Roelof van der Merwe
-
పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో రెండు దేశాలకు ఆడిన క్రికెటర్లు వీరే..!
క్రీడ ఏదైనా జాతీయ జట్టుకు ప్రాతినథ్యం వహించడమనేది ప్రతి ఆటగాడి కల. ఈ అవకాశం కోసం కొందరు ఆటగాళ్లు జీవితకాలం ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఓ ఆటగాడు రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించడమనేది చాలా గొప్ప విషయమని చెప్పాలి.క్రికెట్‌కు సంబంధించి ఇప్పటివరకు 52 మంది ఆటగాళ్లు రెండు వేర్వేరు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించారు. వన్డే ఫార్మాట్లో 16 మంది, టెస్ట్‌ల్లో 17 మంది, టీ20 ఫార్మాట్లో 19 మంది ఇప్పటివరకు రెండు వేర్వేరు జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహించారు.ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇప్పటివరకు ఎంత మంది రెండు వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదుగురు ఆటగాళ్లు రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిథ్యం వహించారు.మొదటిగా రోల్ఫ్ వాన్ డర్ మెర్వ్.. 2009లో సౌతాఫ్రికా తరఫున పొట్టి ప్రపంచకప్ ఆడిన వాన్ డర్ మెర్వ్.. 2022, 2024 ప్రపంచకప్ టోర్నీల్లో నెదర్లాండ్స్‌కు ప్రాతనిథ్యం వహించాడు.రెండో ఆటగాడు డిర్క్ నానెస్.. 2009 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌కు ఆడిన నానెస్.. 2010 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించాడు.మూడవ ఆటగాడు మార్క్ చాప్మన్.. హాంగ్‌కాంగ్‌లో పుట్టిన చాప్మన్ 2014, 2016 టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్లలో పుట్టిన దేశానికి ప్రాతినిథ్యం వహించి.. 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.నాలుగో ఆటగాడు డేవిడ్ వీస్.. 2016 టీ20 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాకు ఆడిన వీస్.. 2021, 2022, 2024 వరల్డ్‌కప్ ఎడిషన్లలో నమీబియాకు ప్రాతినిథ్యం వహించాడు.చివరిగా కోరె ఆండర్సన్.. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌కు ఆడిన ఆండర్సన్.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. -
కోహ్లిని ఔట్ చేశాడు.. గిఫ్ట్ కొట్టేశాడు! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా వరుసగా 9వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. కాగా ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తన మంచిమనసును చాటు కున్నాడు. కోహ్లి తన సంతకం చేసిన జెర్సీని వాన్ డెర్ మెర్వేకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. జెర్సీని ఇచ్చి నవ్వుతూ అతడిని కోహ్లి అలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. డచ్ ఆటగాళ్లు కూడా భారత అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్ 2009, 2010 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లి, వాన్ డెర్ మెర్వే కలిసి ఆడారు. అప్పటినుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం బంధం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లిని వాన్ డెర్ మెర్వే క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్ అత్యుత్తమ జట్టు ఇదే.. కెప్టెన్‌గా కోహ్లి! రోహిత్‌కు నో ఛాన్స్ View this post on Instagram A post shared by ICC (@icc) -
దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్న నెదర్లాండ్స్..
వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికాకు పసికూన నెదర్లాండ్స్ చుక్కలు చూపిస్తోంది. 246 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రోటీస్ బ్యాటర్లు తడబడుతున్నారు. డచ్ బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా టాపర్డర్ కుప్పకూలింది. కేవలం 89 పరుగులకే ప్రోటీస్ 5 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా నెదర్లాండ్స్ స్పిన్నర్ వాన్ డెర్ మెర్వే.. ప్రోటీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇప్పటివరకు 4 ఓవర్లు బౌలింగ్ చేసిన వాన్ డెర్ మెర్వే.. కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కోలిన్ అకెర్మాన్, వాన్‌మీకరన్, వాన్‌బీక్ తలా వికెట్ సాధించారు. ప్రోటీస్ టాపర్డర్‌లో బావుమా(16), డికాక్(20), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(4), మార్క్రమ్(1),క్లాసెన్(28), పరుగులు చేశారు. ప్రస్తుతం 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్లర్(17). జానెసన్(2) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 157 పరుగులు కావాలి. కాగా ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించారు. చదవండి: WC 2023: ఇదేమి బాల్ రా బాబు.. బ్యాటర్‌కు కాకుండా స్లిప్‌కు! వీడియో వైరల్ -
ఐపీఎల్లో నిరాశపరిచినా.. సౌతాఫ్రికా లీగ్‌లో మాత్రం దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్
Sunrisers Eastern Cape: గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో ఘోర పరాజయాలు మూటగట్టుకుంటూ, ఫ్యాన్స్ తలెత్తుకోలేకుండా చేసిన సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం అబ్బురపడే ప్రదర్శన కనబరుస్తూ, వరుస విజయాలతో అదరగొడుతుంది. సీజన్‌ను వరుస పరాజయాలతో ప్రారంభించినా, ఆతర్వాత హ్రాటిక్ విజయాలు, మధ్యలో ఓ ఓటమి, తాజాగా (జనవరి 22) మరో భారీ విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 17 పాయింట్లు) ఎగబాకింది. డర్బన్ సూపర్ జెయింట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్.. ఓపెనర్లు ఆడమ్ రాస్సింగ్టన్ (30 బంతుల్లో 72; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), జోర్డాన్ హెర్మన్ (44 బంతుల్లో 59; 9 ఫోర్లు, సిక్స్) విధ్వంసకర అర్ధశతకాలతో, కెప్టెన్ మార్క్రమ్ (34 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), ట్రిస్టన్ స్టబ్స్ (13 బంతుల్లో 27 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ జెయింట్స్ టీమ్.. రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్ (4-0-20-6) స్పిన్ మాయాజాలం ధాటికి విలవిలలాడిపోయి 86 పరుగులకే కుప్పకూలింది. సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో కైల్ మేయర్స్ (11), వియాన్ ముల్దర్ (29), కేశవ్ మహారాజ్ (12 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో వాన్ డెర్ మెర్వ్ ఆరేయగా.. జెజె స్మట్స్, మార్క్రమ్, జన్సెన్, మాసన్ క్రేన్ తలో వికెట్ పడగొట్టారు. మినీ ఐపీఎల్‌గా పిలువబడే సౌతాఫ్రికా లీగ్ తొలి సీజన్లో సన్‌రైజర్స్ అద్భుత ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యమే ఎస్ఏ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. -
ఆ క్యాచ్‌తో తారుమారు: సౌతాఫ్రికాలోనే పుట్టి ఆ జట్టునే దెబ్బ కొట్టి.. తెలుగు కుర్రాడు కూడా
