పాకిస్తాన్ యువ పేసర్ షాహీన్ షా అఫ్రిది వివాహం ఇవాళ (ఫిబ్రవరి 3) పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో షాహీన్.. పాక్ దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాను నిఖా చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమానికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యాడు. షాహీన్-అన్షా జంటకు పాక్ సహచర క్రికెటర్లు, అలాగే షాహీన్ పీఎస్‌ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) జట్టు లాహోర్ ఖలందర్స్ జట్టు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
షాహీన్‌ను అత్యంత సన్నిహితులైన పాక్ క్రికెటర్ హరీస్ రౌఫ్, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ ట్విటర్ ద్వారా విషెస్ తెలిపారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ వివాహం కోసం ప్రత్యేకంగా కరాచీకి వచ్చినట్లు సమాచారం. నిఖా తర్వాత జరిగే మెహంది కార్యక్రమం ఇవాళ రాత్రి జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాక్ క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది.
కాగా, షాహీన్-అన్షాల ఎంగేజ్‌మెంట్ రెండేళ్ల క్రితమే జరిగింది. నాటి నుంచి వీరి వివాహం అదిగో ఇదిగో అంటూ మీడియాలో పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం పాక్‌కు అంతర్జాతీయంగా ఎలాంటి షెడ్యూల్ లేకపోవడంతో ఆ దేశ క్రికెటర్లంతా విదేశీ లీగ్‌ల్లో బిజీగా ఉన్నారు. షాహీన్ అఫ్రిది కూడా వివాహానికి కొద్ది రోజుల ముందు వరకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు.
Skipper is on his way to Karachi to attend Shaheen's wedding 🙌
— Cricket Pakistan (@cricketpakcompk) February 3, 2023
Photo Courtesy: @mirzaiqbal80 #PakistanCricket #ShaheenAfridi pic.twitter.com/ynJ67vSnv1
పాకిస్తాన్ తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ 13 నుంచి మొదలవుతుంది. 5 టీ20లు, 5 వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. 22 ఏళ్ల షాహీన్ అఫ్రిది ఇప్పటివరకు పాక్ తరఫున 25 టెస్ట్‌లు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. ఇందులో 99 టెస్ట్ వికెట్లు, 62 వన్డే వికెట్లు, 58 టీ20 వికెట్లు పడగొట్టాడు.
🎉Haris Rauf's reaction on Shaheen ka Nikah🎉#MainHoonQalandar #DilSe pic.twitter.com/CsjIQPxzsS
— Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023
🎉Shaheen ka Nikah🎉
— Lahore Qalandars (@lahoreqalandars) February 2, 2023
"Happy Wife, Happy Life"#MainHoonQalandar #DilSe pic.twitter.com/Zi6WGUNFiP
Comments
Please login to add a commentAdd a comment