David Wiese
-
చెలరేగిన డేవిడ్ వీస్, మార్కస్ స్టోయినిస్
అబుదాబీ టీ10 లీగ్‌లో భాగంగా టీమ్ అబుదాబీతో జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ ఆటగాళ్లు డేవిడ్ వీస్, మార్కస్ స్టోయినిస్ చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో వీస్ 12 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 42 పరుగులు చేయగా.. స్టోయినిస్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన డెక్కన్ గ్లాడియేటర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో కొహ్లెర్ కాడ్మోర్ 11, రిలీ రొస్సో 18, నికోలస్ పూరన్ 0, జోస్ బట్లర్ 3, ఆర్యన్ లక్రా 11 (నాటౌట్) పరుగులు చేశారు. టీమ్ అబుదాబీ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ మిల్నే, మార్క్ అదైర్, రుమ్మన్ రయీస్ తలో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమ్ అబుదాబీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేయగలిగింది. తద్వారా 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఫిలిప్ సాల్ట్ (9 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (20 బంతుల్లో 47; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), కడీమ్ అలెన్ (12 బంతుల్లో 24 నాటౌట్; 3 సిక్సర్లు) టీమ్ అబుదాబీని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. టీమ్ అబుదాబీ ఇన్నింగ్స్‌లో పాల్ స్టిర్లింగ్ 8, కైల్ మేయర్స్ 9, లారీ ఎవాన్స్ 9, మార్క్ అదైర్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. గ్లాడియేటర్స్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహీశ్ తీక్షణ 2, ఇబ్రార్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. -
వీస్ మెరుపు బ్యాటింగ్.. లూసియా కింగ్స్ ఘన విజయం
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్‌తో ఇవాళ (సెప్టెంబర్ 16) జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. డేవిడ్ వీస్ మెరుపు ఇన్నింగ్స్‌తో (26 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు) రాణించగా.. అకీమ్ అగస్ట్ (35), జాన్సన్ చార్లెస్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డుప్లెసిస్ (14), రోస్టన్ ఛేజ్ (0), టిమ్ సీఫర్ట్ (13), భానుక రాజపక్స (1) తక్కువ స్కోర్లకే ఓటయ్యారు. ఫాల్కన్స్ బౌలర్లలో క్రిస్ గ్రీన్ 4, షమార్ స్ప్రింగర్ 3, కోఫి జేమ్స్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్‌ను కింగ్స్ స్పిన్నర్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఖారీ పియెర్ (4-1-24-3), రోస్టన్ ఛేజ్ (3-1-15-1), నూర్ అహ్మద్ (4-0-13-2) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి ఫాల్కన్స్ పతనాన్ని శాశించారు. వీరి ధాటికి ఫాల్కన్స్ 28 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి, 8 వికెట్ల నష్టానికి 125 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆఖర్లో క్రిస్ గ్రీన్ (48).. షమార్ స్ప్రింగర్ (24), రోషన్ ప్రైమస్ (17 నాటౌట్) సహకారంతో ఫాల్కన్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. చదవండి: ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం -
డేవిడ్ వీస్ ఆల్‌రౌండ్ షో
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీలో సర్రే జాగ్వర్స్పై బంగ్లా టైగర్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జాగ్వర్స్ 19.5 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. జాగ్వర్స్ జట్టులో విధ్వంసకర వీరులు ఉన్నా స్టోయినిస్ (36), వాన్ బీక్ (31) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కైల్ మేయర్స్ (5), సునీల్ నరైన్ (0), మన్సబ్ గిల్ (2), శ్రేయస్ మొవ్వ (0), బ్రాండన్ మెక్‌ముల్లెన్ (7), మొహమ్మద్ నబీ (0), తారిఖ్ (1), హర్మీత్ సింగ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో షొరీఫుల్ ఇస్లాం 3, డేవిడ్ వీస్, షకీబ్ అల్ హసన్ చెరో 2, కర్టిస్ క్యాంఫర్, అలీ ఖాన్, డిల్లన్ హేలైగర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టైగర్స్.. 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బంతితో రాణించిన డేవిడ్ వీస్ బ్యాటింగ్‌లోనూ (19 బంతుల్లో 27 నాటౌట్) సత్తా చాటి టైగర్స్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టైగర్స్ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 4, ముహమ్మద్ వసీం 14, పర్గత్ సింగ్ 10, షకీబ్ అల్ హసన్ 1, ఇఫ్తికార్ అహ్మద్ 13, కర్టిస్ క్యాంఫర్ 10, డిల్లన్ హేలైగర్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. జాగ్వర్స్ బౌలర్లలో సునీల్ నరైన్ 3, స్టోయినిస్, లొగన్ వాన్ బీక్, బెన్ లిస్టర్ తలో వికెట్ పడగొట్టారు.నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో వాంకోవర్ నైట్స్‌పై బ్రాంప్టన్ వోల్వ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాంకోవర్ నైట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. బ్రాంప్టన్ వోల్వ్స్ మరో 11 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. వెబ్‌స్టర్ (49), నిక్ హాబ్సన్ (37) వోల్వ్స్‌ను విజయతీరాలకు చేర్చారు. -
T20 World Cup 2024: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్
నమీబియా స్టార్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో ఇంగ్లండ్ చేతిలో తన జట్టు ఓటమి అనంతరం వీస్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 39 ఏళ్ల వీస్.. 2013లో సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేసి 2016 వరకు ఆ జట్టు తరఫున ఆడాడు. అనంతరం వీస్ తన తండ్రి జన్మస్థలమైన నమీబియాకు వలస వెళ్లి ఆ దేశ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు (2021 ఆగస్ట్ నుంచి). 2016 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన వీస్.. 2021, 2022 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో నమీబియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. వీస్ నమీబియా తరఫున ఆడుతూ ఆ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఐసీసీ టోర్నీల్లో నమీబియా సాధించిన మొట్టమొదటి విజయంలో (2021 టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌పై) వీస్ కీలకపాత్ర పోషించాడు.రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన వీస్ తన 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 15 వన్డేలు, 51 టీ20లు ఆడి 73 వికెట్లు పడొట్టాడు. కుడి చేతి వాటం బ్యాటర్ అయిన వీస్ తన అంతర్జాతీయ కెరీర్లో దాదాపు 1000 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ద సెంచరీలు ఉన్నాయి.అంతర్జాతీయ కెరీర్‌తో పోలిస్తే ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ కెరీర్లో ఘనమైన రికార్డు కలిగిన వీస్.. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 162 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడి దాదాపు 10000 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 54 అర్దసెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో వీస్ ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లలో కలిపి 490 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన వీస్.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్‌ల్లో ఆడుతున్నాడు. -
పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో రెండు దేశాలకు ఆడిన క్రికెటర్లు వీరే..!
క్రీడ ఏదైనా జాతీయ జట్టుకు ప్రాతినథ్యం వహించడమనేది ప్రతి ఆటగాడి కల. ఈ అవకాశం కోసం కొందరు ఆటగాళ్లు జీవితకాలం ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఓ ఆటగాడు రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించడమనేది చాలా గొప్ప విషయమని చెప్పాలి.క్రికెట్‌కు సంబంధించి ఇప్పటివరకు 52 మంది ఆటగాళ్లు రెండు వేర్వేరు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. వన్డే ఫార్మాట్లో 16 మంది, టెస్ట్‌ల్లో 17 మంది, టీ20 ఫార్మాట్లో 19 మంది ఇప్పటివరకు రెండు వేర్వేరు జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించారు.ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటివరకు ఎంత మంది రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదుగురు ఆటగాళ్లు రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించారు.