2023 వన్డే ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ తమకంటే చాలా రెట్లు మెరుగైన బంగ్లాదేశ్‌కు ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ను బంగ్లా బౌలర్లు నామమాత్రపు స్కోర్‌కే (229 పరుగులు) కట్టడి చేసినప్పటికీ.. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా తడబడిన బంగ్లా పులులు 142 పరుగులకు ఆలౌటై, 87 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు.
తక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేసుకోవడంలో అద్భుతమైన పోరాటపటిమ కనబర్చిన నెదర్లాండ్స్ బౌలర్లు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బంగ్లాదేశ్‌ను మట్టికరిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లు పాల్ వాన్ మీకెరెన్ (4/23), బాస్ డి లీడ్ (2/25) బంగ్లా పతనాన్ని శాసించారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో మెహిది హసన్ మీరజ్ (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ప్రస్తుత ప్రపంచకప్‌లో పటిష్టమైన సౌతాఫ్రికాను ఓడించి సంచలనం సృష్టించిన నెదర్లాండ్స్ తాజాగా బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్‌ను చివరి స్థానానికి నెట్టి ఎనిమిదో స్థానానికి ఎగబాకింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ స్కాట్ ఎడ్వర్డ్స్ (68), వెస్లీ బరెస్సీ (41), సైబ్రాండ్ (35), లొగాన్ వాన్ బీక్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment