
సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్‌గా మురళీధరన్
శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
ముంబై: శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కోచ్‌తో పాటు అతను జట్టు మెంటర్‌గా కూడా వ్యవహరిస్తాడని సన్‌రైజర్స్ ప్రకటించింది. ఏడు ఐపీఎల్ సీజన్లలో కలిపి 66 మ్యాచ్‌లు ఆడిన మురళీధరన్, 63 వికెట్లు పడగొట్టాడు. గతేడాది ఐపీఎల్‌లో బెంగళూరు జట్టు సభ్యుడిగా ఉన్నా, ఒకే మ్యాచ్‌లో అవకాశం లభించింది.