Commentary
-
టీ20 వరల్డ్‌కప్.. కామెంటేటర్ల జాబితా విడుదల
మహిళల టీ20 వరల్డ్‌కప్ 2024కు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. మెగా టోర్నీ కోసం వ్యాఖ్యాతల ప్యానెల్‌ను ఐసీసీ ఇవాళ (అక్టోబర్ 2) విడుదల చేసింది. కామెంటేటర్ల జాబితాలో వరల్డ్‌కప్ విన్నర్లు మెల్ జోన్స్, లిసా స్థాలేకర్, స్టేసీ ఆన్ కింగ్, లిడియా గ్రీన్వే, కార్లోస్ బ్రాత్‌వైట్‌లకు చోటు దక్కింది. వీరితో పాటు కేటీ మార్టిన్, డబ్ల్యూవీ రామన్, సనా మిర్ వరల్డ్‌కప్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. భారత్ నుంచి అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్‌లకు కామెంటేటర్ల ప్యానెల్లో చోటు దక్కింది. అంజుమ్, మిథాలీ మెగా టోర్నీ మొత్తానికి ఎక్స్పర్ట్స్ ఇన్సైట్స్ అందిస్తారు. వ్యాఖ్యాతల ప్యానెల్లో వెటరన్లు ఇయాన్ బిషప్, కస్ నాయుడు, నాసిర్ హుసేన్, నతాలీ జెర్మనోస్, అలీసన్ మిచెల్, ఎంపుమలెలో ఎంబాగ్వా, లారా మెక్గోల్డ్రిక్ కూడా ఉన్నారు.కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 4న ఆడుతుంది. దుబాయ్ వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌తో తలపడుతుంది. అక్టోబర్ 6న చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి గ్రూప్-ఏలో పోటీపడుతుంది. గ్రూప్-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. చదవండి: Irani Cup 2024: సచిన్, ద్రవిడ్ సరసన సర్ఫరాజ్ -
IPL 2024: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇలా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ముందడుగు పడింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల కోసం సంకేత భాష మరియు వివరణాత్మక వ్యాఖ్యానాన్ని అందించనున్నారు. చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల సౌకర్యార్దం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఈ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఈ తరహా వ్యాఖ్యానం అమల్లోకి రానుంది. ఈ నూతన ఒరవడిని అమల్లో పెట్టేందుకు ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ ఇండియా సైనింగ్ హ్యాండ్స్ (ISH) న్యూస్‌తో చేతులు కలిపింది. ఐఎస్హెడ్ నిపుణుల ఆధ్వర్యంలో ఫీడ్‌ను భారతీయ సంకేత భాషను ఉపయోగించి బాల్ టు బాల్ అప్డేట్స్ ఇస్తామని స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. సంకేత బాష ఫీడ్‌తో పాటు సాధారణ వెర్బల్ స్కోర్ అప్డేట్స్ కూడా ఉంటాయని పేర్కొంది. ఈ వెసులుబాటుతో చెవిటి, దృష్టి లోపం ఉన్న క్రికెట్ అభిమానులు గేమ్‌లోని ప్రతి క్షణాన్ని ఆస్వాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
ఇక్కడైతే రోజుకు రూ. 25 లక్షలు..
దాదాపు పదేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ కామెంటేటర్‌గా పునరాగమనం చేయనున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు. మరోసారి తన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీని ధ్రువీకరిస్తూ సిద్ధు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తన ఫస్ట్ లవ్ క్రికెట్ అన్న ఈ పంజాబీ బ్యాటర్.. చేపకు ఈత నేర్పడం ఎటువంటిదో తనకు కామెంట్రీ గురించి ఎవరైనా కొత్తగా చెప్పడం కూడా అలాంటిదేనన్నాడు. గ్యాప్ వచ్చినా తన మాటల పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానన్నాడు సిద్ధు. తన కెరీర్లో కఠిన సవాళ్ల అనంతరం సుమారు 20 సార్లు రీఎంట్రీ ఇచ్చానన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు.. కామెంటేటర్‌గా మాత్రం ఇదే తొలి కమ్‌బ్యాక్ అని పేర్కొన్నాడు. వ్యాఖ్యాతగా ప్రయాణం ప్రారంభించాలనుకున్నపుడు తను ఏమాత్రం కాన్ఫిడెంట్‌గా లేనన్న సిద్ధు.. వరల్డ్‌కప్ లాంటి మెగా ఈవెంట్లో కూడా అదరగొట్టడం అభిమానులతో పాటు తననూ ఆశ్చర్యపరిచిందన్నాడు. గతంలో ఇలాంటి మేజర్ టోర్నీ మొత్తం కామెంట్రీ చేసినందుకు రూ. 60- 70 లక్షలు పారితోషకంగా అందుకునే వాడినన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు.. ఐపీఎల్లో మాత్రం రోజుకు రూ. 25 లక్షలు వస్తాయని చెప్పాడు. అయితే, ఐపీఎల్లో కేవలం డబ్బు వల్ల మాత్రమే సంతృప్తి దొరకదని.. పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను దగ్గరగా గమనిస్తూ సమయం గడపటం సరదాగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 కంటే ముందు ఐపీఎల్ రూపంలో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరకనుందన్న సిద్ధు.. ఇప్పుడు అందరి కళ్లు క్యాష్ రిచ్ లీగ్ మీదనే ఉన్నాయన్నాడు. కేవలం టీమిండియా ఆటగాళ్లకే కాకుండా ప్రధాన జట్టు ఆటగాళ్లంతా వరల్డ్‌కప్ బెర్తు ఖరారు చేసుకోవాలంటే ఐపీఎల్-2024 ప్రదర్శనే ప్రామాణికంగా ఉండబోతుందని సిద్ధు అభిప్రాయపడ్డాడు. పీటీతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా రాజకీయాల్లోనూ ప్రవేశించిన సిద్ధుకు పంజాబ్ మంత్రిగానూ పనిచేసిన అనుభవం ఉంది. ఇక మార్చి 22న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానుంది. చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ ఈవెంట్ షురూ కానుంది. చదవండి: T20I: అఫ్గనిస్తాన్‌కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. అధికారిక ప్రకటన -
పార్లమెంటులో అదే సీను
న్యూఢిల్లీ: అదే గందరగోళం. అవే సీన్లు. అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు ఎవరి పట్టు మీద వారు బెట్టుగా నిలిచారు. దాంతో పార్లమెంటులో వారం రోజులుగా కన్పిస్తున్న దృశ్యాలే రిపీటయ్యాయి. ఇరు పక్షాల డిమాండ్లు, హోరాహోరీ నినాదాలు, గందరగోళం మధ్య కార్యకలాపాలేవీ జరపకుండానే ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. అలా మార్చి 13న మొదలైన మలి విడత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా ఆరో రోజూ పూర్తిగా వృథా అయింది. సోమవారం ఉదయం లోక్‌సభ సమావేశం కాగానే భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలను అధికార బీజేపీ సభ్యులు మరోసారి లేవనెత్తారు. ఆయన క్షమాపణలకు డిమాండ్ చేశారు. ప్రతిగా అదానీ గ్రూప్ అవకతవకల అంశాన్ని కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు తెరపైకి తెచ్చారు. తాము డిమాండ్ చేస్తున్న మేరకు దానిపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో విచారణ జరిపించి తీరాల్సిందేనంటూ కుండబద్దలు కొట్టారు. ఇరు పక్షాలూ పెద్దపెట్టున నినాదాలు మొదలుపెట్టాయి. ఉభయ పక్షాలూ తన చాంబర్‌కు వస్తే చర్చించుకుని పరిష్కారానికి వద్దామని స్పీకర్ ఓం బిర్లా పదేపదే సూచించినా లాభం లేకపోయింది. దాంతో సభను మధ్యాహ్నం రెండింటి దాకా వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక కొన్ని బిల్లులను ప్రవేశపెట్టగానే ఇరువైపుల నుంచి తిరిగి నినాదాలు, గందరగోళం మొదలయ్యాయి. దాంతో సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ... అటు రాజ్యసభలోనూ దాదాపుగా ఇదే దృశ్యాలు కన్పించాయి. సభ ప్రారంభమవుతూనే ఇరు పక్షాలూ నినాదాలకు దిగాయి. వాటి మధ్యే చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మాట్లాడారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయడంలో ప్రభుత్వ వైఫల్యంపై చర్చించాలంటూ 267(9) నిబంధన కింద కాంగ్రెస్ సభ్యులు నోటీసు అందజేసినట్టు పేర్కొన్నారు. దాని ప్రకారం ముందుగా నిర్ణయించిన కార్యకలాపాలను పక్కన పెట్టి నోటీసు అంశాన్ని చర్చకు చేపట్టాల్సి ఉంటుంది. అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణకు సీపీఐ, సీపీఎం సభ్యులు డిమాండ్ చేశారు. నినాదాల హోరు, గందరగోళం అంతకంతకూ పెరిగిపోవడంతో సభ మధ్యాహ్నం రెండింటిదాకా, అనంతరమూ అదే పరిస్థితి కొనసాగడంతో మంగళవారానికి వాయిదా పడింది. నా వ్యాఖ్యలపై లోక్‌సభలో మాట్లాడతా స్పీకర్‌కు రాహుల్ లేఖ ‘‘భారత ప్రజాస్వామ్యం గురించి బ్రిటన్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో స్పష్టత ఇస్తా. నేను మాట్లాడేందుకు అనుమతించండి’’ అంటూ స్పీకర్ ఓం బిర్లాకు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ లేఖ రాశారు. దీనిపై ఆయన ఇప్పటిదాకా బహిరంగంగా స్పందించలేదు. మంగళవారం మాట్లాడేందుకు రాహుల్‌కు అవకాశమివ్వాలని కోరినట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ‘‘మేమేం మాట్లాడబోయినా మైకులు కట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని లండన్‌లో చెప్పినందుకు లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నాచారు’’ అని మండిపడ్డారు. రాహుల్ నివాసానికి పోలీసులు వెళ్లడాన్ని తప్పుబట్టారు. పార్లమెంట్లో తాము లేవనెత్తుతన్న అదానీ, చైనా చొరబాటు వంటి కీలకాంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలా చేస్తోందన్నారు. కేసులకు బెదరను వయనాడ్ (కేరళ): పోలీసు కేసులు, రాజకీయ దాడులతో తనను భయపెట్టలేరని రాహుల్‌గాంధీ అన్నారు. ‘‘సత్యంపై నాకు విశ్వాసముంది. ఎప్పుడూ దానికే కట్టుబడి ఉన్నా. నాపై ఎంతగా దాడి చేసినా పట్టించుకోను. దాంతో, నేనెందుకు భయపడటం లేదా అన్నదే వారికిప్పుడు పెద్ద సమస్యగా మారింది’’ అని బీజేపీపై చెణుకులు విసిరారు. -
'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది'
టి20 సిరీస్‌లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి టి20 వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. టాస్ వేయడానికి కూడా అవకాశం లేకపోవడంతో మ్యాచ్ రద్దు చేసేందుకే అంపైర్లు మొగ్గుచూపారు. అలా తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడం అభిమానులను బాధించింది. ఆ తర్వాత టీమిండియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు కలిసి ఫుట్‌వాలీ పేరుతో ఏకకాలంలో ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ఈ సంగతి పక్కనబెడితే.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మాత్రం స్కై స్టేడియం సిబ్బందిని ఎండగట్టాడు. మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సైమన్ డౌల్ స్టేడియంలో ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తి కలిగించింది. ఆ ఫోటోలో ఒక మసి గుడ్డను కుర్చీపై ఉంచాడు. ''ఇప్పుడే కామెంటరీ ఏరియాలో ఉన్న కుర్చీలకు పట్టిన దుమ్మును మొత్తం క్లీన్ చేశా. స్కై స్టేడియం సిబ్బంది ఎంత మంచి పనిమంతులనేది ఈ ఒక్క విషయంతో అర్థమయింది. అయినా ఇప్పుడు ఆ కుర్చీలన్నీ గుడ్డతో క్లీన్ చేశాను. ఇక ప్యానెల్‌కు వచ్చే విదేశీ గెస్టులు దర్జాగా వచ్చి ఆ కుర్చీల్లో కూర్చోవచ్చు. నిజంగా ఇది సిగ్గుచేటు.. కనీసం కుర్చీలను కూడా క్లీన్ చేయలేదు.. ఇది భరించకుండా ఉంది. వర్షంతో మ్యాచ్ రద్దు అవుతుందని ముందే ఊహించి కనీస ఏర్పాట్లు కూడా సరిగా చేయలేకపోయారు'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సైమన్ డౌల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వర్షంతో తొలి టి20 రద్దు కాగా.. ఇరుజట్ల ఆటగాళ్లు మౌంట్ మాంగనూయ్‌కు బయలుదేరారు. ఆదివారం(నవంబర్ 20న) కివీస్, టీమిండియాల మధ్య రెండో టి20 మ్యాచ్ జరగనుంది. @Sportsfreakconz @martindevlinnz Another great reason to play here at @skystadium . I have just cleaned all the seats in our commentary area so our overseas guests can sit down. What a shambles of a place. Embarrassing. #welcometoNZ pic.twitter.com/Xnpz5BihcI — Simon Doull (@Sdoull) November 18, 2022 చదవండి: FIFA: 'మెస్సీ నా స్నేహితుడే కాదు' వర్షంతో మ్యాచ్ రద్దు.. వింత గేమ్ ఆడిన భారత్, కివీస్ ఆటగాళ్లు -
క్రికెట్లో 'ఆ' స్వరం ఇక వినపడదు..!
ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ సుదీర్ఘ కాలం తర్వాత తన క్రికెట్ వ్యాఖ్యానానికి ముగింపు పలికారు. ఇకపై తాను కామెంటరీ చేయబోనని ఆయన ప్రకటించారు. ఆరోగ్యపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇయాన్ వెల్లడించారు. 78 ఏళ్ల చాపెల్ ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత ప్రతిష్టాత్మక చానల్ 9 ద్వారా తన కామెంటరీని మొదలు పెట్టారు. తన అద్భుత వ్యాఖ్యానంతో క్రికెట్ ప్రపంచంపై ప్రత్యేక ముద్ర వేశారు. సూటి విమర్శలు, సునిశిత విశ్లేషణతో అత్యుత్తమ వ్యాఖ్యాతగా ఎదిగిన చాపెల్ 45 ఏళ్ల పాటు ఈ రంగాన్ని శాసించారు. ఆస్ట్రేలియా తరఫున 75 టెస్టులు ఆడి 5345 పరుగులు చేసిన ఇయాన్ చాపెల్ ఇందులో 30 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించారు. 16 వన్డేల్లో కూడా ఆయన ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించారు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో సార్లు స్టార్ ఆటగాళ్లనుంచి విమర్శలు ఎదుర్కొన్నానని...అయితే ఏనాడూ తాను సూటి వ్యాఖ్యానం విషయంలో వెనక్కి తగ్గలేదన్న చాపెల్, క్రికెట్ బాగు కోసమే తాను మాట్లాడానని స్పష్టం చేశారు. -
45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన క్రికెట్ దిగ్గజం
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ తన 45 ఏళ్ల కామెంటరీ కెరీర్‌కు విడ్కోలు పలికాడు. చాపెల్ తన నిర్ణయాన్ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదివారం ప్రకటించాడు. చాలా కాలం నుంచి కామెంటరీకు గుడ్‌బై చేప్పాలని ఆలోచనలో ఉన్నట్లు చాపెల్ తెలిపాడు. చాపెల్ 75 టెస్టు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా తరపున ప్రాతినిథ్యం వహించాడు. వాటిలో 30 మ్యాచ్‌లకు ఆసీస్ కెప్టెన్‌గా చాపెల్ వ్యవహరించాడు. 1977లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన చాపెల్.. అనంతరం కామెంటెటర్‌గా తన కెరీర్ ప్రారంభించాడు. ఇక సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో చాపెల్ మాట్లాడుతూ.. "క్రికెట్ నుంచి నేను తప్పుకోవాలని అనుకున్న రోజు ఇప్పటకీ నాకు బాగా గుర్తుంది. నా క్రికెట్ కెరీర్లో అఖరి రోజు వాచ్ చూశాను. టైమ్ 11 దాటింది. ఇక చాలు అని డిసైడయ్యాను. ఇక వ్యాఖ్యానం విషయంలోనూ అదే నిర్ణయం తీసుకున్నా. కొన్నేళ్ల కిందట నాకు గుండెపోటు వచ్చింది. నేను అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. కానీ ఆ తర్వాత ఆరోగ్య పరంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకున్న, మెట్లు ఎక్కడంలాంటి పనులు చేసిన అలసట ఎక్కువగా వచ్చేది. అ సమయంలో రగ్బీ లీగ్ వాఖ్యత లెజెండరీ రే వారెన్ చెప్పిన విషయం ఒకటి గుర్తొచ్చింది. ఒక తప్పు చేయడానికి ఒక అడగు దూరంలో మీరుంటారు అని అతడు చెప్పేవాడు. అప్పడే ఇక కామెంటరీని వదిలేయాలని నిర్ణయించుకున్నా" అని చాపెల్ పేర్కొన్నాడు. చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన -
గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్ మజాక్.. వీడియో వైరల్
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్స్ మధ్య జరిగే సంభాషణలు ఒక్కోసారి ఆసక్తి కలిగిస్తాయి. మ్యాచ్ గురించి ప్రస్తావన తెస్తూనే తమదైన శైలిలో జోక్‌లు.. పంచ్‌లు పేల్చుకుంటూ సరదాగా ఉంటారు. తాజాగా బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డిసెంబర్ 12న మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుంది. చదవండి: BBL 2021: కొలిన్ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 27వ సెంచరీ ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పాటు మరో ఇద్దరు కామెంటేటర్స్‌గా వ్యవహరించారు. వీరిలో ఇసా గుహా అనే మహిళ కూడా ఉంది. మ్యాచ్ సందర్భంగా కామెంటరీ ప్యానెల్ మధ్య స్పిన్ బౌలింగ్‌లో ఉండే టెక్నిక్స్ అంశం చర్చకు వచ్చింది. క్యారమ్ బాల్ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్ బాల్ వేయాలంటే .. ఒక బౌలర్ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' అని డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా మాట్లాడడంతో గిల్‌క్రిస్ట్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఇది చూసిన మిగతా టెక్నిషియన్స్ కూడా మొదట ఆశ్చర్యపోయినా నవ్వడం షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తోనే మజాకా''.. ''డబుల్ మీనింగ్ మరీ ఎక్కువైంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Ashes 2021: క్రేజీ బౌన్సర్.. తృటిలో తప్పించుకున్న రూట్ ఇక మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. A reasonable question from @isaguha 👀😂😂😂😂😂😂 pic.twitter.com/Tzu5F2emUg — Alexandra Hartley (@AlexHartley93) December 12, 2021 -
