అల్విరో పీటర్సన్ మ్యాచ్ ఫిక్సర్
దర్యాప్తు సాగుతుందన్న దక్షిణాఫ్రికా బోర్డు
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ అల్విరో పీటర్సన్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) వెల్లడించింది. 35 ఏళ్ల పీటర్సన్‌పై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. దేశవాళీ ఫ్రాంచైజీ టోర్నీలో హైవెల్డ్ లయన్‌సకు కెప్టెన్‌గా వ్యవహరించిన పీటర్సన్ మ్యాచ్ ఫిక్సర్ అని... 2015లో జరిగిన రామ్‌స్లామ్ టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని సీఎస్‌ఏ తెలిపింది. అతనిపై ప్రొవిజనల్ సస్పెన్షన్ విధించామని, 14 రోజుల్లోగా స్పందించాలని నోటీసు కూడా జారీ చేశామని సీఎస్‌ఏ తెలిపింది. 2015లో పీటర్సన్ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిక్సింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తోన్న సీఎస్‌ఏ ఇప్పటికే గులామ్ బొడి, జియాన్ సైమ్స్, మత్సిక్వె, ఎతీ ఎంబలాటి, సొలెకిలేలపై నిషేధం విధించింది. వీరంతా రామ్ స్లామ్ టోర్నీలో ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలొచ్చారుు.