ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు విశాఖలో ఒక్క మ్యాచ్ కూడా లేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఏకంగా...........
► నేడు ముంబైతో తలపడనున్న హైదరాబాద్
► ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం
సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు విశాఖలో ఒక్క మ్యాచ్ కూడా లేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఏకంగా ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించింది. గతంలో హైదరాబాద్ జట్టు ఇక్కడ కొన్ని మ్యాచ్‌లను ఆడినా ఈ సీజన్‌లో అన్ని హోమ్ మ్యాచ్‌లను భాగ్యనగరంలోనే ఆడుతోంది.
అయితే మహారాష్ట్ర మ్యాచ్‌లను తరలించాల్సి రావడం విశాఖ అభిమానులకు వరంగా మారింది. పుణే, ముంబై రెండు జట్లూ తమ హోమ్ మ్యాచ్‌లను ఇక్కడే ఆడనున్నాయి. నేడు (ఆదివారం) జరిగే మ్యాచ్‌లో ముంబై జట్టు సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.