కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించను: మెకల్లమ్ | Cairns Never Condone | Sakshi
Sakshi News home page

కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించను: మెకల్లమ్

Published Thu, Oct 20 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించను: మెకల్లమ్

కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించను: మెకల్లమ్

వెల్లింగ్టన్: తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసి అప్రతిష్టపాలు చేసిన క్రిస్ కెయిన్స్ ను ఎప్పటికీ క్షమించనని న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ తేల్చి చెప్పాడు. 2008లో మ్యాచ్‌ను ఫిక్స్ చేస్తే భారీగా డబ్బులు అందుతాయని మెకల్లమ్‌కు కెయిన్స్  ఆశ చూపాడు. అరుుతే ఈ ఆఫర్‌ను తిరస్కరించిన తను 2011లో ఐసీసీ అవినీతి నిరోధక యూనిట్‌కు సమాచారమందించాడు. అలాగే గతేడాది లండన్ కోర్టులో కెయిన్స్ పై జరిగిన విచారణలో మెకల్లమ్ సాక్షిగా హాజరయ్యాడు. ‘నేను చాలా జాలిగుణం కలిగిన వ్యక్తిని. నిజానికి తను జైలుకెళ్లవద్దనే కోరుకున్నాను.

కానీ మరో రకంగా మాత్రం కెయిన్స్  ను ఎప్పటికీ క్షమించను. నన్ను చెడుగా చిత్రీకరించేందుకు తను పెద్ద ఎత్తున లాబీరుుంగ్ చేసి ఒత్తిడి తీసుకువచ్చాడు. అరుుతే ఇప్పుడు ఎవరి జీవితం వారిది. మేమెప్పుడూ కలుసుకోకూడదనే అనుకుంటున్నాను’ అని మెకల్లమ్ చెప్పాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement