టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీలోని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే 195 పరుగులను ఛేదించి అందరని షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ను పసికూన పపువా న్యూ గినియా ఓడించే అంతా పనిచేసింది.
ఇక రెండు మ్యాచ్‌లు ఒక ఎత్తు. సోమవారం బార్బోడస్ వేదికగా ఒమన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఎత్తు. ఒమన్-నమీబియా మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇరు జట్లు సమాన స్ధాయిలో పోరాడడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
సూపర్ ఓవర్‌లో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోలో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 109 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ఒమన్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నమీబియా కూడా సరిగ్గా నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సూపర్ ఓవర్‌లో ఫలితం తేల్చాల్సి వచ్చింది.
దంచి కొట్టిన డేవిడ్ వీస్, ఎరాస్మస్..
ఇక సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగుల చేసింది. నమీబియా బ్యాటర్లలో డేవిడ్ వీస్ 13 పరుగులు చేయగా.. ఎరాస్మస్ 8 పరుగులు చేశాడు. సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన డేవిడ్ వీస్.. బౌలింగ్‌లో కూడా సత్తాచాటాడు.
తొలి రెండు బంతులకు 2, 0 రాగా.. మూడో బంతికి నమీస్ కుషిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రెండు బంతులకు ఒక్కో పరుగు చొప్పున ఇచ్చి వీస్ జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ ఇచ్చినప్పటికి ఒమన్‌కు చేయాల్సిన నష్టం వీస్ చేసేశాడు.
12 ఏళ్ల తర్వాత తొలి సూపర్ ఓవర్..
కాగా టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ జరగడం ఇది మూడో సారి. చివరగా 2012 టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ జరిగింది. 2012 పొట్టి ప్రపంచకప్‌లో కాండీ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ ద్వారానే ఫలితం తేలింది.
అదే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్, కివీస్ మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దారితీసింది. కాగా 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టై అయినప్పటికి సూపర్ ఓవర్ ద్వారా కాకుండా బాల్ అవుట్ ద్వారా ఫలితం తేల్చారు.
నమీబియా అరుదైన రికార్డు..
ఇక సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన నమీబియా అరుదైన రికార్డు సాధించింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్ ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నమీబియా రికార్డులకెక్కింది. ఒమన్‌తో మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో నమీబియా ఏకంగా 21 పరుగులు సాధించింది.
అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2012 టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌పై సూపర్ ఓవర్‌లో విండీస్ 19 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో విండీస్ రికార్డును నమీబియా బ్రేక్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment