వీస్‌ మెరుపు బ్యాటింగ్‌.. లూసియా కింగ్స్‌ ఘన విజయం | CPL 2024: Saint Lucia Kings Beat Antigua And Barbuda Falcons By 26 Runs | Sakshi
Sakshi News home page

వీస్‌ మెరుపు బ్యాటింగ్‌.. లూసియా కింగ్స్‌ ఘన విజయం

Published Mon, Sep 16 2024 10:16 AM | Last Updated on Mon, Sep 16 2024 10:45 AM

CPL 2024: Saint Lucia Kings Beat Antigua And Barbuda Falcons By 26 Runs

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 16) జరిగిన మ్యాచ్‌లో సెయింట్‌ లూసియా కింగ్స్‌ 26 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కింగ్స్‌.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 

డేవిడ్‌ వీస్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో (26 బంతుల్లో 43 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) రాణించగా.. అకీమ్‌ అగస్ట్‌ (35), జాన్సన్‌ చార్లెస్‌ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. డుప్లెసిస్‌ (14), రోస్టన్‌ ఛేజ్‌ (0), టిమ్‌ సీఫర్ట్‌ (13), భానుక రాజపక్స (1) తక్కువ స్కోర్లకే ఓటయ్యారు. ఫాల్కన్స్‌ బౌలర్లలో క్రిస్‌ గ్రీన్‌ 4, షమార్‌ స్ప్రింగర్‌ 3, కోఫి జేమ్స్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్‌ను కింగ్స్‌ స్పిన్నర్లు చాలా ఇబ్బంది పెట్టారు. ఖారీ పియెర్‌ (4-1-24-3), రోస్టన్‌ ఛేజ్‌ (3-1-15-1), నూర్‌ అహ్మద్‌ (4-0-13-2) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు తీసి ఫాల్కన్స్‌ పతనాన్ని శాశించారు. 

వీరి ధాటికి ఫాల్కన్స్‌ 28 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి, 8 వికెట్ల నష్టానికి 125 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆఖర్లో క్రిస్‌ గ్రీన్‌ (48).. షమార్‌ స్ప్రింగర్‌ (24), రోషన్‌ ప్రైమస్‌ (17 నాటౌట్‌) సహకారంతో ఫాల్కన్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. 

చదవండి: ఇంగ్లండ్‌పై ఐర్లాండ్‌ సంచలన విజయం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement