
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025(ICC Champions Trophy)లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఈ మెగా టోర్నీ గ్రూపు-బిలో భాగంగా లహోర్ వేదికగా దక్షిణాఫ్రికా-అఫ్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రోటీస్ జట్టు ఈ మ్యాచ్‌లో నలుగురు పేస్ బౌలర్లతో ఆడుతోంది.
ఈ మ్యాచ్‌కు విధ్వంసకర ఆటగాడు హెన్రిస్ క్లాసెన్ గాయం కారణంగా దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో క్లాసెన్ ఎడమ మోచేయికి గాయమైంది. ఈ విషయాన్ని ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా టాస్ సందర్బంగా వెల్లడించాడు. మరోవైపు అఫ్గానిస్తాన్ జట్టు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో ఆడుతోంది.
కాగా వన్డే ప్రపంచకప్-2023లో దక్షిణాఫ్రికాను అఫ్గాన్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని అఫ్గాన్ భావిస్తోంది. ప్రోటీస్ మాత్రం గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. కాగా గ్రూపు-బిలో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.
తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్ ఆహ్మద్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి
చదవండి: గిల్ సెంచరీ కోసం హాఫ్ సెంచరీని త్యాగం చేసిన రాహుల్.. అదే హార్దిక్ అయ్యుంటే..!
Comments
Please login to add a commentAdd a comment