మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024కు సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చింది. మెగా టోర్నీ కోసం వ్యాఖ్యాతల ప్యానెల్‌ను ఐసీసీ ఇవాళ (అక్టోబర్ 2) విడుదల చేసింది. కామెంటేటర్ల జాబితాలో వరల్డ్‌కప్ విన్నర్లు మెల్ జోన్స్, లిసా స్థాలేకర్, స్టేసీ ఆన్ కింగ్, లిడియా గ్రీన్‌వే, కార్లోస్ బ్రాత్‌వైట్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కేటీ మార్టిన్, డబ్ల్యూవీ రామన్, సనా మిర్ వరల్డ్‌కప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు.
భారత్ నుంచి అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్‌లకు కామెంటేటర్ల ప్యానెల్‌లో చోటు దక్కింది. అంజుమ్, మిథాలీ మెగా టోర్నీ మొత్తానికి ఎక్స్‌పర్ట్స్ ఇన్‌సైట్స్ అందిస్తారు. వ్యాఖ్యాతల ప్యానెల్‌లో వెటరన్లు ఇయాన్ బిషప్, కస్ నాయుడు, నాసిర్ హుసేన్, నతాలీ జెర్మనోస్, అలీసన్ మిచెల్, ఎంపుమలెలో ఎంబాగ్వా, లారా మెక్‌గోల్డ్‌రిక్ కూడా ఉన్నారు.
కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న ఆడుతుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది.
అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. గ్రూప్-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment