Match-fixing
-
2011 వరల్డ్‌కప్‌ను భారత్‌కు అమ్మేశారు..
కొలంబో : 2011లో జరిగిన వన్డే క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయినట్లు శ్రీలంక మాజీ క్రీడాశాఖ మంత్రి మహిందానంద అలత్గమగే సంచలన ఆరోపణలు చేశారు. శ్రీలంకతో జరిగిన తుదిపోరులో ధోని నేతృత్వంలోని టీమిండియా వరల్డ్‌కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మరో పది బంతులు మిగిలి ఉండగానే టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని చేజిక్కించుకుంది. ఆ సమయంలో శ్రీలంక క్రీడా మంత్రిగా మహిందానంద ఉన్నారు. మహిందానంద 2010 నుంచి 2015 వరకు క్రీడా శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధనం-విద్యుత్ శాఖలో రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. (మళ్లీ జట్టులోకి క్రికెటర్ శ్రీశాంత్) ‘2011 వరల్డ్ కప్ మేము గెలవాల్సి ఉంది. కానీ, మ్యాచ్‌ను భారత్‌కు శ్రీలంకకు అమ్మేసింది. ఇన్నాళ్లు దేశం మేలు కోసం ఈ విషయం చెప్పలేదు. కానీ ఇప్పుడు నా బాధ్యతగా ఈ విషయాన్ని బయటపెడుతున్నా. ఆటగాళ్లను ఈ వ్యవహారంతో ముడిపెట్టడంలేదు. కొన్ని వర్గాలు దీని కోసం పని చేశాయి. నేనేం చెబుతాన్నానో దానికి కట్టుబడి ఉంటా’ అని తాజాగా శ్రీలంకకు చెందిన సిరాస టీవీతో మాట్లాడుతూ మహిందానంద సంచలన అరోపణలు చేశారు. (సచిన్ కెప్టెన్సీ వైఫల్యంపై మదన్‌లాల్ కామెంట్స్) ఇక ఇంతకు ముందే శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయిందని ఆరోపించాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ ఫైనల్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడం తనను విస్మయపరిచిందని పేర్కొన్నాడు. ‘అప్పుడు నేను వ్యాఖ్యాతగా భారత్‌లోనే ఉన్నాను. ఆ ఓటమి నన్నెంతో వేదనకు గురిచేసింది. ఆ ఓటమిపై అప్పట్లోనే నాకు అనుమానం వచ్చింది. 2011 ఫైనల్లో శ్రీలంక ఆడిన తీరుపై మనం విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది' అని అప్పట్లో రణతుంగ వ్యాఖ్యానించాడు. 2011 వరల్డ్‌కప్ ఫైనల్‌పై గతంలో మరో శ్రీలంక క్రీడా మంత్రి దయాసిరి జయశేఖర కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. 2017లో మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ లేవనెత్తిన అంశాల ఆధారంగా ఆ వరల్డ్‌కప్ ఫిక్సింగ్పై విచారణ చేపట్టాలనుకుంటున్నట్లు దయాసిరి తెలిపారు. రణతుంగ ఆరోపణలు పనికిమాలినవిగా నాటి వరల్డ్‌కప్ భారత జట్టు సభ్యులు గౌతమ్ గంభీర్, ఆశీష్ నెహ్రా అప్పట్లోనే కొట్టిపారేశారు. అతడి ఆరోపణలకు ఆధారాలు చూపాలని సవాల్ కూడా విసిరారు.(అవన్నీ తప్పుడు వార్తలు: ఆఫ్రిది) రుజువులు చూపండి: మాజీ కెప్టెన్లు 2011 వరల్డ్‌కప్‌ను భారత్‌కు అమ్మేశారంటూ మహిందానంద చేసిన ఆరోపణలను మాజీ కెప్టెన్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనే తోసిపుచ్చారు. మహిందానంద చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని ట్విటర్లో డిమాండ్ చేశారు. -
బ్యాడ్మింటన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్
కౌలాలంపూర్: మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలడంతో ఇద్దరు మలేసియా బ్యాడ్మింటన్ ఆటగాళ్లపై కెరీర్ ముగిసే విధంగా నిషేధం విధించారు. 31 ఏళ్ల తన్ చన్ సియాంగ్, మాజీ జూనియర్ ప్రపంచ చాంపియన్ 25 ఏళ్ల జుల్ఫాద్లి జుల్కిఫ్లిలు 2013 నుంచి క్రమం తప్పకుండా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు స్వతంత్ర దర్యాప్తు బృందం విచారణలో తేలింది. దీంతో సియాంగ్‌పై 15 ఏళ్లు, జుల్ఫాద్లిపై 20 ఏళ్లు నిషేధం విధించారు. దీంతో వాళ్ల కెరీర్‌కు పూర్తిగా తెరపడింది. వాళ్లు ఈ నిషేధ కాలంలో ఆటతో పాటు పరిపాలన, కోచింగ్, అధికారి, అభివృద్ధి పాత్రలకు కూడా దూరంగా ఉండాల్సిందేనని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) స్పష్టం చేసింది. బ్యాడ్మింటన్ చరిత్రలో ఫిక్సింగ్ ఉదంతంలో శిక్ష పడటం ఇదే తొలిసారి. బీడబ్ల్యూఎఫ్ నైతిక విలువల కమిటీ సియాంగ్కు రూ. 10 లక్షలు (15 వేల డాలర్లు), జుల్ఫాద్లికి రూ. 16.70 లక్షలు (25వేల డాలర్లు) జరిమానాగా విధించింది. -
ఫిక్సింగ్ కేసులో ఇద్దరి అరెస్ట్
లండన్: పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బయటపడిన మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను లండన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. వీరిపై విచారణ కొనసాగుతోందని పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఫిక్సింగ్‌కు సంబంధించి పాక్ బోర్డు ఇప్పటికే ముగ్గురు క్రికెటర్లు షర్జీల్ ఖాన్, ఖాలిద్ లతీఫ్, నాసిర్ జంషెద్లను సస్పెండ్ చేసింది. -
అల్విరో పీటర్సన్ మ్యాచ్ ఫిక్సర్
దర్యాప్తు సాగుతుందన్న దక్షిణాఫ్రికా బోర్డు జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అల్విరో పీటర్సన్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) వెల్లడించింది. 35 ఏళ్ల పీటర్సన్పై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. దేశవాళీ ఫ్రాంచైజీ టోర్నీలో హైవెల్డ్ లయన్సకు కెప్టెన్‌గా వ్యవహరించిన పీటర్సన్ మ్యాచ్ ఫిక్సర్ అని... 2015లో జరిగిన రామ్‌స్లామ్ టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని సీఎస్ఏ తెలిపింది. అతనిపై ప్రొవిజనల్ సస్పెన్షన్ విధించామని, 14 రోజుల్లోగా స్పందించాలని నోటీసు కూడా జారీ చేశామని సీఎస్ఏ తెలిపింది. 2015లో పీటర్సన్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిక్సింగ్పై కఠినంగా వ్యవహరిస్తోన్న సీఎస్ఏ ఇప్పటికే గులామ్ బొడి, జియాన్ సైమ్స్, మత్సిక్వె, ఎతీ ఎంబలాటి, సొలెకిలేలపై నిషేధం విధించింది. వీరంతా రామ్ స్లామ్ టోర్నీలో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలొచ్చారుు. -
కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించను: మెకల్లమ్
వెల్లింగ్టన్: తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి అప్రతిష్టపాలు చేసిన క్రిస్ కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించనని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ తేల్చి చెప్పాడు. 2008లో మ్యాచ్‌ను ఫిక్స్ చేస్తే భారీగా డబ్బులు అందుతాయని మెకల్లమ్‌కు కెయిన్స్ ఆశ చూపాడు. అరుుతే ఈ ఆఫర్‌ను తిరస్కరించిన తను 2011లో ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్‌కు సమాచారమందించాడు. అలాగే గతేడాది లండన్ కోర్టులో కెయిన్స్ పై జరిగిన విచారణలో మెకల్లమ్ సాక్షిగా హాజరయ్యాడు. ‘నేను చాలా జాలిగుణం కలిగిన వ్యక్తిని. నిజానికి తను జైలుకెళ్లవద్దనే కోరుకున్నాను. కానీ మరో రకంగా మాత్రం కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించను. నన్ను చెడుగా చిత్రీకరించేందుకు తను పెద్ద ఎత్తున లాబీరుుంగ్ చేసి ఒత్తిడి తీసుకువచ్చాడు. అరుుతే ఇప్పుడు ఎవరి జీవితం వారిది. మేమెప్పుడూ కలుసుకోకూడదనే అనుకుంటున్నాను’ అని మెకల్లమ్ చెప్పాడు. -
1996లో మాది ఫిక్సింగ్ రూమ్
షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్య కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌కు, మ్యాచ్ ఫిక్సింగ్‌కు అవినాభావ సంబంధం ఉందని మరోసారి తేలిపోయింది. 1996 సమయంలో తమ డ్రెస్సింగ్ రూమ్ ఓ ఫిక్సింగ్ రూమ్‌లా కనిపించేదని షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్య చేశాడు. ‘అప్పట్లో మా డ్రెస్సింగ్ రూమ్‌లో క్రికెట్ కంటే ఫిక్సింగ్‌కు సంబంధించిన ముచ్చట్లే ఎక్కువగా వినిపించేవి. 1996 సమయంలో ఫిక్సర్లు మా జట్టును శాసించారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అధ్వానంగా ఉండేది’ అని అక్తర్ చెప్పాడు. 1999 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ క్రికెటర్లంతా స్థాయికి తగ్గట్లుగా ఆడి ఉంటే టైటిల్ గెలిచేవాళ్లమని వ్యాఖ్యానించాడు. ఫిక్సింగ్‌కు దూరంగా ఉండాలని ఆమిర్‌కు తాను 2010లో సూచించానని, అదే ఏడాది అతను ఇంగ్లండ్‌తో స్పాట్ ఫిక్సింగ్ చేసి దొరికిపోయాడని చెప్పాడు. -
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 1996లో అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ తారస్థాయికి చేరుకుందని వెల్లడించాడు. పాకిస్థాన్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్ అపరిచితులతో నిండిఉండేదని, అత్యంత చెత్తగా ఉండేదని అక్తర్ బాంబు పేల్చాడు. కాగా ఫిక్సింగ్ ముఠాకు తానెప్పుడూ దూరంగా ఉండేవాడినని చెప్పాడు. ఇలాంటి వ్యవహారాలకు దూరంగా ఉండాలని, నిబద్ధతతో క్రికెట్ ఆడాలని ఇతర క్రికెటర్లకు సలహా ఇచ్చేవాడినని అక్తర్ వెల్లడించాడు. పాకిస్థాన్‌కు చెందిన ఓ టీవీ ఛానెల్ ఈ విషయాలను ప్రసారం చేసింది. 2010లో ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ ఆమిర్‌ను కూడా అప్పట్లో హెచ్చరించినట్టు అక్తర్ తెలిపాడు. ఫిక్సింగ్ వ్యవహారాలతో సంబంధమున్న ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సిందిగా ఆమిర్‌కు చెప్పినట్టు వెల్లడించాడు. కాగా ఐదేళ్లు నిషేధానికి గురైన ఆమిర్ గతేడాది మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇటీవల బహిరంగంగా తీవ్ర స్థాయిలో విమర్శించుకున్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు జావేద్ మియాందాద్, షాహిద్ అఫ్రిదీ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని అక్తర్ సూచించాడు. అఫ్రిదీ డబ్బుల కోసం మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేసేవాడని మియాందాద్ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
'అఫ్రిది ఓ దొంగ.. దేశాన్ని అమ్మేశాడు'
కరాచి: 'షాహిద్ అఫ్రిది ఓ దొంగ(Afridi is a son of a thief).. కాసుల కోసం దేశాన్ని అమ్మేసిన దుర్మార్గుడు..' అంటూ పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ జావెద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం కరాచీలో మీడియాతో మాట్లాడిన మియాందాద్.. ఓసారి మ్యాచ్ ఫిక్సింగ్ డబ్బులు తీసుకుంటూ అఫ్రిది తనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని, ఒకవేళ నేను చెప్పింది నిజం కాదంటే అఫ్రిది తన కూతురి మీది ఒట్టేసి చెప్పాలని అన్నారు. (అఫ్రిదికి వీడ్కోలు మ్యాచ్ లేదు..) అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదాపు రిటైర్ అయిన అఫ్రిది.. వీడ్కోలు మ్యాచ్ ఆడలేకపోవడం బాధకలిగించిందని కొద్ది రోజుల కిందట వ్యాఖ్యానించాడు. కొద్ది గంటలకే అఫ్రిది బాధపై స్పందించిన మియాందాద్.. 'డబ్బుల కోసమే అతను చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నాడు'అని కామెంట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా జగడం ముదిరినట్లైంది. శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన అఫ్రిది.. జావెద్ మియాందాద్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. 'మియాందాద్ గొప్ప క్రికెటర్. ఆయన ఇలాంటి చత్త వ్యాఖ్యలు చేస్తాడని ఊహించలేదు. అందుకే ఎంత ఆట తెలిసినా మియాందాద్.. ఇమ్రాన్ ఖాన్ లాగా మంచిపేరు సంపాదించుకోలేక పోయాడు' అని అఫ్రిది అన్నాడు. ఆ మరుసటి రోజే(ఆదివారం) ప్రెస్ మీట్ పెట్టిన మియాందాద్ గతాన్ని తోడుతూ అఫ్రిదీని తిట్టిపోశాడు. (సర్జికల్ స్ట్రైక్స్ పై షాహిద్ అఫ్రిది స్పందన) -
