
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా వరుసగా 9వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 160 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. కాగా ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తన మంచిమనసును చాటు కున్నాడు. కోహ్లి తన సంతకం చేసిన జెర్సీని వాన్ డెర్ మెర్వేకు గిఫ్ట్‌గా ఇచ్చాడు.
జెర్సీని ఇచ్చి నవ్వుతూ అతడిని కోహ్లి అలింగనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. డచ్ ఆటగాళ్లు కూడా భారత అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఈ వీడియోలో కన్పించింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్ 2009, 2010 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున కోహ్లి, వాన్ డెర్ మెర్వే కలిసి ఆడారు. అప్పటినుంచే వీరిద్దరి మధ్య మంచి స్నేహం బంధం ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లిని వాన్ డెర్ మెర్వే క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం.
చదవండి: World Cup 2023: వరల్డ్‌కప్ అత్యుత్తమ జట్టు ఇదే.. కెప్టెన్‌గా కోహ్లి! రోహిత్‌కు నో ఛాన్స్
Comments
Please login to add a commentAdd a comment