మొదటిగా రోల్ఫ్ వాన్ డర్ మెర్వ్.. 2009లో సౌతాఫ్రికా తరఫున పొట్టి ప్రపంచకప్ ఆడిన వాన్ డర్ మెర్వ్.. 2022, 2024 ప్రపంచకప్ టోర్నీల్లో నెదర్లాండ్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు.రెండో ఆటగాడు డిర్క్ నానెస్.. 2009 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌కు ఆడిన నానెస్.. 2010 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు.మూడవ ఆటగాడు మార్క్ చాప్మన్.. హాంగ్‌కాంగ్‌లో పుట్టిన చాప్మన్ 2014, 2016 టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్లలో పుట్టిన దేశానికి ప్రాతినిథ్యం వహించి.. 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.నాలుగో ఆటగాడు డేవిడ్ వీస్.. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాకు ఆడిన వీస్.. 2021, 2022, 2024 వరల్డ్‌కప్ ఎడిషన్లలో నమీబియాకు ప్రాతినిథ్యం వహించాడు.చివరిగా కోరె ఆండర్సన్.. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌కు ఆడిన ఆండర్సన్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
T20 World Cup 2024: లేటు వయసులోనూ ఇరగదీస్తున్న వీస్
నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ (39) లేటు వయసులో అదిరిపోయే ప్రదర్శనలతో ఇరదీస్తున్నాడు. గత కొంతకాలంగా నమీబియా విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న వీస్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్ 2024లోనూ చెలరేగిపోతున్నాడు. వరల్డ్‌కప్ గ్రూప్-బి పోటీల్లో భాగంగా ఒమన్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో వీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి నమీబియాను గెలిపించాడు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో నమీబియా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. రెగ్యులర్ మ్యాచ్‌లో బ్యాట్‌తో బంతితో సత్తా చాటిన వీస్.. సూపర్ ఓవర్లోనూ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు.రెగ్యులర్ మ్యాచ్‌లో తొలుత బంతితో (3.4-0-28-3) రాణించిన వీస్.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ (8 బంతుల్లో 9 నాటౌట్; ఫోర్) పర్వాలేదనిపించాడు. అనంతరం ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీయగా.. సూపర్ ఓవర్లోనూ వీస్ ఇరగదీశాడు. సూపర్ ఓవర్లో తొలుత బ్యాట్‌తో (4 బంతుల్లో 13 నాటౌట్; ఫోర్, సిక్స్) చెలరేగిన వీస్.. ఆతర్వాత బంతితోనూ (1-0-10-1) రాణించి నమీబియాను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ ఆధ్యాంతం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసినందుకు గాను వీస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. నమీబియా బౌలర్లలో వీస్‌తో పాటు ట్రంపెల్మన్ (4-0-21-4), ఎరాస్మస్ (4-0-20-2), స్కోల్జ్ (4-0-20-1) సత్తా చాటారు. ఒమన్ ఇన్నింగ్స్‌లో ఖలీద్ కైల్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఒమన్ చేసినన్ని పరుగులే (109) చేయగలిగింది. ఒమన్ బౌలర్లలో మెహ్రాన్ ఖాన్ (3-1-7-3), కెప్టెన్ ఆకిబ్ ఇలియాస్ (4-1-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. బిలాల్ ఖాన్, అయాన్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. నమీబియాను విజయతీరాలకు చేర్చేందుకు ఫ్రైలింక్ (45) పోరాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.సూపర్ ఓవర్ విషయానికొస్తే.. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా వీస్, ఎరాస్మస్ (2 బంతుల్లో 8 నాటౌట్; 2 ఫోర్లు) రాణించడంతో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఒమన్.. వీస్ ధాటికి 10 పరుగలకే పరిమితమై ఓటమిపాలైంది. -