వ్యాఖ్యాతగా విశ్వనాథన్ ఆనంద్
Viswanathan Anand Commentary Role.. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆనంద్ ఈనెల 24 నుంచి దుబాయ్‌లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ మ్యాచ్‌కు అధికారిక వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ కార్ల్సన్ (నార్వే), నెపోమ్నియాచి (రష్యా) ప్రపంచ టైటిల్ కోసం తలపడనున్నారు. గతంలో ఆన్లైన్ టోర్నీలకు వ్యాఖ్యాతగా పనిచేసిన ఆనంద్ ఈసారి గెలుపోటముల టెన్షన్ లేకుండా ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం వెళ్తుండటం సరదాగా ఉందన్నాడు. -
'నువ్వు చెప్పేది వినొద్దంటా'; కార్తీక్‌ను ట్రోల్ చేసిన మహిళా క్రికెటర్
లండన్: టీమిండియా వుమెన్స్ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ దినేశ్ కార్తీక్‌ను ట్రోల్ చేసింది. క్రికెటర్‌గా కొనసాగుతున్న కార్తీక్ ఇటీవలే కామెంటేటర్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కార్తీన్ లండన్‌లో కౌంటీ క్రికెట్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక జేమిమా రోడ్రిగ్స్ హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్ టోర్నీలో నార్తన్ సూపర్ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. కాగా మంగళవారం ఆమె కామెంటేటర్ అవతారం ఎత్తారు. నాసిర్ హుస్సేన్, రాబ్ కీతో కలిసి కామెంటరీ చేశారు. ఈ సందర్భంగా రోడ్రిగ్స్‌ను ఉద్దేశించి దినేశ్ కార్తీక్ ట్విటర్లో ఫన్నీగా కామెంట్ చేశాడు. ''ఇంగ్లీష్ కామెంటేటర్లయిన నాసిర్ హుస్సేన్, రాబ్ కీలు ఏం చెప్పినా వినకుండా నీ స్టైల్లో కామెంటరీ చేయ్..'' అంటూ తెలిపాడు. కార్తీక్ ట్వీట్‌పై స్పందించిన రోడ్రిగ్స్ తనదైన శైలిలో బదులిచ్చింది. '' హహ్హహ.. నువ్వు ఇప్పుడు ఏం చెప్పావో.. వాళ్లు కూడా అదే చెప్పారు.. నువ్వు చెప్పేది ఏది వినకూడదని.. అవన్నీ అబద్దాలేనని'' అంటూ లాఫింగ్ ఎమోజీతో కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక వుమెన్స్ హండ్రెడ్ 2021 కాంపీటీషన్లో జెమిమా రోడ్రిగ్స్ మంచి ప్రదర్శన కనబరుస్తుంది. వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల నాటౌట్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఆమె లండన్ స్పిరిట్, ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అర్థ శతకాలతో మెరిసింది. ఇక ఈ టోర్నీలో నార్తన్ సూపర్ చార్జర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఇక టీమిండియా తరపున 2018లో అరంగేట్రం చేసిన ఆమె 47 టీ20ల్లో 976 పరుగులు.. 21 వన్డేల్లో 394 పరుగులు చేసింది. HAHAHAHAHAHA!! Interestingly enough, that's EXACTLY what they told me about anything you say! 😂😂😂 https://t.co/Z4G4HU5r8B — Jemimah Rodrigues (@JemiRodrigues) August 11, 2021 -
విచిత్రమైన బౌలర్.. వికెట్ తీసి కామెంటరీ కూడా; వీడియో వైరల్
లండన్: క్రికెట్లో ఒక బౌలర్ వికెట్ తీస్తే సెలబ్రేట్ చేసుకోవడం సాధారణం. అందులో కొంతమంది మాత్రం తాము ఏం చేసినా ప్రత్యేకంగా ఉండాలని భావిస్తుంటారు. ఉదాహరణకు స్టెయిన్ వికెట్ తీస్తే చెయిన్ సా రియాక్షన్ ఇవ్వడం.. ఇమ్రాన్ తాహిర్ వికెట్ తీస్తే గ్రౌండ్ మొత్తం పరుగులు తీయడం.. విండీస్ బౌలర్ కాట్రెల్ వికెట్ తీసిన తర్వాత సెల్యూట్ చేయడం అలవాటు. ఎవరి సెలబ్రేషన్ ఎలా ఉన్నా వాటిని చూసే మనకు మాత్రం వినోదం లభించడం గ్యారంటీ. తాజాగా క్లబ్ క్రికెట్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఈసీఎస్ టీ10 టోర్నీ సందర్బంగా బనేసా, బుకారెస్ట్ గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బుకారెస్ట్ గ్లాడియేటర్స్ స్పిన్నర్ పావెల్ ఫ్లోరిన్ వికెట్ తీసిన ఆనందంలో తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. పావెల్ వేసిన లూప్ డెలివరీని అంచనా వేయడంలో పొరబడ్డ బ్యాట్స్‌మన్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పావెల్ పిచ్‌పై నుంచి పెవిలియన్ వైపు పరిగెత్తాడు. బౌండరీ చివరల్లో ఆగుతాడునుకుంటే ఎవరు ఊహించని విధంగా కామెంటేటరీ సెక్షన్లోకి వెళ్లి.. '' నేను వికెట్ తీశాను.. నా బౌలింగ్ ఎలా ఉంది'' అంటూ గట్టిగా అరిచాడు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి వచ్చి బౌలింగ్‌ను కంటిన్యూ చేశాడు. అతని చర్యలకు సహచర ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లు నవ్వుకున్నారు. ఏది ఏమైనా పావెల్ ఫ్లోరిన్ చేసిన పని నెటిజన్లను మాత్రం విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఒక వికెట్ తీసినంత మాత్రానా ఇంత చేయాల్సిన అవసరం ఉందా అంటూ కొందరు ఘాటుగా పేర్కొన్నారు. Live the moment #cricket pic.twitter.com/k9cbtmKUrE — Pavel Florin (@PavelFlorin13) July 24, 2021 -
