IPL 9
-
సన్ ‘షైన్’ అయిందిలా...
► హైదరాబాద్ సంచలన ప్రదర్శన ► గెలిపించిన బౌలింగ్ వ్యూహం ► కెప్టెన్ నాయకత్వ పటిమతో విజయం డేవిడ్ వార్నర్ మినహా బ్యాటింగ్‌లో మరో మెరుపు లేదు... ధావన్ పేరుకు 501 పరుగులు చేసినా అతి సాధారణ స్ట్రైక్‌రేట్ వాటి విలువను తగ్గించింది. ఇక ఇతర బ్యాట్స్‌మెన్ అంతా కలిపి టోర్నీలో చేసింది రెండే అర్ధ సెంచరీలు... అయినా సరే బ్యాట్స్‌మెన్ ఆటగా పేరుబడ్డ టి20ల్లో హైదరాబాద్ విజేతగా నిలవగలిగింది. వరుస పరాజయాలతో ప్రారంభించిన తర్వాత కొన్ని చక్కటి ప్రదర్శనలతో ప్లే ఆఫ్ వరకు చేరినా ఆ జట్టుపై అందరికీ అపనమ్మకమే... కానీ రైజర్స్ అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేసి చూపించింది. ‘బ్యాటింగ్ మ్యాచ్‌లు గెలిపిస్తుంది... కానీ బౌలింగ్ టోర్నీలు గెలిపిస్తుంది’ అని ఫైనల్ అనంతరం విశ్లేషకులు చేసిన వ్యాఖ్య ఈ జట్టుకు సరిగ్గా సరిపోతుంది. తమ బౌలర్లను చివరి వరకు బలంగా నమ్మిన కెప్టెన్ వారి నుంచి కావాల్సిన ఫలితాన్ని రాబట్టాడు. ఫలితంగా అంచనాలకు అందరి రీతిలో రాణించిన రైజర్స్ ఐపీఎల్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. సాక్షి క్రీడా విభాగం:- ఐపీఎల్లో సన్‌రైజర్స్ 2013లో అడుగు పెట్టింది. తొలిసారే ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించి ఆకట్టుకుంది. అయితే తర్వాతి రెండు సీజన్లు అదే ప్రదర్శనను పునరావృతం చేయడంలో విఫలమైంది. దాంతో 2014, 2015లలో ఆ జట్టు అనామకంగానే కనిపించింది. గత ఏడాది అయితే టీమ్ వైపు స్పాన్సర్లు కూడా పెద్దగా ఆకర్షితులు కాలేదు. కొన్ని స్వల్ప మార్పులు మినహా ఈసారి కూడా దాదాపు అదే జట్టు ఉండటంతో రైజర్స్పై ఎవరికీ పెద్దగా ఆశలు లేవు. పైగా తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ఇక పాత కథే పునరావృతం అవుతుందేమో అనిపించింది. అయితే ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా పైకి ఎగసింది. ముంబై, గుజరాత్, పంజాబ్లపై సాధించిన వరుస విజయాలు జట్టులో ఉత్సాహాన్ని నింపాయి. వర్షం బారిన పడిన మ్యాచ్‌లో సొంతగడ్డపై పుణే చేతిలో ఓడటం కాస్త బ్రేక్ వేసింది. అయితే హైదరాబాద్‌లో రెండు, వైజాగ్‌లో రెండు కలిపి వరుసగా నాలుగు విజయాలతో సన్ దూసుకుపోయింది. అప్పటికే దాదాపుగా ప్లే ఆఫ్‌కు చేరువ కావడంతో తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో మూడు పరాజయాలు ఎదురైనా ఇబ్బంది ఎదురు కాలేదు. అయితే టాప్-2లో లేకపోవడంతో ఫైనల్ కోసం రెండు మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. ఐదు రోజుల వ్యవధిలో వేర్వేరు వేదికల్లో మూడు నాకౌట్ మ్యాచ్‌లలో గెలుపొందడం నిజంగా అద్భుతం. దీనిని సాధించడంలో జట్టులో సమష్టి కృషి కనిపించింది. కెప్టెన్ కమాల్... ఐపీఎల్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లికి లక్ష్యాన్ని ఛేదించే అవకాశం ఇచ్చేందుకు జహీర్ ఖాన్ భయపడ్డాడు, సురేశ్ రైనాకు ధైర్యం సరిపోలేదు, చివరకు ధోని కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్ట పడలేదు. కానీ బెంగళూరుతో మ్యాచ్‌లో ‘చిన్న’స్వామి స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం అంటే పెద్ద సాహసమే. ఈ సాహసమే రైజర్స్‌కు టైటిల్ అందించిందని ప్రత్యర్థి కోచ్ వెటోరి చెప్పడం వార్నర్ ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. వార్నర్‌కు కెప్టెన్‌గా ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో పెద్దగా అనుభవం లేదు. స్యామీ, సంగక్కర, ధావన్‌ల విఫల ప్రయత్నాల తర్వాత గత ఏడాది మధ్యలో వార్నర్‌ను కెప్టెన్‌ను చేసిన యాజమాన్యం ఈసారి చాలా ముందుగానే అతని పేరును ప్రకటించింది. ఒక్క వివాదం లేదు, తప్పుడు కూత కూయలేదు, కీలక సమయాల్లో ప్రత్యర్థి స్లెడ్జింగ్ చేసినా చిరునవ్వే సమాధానమైంది. నాయకత్వంలో జట్టుకు ఫెయిర్ ప్లే అవార్డు... డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ ఇంత గొప్పగా సాగుతుందని ఎవరూ ఊహించలేదు. మైదానం బయట అతని గత చరిత్రను, గొడవలను బట్టి వార్నర్‌ను అంచనా వేసినవారికి అతను తన సమర్థతతోనే సమాధానం చెప్పాడు. ముఖ్యంగా ‘మూగభాష’తోనే ముస్తఫిజుర్‌ను వాడుకున్న తీరు అతని నాయకత్వ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. కీలక సమయాల్లో, సరిగ్గా గురి చూసి కొట్టినట్లుగా బంగ్లా బౌలర్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ఇక బ్యాట్స్‌మెన్‌గా 848 పరుగులతో తిరుగులేని ఆటతీరు కనబర్చిన వార్నర్ సన్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచాడు. లోపాలున్నా... వార్నర్, బౌలర్ల వ్యక్తిగత ప్రదర్శనలు రైజర్స్ జట్టులోని ఇతర లోపాలు కనిపించకుండా చేశాయి. ఆలస్యంగా జట్టుతో చేరిన యువరాజ్ సింగ్ రెండు మ్యాచ్‌లు మినహా తన స్థాయికి తగిన ఆటను కనబర్చలేదు. విదేశీ ఆటగాళ్లు మోర్గాన్, విలియమ్సన్ ఇద్దరూ విఫలం కాగా... ఆల్‌రౌండర్‌గా హెన్రిక్స్ ఫర్వాలేదనిపించాడు. ఫీల్డింగ్‌లో తీవ్ర ఒత్తిడి సమయంలో అతను పట్టిన 11 క్యాచ్‌లు కీలక వికెట్లను అందించాయి. ఇక యువ ఆటగాడు దీపక్ హుడా 17 మ్యాచ్‌లు ఆడినా కేవలం 144 పరుగులతో అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచాడు. బౌలింగ్‌కంటే బిపుల్ శర్మ బ్యాటింగ్ రెండో క్వాలిఫయర్‌లో జట్టుకు పనికొచ్చింది. అయితే కొన్ని సమస్యలు సీజన్లో అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా... సమష్టితత్వం, సరైన వ్యూహాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. మన ఆటపై మనకు నమ్మకం ఉన్నప్పుడు గెలిచేందుకు ‘ఫ్యాన్సీ టీమ్’లాగా హడావిడి చేయాల్సిన అవసరం లేదని నిరూపించింది. ఇద్దరూ ఇద్దరే... గాయంతో నెహ్రా ఆడింది 8 మ్యాచ్‌లే... బరీందర్ ఆకట్టుకున్నా అద్భుతమైన బౌలర్ కాదు. ఇలాంటి స్థితిలో ఇద్దరు బౌలర్లు మొత్తం రైజర్స్ భారాన్ని మోశారు. ‘పర్పుల్ క్యాప్’ గెలుచుకున్న భువనేశ్వర్ (23 వికెట్లు)కు తోడుగా తనదైన శైలిలో కటర్లతో ముస్తఫిజుర్ (17) చెలరేగడం జట్టు విజయాలను సులువు చేసింది. ముఖ్యంగా ప్రత్యర్థి ఇన్నింగ్స్‌లో చివరి నాలుగు ఓవర్లు అంటే వీరిద్దరికి ఎదురు నిలిచి పోరాడటమే! 90 శాతానికిపైగా మ్యాచ్‌లలో వీరిద్దరు డెత్ ఓవర్లలో తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి జట్టును గెలిపించారు. ఒక దశలో ముగ్గురు లెఫ్టార్మ్ స్పిన్నర్లను తుది జట్టులో ఉంచి కూడా సన్ ఫలితం రాబట్టగలగడం, బౌల్ట్‌లాంటి స్టార్‌కు ఒకే మ్యాచ్‌లో అవకాశం రావడం ఆ జట్టు బౌలింగ్ బలానికి అద్దం పడుతుంది. ఎడమచేతి వాటం బౌలర్లు ప్రత్యేకమంటూ వేలంలో వారిపై దృష్టి పెట్టామని చెప్పిన లక్ష్మణ్ ముందుచూపు జట్టును విజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించింది. -
ఐపీఎల్ సూపర్ 11 ఎవరో తెలుసా?
క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ లాంటి అగ్రశ్రేణి ప్లేయర్ల దగ్గర్నుంచి అప్పటివరకు ఊరు, పేరు కూడా తెలియని ఎమర్జింగ్ ప్లేయర్లు కూడా ఆడేందుకు బ్రహ్మాండమైన వేదిక ఐపీఎల్. శరవేగంగా బ్యాట్ ఝళిపించడానికి, బంతితో మ్యాజిక్ చేసి వికెట్లను తిప్పితిప్పి పడేయడానికి.. తద్వారా తమ టాలెంట్‌ను తమ తమ క్రికెట్ బోర్డులకు పరిచయం చేసేందుకు ఉన్న ఓ అద్బుత అవకాశం. ఈసారి ఐపీఎల్ 9 సీజన్లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. చాలామంది ప్లేయర్ల టాలెంట్ వెలుగులోకి వచ్చింది. మరి ఈ సీజన్ మొత్తమ్మీద ఆడిన అన్ని జట్లలోని ప్లేయర్లందరినీ కలగలిపి, వారినుంచి ఒక జట్టును తయారుచేస్తే ఎలా ఉంటుంది? ఐపీఎల్ 9 సీజన్లో టాప్ 11 ప్లేయర్లు ఎవరు? ఆ డ్రీమ్ టీమ్ ఏంటి? ఒకసారి చూద్దామా.. నెంబర్ 1: విరాట్ కోహ్లీ (కెప్టెన్) మ్యాచ్‌లు: 16 పరుగులు: 973 అత్యధికం: 113 సగటు: 81.08 స్ట్రైక్ రేట్: 152.03 సెంచరీలు: 4 అర్ధ సెంచరీలు: 7 నెంబర్ 2: డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్) మ్యాచ్‌లు: 17 పరుగులు: 848 అత్యధికం: 93 నాటౌట్ సగటు: 60.57 స్ట్రైక్ రేట్: 151.42 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 9 నెంబర్ 3: క్వింటన్ డికాక్ మ్యాచ్‌లు: 13 పరుగులు: 445 అత్యధికం: 108 సగటు: 37.08 స్ట్రైక్ రేట్: 136.08 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 3 నెంబర్ 4: ఏబీ డివీలియర్స్ మ్యాచ్‌లు: 16 పరుగులు: 687 అత్యధికం: 129 నాటౌట్ సగటు: 52.84 స్ట్రైక్ రేట్: 168.79 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 6 నెంబర్ 5: అజింక్య రహానే మ్యాచ్‌లు: 14 పరుగులు: 480 అత్యధికం: 74 నాటౌట్ సగటు: 43.63 స్ట్రైక్ రేట్: 126.84 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 6 నెంబర్ 6: షేన్ వాట్సన్ మ్యాచ్‌లు: 16 పరుగులు: 179 అత్యధికం: 36 సగటు: 13.76 స్ట్రైక్ రేట్: 133.58 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 0 వికెట్లు: 20 ఉత్తమ బౌలింగ్: 29/4 నెంబర్ 7: ఆండ్రీ రసెల్ మ్యాచ్‌లు: 12 (8 ఇన్నింగ్స్) పరుగులు: 188 అత్యధికం: 39 నాటౌట్ సగటు: 26.85 స్ట్రైక్ రేట్: 164.91 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 0 వికెట్లు: 15 ఉత్తమ బౌలింగ్: 20/4 నెంబర్ 8: కృనాల్ పాండ్యా మ్యాచ్‌లు: 12 పరుగులు: 237 అత్యధికం: 86 సగటు: 39.50 స్ట్రైక్ రేట్: 191.12 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 1 వికెట్లు: 6 ఉత్తమ బౌలింగ్: 15/2 నెంబర్ 9: భువనేశ్వర్ కుమార్ మ్యాచ్‌లు: 17 వికెట్లు: 23 ఉత్తమ బౌలింగ్: 29/4 ఎకానమీ రేట్: 7.42 స్ట్రైక్ రేట్: 17.21 సగటు: 21.30 నెంబర్ 10: యజువేంద్ర చహల్ మ్యాచ్‌లు: 13 వికెట్లు: 21 ఉత్తమ బౌలింగ్: 25/4 ఎకానమీ రేట్: 8.15 స్ట్రైక్ రేట్: 14.04 సగటు: 19.09 నెంబర్ 11: ముస్తాఫిజుర్ రెహ్మాన్ మ్యాచ్‌లు: 16 వికెట్లు: 27 ఉత్తమ బౌలింగ్: 16/3 ఎకానమీ రేట్: 6.90 స్ట్రైక్ రేట్: 21.52 సగటు: 24.76 -
ఐపీఎల్ సూపర్ 11 ఎవరో తెలుసా?
క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ లాంటి అగ్రశ్రేణి ప్లేయర్ల దగ్గర్నుంచి అప్పటివరకు ఊరు, పేరు కూడా తెలియని ఎమర్జింగ్ ప్లేయర్లు కూడా ఆడేందుకు బ్రహ్మాండమైన వేదిక ఐపీఎల్. శరవేగంగా బ్యాట్ ఝళిపించడానికి, బంతితో మ్యాజిక్ చేసి వికెట్లను తిప్పితిప్పి పడేయడానికి.. తద్వారా తమ టాలెంట్‌ను తమ తమ క్రికెట్ బోర్డులకు పరిచయం చేసేందుకు ఉన్న ఓ అద్బుత అవకాశం. ఈసారి ఐపీఎల్ 9 సీజన్లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. చాలామంది ప్లేయర్ల టాలెంట్ వెలుగులోకి వచ్చింది. మరి ఈ సీజన్ మొత్తమ్మీద ఆడిన అన్ని జట్లలోని ప్లేయర్లందరినీ కలగలిపి, వారినుంచి ఒక జట్టును తయారుచేస్తే ఎలా ఉంటుంది? ఐపీఎల్ 9 సీజన్లో టాప్ 11 ప్లేయర్లు ఎవరు? ఆ డ్రీమ్ టీమ్ ఏంటి? ఒకసారి చూద్దామా.. నెంబర్ 1: విరాట్ కోహ్లీ (కెప్టెన్) మ్యాచ్‌లు: 16 పరుగులు: 973 అత్యధికం: 113 సగటు: 81.08 స్ట్రైక్ రేట్: 152.03 సెంచరీలు: 4 అర్ధ సెంచరీలు: 7 నెంబర్ 2: డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్) మ్యాచ్‌లు: 17 పరుగులు: 848 అత్యధికం: 93 నాటౌట్ సగటు: 60.57 స్ట్రైక్ రేట్: 151.42 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 9 నెంబర్ 3: క్వింటన్ డికాక్ మ్యాచ్‌లు: 13 పరుగులు: 445 అత్యధికం: 108 సగటు: 37.08 స్ట్రైక్ రేట్: 136.08 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 3 నెంబర్ 4: ఏబీ డివీలియర్స్ మ్యాచ్‌లు: 16 పరుగులు: 987 అత్యధికం: 129 నాటౌట్ సగటు: 52.84 స్ట్రైక్ రేట్: 168.79 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 6 నెంబర్ 5: అజింక్య రహానే మ్యాచ్‌లు: 14 పరుగులు: 480 అత్యధికం: 74 నాటౌట్ సగటు: 43.63 స్ట్రైక్ రేట్: 126.84 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 6 నెంబర్ 6: షేన్ వాట్సన్ మ్యాచ్‌లు: 16 పరుగులు: 179 అత్యధికం: 36 సగటు: 13.76 స్ట్రైక్ రేట్: 133.58 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 0 వికెట్లు: 20 ఉత్తమ బౌలింగ్: 29/4 నెంబర్ 7: ఆండ్రీ రసెల్ మ్యాచ్‌లు: 12 (8 ఇన్నింగ్స్) పరుగులు: 188 అత్యధికం: 39 నాటౌట్ సగటు: 26.85 స్ట్రైక్ రేట్: 164.91 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 0 వికెట్లు: 15 ఉత్తమ బౌలింగ్: 20/4 నెంబర్ 8: కృనాల్ పాండ్యా మ్యాచ్‌లు: 12 పరుగులు: 237 అత్యధికం: 86 సగటు: 39.50 స్ట్రైక్ రేట్: 191.12 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 1 వికెట్లు: 6 ఉత్తమ బౌలింగ్: 15/2 నెంబర్ 9: భువనేశ్వర్ కుమార్ మ్యాచ్‌లు: 17 వికెట్లు: 23 ఉత్తమ బౌలింగ్: 29/4 ఎకానమీ రేట్: 7.42 స్ట్రైక్ రేట్: 17.21 సగటు: 21.30 నెంబర్ 10: యజువేంద్ర చహల్ మ్యాచ్‌లు: 13 వికెట్లు: 21 ఉత్తమ బౌలింగ్: 25/4 ఎకానమీ రేట్: 8.15 స్ట్రైక్ రేట్: 14.04 సగటు: 19.09 నెంబర్ 11: ముస్తాఫిజుర్ రెహ్మాన్ మ్యాచ్‌లు: 16 వికెట్లు: 27 ఉత్తమ బౌలింగ్: 16/3 ఎకానమీ రేట్: 6.90 స్ట్రైక్ రేట్: 21.52 సగటు: 24.76 -
ఐపీఎల్-9 సూపర్ 11 ఎవరో తెలుసా?
క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ లాంటి అగ్రశ్రేణి ప్లేయర్ల దగ్గర్నుంచి అప్పటివరకు ఊరు, పేరు కూడా తెలియని ఎమర్జింగ్ ప్లేయర్లు కూడా ఆడేందుకు బ్రహ్మాండమైన వేదిక ఐపీఎల్. శరవేగంగా బ్యాట్ ఝళిపించడానికి, బంతితో మ్యాజిక్ చేసి వికెట్లను తిప్పితిప్పి పడేయడానికి.. తద్వారా తమ టాలెంట్‌ను తమ తమ క్రికెట్ బోర్డులకు పరిచయం చేసేందుకు ఉన్న ఓ అద్బుత అవకాశం. ఈసారి ఐపీఎల్ 9 సీజన్లో అనేక రికార్డులు బద్దలయ్యాయి. చాలామంది ప్లేయర్ల టాలెంట్ వెలుగులోకి వచ్చింది. మరి ఈ సీజన్ మొత్తమ్మీద ఆడిన అన్ని జట్లలోని ప్లేయర్లందరినీ కలగలిపి, వారినుంచి ఒక జట్టును తయారుచేస్తే ఎలా ఉంటుంది? ఐపీఎల్ 9 సీజన్లో టాప్ 11 ప్లేయర్లు ఎవరు? ఆ డ్రీమ్ టీమ్ ఏంటి? ఒకసారి చూద్దామా.. నెంబర్ 1: విరాట్ కోహ్లీ (కెప్టెన్) మ్యాచ్‌లు: 16 పరుగులు: 973 అత్యధికం: 113 సగటు: 81.08 స్ట్రైక్ రేట్: 152.03 సెంచరీలు: 4 అర్ధ సెంచరీలు: 7 నెంబర్ 2: డేవిడ్ వార్నర్ (వైస్ కెప్టెన్) మ్యాచ్‌లు: 17 పరుగులు: 848 అత్యధికం: 93 నాటౌట్ సగటు: 60.57 స్ట్రైక్ రేట్: 151.42 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 9 నెంబర్ 3: క్వింటన్ డికాక్ మ్యాచ్‌లు: 13 పరుగులు: 445 అత్యధికం: 108 సగటు: 37.08 స్ట్రైక్ రేట్: 136.08 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 3 నెంబర్ 4: ఏబీ డివీలియర్స్ మ్యాచ్‌లు: 16 పరుగులు: 687 అత్యధికం: 129 నాటౌట్ సగటు: 52.84 స్ట్రైక్ రేట్: 168.79 సెంచరీలు: 1 అర్ధ సెంచరీలు: 6 నెంబర్ 5: అజింక్య రహానే మ్యాచ్‌లు: 14 పరుగులు: 480 అత్యధికం: 74 నాటౌట్ సగటు: 43.63 స్ట్రైక్ రేట్: 126.84 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 6 నెంబర్ 6: షేన్ వాట్సన్ మ్యాచ్‌లు: 16 పరుగులు: 179 అత్యధికం: 36 సగటు: 13.76 స్ట్రైక్ రేట్: 133.58 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 0 వికెట్లు: 20 ఉత్తమ బౌలింగ్: 29/4 నెంబర్ 7: ఆండ్రీ రసెల్ మ్యాచ్‌లు: 12 (8 ఇన్నింగ్స్) పరుగులు: 188 అత్యధికం: 39 నాటౌట్ సగటు: 26.85 స్ట్రైక్ రేట్: 164.91 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 0 వికెట్లు: 15 ఉత్తమ బౌలింగ్: 20/4 నెంబర్ 8: కృనాల్ పాండ్యా మ్యాచ్‌లు: 12 పరుగులు: 237 అత్యధికం: 86 సగటు: 39.50 స్ట్రైక్ రేట్: 191.12 సెంచరీలు: 0 అర్ధ సెంచరీలు: 1 వికెట్లు: 6 ఉత్తమ బౌలింగ్: 15/2 నెంబర్ 9: భువనేశ్వర్ కుమార్ మ్యాచ్‌లు: 17 వికెట్లు: 23 ఉత్తమ బౌలింగ్: 29/4 ఎకానమీ రేట్: 7.42 స్ట్రైక్ రేట్: 17.21 సగటు: 21.30 నెంబర్ 10: యజువేంద్ర చహల్ మ్యాచ్‌లు: 13 వికెట్లు: 21 ఉత్తమ బౌలింగ్: 25/4 ఎకానమీ రేట్: 8.15 స్ట్రైక్ రేట్: 14.04 సగటు: 19.09 నెంబర్ 11: ముస్తాఫిజుర్ రెహ్మాన్ మ్యాచ్‌లు: 16 వికెట్లు: 27 ఉత్తమ బౌలింగ్: 16/3 ఎకానమీ రేట్: 6.90 స్ట్రైక్ రేట్: 21.52 సగటు: 24.76 -
మేమిద్దరం మరి కాసేపు ఉంటే.. రిజల్టే వేరు: కోహ్లీ
గెలుపు ఓటములను సమానంగా తీసుకోవడం చాలా కష్టం. అందులోనూ దాదాపు చేతివరకు వచ్చిందనుకున్న విజయం చేజారిపోతే ఇంకా కష్టం. సరిగ్గా ఇలాంటి కష్టమే టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి వచ్చింది. ఫైనల్ మ్యాచ్‌లో తాను, ఏబీ డివీలియర్స్ వెంటవెంటనే ఔటయిపోవడమే తమకు పెద్ద శరాఘాతంలా పరిణమించిందని కోహ్లీ విశ్లేషించాడు. సీజన్ మొత్తం తాము చాలా బాగా ఆడినందుకు గర్వంగానే ఉందని, బెంగళూరు అభిమానులు తాము అసలు సరిగా ఆడనప్పుడు కూడా మద్దతు ఇచ్చారని అన్నాడు. మరి కొంతసేపు తాను, డివీలియర్స్ కలిసి ఆడి ఉంటే.. ఫలితం వేరేగా ఉండేదని మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజంటేషన్ కార్యక్రమంలో అన్నాడు. 54 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ అవుట్ కాగా, డివీలియర్స్ కేవలం 5 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి బిపుల్ శర్మ బౌలింగ్‌లో వెనుదిరగడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన సంగతి తెలిసిందే. 973 పరుగులు సాధించి ఆరంజ్ క్యాప్‌ను సొంతం చేసుకోవడం బాగానే ఉంది గానీ, విజయానికి అవతలివైపు ఉండి దీన్ని సాధించడం అంత బాగా అనిపించడంలేదని చెప్పాడు. సన్‌రైజర్స్ బౌలింగ్ ఎటాక్ చాలా బలంగా ఉందని, అందుకే వాళ్లు గెలిచారని అన్నాడు. -
అతడి చేతిలో టీమిండియా భద్రంగా ఉంటుంది!
కప్పు సొంతం అయిన తర్వాత ఇదంతా మావాళ్ల క్రెడిట్.. కుర్రోళ్లు బాగా ఆడారు అని చెప్పడం మామూలే. కానీ, తమను దాదాపు ఓడించినంత పని చేసిన ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌ను ఆకాశానికి ఎత్తేయడం ఎక్కడైనా చూశారా? ఐపీఎల్ 9లోనే అది సాధ్యమైంది. సన్‌రైజర్స్ జట్టుకు కప్పు వచ్చిన తర్వాత ఎలాగైనా మైదానం నుంచి వెళ్లిపోవాలని కోహ్లీ ప్రయత్నించాడు. కానీ, అతడికి అది సాధ్యం కాలేదు. 973 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. అందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ విషయాన్ని కప్పు సాధించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ మర్చిపోలేదు. ''కోహ్లీ తన జట్టును ముందుండి ఎలా నడిపించాడో చూడండి.. అతడో గొప్ప కెప్టెన్. రాబోయే కొన్నేళ్ల పాటు భారత భవిష్యత్తు అతడి చేతుల్లో భద్రంగా ఉంటుంది. అతడు ఈ టోర్నమెంటులో అందరికీ లక్ష్యాలు నిర్దేశించాడు'' అని కోహ్లీని వార్నర్ ప్రశంసల్లో ముంచెత్తాడు. నిజానికి కోహ్లీ - వార్నర్ మధ్య 2014 ఆస్ట్రేలియా పర్యటనలో చాలా పెద్ద గొడవే జరిగింది. అయినా వార్నర్ మాత్రం దాన్ని మనసులో పెట్టుకోలేదు. ఐపీఎల్లో టాప్ క్లాస్ ఆటను రుచిచూపించిన కోహ్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని తన మనసులో మాట చెప్పాడు. ఆ మాట చెప్పగానే స్టేడియం అంతా చప్పట్లతో మార్మోగిపోయింది. ఇక తన సొంత టీమ్‌ను కూడా వార్నర్ ప్రత్యేకంగా పొగిడాడు. కెప్టెన్ వార్నర్‌తో పాటు శిఖర్ ధావన్ కూడా పవర్‌ప్లే సమయంలో అద్భుతంగా రాణించడంతో మొదటి బ్యాటింగ్ ఎందుకు తీసుకున్నారో అందరికీ అర్థమైంది. ఇక బంగ్లా యువ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అయితే సన్ రైజర్స్ బౌలింగ్ లైనప్‌కు పెట్టని కోటలా నిలిచాడు. ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్ ఇద్దరూ తమ వయసును లెక్క చేయకుండా అద్భుతాలు చూపించారు. ఈ అంశాలన్నింటినీ కూడా వార్నర్ ప్రస్తావించాడు. -
ఐపీఎల్లో అదృశ్య హస్తం పనిచేసిందా?
సన్‌రైజర్స్ జట్టు ఐపీఎల్ 9 టైటిల్ గెలుస్తుందని నిజానికి ఈ టోర్నమెంటులోని ఏ దశలోనూ ఎవరూ అనుకోలేదు. అందరి కళ్లూ బెంగళూరు మీదే ఉన్నాయి. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివీలియర్స్, షేన్ వాట్సన్.. ఇలా ఒకళ్లకు మించి మరొక హిట్టర్లున్న ఆ జట్టును తలదన్నేవాడు ఎవడన్న ఊహ కూడా ఎవరికీ లేదు. కానీ ఒక అదృశ్య శక్తి మాత్రం సన్‌రైజర్స్ శక్తి మీద నమ్మకం ఉంచింది. నిరంతరం వారిని వెన్నంటి ఉంటూ ధైర్యం నూరిపోసింది. ఏ దశలోనైనా జట్టు బలాన్ని నమ్ముకోవాలి తప్ప అవతలి జట్టును అతిగా ఊహించుకుని భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. ఆ అదృశ్య శక్తే సన్ రైజర్స్ జట్టు మెంటార్ వెరీ వెరీ స్పెషల్.. వీవీఎస్ లక్ష్మణ్. అవును.. జట్టు మెంటార్‌గా ఉన్న లక్ష్మణ్ ప్రతి క్షణం జట్టుకు కావల్సిన నైతిక స్థైర్యాన్ని అందించాడు. ఇదే విషయాన్ని కప్పు గెలిచిన తర్వాత సన్ రైజర్స్ కీలక బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా చెప్పాడు. స్లాగ్ ఓవర్లలో రన్‌రేటును గణనీయంగా తగ్గించడంలో స్పెషలిస్టుగా మారిన భువీ.. తమకు అదృశ్యశక్తిగా మద్దతు ఇచ్చిన లక్ష్మణ్‌కు థాంక్స్ చెప్పాడు. ఆయన చాలా కీలకంగా పనిచేశారని, తెరవెనుక ఆయన చేసిన కృషివల్లే తెరముందు తాము బాగా ఆడగలిగామని, తమకు సపోర్ట్ చేసినందుకు థాంక్స్ అని ట్వీట్ చేశాడు. మొత్తమ్మీద అదృశ్య శక్తిగా మారిన లక్ష్మణ్.. సన్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడన్న మాట. The invisible supporting the visible, who does incredibly important work. Thank for supporting us @VVSLaxman281 pic.twitter.com/p4hlsUz0j7 — Bhuvneshwar Kumar (@BhuviOfficial) 29 May 2016 -
కాస్కో కోహ్లి....