అలాంటి వారివల్ల ఫిక్సింగ్‌ను ఆపలేం
డబ్బు ఇస్తే ఏ పనైనా చేసేవారు క్రికెట్లోనూ ఉంటారని, అలాంటి వారి వల్ల ఫిక్సింగ్‌ను ఆపడం కష్టమవుతుందని దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. అరుుతే ఇప్పటివరకూ ఎవరూ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనను సంప్రదించలేదని, అలాంటి సంఘటన ఎదురైతే వెంటనే వారిని అధికారులకు అప్పగిస్తానని చెప్పాడు. ఓ క్రికెటర్‌తో ఆడిన తర్వాత అతను ఫిక్సర్ అని తేలితే అలాంటి వారిని తలచుకోవడానికే తనకు అసహ్యంగా ఉంటుందని డివిలియర్స్ అన్నాడు. -
‘ఫిక్సింగ్‌ను ఎవరూ ఆపలేరు’
న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్‌ను అరికట్టేందుకు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వ్యక్తిగతంగా ఆయా ఆటగాడి నైతికత కీలకమవుతుందని భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ‘అధికారులు ఈ జాడ్యాన్ని నిరోధించేందుకు వీలైనంత మేరకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి గదికి వెళ్లి నీవు ఫలానా వ్యక్తితో మాట్లాడకు అని చెప్పే వీలుండదు. ఇదంతా వారి వ్యక్తిగత కట్టుబాటుపై ఆధారపడి ఉంటుంది. తప్పు చేయాలని అతడు అనుకుంటే ఎవరూ ఆపలేరు. నన్నెవరూ ఫిక్సింగ్ కోసం సంప్రదించలేదు. భవిష్యత్‌లోనూ అది జరగదు’ అని కోహ్లి స్పష్టం చేశాడు. -
బిగ్‌బాష్‌లో గేల్ కొనసాగొచ్చు: సీఏ
మెల్బోర్న్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తమ బిగ్‌బాష్ టి20 లీగ్‌లో కొనసాగవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపింది. గత సీజన్ సందర్భంగా గేల్ ఓ మహిళా రిపోర్టర్‌తో అనుచితంగా ప్రవర్తించడంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. 10 వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. సీఏ నిబంధనల ప్రకారం తాము నడుచుకుంటామని, మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతి అరోపణలు ఎదుర్కొనే ఆటగాడిని నిరోధించగలమని... ఇతరత్రా కారణాలతో నిషేధించలేమని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. బిగ్‌బాష్, దేశవాళీ క్రికెట్లో ఆడొద్దని ఎవరు పడితే వారు నిర్ణయించలేరని సదర్లాండ్ చెప్పారు. దీనిపై అతను ప్రాతినిధ్యం వహించే మెల్బోర్న్ రెనెగేడ్స్ తేల్చాల్సి వుంటుందని ఆయన చెప్పారు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌లపై నిఘా
నిశితంగా పరిశీలిస్తున్న నిర్వాహకులు మెల్బోర్న్: మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలు తమను సంప్రదించారని చాలా మంది ఆటగాళ్లు చెబుతున్న నేపథ్యంలో... సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌లపై నిర్వాహకులు నిఘా పెంచారు. ప్రతి మ్యాచ్‌ను నిశితంగా పరిశీలించడంతో పాటు అనుమానం ఉన్న ఫలితాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టిపెట్టారని ఆసీస్ మీడియా తెలిపింది. టాప్-50 ర్యాంక్‌ల్లో ఉన్న 16 మంది ఆటగాళ్లు తరచుగా ఫిక్సింగ్ చేసేవారని బీబీసీ, బజ్‌ఫీడ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో సగం మంది ప్లేయర్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ ఆడుతున్నారని తేలడంతో నిర్వాహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆధారాలను తాము తొక్కిపెట్టడం లేదని ప్రకటించిన టెన్నిస్ నిర్వాహకులు.. ఆట సమగ్రతను కాపాడటానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. పారదర్శకత ఉండాలి: ముర్రే అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో పారదర్శకత ఉండాలని బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే నిర్వాహకులపై మండిపడ్డాడు. బెట్టింగ్ కంపెనీలు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్పాన్సర్‌గా ఉండటాన్ని తప్పుబట్టాడు. ఆస్ట్రేలియా ఆటగాడు కొకినాకిస్, బ్రిటన్ మాజీ ఆటగాడు పర్మర్ కూడా గతంలో బుకీలు తమని సంప్రదించినట్లు చెప్పారు. -
గేమ్...సెట్... మ్యాచ్ ‘ఫిక్స్’!
