర్స్‌కు సానూకూలాంశంగా చెప్పుకోవచ్చు. దీంతో ఈమ్యాచ్‌లో విజయం సాధించి తిరిగి గాడిలో పడాలని ఆజట్టు యోచిస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు మూలస్తంబంగా నిలుస్తున్నాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్‌తో కలిసి జట్టుకు శుభారంభాన్నిస్తున్నాడు. అయితే మిడిలార్డర్లో మోజెస్ హెన్రిక్స్, యువరాజ్ సింగ్, దీపక్ హుడా తదీతరులు విఫలమవుతున్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్ బెన్ కట్టింగ్, నమన్ ఓజా కూడా తమ బ్యాట్లకు పనిచెప్పాల్సి ఉంది. సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. టోర్నీలో పది వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ నీలి రంగు టోపీని హస్తగతం చేసుకున్నాడు. మరోవైపు ఆఫ్గాన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ ఏడు వికెట్లతో టాప్–త్రీలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఆశిష్ నెహ్రా రాణిస్తున్నాడు. ప్రస్తుతం రెండు విజయాలు, రెండు పరజయాలతో కొనసాగుతున్న హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో ఎలాగైన నెగ్గాలని భావిస్తోంది. వరుస ఓటములతో పంజాబ్ డీలా.. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ది కూడా సన్‌రైజర్స్ లాంటి పరిస్థితే. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గిన పంజాబ్.. అనంతరం జరిగిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిపాలైంది. ముఖ్యంగా టాపార్డర్ విఫల కావడం జట్టును కలవరపరుస్తోంది. జట్టులో మేటి ఆటగాళ్లైన కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్, ఇయాన్ మోర్గాన్, హషీమ్ ఆమ్లా సత్తా చాటాలని జట్టు ఆశిస్తోంది. మరోవైపు ఢిల్లీతో మ్యాచ్‌లో చివరి ఓవర్లలో పరుగులను భారీగా సమర్పించుకోవడం జట్టును దెబ్బతీసింది. దీన్ని ఎలాగైనా సరిదిద్దుకోవాలని జట్టు యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తుంది. బౌలర్లలో ఇషాంత్ శర్మ, మోహిత్ శర్మలపై ఆశలు పెట్టుకుంది. గతంలో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించడం, ఇక్కడి పరిస్థితులపై అవగాహన ఉండడం లాంటి అంశాలతో ఇషాంత్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశముంది. పాయింట్ల పట్టికలో చెరో నాలుగు పాయింట్లతో ఉన్న ఈ జట్లు ఈ మ్యాచ్‌లో నెగ్గి విజయమంత్రాన్ని అందుకోవాలని ఇరుజట్లు యోచిస్తున్నాయి. -
వికెట్ల ధీరుడు ’రషీద్’
-
ధనాధన్ క్రికెట్‌కు సిద్దమవుతున్న ఆటగాళ్లు
-
నేను అదృష్టవంతుడిని...
►నా ఎంపికను నేనే నమ్మలేకపోయా ►అఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ హైదరాబాద్: ‘ఐపీఎల్ వేలంను టీవీలో చూశాను. వరల్డ్ నంబర్‌వన్ బౌలర్, లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ పేరు వచ్చినప్పుడే ఎవరూ స్పందించలేదు. దాంతో ఇక నన్ను ఎవరు పట్టించుకుంటారని అనుకున్నా. కానీ సన్‌రైజర్స్ భారీ మొత్తానికి నన్ను ఎంచుకుంది. నిజంగా నన్ను నేనే నమ్మలేకపోయా’... తన ఐపీఎల్ ఎంపికపై అఫ్ఘానిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ స్పందన ఇది. 18 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అతడిని సన్‌రైజర్స్ జట్టు రూ. 4 కోట్లకు తీసుకోవడం విశేషం. ఇంత పెద్ద లీగ్‌లో ఆడగలగడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అతను చెప్పాడు. పదకొండు మంది సభ్యుల కుటుంబం నుంచి వచ్చిన రషీద్, ఈ స్థాయికి చేరేందుకు చాలా శ్రమించినట్లు చెప్పాడు. ‘క్రికెట్ ఆడేందుకు మా దేశంలో పరిస్థితులు చాలా కష్టంగా, కఠినంగా ఉండేవి. కనీస స్థాయి సౌకర్యాలు లేవు. చెప్పుకోదగ్గ మైదానాలే కనిపించవు. అయితే కుటుంబ సభ్యుల అండదండలు, అఫ్ఘాన్ బోర్డు సహకారంతో నేను ఎదగగలిగాను. ఇప్పుడు అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులు కాస్త మెరుగయ్యాయి కానీ మా దేశం నుంచి మరింత మంది ఆటగాళ్లు రావాలంటే మేం ఎక్కువ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది’ అని రషీద్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వల్ల అనేక మంది దిగ్గజాలతో కలిసే అవకాశం తనకు దక్కిందని ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. తనతో పాటు రైజర్స్‌కు ఎంపికైన నబీ కూడా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇక్కడి దాకా రాగలిగాడని, మంచి ప్రదర్శనతో తాము ప్రపంచం దృష్టిని ఆకర్షించగలమని ఖాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. -
ముస్తఫిజుర్ ఆడతాడు!
సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ హైదరాబాద్: ఐపీఎల్–10కు బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రహమాన్ పూర్తిగా దూరమైనట్లు వస్తున్న వార్తలపై తమకు స్పష్టత లేదని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కోచ్ టామ్ మూడీ అన్నారు. గత ఏడాది రైజర్స్ జట్టు చాంపియన్‌గా నిలవడంలో ముస్తఫిజుర్ కూడా కీలక పాత్ర పోషించాడు. శుక్రవారంలోగా అతను జట్టుతో చేరే అవకాశం ఉందని మూడీ వెల్లడించారు. ‘మాకున్న సమాచారం ప్రకారం ఈ నెల 7న ముస్తఫిజుర్ రావాలి. అతను రావడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కాబట్టి అతను ఐపీఎల్లో ఆడతాడనే భావిస్తున్నాం’ అని మూడీ చెప్పారు. డిఫెండింగ్ చాంపియన్‌గా తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని, గత ఏడాది విజయం ముగిసిన అధ్యాయమని కోచ్ చెప్పారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ వంద శాతం ఫిట్‌గా ఉన్నాడని, ఆస్ట్రేలియా నుంచి సరైన సమయంలో తిరిగొస్తాడని చెప్పిన మూడీ... శిఖర్ ధావన్ ఫామ్‌పై కూడా తాము ఆందోళన చెందడం లేదని స్పష్టం చేశారు. ఇద్దరు అఫ్ఘాన్ ఆటగాళ్లు నబీ, రషీద్ తమ జట్టుకు అదనపు బలంగా భావిస్తున్నట్లు ఈ ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ అభిప్రాయపడ్డారు. మరోవైపు సన్‌రైజర్స్ ఆటగాళ్లు క్రిస్ జోర్డాన్, బెన్ లాఫ్లిన్ ఈ సీజన్లో తాము అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. -
