క్రీడ ఏదైనా జాతీయ జట్టుకు ప్రాతినథ్యం వహించడమనేది ప్రతి ఆటగాడి కల. ఈ అవకాశం కోసం కొందరు ఆటగాళ్లు జీవితకాలం ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఓ ఆటగాడు రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించడమనేది చాలా గొప్ప విషయమని చెప్పాలి.
క్రికెట్‌కు సంబంధించి ఇప్పటివరకు 52 మంది ఆటగాళ్లు రెండు వేర్వేరు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. వన్డే ఫార్మాట్‌లో 16 మంది, టెస్ట్‌ల్లో 17 మంది, టీ20 ఫార్మాట్‌లో 19 మంది ఇప్పటివరకు రెండు వేర్వేరు జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించారు.
ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటివరకు ఎంత మంది రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదుగురు ఆటగాళ్లు రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించారు.
మొదటిగా రోల్ఫ్ వాన్ డర్ మెర్వ్.. 2009లో సౌతాఫ్రికా తరఫున పొట్టి ప్రపంచకప్ ఆడిన వాన్ డర్ మెర్వ్.. 2022, 2024 ప్రపంచకప్ టోర్నీల్లో నెదర్లాండ్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు.
రెండో ఆటగాడు డిర్క్ నానెస్.. 2009 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌కు ఆడిన నానెస్.. 2010 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు.
మూడవ ఆటగాడు మార్క్ చాప్‌మన్.. హాంగ్‌కాంగ్‌లో పుట్టిన చాప్‌మన్ 2014, 2016 టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్లలో పుట్టిన దేశానికి ప్రాతినిథ్యం వహించి.. 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
నాలుగో ఆటగాడు డేవిడ్ వీస్.. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాకు ఆడిన వీస్.. 2021, 2022, 2024 వరల్డ్‌కప్ ఎడిషన్లలో నమీబియాకు ప్రాతినిథ్యం వహించాడు.
చివరిగా కోరె ఆండర్సన్.. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌కు ఆడిన ఆండర్సన్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో యూఎస్‌ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment