టీ20 వరల్డ్‌కప్-2024కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఒమన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ అకిబ్ ఇలియాస్ సారథ్యం వహించనున్నాడు. ఇప్పటివరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జీషన్ మక్సూద్‌పై వేటు వేసిన ఒమన్ క్రికెట్.. ఆ బాధ్యతలను ఇలియాస్ అప్పగించింది.
ఇలియస్ గత కొంత కాలంగా ఒమన్ క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ఏసీసీ ప్రీమియర్ కప్‌లో అదరగొట్టిన ఆటగాళ్లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది. ఈ జట్టులో బిలాల్ ఖాన్, కలీముల్లా, జీషన్ మక్సూద్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు.
అయితే మరో సీనియర్ ఆటగాడు జతీందర్ సింగ్‌కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. జతీందర్ సింగ్‌కు రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో చోటుక్కింది. ఇక ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
తుది జట్లు
అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే (వికెట్ కీపర్), అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మొహమ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ (వికెట్ కీపర్), మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్.
రిజర్వ్‌లు: జతీందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా
Comments
Please login to add a commentAdd a comment