► సవాల్ విసురుతున్న వార్నర్ ► నేడు ఐపీఎల్ ఫైనల్ ► బెంగళూరుతో హైదరాబాద్ ఢీ ► తొలి టైటిల్‌పై ఇరు జట్ల కన్ను ఇద్దరూ ఇద్దరే...బ్యాట్‌కు అలుపన్నదే లేకుండా రికార్డు స్థాయిలో పరుగుల ప్రవాహం సాగించింది ఒకరు... అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించింది మరొకరు... ఆశలు లేని స్థితినుంచి జట్టును ఆఖరి మెట్టు వరకు ఒకరు తీసుకొస్తే... అంతా తానై నడిపించింది మరొకరు. ఐపీఎల్-9లో బ్యాట్స్‌మన్‌గానే కాకుండా నాయకులుగా కూడా తమదైన ముద్ర చూపించిన విరాట్ కోహ్లి, డేవిడ్ వార్నర్ ఇప్పుడు చివరిసారి అమీతుమీకి సిద్ధమయ్యారు. టోర్నీ ఆసాంతం మిస్టర్ పర్ఫెక్ట్గా నిలిచిన కోహ్లికి ఇప్పుడు వార్నర్ రూపంలో సవాల్ ఎదురుగా నిలిచింది. మ్యాచ్ బెంగళూరు, హైదరాబాద్ మధ్యే అయినా తొలిసారి తమ జట్టుకు టైటిల్ అందించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్న ఈ ఇద్దరు స్టార్లలో ఎవరిది పైచేయి కానుందో! బెంగళూరు: ఐపీఎల్లో గతంలో రెండుసార్లు ఫైనల్‌కు చేరినా ఓటమితో వెనుదిరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓవైపు... తమ నాలుగో సీజన్లో తుది పోరుకు అర్హత సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోవైపు... టోర్నీలో చాంపియన్‌గా నిలిచేందుకు ఇరు జట్లు అస్త్ర శస్త్రాలతో సన్నద్ధమయ్యాయి. నేడు (ఆదివారం) ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఐపీఎల్-9 ఫైనల్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచి తొలి క్వాలిఫయర్‌లో విజయం అనంతరం బెంగళూరు ఫైనల్లోకి ప్రవేశించింది. మరోవైపు గ్రూప్ దశలో మూడో స్థానంలో నిలిచిన అనంతరం... ఎలిమినేటర్, రెండో క్వాలిఫయర్లలో గెలిచి రైజర్స్ ముందంజ వేసింది. ప్రధానంగా తమ బ్యాటింగ్‌పై ఆధారపడుతున్న ఆర్సీబీ, బౌలర్లపై ఎక్కువగా నమ్మకముంచిన సన్ జట్ల మధ్య హోరాహోరీ పోరుకు అవకాశం ఉంది. ఒకరిని మించి మరొకరు ఐపీఎల్ ఆరంభం సీజన్ నుంచి బెంగళూరు జట్టు ఎన్నో గొప్ప మ్యాచ్‌లు గెలిచింది. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆటగాళ్లు అలరించారు. కానీ టైటిల్ మాత్రం దక్కలేదు. ఈ సారి ఆ జట్టు బ్యాటింగ్ మరింత విధ్వంసకరంగా మారింది. విరాట్ కోహ్లి ఏకంగా 919 పరుగులతో లీగ్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. తన ప్రియమైన గ్రౌండ్లో అతడిని ఆపడం చాలా కష్టం. కోహ్లి విఫలమైనా జట్టుకు ఏమీ కాదని గత మ్యాచ్‌లో డివిలియర్స్ చూపించగా... క్రిస్‌గేల్ కుదురుకుంటే ఎంత ప్రమాదకరమో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముగ్గురితో పాటు కేఎల్ రాహుల్ కూడా దూకుడుగా ఆడుతుండగా, అవకాశం దక్కినప్పుడు వాట్సన్, బిన్నీ ఆకట్టుకున్నారు. అచ్చొచ్చిన సొంత మైదానంలో ఇంత బలమైన లైనప్ చెలరేగిపోతే ఆకాశమే హద్దు కానుంది. 15 ఓవర్ల మ్యాచ్‌లో కూడా 200కు పైగా పరుగులు నమోదైన చిన్నస్వామి స్టేడియంలో మరోసారి అలాంటి మెరుపులకు అవకాశం ఉంది. బెంగళూరు బౌలింగ్ అద్భుతంగా లేకపోయినా... లీగ్ సాగిన కొద్దీ వారంతా నిలదొక్కుకోవడంతో కోహ్లి తన వ్యూహాలతో మంచి ఫలితం రాబట్టగలిగాడు. లెగ్ స్పిన్నర్ చహల్ మరోసారి కీలకం కానున్నాడు. వార్నర్‌కు అండగా నిలుస్తారా..? ప్రత్యర్థి బ్యాటింగ్‌తో పోలిస్తే రైజర్స్ సరితూగడం లేదు. డేవిడ్ వార్నర్ (779 పరుగులు) దూకుడైన బ్యాటింగే ఆ జట్టును ముందుకు నడిపించింది. శిఖర్ ధావన్ (473) ఫర్వాలేదనిపించినా...అతని బ్యాటింగ్ సహజశైలికి భిన్నంగా (117 స్ట్రైక్‌రేట్) సాగడంతో జట్టుకు మెరుపు ఆరంభం లభించలేదు. వీరిద్దరు జతగా చెలరేగితే సన్ భారీస్కోరుకు అవకాశం ఉంటుంది. రెండు మ్యాచ్‌లలో ఆకట్టుకున్న యువరాజ్ సింగ్ ఫైనల్లో గొప్ప ఇన్నింగ్స్ ఆడాలని సన్ ఆశిస్తోంది. అయితే రైజర్స్ బలమైన బౌలింగ్ జట్టు నమ్మకాన్ని నిలబెట్టింది. 23 వికెట్లతో పర్పుల్ క్యాప్‌తో ఉన్న భువనేశ్వర్ పవర్‌ప్లేలో చెలరేగితే మ్యాచ్ ఫలితాన్ని శాసించగలడు. ఇన్నింగ్స్ చివర్లో కూడా భువీ యార్కర్లతో చెలరేగిపోతున్నాడు. గత మ్యాచ్ ఆడని ముస్తఫిజుర్ గాయంనుంచి కోలుకోవాలని జట్టు కోరుకుంటోంది. ప్రత్యర్థిని పూర్తిగా కట్టి పడేస్తున్న ముస్తఫిజుర్‌తో భువీ జత కలిస్తే రైజర్స్ అద్భుతాలు చేయవచ్చు. బరీందర్, బిపుల్ కూడా ఫర్వాలేదనిపిస్తున్నారు. తాజా ఫామ్ గత ఎనిమిది మ్యాచ్‌లలో బెంగళూరు ఏడు గెలిచింది. ఇందులో వరుసగా ఆరు విజయాలు వచ్చాయి. మరో వైపు సన్ గత 8 మ్యాచ్‌లలో 5 గెలిచింది. గ్రూప్‌లో చివరి ఆరు మ్యాచ్‌లలో 3 గెలిచి, 3 ఓడిన సన్‌రైజర్స్ అనంతరం ఎలిమినేటర్, క్వాలిఫయర్ నెగ్గింది. అయితే గత రెండు మ్యాచ్‌లు ఫైనల్ వేదికకు పూర్తిగా భిన్నమైన ఢిల్లీ పిచ్‌పై ఆడటం కొంత ప్రతికూలాంశం. చెరో మ్యాచ్‌లో... లీగ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లు చెరొకటి నెగ్గాయి. తమ సొంత వేదికపై మ్యాచ్‌ను జట్లు కాపాడుకున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లలో కోహ్లి 75, 14 పరుగులు చేయగా... వార్నర్ 58, 92 పరుగులతో పైచేయి సాధించాడు. చిన్నస్వామి స్టేడియంలో ఆడిన 8 మ్యాచ్‌లలో కోహ్లి 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో పాటు ఒకసారి డకౌటయ్యాడు. గతం... 2009 ఐపీఎల్ ఫైనల్లో నాటి హైదరాబాద్ జట్టు డెక్కన్ చార్జర్స్ చేతిలో, 2011 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో బెంగళూరు ఓడింది. సన్‌రైజర్స్ 2013లో ఐపీఎల్లో ప్రవేశించి ప్లేఆఫ్ చేరగా, తర్వాతి రెండు సీజన్లు టాప్-4లో నిలవడంలో విఫలమైంది. తుది జట్ల వివరాలు (అంచనా) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: కోహ్లి (కెప్టెన్), గేల్, డివిలియర్స్, రాహుల్, వాట్సన్, బిన్నీ, సచిన్ బేబీ, జోర్డాన్, అబ్దుల్లా, అరవింద్, చహల్. సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (కెప్టెన్), ధావన్, హెన్రిక్స్, యువరాజ్, హుడా, కటింగ్, ఓజా, భువనేశ్వర్, బిపుల్, బరీందర్, బౌల్ట్/ముస్తఫిజుర్ పిచ్, వాతావరణం చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్లో పరుగుల ప్రవాహానికి చిరునామా. గత మ్యాచ్‌లో అనూహ్యంగా బౌలింగ్‌కు అనుకూలించినా... ఫైనల్‌కు మాత్రం మళ్లీ బ్యాటింగ్ వికెట్ సిద్ధంగా ఉంది.ఆదివారం చిరు జల్లులకు అవకాశం ఉంది. ఒకవేళ వర్షంతో ఏదైనా సమస్య ఎదురైనా సోమవారం ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. -
ఐపీఎల్ తర్వాత గేల్‌పై విచారణ!
ఇంగ్లండ్ మహిళా జర్నలిస్ట్‌తో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాయల్ చాలెంజర్స్ క్రికెటర్ క్రిస్‌గేల్‌పై బీసీసీఐ విచారణ చేపట్టనుంది. ‘ఐపీఎల్ ఆడేందుకు వచ్చి ఇంటర్వ్యూలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఉపేక్షించకూడదు. దీనిపై బెంగళూరు జట్టు యాజమాన్యంతో మాట్లాడతాం. టోర్నీ ముగిసిన తర్వాత విచారణ చేపడతాం’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. -
ఫైనల్లో ఏం జరుగుతుందో..: డివిలియర్స్
బెంగళూరు: వన్ మ్యాన్ షో తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఐపీఎల్-9 ఫైనల్స్ క్ చేర్చాడు ఏబీ డివిలియర్స్. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని 47 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 79 పరుగులతో చివరివరకూ నిలిచి ఒత్తిడిని జయించాడు. గుజరాత్ లయన్స్ ను ఓడించి తన జట్టు బెంగళూరు ఫైనల్స్ కు చేరడంతో చాలా ఆనందంగా ఉందన్నాడు. అయితే ఫైనల్ కు చేరడం తనకు చాలా గొప్ప విషయమని ఏబీ అభిప్రాయపడ్డాడు. తమ జట్టు బౌలింగ్ చేస్తున్నప్పుడు పిచ్ చాలా ఫన్నీగా ఉందని, ప్రత్యర్ధి స్కోరు 160 దాటితే కష్టమని భావించినట్లు పేర్కొన్నాడు. తన కెరీర్ లో ఎక్కువ ఫైనల్ మ్యాచులు ఆడలేదని, అందుకే ప్రస్తుతం ఆడబోయే ఫైనల్ తనకు చాలా విలువైనదని చెప్పాడు. బెంగళూరు తరఫున ఆరేళ్లుగా ఆడుతున్నా.. ఫైనల్ మ్యాచ్ మాత్రం ఆడలేదని ప్రస్తుతం తనకు ఆ గౌరవం దక్కుతుందన్నాడు. గుజరాత్ పై ఇన్నింగ్స్ బెస్ట్ ఇన్నింగ్స్ అని భావిస్తున్నారా అన్న మీడియా ప్రశ్నకు బదులుగా.. టీమ్ విజయానికి తోడ్పడే తన ప్రతి ఇన్నింగ్స్ విలువైనదని చెప్పాడు. గణాంకాల గురించి అసలు పట్టించుకోను.. సెంచరీలు, హాఫ్ సెంచరీల గురించి ఆలోచించను, అవి కేవలం అంకెలు మాత్రమే అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఫైనల్లో ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ టీమ్ స్పిరిట్ బాగుందని సహచరులను ప్రశంసించాడు. -
కోహ్లి(సేన)ని ఆపతరమా!
► ప్లే ఆఫ్‌లో చోటు ► ఢిల్లీకి తప్పని నిరాశ ► కోహ్లి అజేయ అర్ధ సెంచరీ పోరాటమంటే బెంగళూరుదే... వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో అనుకున్నది సాధించింది. అత్యద్భుత ప్రదర్శనతో సగర్వంగా ప్లే ఆఫ్‌లో చోటు దక్కించుకుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్ బౌలర్లు కాస్త ఇబ్బంది పెట్టినా పరిస్థితులకు తగ్గట్టు ఆడిన కోహ్లి మరోసారి అండగా నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో మెరుగైన రన్‌రేట్ ఆధారంగా పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అటు పేలవ బ్యాటింగ్‌తో ఢిల్లీ మూల్యం చెల్లించుకుని ఐపీఎల్ నుంచి నిష్ర్కమించింది. రాయ్‌పూర్: ఇరు జట్లకిదే చివరి లీగ్ మ్యాచ్.. గెలిచిన జట్టుకే ప్లే ఆఫ్‌లో చోటు.. కానీ ఒత్తిడిని అధిగమించలేకపోయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కీలక మ్యాచ్‌లో చతికిలపడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రం తమ లక్ష్యాన్ని అందుకుంది. తొలి మూడు ఓవర్లలోనే గేల్, డివిలియర్స్‌ను కోల్పోయినా విరాట్ కోహ్లి (45 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు) మరోసారి జట్టుకు మూలస్తంభంలా నిలిచాడు. ఫలితంగా ఆదివారం షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఢిల్లీ బౌలర్లు చివరి వరకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 138 పరుగులు చేసింది. ఓపెనర్ డి కాక్ (52 బంతుల్లో 60; 5 ఫోర్లు; 1 సిక్స్) ఒంటరి పోరుకు ఢిల్లీ బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. యజువేంద్ర చాహల్‌కు మూడు, గేల్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బెంగళూరు 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 139 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది. డి కాక్ ఒంటరి పోరు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ డి కాక్ అద్భుత ఇన్నింగ్స్ మినహా చెప్పుకోవడానికి ఏమీ లేదు. రెండో ఓవర్లోనే జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రిషబ్ (1)ను శ్రీనాథ్ అవుట్ చేశాడు. అటువైపు డి కాక్ మాత్రం వేగంగా ఆడేందుకు ప్రాధాన్యమిస్తూ నాలుగో ఓవర్లో సిక్స్, ఫోర్ బాదాడు. కానీ ఆరో ఓవర్లో ఢిల్లీకి మరో ఝలక్ తగిలింది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో చివరికంటా నిలబడి జట్టుకు కీలక విజయాన్ని అందించిన కరుణ్ నాయర్ (10 బంతుల్లో 11; 1 సిక్స్)ను చాహల్ వెనక్కి పంపాడు. మిడాఫ్‌లో కొట్టిన భారీ షాట్‌ను కోహ్లి ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి తీసుకున్న ఈ సూపర్బ్ క్యాచ్ టోర్నీలో హైలైట్ క్యాచ్‌ల్లో ఒకటిగా నిలుస్తుంది. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ 48/2 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ (12 బంతుల్లో 17; 1 ఫోర్; 1 సిక్స్) ఉన్న కొద్దిసేపు వేగంగా ఆడినా చాహల్ అతణ్ని కూడా దెబ్బతీశాడు. డి కాక్‌ను 17వ ఓవర్లో చాహల్ అవుట్ చేయడంతో ఢిల్లీ జట్టు భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది. కోహ్లి.. అదే జోరు స్వల్ప లక్ష్యం కోసం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరును ఆరంభంలోనే ఢిల్లీ వణికించినా నిలకడైన బ్యాటింగ్‌తో కోహ్లి తుది కంటా క్రీజులో నిలిచి ఆదుకున్నాడు. రెండో ఓవర్లో మోరిస్ బంతికి క్రిస్ గేల్ (1) బౌల్డ్ కాగా మూడో ఓవర్లో డివిలియర్స్ (6)ను జహీర్ పెవిలియన్‌కు పంపాడు. అప్పటికి స్కోరు 17 పరుగులు మాత్రమే. ఈ సమయంలో కోహ్లికి జతగా రాహుల్ కలిశాడు. ఇద్దరూ కాసేపు దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో బెంగళూరు జట్టు స్కోరు 49/2కి చేరింది. సమన్వయంతో ముందుకెళుతున్న ఈ జోడిని బ్రాత్‌వైట్ విడదీశాడు. రాహుల్‌ను బౌల్డ్ చేయడంతో మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు సహకరించడంతో వాట్సన్ (18 బంతుల్లో 14; 1 సిక్స్), కోహ్లి ఆచితూచి ఆడారు. 14వ ఓవర్లో ఓ సిక్స్ బాదిన వాట్సన్‌ను మరుసటి ఓవర్లోనే నేగి అవుట్ చేశాడు. చివరి 30 బంతుల్లో 28 పరుగులు రావాల్సి ఉండగా బిన్నీ (11 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) సహకారంతో మరో 11 బంతులుండగానే కోహ్లి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) జోర్డాన్ (బి) చాహల్ 60; రిషబ్ పంత్ (సి) రాహుల్ (బి) శ్రీనాథ్ 1; కరుణ్ నాయర్ (సి) కోహ్లి (బి) చాహల్ 11; శామ్సన్ (సి) రాహుల్ (బి) చాహల్ 17; బిల్లింగ్ (సి) గేల్ (బి) జోర్డాన్ 4; నేగి (సి) డివిలియర్స్ (బి) గేల్ 6; బ్రాత్‌వైట్ (సి) వాట్సన్ (బి) గేల్ 1; మోరిస్ నాటౌట్ 27; జయంత్ యాదవ్ రనౌట్ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1-11, 2-42, 3-71, 4-81, 5-96, 6-98, 7-107, 8-138. బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 2-0-15-0; శ్రీనాథ్ అరవింద్ 4-0-28-1; జోర్డాన్ 2-0-10-1; వాట్సన్ 4-0-27-0; చాహల్ 4-0-32-3; అబ్దుల్లా 2-0-14-0; గేల్ 2-0-11-2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (బి) మోరిస్ 1; కోహ్లి నాటౌట్ 54; డివిలియర్స్ (సి) రిషబ్ (బి) జహీర్ 6; రాహుల్ (బి) బ్రాత్‌వైట్ 38; వాట్సన్ (సి) బిల్లింగ్స్ (బి) నేగి 14; బిన్నీ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1-5, 2-17, 3-83, 4-111. బౌలింగ్: జహీర్ 4-0-30-1; మోరిస్ 3-0-31-1; నేగి 3-0-19-1; మిశ్రా 4-0-33-0; జయంత్ యాదవ్ 1-0-8-0, బ్రాత్‌వైట్ 3.1-0-18-1. -
ప్లే ఆఫ్‌లో ఎవరితో ఎవరు?
రాయ్‌పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ప్రేక్షకులకు, వీక్షకులకు గట్టి మజా అందించిన పొట్టి క్రికెట్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఆదివారం నాటి మ్యాచ్ లతో లీగ్స్ రౌండ్ ముగిసింది. మంగళవారం నుంచి మొదలయ్యే ప్లే ఆఫ్స్ కు గుజరాత్ లయన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిచిచిన గుజరాత్, బెంగళూరులు 24న జరిగే మొదటి క్వాలిఫయర్ లో పోటీపడతాయి. ఇందులో నెగ్గిన జట్టు నేరుగా ఫైనల్స్ కు వెళుతుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్ 1లో విన్ అయిన టీమ్ తో తలపడుతుంది. 25న జరగనున్న తొలి ఎలిమినేటర్ లో హైదరాబాద్, కోల్ కతాలు తలపడతాయి. 27న క్వాలిఫయర్ 2 జరుగుతుంది. 29 ఆదివారం ఫైనల్స్ జరుగుతుంది. ఇక ముందు జరిగే మ్యాచ్ లు అన్ని రాత్రి 8 గంటలకే ప్రారంభం అవుతాయి. లీగ్స్ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టిక, ప్లే ఆఫ్ షెడ్యూల్ ఇలా ఉన్నాయి.. -
కోల్‌కతా చేతుల్లోనే...
► ముంబైపై విజయంతో గుజరాత్ జట్టు ప్లే ఆఫ్‌కు చేరడంతో పాటు టాప్-2లో ఒక స్థానాన్ని ఖరారు చేసుకుంది. సన్‌రైజర్స్ కూడా ప్లే ఆఫ్‌కు చేరింది. ► నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కోల్‌కతా గెలిస్తే... హైదరాబాద్, కోల్‌కతా రెండూ ప్లే ఆఫ్‌కు వెళతాయి. బెంగళూరు, ఢిల్లీ మ్యాచ్‌లో విజేత ముందుకు వస్తుంది. ► ఒకవేళ హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వస్తుంది. కోల్‌కతా 14 పాయింట్ల దగ్గర ఆగుతుంది. అప్పుడు రెండో మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే... ఢిల్లీ, బెంగళూరు (14 పాయింట్లే అయినా మెరుగైన రన్‌రేట్ వల్ల) ముందుకు వెళతాయి. ఒకవేళ బెంగళూరు గెలిస్తే... కోల్‌కతా, ఢిల్లీ, ముంబై 14 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు మెరుగైన రన్‌రే ట్ ఉన్న జట్టు (కోల్‌కతాకు ఎక్కువ అవకాశం ఉంది) ముందుకు వస్తుంది. -
ఐపీఎల్ 9 నుంచి ముంబై నిష్క్రమణ
► ప్లేఆఫ్‌కు గుజరాత్ ► డ్వేన్ స్మిత్ ఆల్‌రౌండ్ షో ► సురేశ్ రైనా మెరుపులు ఆఖరి మ్యాచ్‌కు ముందు చేతిలో 16 పాయింట్లు ఉన్నా గెలవకపోతే ఇంటికెళ్లే ప్రమాదంతో ఉన్న గుజరాత్ లయన్స్ జట్టు కీలక మ్యాచ్‌లో చెలరేగిపోయింది. డ్వేన్ స్మిత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన... రైనా, మెకల్లమ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ప్లేఆఫ్‌కు చేరడంతో పాటు టాప్-2లో స్థానాన్ని ఖరారు చేసుకుంది. అటు డిఫెండింగ్ చాంపియన్ ముంబై చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో ఇంటిముఖం పట్టింది. ఇక ఏదైనా అత్యద్భుతం జరిగితే తప్ప రోహిత్ సేనకు ప్లేఆఫ్ అవకాశం లేదు. కాన్పూర్: సురేశ్ రైనా (36 బంతుల్లో 58; 8 ఫోర్లు; 2 సిక్సర్లు), మెకల్లమ్ (27 బంతుల్లో 48; 8 ఫోర్లు; 1 సిక్స్), డ్వేన్ స్మిత్ (23 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) దుమ్ము రేపే ఆటతీరుతో చెలరేగడంతో గుజరాత్ లయన్స్ ప్లే ఆఫ్‌కు చేరింది. శనివారం గ్రీన్‌పార్క్‌లో జరిగిన మ్యాచ్‌లో లయన్స్ 6 వికెట్ల తేడాతోముంబై ఇండియన్స్‌పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీష్ రాణా (36 బంతుల్లో 70; 7 ఫోర్లు; 4 సిక్సర్లు) ఒక్కడే పోరాడాడు. బట్లర్ (31 బంతుల్లో 33; 3 ఫోర్లు), రోహిత్ (17 బంతుల్లో 30; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ప్రవీణ్, ధావల్, స్మిత్, బ్రేవోలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసి నెగ్గింది. జడేజా (15 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) రాణించాడు. వినయ్‌కు రెండు వికెట్లు దక్కాయి. రాణా జోరు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ ధాటిగా ఆరంభించాడు. వేగంగా పరుగులు తీసే క్రమంలో ధావల్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్స్ బాదిన అనంతరం క్యాచ్ అవుటయ్యాడు. మరసటి ఓవర్లోనే గప్టిల్ (7), కృనాల్ (4)ను డ్వేన్ స్మిత్ పెవిలియన్‌కు పంపి ముంబైని గట్టి దెబ్బే తీశాడు. ఈ దశలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన నితీష్ రాణా ముంబైకి ఆపద్భాందవుడయ్యాడు. బట్లర్‌తో కలిసి కొద్దిసేపు నిదానంగానే ఆడినా అనంతరం ఇరువురూ విజృంభించారు. 11వ ఓవర్లో రాణా ఓ సిక్స్, ఫోర్‌తో వేగం పెంచాడు. తర్వాతి ఓవర్లోనూ 4,6తో జట్టును వంద పరుగులు దాటించాడు. అయితే బ్రేవో అద్భుత రిటర్న్ క్యాచ్‌తో బట్లర్ అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా దూకుడు తగ్గించని రాణా స్పిన్నర్ జకాతి బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. ఈక్రమంలో 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మరో 8 బంతుల్లోనే 20 పరుగులు చేసిన తను బ్రేవో బౌలింగ్‌లో డీప్ స్క్వేర్ లెగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. అనంతరం వచ్చిన బ్యాట్స్‌మెన్ పూర్తిగా నిరాశపరిచారు. పొలార్డ్ (9) తోపాటు హార్దిక్ (7), హర్భజన్ (3)ను వెంటవెంటనే అవుట్ చేసిన లయన్స్ ముంబైని నిలువరించింది. చివరి నాలుగు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే చేసిన ముంబై నాలుగు వికెట్లను కోల్పోయింది. వీరి ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. రైనా, మెకల్లమ్ మెరుపులు: ఓపెనర్‌గా దిగిన ఆరోన్ ఫించ్‌ను రెండో బంతికే వినయ్ కుమార్ ఎల్బీగా పంపడంతో లయన్స్‌కు షాక్ తగిలింది. తొలి రెండు ఓవర్లు ఎనిమిది పరుగులే వచ్చినా ఆ తర్వాత రైనా, మెకల్లమ్ బ్యాట్ ఝళిపించారు. మెక్లీనగర్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రైనా మూడు ఫోర్లు, సిక్స్‌తో 18 పరుగులు రాబట్టగా ఐదో ఓవర్లో మెకల్లమ్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో దూకుడు కనబరిచాడు. ఆరో ఓవర్లో 4,6తో జోరు మీదున్న రైనా ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను బుమ్రా అందుకోలేకపోయాడు. ఇదే ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదగా 19 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో లయన్స్ 70/1 స్కోరు చేసింది. అయితే పదో ఓవర్లో జోరు మీదున్న మెకల్లమ్‌ను హర్భజన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. రైనా ఓ ఫోర్‌తో 30 బంతుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ చేశాడు. అయితే దినేశ్ కార్తీక్ (3) అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలి కాగా ఆ వెంటనే రైనా వికెట్‌ను బుమ్రా తీయడంతో జట్టు ఒత్తిడిలో పడింది. కానీ డ్వేన్ స్మిత్ బౌండరీలతో చెలరేగి పరుగుల వరద పారించాడు. తనకు జడేజా సహకరించడంతో జట్టు ఎలాంటి ఇబ్బంది పడకుండా మ్యాచ్‌ను ముగించింది. స్కోరు వివరాలు: ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) జకాతి (బి) ధావల్ కులకర్ణి 30; గప్టిల్ (సి) బ్రేవో (బి) స్మిత్ 7; రాణా (సి) ధావల్ కులకర్ణి (బి) బ్రేవో 70; కృనాల్ పాండ్య (సి) ఫించ్ (బి) స్మిత్ 4; బట్లర్ (సి అండ్ బి) బ్రేవో 33; పొలార్డ్ (సి) స్మిత్ (బి) ధావల్ కులకర్ణి 9; హార్దిక్ పాండ్య (సి) జడేజా (సి) ప్రవీణ్ కుమార్ 7; హర్భజన్ (సి) రైనా (బి) ప్రవీణ్ కుమార్ 3; వినయ్ కుమార్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1-33, 2-41, 3-45, 4-120, 5-153, 6-160, 7-166, 8-172. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-24-2; ధావల్ కులకర్ణి 4-0-41-2; స్మిత్ 4-0-37-2; జకాతి 3-0-30-0; బ్రేవో 4-0-22-2; జడేజా 1-0-15-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ ఎల్బీడబ్ల్యు (బి) వినయ్ 0; మెకల్లమ్ (బి) హర్భజన్ 48; రైనా (సి) బట్లర్ (బి) బుమ్రా 58; దినేశ్ కార్తీక్ (సి) బట్లర్ (బి) వినయ్ 3; స్మిత్ నాటౌట్ 37 జడేజా నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.5 ఓవర్లలో 4 వికెట్లకు) 173. వికెట్ల పతనం: 1-0, 2-96, 3-111, 4-122. బౌలింగ్: వినయ్ 3-1-17-2; బుమ్రా 4-0-42-1; మెక్లీనగన్ 3.5-0-38-0; కృనాల్ పాండ్య 2-0-28-0; హర్భజన్ 4-0-36-1; హార్ధిక్ 1-0-10-0. -
'కోహ్లీ.. ప్లీజ్ బ్యాట్స్ మెన్ పరువు తీయవద్దు'
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఈ ఐపీఎల్ సీజన్లో సెంచరీల మీద సెంచరీలు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఏ విధ్వంసక బ్యాట్స్ మన్ కు సాధ్యం కాని రికార్డులు తిరగరాస్తున్నాడు కోహ్లీ. ఒకే సీజన్లో 4 సెంచరీలు బాది అతడు బౌలర్లతో పాటు బ్యాట్స్ మన్లకు ఓ పెద్ద సవాలుగా మారాడు. ఈ సీజన్లో ఇప్పటికే 865 పరుగులు చేసి టాప్ లో ఉన్నాడు కోహ్లీ. రెండో స్థానంలో ఉన్న సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ రన్స్, కోహ్లీ పరుగుల వ్యత్యాసం 268 ఉండటం అతడు చెలరేగిన తీరును స్పష్టం చేస్తోంది. బౌలర్లకు లేని నొప్పి బ్యాట్స్ మన్లకు ఎందుకంటారా?.. ఈ వివరాలు చూస్తే అర్థమైపోతోంది. గుజరాత్ లయన్స్ హార్డ్ హిట్టర్ ఆరోన్ ఫించ్, బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీని ఉద్దేశించి చేసిన ట్వీట్ చూస్తే ఆశ్చర్యపోతారు. బ్యాటింగ్ చేయడం మరీ ఇంత సులువు అనేలా ఇన్నింగ్స్ లు ఆడుతున్నావు. దయచేసి ఇలాంటి విధ్వసంక ఆటతీరు ప్రదర్శించి ఇతర బ్యాట్స్ మన్ పరువు కోరుతున్నట్లు ఓ లేఖ తరహాలో ట్వీట్ చేశాడు. పరుగులు చేయడం ఇంత ఈజీ అన్న తీరుగా శతక్కొడుతున్న కోహ్లీకి విజ్ఞప్తి చేశాడు. డియర్ కోహ్లీ అని మొదలుపెట్టిన ఫించ్.. నీ బ్యాటింగ్ వల్ల ప్రపంచంలోని ఇతర బ్యాట్స్ మన్ కు వణుకు పుడుతోందని, వారు చాలా ఆందోళన చెందుతున్నారని పోస్ట్ చేశాడు. ఫించ్ జట్టు గుజరాత్ పై బెంగళూరు జట్టు ఐపీఎల్ అన్ని సీజన్లలోనే 144 పరుగుల తేడాతో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. Dear Virat Kohli, Can you please stop making batting look so easy, it's embarrassing for most other batters in the world. Thanks -
కోహ్లీ సక్సెస్ సీక్రెట్ లీక్ అయింది!
బెంగళూరు: ఐపీఎల్-9 తొలి దశలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటకు ప్రస్తుతం వారి హార్డ్ హిట్టింగ్ షో ఇన్నింగ్స్ లకు ఎలాంటి సంబంధమే లేదు. అప్పుడు వరుస ఓటములు.. ఇప్పుడు భారీ విజయాలతో ప్రత్యర్థి జట్లను అలవోకగా మట్టికరిపిస్తూ ప్లే ఆఫ్స్ కు దూసుకుపోతోంది. బుధవారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ జట్టును 82 పరుగుల భారీ తేడాతో బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం బెంగళూరు బౌలర్ యుజువేంద్ర చాహల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. బెంగళూరు టాప్-4 బ్యాట్స్ మన్ కు బౌలింగ్ చేయాలనుకుంటాన్నారా అన్న ప్రశ్నకు.. వామ్మో వారికి బౌలింగ్ చేయాలని మాత్రం తాను భావించడం లేదని చెప్పాడు. విరాట్ భారీ ఇన్నింగ్స్ ల సీక్రెట్ గురించి కూడా మాట్లాడాడు. కోహ్లీ ఫిట్ నెస్ కు చాలా ప్రాధాన్యమిస్తాడని, అందుకే జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతాడని చాహల్ అన్నాడు. నెట్స్ లో అధికంగా శ్రమించడం కోహ్లీకి కలిసొచ్చిందని, పిచ్ మధ్యలోకి వచ్చి సిక్స్ లు కొట్టడం ప్రాక్టీస్ చేయడంతో సులువుగా భారీ షాట్లు కొడుతున్నాడని తమ జట్టు కెప్టెన్ సక్సెస్ సీక్రెట్ ను వెల్లడించాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ లాంటి ఆటగాళ్లు ఉంటడం బెంగళురుకు కలిసొచ్చే అంశమని చెప్పుకొచ్చాడు. బౌలర్లు రాణించడంతో టోర్నీలో పాయింట్ల పట్టికలో తమ జట్టు రెండో స్థానానికి చేరుకుందన్నాడు. బెంగళూరు విజయాలలో బ్యాట్స్ మన్ మాత్రమే కాదు బౌలర్లు కూడా కీలకపాత్ర పోషిస్తున్నామని ఆ జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్ అభిప్రాయపడ్డాడు. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరడంలో బౌలర్లు కూడా తీవ్రంగా శ్రమించారని, ముఖ్యంగా జోర్డాన్ రాకతో తమ బౌలింగ్ మరింత బలోపేతమైందని చెప్పాడు. తొలి రెండు మ్యాచులలో అంతగా రాణించని జోర్డాన్ కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో రాణించాడు. -
విధ్వంసమే విస్తుపోయేలా..
మళ్లీ ‘శత’క్కొట్టిన కోహ్లి ► 50 బంతుల్లో 113 పరుగులు ► 12 ఫోర్లు, 8 సిక్సర్లతో ఊచకోత ► సీజన్లో నాలుగో సెంచరీతో మరో ఘనత ► హడలెత్తించిన క్రిస్‌గేల్ ► పంజాబ్‌పై బెంగళూరు ఘనవిజయం ► ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్లుగా... మధ్యాహ్నం పూట నిద్రలో కలగంటున్నట్లుగా... ముందే షాట్లన్నీ ఫీడ్ చేసిన ఒక మెషీన్ బ్యాటింగ్ చేస్తున్నట్లుగా... మరోసారి కోహ్లి రెచ్చిపోయాడు. ఈ సీజన్ ఆరంభం నుంచి ఐపీఎల్లో సంచలన ఇన్నింగ్స్‌తో ప్రకంపనలు సృష్టిస్తున్న విరాట్ కోహ్లి... ఈసారి పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశాడు. చేతికి గాయం ఉన్నా లెక్క చేయకుండా... అంపైర్లకు చేతులు నొప్పుట్టేలా, బౌలర్లకు తల తిరిగేలా... కోహ్లి ఒక్కో షాట్ కొడుతుంటే... చిన్నస్వామి బౌండరీ మరింత చిన్నబోయింది. విరాట్ విధ్వంసానికి గేల్ ప్రకంపనలు తోడవడంతో... పరుగుల సునామీలో పంజాబ్ జట్టు తుడిచిపెట్టుకుపోయింది. బెంగళూరు: పాపం... ఏ బౌలర్ అయినా ఏం చేయగలడు..? వచ్చానా, ఆరు బంతులు వేశానా.. వెళ్లానా..? పోనీలే నన్ను నాలుగు ఫోర్లే కొట్టారు... పక్క బౌలర్‌ని మూడు సిక్సర్లు బాదారు... ఇలా సంబర పడటం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితికి బౌలర్లు చేరారు. కొడితే ఫోర్, లేదంటే సిక్సర్... ఎంత మంచి బంతి వేసినా, ఫీల్డర్ చూస్తూ ఉండిపోవడం తప్ప బంతిని ఆపలేని నిస్సహాయత.... బుధవారం కోహ్లి ఇన్నింగ్స్‌ను చూడలేని వాళ్లు దురదృష్టవంతులే అనుకోవాలి. కోహ్లి (50 బంతుల్లో 113; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) అద్భుత సెంచరీకి... క్రిస్ గేల్ (32 బంతుల్లో 73; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో... పంజాబ్‌తో మ్యాచ్‌లో బెంగళూరు 82 పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) విజయం సాధించింది. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా... బెంగళూరు మూడు వికెట్లకు 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. గేల్, కోహ్లి తొలి వికెట్‌కు కేవలం 66 బంతుల్లో 147 పరుగులు జోడించడం విశేషం. తర్వాత పంజాబ్ 14 ఓవర్లలో 9 వికెట్లకు 120 పరుగులు చేసింది. ఈ దశలో మరోసారి వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేశారు. అప్పటికి పంజాబ్ చివరి ఓవర్లో విజయానికి 92 పరుగులు చేయాలి. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బెంగళూరు 82 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు. చాహల్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఒకరిని మించి మరొకరు..: బెంగ ళూరు ఓపెనర్లు కోహ్లి, గేల్ ఆరంభం నుంచే పోటాపోటీగా చెలరేగారు. నాలుగో ఓవర్లో గేల్ వరుసగా రెండు సిక్సర్లు, ఫోర్‌తో జాతర మొదలుపెడితే... దానిని కోహ్లి అందిపుచ్చుకున్నాడు. 28 బంతుల్లో విరాట్ అర్ధసెంచరీ చేస్తే... గేల్ 26 బంతుల్లో ఈ మార్కును చేరాడు. ఈ బౌలర్, ఆ బౌలర్ అనే తేడా లేకుండా ఇద్దరూ పోటాపోటీగా సిక్సర్లు బాదారు. అక్షర్ బౌలింగ్‌లో గేల్ అవుట్ కావడం, తర్వాతి ఓవర్లో డివిలియర్స్ డకౌట్‌గా వెనుదిరగడంతో పంజాబ్ కాస్త సంబరపడ్డా... అక్కడి నుంచి కోహ్లి గేర్ మార్చి మరింత వేగంగా ఆడాడు. ఈ క్రమంలో 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అదే జోరులో మరో సిక్సర్, ఫోర్ కొట్టి అవుటయ్యాడు. చివరి ఓవర్లో రాహుల్ 2 ఫోర్లు కొట్టాడు. పెవిలియన్‌కు క్యూ: భారీ లక్ష్యాన్ని ఛేదించే ఒత్తిడిలో పంజాబ్ బ్యాట్స్‌మెన్ పోరాడలేకపోయారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ విజయ్ అవుటయ్యాక.... ఏ బ్యాట్స్‌మన్ కూడా కుదురుగా ఆడలేకపోయాడు. సాహా (10 బంతుల్లో 24; 5 ఫోర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో విజయాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు: బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: గేల్ (సి) మిల్లర్ (బి) అక్షర్ 73; కోహ్లి (సి) మిల్లర్ (బి) సందీప్ 113; డివిలియర్స్ (బి) అబాట్ 0; రాహుల్ నాటౌట్ 16; వాట్సన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8, మొత్తం (15 ఓవర్లలో మూడు వికెట్లకు) 211. వికెట్ల పతనం: 1-147; 2-154; 3-199. బౌలింగ్: సందీప్ శర్మ 3-0-29-1; మోహిత్ శర్మ 3-0-33-0; అబాట్ 3-0-48-1; కరియప్ప 3-0-55-0; అక్షర్ పటేల్ 3-0-46-1. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: విజయ్ (బి) అరవింద్ 16; ఆమ్లా (సి) జోర్డాన్ (బి) అరవింద్ 9; సాహా ఎల్బీడబ్ల్యు (బి) చాహల్ 24; మిల్లర్ (సి) డివిలియర్స్ (బి) వాట్సన్ 3; గురుకీరత్ (సి) గేల్ (బి) చాహల్ 18; అక్షర్ పటేల్ (సి) కోహ్లి (బి) వాట్సన్ 13; బెహర్డీన్ (సి) డివిలియర్స్ (బి) చాహల్ 0; అబాట్ (సి) డివిలియర్స్ (బి) చాహల్ 0; మోహిత్ రనౌట్ 14; కరియప్ప నాటౌట్ 12; సందీప్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (14 ఓవర్లలో 9 వికెట్లకు) 120. వికెట్ల పతనం: 1-17; 2-43; 3-53; 4-54; 5-77; 6-79; 7-80; 8-96; 9-105. బౌలింగ్: బిన్నీ 1-0-11-0; శ్రీనాథ్ అరవింద్ 2-0-18-2; జోర్డాన్ 1-0-12-0; చాహల్ 3-0-25-4; వాట్సన్ 2-0-7-2; ఆరోన్ 1-0-17-0; గేల్ 3-0-25-0; సచిన్ బేబీ 1-0-4-0. ► ఈ సీజన్ ఐపీఎల్లో కోహ్లికి ఇది 4వ సెంచరీ. ఒకే సీజన్లో కనీసం మూడు సెంచరీలు చేసిన మరో క్రికెటర్ లేడు. ► మామూలుగా 20 ఓవర్లలో 200 కొట్టడమే గొప్ప. కానీ ఈ మ్యాచ్‌లో బెంగళూరు 15 ఓవర్లలోనే 211 బాదింది. ► ఈ మ్యాచ్‌తో కోహ్లి ఐపీఎల్లో 4 వేల పరుగులు (4002) చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ► ప్రస్తుత ఐపీఎల్లో ఇప్పటివరకూ ఏడు సెంచరీలు నమోదయ్యాయి. గతంలో 2008, 2011, 2012లలో అత్యధికంగా ఆరు చొప్పున సెంచరీలు నమోదయ్యాయి. గాయంతోనే... గత మ్యాచ్‌లో ఎడమచేతి బొటనవేలు, చూపుడు వేలు మధ్య కోహ్లికి గాయమైంది. దీనికి 7 కుట్లు పడ్డాయి. మామూలుగా అయితే ఓ నెలరోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన గాయం ఇది. కానీ జట్టు చావోరేవో తేల్చుకోవాల్సినందున కోహ్లి బరిలోకి దిగి... సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ అక్షర్ పటేల్ క్యాచ్ పట్టినప్పుడు ఆ కుట్ల మీద మళ్లీ బంతి తగిలింది. బాధతో విలవిల్లాడినా... జట్టు విజయం ముందు ఆ బాధ తేలిపోయింది. -
ఆర్సీబీ ఆటతీరు అమోఘం
హర్షా భోగ్లే ఈ సీజన్ ఐపీఎల్ ఆరంభంలో పెద్దగా రాణించలేకపోయిన బెంగళూరు ఇప్పుడు ప్రత్యర్థుల పాలిట సింహస్వప్పంగా మారింది. వాళ్లతో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు భయపడే స్థితికి చేరుకున్నారు. ఏ ప్రమాణాల పరంగా చూసినా రాయల్ చాలెంజర్స్ ఆటతీరు అమోఘం. నేను ఇలా చెప్పడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఎందుకంటే విరాట్ కోహ్లి, డివిలియర్స్ ఆట అంచనాలను మించిపోయింది. నేడు ఆర్సీబీ... కింగ్స్ ఎలెవన్‌తో తలపడుతుంది. రెండో అర్ధభాగంలో పంజాబ్ కూడా గట్టి జట్టుగా తయారైంది. అయితే ఇప్పుడు టెన్షన్ అంతా బెంగళూరుపైనే. ఈ మ్యాచ్‌లో పంజాబ్ అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగుతోంది. ఒకవేళ మురళీసేన గనుక గెలిస్తే ఆర్సీబీకి పెద్ద నిరాశే. అయితే బెంగళూరు ఎలా ఆడుతుందోనన్న బెంగను వదిలేసి పంజాబ్ తమదైన శైలిలో చెలరేగితే బాగుంటుంది. -
నాకూ ఆశ్చర్యంగానే ఉంది
ప్రస్తుత క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి. దీనిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. తన షాట్ సెలక్షన్, నిలకడతో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా లక్ష్యాలను ఛేదించడంలో ఏ ఫార్మాట్లో అయినా తనకు తిరుగే లేదు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో వేగంగా 7000 పరుగులు, వేగంగా 25 సెంచరీలు, అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సగటు, ఐపీఎల్ లో ఒకే సీజన్లో మూడు సెంచరీలు, ఒక సీజన్లో అత్యధిక పరుగులు ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. ఒక రకంగా తను తన కెరీర్లోనే ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఇంత నిలకడ ఎలా సాధ్యం? టి20ల్లోనూ సంప్రదాయ వన్డే తరహా ఆటతీరుతో ఈ రికార్డులు ఎలా సాధిస్తున్నాడు..? ఇలా పలు అంశాలపై విరాట్ కోహ్లి ఇంటర్వ్యూ... ⇒ ఈ ఫామ్‌ను, రికార్డులను ఊహించలేదు ⇒ ఛేజింగ్‌లో నాపై ఒత్తిడి ఉండదు ⇒ ఏబీ నాకు మంచి స్నేహితుడు ⇒ విరాట్ కోహ్లి ఇంటర్వ్యూ ♦ ఒకే సీజన్లో మూడు సెంచరీలు. ఇప్పటివరకూ ఏ క్రికెటర్ ఒకే సీజన్లో చేయనన్ని పరుగులు. టి20 క్రికెట్లో ఇంత నిలకడ ఎలా? నిజాయితీగా చెప్పాలంటే నాకూ చాలా ఆశ్చర్యంగానే ఉంది. నిజానికి ఆ మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సెంచరీ చేస్తాననే ఆలోచన నాకు లేదు. వీలైనంత వేగంగా ఆడి జట్టు స్కోరును పెంచాలనే ప్రయత్నం చేసే క్రమంలో ఈ సెంచరీలు వచ్చాయి. ఈ ఫార్మాట్లో విజయ రహస్యం కూడా ఇదే. జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే ప్రయత్నం చేస్తే వ్యక్తిగత రికార్డులు వాటంతట అవే వస్తాయి. ♦ టి20ల్లో కూడా వన్డే తరహాలోనే ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. టి20లకు కొత్తగా ఏమీ ప్రయత్నించలేదా? ప్రస్తుతం నా ఫామ్ చాలా బాగుంది. కాబట్టి ప్రత్యర్థి జట్టులో బౌలర్లు నన్ను కట్టడి చేయడానికి కచ్చితంగా ప్రణాళికలతోనే వస్తారు. ఆఫ్ స్టంప్ బయట బంతులు వేసి బౌండరీ దగ్గర ఇద్దరు ఫీల్డర్లను ఉంచుతారు. కచ్చితంగా నేను ఏదో ఒక తప్పు చేస్తానని ఎదురు చూస్తారు. ఒక 20 బంతులు క్రీజులో నిలబడితే తర్వాత పరుగులు అవే వస్తాయి. ఏ ఫార్మాట్‌కైనా ఇదే వర్తిస్తుంది. తొలి 20 బంతులు షాట్లకు వెళ్లకుండా సింగిల్స్ తీయడంలో ఇబ్బందేమీ లేదు. చివరి ఓవర్లలో సిక్సర్లు కొట్టగల నైపుణ్యం నాలో ఇప్పుడు పెరిగింది. కాబట్టి వన్డే తరహాలోనే కుదురుకుని ఆడినా నష్టం లేదు. ♦ లక్ష్య ఛేదనలో మరింత నిలకడ చూపిస్తారు. ఏ ఓవర్లో ఎలా ఆడాలనే ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుంటారా? జట్టు విజయానికి ఎన్ని పరుగులు కావాలి? దీనిని బట్టే ఛేజింగ్‌ను ప్లాన్ చేయాలి. ప్రత్యర్థి జట్టులోని బౌలర్లు ఎవరు? ఎవరి కోటా ఓవర్లు ఎన్ని మిగిలున్నాయి? ఏ బౌలర్‌ని లక్ష్యం చేసుకోవాలి..? ఇవన్నీ చూసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించాలి. వ్యక్తిగత రికార్డులను పట్టించుకోకుండా జట్టు లక్ష్యాన్ని గుర్తుంచుకుని ఆడితే ఛేజింగ్ చేయడం సులభం. నిజానికి చాలామంది ఛేజింగ్ చేయడం ఒత్తిడితో కూడుకున్న పని అని చెబుతారు. కానీ నాకు మాత్రం ఇదే సులభం అనిపిస్తుంది. ఎన్ని చేయాలో తెలిశాక, దానిని బట్టి భాగస్వామ్యాలు నిర్మించుకుంటూ వెళితే సరిపోతుంది. ♦ ఇంత అద్భుతమైన ఫామ్‌లో ఉంటే బ్యాట్స్‌మన్ రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. కానీ మీరు మాత్రం మీ శైలి క్రికెట్ నుంచి పక్కకు వెళ్లరు. మీ నిలకడకు ఇదే కారణమా? నిలకడ కావాలంటే మన ప్రాక్టీస్, ఆహారం, బ్యాటింగ్ శైలి మనకు బోర్ కొట్టేంత ప్రాక్టీస్ చేయాలి. ఆటను తేలికగా తీసుకోకూడదు. ఒక్కోసారి నాకు కూడా తొలి బంతినే సిక్సర్ కొట్టాలనే కోరిక కలుగుతుంది. కానీ నియంత్రించుకుని నా శైలిలోనే ఆడాలి. ఆటను ఎప్పుడూ గౌరవించాలి. ఆటను తేలికగా తీసుకుంటే ఒక్కో పరుగు కోసం కూడా కష్టపడాల్సి వస్తుంది. మన సామర్థ్యం మీద మనకు నమ్మకం ఉండాలి, అదే సమయంలో ఆట మీద గౌరవంతో పాటు ఒకే పనిని పదే పదే ఒకే రీతిలో చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడు నిలకడగా పరుగులు వస్తాయి. ♦ డివిలియర్స్, కోహ్లి కలిసి ఆడుతుంటే ప్రత్యర్థులంతా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒకరి మీద ఒకరికి గౌరవం, నమ్మకం కూడా బాగా ఉన్నట్లుంది? అవును. మేం ఇద్దరం కలిసి ఆడే సమయంలో ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చుకోం. ఎందుకంటే ఏం చేయాలి, ఎలా ఆడాలనే విషయంపై ఇద్దరికీ అవగాహన ఉంది. ఎప్పుడో ఒక సందర్భంగా ‘కాస్త నెమ్మదిగా, జాగ్రత్తగా ఆడు’ అనే మాట మినహా ఏమీ చెప్పుకోము. మైదానం బయట మేమిద్దరం మంచి స్నేహితులం. అది ఆడే సమయంలోనూ కనిపిస్తుంది. నిజానికి తనతో కలిసి ఆడటం చాలా బాగుంటుంది. మనం ఎప్పుడూ చూడని షాట్లు కూడా ఏబీ ఆడతాడు. అలా అని వాటిని నేను ప్రయత్నించను. ఎవరి శైలి వారిది. ఏబీతో కలిసి ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తాను. ♦ మిగిలిన వారితో పోలిస్తే కోహ్లి ఎందుకు భిన్నం? చిన్నప్పటి నుంచీ యావరేజ్ ఆటగాడిగా మిగిలిపోవడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఏ దశలో, ఏ ప్రత్యర్థిపై ఏ మ్యాచ్ ఆడినా అందరికంటే నేను ఎక్కువ పరుగులు చేయాలని, జట్టును నేనే గెలిపించాలనే తపన ఉండేది. అయితే చాలా మంది దానిని అహంకారంగా చూశారు. కానీ నేను ఎప్పుడూ జట్టు కోసం ఆడే మనిషిని. విజయాన్ని మించిన కిక్ ఏదీ ఇవ్వదు. అందుకే ప్రతి మ్యాచ్ గెలవాలనే తపన ఉంటుంది. ♦ ఇటీవల కాలంలో సచిన్, కోహ్లిలను పోల్చుతున్నారు. దీనిపై స్పందన? ఇది ఎంతమాత్రం సమంజసం కాదు. సచిన్ ఓ దిగ్గజం. ఆయనకు ఎవరూ సరితూగరు. నేను రెండేళ్లుగా బాగా ఆడుతున్నా. కానీ సచిన్ 24 సంవత్సరాల పాటు దేశానికి సేవ చేశాడు. ఓ వ్యక్తిగా నాకు ఆయనే స్ఫూర్తి. ఈ తరంలో ఎవరితో చూసుకున్నా... సచిన్ రెండు రెట్లు ఎక్కువ. గాయమున్నా బరిలోకి... నేడు పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి గాయం ఉన్నా బరిలోకి దిగుతున్నాడు. సోమవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. గాయానికి ఎనిమిది కుట్లు పడే అవకాశం ఉందని మ్యాచ్ అనంతరం కోహ్లి స్వయంగా తెలిపాడు. ప్లేఆఫ్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సి నందున పంజాబ్‌తో ఆడాలని నిర్ణయించుకున్నాడు. మరోవైపు పంజాబ్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ పక్క టెముకల్లో నొప్పి కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. -
ఐపీఎల్ నుంచి మాక్స్ వెల్ ఔట్!
మెల్ బోర్న్: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కీలక ఆటగాడు మాక్స్ వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలగనున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం అధికారికంగా వెల్లడించింది. పంజాబ్ ఆల్ రౌండర్ మాక్స్ వెల్ ఎడమ చేతికి గాయమైందని దాంతో అతడు ఇబ్బంది పడుతున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దీంతో లీగ్ మ్యాచులకు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియా జట్టు త్వరలో వెస్టిండీస్ లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో మాక్స్ వెల్ విశ్రాంతి తీసుకుంటేనే జూన్ 5న మొదలయ్యే ఆ టూర్ సమయానికి అతడు ఫిట్ నెస్ గా ఉంటాడని పేర్కొంది. ఎడమ చేతి గాయం పైకి కనిపించడం లేదని, మాక్స్ వెల్ మాత్రం నొప్పితో బాధ పడుతున్నాడని ఆసీస్ అధికారులు వెల్లడించారు. దీంతో ఐపీల్-9 సీజన్ నుంచి వైదొలగిన 5వ ఆసీస్ క్రికెటర్ అయ్యాడు. గాయాల కారణంగా ఈ ఐపీఎల్ మధ్యలోనే తప్పుకున్న వాళ్లలో ఆసీస్ ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. స్టీవ్ స్మిత్, జాన్ హెస్టింగ్స్, షాన్ మార్ష్, మిచెల్ మార్ష్ ఇప్పటికే ఈ టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. -
ముంబై ఇండియన్స్ 'డేరింగ్' విక్టరీ
విశాఖపట్నం: ప్లే ఆఫ్ రౌండ్ లోకి ప్రవేశించేందుకు కీలకమైన మ్యాచ్ లో ముంబై మెరిసింది. విశాఖపట్నం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ సేన విసిరిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో క్వింటన్ డికాక్ (40, 28 బంతుల్లో) తప్ప మిగతా ఢిల్లీ బ్యాట్స్ మన్లందరూ విఫలమయ్యారు. అసలే భారీ టార్గెట్ కావడం, రెగ్యులర్ గా వికెట్లు పడటంతో ఢిల్లీ 19.1 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో బుమ్రా 3, కృనాల్ పాండ్యా 2, హర్భజన్, విజయ్ కుమార్ లు తలో వికెట్ పడగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన కృనాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్.. కృనాల్ పాండ్యా(86;37 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 205 పరుగులు సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(31;21 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు), గప్తిల్(48;42 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేశారు. చివర్లో బట్లర్(18 నాటౌట్;9 బంతుల్లో 2 ఫోర్లు,1 సిక్స్),అంబటి రాయుడు(13 నాటౌట్;5 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 206 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ మోరిస్ కు రెండు వికెట్లు దక్కగా, జహీర్ ఖాన్, అమిత్ మిశ్రాలకు తలో వికెట్ లభించింది. -
'ఐపీఎల్.. ఆ విధ్వంసం నుంచి అప్పుడే కోలుకోలేం'
బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీల సునామీ ఇన్నింగ్స్ ను త్వరగా మరిచిపోవాలని గుజరాత్ లయన్స్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అంటున్నాడు. విరాట్(109; 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు), డివిలియర్స్(129 నాటౌట్; 52 బంతుల్లో 10ఫోర్లు, 12 సిక్సర్లు) తమ బ్యాటింగ్ తో గుజరాత్ బౌలర్లకు శనివారం జరిగిన మ్యాచ్ లో చుక్కలు చూపించారు. అనంతరం బౌలర్లు కూడా చెలరేగడంతో గుజరాత్ కేవలం 104 పరుగులకే కుప్పకూలి, 144 పరుగుల భారీ ఓటమిని మూట కట్టుకుంది. దీంతో ఐపీఎల్ ఏ సీజన్లలో అయినా చెత్త ఒటమి రికార్డు గుజరాత్ ఖాతాలో పడింది. విరాట్, డివిలియర్స్ లు చెలరేగడంతో తామేం చేయలేకపోయామని, వారిని నిలువరించక పోవడంతో బెంగళూరు తమ ముందు 249 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిందని చెప్పాడు. అయితే ఇలాంటి విధ్వసక ఇన్నింగ్స్ ఎప్పుడో గానీ ఎదురవ్వవని అభిప్రాయపడ్డాడు. బ్యాక్ ఫుట్ పై ఉండి షాట్లు కొట్టడం చాలా అరుదు.. కానీ డివిలియర్స్ మాత్రం బ్యాక్ ఫుట్ తీసుకుని అలవోకగా బంతులను సిక్సర్లుగా మలచటంతో మైండ్ బ్లాంక్ అయిందని పేర్కొన్నాడు. తమ తర్వాతి మ్యాచ్ కు ఐదు రోజుల విరామం ఉందని, ఈ భారీ ఓటమి క్షణాల నుంచి బయటపడేందుకు మంచి అవకావమని కార్తీక్ అంటున్నాడు. -
అరెరె.. మంచి మ్యాచ్ మిస్సయ్యానే!
తొలి సంతానం కోసం ఎదురుచూస్తున్న గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా.. అద్భుతమైన మ్యాచ్‌ని మిస్సయినందుకు తెగ బాధపడుతున్నాడు. తమ ప్రత్యర్థి జట్టులోని ఏబీ డివీలియర్స్, విరాట్ కోహ్లీ ఇద్దరూ విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడి, ఇద్దరూ సెంచరీలు బాదడాన్ని దగ్గరుండి చూడలేకపోయినందుకు రైనా చాలా బాధపడ్డాడు. అయితే సిసలైన క్రీడాస్ఫూర్తితో ఇద్దరికీ అభినందనలు చెప్పాడు. తొలిసారి ఓ గేమ్ మిస్సయ్యానని, కానీ ఐపీఎల్‌లోనే చాలా అద్భుతమైన గేమ్ చూశానని, ఇద్దరూ బాగా ఆడారని ట్వీట్ చేశాడు. అంతకుముందు.. ఇంకా తన సంతానం భూమ్మీదకు రాలేదని.. ఈ ఎదురుచూపులు చాలా భారంగా ఉన్నాయని కూడా రైనా ట్విట్టర్లో తన మధుర భావాలను పంచుకున్నాడు. Many congratulations @ABdeVilliers17and @imVkohli truly class first time missed a game but saw a great game of #IPL2016 play well boys -
‘సన్’ జోరుకు బ్రేక్
► సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి ► 7 వికెట్లతో ఢిల్లీ ఘన విజయం రాణించిన మిశ్రా, డి కాక్ నడి వేసవిలో హైదరాబాద్‌లో సూర్యుడి ప్రతాపానికి వరుణుడు బ్రేక్ వేసినట్లే... ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ జోరుకు ఢిల్లీ బ్రేక్ వేసింది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న వార్నర్ సేన సొంతగడ్డపై మ్యాచ్‌లను ఓటమితో ముగించింది. బౌలర్ల నిలకడ, డికాక్ మెరుపులతో డేర్‌డెవిల్స్ ప్లే ఆఫ్‌కు చేరువయింది. సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో విఫలమైన చాలా సందర్భాల్లో బౌలింగ్‌తో గట్టెక్కే సన్‌రైజర్స్‌కు ఈసారి అదృష్టం కలిసి రాలేదు. అన్ని విభాగాల్లో వైఫల్యం కారణంగా... నాలుగు విజయాల జోరుకు బ్రేక్ పడింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిశ్రా, కూల్టర్ నీల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ డేర్ డెవిల్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ (31 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా... రిషభ్ పంత్ (26 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శామ్సన్ (26 బంతుల్లో 34 నాటౌట్; 2 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 50 బంతుల్లోనే 72 పరుగులు జోడించి 11 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీని గెలిపించారు. హైదరాబాద్‌లో సొంత మ్యాచ్‌లు ముగించుకున్న రైజర్స్ ఇకపై మిగిలిన మూడు మ్యాచ్‌లను ప్రత్యర్థి వేదికలపైనే ఆడుతుంది. క్రిస్ మోరిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వార్నర్ మెరుపులు తప్ప...: తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు... తర్వాతి 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 66 పరుగులు మాత్రమే... సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ స్వరూపం ఇది. ఎప్పటిలాగే వార్నర్ తనదైన శైలిలో దూకుడు మినహా జట్టు బ్యాటింగ్‌లో ఎలాంటి మెరుపులు లేవు. ధావన్ (37 బంతుల్లో 34; 3 ఫోర్లు), విలియమ్సన్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంలో విఫలం కాగా, మిగతా బ్యాట్స్‌మెన్ కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయారు. ఇన్నింగ్స్ తొలి 3 ఓవర్లలో 11 పరుగులే రాగా, తర్వాతి రెండు ఓవర్లు సన్ సొమ్ము చేసుకుంది. షమీ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్ రెండు ఫోర్లు, ధావన్ ఒక ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. జయంత్ వేసిన మరుసటి ఓవర్లో తొలి మూడు బంతులకు వార్నర్ 4, 4, 6 బాదడంతో 17 పరుగులు లభించాయి. అయితే 6-20 మధ్య 15 ఓవర్లలో హైదరాబాద్ రెండు ఓవర్లలో మాత్రమే రెండంకెల పరుగులు తీయగలగడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. జయంత్ తన చివరి ఓవర్లో వార్నర్‌ను బౌల్డ్ చేసి పతనానికి శ్రీకారం చుట్టాడు. వార్నర్, ధావన్ తొలి వికెట్‌కు 53 బంతుల్లో 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత 15 బంతుల వ్యవధిలో సన్ మూడు వికెట్లు కోల్పోయింది. మిశ్రా తన వరుస ఓవర్లలో ధావన్, యువరాజ్ (8)లను అవుట్ చేయగా, హెన్రిక్స్ (0) షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. డి కాక్ జోరు...: నెహ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి డి కాక్ దూకుడు ప్రదర్శించాడు. నెహ్రా మరుసటి ఓవర్లో కూడా అతను మరో రెండు బౌండరీలు కొట్టాడు. అయితే ఆ ఓవర్లో ఢిల్లీ జట్టు అగర్వాల్ (10) వికెట్ కోల్పోయింది. అనంతరం నాయర్ (17 బంతుల్లో 20; 3 ఫోర్లు) కొద్ది సేపు డి కాక్కు అండగా నిలిచాడు. బరీందర్ వేసిన తొలి రెండు ఓవర్లలో వీరిద్దరు కలిసి మూడు ఫోర్లు, 1 సిక్స్‌తో 21 పరుగులు రాబట్టారు. అయితే హెన్రిక్స్ చక్కటి బంతితో నాయర్‌ను బౌల్డ్ చేయడంతో 55 పరుగుల (37 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరో మూడు బంతులకే డి కాక్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత శామ్సన్, పంత్ నిలకడగా ఆడారు. 18 పరుగుల వద్ద శామ్సన్ క్యాచ్‌ను హెన్రిక్స్ వదిలేయడం ఢిల్లీకి కలిసి రాగా... లీగ్‌లో తొలిసారి ముస్తఫిజుర్ విఫలం కావడం కూడా డేర్‌డెవిల్స్ పని సులువు చేసింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) జయంత్ 46; ధావన్ (సి) శామ్సన్ (బి) మిశ్రా 34; విలియమ్సన్ (బి) మోరిస్ 27; యువరాజ్ (సి) పంత్ (బి) మిశ్రా 8; హెన్రిక్స్ (ఎల్బీ) (బి) షమీ 0; హుడా (హిట్ వికెట్) (బి) కూల్టర్ నీల్ 10; ఓజా (సి) శామ్సన్ (బి) కూల్టర్ నీల్ 7; భువనేశ్వర్ (రనౌట్) 1; బరీందర్ (నాటౌట్) 1; నెహ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-67; 2-98; 3-113; 4-114; 5-135; 6-137; 7-138; 8-143. బౌలింగ్: జయంత్ యాదవ్ 4-0-32-1; కూల్టర్‌నీల్ 4-0-25-2; షమీ 3-0-26-1; మోరిస్ 4-0-19-1; డుమిని 2-0-19-0; మిశ్రా 3-0-19-2. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) ఓజా (బి) హెన్రిక్స్ 44; అగర్వాల్ (సి) యువరాజ్ (బి) నెహ్రా 10; నాయర్ (బి) హెన్రిక్స్ 20; శామ్సన్ (నాటౌట్) 34; పంత్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1-20; 2-75; 3-78. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-32-0; నెహ్రా 3-0-23-1; బరీందర్ 2-0-21-0; ముస్తఫిజుర్ 4-0-39-0; హెన్రిక్స్ 3-0-19-2; హుడా 1-0-5-0; యువరాజ్ 1.1-0-11-0. -
ఢిల్లీ విజయ లక్ష్యం 147
హైదరాబాద్: ఐపీఎల్-9లో భాగంగా గురువారమిక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 46 పరుగులు), శిఖర్ దావన్(37 బంతుల్లో 34 పరుగులు) రాణించడంతో సన్‌రైజర్స్ జట్టుకు శుభారంభం లభించింది. అయితే విలియం సన్(24 బంతుల్లో 27 పరుగులు) తప్ప మిగతా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. యువరాజ్ సింగ్(8 బంతుల్లో 8 పరుగులు) అమిత్ మిశ్రా బౌలింగ్‌లో సిక్స్ బాది మంచి ఫాంలో ఉన్నట్లు కనిపించినా.. అదే ఓవర్లో సునాయాసమైన బంతికి వెనుదిరిగాడు. ఆ వెంటనే షమీ బౌలింగ్‌లో హెన్రిక్స్ డకౌట్‌గా వెనుదిరగడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. చివర్లో ఢిల్లీ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. డేర్ డెవిల్స్ బౌలర్లలో అమిత్ మిశ్రా, కౌల్టర్ నైల్‌లకు రెండేసి వికెట్లు దక్కగా యాదవ్, షమీ, మోరిస్‌లకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది. -
మెరిసిన ముంబై.. బెంగళూరు బేజారు
