దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్న నెదర్లాండ్స్‌.. | CWC 2023, SA vs NED: Proteas 5 down as Klaasen departs | Sakshi
Sakshi News home page

WC 2023: దక్షిణాఫ్రికాకు చుక్కలు చూపిస్తున్న నెదర్లాండ్స్‌..

Published Tue, Oct 17 2023 9:20 PM | Last Updated on Wed, Oct 18 2023 9:01 AM

Proteas 5 down as Klaasen departs - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో దక్షిణాఫ్రికాకు పసికూన నెదర్లాండ్స్‌ చుక్కలు చూపిస్తోంది. 246 పరుగుల లక్ష్య ఛేదనలో ప్రోటీస్‌ బ్యాటర్లు తడబడుతున్నారు. డచ్‌ బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా టాపర్డర్‌ కుప్పకూలింది. కేవలం 89 పరుగులకే ప్రోటీస్‌ 5 వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా నెదర్లాండ్స్‌ స్పిన్నర్‌ వాన్ డెర్ మెర్వే.. ప్రోటీస్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇప్పటివరకు 4 ఓవర్లు బౌలింగ్‌ చేసిన వాన్ డెర్ మెర్వే.. కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

అతడితో పాటు కోలిన్ అకెర్మాన్, వాన్‌మీకరన్‌, వాన్‌బీక్‌ తలా వికెట్‌ సాధించారు. ప్రోటీస్‌ టాపర్డర్‌లో బావుమా(16), డికాక్‌(20), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(4), మార్‌క్రమ్‌(1),క్లాసెన్‌(28), పరుగులు చేశారు. ప్రస్తుతం 20 ఓవర్లలో దక్షిణాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్‌ మిల్లర్‌(17). జానెసన్‌(2) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 157 పరుగులు కావాలి. కాగా ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించారు.


చదవండి: WC 2023: ఇదేమి బాల్‌ రా బాబు.. బ్యాటర్‌కు కాకుండా స్లిప్‌కు! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement