'అఫ్రిది ఓ దొంగ.. దేశాన్ని అమ్మేశాడు'
కరాచి: 'షాహిద్ అఫ్రిది ఓ దొంగ(Afridi is a son of a thief).. కాసుల కోసం దేశాన్ని అమ్మేసిన దుర్మార్గుడు..' అంటూ పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ జావెద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆదివారం కరాచీలో మీడియాతో మాట్లాడిన మియాందాద్.. ఓసారి మ్యాచ్ ఫిక్సింగ్ డబ్బులు తీసుకుంటూ అఫ్రిది తనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడని, ఒకవేళ నేను చెప్పింది నిజం కాదంటే అఫ్రిది తన కూతురి మీది ఒట్టేసి చెప్పాలని అన్నారు. (అఫ్రిదికి వీడ్కోలు మ్యాచ్ లేదు..)
అంతర్జాతీయ క్రికెట్ నుంచి దాదాపు రిటైర్ అయిన అఫ్రిది.. వీడ్కోలు మ్యాచ్ ఆడలేకపోవడం బాధకలిగించిందని కొద్ది రోజుల కిందట వ్యాఖ్యానించాడు. కొద్ది గంటలకే అఫ్రిది బాధపై స్పందించిన మియాందాద్.. 'డబ్బుల కోసమే అతను చివరి మ్యాచ్ ఆడాలనుకుంటున్నాడు'అని కామెంట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా జగడం ముదిరినట్లైంది.
శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన అఫ్రిది.. జావెద్ మియాందాద్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. 'మియాందాద్ గొప్ప క్రికెటర్. ఆయన ఇలాంటి చత్త వ్యాఖ్యలు చేస్తాడని ఊహించలేదు. అందుకే ఎంత ఆట తెలిసినా మియాందాద్.. ఇమ్రాన్ ఖాన్ లాగా మంచిపేరు సంపాదించుకోలేక పోయాడు' అని అఫ్రిది అన్నాడు. ఆ మరుసటి రోజే(ఆదివారం) ప్రెస్ మీట్ పెట్టిన మియాందాద్ గతాన్ని తోడుతూ అఫ్రిదీని తిట్టిపోశాడు. (సర్జికల్ స్ట్రైక్స్ పై షాహిద్ అఫ్రిది స్పందన)