సిరాజ్ బన్‌గయా కరోడ్‌పతి
వేలంలో రూ. 2.6 కోట్లకు సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్: ‘మా అమ్మా నాన్న కోసం ఇప్పుడు ఒక మంచి ఇల్లు కొంటాను. వేలంలో భారీ విలువ పలికాక నా మనసులో వచ్చిన ఆలోచన అదొక్కటే’... హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ మనసులో మాట ఇది. మాసాబ్‌ట్యాంక్ సమీపంలోని ఖాజానగర్‌లో ఉన్న ఒక ఇరుకైన అద్దె ఇల్లు సోమవారం ఒక్కసారిగా జనసంద్రంతో నిండిపోయింది. లెక్క లేనంత సంఖ్యలో ఉన్న సిరాజ్ మిత్రులు, పాత బంధువులు, కొత్తగా పరిచయం చేసుకున్న మరికొందరితో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆటో డ్రైవర్ గౌస్ కొడుకైన సిరాజ్ కేవలం స్వయంకృషి, పట్టుదలతో సాధించిన పేరు అది. రాజకీయాలు, సిఫారసులకు అడ్డా అయిన హైదరాబాద్ క్రికెట్లో కేవలం ప్రతిభపైనే ఈ 22 ఏళ్ల పేసర్ దూసుకొచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్లో భారీ మొత్తంతో దేశం దృష్టినీ అతను ఆకర్షించాడు. స్నేహితుల మధ్య టెన్నిస్ బాల్‌తో గల్లీ క్రికెట్లోనే ప్రపంచం... పెద్దోడు ఇంజినీరింగ్ చదివాడు, నువ్వు ఎప్పుడు బాగుపడతావురా? అని తల్లి షబానా ఆందోళన... ఆటో డ్రైవర్‌గా సంపాదన సరిపోవడం లేదని తండ్రి అంటే చివరకు కొంతయినా భారం తగ్గిద్దామని ఇళ్లకు పెయింట్ వేసే పని కూడా చేశాడు... కానీ సిరాజ్ ఎప్పుడూ కష్టపడేందుకు వెనుకాడలేదు. తాను ఇష్టపడిన బౌలింగ్‌లోనే తల్లిదండ్రులు గర్వపడేలా చేశాడు. ఇకపై గౌస్‌కు మళ్లీ ఆటో నడిపించాల్సిన అవసరం లేదు. ఎక్కడా ప్రాథమిక అంశాలు నేర్చుకోకుండా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్న సిరాజ్‌లోని సహజ ప్రతిభను అద్నాన్ అనే కోచ్ గుర్తించాడు. ఆయన మార్గనిర్దేశనంలో లీగ్ స్థాయి క్రికెట్ ఆడటం, అక్కడ 59 వికెట్లతో హెచ్‌సీఏ సెలక్టర్ల దృష్టిలో పడటం చకచకా జరిగిపోయాయి. హైదరాబాద్ అండర్–23 జట్టు తరఫున 29 వికెట్లు పడగొట్టడంతో వెంటనే రంజీల్లో చోటు దక్కింది. గత ఏడాది ఒక మ్యాచ్‌కే పరిమితమైనా ఈ సీజన్లో 41 వికెట్లతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఇరానీ కప్, ఇండియా ‘ఎ’ టీమ్‌లోకి ఎంపిక కావడంలో ఎలాంటి అడ్డంకీ రాలేదు. ఇప్పుడు ఐపీఎల్ కాంట్రాక్ట్‌తో ఈ హైదరాబాద్ కుర్రాడు మరో మెట్టు ఎక్కాడు. -
ఆటో డ్రైవర్ కొడుకు ఐపీఎల్‌కు సెలక్ట్ అయ్యాడు
-
హైదరాబాద్ అభిమానులకు పండగ
నగరంలోనే ఐపీఎల్–10 తొలి మ్యాచ్ ఫైనల్ ఏప్రిల్ 5 నుంచి మే 21 వరకు టోర్నీ ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2017) పదో సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం విడుదల చేసింది. గత ఏడాది లీగ్ చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిబంధనల ప్రకారం తమ సొంతగడ్డపైనే తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకుంది. ఏప్రిల్ 5న ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మొదటి పోరులో సన్‌రైజర్స్‌తో 2016 రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఐపీఎల్ పదో సీజన్లో మొత్తం 47 రోజుల పాటు 10 వేదికలలో లీగ్ నిర్వహిస్తారు. మే 21న ఫైనల్ మ్యాచ్ కూడా హైదరాబాద్‌లోనే జరుగుతుంది. రెండు క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌ల వేదికలను తర్వాత ప్రకటిస్తారు. 2011 తర్వాత ఇండోర్‌లో మరోసారి ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండటం విశేషం. ఎప్పటిలాగే ప్రతీ జట్టు 14 లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో 7 మ్యాచ్‌లను సొంతగడ్డపై, మరో 7 మ్యాచ్‌లను ప్రత్యర్థి మైదానాల్లో ఆడుతుంది. 2017 ఐపీఎల్ కోసం ఈ నెల 20న బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. రూ.2 కోట్ల నుంచి రూ. 10 లక్షల మధ్య కనీస విలువతో వేలం కోసం మొత్తం 351 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. -
అభిమానుల కోసం ఐపీఎల్ ట్రోఫీ
హైదరాబాద్: ఐపీఎల్-9లో చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ జట్టు సాధించిన ట్రోఫీని అభిమానులు చూసే అవకాశాన్ని కల్పించింది ఆ జట్టు యాజమాన్యం. ఐపీఎల్ ట్రోఫీని శనివారం ఇనార్బిట్ మాల్లో, ఆదివారం ఫోరం సుజనామాల్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వ రకు ట్రోఫీని అభిమానులకు అందుబాటులో ఉంచుతారు. జట్టు గెలవడంలో హైదరాబాదీల సహకారం మరువలేనిదని యాజమాన్యం పేర్కొంది. ‘అభిమానుల సహకారం, వారి ప్రోత్సాహం జట్టులో స్ఫూర్తిని కలిగించాయి. వీరి అభిమానమే జట్టు విజేతగా నిలిచి కప్ గెలవడానికి కారణమైంది. వారి సహకారాన్ని గుర్తించేందుకు మేము చేస్తున్న చిన్న ప్రయత్నం ఇది’ అని సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కె. షణ్ముగం వ్యాఖ్యానించారు. -
ఐపీఎల్ ట్రోఫీ నాకు ప్రపంచకప్‌తో సమానం: యువరాజ్
తొమ్మిదో ప్రయత్నంలో ఐపీఎల్ ట్రోఫీ తన చేతుల్లోకి రావడం పట్ల సన్‌రైజర్స్ ఆటగాడు యువరాజ్ సింగ్ అమితానందం వ్యక్తం చేశాడు. ఇన్నాళ్లకు తన కోరిక తీరిందన్నాడు. గతంలో అండర్-19 ప్రపంచకప్‌తో పాటు వన్డే, టి20 వరల్డ్ కప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత జట్టులో ఉన్న యువరాజ్...ఐపీఎల్ టైటిల్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పాడు. ‘నేను ప్రపంచకప్‌లు గెలిచినా ఐపీఎల్ ఒక్కసారి కూడా దక్కలేదు. ఎనిమిదేళ్ల తర్వాత ఆ క్షణం వచ్చింది. ఇదో గొప్ప అనుభూతి. ఇప్పుడు నా దృష్టిలో ఇది ప్రపంచకప్‌లతో సమానమైన విజయం’ అని యువీ అన్నాడు. -
డోన్ట్ వర్రి ముస్తఫా..!
మణికట్టును గుండ్రంగా తిప్పితే అతను స్లో బాల్ వేయబోతున్నట్లు... తన తలపై చేతిని పెడితే తర్వాతి బంతిని బౌన్సర్ విసరబోతున్నట్లు... ఆంగ్లంలో తెలిసినవి రెండే పదాలు ప్రాబ్లం, నో ప్రాబ్లం... ఐపీఎల్లో సన్‌రైజర్స్ విజయపరంపరలో కీలకంగా నిలిచిన ముస్తఫిజుర్ రహమాన్ తిప్పలు ఇవి. సీజన్లో సూపర్ సక్సెస్‌గా నిలిచినా...బెంగాలీ తప్ప మరో భాష రాకపోవడంతో అతను పాపం ఎక్కడో అడవిలో ఉన్నట్లే గడపాల్సి వచ్చింది. సహచరుడు రికీ భుయ్ ఆదుకోకపోతే ముస్తఫిజుర్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది. నాకు నచ్చనివి రెండే విషయాలు... ఒకటి బ్యాటింగ్ చేయడం, రెండు ఇంగ్లీష్‌లో మాట్లాడటం... అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టిననాటినుంచి ముస్తఫిజుర్ చెప్పే రెగ్యులర్ డైలాగ్ ఇది. బంగ్లాదేశ్ జాతీయ జట్టులో అందరికీ బెంగాలీ వచ్చు కాబట్టి సమస్య రాలేదు. కానీ ఐపీఎల్ దగ్గరికి వచ్చే సరికి మాత్రం అతని గుండెల్లో రాయి పడింది. ఇంత సుదీర్ఘ సమయం పాటు అతను సొంత దేశపు ఆటగాళ్లు, వాతావరణంనుంచి ఎప్పుడూ దూరంగా లేడు. ఒక ప్రొఫెషనల్ ఆటగాడిగా ఇలాంటి సందర్భాలు తరచుగా వస్తూనే ఉంటాయి. కానీ మాతృభాష బెంగాలీ తప్ప ఇంగ్లీష్‌లో ఒక్క ముక్క కూడా రాకపోవడం అతని బాధను మరింత పెంచింది. ఆ భయంతోనే బయట ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా మ్యాచ్, ప్రాక్టీస్ లేని సమయంలో అతను హోటల్లోనే ఉండిపోయేవాడు. బెంగాలీ మాట్లాడేవారు పక్కన లేకపోతే అతను చాలా ఇబ్బందికి గురవుతాడు. అందుకే హైదరాబాద్‌లో పంజాబ్‌పై మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా నిలిచినప్పుడు కూడా ప్రసారకర్తలు అతనితో మాట్లాడించలేకపోయారు. ఇలాంటి సమయంలో రికీ భుయ్ రూపంలో ముస్తఫిజుర్‌కు ఆపద్బాంధవుడు దొరికాడు. ఆంధ్ర క్రికెటర్ భుయ్‌కు తన కుటుంబ నేపథ్యం కారణంగా బెంగాలీ బాగా వచ్చు. ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని భుయ్, జట్టుకు ఫుల్‌టైమ్ 12వ ఆటగాడిగా, అనువాదకుడిగా పని చేశాడు. సంకేత భాషలే... ఆటకు భాషతో పనేముంది, క్రికెట్ విశ్వ భాష అంటూ ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. కానీ మ్యాచ్‌లో కీలక సమయంలో వ్యూహాలు రచించడానికి, తమ భావం సరిగ్గా వివరించేందుకు భాష కావాలి. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేవలం ముస్తఫిజుర్ కోసం కొంత ప్రయత్నం కూడా చేశాడట. గూగుల్ ట్రాన్స్లేటర్లో బెంగాలీ పదాలను నేర్చుకోవాలని చూశాడు. కానీ అది సరిపోలేదు. దాంతో రైజర్స్ మేనేజ్మెంట్ ముస్తఫిజుర్ బాధ్యతను ఇక రికీ చేతుల్లో పెట్టేసింది. 2014 అండర్-19 ప్రపంచకప్ నాటినుంచి ముస్తఫిజుర్, భుయ్‌కు స్నేహం ఉంది. ‘టీమ్ సమావేశాల్లో ముస్తఫిజుర్‌కు ఎవరూ ఏమీ చెప్పరు. అంతా మ్యాచ్ జరిగే సమయంలోనే, ముఖ్యంగా టైమౌట్ సందర్భంగానే అతనికి తగిన సందేశం వెళుతుంది. తొలి పది ఓవర్లలో అయితే ఎలా బౌలింగ్ చేయాలి, తర్వాతి పది ఓవర్లలో ఏం చేయాలి, ఏ బ్యాట్స్‌మెన్‌కు ఎలా బంతి విసరాలి, దానికి అనుగుణంగా ఫీల్డింగ్ సిద్ధం చేయడం ఇలా వార్నర్ చెప్పే ప్రతీ విషయాన్ని నేను స్ట్రాటజిక్ టైమౌట్ సమయంలోనే అతని దగ్గరికి వెళ్లి వివరిస్తాను. ఇంతే కాకుండా ఫిజ్ తన చేతులు ఊపుతూ సందేశాలతోనే తన భావం ఏమిటో మాకు చెప్పేస్తాడు’ అని రికీ భుయ్ వెల్లడించాడు. ఐపీఎల్ ఆరంభంతో పోలిస్తే ఇన్ని మ్యాచ్‌ల తర్వాత ఇప్పుడు ముస్తఫిజుర్‌తో సంభాషించే పరిస్థితి కాస్త మెరుగైందని కోచ్ మూడీ సరదాగా చెప్పారు. ఇంటిపై బెంగతో... చదువుల కోసమో, కోచింగ్ కోసమో విద్యార్థులను ఇంటికి దూరంగా హాస్టల్లో పెడితే ఎలా ఉంటుం దో ఇప్పుడు 21 ఏళ్ల ముస్తఫిజుర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మైదానంలో ఉన్నంత సేపు పూర్తిగా బౌలింగ్‌పైనే దృష్టి పెడతాడు. ఆ తర్వాత మాత్రం నా ఊరు, నా ఇల్లు, కుటుంబ సభ్యులు, బ్యాక్‌గ్రౌండ్ ఇవే చెబుతుంటాడు. టైమ్ దొరికితే తన సోదరుడితో ఫోన్లో మాట్లాడుతుంటాడు. అతనికి స్వస్థలం ఎప్పుడు వెళ్లిపోదామా అని ఉంది. ఇప్పటికే చాలా బెంగ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది అని భుయ్ చెప్పాడు. అందుకే అతను కొద్ది రోజులు ఆటకు విరామం పెట్టి ఇంట్లో గడుపుదామని భావిస్తున్నాడు. మరో పర్యటన చేస్తే కుర్రాడు బెంగతోనే అనారోగ్యం పాలవుతాడని ఇంటివాళ్లు కూడా అంటున్నారు. ఇలాంటి హోం సిక్‌తో కూడా ముస్తఫిజుర్ ఐపీఎల్లో చెలరేగాడు. 15 మ్యాచ్‌లలో కేవలం 6.74 ఎకానమీతో అతను 16 వికెట్లు పడగొట్టాడు. భాష రాకపోతేనేమి... బంతితోనే సత్తా చాటి లీగ్‌లో కొత్త స్టార్‌గా ముస్తఫిజుర్ ఆవిర్భవించడం విశేషం. - సాక్షి క్రీడా విభాగం -
మిగిలేదెవరు..?
కోల్‌కతా X హైదరాబాద్ ఐపీఎల్ ఎలిమినేటర్ నేడు రాత్రి గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ఇన్నాళ్లూ ఒక లెక్క... ఇప్పుడొక లెక్క... ఐపీఎల్ లో లీగ్ దశలో ఎలా ఆడామన్నది కాదు... ఇప్పుడు చావోరేవో తేల్చుకునే మ్యాచ్ వచ్చేసింది. ఈ సీజన్లో కోల్‌కతా చేతిలో రెండుసార్లు ఓడిన హైదరాబాద్... ఈసారి ఓడితే ఇంటి దారి పట్టాలి. అటు కోల్‌కతా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పైనే గెలిచి ప్లేఆఫ్‌కు చేరి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో నేడు ఈ రెండు జట్ల మధ్య ఎలిమినేటర్ జరుగుతుంది. న్యూఢిల్లీ: సీజన్ ఆరంభంలో కాస్త తడబడ్డా... బౌలర్ల నిలకడ, వార్నర్ మెరుపులతో సన్‌రైజర్స్ జట్టు మిగిలిన జట్లు అన్నింటికంటే ముందుగా ప్లే ఆఫ్‌కు చేరింది. కానీ ఆఖరి రెండు లీగ్ మ్యాచ్‌లలో ఓడిపోవడం జట్టును ఆందోళనపరుస్తోంది. శిఖర్ ధావన్ ఫామ్‌లోకి వచ్చినా... బ్యాటింగ్ విభాగంలోనే జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విలియమ్సన్, మోర్గాన్ ఇద్దరూ విఫలం కావడం ప్రభావం చూపుతోంది. యువరాజ్ అడపాదడపా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్నా... తన నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ ఇంకా బాకీ ఉంది. మ్యాచ్ జరిగే ఫిరోజ్ షా కోట్ల మైదానం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇది కూడా సన్‌రైజర్స్‌ను ఆందోళన పరిచే అంశం. ఇంతకాలం పేసర్లను నమ్ముకున్న వార్నర్ సేన... కరణ్ శర్మతో పాటు బిపుల్ శర్మను కూడా ఆడించే అవకాశం ఉంది. యువరాజ్ సింగ్ కూడా స్పిన్ బౌలింగ్ చేస్తాడు. కాబట్టి ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. దీపక్ హుడా మీద జట్టు చాలా అంచనాలతో ఉన్నా ఈ సీజన్లో పూర్తిగా నిరాశపరిచాడు. అటు కోల్‌కతా మాత్రం నాణ్యమైన స్పిన్నర్లతో పటిష్టంగా కనిపిస్తోంది. నరైన్, షకీబ్, పీయూష్ చావ్లాలతో పాటు నాలుగో స్పిన్నర్‌ను ఆడించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బ్యాటింగ్ విభాగంలో యూసుఫ్ పఠాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం ఈ జట్టుకు కలిసొచ్చే అంశం. ఓపెనర్లు గంభీర్, ఉతప్ప కూడా ఈ సీజన్లో బాగా ఆడారు. ఆల్‌రౌండర్ రస్సెల్ గాయం గురించి స్పష్టత లేకపోయినా... వికెట్ స్వభావం దృష్ట్యా తన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. ఏమైనా చిన్న తప్పు చేసినా మరో అవకాశం లేని నాకౌట్ మ్యాచ్ కాబట్టి రెండు జట్లూ సర్వశక్తులూ ఒడ్డాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం ఢిల్లీలోనే జరిగే క్వాలిఫయర్-2లో ఆడుతుంది. అక్కడ గెలిస్తే ఫైనల్‌కు చేరుతుంది. -
నాలుగు బెర్త్‌లు... ఆరు జట్లు
ఐపీఎల్లో లీగ్ మ్యాచ్‌లు క్లైమాక్స్ దశకు వచ్చాయి. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా చివరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్ జట్టు ఖరారయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి సన్‌రైజర్స్ జట్టు ఒక్కటే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించినట్లు కనిపిస్తున్నా... వాస్తవానికి ఏ జట్టూ అధికారికంగా ముందంజ వేయలేదు. ప్రస్తుతం నాలుగు బెర్త్‌లకుగాను ఆరు జట్లు రేసులో ఉన్నాయి. పంజాబ్, పుణే జట్లకు ఇప్పటికే ప్లే ఆఫ్ ద్వారం మూసుకుపోయింది. మిగిలిన ఆరు జట్లలో ఎవరి అవకాశాలు ఏమిటి? ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే ఏ జట్టు ఏం చేయాలో చూద్దాం..? సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 16 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే ఇతర సమీకరణాలు, గోల లేకుండా ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలవాలి. ఒకవేళ సన్ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే... కోల్‌కతాపై గుజరాత్ గెలిచి ముంబై చేతిలో ఓడితే... బెంగళూరు, ఢిల్లీల్లో ఒక జట్టు 16 పాయింట్లకు వస్తే... అప్పుడు ఐదు జట్లు 16 పాయింట్లతో సమానంగా ఉంటాయి. రన్‌రేట్ లెక్కలోకి వస్తుంది. అయితే ప్రస్తుతం సన్ రన్‌రేట్ బాగుంది. కాబట్టి చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒకవేళ ఓడినా... చిత్తుగా ఓడకుండా రన్‌రేట్‌ను కాపాడుకోవాలి. ఈ సమీకరణం చాలా క్లిష్టం కాబట్టి సన్‌రైజర్స్ ముందుకు వెళ్లినట్లే భావించాలి. ► మిగిలిన మ్యాచ్‌లు: ఢిల్లీ (శుక్రవారం), కోల్‌కతా (ఆదివారం) కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్రస్తుతం 14 పాయిం ట్లతో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఎలాంటి గొడవా లేదు. ఒకవేళ ఒక్క మ్యాచ్ గెలిచినా రన్‌రేట్ బాగుంది కాబట్టి సమస్య రాకపోవచ్చు. మిగిలిన రెండు మ్యాచ్‌లూ ఓడితే 14 పాయింట్లతో ముందుకు వెళ్లడం కష్టం. సన్‌రైజర్స్ అన్నీ గెలిచి, గుజరాత్ కూడా ముంబైపై గెలవాలి. అదే సమయంలో ఢిల్లీ బెంగళూరుపై గెలవాలి. ఈ సమీకరణంలో నాలుగు జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. రన్‌రేట్ మెరుగ్గా ఉన్న రెండు జట్లు ముందుకు వెళతాయి. ఈ గొడవలన్నీ లేకుండా కనీసం ఒక మ్యాచ్ గెలిస్తే మేలు. ► మిగిలిన మ్యాచ్‌లు: గుజరాత్ (గురువారం), హైదరాబాద్ (ఆదివారం) ముంబై ఇండియన్స్ ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. గుజరాత్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. ఒకవేళ గుజరాత్ చేతిలో ఓడితే... అటు ఢిల్లీ బెంగళూరుపై గెలవాలని కోరుకోవాలి. అదే సమయంలో సన్‌రైజర్స్ కూడా అన్ని మ్యాచ్‌లూ గెలవాలని కోరుకోవాలి. ఇలాంటి సందర్భం వచ్చినా నెట్న్‌ర్రేట్ బాగా లేదు కాబట్టి ముందుకు వెళ్లడం కష్టం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్‌పై గెలిచి, మిగిలిన మ్యాచ్‌ల ఫలితాల కోసం చూడాలి. ► మిగిలిన మ్యాచ్: గుజరాత్ (శనివారం) గుజరాత్ లయన్స్ కోల్‌కతా, గుజరాత్ పరి స్థితి ఒకేలా ఉంది. కాబట్టి ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఒకవేళ కోల్‌కతాతో ఓడితే ముంబైపై కచ్చితంగా గెలవాలి. ఒకవేళ రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం 14 పాయింట్లతో ఉన్నా ఏ రకమైన సమీకరణంలో అయినా ముందుకు పోవడం కష్టం కావచ్చు. ఎందుకంటే రేసులో ఉన్న ఆరు జట్లలో అత్యంత దారుణంగా ఈ జట్టు రన్‌రేట్ ఉంది. కాబట్టి వీలైతే రెండు, లేదంటే కనీసం ఒక్కటైనా గెలవాలి. ► మిగిలిన మ్యాచ్‌లు: కోల్‌కతా (గురువారం), ముంబై (శనివారం) బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ప్రస్తుతం 14 పాయింట్లతో ఉంది. లీగ్ ఆఖరి మ్యాచ్ ఢిల్లీతో ఆడాల్సి ఉంది. ఆ సమయానికి మిగిలిన మూడు బెర్త్‌లు దాదాపుగా ఖరారు కావచ్చు. ఒకవేళ ఢిల్లీ జట్టు హైదరాబాద్‌పై గెలిస్తే... ఢిల్లీ, బెంగళూరుల ఆఖరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ముందుకు వెళ్లే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఆ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ 14 పాయింట్ల మీద నాలుగు జట్లు ఆగిపోయే పరిస్థితి వస్తే... రన్‌రేట్ అందరికంటే బాగున్నందున ముందుకు వెళుతుంది. మిగిలిన మ్యాచ్: ఢిల్లీ (ఆదివారం) ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. కచ్చితంగా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే అవకాశాలు ఉంటాయి. రన్‌రేట్ కూడా బాగోలేదు కాబట్టి... ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోదు. మిగిలిన మ్యాచ్‌లు: హైదరాబాద్ (శుక్రవారం), బెంగళూరు (ఆదివారం) కొసమెరుపు: రేసులో నుంచి ఇప్పటికే వైదొలిగిన పుణే, పంజాబ్ జట్లు ఈ ఆరు జట్ల అవకాశాలను ప్రభావం చేయలేవు. ఎందుకంటే ఈ రెండు జట్లూ తమ ఆఖరి మ్యాచ్‌ను పరస్పరం ఆడాల్సి ఉంది. ఇందులో ఓడిన జట్టు ఆఖరి స్థానంలో నిలుస్తుంది. కాబట్టి ఇది గెలవడం ఈ రెండు జట్లకూ ముఖ్యమే. -
వైజాగ్‌లో ఐపీఎల్ సందడి
► నేడు ముంబైతో తలపడనున్న హైదరాబాద్ ► ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు విశాఖలో ఒక్క మ్యాచ్ కూడా లేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఏకంగా ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించింది. గతంలో హైదరాబాద్ జట్టు ఇక్కడ కొన్ని మ్యాచ్‌లను ఆడినా ఈ సీజన్లో అన్ని హోమ్ మ్యాచ్‌లను భాగ్యనగరంలోనే ఆడుతోంది. అయితే మహారాష్ట్ర మ్యాచ్‌లను తరలించాల్సి రావడం విశాఖ అభిమానులకు వరంగా మారింది. పుణే, ముంబై రెండు జట్లూ తమ హోమ్ మ్యాచ్‌లను ఇక్కడే ఆడనున్నాయి. నేడు (ఆదివారం) జరిగే మ్యాచ్‌లో ముంబై జట్టు సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
శరణ్‌కు జరిమానా
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేసర్ బరీందర్ శరణ్ మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. ముంబై ఇండియన్స్‌తో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తను అనుచితంగా ప్రవర్తించాడు. శరణ్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను అతిక్రమించినట్టు భావించి మ్యాచ్ రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. -
రైజర్... విన్నర్
► ఐపీఎల్లో హైదరాబాద్ తొలి విజయం కెప్టెన్ వార్నర్ సూపర్ ఇన్నింగ్స్ ► రాణించిన బౌలర్లు 7 వికెట్లతో ముంబై ఇండియన్స్ చిత్తు రెండు రోజుల క్రితం ఇదే మైదానంలో 142 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఓటమిని ఆహ్వానించింది. ఇప్పుడు సరిగ్గా అదే స్కోరును ఛేదించి లీగ్‌లో బోణీ చేసింది. ముందుగా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన హైదరాబాద్‌కు ఆ తర్వాత కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ మెరుపులు కీలక విజయాన్ని అందించాయి. రెండు పరాజయాల తర్వాత దక్కిన విజయం రైజర్స్‌లో ఆనందం నింపింది. పేరుకు పెద్ద హిట్టర్లే ఉన్నా... బ్యాటింగ్‌లో తడబడిన ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుంది. రాయుడు, కృనాల్ భాగస్వామ్యం మినహా ఇతర ఆటగాళ్లు విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. భారీ స్కోరు చేయడంలో విఫలమై ఆ జట్టు మూడో పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-9లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ చేసింది. సోమవారం ఇక్కడ ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించి ముంబై ఇండియన్స్‌ను 7 వికెట్లతో చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అంబటి రాయుడు (49 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కృనాల్ పాండ్యా (28 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. అనంతరం హైదరాబాద్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 145 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (59 బంతుల్లో 90 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. 15 బంతులు ఉండగానే సన్‌కు విజయం దక్కడం విశేషం. 63 పరుగుల భాగస్వామ్యం: ఐపీఎల్ కెరీర్ ఆరంభం గప్టిల్ (2)కు కలిసి రాలేదు. లీగ్‌లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న అతను, భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత శరణ్ చక్కటి బంతులతో పార్థివ్ (10), బట్లర్ (11)లను అవుట్ చేశాడు. అంతకుముందు నాలుగో స్థానంలో బరిలోకి దిగిన రోహిత్ (5) కూడా అనవసర సింగిల్‌కు ప్రయత్నించి వెనక్కి రాలేక రనౌటయ్యాడు. తక్కువ వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై ఆ సమయానికి 60 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ దశలో రాయుడు, కృనాల్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రాయుడు చాలా కాలం తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడగా, గత మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్న కృనాల్ మరోసారి చెలరేగాడు. ముందుగా నెమ్మదిగా ఆడిన వీరిద్దరు ఆ తర్వాత ధాటిని ప్రదర్శించారు. సన్ ఫీల్డింగ్ వైఫల్యాల వల్ల కూడా చకచకా పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 43 బంతుల్లో రాయుడు అర్ధసెంచరీ పూర్తయింది. ఈ జోడి ఐదో వికెట్‌కు 39 బంతుల్లోనే 63 పరుగులు జోడించారు. ఆ తర్వాత రాయుడుతో పాటు హార్దిక్ (2) కూడా అవుటైనా కృనాల్ చివరి వరకు నిలబడ్డాడు. తొలి 10 ఓవర్లలో 58 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్, తర్వాతి 10 ఓవర్లలో 84 పరుగులు చేసింది. వార్నర్ ఒక్కడే: ఎప్పటిలాగే ధావన్ (2) వైఫల్యంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. సౌతీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో బంతికే అతను వెనుదిరిగాడు. అయితే రెండో ఓవర్లోనే కెప్టెన్ వార్నర్ ఫోర్, సిక్స్ బాది దూకుడును మొదలు పెట్టాడు. మరో ఎండ్‌లో హర్భజన్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన హెన్రిక్స్ (22 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కొద్దిసేపు వార్నర్‌కు అండగా నిలిచాడు. 10 ఓవర్లలో రైజర్స్ స్కోరు 66 పరుగులకు చేరిన తర్వాత సౌతీ చక్కటి బంతితో హెన్రిక్స్‌ను అవుట్ చేయగా... ఆ తర్వాత మోర్గాన్ (11) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. హార్దిక్ పాండ్యా అద్భుత క్యాచ్ అతని ఇన్నింగ్స్‌కు ముగింపు పలికింది. మరో వైపు భారీ షాట్లతో తన జోరు కొనసాగించిన వార్నర్ 42 బంతుల్లో ఈ సీజన్లో రెండో అర్ధ సెంచరీ నమోదు చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడు ప్రదర్శించిన అతను కొద్దిలో సెంచరీ కోల్పోయాడు. చివర్లో దీపక్ హుడా (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) అండతో అతను మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) ఓజా (బి) భువనేశ్వర్ 2; పార్థివ్ (బి) శరణ్ 10; రాయుడు (సి) హెన్రిక్స్ (బి) శరణ్ 54; రోహిత్ (రనౌట్) 5; బట్లర్ (సి) నమన్ ఓజా (బి) శరణ్ 11; కృనాల్ (నాటౌట్) 49; హార్దిక్ (బి) ముస్తఫిజుర్ 2; హర్భజన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-2; 2-23; 3-43; 4-60; 5-123; 6-135.; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-17-1; శరణ్ 4-0-28-3; హెన్రిక్స్ 4-0-23-0; ముస్తఫిజుర్ 4-0-32-1; బిపుల్ శర్మ 4-0-40-0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (నాటౌట్) 90; ధావన్ (బి) సౌతీ 2; హెన్రిక్స్ (సి) పార్థివ్ (బి) సౌతీ 20; మోర్గాన్ (సి) హార్దిక్ (బి) సౌతీ 11; దీపక్ హుడా (నాటౌట్) 17; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1-4; 2-66; 3-100.; బౌలింగ్: సౌతీ 4-0-24-3; మెక్లీన్గన్ 3.3-0-33-0; జస్ప్రీత్ బుమ్రా 3-0-19-0; హర్భజన్ సింగ్ 4-0-38-0; హార్దిక్ పాండ్యా 3-0-29-0. -
ఇక క్రికెట్ ‘వేడి’
నేడు నగరంలో తొలి ఐపీఎల్ మ్యాచ్ సన్‌రైజర్స్‌తో నైట్‌రైడర్స్ ఢీ మండే ఎండతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరవాసులను మరో వేడి ముంచెత్తబోతోంది. ఈ సీజన్లో నగరంలో తొలి ఐపీఎల్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో నేటి సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఇక బౌండరీలు, సిక్సర్ల హోరులో క్రికెట్ ‘వేడి’ని ఎంజాయ్ చేయడమే..! -
సన్ ‘రైజ్’ అవుతుందా..!