బెంగళూరు: తమ విధ్వంసకారులు విఫలమైన చోట ఓటమిని ఒప్పుకొని, ప్రత్యర్థి జట్టు బాగా ఆడిందంటూ కితాబివ్వడం తప్ప విరాట్ కోహ్లీకి మరో దారిలేదు. అవును. ఐపీఎల్ 9లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బుధవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రతిభ ముందు తలవంచింది. బెంగళూరు విసిరిన 152 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో ఎనిమిది బంతులు ఉండగానే ఛేదించింది. తెలుగు తేజం అంబటి రాయుడు (44), పొలార్డ్ (35), బట్లర్ (29)లు ముంబై విజయంలో కీలక పాత్ర పోశించారు. ఓపెనర్ రోహిత్ శర్మ 25 పరుగులు చేశాడు. 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై 153 పరుగులు చేసింది. ఈ విజయంతో రోహిత్ సేన పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసిన కుణాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై బెంగళూరు ఓపెనర్లు విరాట్ కొహ్లీ (7 పరుగులు), క్రిస్‌గేల్ (5 పరుగులు) ఇద్దరూ విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, ఎబీ డివిలియర్స్ ఆచితూచి ఆడుతూ బెంగళూరు ఇన్నింగ్‌ను చక్కదిద్దారు. తొలి 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులకు చేరింది. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్(27 బంతుల్లో 24 పరుగులు) పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగినా రాహుల్(53 బంతుల్లో 68, నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ వాట్సన్(14 బంతుల్లో 15)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో సచిన్ బేబి(13 బంతుల్లో 25 పరుగులు, నాటౌట్) మెరవడంతో ముంబై ముందు బెంగళూరు 152 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ముంబై బౌలర్లలో సౌథీ, మెక్క్లెనగన్, పాండ్యాలకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది. -
ముంబైకి మళ్లీ పొ‘లార్డ్’
► బట్లర్ మెరుపు ఇన్నింగ్స్ ► బెంగళూరుపై ముంబై విజయం ► కోహ్లి సేన ప్లేఆఫ్ అవకాశాలు క్లిష్టం ఐపీఎల్లో కీలక సమయంలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి ముంబైని గెలిపించే పొలార్డ్ మరోసారి తన విలువను నిరూపించుకున్నాడు. లక్ష్యఛేదన క్లిష్టంగా మారిన సమయంలో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లోనే బెంగళూరుతో గత మ్యాచ్‌లో 19 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేసి ముంబైని గెలిపించిన పొలార్డ్... మరోసారి అదే జట్టుపై 19 బంతుల్లో అజేయంగా 35 పరుగులు చేసి గెలిపించాడు. అటు బెంగళూరు జట్టు కీలక మ్యాచ్‌లో ఓడిపోయి ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకుంది. ఇకపై అన్ని మ్యాచ్‌లు గెలవడంతో పాటు అదృష్టం కూడా తోడైతేనే కోహ్లి సేనకు అవకాశాలు ఉంటాయి. బెంగళూరు: బౌలింగ్ బలహీనంగా ఉన్నా... బ్యాటింగ్ బలంతో ఈ సీజన్లో నెట్టుకొస్తున్న బెంగళూరు జట్టును కీలక మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ ముంచేశారు. బ్యాటింగ్‌కు స్వర్గథామంలాంటి పిచ్‌పై స్టార్ క్రికెటర్లంతా విఫలం కావడంతో కోహ్లి సేన ఓడిపోయింది. చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు 6 వికెట్లతో బెంగళూరుపై గెలిచింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 151 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ (53 బంతుల్లో 68 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సచిన్ బేబీ (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. గేల్, కోహ్లి విఫలం కాగా... డివిలియర్స్ (27 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. ముంబై బౌలర్లలో సౌతీ, మెక్లీనగన్, క్రునాల్ పాండ్యా ఒక్కో వికెట్ తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లకు 153 పరుగులు చేసి గెలిచింది. అంబటి రాయుడు (47 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ (24 బంతుల్లో 25; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... పొలార్డ్ (19 బంతుల్లో 35 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (11 బంతుల్లో 29 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ముంబై బౌలర్ క్రునాల్ పాండ్యా (1/15)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. నిలబెట్టిన భాగస్వామ్యం సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి (7) సిక్సర్‌తో ఖాతా తెరిచినా మెక్లీనగన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ మ్యాచ్‌కు తుది జట్టులోకి వచ్చిన గేల్ (5) కూడా విఫలమయ్యాడు. దీంతో బెంగళూరు 17 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లోకేశ్ రాహుల్, డివిలియర్స్ కలిసి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నెమ్మదిగా ఆడటంతో పరుగులు రాలేదు. దీంతో బెంగళూరు 10 ఓవర్లలో రెండు వికెట్లకు 60 పరుగులు మాత్రమే చేసింది. 11వ ఓవర్ తొలి బంతికే భారీ షాట్‌కు వెళ్లి డివిలియర్స్ అవుటయ్యాడు. వాట్సన్ కూడా కుదురుకునేందుకు సమయం తీసుకోవడంతో బెంగళూరు 14 ఓవర్లకు 76 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో రాహుల్ వేగం పెంచాడు. మెక్లీనగన్ బౌలింగ్‌లో సిక్సర్, రెండు ఫోర్లు కొట్టాడు. అయితే రెండో ఎండ్‌లో వాట్సన్ రనౌటయ్యాడు. 42 బంతుల్లో రాహుల్ ఈ సీజన్లో మూడో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాక... చివరి మూడు ఓవర్లలో చెలరేగి ఆడాడు. రెండో ఎండ్‌లో సచిన్ బేబీ కూడా భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 27 బంతుల్లో 53 పరుగులు జోడించడంతో బెంగళూరుకు గౌరవప్రదమైన స్కోరు లభించింది. ఆదుకున్న పొలార్డ్, బట్లర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే అరవింద్ బౌలింగ్‌లో పార్థీవ్ అవుట్ కావడంతో ముంబైకి షాక్ తగిలింది. అయితే కెప్టెన్ రోహిత్, రాయుడు కుదురుగా ఆడటంతో పవర్‌ప్లేలో 39 పరుగులు వచ్చాయి. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించాక రోహిత్ శర్మ అవుటయ్యాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన నితిష్ రాణా (9) ఒక సిక్సర్ కొట్టినా ఎక్కువసేపు నిలబడలేదు. ఆరోన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన రాయుడు... ఓ ఎండ్‌లో నిలకడగా ఆడాడు. ముంబై విజయానికి 6 ఓవర్లలో 68 పరుగులు అవసరమైన దశలో వాట్సన్ బౌలింగ్‌లో పొలార్డ్ సిక్సర్, ఫోర్‌తో ఒత్తిడి పెంచాడు. కానీ తర్వాతి ఓవర్లో డివిలియర్స్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో రాయుడు అవుటయ్యాడు. ముంబైకి 4 ఓవర్లలో 44 పరుగులు అవసరం కాగా... వాట్సన్ వేసిన 17వ ఓవర్లో పొలార్డ్ ధాటికి 18 పరుగులు వచ్చాయి. అటు బట్లర్ కూడా చెలరేగి ఆడటంతో మరో 8 బంతులు మిగిలుండగానే ముంబై గెలిచింది. పొలార్డ్, బట్లర్ ఐదో వికెట్‌కు అజేయంగా 21 బంతుల్లో 55 పరుగులు జోడించడం విశేషం. స్కోరు వివరాలు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: కోహ్లి (సి) హర్భజన్ (బి) మెక్లీనగన్ 7; గేల్ (సి) రోహిత్ (బి) సౌతీ 5; డివిలియర్స్ (సి) రాయుడు (బి) క్రునాల్ 24; రాహుల్ నాటౌట్ 68; వాట్సన్ రనౌట్ 15; సచిన్ బేబీ నాటౌట్ 25; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 151. వికెట్ల పతనం: 1-8; 2-17; 3-60; 4-98. బౌలింగ్: సౌతీ 4-0-27-1; మెక్లీనగన్ 4-0-35-1; బుమ్రా 4-0-28-0; క్రునాల్ పాండ్యా 4-0-15-1; హర్భజన్ 3-0-19-0; పొలార్డ్ 1-0-22-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 25; పార్థీవ్ (సి) వాట్సన్ (బి) అరవింద్ 1; రాయుడు (సి) డివిలియర్స్ (బి) ఆరోన్ 44; నితిష్ రాణా (సి) బిన్నీ (బి) చాహల్ 9; పొలార్డ్ నాటౌట్ 35; బట్లర్ నాటౌట్ 29; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-2; 2-60; 3-79; 4-98. బౌలింగ్: స్టువర్ట్ బిన్నీ 1-0-2-0; శ్రీనాథ్ అరవింద్ 4-0-23-1; జోర్డాన్ 3-0-37-0; వాట్సన్ 3-0-38-0; చాహల్ 4-0-16-1; ఆరోన్ 3.4-0-37-2. -
ధోనీ సేన ఢమాల్: 'టాప్' లేపిన హైదరాబాద్
► ఐపీఎల్లో టాప్‌కి సన్‌రైజర్స్ ► ఉత్కంఠపోరులో పుణేపై విజయం ► ధోనిసేన ప్లేఆఫ్ అవకాశాలు గల్లంతు సన్‌రైజర్స్ బౌలర్లు మరోసారి మ్యాజిక్ చేశారు. 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అద్భుతంగా కాపాడి జట్టును ప్లే ఆఫ్‌కు చేరువ చేశారు. వరుసగా నాలుగో విజయం సాధించిన వార్నర్ బృందం మొత్తం ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. అటు పుణే సూపర్ జెయింట్స్ సీజన్లో ఎనిమిదో మ్యాచ్ ఓడిపోవడంతో ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యాయి. విశాఖపట్టణం: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై సన్ బౌలర్లు సమష్టిగా రెచ్చిపోయారు. దీంతో మంగళవారం రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో వార్నర్ సేన నాలుగు పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో 14 పాయింట్లతో గుజరాత్ లయన్స్‌ను వెనక్కి నెట్టి టాప్కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (27 బంతుల్లో 33; 2 ఫోర్లు; 2 సిక్సర్లు), కేన్ విలియమ్సన్ (37 బంతుల్లో 32; 3 ఫోర్లు), యువరాజ్ సింగ్ (21 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 19 పరుగులకే ఆరు వికెట్లు తీశాడు. ఐపీఎల్ చరిత్రలో ఓ బౌలర్ ఆరు వికెట్లు తీయడం ఇది రెండోసారి. 2008 ప్రారంభ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తరఫున సోహైల్ తన్వీర్ ఈ ఫీట్ సాధించాడు. అనంతరం బరిలోకి దిగిన పుణే 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసి ఓడింది. జార్జ్ బెయిలీ (40 బంతుల్లో 34; 3 ఫోర్లు; 1 సిక్స్), ధోని (20 బంతుల్లో 30; 1 ఫోర్; 2 సిక్సర్లు), అశ్విన్ (25 బంతుల్లో 29; 3 ఫోర్లు) పోరాడారు. జంపా సంచలన బౌలింగ్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. తొలి ఓవర్లో దిండా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇవ్వగా.. రెండో ఓవర్లో వార్నర్ (14 బంతుల్లో 11; 1 సిక్స్) కవర్స్ ద్వారా భారీ సిక్స్ కొట్టి మరుసటి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆర్పీ సింగ్ వేసిన ఆరో ఓవర్లో ధావన్ ఫోర్, సిక్స్‌తో 13 పరుగులు చేశాడు. కేన్ విలియమ్సన్ అతి జాగ్రత్తకు పోవడంతో పరుగులు రావడం గగనమైంది. మధ్య ఓవర్లలో రజత్ భాటియా, ఆర్.అశ్విన్ అద్భుతంగా రాణించి పరుగులు రాకుండా చూశారు. ఇక చివరి ఐదు ఓవర్లలో ఆడమ్ జంపా ఏకంగా ఆరు వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ను విలవిలలాడేలా చేశాడు. 15వ ఓవర్లో యువరాజ్ (21 బంతుల్లో 23; 1 ఫోర్; 2 సిక్సర్లు) సిక్స్, ఫోర్‌తో జోరు పెంచే ప్రయత్నం చేసినా మరుసటి ఓవర్లో జంపా గూగ్లీకి వెనుదిరగక తప్పలేదు. అటు విలియమ్సన్, హెన్రిక్స్ (8 బంతుల్లో 10; 1 ఫోర్)లను కూడా జంపా తన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. దీపక్ హుడా (5 బంతుల్లో 14; 2 సిక్సర్లు)తో పాటు నమన్ ఓజా (5 బంతుల్లో 7; 1 ఫోర్), భువనేశ్వర్ (1)లను చివరి ఓవర్లో అవుట్ చేసిన ఈ ఆసీస్ లెగ్గీ.. వార్నర్ సేనను చావు దెబ్బ తీశాడు. చివరి వరకు పోరాడినా.. స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన పుణేకు తొలి ఓవర్లోనే భువనేశ్వర్ తన స్వింగ్ పవర్‌తో షాక్ ఇచ్చాడు. ఫామ్‌లో ఉన్న రహానేను చక్కటి అవుట్ స్వింగర్‌తో పెవిలియన్‌కు చేర్చి మెయిడిన్ ఓవర్ వేశాడు. నాలుగో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదిన ఖవాజా (8 బంతుల్లో11; 2 ఫోర్లు) రనౌట్‌గా వెనుదిరగడంతో పవర్‌ప్లేలో పుణే రెండు వికెట్లకు 25 పరుగులు చేసింది. దీంతో పిచ్ పరిస్థితిని గమనించిన బెయిలీ, పించ్ హిట్టర్‌గా వచ్చిన అశ్విన్ జాగ్రత్తగా ఆడారు. యువరాజ్ బౌలింగ్‌లో ఓ సిక్స్ బాదిన బెయిలీని హెన్రిక్స్ అవుట్ చేయడంతో మూడో వికెట్‌కు 49 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపట్లోనే వరుస ఓవర్లలో అశ్విన్, సౌరభ్ తివారి (9) వెనుదిరగడంతో జట్టు ఇబ్బందిలో పడింది. 5 ఓవర్లలో 52 పరుగులు కావాల్సిన ఈ దశలో కెప్టెన్ ధోని, పెరీరా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 18వ ఓవర్లో పెరీరా సిక్స్, ధోని ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 14 పరుగులు రావాల్సి ఉండగా నె హ్రా బౌలింగ్‌లో పెరీరా భారీ షాట్‌కు వెళ్లి అవుటయ్యాడు. ఇక 3 బంతుల్లో 12 పరుగులు అవసరం కాగా ధోని సిక్స్ బాదాడు. అయితే ఐదో బంతికి ధోని రనౌట్ కావడంతో పాటు చివరి బంతికి జంపా కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో హైదరాబాద్‌కు ఉత్కంఠ విజయం దక్కింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ధోని (బి) ఆర్పీ సింగ్ 11; ధావన్ (సి) తివారి (బి) అశ్విన్ 33; విలియమ్సన్ (సి) భాటియా (బి) జంపా 32; యువరాజ్ సింగ్ (సి) తివారి (బి) జంపా 23; హెన్రిక్స్ (సి) రజత్ భాటియా (బి) జంపా 10; హుడా (స్టంప్డ్) ధోని (బి) జంపా 14; నమన్ ఓజా (బి) జంపా 7; భువనేశ్వర్ (సి) తివారి (బి) జంపా 1; శరణ్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1-18, 2-64, 3-96, 4-114, 5-114, 6-135, 7-136, 8-137. బౌలింగ్: దిండా 4-0-26-0; ఆర్పీ సింగ్ 3-0-23-1; అశ్విన్ 4-0-16-1; జంపా 4-0-19-6; భాటియా 3-0-26-0; పెరీరా 2-0-26-0. రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి) ఓజా (బి) భువనేశ్వర్ 0; ఖవాజా (రనౌట్)11; బెయిలీ (సి) నెహ్రా (బి) హెన్రిక్స్ 34; అశ్విన్ (సి) ఓజా (బి) శరణ్ 29; సౌరభ్ తివారి (సి) ధావన్ (బి) నెహ్రా 9; ధోని (రనౌట్) 30; పెరీరా (సి) హెన్రిక్స్ (బి) నెహ్రా 17; భాటియా నాటౌట్ 0; జంపా (సి) ఓజా (బి) నెహ్రా 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1-0, 2-19, 3-68, 4-78, 5-86, 6-126, 7-133, 8-133. బౌలింగ్: భువనేశ్వర్ 4-1-20-1; నెహ్రా 4-0-29-3; శరణ్ 4-0-26-1; హెన్రిక్స్ 3-0-20-1; యువరాజ్ 1-0-10-0; ముస్తఫిజుర్ 4-0-26-0. -
బెంగళూరు బతికిపోయింది
ఓటమికి చేరువగా వచ్చిన బెంగళూరు అదృష్టవశాత్తూ గట్టెక్కింది. జట్టు బౌలర్ క్రిస్ జోర్డాన్ ఒత్తిడిని తట్టుకొని బౌండరీ రాకుండా ఆఖరి బంతిని విసరడంతో ఆ జట్టుకు ఒక్క పరుగుతో విజయం దక్కింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా స్టొయినిస్ 2 పరుగులే తీయగలిగాడు. చివరి ఓవర్లో విజయానికి 17 పరుగులు కావాల్సిన స్థితిలో పంజాబ్ బ్యాట్స్‌మెన్ స్టొయినిస్, బెహర్దీన్ 15 పరుగులు తీయగలిగినా పంజాబ్‌ను ఓటమి నుంచి రక్షించలేకపోయారు. అంతకుముందు చహల్ బౌలింగ్ ప్రదర్శన ఆర్సీబీని ఆదుకుంది. ఒక్క పరుగుతో విజయం * రాణించిన డివిలియర్స్, చహల్ * చివరి బంతికి ఓడిన పంజాబ్ * విజయ్ మెరుపులు వృథా మొహాలీ: ఐపీఎల్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కీలక విజయాన్ని అందుకుంది. మరోసారి బౌలింగ్ వైఫల్యం జట్టును దెబ్బ తీసేలా కనిపించినా, ఎట్టకేలకు గట్టెక్కింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు పరుగు తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. డివిలియర్స్ (35 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, రాహుల్ (25 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), సచిన్ బేబీ (29 బంతుల్లో 33; 1 ఫోర్) రాణించారు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులే చేయగలిగింది. మురళీ విజయ్ (57 బంతుల్లో 89; 12 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగగా, స్టొయినిస్ (22 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. రెండు కీలక వికెట్లు తీసిన వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చెలరేగిన డివిలియర్స్... వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రాహుల్, కోహ్లి (21 బంతుల్లో 20; 2 ఫోర్లు) బెంగళూరుకు శుభారంభం అందించారు. ఒకవైపు కోహ్లి సంయమనంతో ఆడగా, మరోవైపు నుంచి రాహుల్ చెలరేగిపోయాడు. స్టొయినిస్ వేసిన నాలుగో ఓవర్లో అతను మూడు ఫోర్లు, 1 సిక్సర్ బాదడంతో 20 పరుగులు వచ్చాయి. ఈ జోరులో పవర్‌ప్లేలో ఆర్సీబీ 56 పరుగులు చేసింది. 11 పరుగుల వద్ద స్టొయినిస్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి దానిని పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. కరియప్ప వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో బెంగళూరు వేగానికి బ్రేక్ వేసింది. మూడో బంతికి రాహుల్‌ను బౌల్డ్ చేసిన కరియప్ప, మరో రెండు బంతుల తర్వాత కోహ్లిని పెవిలియన్ పంపించాడు. మరుసటి ఓవర్లోనే వాట్సన్ (1) కూడా వెనుదిరిగాడు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన డివిలియర్స్ ఈ దశలో తన ధాటిని ప్రదర్శించాడు. సందీప్ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టిన అతను, మోహిత్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సందీప్ తర్వాతి ఓవర్లో కూడా మళ్లీ సిక్స్, ఫోర్ కొట్టిన తర్వాత మరో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. డివిలియర్స్‌కు సచిన్ బేబీ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 55 బంతుల్లోనే 88 పరుగులు జోడించారు. ఆఖరి ఓవర్లో బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. తొలి 10 ఓవర్లలో 73 పరుగులు చేసిన కోహ్లి సేన, తర్వాతి 10 ఓవర్లలో 102 పరుగులు సాధించింది. విజయ్ ఒంటరి పోరు... పంజాబ్ ఇన్నింగ్స్‌ను విజయ్ దూకుడుగా ఆరంభించగా, ఆమ్లా (20 బంతుల్లో 21; 2 ఫోర్లు) కొద్ది సేపు అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 33 బంతుల్లో 45 పరుగులు జోడించిన అనంతరం ఆమ్లాను వాట్సన్ అవుట్ చేశాడు. విజయ్‌కు సాహా (13 బంతుల్లో 16; 1 ఫోర్) కూడా సహకరించడంతో రెండో వికెట్‌కూ 32 బంతుల్లో 43 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 10 ఓవర్లు ముగిసే సరికి కింగ్స్ స్కోరు 83 పరుగులకు చేరింది. అయితే 11వ ఓవర్లో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. సాహా రనౌట్ కాగా, మిల్లర్(0) స్టంపౌట్ అయి వెనుదిరిగాడు. మరోవైపు 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విజయ్, ఆ తర్వాత మరింత బాధ్యతగా ఆడాడు. అబ్దుల్లా ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టిన విజయ్, చహల్ ఓవర్లో మరో రెండు బౌండరీలు రాబట్టాడు. విజయ్, స్టొయినిస్ నాలుగో వికెట్‌కు ఆరు ఓవర్లలో 51 పరుగులు జత చేసిన తర్వాత భారీ షాట్‌కు ప్రయత్నించి విజయ్ వెనుదిరగడం పంజాబ్ అవకాశాలను దెబ్బ తీసింది. స్కోరు వివరాలు:- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (సి) విజయ్ (బి) కరియప్ప 20; రాహుల్ (బి) కరియప్ప 42; డివిలియర్స్ (సి) కరియప్ప (బి) సందీప్ 64; వాట్సన్ (బి) అక్షర్ 1; సచిన్ బేబీ (రనౌట్) 33; హెడ్ (సి) విజయ్ (బి) సందీప్ 11; బిన్నీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1-63; 2-64; 3-67; 4-155; 5-174; 6-175. బౌలింగ్: సందీప్ 4-0-49-2; అనురీత్ 3-0-15-0; మోహిత్ 3-0-33-0; స్టొయినిస్ 3-0-35-0; అక్షర్ పటేల్ 4-0-27-1; కరియప్ప 3-0-16-2. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) బిన్నీ (బి) వాట్సన్ 21; విజయ్ (సి) చహల్ (బి) వాట్సన్ 89; సాహా (రనౌట్) 16; మిల్లర్ (స్టంప్డ్) రాహుల్ (బి) చహల్ 0; స్టొయినిస్ (నాటౌట్) 34; బెహర్దీన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1-45; 2-88; 3-88; 4-139. బౌలింగ్: బిన్నీ 2-0-16-0; చహల్ 4-0-30-1; జోర్డాన్ 4-0-52-0; వాట్సన్ 4-0-22-2; ఆరోన్ 3-0-25-0; అబ్దుల్లా 3-0-26-0. -
‘కత్తి’లాంటోడు..!
ఏడాది క్రితం అతని పేరు కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు... క్రికెట్ ప్రపంచం అంతా అతడిని కీర్తిస్తోంది. ప్రత్యర్థి క్రికెటర్లు కొన్ని వందలసార్లు అతని బౌలింగ్ వీడియోలు చూస్తున్నారు. కానీ మైదానంలోకి దిగాక ఎవరికీ కొరుకుడు పడని బంతులు వేస్తున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లి కూడా అతని ధాటికి వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఆ సంచలనం పేరు ముస్తాఫిజుర్ రెహమాన్. బంగ్లాదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ఈ యువ బౌలర్ ఇప్పుడు ఐపీఎల్ ద్వారా మరింత ప్రకంపనలు పుట్టిస్తున్నాడు. నిలకడగా బౌలింగ్ చేస్తూ సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సాక్షి క్రీడావిభాగం: గత జూన్‌లో భారత్‌తో వన్డే ద్వారా ముస్తాఫిజుర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే తన ఆఫ్ కట్టర్స్‌తో బెంబేలెత్తించి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆ షాక్ నుంచి ధోనిసేన కోలుకునేలోగానే రెండో వన్డేలో ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. దీంతో తొలిసారి భారత్‌పై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ గెలిచింది. దీంతో బంగ్లాదేశ్‌లో ముస్తాఫిజుర్ హీరోగా మారిపోయాడు. అయితే ఇలాంటి బౌలర్లు గతంలో చాలామంది వచ్చారని, ముస్తాఫిజుర్ కూడా ఈ సంచలనాలు ఎక్కువ కాలం కొనసాగించలేడనే వాదన కూడా వినిపించింది. అయితే ఏడాది గడిచినా ప్రపంచంలోని టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కూడా ఇప్పటికీ అతని ఆఫ్ కట్టర్స్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ఏడాది కాలంలో మొత్తం 24 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను 52 వికెట్లు తీసుకున్నాడు. గత ఏడాది కాలంలో బంగ్లాదేశ్ సంచలన విజయాల్లో ముస్తాఫిజుర్దీ కీలకపాత్ర. చౌకగానే సన్‌రైజర్స్‌కు... ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముస్తాఫిజుర్‌ను సన్‌రైజర్స్ జట్టు రూ.1.4 కోట్లు పెట్టి కొనుక్కుంది. నిజానికి అతని నైపుణ్యానికి ఇంతకంటే ఎక్కువ రేటు రావాల్సింది. కానీ ముస్తాఫిజుర్ ఇంకా ఈ స్థాయిలో రాణిస్తాడని ఏ జట్టూ ఊహించలేదు. ‘తన ఆఫ్ కట్టర్స్‌ను ఇంకా చాలామంది బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోలేదు. కాబట్టి కచ్చితంగా అతను మా బలమవుతాడు’ అని సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ వేలం సమయంలో అభిప్రాయపడ్డారు. ఒక రకంగా తను చౌకగానే ఈ జట్టుకు దొరికాడు. అయితే బౌల్ట్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్‌తో పాటు ఆశిష్ నెహ్రా, బరీందర్ శరణ్లాంటి భారత ఎడమచేతి వాటం బౌలర్లు ఉన్నందున తుది జట్టులో ముస్తాఫిజుర్‌కు చోటు దక్కుతుందని అతను కూడా అనుకోలేదట. కానీ అనూహ్యంగా తొలి మ్యాచ్‌లోనే తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో జోరు... సీజన్ తొలి మ్యాచ్‌లో బెంగళూరుతో మ్యాచ్‌లో సన్ బౌలర్లు 227 పరుగులు ఇచ్చారు. అయితే ముస్తాఫిజుర్ మాత్రం తన నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా బంతులు వేస్తున్న అతను పంజాబ్‌పై నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు అవసరమైన సమయంలో... స్లాగ్ ఓవర్లలో కెప్టెన్ వార్నర్ బంతి ముస్తాఫిజుర్‌కు ఇస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు ఆడిన ఫిజ్... 13 వికెట్లు తీసుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో అందరికంటే పొదుపుగా (6.15 ఎకానమీ) బౌలింగ్ చేశాడు. సుదీర్ఘకాలం ఉంటాడా? ఏడాది అంతర్జాతీయ క్రికెట్ అనుభవంలోనే ముస్తాఫిజుర్ రెండుసార్లు గాయాల బారిన పడ్డాడు. ఏ ఫాస్ట్ బౌలర్‌కైనా గాయాలు సహజం. ముస్తాఫిజుర్‌కు కూడా ఇప్పుడు తనని తాను గాయాల నుంచి కాపాడుకోవడమే కీలకం. చాలామంది బౌలర్లు గతంలో రెండు మూడేళ్లు సంచలన బౌలర్లుగా ప్రభావం చూపినా ఆ తర్వాత కనుమరుగయ్యారు. కారణం ప్రత్యర్థులు వారి బౌలింగ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం. ఏ బౌలర్ అయినా ఎప్పటికప్పుడు మెరుగైతేనే సుదీర్ఘకాలం మనగలుగుతాడు. ముస్తాఫిజుర్లో ఈ నైపుణ్యం ఉందని సన్‌రైజర్స్ బౌలింగ్ మెంటార్ మురళీధరన్ అభిప్రాయపడుతున్నారు. ‘సరైన గెడైన్స్‌తో ప్రణాళికతో వెళితే ముస్తాఫిజుర్ సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడు’ అని ఆయన అన్నారు. భవిష్యత్ సంగతి ఎలా ఉన్నా ఈ సీజన్ ఐపీఎల్లో చివరి వరకూ ఇదే నిలకడ కనబరచి సన్‌రైజర్స్‌ను చాంపియన్‌గా నిలపాలని ఆశిద్దాం. స్ఫూర్తిదాయక నేపథ్యం బంగ్లాదేశ్‌లోని సత్కిరా అనే పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పల్లెటూరు టెటూలియా ముస్తాఫిజుర్ స్వస్థలం. చిన్నప్పుడు తన ముగ్గురు అన్నలతో కలిసి సరదాగా టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడేవాడు. 12 ఏళ్ల వయసులో తనలో క్రికెట్ టాలెంట్‌ను గుర్తించిన అతని తండ్రి అబుల్ ఖాసీం ఘాజీ సత్కిరా పట్టణానికి శిక్షణ కోసం పంపించారు. దీనికోసం తన అన్న వెనుక బండి మీద కూర్చుని రోజూ 40 కిలోమీటర్లు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. దీంతో చదువు అటకెక్కింది. అయినా తనలో నైపుణ్యం ఉందని కోచ్‌లు చెప్పడంతో 2012లో ఢాకా వచ్చాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేస్ బౌలింగ్ ఫౌండేషన్‌కు ఎంపికయ్యాడు. రెండేళ్లలోనే (2014) అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. 2014లో దేశవాళీ క్రికెట్లో నిలకడ, 2015 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా డైనమైట్స్ తరఫున 10 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీయడంతో జాతీయ జట్టులో అవకాశం లభించింది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ముస్తాఫిజుర్ అంచెలంచెలుగా ఎదిగిన వైనం బంగ్లాదేశ్‌లోని ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ముస్తాఫిజుర్‌కు క్రేజ్ బాగా పెరిగింది. రోజూ వందల సంఖ్యలో లవ్‌లెటర్స్ వస్తున్నాయట. డిమాండ్ పెరిగింది...ప్రస్తుతం టి20 క్రికెట్లో సునీల్ నరైన్ తర్వాత అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన రికార్డు ముస్తాఫిజుర్ది. ఇప్పటికే అతను అనేక ఘనతలు సొంతం చే సుకున్నాడు. షకీబ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సంచలనంగా మారిన ముస్తాఫిజుర్ తమ లీగ్‌లలో ఆడాలని అన్ని దేశాలూ కోరుకుంటున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ అతణ్ని తీసుకుంది. కానీ గాయం కారణంగా ఈ లీగ్‌లో అతను ఆడలేదు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్ తరఫున ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ జట్లు కూడా ముస్తఫిజుర్‌తో చర్చలు జరుపుతున్నాయి. ఒకరకంగా ప్రస్తుతం అతను ప్రపంచ క్రికెట్లో హాట్ పేస్ బౌలర్. -
‘143’ తర్వాత బ్రేక్!