♦ టెన్నిస్‌లో ఫిక్సింగ్ కలకలం ♦ స్టార్ ఆటగాళ్లూ ‘భాగస్వాములే’ ♦ సంచలనం రేపుతున్న కథనం మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కి అంతా సిద్ధమైన వేళ టెన్నిస్ ప్రపంచాన్ని నివ్వెరపరిచే కొత్త అంశాలు బయటికి వచ్చాయి. టెన్నిస్‌లో యథేచ్ఛగా మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతోందని, దీనికి స్టార్ ఆటగాళ్లు కూడా మినహాయింపు కాదని ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ తమ పరిశోధన అనంతరం వెల్లడించింది. ఫిక్సింగ్‌కు సంబంధించి ఫైల్స్ రూపంలో రుజువులు కూడా బయటపడ్డట్లు సమాచారం. టాప్-50 ర్యాంకుల్లో ఉన్న 16 మంది స్టార్ ఆటగాళ్లు గత పదేళ్లలో తరచుగా ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, వీరిలో ఎనిమిది మంది ఈ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా ఆడుతున్నారని ప్రకటించడం సంచలనం రేపింది. గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఆటగాళ్లకు కూడా ఫిక్సింగ్‌లో భాగం ఉందని చెప్పడం ఒక్కసారిగా టెన్నిస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫలానా ఆటగాళ్లపై అనుమానం ఉన్నట్లు ఏటీపీకి సమాచారం ఉన్నా... వారు ఈ 16 మందిలో కనీసం ఒక్కరిని కూడా హెచ్చరించలేదనేది కూడా ఈ వివాదంలో మరో అంశం. అవినీతి వ్యతిరేక విభాగమైన టెన్నిస్ ఇంటెగ్రిటీ యూనిట్ (టీఐయూ) చేతకానితనంగా కూడా దీనిని విమర్శకులు అభివర్ణిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ ‘ఇన్నేళ్ళలో ఏ కారణంగా కూడా ఫిక్సర్లను తప్పించే ప్రయత్నం చేయలేదు. బీబీసీ చెప్పిన అంశాలు గత పదేళ్లకు సంబంధించినవి. కొత్తగా ఏదైనా వస్తే అప్పుడు విచారిస్తాం’ అని ఏటీపీ హెచ్ క్రిస్ కెర్మోడ్ స్పష్టం చేశారు. బీబీసీ బయటపెట్టిన వివరాలు 26 వేల టెన్నిస్ మ్యాచ్‌లను విశ్లేషించిన అనంతరం అంతర్గత సమాచారాన్ని బట్టి ఈ దర్యాప్తు సాగింది. 16 మంది స్టార్ ఆటగాళ్లు తరచుగా తాము సునాయాసంగా గెలుస్తారనుకున్న మ్యాచ్‌లను చేతులారా ఓడి బెట్టింగ్‌రాయుళ్లకు సహకరించారు. వేయి మ్యాచ్‌లకు ఒకసారి కూడా సాధ్యం కాని ఫలితంపై కూడా బుకీలు పందాలు కాసి భారీ సొమ్ము గెలుచుకోవడం విశేషం. ఈ జాబితాలో ఒక యూఎస్ ఓపెన్ విజేత, వింబుల్డన్ డబుల్స్ విజేత కూడా ఉన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న ఒక ఆటగాడు తన తొలి సెట్‌ను ఫిక్స్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. హోటల్ రూమ్‌ల వద్ద ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకునే బుకీలు...కనీసం 50 వేల డాలర్ల ఎరతో ఫిక్సింగ్‌ను ప్రారంభిస్తున్నారు. ఫిక్సర్లుగా బయటపడ్డవారి వద్ద 70కి పైగా ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. రష్యా, ఇటలీ కేంద్రాలుగా ఫిక్సింగ్ గ్యాంబ్లర్లు ఎక్కువగా ఉన్నారు. ఇన్నేళ్లలో వీరు వేల కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. 2007లో రష్యాలో జరిగిన ఒక టోర్నీలో తొలి రౌండ్ మ్యాచ్ ఓడితే లక్షా 10 వేల పౌండ్లు ఇస్తామని ఆశజూపారు. నా సహాయక సిబ్బందిలో ఒక వ్యక్తి ద్వారానే నన్ను లాగే ప్రయత్నం చేశారు. అయితే దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించా. నేను ఆ టోర్నీ కూడా ఆడలేదు. ఆ ఘటన నన్ను ఒక రకంగా భయపెట్టింది. అలాంటి విషయాలకు దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఇలాంటి నేరాన్ని నేను సమర్థించను. -జొకోవిచ్, ప్రపంచ నంబర్‌వన్ సదరు ఆటగాళ్ల పేర్లు బయటికి రావాలని నేనూ కోరుకుంటున్నా. అతడు సింగిల్స్ ఆటగాడా, డబుల్స్ ఆటగాడా, ఏ గ్రాండ్‌స్లామ్ గెలిచాడు నేనూ తెలుసుకోవాలనుకుంటున్నా. అప్పుడైనా వాస్తవం ఏమిటో అందరికీ తెలుస్తుంది. దానిపైనే మనం చర్చ కొనసాగించవచ్చు. వెంటనే పరిష్కరించాల్సిన సమస్య ఇది. -ఫెడరర్ నాకు ఫిక్సింగ్ గురించి అసలేం తెలీదు. నేను ఆడుతున్నప్పుడు తీవ్రంగా శ్రమిస్తాను. గెలుపుపైనే దృష్టి పెడతా. ఎప్పుడైనా నా ప్రత్యర్థులు కూడా అదే తరహాలో ఆడారనే భావిస్తున్నా. -సెరెనా విలియమ్స్ -
బుకీల గెంటివేత
ఢాకా: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ను ఈసారి ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్‌లకు ఆస్కారం లేకుండా జరిపేందుకు నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంట్లో భాగంగా నలుగురు బుకీలను స్టేడియం నుంచి బయటకు పంపేశారు. ‘అనుమానాస్పదంగా కనిపిస్తున్న నలుగురు బుకీలను అవినీతి వ్యతిరేక యూనిట్ అధికారులు గుర్తించారు. చట్ట ప్రకారం వారిని జైలుకు తరలించే అధికారం మాకు లేదు. కాబట్టి బయటకు పంపాం’ అని బీపీఎల్ కార్యదర్శి ఇస్మాయిల్ హైదర్ మాలిక్ తెలిపారు. -
బాంబు పేల్చిన మెక్ కల్లమ్
లండన్: న్యూజిలాండ్ క్రికెట్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ బాంబు పేల్చాడు. తనను మ్యాచ్ ఫిక్సింగ్ లోకి లాగేందుకు ప్రయత్నం జరిగిందని కోర్టుకు వెల్లడించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని తన మాజీ సహచరుడు క్రిస్ కెయిన్ప్ తనను అడిగాడని తెలిపాడు. 2008, ఏప్రిల్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సందర్భంగా కోల్ కతా లోని ఓ హోటల్ లో కలిసినప్పుడు తనను ఫిక్సింగ్ లోకి లాగేందుకు కెయిన్స్ ప్రయత్నించాడని, అయితే అతడి ప్రతిపాదనకు తాను ఒప్పుకోలేదని లండన్ కోర్టులో వెల్లడించాడు. కెయిన్స్ ప్రతిపాదనతో తాను షాక్ కు గురయ్యానని చెప్పాడు. ఫిక్సింగ్ చేయాలని అదే ఏడాది రెండుసార్లు తనను కెయిన్స్ కోరాడని తెలిపాడు. స్పాట్ ఫిక్సింగ్ గురించి పేపర్ పై రాసి మరీ వివరించాడన్నాడు. ఒక్కో స్పాట్ ఫిక్సింగ్ కు 70 వేల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఇస్తారని ఆశ పెట్టాడని వెల్లడించాడు. ఫిక్సింగ్ సొమ్ముతో కెయిన్స్ న్యూజిలాండ్ లో ఆస్తులు కూడబెట్టాడని తెలిపాడు. కెయిన్స్ వ్యవహారం గురించి 2011లో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు మెక్ కల్లమ్ చెప్పాడు. -
ఫిక్సింగ్ కలకలం!
టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌పై ఐసీసీ అనుమానం విచారణ జరపనున్న ఏసీఎస్‌యూ అఫ్ఘానిస్తాన్ జట్టుపై అనుమానాలు ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఎంత పటిష్టమైన ఏర్పాట్లు చేసినా ఫిక్సింగ్‌ను ఆపడం సాధ్యం కాదేమో. తాజాగా టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీలో అఫ్ఘానిస్తాన్ జట్టు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందనే అనుమానాలు వచ్చాయి. హాంకాంగ్‌తో ఈ జట్టు ఆడిన క్వాలిఫయర్ మ్యాచ్‌ను విచారించాలని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం నిర్ణయించింది. దుబాయ్: ప్రస్తుతం ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఐసీసీ టి20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టోర్నీకి ఇందులో నుంచి ఆరు జట్లు అర్హత సాధిస్తాయి. జులై 9 నుంచి 26 వరకు జరిగే ఈ టోర్నీలో మొ త్తం 14 జట్లు బరిలోకి దిగాయి. ఏడు జట్లు రెండేసి గ్రూప్‌లుగా ఆడాయి. రెండు గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచిన ఐర్లాండ్, స్కాట్లాండ్ నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన నాలుగు జట్లను తేల్చేం దుకు నాలుగు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు నిర్వహించాలి. ఇందులో భాగంగా మంగళవారం అఫ్ఘానిస్తాన్, హాంకాంగ్ తొలి మ్యాచ్ ఆడాయి. ఇందులో గెలిచిన హాంకాంగ్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం ఈ రెండు జట్లు గ్రూప్ దశలో రెండు, మూడు స్థానాల్లో నిలిచినందున... ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు కు మళ్లీ మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. మంగళవారం ఓడిపోయిన అఫ్ఘానిస్తాన్ జట్టు గురువారం జరిగే మ్యాచ్‌లో పపువా న్యూగినియా జట్టుతో ఆడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచినా భారత్‌కు వచ్చి ప్రపంచకప్ ఆడొచ్చు. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ తొలుత 161 పరుగులు చేసింది. హాంకాంగ్ ఆఖరి బంతికి రెండు పరుగులతో 162 లక్ష్యాన్ని ఛేదించి నెగ్గింది. చివరి ఓవర్లో హాంకాంగ్ ఏకంగా 16 పరుగులు సాధించింది. మామూలుగా మ్యాచ్ చూసిన వాళ్లకి ఇది అద్భుతమైన ఉత్కంఠతో సాగిన పోరు. కానీ ఐసీసీ అవినీతి నిరోధక, భద్రతా విభాగం అధికారులకు అనుమానం వచ్చింది. ఈ మ్యాచ్ కోసం బయట బెట్టింగ్‌లు సాగిన విధానం వల్ల వీరికి అనుమానం వచ్చింది. దీంతో బెట్టింగ్‌లు నిర్వహించే సంస్థలను సంప్రదించారు. బెట్‌ఫెయిర్ సహా ప్రముఖ బెట్టింగ్ సంస్థలన్నింటిలోనూ విచారణ సాగించనున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధిం చిన బెట్టింగ్ అసాధారణ రీతిలో సాగింది. ఫలితం ముందే తెలిసినట్లుగా పందేలు సాగాయి. -
బీజేపీ కాంగ్రెస్‌ల మ్యాచ్ ఫిక్సింగ్
పుదుచ్చేరి: సంస్కరణల పేరిట దేశ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు (కుమ్మక్కు) ఒడిగట్టాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ, బీమా సవరణ బిల్లు వంటివి పార్లమెంటులో పాసవుతున్న తీరే ఇందుకు నిదర్శనమన్నారు. బుధవారమిక్కడ అట్టహాసంగా ప్రారంభమైన సీపీఐ 22వ జాతీయ మహాసభలలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ఈ సభలకు పార్టీ కురువృద్ధుడు ఏబీ బర్దన్, రవీంద్రకుమారన్, ద్రుపద్ బర్గోయ్, అనీ రాజా, సీఎన్ జయదేవన్, విశ్వనాథన్, స్మితా పన్సారే, విశ్వజిత్, ఏఏ ఖాన్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. మహాసభలను సురవరం లాంఛనంగా ప్రారంభించారు. దేశ సహజ వనరులు, జాతి సంపదను కాపాడే శక్తియుక్తులు కమ్యూనిస్టులకే ఉన్నాయని ఆయన అన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను తిప్పికొట్టి బడుగు బలహీన వర్గాల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చేది వామపక్ష, ప్రజాతంత్ర శక్తులేనని చెప్పారు. కార్పొరేట్ శక్తుల అండదండలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ మతతత్వ శక్తుల చేతిలో పావుగా మారిందని ధ్వజమెత్తారు. ఘర్వాప్సీ పేరుతో అతివాద హిందూ సంస్థలు మైనారిటీ వ్యతిరేక ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నాయన్నారు. మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. బహుళజాతి సంస్థలు, విదేశీ పెట్టుబడిదారుల కోసం ప్రధాని నరేంద్రమోదీ నిద్రాహారాలు మాని పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకునే స్థితిలో లేకపోయాయని విమర్శించారు. విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాలలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీకి ఢిల్లీ ఎన్నికలు ఓ గుణపాఠం... ప్రభుత్వమే తాను, తానే ప్రభుత్వమన్న రీతిలో ప్రవర్తించిన ప్రధానమంత్రికి ఢిల్లీ ఎన్నికలు పెద్ద గుణపాఠమన్నారు. బీజేపీ ఆర్థిక, మతతత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారనడానికి నిదర్శనమే ఢిల్లీ ఎన్నికలన్నారు. అలాగే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తమకో పాఠమేనని అంగీకరించారు. అంతమాత్రాన వామపక్షాల నైతిక స్థైర్యమేమీ సడలలేదని చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను తామూ స్వీకరిస్తున్నామని, కచ్చితంగా అధిగమించటానికి వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యతే దీనికి సరైన వేదిక అన్నారు. -
ఫిల్మ్ ఆఫర్ పట్టుకెళ్లిపోయిన శ్రీ...
మ్యాచ్ ఫిక్సింగ్‌లో అడ్డంగా దొరికిపోయి... టీమిండియాలో ప్లేస్ కోల్పోయిన పేసర్ శ్రీశాంత్‌కు మాంచి ఆఫర్లే వస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్‌కు ఇలా వచ్చి అలా ఓ ఫిల్మ్ ఆఫర్ పట్టుకెళ్లిపోయిన శ్రీ... ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అదికూడా... మహేష్‌భట్ కుమార్తె పూజాభట్ ‘కాబరెట్’ మూవీలో. డ్యాన్సర్ పాత్ర పోషిస్తున్న రిచా చద్దాకు మలయాళీ మెంటార్‌గా ఈ చిన్నోడు చేస్తున్నాడు. ‘మొదట కాస్త పెద్దగా కనిపించేవారు కావాలనుకున్నా... శ్రీని చూసిన తరువాత అతడే ఇందుకు పర్ఫెక్ట్ అని డిసైడయ్యా. కెమెరా ముందు శ్రీకి బెరుకు కూడా లేదు’ అంటూ చెప్పుకొచ్చింది పూజాభట్. -
క్లినర్‌గా మారిన క్రిస్ కెయిన్స్
-
కెయిన్స్పై మరో కేసు
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్పై లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై వేసిన పరువు నష్టం దావా సందర్భంగా అతను అసత్యాలు చెప్పాడని పోలీసులు ఆరోపించారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు కెయిన్స్‌ను ఐపీఎల్‌లోకి తీసుకోలేదని మోడి చేసిన ఆరోపణలపై 2012లో కివీస్ క్రికెటర్ పరువు నష్టం దావా వేశాడు. ఈ విచారణలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని చెప్పిన కెయిన్స్... మడమ గాయం నుంచి సకాలంలో కోలుకోకపోవడంతో ఐసీఎల్ జట్టు చండీగఢ్ లయన్స్ తనపై వేటు వేసిందని వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కెయిన్స్ తరఫు లాయర్ ఆండ్రూ ఫిచ్ హోలాండ్... కోర్టుకు సమర్పించారు. దీన్ని విచారించిన లండన్ హైకోర్టు కెయిన్స్‌కు 90 వేల పౌండ్లు చెల్లించాలని తీర్చు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తనపై నమోదు చేసిన కేసు నిరాశ కలిగించినప్పటికీ అధికారులకు సహకరిస్తానని కెయిన్స్ తెలిపాడు. ‘యూకేలోని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాళ్లు నాపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈనెల 25న ఇది విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. నాపై ఉన్న ఆరోపణలను తొలగించుకోవడానికి మరో అవకాశం వచ్చింది. ఈ కేసు నుంచి బయటపడే వరకు పోరాడతా’ అని కెయిన్స్ పేర్కొన్నాడు. -
గుబులు రేపుతున్న తిరక్రాస్ ఓటింగ్!
