‘ఫిక్సింగ్‌ను ఎవరూ ఆపలేరు’ | "Nobody was able to stop Fixing | Sakshi
Sakshi News home page

‘ఫిక్సింగ్‌ను ఎవరూ ఆపలేరు’

Published Fri, May 6 2016 12:36 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 PM

"Nobody was able to stop Fixing

న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్‌ను అరికట్టేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వ్యక్తిగతంగా ఆయా ఆటగాడి నైతికత కీలకమవుతుందని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘అధికారులు ఈ జాడ్యాన్ని నిరోధించేందుకు వీలైనంత మేరకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి గదికి వెళ్లి నీవు ఫలానా వ్యక్తితో మాట్లాడకు అని చెప్పే వీలుండదు.

ఇదంతా వారి వ్యక్తిగత కట్టుబాటుపై ఆధారపడి ఉంటుంది. తప్పు చేయాలని అతడు అనుకుంటే ఎవరూ ఆపలేరు. నన్నెవరూ ఫిక్సింగ్ కోసం సంప్రదించలేదు. భవిష్యత్‌లోనూ అది జరగదు’ అని కోహ్లి స్పష్టం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement