పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి సోదరి మంగళవారం తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని అఫ్రిది సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.
"మా సోదరి మమ్మల్ని విడిచిపెట్టి ఆ దేవుడు వద్దకు వెళ్లిపోయింది. ఆమె మరణవార్తను మా బరువెక్కిన హృదయాలతో తెలియజేస్తున్నాము. ఆమె ఆంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి" అని అఫ్రిది ట్విటర్‌లో రాసుకొచ్చాడు. ఈ విషయం తెలిసిన ప్రముఖులు, అభిమానులు అఫ్రిదికి సానుభూతి తెలియజేస్తున్నారు.
అయితే "తన చెల్లిని చూసేందుకు వెళ్తున్నాననీ, ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నానని శనివారం(ఆక్టోబర్ 16) రాత్రి ఆఫ్రిది ట్విట్ చేశాడు. కానీ అతడు ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే ఆమె మృతి చెందింది. కాగా షాహిద్ అఫ్రిది కుటుంబంలో మొత్తం 11 మంది ఉన్నారు.
అందులో ఆరుగురు సోదరులు, అయిదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. షాహిద్ సోదరులు తారిక్ అఫ్రిది, అష్ఫక్ అఫ్రిది కూడా క్రికెటర్లే. ప్రస్తుత పాకిస్తాన్ స్టార్ ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది.. షాహిద్ అఫ్రిదికి అల్లుడే అన్న విషయం తెలిసిందే.
చదవండి: SMAT 2023: 42 బంతుల్లో శతక్కొట్టిన సన్‌రైజర్స్ బ్యాటర్
(إِنَّا ِلِلَّٰهِ وَإِنَّا إِلَيْهِ رَاجِعُونَ,)
— Shahid Afridi (@SAfridiOfficial) October 17, 2023
Surely we belong to Allah and to him we shall return.
With Heavy hearts we inform you that our beloved Sister passed away and her Namaz e Janazah will be at 17.10.2023 after Zuhur prayer at Zakariya masjid main 26th street… https://t.co/Ly4sK6XVGT
Comments
Please login to add a commentAdd a comment