రాజ్‌కోట్: ఐపీఎల్ ఆరంభంనుంచి ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా బరిలోకి దిగుతున్న సురేశ్ రైనా తొలిసారి ఒక మ్యాచ్‌కు దూరం కానున్నాడు. తన భార్య ప్రసవం కారణంగా నెదర్లాండ్స్ వెళుతున్న రైనా... గుజరాత్ లయన్స్ తర్వాతి మ్యాచ్‌లో ఆడే అవకాశాలు దాదాపుగా లేవు. ‘నా భార్య ను కలిసేందుకు సోమవారం హాలండ్ వెళుతున్నాను. చాలా ఉద్వేగంగా ఉంది’ అని ఆదివారం కోల్‌కతాతో విజయం అనంతరం రైనా చెప్పాడు. లయన్స్ తదుపరి మ్యాచ్‌కు (శనివారం) ముందు చాలా విరామం ఉన్నా... ఆలోగా కూడా రైనా తిరిగి రాకపోవచ్చు. 2008నుంచి 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన రైనా, ఈ సారి కొత్త జట్టు గుజరాత్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్లో అత్యధికంగా 143 మ్యాచ్‌లు ఆడిన రైనా 3985 పరుగులు చేశాడు. -
లయన్స్ పంజా విసిరింది
► కోల్‌కతాపై విజయం దినేశ్ కార్తీక్ అర్ధ సెంచరీ ► వరుస పరాజయాలకు బ్రేక్ కోల్‌కతా: వరుసగా మూడు పరాజయాలతో కుదేలైన గుజరాత్ లయన్స్ ఎట్టకేలకు పంజా విసిరింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి తిరిగి టాప్ పొజిషన్‌కు చేరుకుంది. ముందుగా బౌలర్లు అద్భుతంగా రాణించి ప్రత్యర్థిని ఓ మాదిరి స్కోరుకే కట్టడి చేయగా అనంతరం బ్యాట్స్‌మెన్ మిగతా పని కానిచ్చారు. ఫలితంగా ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో లయన్స్ ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. షకీబ్ హసన్ (49 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు; 4 సిక్సర్లు), యూసుఫ్ పఠాన్ (41 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీలు చేశారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ప్రవీణ్ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ లయన్స్ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (29 బంతుల్లో 51; 8 ఫోర్లు; 1 సిక్స్) అర్ధసెంచరీకి తోడు చివర్లో ఆరోన్ ఫించ్ (10 బంతుల్లో 29; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ మొత్తాన్ని యూసుఫ్ పఠాన్, ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ నడిపించారు. ఆరంభంలో బౌన్సీ పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న పేసర్ ప్రవీణ్ కుమార్ రెండో ఓవర్లో గంభీర్ (5), మనీష్ పాండేను పెవిలియన్‌కు పంపి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రాబిన్ ఉతప్ప (10 బంతుల్లో 14; 3 ఫోర్లు)... రైనా సూపర్ క్యాచ్‌తో సూర్యకుమార్ యాదవ్ (4) కూడా అవుట్ కావడంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షకీబ్, యూసుఫ్ జోడి జట్టును అద్భుతంగా ఆడి ఆదుకుంది. ఎలాంటి నిర్లక్ష్యపు షాట్లకు పోకుండా అడపాదడపా బౌండరీలు బాదుతూ కోల్‌కతాకు గౌరవప్రద స్కోరును అందించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లయన్స్ తమ తొలి ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే తీసినా ఆ తర్వాత పుంజుకుంది. రెండో ఓవర్లో రెండు, మూడో ఓవర్లో మూడు ఫోర్లతో గేరు మార్చింది. అయితే పరుగుల కట్టడికి స్పిన్నర్లను బరిలోకి దించి గంభీర్ ఫలితం సాధించాడు. దూకుడు మీదున్న డ్వేన్ స్మిత్ (18 బంతుల్లో 27; 4 ఫోర్లు; 1 సిక్స్)ను షకీబ్ బౌల్డ్ చేయగా... పీయూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన మెకల్లమ్ (24 బంతుల్లో 29; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) క్యాచ్ అవుటయ్యాడు. అయితే తొమ్మిదో ఓవర్లో దినేశ్ కార్తీక్ హ్యాట్రిక్ ఫోర్లతో ఒత్తిడి తగ్గించాడు. రైనాతో కలిసి మూడో వికెట్‌కు 49 పరుగులు జత చేశాడు. 27 బంతుల్లో దినేశ్ కార్తీక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా ఫించ్ వచ్చీ రావడంతోనే బౌండరీల వర్షం కురిపించడంతో లక్ష్యం చిన్నదైపోయింది. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) దినేశ్ కార్తీక్ (బి) కులకర్ణి 14; గంభీర్ (బి) ప్రవీణ్ 5; మనీష్ పాండే (సి) దినేశ్ కార్తీక్ (బి) ప్రవీణ్ 0; సూర్యకుమార్ యాదవ్ (సి) రైనా (బి) స్మిత్ 4; షకీబ్ నాటౌట్ 66; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 63; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-15, 2-15, 3-21, 4-24. బౌలింగ్: ప్రవీణ్ 4-1-19-2; కులకర్ణి 4-0-30-1; స్మిత్ 2-0-14-1; బ్రేవో 4-0-39-0; కౌశిక్ 1-0-14-0; జడేజా 3-0-25-0; తాంబే 2-0-15-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) షకీబ్ 27; మెకల్లమ్ (సి) పాండే (బి) చావ్లా 29; రైనా (సి) హాగ్ (బి) రసెల్ 14; దినేశ్ కార్తీక్ (స్టంప్డ్) ఉతప్ప (బి) హాగ్ 51; ఫించ్ (రనౌట్) 29; జడేజా నాటౌట్ 9; బ్రేవో నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18 ఓవర్లలో ఐదు వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-42, 2-67, 3-116, 4-155, 5-158. బౌలింగ్: రసెల్ 3-0-21-1; మోర్కెల్ 4-0-38-0; షకీబ్ 3-0-38-1; చావ్లా 4-0-30-1; హాగ్ 2-0-19-1; ఉమేశ్ 2-0-18-0. -
తీరంలో ‘సూర్యో’దయం
► సన్‌రైజర్స్ విజయాల హ్యాట్రిక్ 85 పరుగులతో ముంబై చిత్తు ► రాణించిన ధావన్, వార్నర్ చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు ‘సొంత మైదానం’ కాని సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన పట్టును ప్రదర్శించింది. గత ఏడాది ఇక్కడే హోం గ్రౌండ్‌గా మూడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ జట్టు ఇప్పుడు ప్రత్యర్థి స్థానంలో తలపడింది. అయితే వేదిక మారినా ఆ జట్టు జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఈసారి విశాఖ తీరంలో ముంబైని తుక్కుగా ఓడించి లీగ్‌లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ముందుగా వార్నర్, ధావన్ మెరుపులకు తోడు అద్భుత బౌలింగ్ రైజర్స్‌ను నిలబెట్టింది. ఒకరు కాదు ఇద్దరు కాదు...నలుగురు సన్‌రైజర్స్ బౌలర్లు తమ తొలి ఓవర్లోనే వికెట్ తీస్తే భారీ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అచేతనంగా మారిపోయింది. 26 బంతులు ఆడే సరికే ఐదుగురు ఆటగాళ్లు అవుట్ కాగా... లీగ్‌లో ఛేదన అంటే చెలరేగిపోతున్న కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం మొదలు... పది ఓవర్ల లోపే ఏడు వికెట్లు కోల్పోయిన ముంబై జట్టు ఏమీ చేయలేక చేతులెత్తేసింది. సీజన్లో అతి తక్కువ స్కోరు నమోదు చేసిన రోహిత్ బృందం మూడు విజయాల తర్వాత ఓటమిని మూటగట్టుకుంది. సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుతమైన ప్రదర్శనతో ఆ జట్టు లీగ్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రైజర్స్ 85 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (57 బంతుల్లో 82 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయమైన బ్యాటింగ్‌కు తోడు వార్నర్ (33 బంతుల్లో 48; 7 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారం జట్టుకు భారీ స్కోరు అందించాయి. అనంతరం ముంబై 16.3 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. సన్ బలమైన బౌలింగ్ ముందు ముంబై బ్యాటింగ్ సమష్టిగా విఫలమైంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆశిష్ నెహ్రా (3/15), ముస్తఫిజుర్ రహమాన్ (3/16) చెలరేగగా, బరీందర్‌కు 2 వికెట్లు దక్కాయి. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం ఇదే మైదానంలో పుణేతో తలపడుతుంది. ఓపెనర్లు దూకుడు: ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు వార్నర్, ధావన్ మరోసారి హైదరాబాద్‌కు అదిరే ఆరంభం ఇచ్చారు. ముందుగా వార్నర్ జోరు మొదలు పెట్టగా, ఆ తర్వాత ధావన్ లయ అందుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతిని ఫోర్‌గా మలచిన వార్నర్...హర్భజన్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాది దూకుడు ప్రదర్శించాడు. మెక్లీనగన్ బౌలింగ్‌లో కూడా వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 51 పరుగులకు చేరింది. అయితే భజ్జీ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన వార్నర్, అదే ఊపులో అవుట్ కావడంతో 85 పరుగుల (59 బంతుల్లో) తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. విలియమ్సన్ (2) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో ధావన్, యువరాజ్ కలిసి జట్టును నడిపించారు. గత మ్యాచ్‌లో విఫలమైన యువరాజ్ తన 100వ ఐపీఎల్ మ్యాచ్‌లో చెలరేగాడు. పొలార్డ్ వేసిన ఓవర్లో యువీ వరుసగా ఫోర్, సిక్స్ కొట్టడంతో రైజర్స్ ఇన్నింగ్స్ వేగం పెరిగింది. మరోవైపు 43 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న ధావన్, అనంతరం బుమ్రా వేసిన రెండు ఓవర్లలో కలిపి నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ బాది దూకుడు ప్రదర్శించాడు. చివరి ఓవర్ నాలు గో బంతికి యువీ హిట్ వికెట్‌గా వెనుదిరగ్గా, ఓవర్లో ఏడు పరుగులే వచ్చాయి. అయితే 15-19 మధ్య ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్ 68 పరుగులు చేయడం జట్టు భారీ స్కోరుకు కారణమైంది. టపటపా...: భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ పూర్తిగా పట్టు తప్పింది. ఆ జట్టులో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కనీస స్థాయిలో పోరాడలేకపోయాడు. తొలి ఓవర్ చివరి బంతికి పార్థివ్ (0)ను అవుట్ చేసి భువనేశ్వర్ శుభారంభం ఇవ్వగా, నెహ్రా వేసిన రెండో ఓవర్ తొలి బంతినే రోహిత్ (5) వికెట్లపైకి ఆడుకున్నాడు. నెహ్రా తన రెండో ఓవర్లో మరింత చెలరేగిపోయాడు. నాలుగో బంతికి రాయుడు (6) వెనుదిరగ్గా, ఆరో బంతిని బట్లర్ (2) నేరుగా కీపర్ చేతుల్లోకి పంపించాడు. భువీ, నెహ్రాలాగే తొలి ఓవర్లో వికెట్ పండగ చేసుకుంటూ బరీందర్ కూడా తన రెండో బంతికే కృనాల్ (11 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్)ను అవుట్ చేయడంతో ముంబై 30 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. బరీందర్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి పొలార్డ్ (11) ఆదుకునే ప్రయత్నం చేసినా అతనూ వెంటనే అవుటయ్యాడు. ఈసారి నా వంతు అంటూ తొలి బంతికే హార్దిక్ (7)ను అవుట్ చేసిన ముస్తఫిజుర్, రెండో ఓవర్ తొలి బం తికి సౌతీ (3)ని వెనక్కి పంపడంతో ముంబై గెలు పు ఆశలు కోల్పోయింది. హర్భజన్ (21 నాటౌట్; 2 ఫోర్లు) కొద్దిసేపు పోరాడినా మరో 21 బంతులు ఉండగానే ముంబై ఇన్నింగ్స్ ముగిసింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) పొలార్డ్ (బి) హర్భజన్ 48; ధావన్ (నాటౌట్) 82; విలియమ్సన్ (సి) రోహిత్ (బి) హర్భజన్ 2; యువరాజ్ (హిట్‌వికెట్) (బి) మెక్లీనగన్ 39; హెన్రిక్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 177 వికెట్ల పతనం: 1-85; 2-91; 3-176. బౌలింగ్: సౌతీ 4-0-35-0; మెక్లీనగన్ 4-0-38-1; హర్భజన్ 4-0-29-2; బుమ్రా 4-0-35-0; హార్దిక్ 1-0-10-0; పొలార్డ్ 2-0-23-0; కృనాల్ 1-0-5-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) నెహ్రా 5; పార్థివ్ (ఎల్బీ) (బి) భువనేశ్వర్ 0; రాయుడు (సి) విలియమ్సన్ (బి) నెహ్రా 6; కృనాల్ (సి) ధావన్ (బి) బరీందర్ 17; బట్లర్ (సి) ఓజా (బి) నెహ్రా 2; పొలార్డ్ (సి) బరీందర్ (బి) హెన్రిక్స్ 11; హార్దిక్ (సి) ఓజా (బి) ముస్తఫిజుర్ 7; హర్భజన్ (నాటౌట్) 21; సౌతీ (సి) ఓజా (బి) ముస్తఫిజుర్ 3; మెక్లీనగన్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 8; బుమ్రా (సి) ఓజా (బి) బరీందర్ 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (16.3 ఓవర్లలో ఆలౌట్) 92. వికెట్ల పతనం: 1-5; 2-5; 3-28; 4-30; 5-30; 6-49; 7-50; 8-58; 9-78; 10-92. బౌలింగ్: భువనేశ్వర్ 3-0-23-1; నెహ్రా 3-0-15-3; బరీందర్ 3.3-0-18-2; హెన్రిక్స్ 4-0-18-1; ముస్తఫిజుర్ 3-0-16-3. -
నేడు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు
విశాఖ: నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 8, 10, 13, 15, 17, 21 తేదీలలో పీఎంపాలెం, డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2016 క్రికెట్ మ్యాచ్‌లకు నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక వైఎస్ఆర్ స్టేడియం వద్ద భారీ పోలీస్ భద్రతను ఏర్పాటుచేశారు. ఎండాడ జంక్షన్ వరకు వాహనాల రాకపోకలకు అనుమతి ఉంటుందని నగర క్రైం డీసీపీ టీ.రవికుమార్‌మూర్తి, నగర ట్రాఫిక్ ఏడీసీపీ కే. మహేంద్రపాత్రుడు వెల్లడించారు. వైఎస్ఆర్ స్డేడియం వేదికగా సాయంత్రం 4 గంటలకు ముంబై ఇండియన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఐదు రద్దీ నియంత్రణ బృందాలు, భద్రతా బృందాలను కొమ్మాదిలో ఒకటి, ఎండాడలో ఒకటి ఏర్పాటు చేశారు. -
గట్టి నిఘా నడుమ ఐపీఎల్
► సుమారు వెయ్యిమంది పోలీసులతో పహారా ► స్టేడియం చుట్టూ 42 సీసీ కెమెరాలు ఏర్పాటు అల్లిపురం : ఈ నెల 8, 10, 13, 15, 17, 21 తేదీలలో పీఎంపాలెం, డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2016 క్రికెట్ మ్యాచ్‌లకు నగర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ టీ.రవికుమార్‌మూర్తి, నగర ట్రాఫిక్ ఏడీసీపీ కే. మహేంద్రపాత్రుడు వివరాలు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్‌లు సక్రమంగా జరగడానికి నలుగురు ఏడీసీపీలు, 12 మంది ఏసీపీలు, 40 మంది సీఐలు, 62 మంది ఎస్ఐలు, 99 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, 378 మంది కానిస్టేబుల్స్, 44 మంది మహిళా కానిస్టేబుల్స్, 39 మంది హోంగార్డులతో పాటు 11 ప్లటూన్ల ఆర్మ్డ్ ఫోర్సును వినియోగిస్తున్నారు. ► స్టేడియం చుట్టూ 42 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్టేడియం వద్ద రెండు కమాండ్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. ► 27,500 మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను చూసేలా స్టేడియం సామర్ధ్యం ఉంది. ► స్టేడియంలోకి ప్రవేశానికి 20 గేట్లు వినియోగిస్తున్నారు. ఒక్కో గేటు వద్ద ఒక సీఐ పర్వవేక్షిస్తుంటారు. ఐదు సెక్టార్లకు ఒక ఏసీపీ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు. ► బందోబస్తుకు సంబంధించి ‘ఏ’ నుంచి ‘ఓ’ స్టాండులను 15 విభాగాలుగా విభజించా రు. ప్రతి స్టాండుకు ఒక సీఐ, ఎస్ఐ బాధ్యత వహిస్తారు. వీటిని 3 సెక్టార్లుగా విభజించి ఒక్కో సెక్టారుకు ఒక ఏసీపీ పర్యవేక్షిస్తారు. ► స్టేడియంలో 30 కార్పొరేట్ బాక్సులు మ్యాచ్ అఫీసియల్ ప్లేయర్స్ లాంజెస్, 1250 సీటింగ్ ఏర్పాట్లను సౌత్‌బ్లాక్‌లో ఏర్పాటు చేశారు. ► వీరికి ఒక ఏసీపీ, ఆరుగురు సీఐలు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ► స్టేడియం లోపలకు ప్రవేశించే వారిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేస్తారు. ► 150 మంది ఏసీఏ సిబ్బంది స్టేడియంలో క్రికెట్ టికెట్ చెకింగ్స్ నిర్వహిస్తారు. ► ఐదు రద్దీ నియంత్రణ బృందాలు, భద్రతా బృందాలను కొమ్మాదిలో ఒకటి, ఎండాడలో ఒకటి ఏర్పాటు చేశారు. -
వైజాగ్‌లో ఐపీఎల్ సందడి
► నేడు ముంబైతో తలపడనున్న హైదరాబాద్ ► ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు విశాఖలో ఒక్క మ్యాచ్ కూడా లేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా ఏకంగా ఆరు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం లభించింది. గతంలో హైదరాబాద్ జట్టు ఇక్కడ కొన్ని మ్యాచ్‌లను ఆడినా ఈ సీజన్లో అన్ని హోమ్ మ్యాచ్‌లను భాగ్యనగరంలోనే ఆడుతోంది. అయితే మహారాష్ట్ర మ్యాచ్‌లను తరలించాల్సి రావడం విశాఖ అభిమానులకు వరంగా మారింది. పుణే, ముంబై రెండు జట్లూ తమ హోమ్ మ్యాచ్‌లను ఇక్కడే ఆడనున్నాయి. నేడు (ఆదివారం) జరిగే మ్యాచ్‌లో ముంబై జట్టు సన్‌రైజర్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. -
'ఆ బౌలర్ ను ఎదుర్కోవడం చాలా కష్టం'
హైదరాబాద్: కొత్త ఫ్రాంచైజీ అయినప్పటికీ వరుస విజయాలతో దుమ్మురేపిన తమ జట్టు ఓటముల బాట పట్టడాన్ని గుజరాత్ లయన్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో జీర్ణించుకోలేక పోతున్నాడు. వర్షం కురిసి స్టేడియం ఔట్ ఫీల్డ్ అంతగా సెట్ అవ్వలేదని పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా తమ బ్యాట్స్ మన్ కుదురుకోలేదని అభిప్రాయపడ్డాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో గుజరాత్ లయన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన అనంతరం బ్రావో మీడియాతో మాట్లాడాడు. భువనేశ్వర్ బౌలింగ్ ఆటను మార్చేసిందని, అతను వేసిన తొలి ఓవర్ అద్భుతమని ప్రశంసించాడు. శిఖర్ ధావన్ (47 నాటౌట్; 6 ఫోర్లు) రాణించినప్పటికీ అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన భువీ(2/28)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాంటి పరిస్థితుల్లో భువీ లాంటి ప్రధాన పేస్ బౌలర్ ను ఎదుర్కొవడం చాలా కష్టమన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ స్వింగ్ రాబట్టే బౌలర్లలో భువీ ఒకడని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ ఆటగాళ్లం అయినా, పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాలి. అలాంటిది జరగనందున లయన్స్ కు ఓటమి తప్పలేదన్నాడు. -
మరింత రైజింగ్
► సన్‌రైజర్స్‌కు ఐదో విజయం ► 5 వికెట్లతో గుజరాత్ ఓటమి ► సమష్టిగా రాణించిన బౌలర్లు ► ధావన్ కీలక ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మొదటి రెండు ఓవర్లు మెయిడిన్లు... బౌలర్లంతా పోటాపోటీగా కట్టుదిట్టంగా బంతులు వేయడం... సన్‌రైజర్స్‌కు బలమైన బౌలర్లు మరోసారి చెలరేగారు. అయితే 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాట్స్‌మెన్ తడబడినా... శిఖర్ ధావన్ కీలక ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ లయన్స్‌పై గెలిచింది. సీజన్లో వార్నర్ సేనకు ఇది ఐదో విజయం. దీంతో ప్లే ఆఫ్ దిశగా హైదరాబాద్ మరో అడుగు ముందుకు వేసింది. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూసుకుపోతోంది. సమర్థ బౌలింగ్‌కు తోడు ధావన్ బ్యాటింగ్ ప్రదర్శనతో మరో కీలక విజయం సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (42 బంతుల్లో 51 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముస్తఫిజుర్, భువనేశ్వర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (40 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఫించ్ మినహా...: మెకల్లమ్, స్మిత్... ఇద్దరూ విధ్వంసకర బ్యాట్స్‌మెన్. కానీ సన్ బౌలర్ల నిలకడతో కనీసం సింగిల్స్ తీయడానికి కూడా కిందామీదా పడ్డారు. మూడో ఓవర్ రెండో బంతికి ఆ జట్టు ఖాతా తెరిచింది. అయితే ఇదే ఒత్తిడిలో స్మిత్ (9 బంతుల్లో 1) అవుటయ్యాడు. రైనా (10 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు నిలవలేదు. పవర్‌ప్లేలో ఆ జట్టు 26 పరుగులు మాత్రమే చేయగలిగింది. విలియమ్సన్, వార్నర్‌ల అద్భుతమైన క్యాచ్‌లకు కార్తీక్ (0), మెకల్లమ్ (19 బంతుల్లో 7) వెనుదిరగడంతో లయన్స్ 34 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఫించ్, బ్రేవో (20 బంతుల్లో 18; 1 ఫోర్) కొద్దిగా ఆదుకునే ప్రయత్నం చేశారు. ఐదో వికెట్‌కు 39 బంతుల్లో 45 పరుగులు జోడించిన తర్వాత బ్రేవో వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. 30 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లాంగాఫ్‌లో వార్నర్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో ఫించ్ బతికిపోయాడు. ఆఖర్లో ఫించ్‌కు కొద్ది సేపు జడేజా (13 బంతుల్లో 18; 2 ఫోర్లు) అండగా నిలవడంతో లయన్స్ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. లయన్స్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు మాత్రమే ఉన్నాయి. ధావన్ యాంకర్ ఇన్నింగ్స్: స్వల్ప లక్ష్య ఛేదనలో రైజర్స్‌కు వార్నర్ (17 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) దూకుడైన ఆరంభం అందించాడు. సాంగ్వాన్ వేసిన రెండో ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లతో చెలరేగాడు. అయితే ధావల్ తన తొలి బంతికే వార్నర్‌ను అవుట్ చేయడంతో గుజరాత్‌కు బ్రేక్ లభించింది. ఆ వెంటనే విలియమ్సన్ (6) వెనుదిరగ్గా, హెన్రిక్స్ (16 బంతుల్లో 14; 2 ఫోర్లు) కూడా ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్‌లో ధావన్‌కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. 10 ఓవర్లు ముగిసే సరికి అతను 15 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే ఆ తర్వాత మరింత బాధ్యత తీసుకొని ఆడిన అతను జట్టును ముందుండి నడిపించాడు. ఐపీఎల్-9లో తొలి మ్యాచ్ ఆడిన యువరాజ్ (14 బంతుల్లో 5) పూర్తిగా నిరాశపరిచాడు. ఈ దశలో గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో కొంత ఒత్తిడి నెలకొంది. అయితే ధావన్ సంయమనంతో ఆడుతూ చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు గుజరాత్ లయన్స్ బ్యాటింగ్: డ్వేన్ స్మిత్ (సి) ముస్తఫిజుర్ (బి) భువనేశ్వర్ 1; మెకల్లమ్ (సి) వార్నర్ (బి) హెన్రిక్స్ 7; రైనా (సి) అండ్ (బి) భువనేశ్వర్ 20; కార్తీక్ (సి) విలియమ్సన్ (బి) ముస్తఫిజుర్ 0; ఫించ్ (నాటౌట్) 51; బ్రేవో (సి) (సబ్) విజయ్ శంకర్ (బి) బరీందర్ 18; జడేజా (సి) భువనేశ్వర్ (బి) ముస్తఫిజుర్ 18; ప్రవీణ్ కుమార్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 126. వికెట్ల పతనం: 1-2; 2-24; 3-25; 4-34; 5-79; 6-106; బౌలింగ్: భువనేశ్వర్ 4-1-28-2; నెహ్రా 4-1-23-0; ముస్తఫిజుర్ 4-0-17-2; బరీందర్ 3-0-21-1; హెన్రిక్స్ 3-0-24-1; యువరాజ్ 2-0-13-0. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) ప్రవీణ్ (బి) ధావల్ 24; ధావన్ (నాటౌట్) 47; విలియమ్సన్ (సి) స్మిత్ (బి) ప్రవీణ్ 6; హెన్రిక్స్ (సి) కార్తీక్ (బి) బ్రేవో 14; యువరాజ్ (సి) సాంగ్వాన్ (బి) ధావల్ 5; హుడా (సి) కార్తీక్ (బి) బ్రేవో 18; ఓజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19 ఓవర్లలో 5 వికెట్లకు) 129. వికెట్ల పతనం: 1-26; 2-33; 3-55; 4-81; 5-108. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 4-0-28-1; సాంగ్వాన్ 2-0-28-0; ధావల్ 4-1-17-2; కౌశిక్ 4-0-25-0; జడేజా 2-0-14-0; బ్రేవో 3-0-14-2. -
‘ఫిక్సింగ్‌ను ఎవరూ ఆపలేరు’
న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్‌ను అరికట్టేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వ్యక్తిగతంగా ఆయా ఆటగాడి నైతికత కీలకమవుతుందని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘అధికారులు ఈ జాడ్యాన్ని నిరోధించేందుకు వీలైనంత మేరకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి గదికి వెళ్లి నీవు ఫలానా వ్యక్తితో మాట్లాడకు అని చెప్పే వీలుండదు. ఇదంతా వారి వ్యక్తిగత కట్టుబాటుపై ఆధారపడి ఉంటుంది. తప్పు చేయాలని అతడు అనుకుంటే ఎవరూ ఆపలేరు. నన్నెవరూ ఫిక్సింగ్ కోసం సంప్రదించలేదు. భవిష్యత్‌లోనూ అది జరగదు’ అని కోహ్లి స్పష్టం చేశాడు. -
'కొంప ముంచిన ఆఖరి ఓవర్'
కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం జరిగిన మ్యాచ్ లో కోల్ కతా చేతిలో ఓటమిపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు అక్షర్ పటేల్ స్పందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.. తమ ఇన్నింగ్స్ చివరి ఓవర్ కొంపముంచిందని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు. 19వ ఓవర్ ముగిసేవరకూ విజయం తమదేనని ధీమాగా ఉన్నట్లు చెప్పాడు. మాక్స్ వెల్ అద్భుత ఇన్నింగ్స్(42 బంతుల్లో 68) తోడవడంతో సులువుగా గెలుస్తామని భావించామని, చివరి ఓవర్లో మూడు వికెట్లు కోల్పోవడంతో కోల్ కతా విజయం సాధించిందని అభిప్రాయపడ్డాడు. తర్వాతి మ్యాచ్ కు తమ జట్టు 100 శాతం ప్రదర్శన చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ఓవరాల్ గా నాలుగు వికెట్లు తీసిన రస్సెల్ ముగ్గుర్ని డకౌట్ గా వెనక్కి పంపడం గమనార్హం. అక్షర్ పటేల్ (21; 7 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) చివర్లో మెరుపులు మెరిపించినా రనౌట్ కావడంతో వారి పతనం మళ్లీ మొదలైంది. చివరి ఓవర్ రెండో బంతికి అక్షర్ పటేల్ రనౌట్ కాగా, మూడో బంతికి గురుకీరత్ రనౌట్ అయ్యాడు. రస్సెల్ వేసిన అదే ఓవర్లో ఐదో బంతికి స్వప్నిల్ సింగ్ ఎల్బీడబ్లూ రూపంలో వెనుదిరిగాడు. దీంతో చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి 12 పరుగులు అవసరం కాగా, 4 పరుగులే చేసి 3 వికెట్లు కోల్పోవడంతో 7 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యామని అక్షర్ వివరించాడు. -
'అతడు ఔటవ్వడం మాకు కలిసొచ్చింది'
వరుస విజయాలతో దూసుకుపోతూ కోల్ కోతా నైట్ రైడర్స్ ప్రత్యర్థి జట్లకు షాక్ ఇస్తుంది. కోల్ కతా కెప్టెన్ గంభీర్ మాట్లాడుతూ.. మేం మరో 10 పరుగులు చేయాలి. ఆ పరుగులు మేం వెనకబడిపోయాం. అయినా, మా బ్యాట్స్ మెన్ చాలా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడారు. మొదట్లో బంతి చాలా వేగంగా వచ్చినా, చివర్లో మాత్రం చాలా స్లో అవుతుండటంతో ఆడటం కష్టమైందని చెప్పాడు. మాక్స్ వెల్ ఔటవ్వడం కూడా మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అని అభిప్రాయపడ్డాడు. ఈడెన్ గార్డెన్స్ లో బుధవారం జరిగిన మ్యాచులో కింగ్స ఎలెవన్ పంజాబ్ పై 7 పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మాది అనే ఉద్దేశంతో ఎప్పుడూ ఉండలేమని, ఆండ్రీ రస్సెల్ అద్భుతంగా బౌలింగ్ చేయడం తమకు కలిసొచ్చిందన్నాడు. ప్రత్యర్థి జట్టు ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచినా... చాంపియన్స్ తరహాలో బౌలింగ్ చేశామని తమ బౌలర్లను ప్రశంసించాడు. ముఖ్యంగా పర్పుల్ క్యాప్ సాధించిన రస్సెల్(4/20) బౌలింగ్ తమ విజయానికి బాటలు వేసిందని గంభీర్ పేర్కొన్నాడు. 12 పాయింట్లతో గుజరాత్ లయన్స్ తో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ తో కోల్ కతా సీజన్ లో తొలిసారి టాప్ ప్లేస్ ఆక్రమించింది. -
కోల్‌కతా ‘టాప్’ క్లాస్
► పంజాబ్‌పై ఏడు పరుగులతో నైట్ రైడర్స్విజయం ► ఉతప్ప, గంభీర్ అర్ధసెంచరీలు ► బంతితో మెరిసిన రసెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గంభీర్, ఉతప్పల క్లాసికల్ అర్ధసెంచరీలు... ఆండ్రీ రసెల్ సంచలన బౌలింగ్‌తో సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయం సాధించింది. సీజన్లో తొలిసారి మ్యాక్స్‌వెల్ మెరిసినా పంజాబ్ రాత మారలేదు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచిన నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. కోల్‌కతా: ‘సూపర్ మ్యాన్’ ఆండ్రీ రసెల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో మరో విజయాన్ని చేర్చాడు. ఈసారి అద్భుతమైన బౌలింగ్‌తో పాటు మైదానం అంతా పాదరసంలా క దిలి ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. రసెల్ (4/ 20) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడు పరుగులతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉతప్ప (49 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), గంభీర్ (45 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ సెంచరీలు సాధించి... తొలి వికెట్‌కు 81 బంతుల్లో 101 పరుగులు జోడించారు. యూసుఫ్ పఠాన్ (16 బంతుల్లో 19 నాటౌట్; 1 సిక్సర్), రసెల్ (10 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్సర్) స్లాగ్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. మ్యాక్స్‌వెల్ (42 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అక్షర్ పటేల్ (7 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. తన నాలుగు ఓవర్లలో 15 డాట్ బాల్స్ వేసిన రసెల్ నాలుగు వికెట్లు తీయగా... పీయూష్ చావ్లా రెండు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ల జోరు ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోల్‌కతా ఓపెనర్లు గంభీర్, ఉతప్ప మరోసారి రాణించారు. ఇద్దరూ తమ సహజశైలిలోనే ఆడటంతో అడపాదడపా బౌండరీలు వచ్చినా పవర్‌ప్లేలో 40 పరుగులు మాత్రమే వచ్చాయి. కుదురుకున్నాక ఇద్దరూ చెరో సిక్సర్ కొట్టినా ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 74 పరుగులతో కోల్‌కతా పటిష్ట స్థితికి చేరింది. 42 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన గంభీర్... ఆ తర్వాతి ఓవర్లోనే రనౌట్‌గా వెనుదిరిగాడు. గత మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యూసుఫ్ పఠాన్‌తో కలిసి ఉతప్ప ఇన్నింగ్స్‌లో వేగం పెంచే ప్రయత్నం చేశాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన ఉతప్ప... జోరు పెంచి ఓ సిక్సర్, ఫోర్ కొట్టినా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రసెల్ క్రీజులోకి వచ్చినా... పఠాన్, రసెల్ జోడీని పంజాబ్ బౌలర్లు నియంత్రించారు. స్లాగ్ ఓవర్లలో సందీప్ శర్మ, మోహిత్ శర్మ అద్భుతంగా యార్కర్లు సంధించడంతో భారీగా పరుగులు రాలేదు. ఇన్నింగ్స్ చివరి బంతికి రసెల్ రనౌట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ పోరాడినా... పంజాబ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్టోయినిస్ అవుటయ్యాడు. వోహ్రా, కెప్టెన్ విజయ్ కూడా వరుస బంతుల్లో అవుట్ కావడంతో పంజాబ్ 13 పరుగులకే టాపార్డర్ మూడు వికెట్లు కోల్పోయింది. సాహా, మ్యాక్స్‌వెల్ చెరో రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో పంజాబ్ 37 పరుగులు చేసింది. సాహా కూడా విఫలం కావడంతో పది ఓవర్లలో 4 వికెట్లకు 64 పరుగులు మాత్రమే చేసింది.ఈ దశలో మ్యాక్స్‌వెల్ బ్యాట్ ఝళిపించాడు. చావ్లా బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్... హాగ్ బౌలింగ్‌లో సిక్సర్, రెండు ఫోర్లతో 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో మరో ఫోర్, సిక్సర్ కొట్టాక చావ్లా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికి పంజాబ్ విజయానికి 26 బంతుల్లో 45 పరుగులు చేయాలి. ఫామ్‌లో లేని మిల్లర్ మరోసారి నిరాశపరిచినా... రసెల్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లతో అక్షర్ పటేల్ పంజాబ్ ఆశలు సజీవంగా నిలిపాడు. చివరి రెండు ఓవర్లలో విజయానికి 22 పరుగులు అవసరం కాగా... మోర్కెల్ వేసిన 19వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో రసెల్... అక్షర్‌ను రనౌట్ చేయడంతో పాటు స్వప్నిల్ వికెట్ తీసి కేవలం నాలుగు పరుగులే ఇచ్చి కోల్‌కతా విజయాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప రనౌట్ 70; గంభీర్ రనౌట్ 54; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 19; రసెల్ రనౌట్ 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-101; 2-137; 3-164. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-25-0; మోహిత్ శర్మ 4-0-39-0; స్టోయినిస్ 3-0-26-0; అక్షర్ పటేల్ 4-0-24-0; స్వప్నిల్ సింగ్ 3-0-29-0; గురుకీరత్ 1-0-8-0; మ్యాక్స్‌వెల్ 1-0-11-0. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) షకీబ్ (బి) మోర్కెల్ 6; స్టోయినిస్ (సి) చావ్లా (బి) రసెల్ 0; వోహ్రా (సి) షకీబ్ (బి) రసెల్ 0; సాహా (బి) చావ్లా 24; మ్యాక్స్‌వెల్ ఎల్బీడబ్ల్యు (బి) చావ్లా 68; మిల్లర్ (సి) సతీశ్ (సబ్) (బి) రసెల్ 13; గురుకీరత్ రనౌట్ 11; అక్షర్ పటేల్ రనౌట్ 21; స్వప్నిల్ సింగ్ ఎల్బీడబ్ల్యు (బి) రసెల్ 0; మోహిత్ శర్మ నాటౌట్ 1; సందీప్ శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-1; 2-13; 3-13; 4-53; 5-120; 6-130; 7-154; 8-155; 9-156. బౌలింగ్: రసెల్ 4-0-20-4; మోర్నీ మోర్కెల్ 4-0-27-1; ఉమేశ్ యాదవ్ 3-0-26-0; షకీబ్ 3-0-21-0; పీయూష్ చావ్లా 4-0-27-2; హాగ్ 2-0-28-0. -
రాణించిన ఉతప్ప, గంభీర్..
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు చెలరేగారు. వీరిద్దరూ రాణించడంతో పంజాబ్ ముందు 165 పరుగుల టార్గెట్ నిలిపారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ (54; 45 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప(70; 49 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఈ జోడీ తొలి వికెట్ కు 101 పరుగల భారీ భాగస్వామ్యాన్ని జతచేసింది. ఆ స్కోరు వద్ద గంభీర్ రనౌటయ్యాడు. ఆ తర్వాత షాట్లతో విజృంభించిన ఉతప్ప కూడా మాక్స్ వెల్ చురుకైన ఫీల్డింగ్ తో రనౌట్ అయ్యి రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. ఆ తర్వాత యూసఫ్ పఠాన్(19 నాటౌట్), ఆండ్రీ రస్సెల్(16; 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) చివరి బంతికి లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. కోల్ కతా భారీ స్కోరు చేసేలా కనిపించినా చివరి ఓవర్లలో బౌలర్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేయడంతో 170 కూడా చేయలేకపోయింది. పంజాబ్ బౌలర్లలో గత మ్యాచ్ హ్యాట్రిక్ హీరో అక్షర్ పటేల్ కాస్త పొదుపుగా బౌలింగ్ వేశాడు. కానీ వికెట్ తీయలేకపోయాడు. కోల్ కతా మూడు వికెట్లు కోల్పోగా ఆ మూడు రనౌట్లే కావడం విశేషం. -
గంభీర్, కోహ్లీలకు భారీ జరిమానా
బెంగళూరు: మ్యాచ్ ఆఖరులో వివాదాస్సదంగా ప్రవర్తించిన గౌతం గంభీర్ కు, స్లో ఓవర్ రేట్ కారణంగా విరాట్ కోహ్లీలకు భారీ జరిమానా పడింది. కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల కెప్టెన్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మ్యాచ్ రిఫరీ.. అతిగా ప్రవర్తించి, కుర్చీని కాలుతో తన్నిన గంభీర్ కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించగా, కోహ్లీ బృందానికి రూ.66 లక్షల భారీ జరిమానా విధించారు. ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య సోమవారం జరిగిన మొదటి మ్యాచ్ లో గంభీర్ మొదటి నుంచి ఆవేశపూరితంగా వ్యవహరించాడు. 19వ ఓవర్ చివరి బంతికి క్రీజ్ లో ఉన్న బ్యాట్స్ మన్ సిక్సర్ కొట్టడంతో కేకేఆర్ విజయం ఖరారయినప్పుడు కెప్టెన్ గంభీర్ కోపంగా లేచి, చేతిలో ఉన్న టవల్ ను బౌండరీ మీదకు విసిరాడు. అంతటితో ఆడకుండా ఆటగాళ్లు కూర్చోవడానికి ఏర్పాటుచేసిన కుర్చీలను కాలితో బలంగా తన్నాడు. ఈ దృశ్యాలు ప్రత్యక్షంగా ప్రసారం కావడంతో గంభీర్ ప్రవర్తన చర్చనీయాంశమైంది. అయితే అన్ని అంశాలను కూలంకశంగా పరిశీలించిన అనంతరం గంభీర్ కు ఫైన్ వేస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ బుధవారం ప్రకటించారు. ఇక కోహ్లీ విషయానికి వస్తే గతంలోనూ స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైన ఈ ఆర్ సీబీ కెప్టెన్.. కోల్ కతాతో మ్యాచ్ లోనూ ఓవర్లు స్లోగా వేయించాడు. దీంతో మొత్తం జట్టు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా ఒక్కో ఆటగాడికి రూ.6లక్షల జరిమానా విధిస్తున్నట్లు రిఫరీ పేర్కొన్నారు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఇంత భారీ పరిమాణంలో ఫైన్ లు ఉండవు. కానీ ఐపీఎల్ నియమావళి ప్రకారం జరిమానాలు భారీగా ఉంటాయి. -
‘పెయినింగ్’ సూపర్ జెయింట్స్
ఏ టోర్నీలో అయినా ఏ జట్టులో అయినా ఒకరో ఇద్దరో ఆటగాళ్లు గాయపడటం సాధారణం. దాదాపుగా అన్ని జట్లూ దీనికి సన్నద్ధమయ్యే ప్రణాళికలు రచించుకుంటాయి. కానీ ఈసారి ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ మాత్రం గాయాల ‘పెయిన్’ని తట్టుకోలేకపోతోంది. అసలే అంతంతమాత్రం ప్రదర్శనతో గందరగోళంలో ఉన్న ధోని సేనకు మరో షాక్ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ కూడా గాయం కారణంగా ఈ సీజన్‌కు దూరమయ్యాడు. సాక్షి క్రీడావిభాగం ఈ ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని కొత్త జట్టు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడి ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించింది. దీంతో జట్టు యాజమాన్యం సంబరపడింది. ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం ఈ జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లుగా కెవిన్ పీటర్సన్, డు ప్లెసిస్, స్టీవ్ స్మిత్, మిషెల్ మార్ష్ బరిలోకి దిగారు. అందరూ బాగా ఆడటంతో జట్టు తొలి మ్యాచ్‌లోనే బోణీ చేసింది. కానీ సగం సీజన్ అయ్యేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ నలుగురూ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఇప్పటికి ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ధోని సేన కేవలం రెండే విజయాలు సాధించింది. దీంతో నాకౌట్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఈ దశలో స్మిత్‌లాంటి కీలక క్రికెటర్ కూడా దూరం కావడం జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపనుంది. ఒకరి వెనక ఒకరు... ముందుగా కెవిన్ పీటర్సన్ గాయంతో పుణేకు షాక్ తగిలింది. మోకాలి కింద వెనకభాగంలో గాయం కారణంగా ఈ ఇంగ్లండ్ మాజీ స్టార్ వైదొలిగాడు. అప్పటికి అతను కేవలం నాలుగు మ్యాచ్‌లే ఆడాడు. మరో రెండు మ్యాచ్‌ల తర్వాత డు ప్లెసిస్ వేలి గాయంతో సీజన్‌కు దూరమయ్యాడు. మిషెల్ మార్ష్ సీజన్లో మూడు మ్యాచ్‌లు ఆడిన తర్వాత పక్కటెముకల గాయంతో తప్పుకున్నాడు. తాజాగా స్టీవ్ స్మిత్ మణికట్టు గాయం కారణంగా స్వదేశానికి పయనమయ్యాడు. పీటర్సన్, డు ప్లెసిస్ వైదొలిగాక ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజాను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా ఆస్ట్రేలియాకే చెందిన జార్జ్ బెయిలీని కూడా తీసుకున్నారు. మే 5న ఢిల్లీతో మ్యాచ్ సమయానికి వీరు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఇక మార్ష్, స్మిత్‌ల కోసం ప్రత్యామ్నాయాన్ని చూసుకోలేదు. ప్రదర్శన కూడా అంతంతే ఈ సీజన్ ఆరంభంలో పుణే కూడా టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటి. ధోని సారథ్యం, స్టార్ బ్యాట్స్‌మెన్ కారణంగా రేసులో ఉంది. తొలి మ్యాచ్‌లో దీనికి తగ్గట్లే ఆడినా, ఆ తర్వాత జట్టు ప్రదర్శన ఏమాత్రం ఆశాజనకంగా లేదు. బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా సన్‌రైజర్స్‌పై గెలిచినా... గుజరాత్, ముంబైల చేతిలో ఓడి అవకాశాలను క్లిష్టం చేసుకుంది. బాగా ఆడుతున్న స్మిత్, డు ప్లెసిస్ టోర్నీకి దూరమవడం, రహానే మినహా మరో బ్యాట్స్‌మన్ ఫామ్‌లో లేకపోవడం ఈ జట్టును తీవ్ర ఆందోళనలో పడేసింది. ఇక బౌలింగ్‌లోనూ ఈ జట్టు దారుణంగా విఫలమయింది. ఆర్పీ సింగ్, ఇషాంత్ శర్మ, అశోక్ దిండా ముగ్గురూ పెద్దగా ఆకట్టుకోలేకపోగా... ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకూ దారుణంగా నిరాశపరిచాడు. గత నాలుగేళ్లుగా అన్ని రకాల ఫార్మాట్లలో, ఏ జట్టు తరఫున ఆడినా ధోనికి ప్రధాన అస్త్రంగా ఉన్న అశ్విన్... ఈసారి పూర్తి కోటా ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. అసలే ఫామ్‌లో లేని ఆటగాళ్లతో తంటాలుపడుతున్న ధోని... ఫామ్‌లో ఉన్న ఆటగాళ్ల గాయాలతో మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. ఇక ఈ సీజన్లో మళ్లీ పుణే పుంజుకుంటుందా అనేది సందేహమే. ప్రతిసారీ ఏదో ఒక ‘మాయ’ చేసే ధోని ఈ సీజన్లో ఏం చేస్తాడనేది ఆసక్తికరం. షాన్ మార్ష్ కూడా... పుణేతో పాటు ఇతర జట్లను కూడా గాయాలు బాధపెడుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాడు షాన్‌మార్ష్ కూడా వెన్నునొప్పితో సీజన్‌కు దూరమయ్యాడు. ఆరు మ్యాచ్‌లాడిన తను పంజాబ్ తరఫున అత్యధికంగా 159 పరుగులు సాధించాడు. -
రవీంద్ర జడేజాకు మందలింపు
గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మ్యాచ్ రిఫరీ మందలింపునకు గురయ్యాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో తను అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఐపీఎల్ నిబంధనావళి లెవల్ 1 నిబంధనకు వ్యతిరేకం. జడేజా తన తప్పును అంగీకరించడంతో రిఫరీ మందలింపుతో సరిపెట్టారు. -
యాహూ యూసుఫ్...
► కోల్‌కతాను గెలిపించిన పఠాన్ ► 29 బంతుల్లో 60 పరుగులు ► రసెల్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ► మళ్లీ ఓడిన బెంగళూరు ఒకప్పుడు యూసుఫ్ పఠాన్ అంటే విధ్వంసానికి పక్కా చిరునామా. కానీ చాన్నాళ్లుగా అతని బ్యాట్ మూగబోయింది. అయితే ఇప్పుడు మరోసారి అతనిలోని ‘అసలు మనిషి’ బయటకు వచ్చాడు. ఐపీఎల్ సీజన్ ఆరంభం నుంచి నివురుగప్పిన నిప్పులాగే ఉండిపోయిన అతను, ఇప్పుడు ఒక్కసారిగా మండుతున్న అగ్ని కణికలా మారాడు. అసలు విజయానికి అవకాశం లేని చోట అద్భుత ప్రదర్శనతో కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. ఆండ్రీ రసెల్ సహకారం అతని పనిని సులువు చేసింది. కోల్‌కతా నాలుగో వికెట్ కోల్పోయిన సమయంలో విజయ లక్ష్యం 59 బంతుల్లో 117 పరుగులు... సొంతగడ్డపై బెంగళూరు బౌలర్ల క్రమశిక్షణతో ఇది అసాధ్యంగా కనిపించింది. కానీ పఠాన్, రసెల్ దీనిని సుసాధ్యం చేశారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 44 బంతుల్లోనే 96 పరుగుల జోడించి రాయల్ చాలెంజర్స్‌ను కుమ్మేశారు. ఫలితంగా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే నైట్‌రైడర్స్‌కు విజయం దక్కింది. బెంగళూరు: కోల్‌కతా నైట్‌రైడర్స్ లక్ష్య ఛేదనలో మరోసారి సత్తా చాటింది. రెండు వరుస పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు బాట పట్టింది. ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 5 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 52; 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా, చివర్లో వాట్సన్ (21 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అనంతరం యూసుఫ్ పఠాన్ (29 బంతుల్లో 60 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (24 బంతుల్లో 39; 1 ఫోర్, 4 సిక్సర్లు) భారీ భాగస్వామ్యం సహాయంతో కోల్‌కతా 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. గౌతం గంభీర్ (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన రసెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రాహుల్ దూకుడు... వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న బెంగళూరు మళ్లీ గేల్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే మోర్నీ మోర్కెల్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన గేల్ (7) తర్వాతి బంతికే అవుటై నిరాశపరిచాడు. కోహ్లి, రాహుల్ నిలదొక్కుకునేందుకు సమయం తీసుకోవడంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 40 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత వీరిద్దరు వేగం పెంచారు. చావ్లా, నరైన్ బౌలింగ్‌లో రాహుల్ సిక్సర్లు బాది ధాటిని ప్రదర్శించగా, కోహ్లి తన సహజశైలిలో ఆడాడు. 29 బంతుల్లోనే అర్ధ సెంచరీని అందుకున్న రాహుల్, వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఈ ఘనత సాధించాడు. అయితే ఆ వెంటనే చావ్లా బౌలింగ్‌లో వెనుదిరగడంతో 84 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. డివిలియర్స్ (4) కూడా విఫలం కాగా... మరోవైపు 42 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది. మోర్కెల్ బౌలింగ్‌లో గంభీర్ క్యాచ్ వదిలేసినా, మరుసటి బంతికే రసెల్ అందుకోవడంతో కోహ్లి ఇన్నింగ్స్ ముగిసింది. ఆ మూడు ఓవర్లు... 17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 131/4 మాత్రమే. 160 పరుగులైనా చేయగలదా అనే సందేహం. అయితే ఆ జట్టుకు ‘ఆపద్బాంధవుడి’ రూపంలో కోల్‌కతా బౌలర్ ఉమేశ్ యాదవ్ వచ్చాడు. అతను వేసిన 18, 20 ఓవర్లలో కలిపి బెంగళూరు ఏకంగా 41 పరుగులు రాబట్టింది. 18వ ఓవర్లో సచిన్ బేబీ (8 బంతుల్లో 16) వరుసగా 2 ఫోర్లు, 1 సిక్స్ బాదగా, వాట్సన్ మరో ఫోర్ కొట్టాడు. తన వంతుగా ఉమేశ్ రెండు నోబాల్‌లు, వైడ్ కలిపి మొత్తం 23 పరుగులు సమర్పించుకున్నాడు. చివరి ఓవర్లో స్టువర్ట్ బిన్నీ (4 బంతుల్లో 16) వరుసగా 6, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. అంతకుముందు రసెల్ వేసిన 19వ ఓవర్లో వాట్సన్ వరుసగా మూడు ఫోర్లతో చెలరేగడంతో ఆర్సీబీ 13 పరుగులు సాధించింది. ఈ మూడు ఓవర్లలోనే 54 పరుగులు చేసిన బెంగళూరు ఆఖరి ఐదు ఓవర్లలో ఈ సీజన్లో అత్యధిక (73) పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఐపీఎల్-9లో కరణ్ శర్మ (4 ఓవర్లలో 57) తర్వాత రెండో చెత్త ప్రదర్శన ఉమేశ్ యాదవ్ (56)దే. మెరుపు భాగస్వామ్యం... భారీ లక్ష్యఛేదనలో కోల్‌కతా తడబడింది. తొలి ఓవర్లోనే ఉతప్ప (1)ను బిన్నీ అవుట్ చేసి శుభారంభం అందించగా, లిన్ (15) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 37 పరుగులకే పరిమితమైంది. అనంతరం షమ్సీ వేసిన ఏడో ఓవర్లో గంభీర్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. అయితే మూడు పరుగుల వ్యవధిలో గంభీర్, పాండే (8) వెనుదిరగడంతో నైట్‌రైడర్స్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అయితే పఠాన్, రసెల్ భాగస్వామ్యం ఆ జట్టును కోలుకునేలా చేసింది. వీరిద్దరు తమదైన శైలిలో భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అప్పటి దాకా చక్కటి బౌలింగ్ చేసిన ఆర్సీబీ వీరిని అడ్డుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యింది. చివర్లో రసెల్ అవుటైనా, సూర్య కుమార్ (10 నాటౌట్) అండతో పఠాన్ మ్యాచ్ ముగించాడు. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (సి) యూసుఫ్ పఠాన్ (బి) చావ్లా 52; గేల్ (సి) ఉతప్ప (బి) మోర్నీ మోర్కెల్ 7; కోహ్లి (సి) రసెల్ (బి) మోర్నీ మోర్కెల్ 52; డివిలియర్స్ (ఎల్బీ) (బి) చావ్లా 4; వాట్సన్ (రనౌట్) 34; సచిన్ బేబీ (సి) అండ్ (బి) రసెల్ 16; బిన్నీ (సి) పాండే (బి) ఉమేశ్ 16; ఆరోన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 185. వికెట్ల పతనం: 1-8; 2-92; 3-109; 4-129; 5-167; 6-184; 7-185. బౌలింగ్: రసెల్ 4-0-24-1; మోర్నీ మోర్కెల్ 4-0-28-2; నరైన్ 4-0-45-0; ఉమేశ్ 4-0-56-1; చావ్లా 4-0-32-2. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) కోహ్లి (బి) బిన్నీ 1; గంభీర్ (ఎల్బీ) (బి) అరవింద్ 37; లిన్ (బి) చహల్ 15; పాండే (సి) సచిన్ (బి) వాట్సన్ 8; యూసుఫ్ పఠాన్ (నాటౌట్) 60; రసెల్ (సి) బిన్నీ (బి) చహల్ 39; సూర్య కుమార్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (19.1 ఓవర్లలో 5 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1-6; 2-34; 3-66; 4-69; 5-165. బౌలింగ్: బిన్నీ 2-0-17-1; అరవింద్ 2.1-0-16-1; వాట్సన్ 3-0-38-1; చహల్ 4-0-27-2; ఆరోన్ 4-0-34-0; షమ్సీ 4-0-51-0. -
వినోద్ కాంబ్లీకి ఇంకా దురదగా ఉందట!
ముంబై: పట్టుమని పాతికేళ్లైన నిండకముందే అనూహ్యరీతిలో టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వినోద్ కాంబ్లీకి ఇప్పుడు 44 ఏళ్లు. వివాదాస్పద ప్రవర్తనతో వ్యక్తిగతంగానేకాక క్రికెట్ పరంగానూ చిక్కులు ఎదుర్కొని, ఆటకు దూరమైన ఈ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్ కు.. బ్యాట్ పట్టాలని, కసితీరా షాట్లు కొట్టాలని ఇంకా దురదగా ఉందట. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్ కు కొడుకుతోపాటు వీక్షించిన కాంబ్లీ.. మ్యాచ్ అనంతరం 'ఇంకా ఆడాలని చేతులు దురదపెడుతున్నాయి' అంటూ ట్వీట్ చేశాడు. తనలాంటి ఎడమచేతి వాటం ఆటగాడైన గౌతం గంభీర్ డ్రైవ్ షాట్లు కొట్టడాన్ని ఆనందించానని, దిలిప్ వెంగ్ సర్కార్ తో కాసేపు ముచ్చటించానని చెప్పుకొచ్చాడు కాంబ్లీ. 'నీ టైమ్ లో నువ్వు కూడా ఆటను ఇలాగే ఎంజాయ్ చేసేవాడివి కదా' అని దిలీప్ సార్ తనతో అన్నట్లు పేర్కొన్నాడు. 90వ దశకం ప్రారంభంలో భారత జట్టులోకి వచ్చిన కాంబ్లీ తాను ఆడిన మొదటి ఏడు టెస్ట్ మ్యాచ్ లలోనే నాలుగు సెంచరీలు (వాటిలో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి) సాధించాడు. 104 వన్ డేలు ఆడి రెండు సెంచరీలు, 14 అర్ధసెంచరీలు చేశాడు. ఒక్క టీ20 మ్యాచ్ ఆడకుండానే ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రతిభ కున్నప్పటికీ వివాదాస్సద ప్రవర్తనతో అనేక చిక్కులు ఎదుర్కొన్నాడు. 2011లో అధికారికంగా రిటైర్ మెంట్ ప్రకటించిన కాంబ్లీ.. అలవాటైన వివాదాలతో అప్పుడప్పుడూ వార్తల్లో కనిపించడం, చిన్ననాటి స్నేహితుడు సచిన్ టెండూల్కర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
అంపైర్ల చేతికి ‘ఆయుధం’
అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ ఆదివారం పంజాబ్, గుజరాత్ మ్యాచ్‌లో తన ఎడమ చేతికి ఒక పెద్ద పంకాలాంటి వస్తువును అంటి పెట్టుకొని బరిలోకి దిగడం చూశారా! ఇంజినీర్లు వాడే స్కేల్లా ఉన్న ఆ పరికరం ఇప్పుడు ఆయనకు రక్షణ కవచంలాంటిది. ధనాధన్ క్రికెట్లో బంతులు బౌండరీలు దాటడమే కాదు... కొన్నిసార్లు షాట్లు నేరుగా అంపైర్లపైకి కూడా దూసుకొస్తుంటాయి. కొన్నాళ్ల క్రితం భారత దేశవాళీ క్రికెట్లో ఒక ఆసీస్ అంపైర్ కూడా గాయపడ్డాడు. దాంతో ఆక్సెన్‌ఫోర్డ్ తనను తాను రక్షించుకునేందుకు ఇలాంటిది తీసుకొని మ్యాచ్‌కు వెళుతున్నారు. బంతి తనపైకి వస్తే సింపుల్‌గా రజినీకాంత్ లెవెల్లో ఒక చేతిని అడ్డుగా పెట్టేస్తే సరి! ఫైబర్‌తో తయారైన ఈ ‘గార్డ్’కు బలమైన బంతులను కూడా నిరోధించగల సామర్థ్యం ఉంది. మన ఆటగాళ్లు కొంతమంది ఆక్సెన్ఫోర్డ్పైకి సరదాగా బంతులు విసిరి మరీ దానిని పరీక్షించారట. ఇప్పటికే అంపైర్లు హెల్మెట్లు ధరిస్తుండగా, హిట్టర్ల దెబ్బనుంచి కాపాడుకునేందుకు ఇప్పుడు అంపైర్ల చేతికి మరో ఆయుధం కొత్తగా చేరింది. -
నాయకుడు గెలిపించాడు
►మరోసారి రాణించిన రోహిత్ శర్మ ► పుణేపై ముంబై ఇండియన్స్ విజయం పుణే: స్టార్ ఆటగాళ్లు... తెరవెనుక అతిపెద్ద మంత్రాంగం... అయినా ఆరంభంలో విజయాలు సాధించడంలో వెనుకబడ్డ ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు పుంజుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (60 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ముందుండి జట్టును నడిపిస్తుండటంతో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్-9లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో పుణేపై నెగ్గింది. సీజన్ తొలి మ్యాచ్‌లో పుణే చేతిలో ఎదురైన పరాజయానికి ఘనమైన ప్రతీకారం తీర్చుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. సౌరభ్ తివారి (45 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), స్టీవ్ స్మిత్ (23 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. తర్వాత ముంబై 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసింది. బట్లర్ (17 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఆరంభం అదుర్స్... ఓపెనర్లలో రహానే (4) విఫలమైనా... సౌరభ్ తివారితో కలిసి వన్‌డౌన్‌లో స్మిత్ మోత మోగించాడు. మూడు ఓవర్ల తేడాలో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదడంతో పవర్‌ప్లేలో పుణే వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఏడో ఓవర్లో తివారి రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టడంతో 20 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్లో స్మిత్ మూడో సిక్సర్ బాదాడు. అయితే వేగంగా ఆడుతున్న ఈ జోడిని పదో ఓవర్లో బుమ్రా విడగొట్టాడు. అద్భుతమైన ఫుల్ లెంగ్త్ బంతితో స్మిత్‌ను పెవిలియన్‌కు పంపడంతో రెండో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ ఓవర్ ముగిసేసరికి పుణే స్కోరు 93/2కు చేరింది. అప్పటి వరకు వాయువేగంతో దూసుకుపోయిన పుణే స్కోరు బోర్డుకు హర్భజన్ కళ్లెం వేశాడు. బంతిని బాగా టర్న్ చేస్తూ ఓ వికెట్ తీయడంతో పాటు పరుగులూ నిరోధించాడు. దీంతో 11 నుంచి 15 ఓవర్ల మధ్య కేవలం 27 పరుగులు మాత్రమే వచ్చాయి. ఈ దశలో 39 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న తివారి, ధోని (24 బంతుల్లో 24; 2 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 33 పరుగులు జత చేశాక 18వ ఓవర్లో తివారి అవుటయ్యాడు. చివరి ఓవర్లో ధోని కూడా వెనుదిరిగాడు. మళ్లీ సారథే... తొలి రెండు ఓవర్లలో 8 పరుగులే రావడంతో కాస్త ఒత్తిడికి లోనైన రోహిత్ మూడో ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 16 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన పార్థీవ్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. తర్వాత రాయుడు (19 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) సింగిల్స్‌తో రోహిత్‌కు చక్కని సహకారం అందించాడు. వీరిద్దరు చెరో సిక్సర్ బాదడంతో పవర్‌ప్లేలో 51/1 ఉన్న స్కోరు పది ఓవర్లు ముగిసేసరికి 76/1కి చేరింది. వేగంగా ఆడే ప్రయత్నంలో రాయుడు 12వ ఓవర్లో వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 38 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన రోహిత్ ఆ తర్వాత వేగంగా ఆడాడు. రెండోఎండ్‌లో బట్లర్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జోడించడంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయం ఖాయమైంది. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (సి) క్రునాల్ (బి) మెక్లీనగన్ 4; సౌరభ్ తివారి (సి) హార్దిక్ (బి) బుమ్రా 57; స్మిత్ (సి) పార్థీవ్ (బి) బుమ్రా 45; హాండ్స్‌కాంబ్ (సి) బట్లర్ (బి) హర్భజన్ 6; ధోని (సి) రాయుడు (బి) బుమ్రా 24 ; పెరీరా నాటౌట్ 12; భాటియా నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1-8; 2-92; 3-105; 4-138; 5-149. బౌలింగ్: సౌతీ 4-0-35-0; మెక్లీనగన్ 4-0-27- 1; క్రునాల్ 2-0-28-0; బుమ్రా 4-0-29-3; హార్దిక్ 2-0-14-0; హర్భజన్ 4-0-25-1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ నాటౌట్ 85; పార్థీవ్ (సి) ధోని (బి) దిండా 21; రాయుడు (సి) రహానే (బి) అశ్విన్ 22; బట్లర్ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (18.3 ఓవర్లలో 2 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-39; 2-91. బౌలింగ్: పెరీరా 4-0-35-0; దిండా 3-0-33-1; బొలాండ్ 3-0-23-0; భాటియా 3-0-20-0; ఆర్. అశ్విన్ 3-0-21-0; ఎం.అశ్విన్ 2.3-0-25-0. -
అక్షర్ అదరహో
► ‘హ్యాట్రిక్’తో మలుపు తిప్పిన స్పిన్నర్ ► పంజాబ్ అనూహ్య విజయం ► 23 పరుగులతో ఓడిన గుజరాత్ లయన్స్ విజయ లక్ష్యం 155 పరుగులు... భారీ హిట్టర్లతో పాటు మంచి ఫామ్‌లో, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆ జట్టుకు సొంతగడ్డపై దీనిని ఛేదించడం అంత కష్టమైన పనేం కాదు. అవతలివైపు ఉన్నదేమో వరుస పరాజయాలతో కునారిల్లి అట్టడుగున నిలిచిన పంజాబ్ జట్టు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుత బౌలింగ్‌తో సునాయాసం అనుకున్న లక్ష్యం కాస్తా పెద్దదిగా మారి గుజరాత్‌కు షాక్ తగిలింది. రెండు ‘సింహా’ల పోరులో చివరకు కింగ్స్ ఎలెవన్‌దే పైచేయి అయింది. తన రెండో ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్, తర్వాతి ఓవర్ తొలి బంతితో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఫలితంగా మూడు వరుస పరాజయాల తర్వాత కింగ్స్ ఎలెవన్‌కు గెలుపుతో ఊరట లభించింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్న మురళీ విజయ్ కూడా అర్ధ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాజ్‌కోట్: వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ లయన్స్ జట్టుకు బ్రేక్ పడింది. మూడు మ్యాచ్‌ల తర్వాత ఆ జట్టుకు ఓటమి ఎదురైంది. పేలవ ప్రదర్శనతో సీజన్లో ఆకట్టుకోలేకపోతున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనూహ్యంగా చెలరేగి లయన్స్‌కు అడ్డుకట్ట వేసింది. ఆదివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 23 పరుగుల తేడాతో లయన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. మురళీ విజయ్ (41 బంతుల్లో 55; 6 ఫోర్లు) రాణించగా, వృద్ధిమాన్ సాహా (19 బంతుల్లో 33; 4 ఫోర్లు), మిల్లర్ (27 బంతుల్లో 31; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. శివిల్ కౌశిక్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫాల్క్‌నర్ (27 బంతుల్లో 32; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (4/21) సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. మోహిత్ 3 వికెట్లు పడగొట్టాడు. నాయకుడు నడిపించగా... కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడుతున్న మురళీ విజయ్, ప్రవీణ్ కుమార్ వేసిన మూడో ఓవర్లో మూడు ఫోర్లు బాది దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాడు. మరోవైపు స్టొయినిస్ (17 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడటంతో ఈ జోడి తొలి వికెట్‌కు 40 బంతుల్లోనే 65 పరుగులు జోడించింది. అయితే ఆ తర్వాత ఎనిమిది పరుగుల వ్యవధిలో పంజాబ్ 4 వికెట్లు కోల్పోయింది. స్టొయినిస్‌ను జడేజా అవుట్ చేయగా, కౌశిక్ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో షాన్ మార్ష్ (1), మ్యాక్స్‌వెల్ (0)లను పెవిలియన్ పంపించాడు. ఆ వెంటనే గుర్కీరత్ (0) రనౌటయ్యాడు. మరోవైపు 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విజయ్, కౌశిక్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బ్రేవో చేతికి చిక్కాడు. ఈ దశలో మిల్లర్, సాహా భాగస్వామ్యం పంజాబ్‌కు మెరుగైన స్కోరు అందించింది. వీరిద్దరు ఆరో వికెట్‌కు 25 బంతుల్లో 39 పరుగులు జత చేశారు. మిల్లర్‌ను ధవల్ అవుట్ చేయగా... 19, 20 ఓవర్లలో పంజాబ్ రెండేసి వికెట్లను కోల్పోయింది. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ ఒక్క ఫోర్ మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీసింది. అంతా కలిసికట్టుగా... తన తొలి ఓవర్లోనే మెకల్లమ్ (1)ను బౌల్డ్ చేసి మోహిత్ పంజాబ్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రైనా (15 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్)ను కూడా చక్కటి బంతితో మోహిత్ పెవిలియన్ పంపించాడు. పవర్‌ప్లేలో గుజరాత్ 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే అసలు మ్యాజిక్ ఏడో ఓవర్లో ప్రారంభమైంది. ఓవర్ మూడో బంతికి డ్వేన్ స్మిత్ (15)ను అవుట్ చేసిన అక్షర్... ఐదు, ఆరు బంతులకు కార్తీక్ (2), బ్రేవో (0)లను పెవిలియన్ పంపించాడు. మరో మూడు ఓవర్ల తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన అక్షర్ తొలి బంతికే జడేజా (11)ను ‘హ్యాట్రిక్’ వికెట్‌గా అవుట్ చేశాడు. తాను వేసిన ఐదు బంతుల వ్యవధిలో పటేల్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. 57 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయిన గుజరాత్ ఆ తర్వాత కోలుకోలేదు. చివర్లో ఫాల్క్‌నర్, ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) పోరాడినా లక్ష్యానికి లయన్స్ చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (సి) బ్రేవో (బి) కౌశిక్ 55; స్టొయినిస్ (స్టంప్డ్) కార్తీక్ (బి) జడేజా 27; షాన్ మార్ష్ (సి) రైనా (బి) కౌశిక్ 1; మ్యాక్స్‌వెల్ (సి) కార్తీక్ (బి) కౌశిక్ 0; గుర్కీరత్ సింగ్ (రనౌట్) 0; మిల్లర్ (సి) డ్వేన్ స్మిత్ (బి) ధావల్ 31; సాహా (బి) బ్రేవో 33; అక్షర్ (సి) కిషన్ (బి) బ్రేవో 0; మోహిత్ (బి) ప్రవీణ్ కుమార్ 1; కరియప్ప (బి) ప్రవీణ్ కుమార్ 1; సందీప్ శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 154. వికెట్ల పతనం: 1-65; 2-70; 3-70; 4-73; 5-100; 6-139; 7-145; 8-151; 9-153; 10-154. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 2.5-0-25-2; ధవల్ 4-0-28-1; జడేజా 3-0-28-1; కౌశిక్ 4-0-20-3; బ్రేవో 4-0-33-2; ఫాల్క్‌నర్ 2-0-19-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) గుర్కీరత్ (బి) అక్షర్ 15; మెకల్లమ్ (బి) మోహిత్ 1; రైనా (బి) మోహిత్ 18; కార్తీక్ (బి) అక్షర్ 2; జడేజా (సి) సాహా (బి) అక్షర్ 11; బ్రేవో (బి) అక్షర్ 0; కిషన్ (రనౌట్) 27; ఫాల్క్‌నర్ (సి) మిల్లర్ (బి) సందీప్ 32; ప్రవీణ్ కుమార్ (సి) కరియప్ప (బి) మోహిత్ 15; ధవల్ (నాటౌట్) 6; కౌశిక్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 131. వికెట్ల పతనం: 1-13; 2-34; 3-38; 4-39; 5-39; 6-57; 7-86; 8-125; 9-125. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-31-1; మోహిత్ 4-0-32-3; స్టొయినిస్ 4-0-23-0; అక్షర్ 4-0-21-4; కరియప్ప 3-0-15-0; గుర్కీరత్ 1-0-8-0. -
అతడి బ్యాటింగ్ అద్భుతం: వార్నర్
హైదరాబాద్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక విజయాన్ని నమోదు చేయడంలో ఆ జట్టు కెప్టెన్ మరోసారి కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు. ఇది సమిష్టి విజయమని, ఏ ఒక్కరికో సొంతం కాదని వార్నర్ పేర్కొన్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ తో ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన విలియమ్సన్ ను ప్రశంసించాడు. విలియమ్సన్ (38 బంతుల్లో 50; 7 ఫోర్లు) ఇన్నింగ్స్ తోడవ్వడంతోనే భారీ స్కోరును సాధించామన్నాడు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో రాణించాడని, అతను క్లాస్ ఆటగాడని సన్ రైజర్స్ కెప్టెన్ వార్నర్ కితాబిచ్చాడు. జట్టు ఆటగాళ్లు అందరూ రాణించారని, బెంగళూరు ముందు భారీ లక్ష్యాన్ని నిలిపి విజయాన్ని సొంతం చేసుకున్నామని పేర్కొన్నాడు. తాను సెంచరీ మిస్ కావడంపై డేవిడ్ వార్నర్ (50 బంతుల్లో 92; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విలియమ్సన్ బ్యాటింగ్ అద్భుతమని... అతని చేరికతో మా బలం పెరిగిందని, టోర్నీలో మిగతా మ్యాచ్ లలో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశాడు.విలియమ్సన్ తో కలిసి భాగస్వాయ్యాలు నెలకొల్పి జట్టును విజయపథంలో నడిపిస్తానని వార్నర్ వివరించాడు. -
బౌలింగ్‌తోనే ముంబై విజయాలు
హర్షా భోగ్లే ఐపీఎల్ సగభాగం పూర్తవగా రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య నేటి (ఆదివారం) మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని కొందరు జోస్యం చెబుతున్నారు. ఇది నిజమూ కావచ్చు.. లేదా కాకుండా పోవచ్చు. అయితే ఇలాంటి చర్చ అంతటా జరుగుతూనే ఉంటుంది. ఇక మరో మ్యాచ్‌లో గుజరాత్‌తో... ఓడితే దాదాపు ఇంటికి బయలుదేరే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆడబోతోంది. నిజానికి పుణే జట్టు ఎంత భారీ స్కోరు చేసినా కూడా తమ విజయంపై నమ్మకం పెట్టుకోలేకపోతోంది. ఎందుకంటే ఆ స్కోరును కాపాడుకునేందుకు వారి దగ్గర అంత నాణ్యమైన బౌలింగ్ సామర్థ్యం కనిపించడం లేదు. పుణే ప్రధాన బౌలర్ ఆర్.అశ్విన్ కూడా ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా ప్రారంభంలో... చివర్లో ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తించే ఫాస్ట్ బౌలర్ల కొరత కూడా ఉంది. ప్రస్తుతానికైతే ముంబై ఇండియన్స్ పటిష్ట బౌలింగ్ విభాగం కలిగిన జట్టుగా పేరు తెచ్చుకుంది. అందుకే ఆరు మ్యాచ్‌ల్లో వారు నాలుగు గెలవగలిగారు. ఇక బ్యాటింగ్ లో వారికి మాంచి కండ పుష్టి కలిగిన ఆటగాళ్లున్నారు. పుణే స్టేడియంలో ఈ విషయం మరోసారి నిరూపితమవ్వచ్చు. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేకపోవడంతో అభిమానులకు కనువిందు ఖాయం. మరోవైపు రాజ్‌కోట్‌లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు పరాజయాలతో కుదేలైన పంజాబ్ కింగ్స్.. పవర్ఫుల్ లయన్స్‌ను ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్ కనుక వారు ఓడితే క్వాలిఫయర్‌కు వెళ్లడం కష్టమే! -
లెక్క సరిచేశారు
► కోల్‌కతాపై ఢిల్లీ గెలుపు ► నాయర్, బిల్లింగ్స్ అర్ధసెంచరీలు ► బ్రాత్‌వైట్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ► ఉతప్ప శ్రమ వృథా న్యూఢిల్లీ: సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఎదురైన పరాభావానికి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఘనమైన ఆరంభం లభించకున్నా భారీ లక్ష్యాన్ని నిర్దేశించి... అద్భుతమైన బౌలింగ్‌తో జహీర్ ఖాన్ బృందం మ్యాచ్ గెలిచి లెక్క సరిచేసింది. దీంతో ఐపీఎల్-9లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 27 పరుగుల తేడాతో కోల్‌కతాపై గెలి చింది. టాస్ గెలిచి కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకోగా, ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 186 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (50 బంతుల్లో 68; 9 ఫోర్లు, 1 సిక్స్), బిల్లింగ్స్ (34 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. తర్వాత కోల్‌కతా 18.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. రాబిన్ ఉతప్ప (52 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. కోల్‌కతా చివరి ఐదు వికెట్లను కేవలం ఎనిమిది పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమ నార్హం. టాప్ విఫలం... ఆరంభంలో చెలరేగిన కోల్‌కతా బౌలర్లు.. 32 పరుగులకే ఢిల్లీ టాప్-3 బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చారు. ముఖ్యంగా డికాక్ అవుట్ కావడం ఢిల్లీ స్కోరుపై ప్రభావం చూపింది. కానీ నాయర్, బిల్లింగ్స్ ఈ ఒత్తిడి నుంచి తొందరగానే తేరుకున్నారు. వికెట్లను కాపాడుకుంటూనే స్ట్రయిక్ రొటేషన్‌తో రన్‌రేట్‌ను పెంచారు. దీంతో పవర్‌ప్లేలో 37/3తో ఉన్న ఢిల్లీ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 70/3కు చేరింది. 12వ ఓవర్ నుంచి ఈ ఇద్దరు జోరు పెంచడంతో స్కోరు బోర్డు వేగంగా కదలింది. 17వ ఓవర్లో ఉమేశ్ మూడు బంతుల తేడాలో నాయర్, మోరిస్ (0)లను అవుట్ చేసి ఝలక్ ఇచ్చాడు. నాయర్, బిల్లింగ్స్ నాలుగో వికెట్‌కు 105 పరుగులు జత చేశారు. ఈ దశలో వచ్చిన బ్రాత్‌వైట్ (11 బంతుల్లో 34; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సిక్సర్లు, బౌండరీలు బాదడంతో ఆరో వికెట్‌కు కేవలం 12 బంతుల్లోనే 37 పరుగులు జతయ్యాయి. ఓవరాల్‌గా చివరి నాలుగు ఓవర్లలో 55 పరుగులు రావడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. ఉతప్ప మినహా.... లక్ష్య ఛేదనలో ఓ ఎండ్‌లో ఉతప్ప మెరుగ్గా ఆడినా.. రెండో ఎండ్‌లో సహచరులు పెవిలియన్ బాటపట్టారు. మూడో ఓవర్లో గంభీర్ (6)తో మొదలైన వికెట్ల పతనం చివరి వరకు కొనసాగింది. 8 ఓవర్లు ముగిసేసరికి నైట్‌రైడర్స్ 58 పరుగులకు మూడు వికెట్లు కోల్పోవడంతో కోలుకోలేకపోయింది. ఈ దశ లో సూర్యకుమార్ (13 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు ఆడే ప్రయత్నం చేశాడు. ఉతప్పతో కలిసి నాలుగో వికెట్‌కు 36 పరుగులు జత చేశాడు. 13వ ఓవర్లో వంద పరుగులకు చేరుకున్న కోల్‌కతా ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంది. 15వ ఓవర్లో భారీ సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసిన ఉతప్పకు తోడుగా రసెల్ బ్యాట్ ఝుళిపించాడు.ఇక 24 బంతుల్లో 51 పరుగులు చేయాల్సిన దశలో ఐదు బంతుల తేడాలో రసెల్ (12 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్), హోల్డర్ (0), ఉతప్ప అవుటయ్యారు. దీంతో విజయసమీకరణం 12 బంతుల్లో 31గా మారింది. 19వ ఓవర్లో వరుస బంతుల్లో నరైన్ (4), ఉమేశ్ (2) అవుట్‌కావడంతో 9 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ విజయాన్ని అందుకుంది. బ్రాత్ వైట్, జహీర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) హాగ్ (బి) రసెల్ 1; శ్రేయస్ ఎల్బీడబ్ల్యు (బి) రసెల్ 0; శామ్సన్ ఎల్బీడబ్ల్యు (బి) నరైన్ 15; కరుణ్ నాయర్ ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ 68; బిల్లింగ్స్ (బి) ఉమేశ్ 54; మోరిస్ (బి) ఉమేశ్ 0; బ్రాత్‌వైట్ (సి) నరైన్ (బి) రసెల్ 34; పంత్ రనౌట్ 4; షమీ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1-1; 2-2; 3-32; 4-137; 5-137; 6-174; 7-182; 8-186. బౌలింగ్: రసెల్ 4-0-26-3; హోల్డర్ 4-0-35-0; నరైన్ 3-0-22-1; ఉమేశ్ 3-0-33-3; హాగ్ 4-0-39-0; చావ్లా 2-0-24-0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) నాయర్ (బి) మోరిస్ 72; గంభీర్ (సి) శ్రేయస్ (బి) జహీర్ 6; చావ్లా ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 8; యూసుఫ్ పఠాన్ (సి) మిశ్రా (బి) బ్రాత్‌వైట్ 10; సూర్యకుమార్ (సి) శ్రేయస్ (బి) బ్రాత్‌వైట్ 21; సతీష్ (సి) మోరిస్ (బి) బ్రాత్‌వైట్ 6; రసెల్ (సి అండ్ బి) మిశ్రా 17; హోల్డర్ రనౌట్ 0; ఉమేశ్ (సి) మోరిస్ (బి) జహీర్ 2; నరైన్ రనౌట్ 4; హాగ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (18.3 ఓవర్లలో ఆలౌట్) 159. వికెట్ల పతనం: 1-21; 2-33; 3-58; 4-94; 5-107; 6-151; 7-152; 8-153; 9-159; 10-159. బౌలింగ్: జహీర్ 3.3-0-21-3; షమీ 4-0-33-0; మోరిస్ 3-0-19-1; బ్రాత్‌వైట్ 4-0-47-3; మిశ్రా 4-0-36-1. -
మురళీ విజయ్‌కు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పగ్గాలు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో నిరాశాజనక ప్రదర్శన కనబరుస్తోన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సారథ్య బాధ్యతల్లో మార్పు చేసింది. ఇప్పటిదాకా కెప్టెన్‌గా ఉన్న దక్షిణాఫ్రికా ప్లేయర్ డేవిడ్ మిల్లర్‌ను తప్పించి... అతని స్థానంలో భారత్‌కు చెందిన మురళీ విజయ్ను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఈ సీజన్లో మిల్లర్ ఆరు ఇన్నింగ్స్‌లో కలిసి మొత్తం 76 పరుగులు చేయగా... మురళీ విజయ్ 143 పరుగులు సాధించాడు. -
వార్నర్ విధ్వంసం, బెంగళూరుకు భారీ లక్ష్యం
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తో జరగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి బెంగళూరుకు భారీ లక్ష్యాన్ని ముందుంచింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కేవలం 50 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లు బాదిన ఓపెనర్ వార్నర్ స్కోరును పెంచే క్రమంలో ఔటయ్యాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన వార్నర్ తొలి వికెట్ కోల్పోయిన తర్వాత జోరు పెంచాడు. ధావన్(11) ఔటైన తర్వాత క్రీజులోకొచ్చిన విలియమ్సన్(50 పరుగులు; 7 ఫోర్లు) తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. విలియమ్సన్ కూడా చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 124 పరుగుల భారీ భాగస్వాయ్యాన్ని జత చేశారు. చివర్లో త్వరత్వరగా వికెట్లు చేజార్చుకోవడంతో 200 మార్కును చేరుకోలేక పోయింది. ఆఖరి ఓవర్లలో హెన్రిక్స్ (30 నాటౌట్, 13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు)మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన వాట్సన్ ఆ ఓవర్లో కేవలం 6 పరుగులే ఇవ్వడంతో రెండు వందల పరుగులకు కొన్ని అడుగుల దూరంలో నిలిచింది. బెంగళూరు బౌలర్లలో రిచర్డ్ సన్ రెండు వికెట్లు, వాట్సన్, శంషి చెరో వికెట్ తీశారు. -
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు షాబుద్దీన్ గుడ్‌బై
అనంతపురం స్పోర్ట్స్: ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ షాబుద్దీన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ కెరీర్‌కు శుక్రవారం అధికారికంగా వీడ్కోలు ప్రకటించాడు. షాబుద్దీన్ ఆల్‌రౌండర్‌గా ఆంధ్ర జట్టుకు సేవలందించాడు. 80 రంజీ మ్యాచ్‌లాడి 2,567 పరుగులు (రెండు సెంచరీలు, 12 అర్ధసెంచరీలు) చేశాడు. 248 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఆర్డీటీ క్రికెట్ ఆపరేషన్స్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. -
కోహ్లి, గేల్ డ్యాన్స్ డ్యాన్స్...