సాక్షి ప్రతినిధి,విజయనగరం : బంధుత్వాలు, సన్నిహిత సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ, కాంగ్రెస్‌కు చెందిన నాయకులు క్రాస్ ఓటింగ్‌కు పిలుపునిచ్చారు. ఒకటి అటు, ఒకటి ఇటు అంటూ లోపాయికారిగా విస్తృతంగా ప్రచారం చేశారు. ఓటు వేయడానికి వెళ్లే ముందు కూడా ఓటర్లకు ఇదే చెప్పారు. మొత్తానికి ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో చాలాచోట్ల క్రాస్ ఓటింగ్ పడినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ ఈ క్రాస్ ఓటింగ్‌లో చాలా మంది తప్పులో కాలేసినట్టు తెలిసింది. పోలింగ్ బూత్‌లో ఎంపీకి ఒకటి, ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోడానికి మరొక ఈవీఎంను ఏర్పాటు చేశారు. క్రాస్ ఆలోచనలో తికమకకు గురై ఎంపీకి వేద్దామని ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యేకి వేద్దామనుకుని ఎంపీకి ఓటువేసిన వారు చాలామంది ఉన్నారు. బయటకొచ్చాక పక్కనున్న వారు చెప్పిన తర్వాత అసలు విషయాన్ని తెలుసుకుని నాలిక కరుచుకున్నారు. విజయనగరంలో మీసాల గీత అనుచరులు పలువురు ఎమ్మెల్యే ఓటు తమకి, ఎంపీ ఓటు బొత్స ఝాన్సీలక్ష్మీకి వేయాలని లోపాయికారీ పిలుపునివ్వడంతో పలువురు అదే తరహాలో ఓటేసినట్టు తెలిసింది. ఓటర్లు తడబడటంతో టీడీపీకీ రావాల్సిన ఓట్లు చాలావరకు ఆ పార్టీ కోల్పోయినట్టు సమాచారం. మీసాల గీత అనుచరుల నిర్వాకాన్ని పసిగట్టిన అశోక్ వర్గం టీడీపీ నాయకులు పలువురు అందుకు ప్రతీకారంగా ఎమ్మెల్యే ఓటు కోలగట్ల వీరభద్రస్వామికి, ఎంపీ ఓటు అశోక్‌గజపతిరాజుకు వేసినట్టు నగరంలో ఇప్పటికే విసృ్తతంగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నాయకులు కూడా లోపాయికారిగా క్రాస్ ఓటింగ్‌కు పిలుపునివ్వడంతో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యడ్ల రమణమూర్తికి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరంలో కూడా సామాజికవర్గం కోణంలో టీడీపీ నాయకులు పలువురు ఎంపీ ఓటు విషయంలో క్రాస్ ఓటింగ్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఇక్కడ కూడా అశోక్ గజపతిరాజు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. చాలా మంది ఎమ్మెల్యేకి వేయవలసిన ఓటు ఎంపీకి, ఎంపీకి వేయవలసిన ఓటు ఎమ్మెల్యేకి వేశారు. దీంతో ఆ రెండు పార్టీలు నష్టపోయాయి. ఇక, బొబ్బిలిలో టీడీపీ నాయకులు ఎంపీ ఓటును కాంగ్రెస్‌కు వేయాలని పిలుపునిచ్చినట్టు తెలిసింది. ఇక్కడ కూడా అశోక్ ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. సాలూరు టీడీపీలో పలువురు ఎమ్మెల్యే ఓటు రాజన్నదొరకు, ఎంపీ ఓటు సంధ్యారాణికి వేయాలని పిలుపునివ్వడంతో ఆ ప్రక్రియ గుట్టుగా జరిగిపోయింది. దీంతో భంజ్‌దేవ్‌కు నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. కురుపాం టీడీపీలో ఎంపీ ఓటు వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్‌కు వేయాలన్న లోపాయికారీ పిలుపుతో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అంచనాలు తలకిందులయ్యాయి. ఇదే తరహాలో కాంగ్రెస్‌లో కూడా క్రాస్ ఓటింగ్ జరగడంతో పరిస్థితి అయోమయంగా తయారైంది. క్రాస్ ఓటింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. క్రాస్ ఓటింగ్ పరిణామాల కారణంగా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయన్న ఇషయాన్ని ఆయా పార్టీలు అంచనా వేసుకోలేకపోతున్నాయి. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రం క్రాస్ ఓటింగ్ జోలికి పోకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులకు అటువంటి భయం లేకుండా పోయింది. ఈ క్రాస్ ఓటింగ్ తమకు కలిసొస్తుండడంతో మరింత మెజార్టీ పెరుగుతుందని ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. -
ఇచ్చి పుచ్చుకుందాం.. రా!
పాలకొండ, న్యూస్‌లైన్, ‘ఈసారి నీ పాత నియోజకవర్గంలో నన్ను గెలిపించు.. నా పాత నియోజకవర్గంలో నిన్ను గెలిపించేందుకు కృషి చేస్తా..’ -ఇదీ మాజీ మంత్రులు కళావెంకటరావు, కోండ్రు మురళిల మధ్య కుదిరిన అవగాహన.‘ఈసారి నేను గెలవటం డౌటే.. నా గురువు కిశోర్‌చంద్రదేవ్ ఎంపీగా గెలవడమే ముఖ్యం. అందుకే నీకు సాయం చేస్తా. బదులుగా ఎంపీ ఓట్లు మాకు పడేలా చెయ్యి..’ -ఇదీ పాలకొండ కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులు, టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు ఇచ్చిన ఆఫర్. ‘నియోజకవర్గంలోని కాళింగుల ఓట్లు ఈసారి నాకు పడేలా చేస్తే.. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించేలా చేస్తా. లేదంటే మీ కోరిక ఏంటో చెబితే మా అధినేతతో చెప్పి తీరేలా చేస్తా. ఇంకా కాదంటే మీ కులం ఓట్లకు రేటు చెప్పు.. ఇప్పిస్తా..’ -ఇదీ టెక్కలి కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి రామ్మోహన్‌రావుకు టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన బంపర్ ఆఫర్.! జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీయటమే లక్ష్యంగా సాగుతున్న ఈ అనైతిక వ్యవహారంపై ఆ రెండు పార్టీల కార్యకర్తలు భగ్గుమంటున్నారు. దీనివల్ల రెండు పార్టీలకు తీవ్ర నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. దీనిపై వారి హెచ్చరికలను మ్యాచ్ ఫిక్సింగ్ నేతలు బేఖాతరు చేస్తున్నారు. టెక్కలిలో వెలమ కులానికి చెందిన అచ్చెన్నాయుడికి కులసమీకరణాల ప్రకారం తగినంత బలం లేదు. ఈ నియోజకవర్గంలో కాళింగ సామాజికవర్గానిది నిర్ణయాత్మక శక్తి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఆ సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో అచ్చెన్నను ఓటమి భయం వెన్నాడుతోంది. అర దుకే కాళింగ సామాజిక వర్గానికే చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి రామ్మోహనరావుతో ఫిక్సింగ్‌కు సిద్ధపడ్డారు. ఈసారి సాయం చేస్తే రానున్న ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరును సూచిస్తానని, లేదంటే ఓట్లు వేయించేందుకు రేటు చెప్తే సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. అచ్చెన్నను నమ్మితే కొంప మునగటం ఖాయమని కొందరు, సొమ్ము చేసుకునేందుకు ఇదే మంచి అవకాశమని మరికొందరు చెబుతుండటంతో రామ్మోహనరావు సంకట స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. అయితే అచ్చెన్నకు సాయం చేసేందుకు కాళింగ సామాజికవర్గ నేతలు ససేమిరా అంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు రామ్మోహనరావు ఒప్పుకున్నా వీరు సహకరించే అవకాశం కనిపించటం లేదు.పాలకొండలో టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణను గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి సుగ్రీవులు కంకణం కట్టుకున్నట్టు సమాచారం. తన గురువు, కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ అరకు ఎంపీగా గెలవడమే తనకు ప్రధానమని ఆయన చెబుతున్నారు. సుగ్రీవులు ప్రతిపాదనకు టీడీపీ అభ్యర్థి జయకృష్ణ కూడా అంగీకరించారని తెలుస్తోంది. ఎంపీ ఓట్లను కిశోర్దేవ్కు వేయిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి జయకృష్ణ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం.ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కళా వెంకటరావు.. రాజాం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కోండ్రు మురళీ ఇప్పటికే ఫిక్సింగ్పై అవగాహనకొచ్చినట్టు ఆ రెండు పార్టీలవారే చెబుతున్నారు. 2004లో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మురళి సహకారం తీసుకుని గట్టెక్కాలని కళా భావిస్తున్నారు. అందుకు ప్రతిగా రాజాంలో మురళి గెలుపునకు సహకరించాలని నిర్ణయించుకున్నారు. గతంలో కళా ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నియోజకవర్గం పరిధిలో రాజాం ప్రాంతం ఉండటమే దీనికి కారణం. ఇదిలా ఉండగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఫిక్సింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. -
కాంగ్రెస్, బీజేపీ ఓటమే లక్ష్యం
పార్లమెంట్లో మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయి దేశం అభివృద్ధి చెందాలంటే ‘మార్పు’ రావాలి అది మోడీ, రాహుల్‌తో సాధ్యం కాదు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : కాంగ్రెస్, బీజేపీ ఓటమే లక్ష్యమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. వరంగల్ ఎంజీఎం సమీపంలోని ఇస్లామియా గ్రౌండ్లో బుధవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశం అభివృద్ధి చెందాలంటే కొత్త రకమైన విధానాలు రావాలని ఆకాంక్షించారు. అప్పుడే పేద ప్రజలకు బతుకుదెరువు దొరుకుతుందని.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, నిరుద్యోగులు ఎక్కువయ్యూరని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాలు ఓ వైపు కుంభకోణాల్లో కూరుకుపోతూనే... ధనికులకు లబ్ధిచేకూరే విధంగా ప్రోత్సహిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇప్పుడు మన దేశానికి కావాల్సింది మార్పు అని... ఆ మార్పును మోడీ, రాహుల్ తీసుకురాలేరన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడిన వారి ని పట్టుకుని దండించారు.. కానీ, అలాంటి ఫిక్సింగ్ పార్లమెంట్లో పార్లమెంట్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య కొనసాగిందన్నారు. దీని ప్రభావం దేశ ఆర్థిక విధానాలపై పడిందని, 2జీ, బొగ్గు కుంభకోణాల్లో లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యూయని, కాంగ్రెస్, బీజేపీని మట్టికరిపించి ఒక ప్రత్యామ్నా శక్తిగా వామపక్షాలు ఎదుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ తన ప్రచారానికి రూ.15 వేల కోట్లు ఖర్చుపెట్టి గెలుస్తానని అనుకుంటున్నారని... కానీ, అది భ్రమగా నే మిగిలిపోతుందన్నారు.ఈ ఎన్నికల తర్వాత తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి చెందుతుందని అనుకోవడం భ్రమేనన్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో మనం చూస్తున్నాం కదా... అని పేర్కొన్నాన్నారు. వరంగల్ తూర్పు సీపీఎం అభ్యర్థి మెట్టు శ్రీనివాస్‌ను అధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నాగయ్య మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆజంజాహి మిల్లు భూములను హోల్‌సేల్‌గా అమ్ముకుని పరికరాలను రిటేల్‌గా అమ్మి న పాపం టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలదేనని ఆరోపించా రు. కొండా సురేఖను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అజంజాహి మిల్లు కూతను మిమిక్రీతో వినిపిస్తారాని ఎద్దేవా చేశా రు. బస్వరాజు సారయ్య ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారన్నారు. టీఆర్ఎస్ కారు ను కొండా మురళి కొనుక్కున్నాడని విమర్శించారు. తూర్పులో 7000 మందికి, పట్టణంలో 20,000 మంది కి గూడు కల్పించింది సీపీఎం పార్టీయేనని స్పష్టం చేశా రు. మంత్రి పదవిలో ఉన్నప్పుడు సారయ్య, సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చేసింది ఏమిటని ప్రశ్నించారు. సారయ్యకు ఓటు వేస్తే నీళ్లలో వేసినట్లేనని ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. సీపీఎం తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన కారు కాదని... అది సురేఖ కొనుక్కున్న కారని విమర్శించారు. ఇప్పటికైనా... బరిలోనుంచి విరమించుకోవాలన్నారు. సభ లో ప్రజానాట్యమండలి అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యం లో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగయ్య, కల్లుగీత సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎంబీ.రమణ, సీఐటీయూ జిల్లా కార్యదర్శి చుక్కయ్య, నగర కార్యదర్శి రాగుల రమేష్, సీపీఎం నాయకులు దుబ్బ శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్, ముక్కెర రామస్వామి, బోగి సురేష్, పల్లం రవి, కొప్పుల శ్రీనివాస్, సింగారపు బాబు, రత్నమా ల, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సభలో సీతారాం ఏచూరి మాట్లాడుతూ వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా సీపీఎం అభ్యర్థి శ్రీరాంని గెలిపించాలని అనడంతో సభకు హాజరైన వారు ఆశ్చర్యంగా చూశా రు. ఇలా రెండు మూడు సార్లు అనడంతో ఆయన పక్కన ఉన్న సీఐటీయూ నగర కార్యదర్శి రాగుల రమేష్ వచ్చి శ్రీరాం కాదు శ్రీనివాసు అని చెప్పడంతో ఏచూరి శ్రీనివాస్ అని ప్రసంగించారు. -
తెరపైకి మ్యాచ్ ఫిక్సింగ్
ఆ మధ్య క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎంత కలకలం సృష్టిం చిందో? ఎందరు క్రీడాకారులు అందులో ఇరుక్కుని తమ ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకున్నారో తెలిసిందే. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వృత్తాంతం ఇప్పుడు వెండితెరపైకి రానుంది. ఇంతకు ముందు శివ హీరోగా తిల్లుముల్లు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు బద్రి తదుపరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఁఆడామే జయిచ్చమొడారూ. (ఆడకుండానే గెలిచామేరా) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ గత ఐపీఎల్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ అంశం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందేనన్నారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌లో టోర్నమెంట్, బెట్టిం గ్స్, క్రికెటర్స్ ఇన్వాల్మెంట్ ఉన్న విషయం తెలిసిందేనన్నారు. తాను తిల్లుముల్లు చిత్ర రూపకల్పనలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందన్నారు. ఈ అంశాన్ని ఇతి వృత్తంగా తీసుకుని చిత్రం చేయాలని అప్పడే నిర్ణయించుకున్నానన్నారు. నిజానికి ఈ బెట్టింగ్‌లు, ఫిక్సింగ్‌లు చాలా మందికి తెలియవన్నారు. వీటిని విపులీకరిస్తూ కమర్షియల్ అంశాలను జోడించి జనరంజక అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రమే ఆడామే జయిచ్చమొడా అని చెప్పారు. షూటింగ్ పూర్తయిందని తెలిపారు. మే లో ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం సమయంలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు వివరిం చారు. యువ నటులు కరుణాకరన్, సింహా హీరోలుగా నటించిన ఈ చిత్రంలో చెన్నై-28 ఫేమ్ విజయలక్ష్మి హీరోయిన్గా నటించారని చెప్పారు. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఒక కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో రాధారవి ముఖ్య పాత్రల్లో నటించారని తెలిపారు. -
రూ. 3 లక్షల కోట్లు
బెట్టింగ్ ద్వారా ఏటా భారత్‌లో చేతులు మారుతున్న మొత్తం ‘కొన్ని దశాబ్దాలుగా బెట్టింగ్ స్పోర్ట్స్‌లో భాగమైపోయింది. బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్, .. వీటిని పూర్తిగా నిరోధించలేం.. బెట్టింగ్‌కు ఆంక్షలతో కూడిన చట్టబద్ధత కల్పించడం ఒక్కటే దీనికి పరిష్కారం.’ ఇదీ బెట్టింగ్‌పై జస్టిస్ ముకుల్ ముద్గల్ అభిప్రాయం.. ఐపీఎల్లో అవినీతిపై ఆయన ఇటీవల సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో బెట్టింగ్‌కు చట్టబద్ధత తీసుకురావాలని సూచించారు. అయితే బెట్టింగ్‌కు చట్టబద్ధత అవసరమా ? ఇది సాధ్యమా కాదా ? అనే సంగతి కాసేపు పక్కన పెడితే కోట్ల రూపాయల సక్రమ, అక్రమ ధనం మాత్రం చేతులు మారుతోంది. రూ. 3,00,000 కోట్లు... అక్షరాల మూడు లక్షల కోట్ల రూపాయలు... రెండు, మూడు పెద్ద రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌కు ఈ మొత్తం సమానం. అయితే ఇంత పెద్ద మొత్తం భారత్‌లో కేవలం బెట్టింగ్ ద్వారా చేతులు మారుతోంది... ఆశ్చర్యంగా అనిపించినా, నమ్మలేకపోయినా... ఇది నిజం. పోలీసులు బుకీలపై, బెట్టింగ్ రాయుళ్లపై ఎంతగా నిఘా పెట్టినా దీన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు. బెట్టింగ్‌కు పాల్పడుతున్న వారిని అరెస్ట్‌చేసినా, బెయిల్‌పై బయటకు రాగానే మళ్లీ షరా మామూలే. ఐపీఎల్ ద్వారా ఎక్కువ టి20 క్రికెట్ మరీ ముఖ్యంగా 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చినప్పటి నుంచి బెట్టింగ్ జాఢ్యం మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్థాయి విద్యార్థులు ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్‌ల బెట్టింగ్ చేస్తున్నారు. ఇది ఆందోళనకర పరిణామం. గత సీజన్ ఐపీఎల్లో సుమారు రూ.40 వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగినట్లు అంచనా. ప్రతి ఏటా ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ 25 శాతం వరకూ పెరుగుతోంది. బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పిస్తే...? ఇండియాలో బెట్టింగ్‌కు చట్టబద్ధత లేదు కానీ.. ఇంగ్లండ్ లాంటి కొన్ని పాశ్చాత్య దేశాల్లో బెట్టింగ్ లీగలే. మన దగ్గర కూడా లీగల్ చేయాలనే డిమాండ్ అడపాదడపా వినిపిస్తోంది. ‘బెట్టింగ్‌ను లీగలైజ్ చేస్తే కోట్లాది రూపాయల ఆదాయం పన్నుల రూపంలో కేంద్రానికి వస్తుంది. ఏడాదికి మూడు లక్షలకు పైగా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. బెట్టింగ్ చట్టబద్ధత ద్వారా ప్రభుత్వానికి యేటా రూ. 1,00,000 కోట్లు (లక్ష కోట్ల రూపాయలు) పన్ను రూపంలో వస్తుంది. ఇలా ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్రం క్రీడాభివృద్ధికో లేదంటే సంక్షేమ పథకాలకో వినియోగించవచ్చు’ పలువురు మాజీ క్రికెటర్లు తరచూ చేస్తున్న సూచన ఇది. ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ), కేంద్ర క్రీడా శాఖకు ఓ నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో బెట్టింగ్‌కు చట్టబద్ధత కల్పించడం ద్వారా వచ్చే లాభాలను వివరించినట్లు సమాచారం. మరింత పెరిగే అవకాశం ఒకవేళ బెట్టింగ్‌ను లీగలైజ్ చేస్తే... ఇందులో పందేల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు బెట్టింగ్ నేరం కాబట్టి... చాటుగా భయపడుతూ పందేలు కాస్తున్నారు. అదే లీగల్ అయితే ఈ మొత్తం రెండు మూడు రెట్లకు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతానికైతే బెట్టింగ్‌కు చట్టబద్దత కల్పించే అవకాశాలు చాలా తక్కువే.