పెళ్లి తర్వాత నా లైఫ్ మారిపోయింది : రానా దగ్గుబాటి
నటుడిగా, ప్రతినాయకుడిగా, యాంకర్‌గా ఎన్నో పాత్రలు పోషించిన రానా ఇప్పుడు మరో కొత్త ఫ్లాట్ ఫాంలోకి అడుగుపెడుతున్నారు. భారత్, శ్రీలంక మ్యాచ్ దగ్గరనుంచి రెజ్లింగ్, టోక్యో 2021, ఒలంపిక్స్ దాకా జరిగే అన్ని అప్డేట్స్ని తెలుగులో పరిచయం చేయనున్నారు. ప్రముఖ ఛానల్ సోనీ టీవీ ఈ మేరకు రానాతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి పలు అంశాల గురించి రానా 'సాక్షి'తో ముచ్చటించారు. క్రీడలు, సినిమాలు సహా పర్సనల్ లైఫ్ గురించి పలు విషయాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత లైఫ్ చాలా మారిపోయిందన్న రానా త్వరలోనే బాబాయ్ వెంకటేష్, తమ్ముడు అభిరామ్‌లతో సినిమా చేస్తానని పేర్కొన్నారు. ఇక నారప్ప సినిమా ఓటీటీలో రావడం బాధగానే ఉందని చెప్పారు. ఆర్ఆర్ఆర్లో రామ్‌చరణ్ టీజర్ బాగా నచ్చిందని ప్రశంసలు కురిపించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వివరాల కోసం వీడియోను చూడండి. -
తీవ్ర దుమారం.. క్షమాపణలు చెప్పిన దినేశ్ కార్తీక్
టీమిండియా మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన సెక్సియెస్ట్ కామెంట్లపై క్షమాపణలు చెప్పాడు. లంక, ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే సందర్భంగా.. కామెంటేటర్‌గా వ్యవహరించిన దినేశ్ చేసిన ‘బ్యాట్లు- పక్కవాళ్ల భార్య’ కామెంట్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘జరిగిందానికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. తప్పుడు ఉద్దేశంతో నేను ఆ కామెంట్లు చేయలేదు. కావాలని చేసిన కామెంట్లు ఎంతమాత్రం కావు. కానీ, తప్పు జరిగిపోయింది. అలా మాట్లాడాల్సి ఉండకూడదు. ఈ విషయంపై నా తల్లి, భార్య కూడా నన్ను తిట్టారు. సారీ.. ఇంకోసారి తప్పు జరగదు’ అంటూ ఆదివారం ఒక సందేశం విడుదల చేశాడు దినేశ్ కార్తీక్. కాగా, 36 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ కమ్ వికెటకీపర్ భారత్ తరపున 94 వన్డేలు, 32 టీ20లు, 26 టెస్టులు ఆడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కామెంటేటర్‌గా మారిన దినేశ్.. అందులోనూ అదరగొడుతుండడం విశేషం. ‘ప్లేయర్స్ తమ బ్యాట్స్ కంటే అవతలి వాళ్ల బ్యాట్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారని, అవి పక్కవాళ్ల భార్యల్లాంటివేనని. ఆకర్షణనీయంగా ఉంటాయని, అందుకే ఆకర్షితులు అవుతార’ని కామెంట్ చేసి విమర్శలు ఎదుర్కొన్నాడు దినేశ్ కార్తీక్. @DineshKarthik take a bow👏🏻👏🏻 Brilliant commentary 😂😂 I can imagine @felixwhite and @gregjames applauding right now #tailendersoftheworlduniteandtakeover pic.twitter.com/SLD4kxIB2n — Jon Moss (@Jon_Moss_) July 1, 2021 -
బీబీసీకి బాయ్‌కాట్ గుడ్‌బై
లండన్: బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)తో 14 ఏళ్ల అనుబంధాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ తెంచుకున్నాడు. ‘బీబీసీ టెస్టు మ్యాచ్ ప్రత్యేక కామెంటరీ బృందం’ నుంచి 79 ఏళ్ల బాయ్కాట్తప్పుకున్నాడు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో నా ఆరోగ్యం గురించి వాస్తవికంగా, నిజాయితీగా ఆలోచించాలి. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఇటీవలే బైపాస్ సర్జరీ కూడా జరిగింది. 79 ఏళ్ల వయస్సులో ఇంకా వ్యాఖ్యాతగా వ్యవహరించడం కష్టమే’ అని బాయ్‌కాట్ తెలిపాడు. -
గంభీర్.. నీ కపటత్వం తెలిసిపోయింది