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Netherlands: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీలో సూపర్-12 చేరాలంటే ఇతర జట్ల ఫలితంపై ఆధారపడ్డ నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికాను ఓడించి సంచలనం సృష్టించిన విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్-12లో భాగంగా తమ ఆఖరి మ్యాచ్‌లో మేటి జట్టు ప్రొటిస్‌తో ఆదివారం తలపడ్డ డచ్ జట్టు అంచనాలు తలకిందులు చేసింది. సౌతాఫ్రికా తమ ‘చోకర్స్ ట్యాగ్‌ను నిలబెట్టుకునేలా’ చావు దెబ్బ కొట్టింది. బవుమా బృందాన్ని 13 పరుగుల తేడాతో ఓడించి సఫారీల సెమీస్ అవకాశాలను గల్లంతు చేసింది. మేటి జట్లతో పాటుగా గ్రూప్-2 పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచి చరిత్ర సృష్టించింది. ప్రొటిస్ చేజేతులా ఇక స్టార్ పేసర్లున్న దక్షిణాఫ్రికా జట్టు డచ్ జట్టు బ్యాటర్లను కట్టడి చేయలేక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కూల్చి 158 పరుగులు చేసే అవకాశం ఇచ్చింది. మరి లక్ష్య ఛేదనలో బ్యాటర్లు మెరుగ్గా ఆడారా అంటే అదీ లేదు. ఓపెనర్లు క్వింటన్ డికాక్ 13, తెంబా బవుమా 20, ఈ ఎడిషన్‌లో తొలి సెంచరీ వీరుడు రిలీ రోసో 25 పరుగులు చేయగా.. మార్కరమ్ 17, డేవిడ్ మిల్లర్ 17, హెన్రిచ్ క్లాసెన్ 21 పరుగులకే పరిమితమయ్యారు. మ్యాచ్ ఫలితాన్నే మార్చి వేసేలా అద్భుత క్యాచ్ ముఖ్యంగా జట్టును ఒంటిచేత్తో గెలిపించగల కిల్లర్ మిల్లర్ అవుట్ కావడంతో సఫారీ జట్టు ఓటమి దిశగా పయనించింది. మరి మిల్లర్‌ను అద్భుత క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపింది ఎవరో తెలుసా? నెదర్లాండ్స్ ఆటగాడు వాన్ డర్ మెర్వ్. అతడు పట్టిన సూపర్ క్యాచ్‌తోనే సఫారీ టీమ్ ఓటమి దిశగా మళ్లింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. 2009, 2010 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా తరఫునే ఆడిన వాన్ డర్ మెర్వ్ ఈసారి అదే జట్టును దెబ్బ కొట్టాడు. విజయానికి 29 బంతుల్లో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో 16వ ఓవర్లో డచ్ బౌలర్ గ్లోవర్ వేసిన బంతిని మిల్లర్ పుల్ చేయబోగా బంతి అనూహ్యంగా గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్‌లెగ్‌లో ఉన్న మెర్వ్ వెనక్కి తిరిగి పరుగెడుతూ స్క్వేర్‌లెగ్ వద్ద అద్భుత రీతిలో క్యాచ్ అందుకున్నాడు. దీంతో మిల్లర్ నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. View this post on Instagram A post shared by ICC (@icc) సౌతాఫ్రికాకు ఆడి.. ఆ జట్టునే దెబ్బ కొట్టి వాన్ డర్ మెర్వ్ ఒక్కడే కాదు.. ప్రొటిస్‌తో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను గెలిపించిన స్టీఫెన్ మైబర్గ్, కొలిన్ అకర్మన్, బ్రెండన్ గ్లోవర్ దక్షిణాఫ్రికాలోనే పుట్టి అక్కడే దేశవాళీ క్రికెట్ ఆడటం విశేషం. ఆ తర్వాత వీళ్లంతా నెదర్లాండ్స్‌కు వలస వెళ్లారు. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా నిలిచి నెదర్లాండ్స్‌ను గెలుపులో కీలక పాత్ర పోషించిన అకర్మెన్ ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడం మరో విశేషం. మన వాళ్లు కూడా! టీ20 ప్రపంచకప్-2022కు ఎంపికైన డచ్ జట్టులో సౌతాఫ్రికాకు చెందిన ప్లేయర్లు మాత్రమే కాదు.. భారత్‌లో పుట్టిన క్రికెటర్లు కూడా ఉండటం గమనార్హం. అందునా తెలుగు నేలపై పుట్టిన ఆటగాడు మరో విశేషం. ఎడమచేతి వాటం గల బ్యాటర్ విక్రమ్‌జిత్ సింగ్ పంజాబ్‌లో జన్మించి నెదర్లాండ్స్‌కు వలస వెళ్లగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన తేజ నిడమానూరు కూడా ఈ జట్టులో ఉన్నాడు. ఇక సూపర్-12లో భాగంగా విక్రమ్‌జిత్ టీమిండియాతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి ఒక్క పరుగు మాత్రమే చేయగా.. 28 ఏళ్ల తేజకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. View this post on Instagram A post shared by Teja Nidamanuru (@teja_52) చదవండి: T20 WC 2022: సెమీ ఫైనల్ జట్లు, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర వివరాలు T20 WC IND Vs ENG Semi Final: ఇంగ్లండ్‌తో మ్యాచ్ సవాలే.. యువీలాగే సూర్య దంచికొడితే! View this post on Instagram A post shared by ICC (@icc)