ఐపీఎల్లో మిగిలిన చాలా జట్లతో పోలిస్తే హైదరాబాద్ సన్‌రైజర్స్‌కు అభిమానుల సంఖ్య తక్కువ. చెన్నై, ముంబైలాంటి జట్లతో పోలిస్తే హైదరాబాద్ కోసం ఆసక్తిగా ఎదురుచూసే వారి సంఖ్యా తక్కువే. దీనికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి... స్టేడియానికి అభిమానులను భారీగా రప్పించే భారత స్టార్ క్రికెటర్ లేకపోవడం. రెండు... ఆట పరంగా అద్భుతాలు చేయకపోవడం. ఈసారి సీజన్లో యువరాజ్ సింగ్‌ను తీసుకోవడం వల్ల తొలి సమస్యను దాదాపుగా అధిగమించారు. మరి మైదానంలో ఏం చేస్తారనేదే అసలు ప్రశ్న. సాక్షి క్రీడావిభాగం:- రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులకూ కలిపి హైదరాబాద్ సన్‌రైజర్స్ ఒకటే ఐపీఎల్ జట్టు. కాబట్టి అభిమానుల సంఖ్య భారీగా ఉండాలి. కానీ కచ్చితంగా మా జట్టే గెలవాలని కోరుకునేలా... విధేయంగా ఉండే అభిమానుల సంఖ్య మాత్రం ఆ స్థాయిలో లేదు. 2013లో ఈ జట్టు లీగ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఇప్పటివరకూ స్టేడియానికి ఫ్యాన్స్‌ను రప్పించే స్టార్ లేకపోవడం లోటు. ఎంతమంది విదేశీ స్టార్స్ ఉన్నా.. కచ్చితంగా భారత జట్టులోని స్టార్ క్రికెటర్ ఉంటేనే అభిమానులు చూస్తారు. శిఖర్ ధావన్ రూపంలో భారత ఓపెనర్ జట్టులో ఉన్నా... మైదానానికి జనాలను రప్పించే స్థాయి అతనికి లేదనేది వాస్తవం. ధోని, కోహ్లి, గేల్, సెహ్వాగ్, డివిలియర్స్ లాంటి వారి స్థాయిలో కాకపోయినా ఒక పెద్ద క్రికెటర్ జట్టులో ఉండాల్సింది. ఈ లోటును ఈ ఏడాది సన్‌రైజర్స్ కొంతవరకు పూడ్చుకుంది. యువరాజ్ సింగ్‌ను తీసుకోవడం ద్వారా అభిమానులకు చేరువయ్యే అవకాశం లభించింది. కాబట్టి ఒక పెద్ద సమస్య తీరింది. స్థానిక ఆటగాళ్లకు పెద్దగా తుది జట్టులో అవకాశాలు ఇవ్వకపోవడం కూడా ఈ జట్టు మీద ఉన్న పెద్ద ఫిర్యాదు. ప్రదర్శన అంతంత మాత్రం 2008లో ఐపీఎల్ మొదలైన తొలి ఏడాదే హేమాహేమీల్లాంటి ఆటగాళ్లతో డెక్కన్ చార్జర్స్ జట్టు ఏర్పడింది. హైదరాబాద్‌కు చెందిన ఈ జట్టు2009లో విజేతగా నిలిచినా ఆ తర్వాత చాలా పేలవ ప్రదర్శనతో లీగ్‌లో కొనసాగింది. 2012 తర్వాత డెక్కన్ చార్జర్స్ జట్టు స్థానంలో సన్‌రైజర్స్ వచ్చింది. 2013లో తొలి ఏడాది ప్లే ఆఫ్ దశకు వెళ్లింది. దీంతో ఫర్వాలేదనిపించినా... వరుసగా రెండేళ్ల పాటు ఎనిమిది జట్ల లీగ్‌లో ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. వైవిధ్యమైన ఎంపిక మిగిలిన జట్లతో పోలిస్తే ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ ఆటగాళ్లను ఎంచుకునే విధానం చాలా వైవిధ్యంగా ఉంటుంది. స్టెయిన్‌లాంటి స్టార్ బౌలర్ జట్టులో ఉన్నా బౌల్ట్ (న్యూజిలాండ్)ను భారీ మొత్తం ఇచ్చి గత ఏడాది తీసుకొచ్చారు. అలాగే అవసరాన్ని మించి ఫాస్ట్ బౌలర్లతో జట్టును నింపారు. గత ఏడాదినే ఉదాహరణగా తీసుకుంటే... భువనేశ్వర్, ఇషాంత్, ప్రవీణ్ కుమార్, బౌల్ట్, స్టెయిన్, ఇర్ఫాన్ పఠాన్, ప్రశాంత్‌ల రూపంలో ఏడుగురు పేసర్లపై డబ్బులు వెచ్చించారు. టి20 క్రికెట్లో భారత పిచ్‌లపై తుది జట్టులో ఇద్దరు లేదా ముగ్గురు పేసర్లు ఉంటే చాలు. కానీ ఇంత మందికి ఎందుకు డబ్బు పెట్టారో తెలియని పరిస్థితి. వేలంలోనే నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా ఆటగాళ్లను తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈసారి కూడా... ఈసారి ఐపీఎల్ వేలానికి ముందు స్టెయిన్, ఇర్ఫాన్లను జట్టు వదిలేసింది. వేలంలో మంచి బ్యాట్స్‌మెన్ కోసం చూస్తారనుకుంటే ఈసారి ఆశ్చర్యకరంగా ఎడమచేతి వాటం పేసర్ల మీద డబ్బు ఖర్చు చేశారు. ఇప్పటికే జట్టులో బౌల్ట్ ఎడమచేతి వాటం పేసర్. ఈసారి కొత్తగా ఆశిష్ నెహ్రా, ముస్తాఫిజుర్ రెహమాన్ (బంగ్లాదేశ్), బరిందర్ శరణ్‌లను తెచ్చారు. నలుగురు ఎడమచేతి వాటం బౌలర్లు జట్టులో ఎందుకున్నారో తెలియదు. అన్నట్లు బ్యాటింగ్‌లోనూ ఎడమచేతి వాటం స్టార్సే ఎక్కువ. డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, యువరాజ్, ఇయాన్ మోర్గాన్లతో పాటు జట్టులో కచ్చితంగా ఉండే ఆల్‌రౌండర్ కరణ్ శర్మ కూడా ఎడమచేతి వాటం ఆటగాడే. కూర్పు ఎలా ఉందంటే... యువరాజ్, ధావన్ జట్టులో ఉన్నా.. దేశవాళీ బ్యాట్స్‌మెన్ విషయంలో ఇంకా కొంత లోటు కనిపిస్తోంది. రికీ భుయ్, తిరుమలశెట్టి సుమన్ మాత్రమే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. వార్నర్, మోర్గాన్, విలియమ్సన్ రూపంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో వార్నర్ కెప్టెన్ కాబట్టి కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. విలియమ్సన్ కూడా ఆడే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్లు ఏడుగురు ఉన్నారు. ఇందులో హెన్రిక్స్, బెన్ కటింగ్ విదేశీ క్రికెటర్లు. ఈ ఇద్దరిలో ఒకరు తుది జట్టులోకి రావచ్చు. దీపక్ హుడా, కరణ్ శర్మ దాదాపుగా తుది జట్టులో ఉంటారు. ఆశిష్ రెడ్డి, బిపుల్ శర్మ, విజయ్ శంకర్లకు అవకాశం కొద్దిగా కష్టమే. ఇక బౌలర్లలో ఏడుగురూ పేస్ బౌలర్లే. బౌల్ట్, ముస్తాఫిజుర్లలో ఒకరు... నెహ్రా, భువనేశ్వర్ ఇద్దరూ దాదాపు అన్ని మ్యాచ్‌లూ ఆడే అవకాశం ఉంది. దేశవాళీ బ్యాట్స్‌మెన్ సంఖ్య ఎక్కువగా ఉన్న జట్లు ఐపీఎల్లో ప్రతి సీజన్లోనూ నిలకడగా రాణిస్తున్నాయి. ఈ విషయంలో సన్‌రైజర్స్ ఇంకా మెరుగుపడలేదు. గత ఏడాది జట్టు ప్రధానంగా వార్నర్ మీద ఆధారపడి సాగింది. ఈ ఏడాది కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. తనతో పాటు కనీసం మరో ఇద్దరైనా సీజన్ అంతా నిలకడగా ఆడితే అవకాశాలు మెరుగ్గా ఉండొచ్చు. మిగిలిన జట్లతో పోలిస్తే హైదరాబాద్ తుది జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తున్నా... ఏదైనా అద్భుతం జరిగి సన్ ‘రైజ్’ కావాలని ఆశిద్దాం. -
భారత్‌కు కోచ్‌గా రమ్మన్నారు: మైక్ హస్సీ
గతంలో తనను భారత జట్టు కోచ్‌గా వ్యవహరించాలని కోరారని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ వెల్లడించాడు. గత ఏడాది ఐపీఎల్లో చెన్నై తరఫున ఆడుతున్న సమయంలో సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ తనని కలిశాడని, భారత కోచ్‌గా పని చేయాలని కోరారని తన తాజా పుస్తకం ‘విన్నింగ్ ఎడ్జ్’లో హస్సీ తెలిపాడు. అయితే కుటుంబంతో కలిసి కొంత సమయం గడపాలని భావించినందున ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిపాడు. అంతకంటే ముందు శ్రీలంక జట్టుకు సహాయక కోచ్‌గా చేయమని జయవర్ధనే కూడా అడిగినట్లు హస్సీ తెలిపాడు. -
సన్‌రైజర్స్ సరదాలు
-
సన్‌రైజర్స్‌కు ఆడేందుకు వస్తున్న పీటర్సన్
-
వినోదానికి రెఢీ!
ఐపీఎల్ ఎనిమిదో సీజన్ హైదరాబాద్‌కు కాస్త ఆలస్యంగా వచ్చింది. నగరంలో తొలి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం ఉప్పల్ స్టేడియంలో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మ్యాచ్ టికెట్లన్నీ అమ్ముడు పోయాయి. ఇక క్రికెట్ ప్రేమికులకు సందడే సందడి.. -
సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్‌గా మురళీధరన్
ముంబై: శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కోచ్‌తో పాటు అతను జట్టు మెంటర్‌గా కూడా వ్యవహరిస్తాడని సన్‌రైజర్స్ ప్రకటించింది. ఏడు ఐపీఎల్ సీజన్లలో కలిపి 66 మ్యాచ్‌లు ఆడిన మురళీధరన్, 63 వికెట్లు పడగొట్టాడు. గతేడాది ఐపీఎల్లో బెంగళూరు జట్టు సభ్యుడిగా ఉన్నా, ఒకే మ్యాచ్‌లో అవకాశం లభించింది. -
సన్‌రైజర్స్‌తో క్యాన్సర్ భాదిత చిన్నారుల క్రికెట్
-
సన్‌రైజర్స్ బలం పెరిగింది
ఈ సారి హైదరాబాద్‌కే చాన్స్ జట్టు విజయంపై టీమ్ మేనేజ్మెంట్ ధీమా ఐపీఎల్ కోసం నేడు దుబాయ్‌కు పయనం సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ఐపీఎల్లో ప్రవేశించిన తొలి సారే సన్‌రైజర్స్ హైదరాబాద్ చక్కటి ప్రదర్శన కనబర్చిందని, ఈ సారి తాము మరింత మెరుగైన క్రికెట్ ఆడతామని ఆ జట్టు కోచ్ టామ్ మూడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ధాటిగా ఆడే హిట్టర్ల రాకతో తమ జట్టు బ్యాటింగ్ బలం పెరిగిందని ఆయన అన్నారు. ఐపీఎల్-7 తొలి దశలో పాల్గొనేందుకు సన్‌రైజర్స్ జట్టు శనివారం ఉదయం యూఏఈ బయల్దేరి వెళ్లనుంది. ఈ సందర్భంగా మూడీతో పాటు జట్టు మెంటర్స్ వీవీఎస్ లక్ష్మణ్, కె. శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. టీమ్‌కు నిర్వహించిన మూడు రోజుల స్వల్పకాలిక శిక్షణా శిబిరం శుక్రవారం ఇక్కడ ముగిసింది. పిచ్‌లు సమస్య కాదు... జట్టు మెంటర్ కె. శ్రీకాంత్ మాట్లాడుతూ...గత సంవత్సరం జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన పలువురు ఆటగాళ్లను కొనసాగించడం జట్టుకు ఉపయోగపడుతుందని అన్నారు. ‘ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాన బృందం అంతా ఇప్పుడు టీమ్‌లో కొనసాగుతోంది. మా ప్రదర్శన ఇంకా బాగుంటుందని నా నమ్మకం. దక్షిణాఫ్రికాలో ఆడి భారత్‌కు వస్తే కష్టమేమో గానీ యూఏఈ పిచ్‌లకు, భారత్‌కు పెద్దగా తేడా ఉండదు కాబట్టి సమస్య లేదు. గత ఏడాది వివాదాలతో ఇప్పుడు ఇబ్బంది లేదు’ అని ఆయన విశ్లేషించారు. హిట్టర్లు చెలరేగుతారు... మరో వైపు సన్‌రైజర్స్ సమతూకంగా ఉందని మరో మెంటర్ లక్ష్మణ్ అభిప్రాయ పడ్డారు. జట్టు అవసరాలకు అనుగుణంగానే ఆటగాళ్లను వేలంలో ఎంచుకున్నట్లు ఆయన చెప్పారు. ‘మా టీమ్‌లో చక్కటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. పైగా వార్నర్, ఫించ్‌లాంటి కొంత మంది హిట్టర్లు ఇప్పుడు టీమ్‌తో చేరారు కాబట్టి తిరుగు లేదు. ఆటగాళ్ల మధ్య గత ఏడాది కనిపించిన సమన్వయం ఈ సారి కూడా కొనసాగుతుంది’ అని అన్నారు. వేలం జరిగే విధానంలో ఉండే పరిమితుల కారణంగానే హైదరాబాద్ స్థానిక ఆటగాళ్లు ఎక్కువ మందికి చోటు ఇవ్వలేకపోయామని ఆయన స్పష్టం చేశారు. నాలుగో సింహం! ‘టాపార్డర్‌లో ధావన్, వార్నర్, ఫించ్ వంటి ముగ్గురు విధ్వంసక ఆటగాళ్లు ఉన్నారు సరే...నాలుగో ఆటగాడు అలాంటివాడే కావాలి. అవసరమైతే నేను ఆ స్థానంలో ఆడేందుకు రెడీ. నాకు షార్జాలో మంచి అనుభవం ఉంది. నా ఆఫ్ స్పిన్‌తో వన్డేల్లో రెండు సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టాను కూడా’...ఈ మాటలన్నది ఎవరో కాదు. ఒకప్పటి భారత స్టార్ ఓపెనర్, ఇప్పుడు సన్‌రైజర్స్ మెంటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఆయన ఎక్కడున్నా సరదా కబుర్లు, వ్యాఖ్యలతో వాతావరణం అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా మారిపోతుంది. శుక్రవారం మీడియా సమావేశంలో కూడా ఆయన తనదైన శైలిలో నవ్వులు కురిపించారు. లక్ష్మణ్‌ను ఒకసారి జట్టుకు వైస్ ప్రెసిడెంట్ అని, మరో సారి డిప్యూటీ చైర్మన్ అని సంబోధించిన శ్రీకాంత్... మీడియా తరఫున తనే జట్టు సభ్యులకు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో వచ్చీ రాని తెలుగులో వేణుగోపాలరావుతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. మరో వైపు ఇషాంత్, స్యామీ, మిశ్రాలను తన త్రీ మస్కటీర్స్ (ముగ్గురు యోధులు)గా ఆయన ప్రశంసించారు. దీనిపై స్పందిస్తూ ఇషాంత్...‘నిజమే, ఒకరు బాగా నలుపు, మరొకరు బాగా పొడవు, ఇంకొకరు బాగా పొట్టి’ అంటూ సమాధానమివ్వడం హాస్యాన్ని పంచింది. -
క్వాలిఫయర్ ‘టాప్’ ఒటాగో
మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి20 క్వాలిఫయింగ్ మ్యాచుల్లో ఒటాగో వోల్ట్స్ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. సన్‌రైజర్స్ జోరుకు పగ్గాలు వేస్తూ శుక్రవారం ఇక్కడ జరిగిన చివరి మ్యాచ్‌లో ఒటాగో వోల్ట్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఇప్పటికే ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించడంతో ఎలాంటి ప్రాధాన్యత లేని ఈ మ్యాచ్‌లో రైజర్స్ విఫలమైంది. ఈ గెలుపుతో క్వాలిఫయింగ్‌లో వోల్ట్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ నెగ్గినట్లయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేయగా, ఒటాగో 16.2 ఓవర్లలో 5 వికెట్లకు 144 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ధావన్ (10 బంతుల్లో 12; 1 సిక్స్)తో పాటు