న్యూఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మీరు కేవలం మాటల మనిషని నిరూపించుకున్నారు.. దేశం కంటే డబ్బు ముఖ్యం అయ్యిందా అంటూ మండిపడుతున్నారు. గంభీర్‌ను ఇంతలా ట్రోల్ చేయడానికి ఓ కారణం ఉంది. పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు గంభీర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిపై ఘాటుగా స్పందించిన గంభీర్ పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ప్రపంచకప్‌లో కూడా ఆ జట్టుతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలన్నారు. మహా అయితే భారత్ రెండు పాయింట్లు కోల్పోతుందని, ఆట కన్నా దేశ ప్రజల సెంటిమెంట్ ముఖ్యమని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయంపై తీవ్ర చర్చ కూడా జరిగింది. మాజీ ఆటగాళ్లు, అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. బీసీసీఐ కూడా పాక్‌తో మ్యాచ్ విషయంలో కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా గంభీర్ చేసిన ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అంతేకాక ఈ మాజీ క్రికెటర్ స్టార్ స్పోర్ట్స్ చానెల్లో దర్శనమివ్వడం.. మ్యాచ్ విశ్లేషకుడిగా అవతారం ఎత్తడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు పాకిస్తాన్‌తో మ్యాచే వద్దన్న నువ్వు.. ఇప్పుడు డబ్బు కోసం భారత్-పాక్ మ్యాచ్‌కు విశ్లేషకుడిగా వ్యవహరిస్తావా.. నీ కపటత్వం జనాలకు తెలిసిపోయింది’ అంటూ ట్రోల్ చేయడమే కాక గంభీర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ట్విటర్లో షేర్ చేయడం ప్రారంభించారు. తను వ్యతిరేకించిన మ్యాచ్‌తోనే గంభీర్ డబ్బు సంపాదించుకుంటున్నాడంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Political Gambhir vs Cricketer Gambhir #IndiaVsPakistan pic.twitter.com/19pqECs1SD — Dhruv Rathee (@dhruv_rathee) June 16, 2019 -
స్లిప్‌లో కామెంటేటర్
క్రికెట్ చరిత్రలో ఎన్నడూ కనిపించని అనూహ్య దృశ్యమిది... ఇప్పటి వరకు మైదానంలో ఉన్న ఆటగాడితో కామెంటేటర్లు మాట్లాడటమే చూశాం. కానీ కామెంటేటర్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫీల్డర్ల పక్కన నిలబడి కామెంటరీ ఇవ్వడం ఇప్పుడు కనిపించింది. గురువారం వెస్టిండీస్, వరల్డ్ ఎలెవన్ మధ్య జరిగిన టి20 ఛారిటీ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గేల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కీపర్, తొలి స్లిప్ ఫీల్డర్ మధ్య కాస్త వెనక్కు జరిగి నాసిర్ హుస్సేన్ కామెంటరీ ఇచ్చాడు. ఏదో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అయితే ఫర్వాలేదు గానీ... ఐసీసీ అధికారికంగా అంతర్జాతీయ టి20 హోదా ఇచ్చిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటన జరగడమే ఆశ్చర్యకరం! -
ప్రపంచకప్ రేడియో ప్రసార హక్కులు సోంతం చేసుకున్న బీబీసీ
-
జైత్రయాత్రలో జగద్గురువు
ప్రపంచమంతా ఇన్నాళ్లూ అసమగ్రమైన విజ్ఞానకాంతులను మాత్రమే దర్శించింది. ఎన్నో తెగలు, శాఖలు భిన్న అన్వయాలను ప్రచారం చేశాయి. పగిలిన అద్దపుముక్కల వలె పరిమితంగా ఆ విజ్ఞాన జ్యోత్స్నను పరావర్తనం చేశాయే కాని ఆ దివ్యజ్యోతి నిజకాంతులను చూపలేకపోయారెవరూ. మాయాసిద్ధాంత ప్రవక్తలు దివ్యమంత్రాల ధ్యానం ద్వారా తప్పనిసరిగా ముక్తి పొందవచ్చునని అంటారు. కాని ధ్యానం తపస్సు జ్ఞానంతోపాటు కర్మాచరణ సమాంతరంగా లేకపోతే మోక్షసాధన కష్టమని తదితర సైద్ధాంతికులు అంటారు. జ్ఞానంలో కర్మాచరణ అవిభాజ్యమైన భాగమని, తెలుసుకునే కృషి, తపస్సు, తెలిసినదాన్ని అనుభవంలో రుజువు చేసుకోకపోతే లాభం లేదు. జ్ఞానం భక్తితో పరిశుద్ధమై, ఉపాసనతో ప్రగాఢమైతేనే మోక్షమార్గంలోకి మళ్లుతారనేది సత్యం. నేను ఈ మార్గాన్ని నా శక్తినంతా కూడదీసుకుని సిద్ధాంతీకరిస్తాను. సాక్షాత్తూ నారాయణుడే వేదవ్యాసుడై రచించిన బ్రహ్మసూత్రాలలో సనాతనంగా ఉన్నప్పటికీ మరుగున పడిన ఈ సిద్ధాంతాన్ని పునరుజ్జీవింపజేస్తాను. యామునాచార్యుని పాదపద్మాలకు ఆ భాష్యాన్ని సమర్పిస్తాను. ఆనాడు వేదవ్యాసుడి నోట పలికిన భారతాన్ని వినాయకుడు వ్రాసినట్టే కురేశుడు ఈ భాష్యాన్ని లిఖించాలి. ‘‘అయితే అర్థం చేసుకొని వ్రాయాలి. నాతో విభేదిస్తే లిఖించవద్దు’’ అని కూడా చెప్పారు. మీ ఆజ్ఞ అన్నాడు కురేశుడు. రామానుజుని నోట సరస్వతి పలుకుతున్నది. కురేశుడు వెంట వెంటనే లిఖిస్తున్నాడు. అర్థం చేసుకోవడానికి నెమ్మదిస్తున్నాడు. అర్థం అవుతూనే లేఖనం పూర్తవుతున్నది. ఒకరోజు మరొక శ్రుతి వాక్యానికి సంబంధించిన వ్యాఖ్యానం ప్రస్తావనకు వచ్చింది. జీవ స్వరూప నిర్ణయ అంశాన్ని వివరించినపుడు ‘జీవుడు సర్వజ్ఞుడనీ స్వతంత్రుడనీ, భగవంతుడిపైన ఆధారపడబోడనే అర్థం వచ్చే విధంగా చెప్పారు. కురేశుడు ఆగిపోయాడు. అంటే విభేదించాడు. ఇదేమిటి జీవుడు అన్నీ తెలిసిన వాడా అనుకుంటూ ఆలోచిస్తూ మౌనంగా ఉన్నాడు. ‘‘ఏమిటి కురేశా ఘంటం ఆగిపోయింది, ఊ, కానీ,... వ్రాయి..’’ అన్నా ఘంటం కదలడం లేదు. కోపించారు. ఉహూ.. అయినా లాభం లేదు. ‘‘ఇలా అయితే ఇక శ్రీభాష్యరచన సాగేదేవిధంగా, నీవే వ్రాసుకో?’’ అని తీవ్రంగా ఆగ్రహించారు. విసురుగా కాలితోతన్ని ‘వెళ్లిపో’ అన్నారు. కురేశుడు పడిపోయి అలాగే ఉన్నాడు. శిష్యులు వచ్చి దీని అర్థం ఏమిటి అని అడిగారు. ‘‘ఏముంది. ఆయన నా యజమాని. కొడితే పడతాను. కాలితో తంతే పడిపోతాను. అంతే!’’ అన్నాడు. రామానుజునికి ప్రశ్నార్థకంగా ఉన్న కురేశుని ముఖమే పదే పదే కనిపించింది. తన వ్యాఖ్యానంలో లోపాలేమిటి అని ఆలోచించారు. విశ్లేషించుకున్నారు. ‘‘జీవుడు భగవంతుడి అంశే గాని భగవంతుడు కాదు కదా. భగవంతుడు సర్వజ్ఞుడు, కాని ప్రతిజీవి జీవాత్మ సర్వజ్ఞుడు అయ్యే అవకాశం లేదు కదా. భగవంతుడిపైన పూర్తిగా ఆధారపడి, దాసుడై, భగవంతుడిని అర్చించి భగవంతుడికి ఉపయోగపడటం కదా జీవుడు, జీవాత్మ చేయవలసింది. అద్వైతం అంటే జీవాత్మ పరమాత్మ రెండుకావని అర్థం. అట్లా అయితే ప్రతి జీవాత్మ పరమాత్ముడేనా. అయితే అతడు సర్వజ్ఞుడు కావలసిందే. ఈ భేదాన్ని గమనించకపోవడమే ఈ పండితులంతా చేస్తున్న పొరబాటు. ప్రతి జీవాత్మలో పరమాత్మ అంశ ఉంటుంది, అది భక్తితో శరణాగతితో పరమాత్మ సాన్నిధ్యం పొంది మోక్షం సాధించి పరమాత్మలో కలిసి పోతే అసలు అద్వైతం అవుతుంది. కురేశుడి సందేహం సరైనదే’’ అనుకున్నారు. అదే మరింత వివరణతో శ్రీభాష్యమై ప్రవహించింది. కురేశుడి లేఖనం సాగింది. అద్వైతానికి రామానుజుడు అద్దిన విశిష్టత అదే, కనుక అదే విశిష్టాద్వైతం. తన గురువు తప్పులు ఎత్తిచూపిన రామానుజుడు తన తప్పుల గురించి మౌనంగా చెప్పిన శిష్యుడిని సమాదరించినాడు. ‘‘నన్ను క్షమిస్తావా కురేశా? నీ మౌనాన్ని అర్థం చేసుకునే సహనం లేకుండా పోయినందుకు సిగ్గుపడుతున్నాను’’ అన్నాడు. ‘‘ఆచార్యా ఇంత మాటా.. నేను మీ పాదరేణువును, దీనికన్న నన్ను ఇంకోసారి కొట్టినా బాగుండేది’’ అని కురేశుడు కన్నీళ్లతో అన్నాడు. పాదాలపై పడబోయిన కురేశుని లేవనెత్తి దగ్గరకు తీసుకుని కన్నీళ్లతో కౌగిలించుకుని ‘‘కురేశా భగవంతుని శ్రీచరణాల ముందు ఎవరూ గొప్ప కాదు ఎవరూ తక్కువ కాదు. ఈసారి స్పష్టంగా జీవుడు జీవాత్మ పరమాత్మ అనుగ్రహం పైన పూర్తిగా ఆధార పడవలసిందే అని సిద్ధాంతీకరించారు రామానుజుడు. కురేశుడు విలేఖకుడే కాదు, విమర్శకుడు, విశ్లేషకుడు కూడా. రామానుజులు తనకన్నా ముందు బ్రహ్మసూత్రాలపైన వ్యాఖ్యానం రచించిన విశిష్టాద్వైత సిద్ధాంత ఆచార్యులైన 1. బోధాయనుడు: బోధాయన వృత్తి, లక్ష శ్లోకాలు 2. ద్రావిడాచార్య: ద్రావిడభాష్యం. దానిపైన టీకా, 3. టంక (బ్రహ్మానంది, వాక్యకార) వార్తిక. 4. గుహదేవాచార్య, 5. ఆచార్య భరూచి: 6. భాగవత శ్రీవత్సాంక మిశ్ర, అత్యంత సనాతన భాష్యరచయిత. 7. నాథముని: న్యాయతత్వ: విశిష్టాద్వైత సిద్ధాంతం, యోగరహస్య (యోగ విధాన రహస్య సిద్ధాంతాలు) మీద విజ్ఞాన సర్వస్వం. 8. యామునాచార్య: సంవిత్ సిద్ధి, స్వర సిద్ధి, ఆత్మసిద్ధి, ఆగమ ప్రామాణ్య రచయిత (11వ శతాబ్ది) మొదలైన గ్రంథాలను అధ్యయనం చేసిన తరువాత శ్రీభాష్యం రచించారు. రామానుజుని శ్రీభాష్యం ఈనాటికీ అత్యుత్తమ ప్రామాణిక గ్రంథంగా భాసిల్లుతున్నది. బ్రహ్మసూత్రాలు భారతీయ సనాతన ధర్మానికి కీలకమైనవి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. వీటిని ప్రస్థాన త్రయం అంటారు. సంక్లిష్టమైన ఈ అంశాలను వివరించడానికి మొదటి వ్యాఖ్యానం రచించినవారు ఆదిశంకరాచార్యులు. బాదరాయణుడు సూత్రబద్ధం చేయటం వలన బాదరాయణ సూత్రాలనీ, వేదాంతాన్ని వివరిస్తాయి కనుక వేదాంత సూత్రాలనీ; బ్రహ్మమును గురించి నివేదిస్తాయి కనుక బ్రహ్మ మీమాంస లేదా బ్రహ్మ సూత్రాలనీ ఈ సూత్రాలను పిలుస్తారు. ఈ సూత్రాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు విశిష్టాద్వైత పరంగా సరికొత్త అన్వయంతో ప్రస్థాన త్రయం రచించారు రామానుజులు. శ్రీభాష్యం రచనతో రామానుజుని కీర్తి భరత ఖండమంతా వ్యాపించింది. పండిత సభల్లో గోష్ఠులలో, మత వివాదాలలో, ధార్మిక విమర్శా సభల్లో చర్చనీయాంశంగా మారింది. మౌలిక సిద్ధాంత నిర్ధారణ జరిగిన తరువాత ఈ శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లడానికి ప్రచారానికి సరయిన సమయం ఆసన్నమైంది. వేదాంత సారము, వేదార్థ సంగ్రహము, వేదాంత దీపము మొదలైన అనుబంధ రచనలు, భగవద్గీతపైన రామానుజ భాష్యం కూడా అందుబాటులోకి రావడంతో రామానుజుడు మరో జైత్రయాత్రకు సంసిద్ధమైనాడు. పైబడుతున్న శతాధిక వయోభారాన్ని లెక్క చేయకుండా రామానుజుడు ఆర్తి ఉన్న ప్రతి వాడికీ భక్తివేదాంత దర్శనాన్ని చేయించడం లక్ష్యంగా బయలుదేరాడు. వెళ్లినచోటల్లా మత సిద్ధాంత చర్చలలో రామానుజుడు వెలిగిపోతున్నాడు. పుణ్యక్షేత్ర సందర్శన, శ్రీవైష్ణవ సిద్ధాంత చర్చ, వాదోపవాదాలు, ప్రతివాదాలు, ప్రతిచోటా జయాలు. ఓడిన వారు వైష్ణవం స్వీకరిస్తున్నారు, శిష్యగణం పెరిగిపోతున్నది. రామానుజ మఠాలు విస్తరిస్తున్నాయి. కుంభకోణం పట్టణంలో