Oman cricket team
-
12 ఏళ్ల తర్వాత తొలి సూపర్ ఓవర్.. నమీబియా వరల్డ్ రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీలోని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే 195 పరుగులను ఛేదించి అందరని షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ను పసికూన పపువా న్యూ గినియా ఓడించే అంతా పనిచేసింది.ఇక రెండు మ్యాచ్‌లు ఒక ఎత్తు. సోమవారం బార్బోడస్ వేదికగా ఒమన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఎత్తు. ఒమన్-నమీబియా మ్యాచ్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఇరు జట్లు సమాన స్ధాయిలో పోరాడడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్లో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోలో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 109 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ఒమన్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నమీబియా కూడా సరిగ్గా నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సూపర్ ఓవర్లో ఫలితం తేల్చాల్సి వచ్చింది.దంచి కొట్టిన డేవిడ్ వీస్, ఎరాస్మస్..ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 21 పరుగుల చేసింది. నమీబియా బ్యాటర్లలో డేవిడ్ వీస్ 13 పరుగులు చేయగా.. ఎరాస్మస్ 8 పరుగులు చేశాడు. సూపర్ ఓవర్లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన డేవిడ్ వీస్.. బౌలింగ్‌లో కూడా సత్తాచాటాడు.తొలి రెండు బంతులకు 2, 0 రాగా.. మూడో బంతికి నమీస్ కుషిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రెండు బంతులకు ఒక్కో పరుగు చొప్పున ఇచ్చి వీస్ జట్టు విజయాన్ని లాంఛనం చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ ఇచ్చినప్పటికి ఒమన్‌కు చేయాల్సిన నష్టం వీస్ చేసేశాడు.12 ఏళ్ల తర్వాత తొలి సూపర్ ఓవర్..కాగా టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ జరగడం ఇది మూడో సారి. చివరగా 2012 టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ జరిగింది. 2012 పొట్టి ప్రపంచకప్‌లో కాండీ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్ ద్వారానే ఫలితం తేలింది. అదే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్, కివీస్ మ్యాచ్ కూడా సూపర్ ఓవర్ దారితీసింది. కాగా 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ టై అయినప్పటికి సూపర్ ఓవర్ ద్వారా కాకుండా బాల్ అవుట్ ద్వారా ఫలితం తేల్చారు.నమీబియా అరుదైన రికార్డు..ఇక సూపర్ ఓవర్లో విజయం సాధించిన నమీబియా అరుదైన రికార్డు సాధించింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నమీబియా రికార్డులకెక్కింది. ఒమన్‌తో మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో నమీబియా ఏకంగా 21 పరుగులు సాధించింది.అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2012 టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌పై సూపర్ ఓవర్లో విండీస్ 19 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో విండీస్ రికార్డును నమీబియా బ్రేక్ చేసింది. -
ప్రపంచకప్‌లో సంచలనం.. టీ20 చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
టీ20 వరల్డ్‌కప్-2024ను నమీబియా విజయంతో ఆరంభించింది. సోమవారం బార్బోడస్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది.దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన చేసిన నమీబియా.. డేవిడ్ వీస్, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం 10 పరుగులు మాత్రమే చేసింది.దీంతో నమీబియా విజయభేరి మ్రోగించింది. నమీబియా విజయంలో ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ కీలక పాత్ర పోషించాడు.టీ20 క్రికెట్ చరిత్రలో..ఇక ఈ మ్యాచ్‌లో నమీబియా పేసర్ ట్రంపెల్మన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఒమన్ బ్యాటర్లకు ట్రంపెల్మన్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ ఆది నుంచే ఒమన్ బ్యాటర్లకు ఈ నమీబియన్ ముప్పుతిప్పలు పెట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ట్రంపెల్మన్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు.ఈ క్రమంలో ట్రంపెల్మన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో తొలి ఓవర్ తొలి రెండు బంతుల్లోనే రెండు వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా ట్రంపెల్మన్ రికార్డులకెక్కాడు.ఇప్పటివరకు జరిగిన 2633 అంతర్జాతీయ టీ20ల్లో ఏ బౌలర్ కూడా ఈ ఘనత సాధించలేదు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఓవర్ వేసిన ట్రంపెల్మన్.. వరుసగా ప్రజాపతి, ఇలియాస్‌ను ఔట్ చేసి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
నరాలు తెగే ఉత్కంఠ.. సూపర్ ఓవర్లో ఫలితం! నమీబియా విజయం
టీ20 వరల్డ్‌కప్-2024లో బార్బడోస్ వేదికగా ఒమాన్-నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు సమాన స్థాయిలో పోరాడడంతో మ్యాచ్ ఫలితం సూపర్ ఓవర్లో తేలింది. ఒమాన్‌పై సూపర్ ఓవర్లో నమీబియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. డేవిడ్ వీస్, ఎరాస్మస్ చెలరేగడంతో 6 బంతుల్లో 21 పరుగులు చేసింది. అనంతరం 22 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ 6 బంతుల్లో వికెట్ కోల్పోయి కేవలం1 0 పరుగులు మాత్రమే చేసింది. సూపర్ ఓవర్ బౌలింగ్ చేసిన డేవిస్ వీస్ ఒమన్ బ్యాటర్లకు ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు.చెలరేగిన నమీబియా బౌలర్లు..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమాన్.. నమీబియా బౌలర్ల దాటికి 19.4 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది. నమీబియా పేసర్ రూబెన్ ట్రంపెల్మాన్ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించగా.. ఆల్‌రౌండర్ డేవిస్ వీస్ 3, కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ రెండు, స్కోల్జ్ ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో ఖలీద్ కైల్(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మక్సూద్(22) పరుగులతో రాణించాడు.వారెవ్వా మెహ్రాన్ ఖాన్..110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా కూడా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా 109 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. కాగా ఈ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు రావడంలో ఒమన్ ఆల్‌రౌండర్ మెహ్రాన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు.ఆఖరి ఓవర్లో నమీబియా విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరమవ్వగా.. ఒమన్ బౌలర్ మెహ్రాన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టును పోటీలో ఉంచాడు. కానీ దురదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో ఒమన్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన మెహ్రాన్ ఖాన్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. -
Oman T20 WC Squad: టీ20 వరల్డ్‌కప్‌కు జట్టును ప్రకటించిన ఒమన్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఒమన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ అకిబ్ ఇలియాస్ సారథ్యం వహించనున్నాడు. ఇప్పటివరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జీషన్ మక్సూద్‌పై వేటు వేసిన ఒమన్ క్రికెట్.. ఆ బాధ్యతలను ఇలియాస్ అప్పగించింది. ఇలియస్ గత కొంత కాలంగా ఒమన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ఏసీసీ ప్రీమియర్ కప్‌లో అదరగొట్టిన ఆటగాళ్లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది. ఈ జట్టులో బిలాల్ ఖాన్, కలీముల్లా, జీషన్ మక్సూద్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.అయితే మరో సీనియర్ ఆటగాడు జతీందర్ సింగ్‌కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. జతీందర్ సింగ్‌కు రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చోటుక్కింది. ఇక ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. తుది జట్లుఅకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే (వికెట్ కీపర్), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మొహమ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ (వికెట్ కీపర్), మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్.రిజర్వ్‌లు: జతీందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా -
ఒమన్‌పై విజయం.. వరల్డ్‌కప్ అర్హత దిశగా జింబాబ్వే
సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ పోటీలో జింబాబ్వే ఎదురులేకుండా సాగుతోంది. గురువారం మొదలైన సూపర్ సిక్స్ పోటీల్లో జింబాబ్వే, ఒమన్‌లు తలపడ్డాయి. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే విషయంలో మరింత దగ్గరైంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. సీనియర్ బ్యాటర్ సీన్ విలియమ్సన్(103 బంతుల్లో 142 పరుగులు, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) టోర్నీలో మూడో శతకంతో చెలరేగాడు. సికందర్ రజా 49 బంతుల్లో 42 పరుగులు చేయగా.. ఆఖర్లో జాంగ్వే 28 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒమన్ బౌలర్లలో ఫయాజ్ బట్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 333 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఒమన్ శక్తికి మించి పోరాటం చేసింది. ఓపెనర్ కశ్యప్ ప్రజాపతి 97 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్లో అకీబ్ ఇల్యాస్ 45, జీషన్ మక్సూద్ 37, ఆయానా ఖాన్ 47 పరుగులు చేశాడు. ఒక దశలో 42 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 248 పరుగులతో గెలిపించేలా అనిపించింది. ఆ తర్వాత వరుస విరామాల్లో మూడు వికెట్లు కోల్పోయింది. అయితే చివర్లో మొహమ్మద్ నదీమ్ 18 బంతుల్లోనే 30 పరుగులు నాటౌట్ ఆశలు రేపినా మిగతావారు సహకరించడంలో విఫలమయ్యారు. దీంతో ఒమన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానిక 318 పరుగులకు పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ, తెందయి చతారాలు చెరో మూడు వికెట్లు తీయగా.. రిచర్డ్ నగర్వా రెండు,సికందర్ రజా ఒక వికెట్ పడగొట్టాడు. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన జింబాబ్వే 4 పాయింట్లతో సూపర్ సిక్స్‌లో రెండో టాపర్‌గా అడుగుపెట్టింది. తాజాగా ఒమన్‌పై విజయంతో పాయింట్ల సంఖ్యను ఆరుకి పెంచుకుంది. మరొక విజయం సాధిస్తే జింబాబ్వే అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా జరగనున్ను వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది. A hard-fought win! 🇿🇼 beat Oman by 1⃣4⃣ runs in the first match of the Super Six 🙌 📝: https://t.co/wBKKKFmDjo #ZIMvOMA | #CWC23 pic.twitter.com/aTn5aruPjo — Zimbabwe Cricket (@ZimCricketv) June 29, 2023 చదవండి: 58 గంటల ప్రయాణం.. తీరా వస్తే టికెట్ దొరకలేదు; కట్‌చేస్తే Ashes 2023: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్ -
పసికూనపై శ్రీలంక ప్రతాపం.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫియర్స్-2023లో శ్రీలంక మరో విజయం నమోదు చేసింది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో శ్రీలంక గెలుపొందింది. 96 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. కేవలం 15 ఓవర్లలలోనే ఛేదించింది. శ్రీలంక ఓపెనర్లు దిముత్ కరుణ రత్నే(61), నిస్సాంక(37) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఒమెన్ శ్రీలంక బౌలర్ల ధాటికి కేవలం 98 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో హాసరంగా ఐదు వికెట్లతో ఒమన్‌ను దెబ్బ తీయగా.. లహిరు కుమార మూడు, రజితా ఒక్క వికెట్ సాధించారు. ఒమన్ బ్యాటర్లలో అయాన్ ఖాన్(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ ఈవెంట్లో హాసరంగా ఐదు వికెట్ల ఘనత సాధించడం రెండో సారి. ఈ టోర్నీలో గ్రూపు-బిలో ఉన్న లంక వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. శ్రీలంక తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం ఐర్లాండ్‌తో తలపడనుంది. చదవండి: అసలు పోరులో తుస్సు! జట్టు నుంచి అవుట్.. నీ సహచర ఆటగాడిని చూడు! -
T20 World Cup 2021 : ఒమన్ జట్టులో హైదరాబాదీ క్రికెటర్..
Hyderabad Born Cricketer Sandeep Goud Playing For Oman Cricket Team: టీ20 ప్రపంచకప్-2021కు అర్హత సాధించిన 8 క్వాలిఫయర్స్ జట్లలో ఒకటైన ఒమన్ జట్టులో హైదరాబాద్ బార్న్ క్రికెటర్ చోటు దక్కించుకున్నాడు. నగరంలోని కవాడిగూడకు చెందిన 29 ఏళ్ల శ్రీమంతుల సందీప్ గౌడ్.. 2016లో ఉద్యోగ రిత్యా ఒమన్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయ్యాడు. ఈ క్రమంలో అక్కడి దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి 2019 ఫిబ్రవరిలో ఒమన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ గౌడ్.. ఇప్పటివరకు 19 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. సందీప్ 2005-08 మధ్యలో హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే, ఒమన్-పపువా న్యూ గినియా జట్ల మధ్య ఇవాళ ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో సందీప్ ఒమన్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. చదవండి: 17 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటించనున్న టీమిండియా..! -
వసీం జాఫర్ మేనల్లుడి అద్భుత శతకం.. రెండో వన్డేలో ముంబై ఘన విజయం
మస్కట్: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మేనల్లుడు అర్మాన్ జాఫర్ (114 బంతుల్లో 122; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఒమన్‌తో జరిగిన రెండో వన్డేలో ముంబై జట్టు 231 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అర్మాన్తో పాటు సుజిత్ నాయక్ (70 బంతుల్లో 73; 6 ఫోర్లు) రాణించాడు. ఒమన్ బౌలర్లలో మహ్మద్ నదీమ్ 4, నెసట్ర్ దంబా 2, కలీముల్లా, ఆకిబ్ ఇలియాస్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఒమన్ ముంబై బౌలర్లు మోహిత్ అవస్థి (4/31), ధుర్మిల్ మట్కర్ (3/21), దీపక్ షెట్టి (2/9), అమాన్ ఖాన్(1/8) ధాటికి 22.5 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. ఒమన్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ నదీమ్(35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో 4 వన్డేల సిరీస్‌లో ముంబై 2-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో కూడా ముంబై జట్టే విజయం సాధించింది. మూడో వన్డే సెప్టెంబర్ 2న జరుగనుంది. చదవండి:క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ బౌలర్.. -
చెలరేగిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్..
మస్కట్: ముంబై జట్టు ఓమన్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి వన్డేలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (79 బంతుల్లో 82; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హార్ధిక్ తామోర్(70 బంతుల్లో 51; 4 ఫోర్లు) రాణించడంలో ముంబై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఓమన్.. ముంబై కెప్టెన్ షమ్స్ ములానీ (3/45), శశాంక్ (2/27), అమన్ (2/26) ధాటికి 47.1ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. ఓమన్ బ్యాట్స్‌మెన్ ఖాలిద్ కైల్(84 బంతుల్లో 76; 4 ఫోర్లు, సిక్స్), ఖవర్ అలీ(73 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఛేదనలో ముంబై జట్టు 43.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓమన్ బౌలర్లలో షకీల్ ఖాన్, రఫీవుల్లా తలో 2 వికెట్లు, బిలాల్ షా, ఫయాజ్ భట్ చెరో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం జరుగనుంది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్‌రౌండర్ -
తొలిసారి టి20 ప్రపంచకప్‌కు ఒమన్
డబ్లిన్: మధ్య ప్రాచ్య దేశం ఒమన్ క్రికెట్ జట్టుకు చారిత్రాత్మక క్షణమిది! సీనియర్ స్థాయి క్రికెట్లో ఆ జట్టు తొలిసారి ప్రపంచకప్ పోటీల్లో పాల్గొనబోతుండటం విశేషం. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టి20 వరల్డ్ కప్‌కు ఒమన్ క్వాలిఫై అయింది. గురువారం ఇక్కడ జరిగిన నాలుగో క్వాలిఫయింగ్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఒమన్ 5 వికెట్ల తేడాతో నమీబియాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 148 పరుగులు చేసింది. అనంతరం ఒమన్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతకు ముందు మూడో ప్లే ఆఫ్‌లో పపువా న్యూగినియాను 6 వికెట్లతో ఓడించి అఫ్ఘనిస్తాన్ కూడా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయింది. మొత్తం ఆరు క్వాలిఫయింగ్ బెర్త్‌లకు అవకాశం ఉండగా ఈ రెండు జట్లతో పాటు ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, హాంకాంగ్ ఇప్పటికే అర్హత సాధించాయి