పార్థివ్ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు), సమంత్రే (8) వెంట వెంటనే వెనుదిరగడంతో రైజర్స్ 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జేపీ డుమిని (38 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు), వైట్ (23 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) సహకారంతో ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఆ తర్వాత స్యామీ (22 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ఫర్వాలేదనిపించడంతో హైదరాబాద్ స్కోరు 143 పరుగులకు చేరింది. అనంతరం బ్రెండన్ మెకల్లమ్ (39 బంతుల్లో 67 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటి చేత్తో వోల్ట్స్ను గెలిపించాడు. రూథర్ ఫోర్డ్ (23 బంతుల్లో 27; 5 ఫోర్లు), నీషమ్ (13 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతనికి సహకరించడంతో మరో 22 బంతులు మిగిలి ఉండగానే విజయం వోల్ట్స్ సొంతమైంది. -
‘సన్’రైజ్ అవుతుందా!
ధనాధన్ క్రికెట్ పండగకు రంగం సిద్ధమైంది. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నమెంట్లో సత్తా చాటేందుకు భారత్‌తోపాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా దేశవాళీ జట్లు సిద్ధమయ్యాయి. మరో రెండు రోజుల్లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో ఈ టోర్నీకి తెరలేవనుంది. ఐపీఎల్ తర్వాత మరోసారి భారత్ అభిమానులు టి20 క్రికెట్ మజాను రుచి చూడబోతున్నారు. సాక్షి, హైదరాబాద్: పేరు మారడంతో పాటు అదృష్టం కూడా మారిన హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. సన్‌రైజర్స్‌గా బరిలోకి దిగి టాప్-4 జట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మరో టి20 టోర్నీ చాంపియన్స్ లీగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించేందుకు సన్‌రైజర్స్ క్వాలిఫయింగ్ పోటీలు ఆడాల్సి ఉంది. మొహాలీలో మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో కంద్ మారూన్స్‌తో, బుధవారం జరిగే రెండో మ్యాచ్‌లో ఫైసలాబాద్ వోల్వ్స్తో రైజర్స్ తలపడుతుంది. రైజర్స్ పాత జట్టు డెక్కన్ చార్జర్స్ 2009లో జరిగిన తొలి చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించింది. అందులో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. ఆ తర్వాత మూడు సార్లు చార్జర్స్ క్వాలిఫై కాలేదు. బౌలింగే బలం... ఐపీఎల్ తరహాలోనే చాంపియన్స్ లీగ్‌లో కూడా సన్‌రైజర్స్ బౌలింగ్‌నే నమ్ముకుంది. ప్రధానాస్త్రం డేల్ స్టెయిన్ చెలరేగితే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు. లెగ్‌స్పిన్నర్లు అమిత్ మిశ్రా, కరణ్ శర్మ తమ చక్కటి ప్రదర్శనతో ఐపీఎల్లో ఆకట్టుకున్నారు. ఈ ముగ్గురు తమ పూర్తి కోటా బౌలింగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉంది. రెండో పేసర్‌గా ఇషాంత్ శర్మతో పాటు తిసారా పెరీరా, డారెన్ స్యామీ, ఆశిష్ రెడ్డివంటి ఆల్‌రౌండర్లతో టీమ్ సమతూకంగా ఉంది. తన ప్రతిభను ప్రదర్శించేందుకు హైదరాబాద్ యువ ఆటగాడు హనుమ విహారికి ఈ టోర్నీ మరో అవకాశం కల్పిస్తోంది. దూకుడైన ఆటతీరుకు మారుపేరైన ఓపెనర్ శిఖర్ ధావన్‌పై జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. భద్రతలేమి కారణంగా సొంత గడ్డపై క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం కోల్పోయిన సన్‌రైజర్స్ దూకుడైన ఆట ప్రదర్శిస్తే సీఎల్‌టి20లో కూడా సత్తా చాటే అవకాశం ఉంది. ధావన్‌కు నాయకత్వ పగ్గాలు విధ్వంసకర బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు మరో ప్రమోషన్ లభించింది. చాంపియన్స్ లీగ్ టి20లో పాల్గొనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రైజర్స్ కెప్టెన్ కుమార సంగక్కర సీఎల్‌టి20లో తన లంక జట్టు కంద్ మారూన్స్కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో జట్టు మేనేజ్మెంట్ ధావన్‌ను ఎంపిక చేసింది. సంగక్కర స్థానంలో ఐపీఎల్లో సగం మ్యాచ్‌లకు కెప్టెన్‌గా పని చేసిన వైట్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ టీమ్‌లో ఉన్నాడు. అయితే అతడిని కాదని ధావన్‌ను ఎంపిక చేయ డం విశేషం. అన్ని ఫార్మాట్లలో అద్భుత ఫామ్ తో భారత జట్టులో స్థానం ఖాయం చేసుకున్న శిఖర్, ఐపీఎల్-6లో 10 మ్యాచుల్లో 311 పరుగులు చేసి సన్‌రైజర్స్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), వైట్, ఆశిష్ రెడ్డి, డుమిని, పార్థివ్ పటేల్ (కీపర్), సమంత్రే, ఇషాంత్, స్టెయిన్, ఆనంద్ రాజన్, అమిత్ మిశ్రా, పెరీరా, స్యామీ, కరణ్, విహారి. -
సన్‌రైజర్స్‌కు సంగక్కర ఆడట్లేదు
కొలంబో: ఈ ఏడాది చాంపియన్స్ లీగ్‌లో లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడటం లేదు. తమ దేశవాళీ జట్టు కుందురత తరఫున అతను బరిలోకి దిగుతున్నాడు. లంక ప్రీమియర్ లీగ్ రద్దు కావడంతో సూపర్ 4 లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన కుందురత జట్టు చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించింది. దీంతో తమ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తానని సంగక్కర స్పష్టం చేశాడు. లంక బోర్డు కూడా ఇదే విషయాన్ని చెప్పిందన్నాడు. ఐపీఎల్-6లో సన్‌రైజర్స్‌కు ఆడిన ఈ లంక మాజీ కెప్టెన్‌ను చాలా మ్యాచ్‌ల్లో పక్కనబెట్టారు. అయితే విండీస్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌తో పాటు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అతను గాడిలో పడ్డాడు.