వాట్సన్ గిటార్ మోత బెంగళూరు: ఐపీఎల్లో ఎన్ని జట్లున్నా సరదాల విషయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తర్వాతే ఎవరైనా. మైదానంలో మ్యాచ్ ఫలితాలు ఎలా ఉన్నా... ఒక్కసారిగా హోటల్ చేరగానే వారంతా ‘కళాకారులు’ అయిపోతారు. అసలు ఆర్సీబీ జట్టు సభ్యులైన తర్వాతే ఆటగాళ్లకూ జోష్ వస్తుందేమో! ఇలాంటి వాటిలో ముందుండే క్రిస్ గేల్‌కు సూపర్ స్టార్ విరాట్ కోహ్లి కూడా జత కలిశాడు. జట్టు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరు కలిసి కదంతొక్కారు. తమ నైపుణ్యాన్నంతా చూపెడుతూ సూపర్ డ్యాన్స్‌లతో చెలరేగారు. వీరి నృత్య ప్రదర్శనతో అక్కడి వేదిక దద్దరిల్లింది. కోహ్లి, గేల్ తమ నాట్యంతో ఆకట్టుకుంటే... మరో ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ తన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2011నాటి డేవిడ్ గ్వెట్టా సూపర్ హిట్ సాంగ్ ‘టైటానియం’ను పాడుతూ, మరోవైపు చక్కగా గిటార్ మోగిస్తూ ద్విపాత్రాభినయం చేశాడు. ఆర్సీబీ టీమ్‌లో మరో స్టార్ డివిలియర్స్ ఈ షో లో భాగం కాకపోయినా...అతని భార్య డేనియల్లె డివిలియర్స్ తన మధుర గాత్రంతో వాట్సన్‌తో గొంతు కలపడం మరో విశేషం. మొత్తంగా బెంగళూరు ఆటగాళ్లు ఎప్పటిలాగే తమ ఐపీఎల్ సీజన్‌ను కలర్ఫుల్గా మార్చుకుంటున్నారు. శనివారం సన్‌రైజర్స్ జట్టుతో తలపడేందుకు బెంగళూరు జట్టు గురువారం హైదరాబాద్‌కు చేరుకుంది. -
ముంబైకి టేలర్... బెంగళూరుకు జోర్డాన్
ఐపీఎల్లో గాయాలబారిన పడిన తమ ఆటగాళ్ల స్థానంలో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు వేరే ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. లసిత్ మలింగ స్థానంలో విండీస్ పేసర్ జెరోమ్ టేలర్‌ను ముంబై ఎంచుకోగా... మిషెల్ స్టార్క్‌కు బదులుగా ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను బెంగళూరు తీసుకుంది. గాయాల కారణంగా మలింగ, స్టార్క్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయారు. -
కోహ్లి 'శత' క్కొట్టినా...
► బెంగళూరుకు తప్పని ఓటమి ► బౌలింగ్ వైఫల్యంతో మూల్యం ► పరుగుల వేటలో లయన్స్‌కు నాలుగో విజయం బౌలర్ల సహకారం లేకపోవడంతో... భారీస్కోర్లు చేస్తున్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును మూడోసారి పరాజయం పలుకరించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి తొలిసారి టి20లో సెంచరీ సాధించినా బౌలర్ల వైఫల్యంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మరోవైపు గుజరాత్ లయన్స్ ఛేదనలో గర్జిస్తోంది. బెంగళూరు తమ ముందుంచిన కొండంత లక్ష్యాన్ని అలవోకగా అధిగమించింది. లయన్స్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్ని ఛేదించే గెలిచింది. ఒక్క మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసి ఓడింది. రాజ్‌కోట్: ఈ ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ సమస్య బెంగళూరు జట్టు కొంపముంచుతోంది. విరాట్ కోహ్లి మెరుపు శతకంతో భారీస్కోరు చేసినా ఆ జట్టును ఓటమి వీడలేదు. ఈ సీజన్లోనే కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ లయన్స్ విజయాలతో దూసుకెళ్తోంది. బ్యాట్స్‌మెన్ సమష్టి కృషితో రాణించడంతో భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఆదివారం సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌పై జయభేరి మోగించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి (63 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించాడు. లోకేశ్ రాహుల్ (35 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. తర్వాత లయన్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. దినేశ్ కార్తీక్ (39 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు), మెకల్లమ్ (24 బంతుల్లో 42; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి గుజరాత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. విరాట్ వీరవిహారం... అంతకుముందు టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో విజయవంతమైన ఓపెనర్ కోహ్లి ఈ మ్యాచ్‌లో వాట్సన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే ఈ జోడీ విఫలమైంది. జట్టు స్కోరు 8 పరుగుల వద్ద వాట్సన్ (6) వెనుదిరిగాడు. దీంతో డివిలియర్స్ జతయ్యాడు. ఇద్దరూ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించారు. గత మ్యాచ్‌కు రీప్లేగా సాగుతుందనుకుంటున్న దశలో డివిలియర్స్ (16 బంతుల్లో 20; 2 ఫోర్లు)ను స్పిన్నర్ ప్రవీణ్ తాంబే పెవిలియన్‌కు పంపాడు. దీంతో 51 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. గత మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా విఫలమైన లోకేశ్ సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగాడు. కెప్టెన్ కోహ్లి కంటే ధాటిగా ఆడి ఇన్నింగ్స్ ఆసాంతం అండగా నిలిచాడు. ఈ క్రమంలో మొదట విరాట్ 40 బంతుల్లో, తర్వాత రాహుల్ 34 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరు లయన్స్ బౌలర్లకు మరో వికెట్‌కు అవకాశం ఇవ్వలేదు. అజేయమైన మూడో వికెట్‌కు 121 పరుగులు జతచేశారు. బ్రేవో వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కోహ్లి సిక్స్, రెండు ఫోర్లతో కలిపి 15 పరుగులు చేసి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 193 టి20 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఈ ఫార్మాట్లో తొలిసారి సెంచరీ సాధించడం విశేషం. ఐపీఎల్-9లో ఇది రెండో సెంచరీ. ఇంతకుముందు ఢిల్లీ బ్యాట్స్‌మన్ డికాక్ బెంగళూరు జట్టుపై సెంచరీ చేశాడు. గెలిపించిన బ్యాట్స్‌మెన్ ఓపెనర్ల శుభారంభం మొదలు... క్రీజ్‌లోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మెన్ మెరుగ్గా ఆడటంతో కొండంత లక్ష్యం కూడా లయన్స్ జట్టు ముందు చిన్నబోయింది. మెకల్లమ్, డ్వేన్ స్మిత్ (21 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ఆరంభించారు. దీంతో ఓవర్‌కు సగటున 9 పరుగులతో జోరు కొనసాగింది. తొలి వికెట్‌కు ఇద్దరు కలిసి 47 పరుగులు జతచేశారు. ఆరో ఓవర్లో అదే స్కోరు వద్ద స్మిత్, 9వ ఓవర్లలో 87 పరుగుల వద్ద మెకల్లమ్ నిష్ర్కమించినా... బెంగళూరుకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక తర్వాతైన పట్టుబిగిద్దామనుకున్న ఆర్సీబీకి కెప్టెన్ రైనా (24 బంతుల్లో 28; 3 ఫోర్లు), కార్తీక్ ఆ అవకాశాన్నివ్వలేదు. దీంతో కడదాకా చెయ్యాల్సిన రన్‌రేట్‌ను కాపాడుకుంటూ వచ్చిన లయన్స్దే పైచేయి అయ్యింది. బౌలింగ్ వైఫల్యంతో బెంగళూరు మళ్లీ మూల్యం చెల్లించుకుంది. ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్‌కు దిగి 170 కంటే ఎక్కువ స్కోరు చేసిన బెంగళూరుకిది మూడో పరాజయం కావడం గమనార్హం. స్కోరు వివరాలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి నాటౌట్ 100; వాట్సన్ (సి) జడేజా (బి) ధవళ్ కులకర్ణి 6; డివిలియర్స్ (సి) రైనా (బి) తాంబే 20; రాహుల్ నాటౌట్ 51; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 180. వికెట్ల పతనం: 1-8, 2-59. బౌలింగ్: ప్రవీణ్ కుమార్ 3-0-28-0, కులకర్ణి 4-0-39-1, తాంబే 3-0-24-1, జకాతి 3-0-28-0, జడేజా 3-0-17-0, డ్వేన్ బ్రేవో 4-0-43-0. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) డివిలియర్స్ (బి) రిచర్డ్సన్ 32; మెకల్లమ్ (సి అండ్ బి) షమ్మీ 42; రైనా (సి) అబ్దుల్లా (బి) చాహల్ 28; దినేశ్ కార్తీక్ నాటౌట్ 50; జడేజా (సి) రాహుల్ (బి) వాట్సన్ 12; బ్రేవో నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 182. వికెట్ల పతనం: 1-47, 2-87, 3-140, 4-178. బౌలింగ్: చాహల్ 4-0-33-1, రిచర్డ్సన్ 4-0-53-1, ఇక్బాల్ అబ్దుల్లా 4-0-41-0, వాట్సన్ 3.3-0-31-1, తబ్రేజ్ షమ్సీ 4-0-21-1. -
చిక్కుల్లో బౌలర్ ముస్తాఫిజుర్
హైదరాబాద్: సత్ఖీరా పట్టణం.. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉండే అదే పేరున్న జిల్లా కేంద్రం. అక్కడ పేదవాళ్లుండే కాలనీలో ఓ చిరు ఉద్యోగి తన భార్య, ఆరుగురు సంతానంతో నివసించాడు. అతనికి క్రికెట్ అంటే పిచ్చి. అతని చిన్నకొడుక్కైతే ప్రాణం. ఇద్దరూ క్రికెట్ నే ప్రేమించారు. ఆరాధించారు. నాన్నను ఇంప్రెస్ చెయ్యటంకోసం.. వికెట్లంత ఎత్తు పెరగకముందే బౌలింగ్ మొదలుపెట్టాడా బుడ్డోడు. పెరిగి.. 5అడుగుల 11 అంగులాల ఎత్తయ్యాడు. పేరు ముస్తాఫిజుర్ రహమాన్. క్రికెట్ మోజులోపడి అతను చదువును నిర్లక్ష్యం చేశాడు. అదే ఇప్పుడతన్ని గొప్ప చిక్కుల్లో పడేసింది. ఎన్నో అడ్డంకుల్ని ఎదుర్కొని బౌలర్ గా మంచిపేరు తెచ్చుకున్నాడు ముస్తాఫిజుర్. అరంగేట్రం చేసిన టెస్ట్, వన్ డే మ్యాచ్ ల్లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును గెలుచుకున్న మొట్టమొదటి క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. 2015 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న ముస్తాఫిజులు ఈ ఏడాది ప్రారంభంలో గాయాలపాలై కొన్నిరోజులు ఆటకు దూరమయ్యాడు. మళ్లీ ఐపీఎల్ వేదికగా చెలరేగిపోతున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫన ఆడుతోన్న ముస్తాఫిజుర్ ఇప్పుడో గొప్ప చిక్కుల్లో పడ్డాడు. ఇన్నాళ్లంటే బంగ్లాదేశీ జట్టే కాబట్టి బెంగాలీలో మాట్లాడేవాడు. ఇప్పుడు.. కలగూరగంపలా దేశానికొకరుచొప్పున, ప్రాంతానికి ఇద్దరు చొప్పున కలిసి జట్టుగా ఏర్పడే ఐపీఎల్ లో ఆడుతున్న ముస్తాఫిజుర్ తీవ్రమైన భాషా సమస్యను ఎదుర్కొంటున్నాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ లో పడిపోయి చదువును అలక్ష్యంచేసిన అతనికి అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ పదిముక్కలైనా రాదు. దీంతో సహచరులతో ఐడియాలు పంచుకోవాలన్నా, ప్రెజెంటేషన్ సెర్మనీల్లో మాట్లాడాలన్నా వెనకడుగు వేస్తున్నాడు. ఇదే విషయాన్ని శనివారం పంజాబ్ తో జరిగిన మ్యాచ్ అనంతరం హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్ ఇరగదీస్థాడు కానీ భాషే అతని సమస్య అని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆసియా ఆటగాళ్లు భాషా సమస్యను ఎదుర్కోవడం సహజమే. వీరేంద్ర సెహవాగ్, భజ్జీ, చాలా మంది పాకిస్థాన్ ఆటగాళ్లు ఇలాంటి ఇబ్బందులు పడ్డవారే. క్రమంగా ఇంగ్లీష్ పై పట్టుపెంచుకుని, అనర్గళంగా మాట్లాడటమేకాక, కామెంటేటర్లుగానూ మారారు అందులో కొందరు. సో.. ముస్తాఫిజుర్.. నీక్కూడా ఆల్ ది బెస్ట్. స్పీక్ వెల్.. -
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ‘హ్యాట్రిక్’
► వరుసగా మూడో విజయం 10 పరుగులతో ఓడిన ముంబై ► రాణించిన శామ్సన్, డుమిని రోహిత్ శర్మ పోరాటం వృథా తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన తర్వాత ఢిల్లీ జట్టులో అనూహ్య మార్పు. ఎక్కువ మంది కుర్రాళ్లతో బరిలోకి దిగినా అంచనాలకు మించి రాణిస్తోంది. లక్ష్యం నిర్దేశించడంలోనూ, ఛేదించడంలోనూ తమదైన శైలిలో చెలరేగుతూ ‘హ్యాట్రిక్’ విజయాలను సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ: సొంతగడ్డపై ఢిల్లీ డేర్‌డెవిల్స్ అదరగొడుతోంది. మొన్న బెంగళూరుపై భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన జహీర్ సేన ఇప్పుడు సూపర్ బౌలింగ్‌తో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసింది. బ్యాటింగ్‌లో సంజూ శామ్సన్ (48 బంతుల్లో 60; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), డుమిని (31 బంతుల్లో 49 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లకు తోడు స్లాగ్ ఓవర్లలో బౌలర్లు చెలరేగడంతో ఐపీఎల్-9లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా, ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. తర్వాత ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులకు పరిమితమైంది. రోహిత్ శర్మ (48 బంతుల్లో 65; 7 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా, క్రునాల్ పాండ్యా (17 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. సంజూ శామ్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. శామ్సన్ జోరు... తొలి రెండు బంతులను బౌండరీలుగా మలిచిన ఓపెనర్ డికాక్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించినా.. రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. దీంతో ఢిల్లీ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో వచ్చిన శామ్సన్ కుదురుగా ఆడేందుకు ప్రయత్నించినా... నాలుగో ఓవర్లో శ్రేయస్ అయ్యర్ (20 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ఓ ఫోర్, సిక్స్‌తో 12 పరుగులు రాబట్టాడు. పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన ఢిల్లీ.. ఏడు, ఎనిమిది ఓవర్లలో శ్రేయస్, కరుణ్ నాయర్ (5) వికెట్లను చేజార్చుకోవడంతో రన్‌రేట్ పడిపోయింది. తర్వాత శామ్సన్తో జత కలిసిన డుమిని సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ చక్కని సహకారం అందించాడు. దీన్ని ఉపయోగించుకున్న శామ్సన్... హర్భజన్ వేసిన 12వ ఓవర్లో ఓ సిక్స్, ఫోర్‌తో వేగం పెంచాడు. ఆ తర్వాతి ఓవర్లో మరో బౌండరీ సాధించి 40 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. రెండో ఎండ్‌లో డుమిని కూడా పొలార్డ్‌కు సిక్సర్ రుచి చూపెట్టాడు. 17వ ఓవర్ రెండో బంతికి భారీ సిక్సర్ సంధించిన శామ్సన్ తర్వాతి బాల్‌కు అవుటయ్యాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు వికెట్‌కు 71 పరుగులు జోడించారు. చివరి మూడు ఓవర్లలో డుమిని, పవన్ నేగి (10 బంతుల్లో 10 నాటౌట్; 1 ఫోర్)లు 34 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. మెక్లీనగన్ 2 వికెట్లు తీశాడు. రోహిత్ ఒక్కడే... ముంబై ఓపెనర్లలో పార్థీవ్ పటేల్ (1) నిరాశపర్చినా... రెండో ఎండ్‌లో రోహిత్ తన మార్క్‌ను చూపెట్టాడు. అంబటి రాయుడు (23 బంతుల్లో 25; 4 ఫోర్లు)తో కలిసి ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. నేగి వేసిన మూడో ఓవర్లో రోహిత్ నాలుగు ఫోర్లతో 19 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో రాయుడు కూడా రెండు బౌండరీలు సాధించడంతో 8కి పైగా రన్‌రేట్ నమోదైంది. పవర్‌ప్లేలో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసిన ముంబై.. 9వ ఓవర్లో రాయుడు వికెట్‌ను కోల్పోయింది. మిశ్రా అద్భుతమైన గుగ్లీతో అతన్ని అవుట్ చేశాడు. దీంతో రెండో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచిన క్రునాల్ ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు. మొత్తం 4 ఫోర్లు, 2 సిక్సర్లతో మూడో వికెట్‌కు 41 పరుగులు జోడించి అవుటయ్యాడు. ఇక 6 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన దశలో ఢిల్లీ బౌలర్లు విజృంభించారు. బట్లర్ (2)ను వెంటనే అవుట్ చేయడంతో పాటు భారీ షాట్లకు పోకుండా రోహిత్, పొలార్డ్ (18 బంతుల్లో 19; ఒక సిక్స్)లను కట్టడి చేశారు. దీంతో సింగిల్స్ మాత్రమే రావడంతో రన్‌రేట్ పెరిగిపోయింది. 19వ ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన పొలార్డ్ ఆఖరి బంతికి అవుటయ్యాడు. ఆఖరి ఓవర్లో 21 పరుగులు అవసరంకాగా, రోహిత్, హర్భజన్ (0) వరుస బంతుల్లో వెనుదిరిగారు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) హార్దిక్ (బి) మెక్లీనగన్ 9; శ్రేయస్ (సి) రాయుడు (బి) హార్దిక్ 19; శామ్సన్ (సి) సౌతీ (బి) మెక్లీనగన్ 60; కరుణ్ నాయర్ (సి) సౌతీ (బి) హర్భజన్ 5; డుమిని నాటౌట్ 49; నేగి నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-11; 2-48; 3-54; 4-125. బౌలింగ్: సౌతీ 3-0-21-0; మెక్లీనగన్ 4-0-31-2; బుమ్రా 4-0-42-0; క్రునాల్ పాండ్యా 4-0-25-0; హార్దిక్ పాండ్యా 1-0-7-1; హర్భజన్ 3-0-24-1; పొలార్డ్ 1-0-11-0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 65; పార్థీవ్ పటేల్ రనౌట్ 1; రాయుడు (బి) మిశ్రా 25; క్రునాల్ పాండ్యా రనౌట్ 36; బట్లర్ ఎల్బీడబ్ల్యు (బి) మిశ్రా 2; పొలార్డ్ (సి) మోరిస్ (బి) జహీర్ 19; హార్దిక్ నాటౌట్ 2; హర్భజన్ ఎల్బీడబ్ల్యు (బి) మోరిస్ 0; సౌతీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1-9; 2-62; 3-103; 4-110; 5-144; 6-152; 7-152. బౌలింగ్: జహీర్ 4-0-30-1; షమీ 3-0-24-0; నేగి 1-0-19-0; మోరిస్ 4-0-27-1; మిశ్రా 4-0-24-2; తాహిర్ 4-0-29-0. -
విరాట్ కోహ్లిపై రూ. 12 లక్షల జరిమానా
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వాహకులు రూ. 12 లక్షలు జరిమానా విధించారు. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌తో శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బెంగళూరు బౌలర్లు నిర్ణీత సమయంలో పూర్తి కోటా ఓవర్లు పూర్తి చేయనందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి ఇలా జరిగితే కోహ్లిపై రూ. 24 లక్షలు జరిమానా విధిస్తారు. మూడోసారి ఇదే తప్పిదాన్ని పునరావృతం చేస్తే అతనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశముంది. -
కోహ్లీకి భారీ జరిమానా
పుణె: విధ్వంసకరమైన బ్యాటింగ్ తో పొట్టి క్రికెట్ పోటీలో భారీగా పరుగులు సాధిస్తోన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ) బౌలింగ్ విభాగంలో బలహీనంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఆ బలహీనతను అధిగమించే క్రమంలో కీలకమైన ఓవర్లను ఏ బౌలర్ తో వేయించాలా అని తెగ మథనపడిపోతున్నాడు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ! అలా ఆ...లోచిస్తూ..చిస్తూ అతను కాలాన్నీ హరిస్తున్నాడు. అయితే పుణే వేదికగా ధోనీ సారథ్యంలోని పుణే సూపర్ జెయింట్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మాత్రం ఆర్ సీబీ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ వ్యూహచర్చలతో టైమ్ ను కిల్ చేశారు. మ్యాచ్ చూసినవారెవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థమై ఉంటుంది. ప్రేక్షకుల కన్నా ఈ విషయం రిఫరీకి బాగా అర్థమైంది. అందుకే కోహ్లీకి ఫైన్ పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సారథి కోహ్లీకి జరిమానా విధిస్తున్నట్లు మ్యాచ్ అనంతరం రిఫరీలు ప్రకటించారు. జరిమానా అంతాఇంతా కాదు ఏకంగా 20 వేల డాలర్లు! మన కరెన్సీలో రూ.13.3 లక్షలు. సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ కు ఇంత భారీ స్థాయిలో జరిమానా ఉండదు కానీ ఐపీఎల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిబంధనల్లో జరిమానాల స్థాయి భారీగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ ముగించాల్సిన సమయానికి ఆర్ సీబీ రెండు ఓవర్లు వెనుకబడిపోయింది. శుక్రవారం నాటి మ్యాచ్ లో కోహ్లీ సేన ధోని సేనపై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ దిగన ఆర్సీబీ ఏబీ డివిలియర్స్, కోహ్లీల దూకుడుతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ఆదినుంచే తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. -
పుణే స్పిన్ బాగుంది
హర్షా భోగ్లే ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభమైన 14 రోజులకు రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ సొంత వేదికకు చేరింది. అయితే ఆ జట్టుకిది ఇప్పుడు సొంత మైదానం అని చెప్పుకోవడానికి లేదు. మారిన పరిస్థితుల కారణంగా కేవలం తాత్కాలిక శిబిరంగానే ఉపయోగపడనుంది. ఇక లీగ్‌లో వారు కాస్త కఠినమైన దశకు చేరుకున్నారు. రానున్న పది రోజుల్లో ఐదు మ్యాచ్‌లు ఆడబోతున్నారు. వీటి తర్వాత తాజా లీగ్‌లో వారి అవకాశాలేమిటో అంచనా వేయవచ్చు. పుణే పిచ్‌పై నాకు ఆసక్తిగా ఉంది. ఎందుకంటే క్రితంసారి నేను చూసినప్పుడు ఇది మంచి సలాడ్ బౌల్‌లాగా అనిపించింది. ఎందుకంటే ఇది భారత్‌లోనే అత్యంత అందమైన స్టేడియాల్లో ఒకటి. పుణే జట్టు ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ స్పిన్నర్‌తో స్పిన్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. మురుగన్ అశ్విన్ ప్రభావం చూపిస్తున్నాడు. పేస్‌లో ఇషాంత్ శర్మ ముంబైతో మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. అయితే ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లను కెప్టెన్ ధోని వేయనిస్తాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే వికెట్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ జట్టు ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తోంది. ముఖ్యంగా ఓపెనర్ డు ప్లెసిస్ వేగవంతమైన ఆటతో ఒత్తిడి లేకుండా చూస్తున్నాడు. ఒక ఓపెనర్ స్ట్రయిక్ రేట్ 145-150 మధ ్య ఉంటే మంచిది. మరోవైపు మొత్తం పోస్టర్ బాయ్స్‌తో నిండిపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిని ఓడింది. ఇందులో ఓడిన రెండు మ్యాచ్‌లు మొదట బ్యాటింగ్ చేసినవే. అయితే ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది కాబట్టి కెప్టెన్ విరాట్ కోహ్లి తమ తుది కూర్పు ఎలా ఉండాలో తెలుసుకోవాల్సి ఉంది. గత మ్యాచ్‌లో ఏకంగా వారు ఆరు మార్పులతో బరిలోకి దిగారు. ఇది తమ శిబిరంలో అనిశ్చితిని తెలియజేసింది. అయితే రిచర్డ్సన్, అబ్దుల్లాలను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. నావరకైతే స్పిన్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై బెంగళూరు మరోసారి చేజ్ చేయడంతో పాటు ఆర్.అశ్విన్.. కోహ్లికి బౌలింగ్ వేస్తే చూడాలని ఉంది. -
జోడీ నంబర్ 1
► కోల్‌కతా ఓపెనర్లు సూపర్ హిట్ ► వరుసగా మూడో సీజన్లోనూ నిలకడ ఫార్మాట్ ఏదైనా ఓపెనర్లు బాగా ఆడితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి జట్టూ మంచి ఓపెనింగ్ జోడీ కోసం చూస్తుంది. ఐపీఎల్లో దాదాపు అన్ని జట్లూ సరైన ఓపెనర్ల కోసం ఇబ్బంది పడుతూ, ప్రతి సీజన్లోనూ మార్పులు చేస్తూనే ఉంటాయి. కోల్‌కతా కూడా ఆరేళ్ల పాటు ఇలాంటి తిప్పలే పడింది. 2014లో తొలిసారి గంభీర్, ఉతప్ప జతకలిశాక ఈ జట్టు రాత మారింది. ఈ ఏడాది కూడా అదే జోరుతో ఈ ఇద్దరూ చెలరేగిపోతున్నారు. సాక్షి క్రీడావిభాగం:- మిగిలిన చాలా జట్ల ఓపెనర్లతో పోలిస్తే గంభీర్, ఉతప్ప ఇద్దరూ అంత పెద్ద విధ్వంసకర ఆటగాళ్లేం కాదు. కానీ పవర్‌ప్లేలో ఈ ఇద్దరూ కలిసి అలవోకగా ఓ 50-60 పరుగులు చేసేస్తారు. విరుచుకుపడి సిక్సర్ల సునామీ సృష్టించడం, భీకరమైన షాట్లు ఆడటం కనిపించదు. కానీ పరుగులు వస్తాయి. అడపాదడపా గ్యాప్‌లలోకి ఫోర్లు కొట్టినా... ఈ ఇద్దరూ ఎక్కువగా నమ్ముకుంది స్ట్రయిక్ రొటేట్ చేయడం. సింగిల్ లేదు అనుకునే దగ్గర కూడా ఈ ఇద్దరూ కలిసి పరుగు రాబడతారు. దీనికి కారణం ఈ ఇద్దరికీ కుదిరిన సమన్వయం. మైదానంలో ప్రొఫెషనల్‌గానే కాదు... వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య పెరిగిన స్నేహం కూడా దీనికి కారణం. నిలకడకు మారుపేరు గంభీర్, ఉతప్ప కలిసి ఇప్పటివరకూ 28 ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ చేస్తే ఇందులో 18 సార్లు 30 పరుగులకి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఐపీఎల్లో మరే జట్టుకూ ఇంత నిలకడైన ఓపెనింగ్ భాగస్వామ్యాలు లేవు. వాస్తవానికి 2014 సీజన్లో ఉతప్ప ఓపెనర్ కాదు. లోయర్ ఆర్డర్లో ఆడేవాడు. ఆ సీజన్లో గంభీర్, కలిస్, మనీష్ పాండే, బిస్లా... ఈ నలుగురూ కలిసి రకరకాల కాంబినేషన్లలో ఆడారు. కానీ ఏ ఒక్క జోడీ హిట్ కాలేదు. అప్పటికి ఉతప్ప కూడా లోయర్ ఆర్డర్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అయితే ఓ రోజు మ్యాచ్‌కు ముందు జట్టు సమావేశంలో ఓపెనర్ల గురించి చర్చ జరిగినప్పుడు... తాను తొలి స్థానంలో సౌకర్యంగా ఆడతానని ఉతప్ప చెప్పాడు. దీంతో అవకాశం ఇచ్చారు. 2014 మే 2న తొలిసారి ఇద్దరూ కలిసి ఆడారు. ఆ మ్యాచ్‌లో గంభీర్ రనౌట్ అయ్యాడు. కానీ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకున్న తర్వాత... ఒకరితో ఒకరికి స్నేహం పెరిగాక వికెట్ల మధ్య పరుగులోనూ సమస్యలు తొలిగిపోయాయి. ఆ మ్యాచ్ తర్వాత ఈ జోడీ ఆడుతుండగా ఒక్కసారి కూడా రనౌట్ కాలేదు. ఆ సీజన్లో ఉతప్ప కోల్‌కతాకు అద్భుతాలు చేసి పెట్టాడు. ఏకంగా 660 పరుగులతో ‘ఆరెంజ్ క్యాప్’ సంపాదించడంతో పాటు కోల్‌కతాను చాంపియన్‌గా నిలబెట్టాడు. ఒకరి మీద ఒకరికి నమ్మకం గంభీర్, ఉతప్పల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ముఖ్యంగా వికెట్ల మధ్య పరుగు విషయంలో ఇది బాగా కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎక్కువ. ఒకరి నిర్ణయాన్ని మరొకరు గౌరవిస్తారు. గంభీర్ సింగిల్ కోసం బయల్దేరాడంటే ఉతప్ప కూడా గుడ్డిగా పరుగెడతాడు. సహచరుడి జడ్జిమెంట్ మీద పరస్పరం ఉన్న నమ్మకం ఇది. హైదరాబాద్‌లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఇది బాగా కనిపించింది. పరిస్థితికి తగ్గట్లు ఇన్నింగ్స్ పేస్ మార్చడంలోనూ ఇద్దరూ సిద్ధహస్తులే. గంభీర్ వేగంగా ఆడుతున్న సమయంలో పొరపాటున కూడా ఉతప్ప షాట్ల కోసం వెళ్లడు. సింగిల్ తీసి వెంటనే స్ట్రయికింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఇటు గంభీర్ కూడా అంతే. ఇద్దరిలోనూ ఉతప్ప కొంత మెరుైగె న హిట్టర్. ప్రస్తుతం ఈ ఇద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం కోల్‌కతాకు బాగా కలిసొచ్చే అంశం. ప్రయోగాల పరంపర కోల్‌కతాతో పోలిస్తే మిగిలిన జట్లు ఓపెనింగ్ కాంబినేషన్ కోసం ఇంకా తంటాలు పడుతూనే ఉన్నాయి. ప్రస్తుత సీజన్లో గుజరాత్ లయన్స్, పుణే జెయింట్స్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. సన్‌రైజర్స్ జట్టు కూడా 2014 నుంచి కేవలం రెండు జోడీలను మాత్రమే ప్రయత్నించింది. వార్నర్, ధావన్ ఇద్దరూ సూపర్ స్టార్స్ కావడం వల్ల ఓపెనర్లను మార్చడం లేదు. కానీ ప్రస్తుతం ధావన్ ఫామ్ చూస్తే త్వరలోనే హైదరాబాద్ జట్టు కూడా ఓపెనర్లను మార్చక తప్పకపోవచ్చు. ఇక ఓపెనర్ల విషయంలో ఏమాత్రం నిలకడ లేని జట్టు ముంబై ఇండియన్స్. 2014 నుంచి ఇప్పటివరకూ ఈ జట్టు 11 రకాల ఓపెనింగ్ కాంబినేషన్లను ప్రయత్నించింది. అటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా ఈ మూడు సీజన్లలో 10 రకాల జోడీలను ఆడించింది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ 9 జోడీలతో ప్రయోగాలు చేస్తే... పంజాబ్ ఆరు కాంబినేష్లను ప్రయత్నించింది. ఏమైనా ఓపెనర్లు ఇద్దరూ ఫామ్‌లో ఉంటే ఆ జట్టు సురక్షితంగా ఉన్నట్లే. కోల్‌కతా విషయంలో మరోసారి ఇదే నిజమయింది. -
మే 1న పుణేలోనే...