12 ఏళ్ల తర్వాత తొలి సూపర్ ఓవర్.. నమీబియా వరల్డ్ రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీలోని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే 195 పరుగులను ఛేదించి అందరని షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ను పసికూన పపువా న్యూ గినియా ఓడించే అంతా పనిచేసింది.ఇక రెండు మ్యాచ్‌లు ఒక ఎత్తు. సోమవారం బార్బోడస్ వేదికగా ఒమన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఎత్తు. ఒమన్-నమీబియా మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇరు జట్లు సమాన స్ధాయిలో పోరాడడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోలో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 109 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ఒమన్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నమీబియా కూడా సరిగ్గా నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సూపర్ ఓవర్లో ఫలితం తేల్చాల్సి వచ్చింది.దంచి కొట్టిన డేవిడ్ వీస్, ఎరాస్మస్..ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగుల చేసింది. నమీబియా బ్యాటర్లలో డేవిడ్ వీస్ 13 పరుగులు చేయగా.. ఎరాస్మస్ 8 పరుగులు చేశాడు. సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన డేవిడ్ వీస్.. బౌలింగ్‌లో కూడా సత్తాచాటాడు.తొలి రెండు బంతులకు 2, 0 రాగా.. మూడో బంతికి నమీస్ కుషిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రెండు బంతులకు ఒక్కో పరుగు చొప్పున ఇచ్చి వీస్ జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ ఇచ్చినప్పటికి ఒమన్‌కు చేయాల్సిన నష్టం వీస్ చేసేశాడు.12 ఏళ్ల తర్వాత తొలి సూపర్ ఓవర్..కాగా టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ జరగడం ఇది మూడో సారి. చివరగా 2012 టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ జరిగింది. 2012 పొట్టి ప్రపంచకప్‌లో కాండీ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ ద్వారానే ఫలితం తేలింది. అదే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్, కివీస్ మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దారితీసింది. కాగా 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టై అయినప్పటికి సూపర్ ఓవర్ ద్వారా కాకుండా బాల్ అవుట్ ద్వారా ఫలితం తేల్చారు.నమీబియా అరుదైన రికార్డు..ఇక సూపర్ ఓవర్లో విజయం సాధించిన నమీబియా అరుదైన రికార్డు సాధించింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నమీబియా రికార్డులకెక్కింది. ఒమన్‌తో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో నమీబియా ఏకంగా 21 పరుగులు సాధించింది.అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2012 టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌పై సూపర్ ఓవర్లో విండీస్ 19 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో విండీస్ రికార్డును నమీబియా బ్రేక్ చేసింది. -
చెలరేగిన డేవిడ్ వీస్.. తుస్సుమన్న విధ్వంసకర వీరులు
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో నార్త్ర్న్ సూపర్ ఛార్జర్స్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ చెలరేగిపోయాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం సాధించాడు. అతనికి బ్రైడన్ కార్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సైఫ్ జైబ్ (21 బంతుల్లో 21; ఫోర్), ఆడమ్ హోస్ (17 బంతుల్లో 18; 3 ఫోర్లు) జత కలవడంతో సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. Luke Wood's first 10 balls were something else! 🚀#TheHundred pic.twitter.com/SZWNvcn26V — The Hundred (@thehundred) August 10, 2023 నిప్పులు చెరిగిన లూక్ వుడ్.. సూపర్ ఛార్జర్స్ హిట్టర్లు టామ్ బాంటన్ (0), మాథ్యూ షార్ట్ (8), హ్యారీ బ్రూక్ (0).. రాకెట్స్ పేసర్ లూక్ వుడ్ ధాటికి వణికిపోయారు. తొలి 6 బంతుల్లోనే వీరు ముగ్గురు పెవిలియన్‌కు చేరారు. వుడ్ ఈ ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేశాడు. వుడ్ 20 బంతుల్లో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొడితే.. జో రూట్ 20 బంతుల్లో 24 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. David Wiese 🤝 powerful hitting Insane crowd catch incoming... #TheHundred pic.twitter.com/Gn2MWUNyNW — The Hundred (@thehundred) August 9, 2023 తుస్సుమన్న విధ్వంసకర వీరులు.. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. నిర్ణీత బంతుల్లో 139 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. విధ్వంసకర వీరులైన రాకెట్స్ బ్యాటర్లు అలెక్స్ హేల్స్ (29), డేవిడ్ మలాన్ (6), కొలిన్ మున్రో (15), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (15), జో రూట్ (4), సామ్ హెయిన్ (20), డేనియల్ సామ్స్ (27).. సూపర్ ఛార్జర్స్ బౌలర్లు వేన్ పార్నెల్ (3/21), రీస్ టాప్లే (2/20), కల్లమ్ పార్కిన్సన్ (2/29) ధాటికి తేలిపోయారు. ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర వీరులుగా పేరున్న రాకెట్స్ బ్యాటర్లు.. సూపర్ ఛార్జర్స్ నిర్ధేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలయ్యారు. 🚨JOE ROOT STRIKES FOR THE TRENT ROCKETS 🚨#TheHundred pic.twitter.com/JVcWq6nSeZ — The Hundred (@thehundred) August 9, 2023 -
David Wiese: ఐదేసి ఇరగదీసిన వీస్.. వారియర్స్ ఖేల్ ఖతం
ఇనాగురల్ ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2023 (దుబాయ్ లీగ్)లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారయ్యాయి. నిన్న (ఫిబ్రవరి 6) జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గల్ఫ్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలవ్వడంతో షార్జా వారియర్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది. జెయింట్స్ పేసర్, వెటరన్ ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ ఐదు వికెట్లు (4-0-20-5) తీసి అదరగొట్టడంతో జెయింట్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టేబుల్ టాపర్‌గా ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన జెయింట్స్.. వారియర్స్‌ను 18.3 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌట్ చేసింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కోహ్లెర్ కాడ్మోర్ (33), స్టోయినిస్ (18), మహ్మద్ నబీ (21), నూర్ అహ్మద్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. వారియర్స్ ఇన్నింగ్స్‌లో కోహ్లెర్ కాడ్మోర్ ఆరంభంలో మెరుపు వేగంతో పరుగులు చేసి జెయింట్స్ బౌలర్లను భయపెట్టాడు. అయితే టామ్ హెల్మ్ కాడ్మోర్కు కళ్లెం వేయడంతో వారియర్స్ ఢీలా పడిపోయి వరుసగా వికెట్లు కోల్పోయింది. జెయింట్స్ బౌలర్లలో వీస్ ఐదేయగా.. కార్లోస్ బ్రాత్‌వైట్ 2, సంచిత్ శర్మ, టామ్ హెల్మ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జెయింట్స్16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టామ్ బాంటన్ (11), కెప్టెన్ జేమ్స్ విన్స్ (27), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (35), అయాన్ అఫ్జల్ ఖాన్ (14 నాటౌట్), గెర్హార్డ్ ఎరాస్మస్ (10 నాటౌట్) రాణించారు. వారియర్స్ బౌలర్లలో జునైద్ సిద్ధిఖీ 2, మార్కస్ స్టోయినిస్ ఓ వికెట పడగొట్టారు. ఈ విజయంతో వారియర్స్ లీగ్ నుంచి నిష్క్రమించగా.. తొలి రెండు స్థానాల్లో నిలిచిన గల్ఫ్ జెయింట్స్, డెసర్ట్ వైపర్స్ క్వాలిఫయర్స్‌కు.. 3, 4 స్థానాల్లో నిలిచిన ముంబై ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌ను అర్హత సాధించాయి. 6 జట్లలో చివరి స్థానంలో నిలిచిన అబుదాబీ నైట్‌రైడర్స్ ఇదివరకే లీగ్ నుంచి నిష్క్రమించింది. ఫిబ్రవరి 8: గల్ఫ్ జెయింట్స్, డెసర్ట్ వైపర్స్ (క్వాలిఫయర్స్ 1) ఫిబ్రవరి 9: ముంబై ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ (ఎలిమినేటర్) -
షాహీన్ అఫ్రిది 'నిఖా' హోగయా.. ప్రత్యేక అతిధి ఎవరంటే..?
పాకిస్తాన్ యువ పేసర్ షాహీన్ షా అఫ్రిది వివాహం ఇవాళ (ఫిబ్రవరి 3) పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో షాహీన్.. పాక్ దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాను నిఖా చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమానికి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రత్యేక అతిధిగా హాజరయ్యాడు. షాహీన్-అన్షా జంటకు పాక్ సహచర క్రికెటర్లు, అలాగే షాహీన్ పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) జట్టు లాహోర్ ఖలందర్స్ జట్టు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. షాహీన్‌ను అత్యంత సన్నిహితులైన పాక్ క్రికెటర్ హరీస్ రౌఫ్, నమీబియా ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ ట్విటర్ ద్వారా విషెస్ తెలిపారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ వివాహం కోసం ప్రత్యేకంగా కరాచీకి వచ్చినట్లు సమాచారం. నిఖా తర్వాత జరిగే మెహంది కార్యక్రమం ఇవాళ రాత్రి జరుగనుంది. ఈ కార్యక్రమంలో పాక్ క్రికెటర్లతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. కాగా, షాహీన్-అన్షాల ఎంగేజ్మెంట్ రెండేళ్ల క్రితమే జరిగింది. నాటి నుంచి వీరి వివాహం అదిగో ఇదిగో అంటూ మీడియాలో పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం పాక్‌కు అంతర్జాతీయంగా ఎలాంటి షెడ్యూల్ లేకపోవడంతో ఆ దేశ క్రికెటర్లంతా విదేశీ లీగ్‌ల్లో బిజీగా ఉన్నారు. షాహీన్ అఫ్రిది కూడా వివాహానికి కొద్ది రోజుల ముందు వరకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. Skipper is on his way to Karachi to attend Shaheen's wedding 🙌 Photo Courtesy: @mirzaiqbal80 #PakistanCricket #ShaheenAfridi pic.twitter.com/ynJ67vSnv1 — Cricket Pakistan (@cricketpakcompk) February 3, 2023 పాకిస్తాన్ తదుపరి షెడ్యూల్ ఏప్రిల్ 13 నుంచి మొదలవుతుంది. 5 టీ20లు, 5 వన్డేలు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్లో పర్యటించనుంది. 22 ఏళ్ల షాహీన్ అఫ్రిది ఇప్పటివరకు పాక్ తరఫున 25 టెస్ట్‌లు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. ఇందులో 99 టెస్ట్ వికెట్లు, 62 వన్డే వికెట్లు, 58 టీ20 వికెట్లు పడగొట్టాడు. 🎉Haris Rauf's reaction on Shaheen ka Nikah🎉#MainHoonQalandar #DilSe pic.twitter.com/CsjIQPxzsS — Lahore Qalandars (@lahoreqalandars) February 3, 2023 🎉Shaheen ka Nikah🎉 "Happy Wife, Happy Life"#MainHoonQalandar #DilSe pic.twitter.com/Zi6WGUNFiP — Lahore Qalandars (@lahoreqalandars) February 2, 2023 -
కంటతడి పెట్టిన డేవిడ్ వీస్.. అద్భుత పోరాటం అంటూ నెటిజన్ల కితాబు
రసవత్తరంగా సాగిన టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-ఏ క్వాలిఫయర్స్ పోటీలు ఇవాల్టితో ముగిశాయి. ఈ గ్రూప్ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు సూపర్-12కు అర్హత సాధించాయి. ఇవాళ (అక్టోబర్ 20) జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీలంక.. నెదర్లాండ్స్‌పై, యూఏఈ.. నమీబియాపై విజయం సాధించి సూపర్-12 బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఇద్దరు ఆటగాళ్లు కనబర్చిన అద్భుత పోరాటపటిమ యావత్ క్రీడా ప్రపంచాన్ని కదిలించింది. శ్రీలంకతో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ ఆటగాడు వాన్ డెర్ మెర్వ్ భరించలేని నొప్పితో బరిలోకి దిగి అందరి మన్ననలు అందుకోగా.. యూఏఈతో మ్యాచ్‌లో నబీమియా ఆటగాడు డేవిడ్ వీస్ అద్భుతమైన పోరాట పటిమ కనబర్చి.. అభిమానులచే శభాష్ యోధుడా అనిపించుకున్నాడు. అయితే డేవిడ్ వీస్ వీరోచిత పోరాట పటిమ కనబర్చినప్పటికీ తన జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో మ్యాచ్ అనంతరం అతను తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టాడు. ఈ దృశ్యాలు అందరినీ కలచి వేశాయి. వీస్ తన జట్టును గెలిపించేందుకు చివరి వరకు పోరాడి ఆఖరి ఓవర్లో వెనుదిరిగాడు. ఫలితంగా నమీబియా మ్యాచ్ ఓడటంతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించింది. 37 ఏళ్ల వీస్‌కు ప్రస్తుత ప్రపంచకప్‌లో తన జట్టును ఎలాగైనా సూపర్ 12 దశకు చేర్చాలని దృడ నిశ్చయంతో ఉన్నాడు. ఈ క్రమంలో నమీబియా తమ తొలి మ్యాచ్‌లో ఆసియా ఛాంపియన్ శ్రీలంకకు షాకిచ్చింది. ఈ గెలుపులో వీస్ కీలకపాత్ర పోషించాడు. వయసు పైబడిన రిత్యా వీస్‌కు ఇదే చివరి ప్రపంచకప్ కావడంతో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వీస్ కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే, నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. ఛేదనలో నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఫలితంగా నమీబియా 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. యూఏఈ ఇన్నింగ్స్‌లో ముహ్మద్ వసీమ్ (50), రిజ్వాన్ (43 నాటౌట్), బాసిల్ హమీద్ (25 నాటౌట్) రాణించగా.. నమీబియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వీస్ (55) ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.