ముంబై: ఐపీఎల్లో మే 1న పుణేలో జరగాల్సిన మ్యాచ్‌ను అక్కడే నిర్వహించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 30 తర్వాత మహారాష్ట్రలో జరగాల్సిన మ్యాచ్‌లన్నీ తరలించాలని గతంలో కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ 29న పుణేలో ధోనిసేన మ్యాచ్ ఆడి, తిరిగి మే 1న వేరే వేదికకు వెళ్లి ఆడటం కష్టమని, కాబట్టి ఈ ఒక్క మ్యాచ్‌నూ అనుమతించాలని బీసీసీఐ హైకోర్టును కోరింది. -
వివాదాల ప్రభావం పడుతోంది: ప్రీతి జింటా
ప్రతి ఏటా ఐపీఎల్‌ను ఏదో ఒక వివాదం చుట్టుముట్టడం వల్ల ఫ్రాంచైజీలపై ప్రభావంపడుతోందని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ సహ యజమాని ప్రీతి జింటా వ్యాఖ్యానించింది.‘ఈ వివాదాల వల్ల జట్ల బ్రాండ్ దెబ్బతింటోంది. దీని ప్రభావం మా వ్యాపారంపై పడుతోంది’ అని వాపోయింది. ఐపీఎల్ వల్ల దేశంలో క్రీడల ముఖచిత్రం మారిపోయిందని, యువ క్రికెటర్లకు మేలు చేసే ఈ లీగ్‌ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని పేర్కొంది. -
కోల్ కతా రైడింగ్
► నైట్‌రైడర్స్‌కు మూడో విజయం ► రాణించిన ఉతప్ప, గంభీర్ ► మరోసారి మెరిసిన బౌలర్లు ఈ సీజన్ ఐపీఎల్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు జరిగితే... 11 మ్యాచ్‌ల్లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లే గెలిచాయి. ఇప్పుడు కోల్‌కతా, పంజాబ్ మ్యాచ్‌లో కూడా అదే ఆనవాయితీ కొనసాగింది. ప్రత్యర్థి జట్టులోని హిట్టర్లను స్పిన్ మ్యాజిక్‌తో నియంత్రించిన నైట్‌రైడర్స్... ఓపెనర్ల రాణింపుతో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సీజన్లో మూడో విజయం సొంతం చేసుకుంది. మొహాలీ: నాణ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోరుకే అవుట్ చేయడం... ఆపై ఓపెనర్ల రాణింపుతో సులువుగా ఛేదించడం.. ఈ సీజన్లో కోల్‌కతా విజయమంత్రం ఇది. పంజాబ్‌పై కూడా అదే తరహాలో కోల్‌కతా ‘రైడింగ్’ కొనసాగింది. లక్ష్య ఛేదనలో రాబిన్ ఉతప్ప (28 బంతుల్లో 53; 9 ఫోర్లు), గౌతమ్ గంభీర్ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు)లు చెలరేగడంతో ఐపీఎల్-9లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. షాన్ మార్ష్ (41 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, మురళీ విజయ్ (22 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. తర్వాత కోల్‌కతా 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 141 పరుగులు చేసింది. అక్షర్, సాహు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మార్ష్ మినహా... పిచ్ బౌలర్లకు సహకరించడంతో పంజాబ్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి బాగా ఇబ్బందిపడ్డారు. ఓపెనర్లలో మన్నన్ వోహ్రా (8) నాలుగో ఓవర్లోనే అవుట్‌కాగా, మురళీ విజయ్‌తో కలిసి మార్ష్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు. వీరిద్దరు అడపాదడపా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో కింగ్స్ స్కోరు 41/1 పరుగులకు చేరింది. ఈ దశలో గంభీర్... స్పిన్నర్ల చేతికి బంతి ఇవ్వడంతో పంజాబ్ మిడిలార్డర్ తలకిందులైంది. ఓ ఎండ్‌లో మార్ష్ స్థిరంగా ఆడినా.... రెండో ఎండ్‌లో చావ్లా, నరైన్, యూసుఫ్‌లు వ్యూహాత్మకంగా బౌలింగ్ చేస్తూ వరుస విరామాల్లో విజయ్, సాహా (8), మిల్లర్ (6), మ్యాక్స్‌వెల్ (4)లను పెవిలియన్‌కు చేర్చారు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 5 వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేసింది. ఇక భారీ షాట్లు ఆడతాడనుకున్న అక్షర్ పటేల్ (9)తో పాటు మోహిత్ శర్మ (1), ప్రదీప్ సాహు (1)లు పది బంతుల తేడాలో అవుట్‌కావడం స్కోరుపై ప్రభావం చూపింది. ఆఖరి ఓవర్లో మార్ష్ రెండు భారీ సిక్సర్లతో 18 పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ మొత్తంలో ఇదే అత్యధికం. మోర్కెల్, నరైన్ చెరో రెండు వికెట్లు తీశారు. మెరుపు భాగస్వామ్యం లక్ష్యం భారీగా లేకపోయినా... కోల్‌కతా ఛేదన ధాటిగానే ప్రారంభించింది. గంభీర్ సింగిల్స్‌కు ప్రాధాన్యమిచ్చినా.. ఉతప్ప వేగంగా ఆడాడు. ఈ ఇద్దరు ఓవర్‌కు ఒకటి, రెండు ఫోర్లతో పదికి పైగా రన్‌రేట్ నమోదు చేశారు. దీంతో తొలి ఆరు ఓవర్లలో నైట్‌రైడర్స్ 65 పరుగులు చేసింది. స్పిన్నర్ సాహు వేసిన ఏడో ఓవర్లో అద్భుతమైన రివర్స్ స్వీప్‌తో ఫోర్ కొట్టిన ఉతప్ప... ఆ తర్వాతి బంతికి సింగిల్స్ తీసి ఈ సీజన్లో మూడో ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ (24 బంతుల్లో) సాధించాడు. నిలకడగా ఆడుతున్న ఈ జోడిని 9వ ఓవర్లో సాహునే విడదీశాడు. ఓ ఫుల్ లెంగ్త్ బంతిని స్వీప్ చేయబోయి ఉతప్ప ఎల్బీడబ్ల్యు అయ్యాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలో 82 పరుగులు జత చేశారు. ఈ దశలో వచ్చిన మనీష్ పాండే (12) మెల్లగా ఆడినా.... సాహు తన మూడో ఓవర్లో గంభీర్‌ను పెవిలియన్‌కు పంపాడు. మిడ్ వికెట్ మీదుగా గాల్లోకి లేచిన బంతిని మ్యాక్స్‌వెల్ జంప్ చేస్తూ నేర్పుగా అందుకున్నాడు. ఇక 42 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో అక్షర్ పటేల్ వరుస ఓవర్లలో పాండే, షకీబ్ (11)ల వికెట్లు తీశాడు. కానీ విజయానికి 15 పరుగులు అవసరమైన దశలో యూసుఫ్ (12 నాటౌట్) రెండు, సూర్యకుమార్ (11 నాటౌట్) ఓ ఫోర్ బాదడంతో మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజయం లభించింది. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: మురళీ విజయ్ (బి) చావ్లా 26; వోహ్రా (సి) షకీబ్ (బి) మోర్కెల్ 8; మార్ష్ నాటౌట్ 56; సాహా (సి) ఉతప్ప (బి) నరైన్ 8; మిల్లర్ (సి) ఉతప్ప (బి) పఠాన్ 6; మ్యాక్స్‌వెల్ (సి) చావ్లా (బి) నరైన్ 4; అక్షర్ పటేల్ (సి) సూర్య కుమార్ (బి) ఉమేశ్ 9; మోహిత్ శర్మ (సి) ఉతప్ప (బి) మోర్కెల్ 1; ప్రదీప్ సాహు రనౌట్ 1; అబాట్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1-21; 2-47; 3-59; 4-72; 5-94; 6-108; 7-115; 8-118. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-27-2; ఉమేశ్ యాదవ్ 3-0-17-1; షకీబ్ 4-0-28-0; నరైన్ 4-0-22-2; పీయూష్ చావ్లా 3-0-18-1; యూసుఫ్ పఠాన్ 1-0-6-1; రస్సెల్ 1-0-18-0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప ఎల్బీడబ్ల్యు (బి) సాహు 53; గంభీర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సాహు 34; మనీష్ పాండే (బి) అక్షర్ 12; షకీబ్ (సి) సందీప్ (బి) అక్షర్ 11; సూర్య కుమార్ నాటౌట్ 11; యూసుఫ్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (17.1 ఓవర్లలో 4 వికెట్లకు) 141. వికెట్ల పతనం: 1-82; 2-97; 3-110; 4-123. బౌలింగ్: సందీప్ శర్మ 2-0-21-0; అబాట్ 3-0-32-0; మోహిత్ శర్మ 3.1-0-29-0 అక్షర్ పటేల్ 3-0-19-2; ప్రదీప్ సాహు 4-0-18-2; మ్యాక్స్‌వెల్ 2-0-17-0. -
ఐపీఎల్ -9 విజేత ఎవరంటే..?
బెంగళూరు: ఐపీఎల్ -9లో లీగ్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సీజన్ ఉత్కంభరిత పోరు ఇంకా ఎదురుకానప్పటికీ మ్యాచ్ లకు ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. చెన్నై, రాజస్థాన్ జట్ల రద్దు కాగా, వాటి స్థానంలో గుజరాత్, పుణే బరిలో నిలిచాయి. ఈసారి మాత్రం టైటిల్ బెంగళూరుదే అంటున్నారు బుక్ మేకర్స్. విరాట్ కోహ్లి నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్ సీబీ)కే టైటిల్ కైవసం చేసుకునే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. పంజాబ్ ఈసారి చివరిస్థానంతో సరిపెట్టుకుంటుందని అంచనా వేశారు. బుక్ మేకర్స్ అభిప్రాయాలు ఆధారంగా ఆయా జట్ల విజయావకాశాలు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరు- 29 శాతం గుజరాత్- 19 శాతం ముంబై- 14 శాతం పుణే- 13 శాతం కోల్ కతా-12 శాతం ఢిల్లీ- 6 శాతం హైదరాబాద్-5 శాతం పంజాబ్ - 4 శాతం -
ముచ్చటగా మూడోసారి గర్జించిన 'లయన్స్'
ఐపీఎల్ లో కొత్త ఫ్రాంచైజీ జట్టు గుజరాత్ లయన్స్ మరోసారి గర్జించింది. కొత్త జట్టు అయినా.. ఆట మాత్రం ఘనంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ చేతులు మారుతూ వచ్చింది. చివరి బంతికి ఫోర్ కొట్టి 144 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. గుజరాత్ నిర్ణీత ఓవర్లు ఆడి 7 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. గుజరాత్ లయన్స్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ మరోసారి హాఫ్ సెంచరీ(67; 54 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) చేసి జట్టును విజయాలబాటలో నడిపించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హీరో ఫించ్ ఈ సీజన్ లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ అర్థ శతకాలు బాది జట్టు విజయంలో కీలక పోషించాడు. కెప్టెన్ సురేష్ రైనా (27; 22 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. బ్రెండన్ మెకల్లమ్(6), దినేష్ కార్తీక్(9), బ్రావో(2) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మెక్ క్లెనగన్ 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా రెండు వికెట్లు, పాండ్యా ఒక్క వికెట్ తీశారు. ముంబై ఇన్నింగ్స్: అంతకుముందు ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి గుజరాత్ లయన్స్ ముందు 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటింగ్ చేపట్టిన ముంబై జట్టు ఆది నుంచి తడబడుతూ బ్యాటింగ్ కొనసాగించింది. ఓపెనర్లలో పార్థీవ్ పటేల్(34) మెస్తరుగా రాణించగా, మిగతా ఆటగాళ్లలో బట్లర్(16),అంబటి రాయుడు(20),టిమ్ సౌతీ(25), కృణాల్ పాండ్యా(20 నాటౌట్)లు మాత్రమే రెండంకెల మార్కును చేరడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో కులకర్ణి, తాంబేలు తలో రెండు వికెట్లు సాధించగా, బ్రేవో, జకాతిలకు చెరో వికెట్ దక్కింది. రోహిత్ శర్మ(7) విఫలమయ్యాడు. -
రోహిత్ మెరుపులు.. ముంబై అదరహో
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో ఓటమితో ఆరంభించిన ముంబై ఇండియన్స్ తమ రెండో మ్యాచ్ లో సత్తాచాటింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో బుధవారం రాత్రి ఇక్కడ జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తమ అసలైన ఆటతీరును ప్రదర్శించి మరో ఐదు బంతులు ఉండగానే 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ(84 పరుగులు; 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా బ్యాట్స్ మన్ రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. టార్గెట్ ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మకు మరో ఓపెనర్ పార్థీవ్ పటేల్(23), మెక్ క్లెనగన్(20 పరుగులు; 8 బంతుల్లో 3 సిక్సర్లు), చివర్లో బట్లర్ (41 పరుగులు; 22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు జతవ్వడంతో ముంబై విజయం నల్లేరుపై నడకగా మారింది. లక్ష్యం ఎక్కువగా ఉన్నప్పటికీ ఏ దశలోనూ ముంబై ఆటగాళ్లు వెనక్కి తగ్గలేదు. కోల్ కతా బౌలర్లలో రస్సెల్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. కోల్ కతా ఇన్నింగ్స్: తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా కెప్టెన్ గౌతం గంభీర్ (64 పరుగులు; 52 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), మనీష్ పాండే (52 పరుగులు; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆండ్రీ రస్సెల్ (36 పరుగులు; 17 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) సూపర్ ప్రదర్శనతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్ క్లెనగన్ రెండు వికెట్లు పడగొట్టగా, పాండ్యా, హర్బజన్ చెరో వికెట్ తీశారు. -
'అతడి కారణంగానే ఓడిపోయాం'
బెంగళూరు: యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ కారణంగానే ఐపీఎల్ -9 తొలి మ్యాచ్ లో తాము ఓడిపోయామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. చివరి ఓవర్లలో విజృభించి ఆడి సర్ఫరాజ్ తమ నుంచి మ్యాచ్ ను లాగేసుకున్నాడని పేర్కొన్నాడు. అతడు చేసిన పరుగులే మ్యాచ్ లో కీలకంగా మారాయని చెప్పాడు. చివరి రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపం మారిపోయిందన్నాడు. విరాట్ కోహ్లి, డివిలియర్స్ కూడా గొప్ప ఇన్నింగ్స్ ఆడారని మెచ్చుకున్నాడు. గతి తప్పి చెత్త బంతులు వేసిన బౌలర్లతో తాను మాట్లాడకపోవడం కూడా ఓటమి కారణమని చెప్పాడు. సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయపడం కూడా తమపై ప్రతికూల ప్రభావం చూపిందని వాపోయాడు. ఓటమికి తాను ఏ ఒక్కరిని తప్పు బట్టడం లేదని, లోపాలను సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్ లో బరిలోకి దిగుతామని వార్నర్ తెలిపాడు. -
సన్ రైజర్స్ కు మరో ఎదురుదెబ్బ
బెంగళూరు: ఐపీఎల్-9లో తాను ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్వయంగా వెల్లడించాడు. గజ్జలో గాయం కావడంతో నెహ్రా కొన్ని మ్యాచ్ లు దూరమయ్యాడని తెలిపాడు. మంగళవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో నెహ్రా గాయపడ్డాడు. దీంతో తన కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. 2.1 ఓవర్లు వేసి మధ్యలో వైదొలిగాడు. మిగిలిన 5 బంతులను మరో బౌలర్ ఆశిష్ రెడ్డి వేశాడు. హైదరాబాద్ తరపున నెహ్రా తొలిసారిగా ఆడుతున్నాడు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించాడు. -
'సర్ఫరాజ్ బ్యాటింగ్ సూపర్'
బెంగళూరు: భారత యువ బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ పై ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. అతడి బ్యాటింగ్ స్టయిల్ తనను ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. అతడు ఆడే షాట్లపై కంట్రోల్ బాగుందని పేర్కొన్నాడు. 'అతడో అద్భుతమైన యువకుడు. అన్నిరకాల షాట్లు ఆడేందుకు అతడు ఎంతో ప్రాక్టీస్ చేసినట్టు అర్థమవుతోంది. తాను ఆడే షాట్లపై నియంత్రణ బాగుంది. ఇలాంటి యంగ్ టాలెంట్ ను ఇంతకుముందెన్నడూ చూడలేదు. బాగా బ్యాటింగ్ చేసేందుకు అతడు చాలా ప్రాక్టీస్ చేస్తాడు. అది ఈ రోజు మ్యాచ్ లో ప్రస్ఫుటమైంది. ఒక్క చెత్త షాట్ కూడా ఆడలేదు. బ్యాక్ ఫుట్ మీద అతడు కొట్టిన సిక్సర్ అద్భుతమైన షాట్. ఎంతో సులువుగా బాదిన ఈ షాట్ ను చూసి తీరాల్సిందే. సర్ఫరాజ్ షాట్ సెలెక్షన్ చాలా బాగుంద'ని వాట్సన్ అన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మంగళవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సర్ఫరాజ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 10 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు బాదాడు. సర్ఫరాజ్ చెలరేగడంతో బెంగళూరు స్కోరు 200 పరుగులు దాటింది. -
బెంగళూరు నుంచికూడా తరలించండి!
సాక్షి, బెంగళూరు: ఐపీఎల్ తొమ్మిదో సీజన్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే మహారాష్ట్రలో జరిగే మ్యాచ్‌లపై సందిగ్ధత కొనసాగుతుండగా... తాజాగా బెంగళూరు నుంచి కూడా ఐపీఎల్‌ను తరలించాలని కోరుతూ కర్నాటక హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. రాష్ట్రంలో తీవ్ర నీటి కరవు ఉందని, ఇలాంటి స్థితిలో ఐపీఎల్ కోసమంటూ ఎక్కువ నీటితో స్టేడియంలోని పిచ్‌లను తడపడం సరికాదని పిటిషన్‌దారుడు శ్రీనివాస్‌శర్మ న్యాయస్థానానికి తెలిపారు. అంతేకాకుండాఆ నీటిని జలమండలి అక్రమంగా సరఫరా చేస్తోందని గుర్తుచేశారు. నేడు (మంగళవారం) సన్‌రైజర్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్ ఆడనుండగా ఈ పిల్ కూడా విచారణకు రానుంది. -
లయన్స్ గర్జన
► తొలి మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం ► 5 వికెట్లతో పంజాబ్ చిత్తు ► బ్రేవోకు నాలుగు వికెట్లు ► చెలరేగిన ఫించ్, దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో కొత్త జట్టు గుజరాత్ లయన్స్‌కు ఘనమైన ఆరంభం లభించింది. ముందు బౌలింగ్‌లో ఆ తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగిన ఆ జట్టు లీగ్‌లో విజయంతో బోణీ చేసింది. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ అయిన రైనా, ఇప్పుడు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. వోహ్రా, మురళీ విజయ్‌ల శుభారంభం తర్వాత పంజాబ్‌ను లయన్స్ బౌలర్లు కట్టడి చేశారు. ‘చాంపియన్’ బ్రేవో రెండు ఓవర్లలో రెండేసి వికెట్లు తీసి పంజాబ్‌ను దెబ్బతీయగా... ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఫించ్ మెరుపులు, చివర్లో దినేశ్ కార్తీక్ దూకుడు గుజరాత్‌ను గెలిపించాయి. మొహాలి: ఐపీఎల్లో మొదటిసారి బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ జట్టు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో లయన్స్ 5 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. మురళీ విజయ్ (34 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), మనన్ వోహ్రా (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. బ్రేవో 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం గుజరాత్ లయన్స్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ ఫించ్ (47 బంతుల్లో 74; 12 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, దినేశ్ కార్తీక్ (26 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఫించ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం లభించింది. ఆకట్టుకున్న ఓపెనర్లు.. ఓపెనర్లు విజయ్, వోహ్రా దూకుడుగా ఆడి కింగ్స్ ఎలెవన్‌కు శుభారంభం అందించారు. ఫాల్క్‌నర్ వేసిన ఓవర్లో వోహ్రా మూడు ఫోర్లు బాదడంతో జోరు పెరిగింది. అదే ఓవర్లో బ్రేవో క్యాచ్ వదిలేయడంతో వోహ్రా బతికిపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ కోల్పోకుండా 52 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు విజయ్, వోహ్రా 50 బంతుల్లో 78 పరుగులు జోడించిన అనంతరం జడేజా ఈ జోడీని విడదీశాడు. వోహ్రా, కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో పంజాబ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే విజయ్ను కూడా జడేజా బౌల్డ్ చేశాడు. ఈ రెండు వికెట్ల తర్వాత లయన్స్ ఆధిపత్యం ప్రదర్శించింది. బ్రేవో తన రెండో ఓవర్లో చెలరేగి రెండు కీలక వికెట్లు తీశాడు. అతని స్లో బంతులకు మ్యాక్స్‌వెల్ (2), మిల్లర్ (15; 1 ఫోర్, 1 సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ దశలో స్టొయినిస్ (22 బంతుల్లో 33; 4 ఫోర్లు), సాహా (25 బంతుల్లో 20) పంజాబ్‌ను ఆదుకున్నారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు ఐదో వికెట్‌కు 45 బంతుల్లో 55 పరుగులు జత చేశారు. చివరి ఓవర్లో బ్రేవో మళ్లీ సత్తా చాటి సాహా, స్టొయినిస్‌లను పెవిలియన్ పంపించాడు. కీలక భాగస్వామ్యాలు... తొలి ఓవర్లోనే గుజరాత్‌కు షాక్ తగిలింది. సందీప్ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన మెకల్లమ్ (0) స్టంపౌటయ్యాడు. అయితే ఫించ్ దూకుడుగా ఆడగా, ఉన్న కొద్దిసేపు రైనా (9 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిని ప్రదర్శించడంతో జట్టు ఇన్నింగ్స్‌లో వేగం తగ్గలేదు. వీరిద్దరు రెండో వికెట్‌కు 27 బంతుల్లోనే 51 పరుగులు జోడించడం విశేషం. రైనా వెనుదిరిగినా... మరో ఎండ్‌లో ఫించ్ 32 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి దినేశ్ కార్తీక్ అండగా నిలిచాడు. ఫించ్, కార్తీక్ 38 బంతుల్లోనే 65 పరుగులు జత చేశారు. ఈ దశలో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఫించ్ స్టంపౌట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత జడేజా (8) రనౌట్‌తో పాటు, కిషన్ (11) వెనుదిరగడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా మరో 14 బంతులు మిగిలి ఉండగానే కార్తీక్ మ్యాచ్‌ను ముగించాడు. ►1 బ్రెండన్ మెకల్లమ్ 42 ఇన్నింగ్స్‌ల తర్వాత ఐపీఎల్లో మరోసారి డకౌట్ అయ్యాడు. తొలి నాలుగు సీజన్లలో మెకల్లమ్ 35 ఇన్నింగ్స్‌లో నాలుగుసార్లు డకౌట్ అయ్యాడు ► 4/22 ఐపీఎల్లో డ్వేన్ బ్రేవో తన వ్యక్తిగత ఉత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. ► 300 టి20 క్రికెట్లో డ్వేన్ బ్రేవో 300 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందాడు. 299 వికెట్లతో మలింగ రెండో స్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ (బి) జడేజా 42; వోహ్రా (సి) కార్తీక్ (బి) జడేజా 38; మిల్లర్ (బి) బ్రేవో 15; మ్యాక్స్‌వెల్ (బి) బ్రేవో 2; సాహా (సి) జడేజా (బి) బ్రేవో 20; స్టొయినిస్ (సి) ఫించ్ (బి) బ్రేవో 33; అక్షర్ పటేల్ (నాటౌట్) 4; జాన్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-78; 2-91; 3-101; 4-102; 5-157; 6-157. బౌలింగ్: ప్రవీణ్ 4-0-25-0; సాంగ్వాన్ 2-0-21-0; ఫాల్క్‌నర్ 4-0-39-0; లడ్డా 2-0-21-0; జడేజా 4-0-30-2; బ్రేవో 4-0-22-4. గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: ఫించ్ (స్టంప్డ్) సాహా (బి) సాహూ 74; మెకల్లమ్ (స్టంప్డ్) సాహా (బి) సం దీప్ 0; రైనా (సి) జాన్సన్ (బి) స్టొయినిస్ 20; కార్తీక్ (నాటౌట్) 41; జడేజా (రనౌట్) 8; ఇషాన్ కిషన్ (సి) శర్మ (బి) జాన్సన్ 11; బ్రేవో (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1-1; 2-52; 3-117; 4-133; 5-151. బౌలింగ్: సందీప్ 3-0-21-1; జాన్సన్ 4-0-35-1; మోహిత్ 2.4-0-24-0; స్టొయినిస్ 2-0-27-1; అక్షర్ పటేల్ 2-0-17-0; సాహూ 4-0-35-1. -
మ్యాచ్‌లు తరలించడం పరిష్కారం కాదు: ధోని
మహారాష్ట్రలో తీవ్ర కరవు, నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మ్యాచ్‌లు తరలించడం సమస్యకు పరిష్కారం కాదని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోని అన్నాడు. నీటి ఎద్దడికి దీర్ఘకాల, శాశ్వత పరిష్కారం కావాలన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌కు చివర్లో బౌలింగ్ ఇవ్వడంపై ధోని వివరణ ఇచ్చాడు. అశ్విన్‌కు ఏ సమయంలో బంతి ఇచ్చినా అద్భుతంగా రాణించగలడని చెప్పాడు. గతంలో జట్టు కష్టకాలంలో ఉన్న సమయంలో అశ్విన్ చాలాసార్లు ఆదుకున్నాడని అన్నాడు. -
ఢిల్లీని చిత్తుచేసిన కోల్ కతా
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు సార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ తమ తొలి మ్యాచ్ లో శుభారంభం చేసింది. ఐపీఎల్ 9లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్ తో ఇక్కడ జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 99 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో ఛేదించింది. లక్ష్య ఛేదనకు దిగిన నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గౌతమ్ గంభీర్ (41 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు) నాటౌట్, మరో ఓపెనర్ రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 35; 7 ఫోర్లు) శుభారంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 69 పరుగులు జోడించిన తర్వాత ఉతప్ప ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(15)తో కలిసి మిగిలిన లాంఛనాన్ని పూర్తిచేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్ అమిత్ మిశ్రాకు ఒక వికెట్ దక్కింది. ఢిల్లీ తడబాటు: అంతకుముందు టాస్ గెలిచిన కోల్ కతా తొలుత ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్ కతాకు 99 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆది నుంచి తడబడింది. జట్టులో ఏ ఒక్క ఆటగాడు కనీసం పోరాట పటిమను ప్రదర్శించలేదు. డీ కాక్(17), మయాంక్ అగర్వాల్(9), సంజూ శ్యాంసన్(15), నేగీ(11), బ్రాత్ వైట్(6), క్రిస్ మోరిస్(11),అమిత్ మిశ్రా(3) , జహీర్ ఖాన్(4) ఇలా వరుసగా క్యూట్టడంతో ఢిల్లీ 17.4 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటయ్యింది. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్, బ్రాడ్ హాగ్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, పీయూష్ చావ్లా, హేస్టింగ్లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. -
నరైన్ ఈసారి మరింత మెరుగ్గా ఆడతాడు: గంభీర్
సందేహాస్పద బౌలింగ్ శైలిని సరిచేసుకొని నిషేధాన్ని తొలగించుకున్న తమ జట్టు స్పిన్నర్ సునీల్ నరైన్.. ఈసారి ఐపీఎల్లో మరింత మెరుగ్గా రాణిస్తాడని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. నిషేధం తొలగిపోవడంతో నరైన్‌పై ఎలాంటి ఒత్తిడి ఉండదని... ఈ పరిస్థితుల్లో అతని నుంచి అత్యుత్తమ ప్రదర్శన వస్తుందని గంభీర్ అన్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో 74 వికెట్లు తీసుకున్న నరైన్ 2012, 2014లలో కోల్‌కతాకు టైటిల్ దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. -
అవును.. అంబానీయే...
బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పక్కన నిలబడి ఉన్న బక్కపల్చని వ్యక్తిని గుర్తుపట్టారా..? ప్రతీ ఐపీఎల్ సీజన్లోనూ ఇతను క్రమం తప్పకుండా ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ల సమయంలో దర్శనమిస్తూనే ఉంటాడు.. గుర్తుపట్టలేకపోతే ఓసారి పక్క ఫొటో వైపు లుక్కేయండి.. అవును.. అతడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీయే.. 140 కేజీల అధిక బరువుతో ఉండే అతను ఇటీవలే ఇలా స్లిమ్ అండ్ ట్రిమ్గా మారిపోయి 70 కేజీలకు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. -
ఐపీఎల్ మ్యాచ్ లకు నీళ్లివ్వం: సీఎం ఫడ్నవిస్
ముంబై: ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న తీవ్ర కరువు.. గడిచిన వందేళ్లలో కనీవినీ ఎరుగనిది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ లకు నీటి సరఫరా విషయమై కొద్ది కాలంగా నెలకొన్న సందిగ్ధతకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం తరఫును ముక్తాయింపునిచ్చారు. శుక్రవారం ముంబైలో మీడియాతో మాట్లాడిన ఆయన ఐపీఎల్ మ్యాచ్ లకు చుక్కనీరు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. 'ఐపీఎల్ మ్యాచ్ లకు మా ప్రభుత్వం నీళ్లిచ్చేదిలేదు. ఇదే వాదనను హైకోర్టులోనూ బలంగా వినిపించాం. నీళ్లివ్వని కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లు మహారాష్ట్ర నుంచి తరలిపోతే మాకేమీ అభ్యంతరం లేదు' అని సీఎం ఫడ్నవిస్ పేర్కొన్నారు. తీవ్రదుర్భిక్షంలో ఐపీఎల్ మ్యాచ్ ల కోసం నీటిని వృధా చేయరాదని, మ్యాచ్ లను తరలించేలా ఆదేశాలు జారీచేయాలని బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. పిల్ ను విచారించిన కోర్టు.. శనివారం ముంబైలో జరగాల్సిన మొదటి మ్యాచ్ కు మాత్రం అనుమతి మంజూరుచేస్తూ మిగతా మ్యాచ్ ల వ్యవహారంపై వాదనలను ఈ నెల 12కు వాయిదావేసింది.ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం ముంబై, పుణె, నాగ్పూర్ల్లో 19 మ్యాచ్‌లు జరగాల్సివుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు ఈ నెల 9న ఆరంభమవుతాయి.