అన్యమతాచార్యులు వాదంలో ఓడి ‘‘అడియేన్ (పాదాలు) రామానుజ దాసోహం’’ అన్నారు. చోళ మండలంలో పలువురు వైష్ణవ దీక్ష పొందారు. ఆళ్వార్ తిరునగరికి చేరుకున్నారు. అది తిరుమంగై ఆళ్వార్ అవతరించి స్వాధ్యాయ ప్రవచనాలు సాగించిన చోటు. పుష్కరిణిలో స్నానం చేసి, మడి కట్టుకుని, తిరుమణి కాపుచేసుకుని, అనుష్ఠానం ముగించి, త్రిదండాన్ని చేబూని శిష్యబృందంతో ఆలయంలో ప్రదక్షిణ చేస్తుండగా ఒక స్త్రీ ఎదురుపడింది. ఆమె శుచీశుభ్రతలు పాటించడం లేదని ఎవరో చండాలాంగన అన్నారనీ శిష్యులు ఆమెను పక్కకు తప్పుకోమన్నారు. రామానుజుడు ముందుకు వస్తూనే ఉన్నారు. ‘‘ఎక్కడికి తప్పుకోమంటారు ఏ పక్కకు వెళ్లమంటారు స్వామీ. పవిత్రమూర్తి మీరు ఎదురుగా ఉన్నారు. ఒక్క అడుగు వేసినా మీకు అడ్డు అవుతాను. వెనుకకు మరలిపోదామంటే అతిపవిత్రమైన తిరుక్కణ్ణాపురం ఉంది. ఆ పుణ్యక్షేత్రాన్ని తగలవలసి వస్తుంది. పోనీ కుడివైపు వెళదామా అంటే అక్కడ మన తిరుమంగై ఆళ్వార్ నిలిచిన కోవెల తిరుమణన్ కొళ్లై, దాన్ని ఆనుకుని తిరువారేశు మందిరం ఉన్నవి. వాటిని దాటేదెట్లా స్వామీ? ఎడమవైపు వెళదామంటే అక్కడ అసామాన్యమైన తిరువాళి మానవాళన్ స్వామి ఆలయం ఉంది. ఇన్ని దివ్యదేశాల మధ్య ఏది మలినమో నాకు తెలియదు. నాకు చుట్టూ అన్నీ పుణ్యపవిత్ర క్షేత్రాలే కనిపిస్తున్నాయి. పరమ అజ్ఞానిని నేనెటు వెళ్లగలను? ఎక్కడికి తప్పుకోను మీరే దయచూపి దారిచూపండి స్వామీ.’’ అని వినయంగా అడిగిందామె. ఆమె సామాన్యురాలు కాదనీ, తన శిష్యులు తప్పు చేశారనీ అర్థమైపోయింది రామానుజులకు. చేతులు జోడించి నమస్కరించి ‘‘అమ్మా! నన్ను క్షమించు. ఈ దివ్యక్షేత్రాల పవిత్రత తెలిసిన జ్ఞానివమ్మా నీవు. నీవే నాకన్న శుచిమంతురాలివి, పవిత్రురాలివి. నీకు మాలిన్యం ఏమిటి తల్లీ. మీరూ నేనూ అంతా కలిసి ఆ శ్రీహరిని ధ్యానిద్దాం. అనుష్టానం చేసుకుందాం రా.. నీకూ మంత్రోపదేశం చేస్తాను వస్తావా’’ అనగానే ఆమె పాదాభివందనం చేసింది. ఆమెకు పంచసంస్కారాలు చేశారు. నిత్యానుష్టానంతో, ధ్యానంతో భజన కీర్తనలతో ఆమె ఆ తిరువాలి తిరునగరిలో ఉత్తమభక్తురాలిగా కీర్తిపొందింది. ఆంతరంగిక శుద్ధి అన్నింటికన్నా ముఖ్యం. బహిరంగంగా పరిశుభ్రంగా ఉండడం అవసరమే కాని లేకపోవడం అయోగ్యత కాదు. ఆర్తిని మించిన యోగ్యత మరేదీ లేదనేదే రామానుజుని ఆదర్శ సిద్ధాంతం. శ్రీవైష్ణవాన్ని కులాతీత సర్వజనాదరణ పాత్రం చేసిన సంస్కారం అదే. తరువాత మధురైకి పదికిలోమీటర్ల సమీపంలో ఉన్న తిరుమాళికచోలై ప్రాంతానికి వెళ్లారు. దర్భశయనం దివ్యదేశాన్ని సందర్శించారు. సేతువును చూసారు. చోళదేశంలో శ్రీవైష్ణవ స్థాపన తరువాత రామానుజుడు పాండ్య పాలిత ప్రాంతంలోని శ్రీమన్నారాయణ క్షేత్రాలను సందర్శించారు. పండిత సభలలో పాల్గొన్నారు. తర్కాన్ని, శాస్త్రాన్ని, వ్యాకరణాన్ని మధించిన రామానుజుడి విజ్ఞాన వివేకం ముందు వాదనాశక్తి ముందు మరెవ్వరూ నిలబడడం లేదు. అందరూ శిష్యులైపోతున్నారు. శ్రీభాష్యం ఏం చెబుతుంది? పరమాత్మ, జీవాత్మ, ప్రకృతి అనే మూడు తత్వాల గురించి సూత్రాలు ఏం చెప్పాయో శ్రీభాష్యం వివరిస్తుంది. సూత్రాలలో వివరణ ఉండదు. అర్థం చేసుకునే విధానం కూడా కనిపించదు. ఉపోద్ఘాతమూ ఉండదు. ఇందులో మోక్షసాధనకు భక్తియే సాధనమని రామానుజాచార్యుడు ప్రతిపాదించాడు. దీనికి ముందు బ్రహ్మసూత్రాలపైన బోధాయనుడు చేసిన వ్యాఖ్యానాన్ని గురించి ప్రస్తావిస్తారు. తొలిభాగంలో బోధాయనుడిని ఉటంకించి తాను ఆయన అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్టు వివరించారు రామానుజాచార్యుడు. కొన్నాళ్లకు సమగ్రమైన శ్రీభాష్య రచన పూర్తయింది. అప్పుడు రామానుజుని వయసు నూరు సంవత్సరాలు. శ్రీభాష్య అధ్యయనం సులభతరం చేయడం కోసం వేదాంత దీపము, వేదాంత సారము, వేదార్థ సంగ్రహం అనే పుస్తకాలను, గీతా భాష్యమును కూడా రామానుజుడు రచించారు. విజ్ఞాన భాండాగారం వేదాలను విభజించి అనేక పురాణాలు, ఇతిహాసాలు రచించి, సిద్ధాంతాలను సూత్రీకరించిన వ్యాసుడు స్వయంగా విష్ణురూపుడే. లేకపోతే ఇన్ని రచనలు సాధ్యమా? వ్యాసులు చాలామంది ఉండి ఉంటారంటారు. బ్రహ్మసూత్రాలు రాసిన బాదరాయణుడు (లేదా బోధాయనుడు), వ్యాసుడు ఒకరే అని కొందరు, కాదు, వ్యాసుని శిష్యుడని మరికొందరు పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇద్దరూ వేరనిగానీ వేరు కాదని గానీ అనడానికి ఆధారాలు లేవు. బ్రహ్మసూత్ర గ్రంథంలో నాలుగు అధ్యాయాలు, ఒక్కో అధ్యాయంలో నాలుగు పాదాలు, అన్ని పాదాలలో మొత్తం 192 అధికరణాలు, ప్రతి అధికరణంలో కొన్ని సూత్రాల చొప్పున మొత్తం 555 సూత్రాలు ఉన్నాయి. వేదసారమైన మహాభారతాన్ని పంచమ వేదమని, అందులో ఉన్న భగవద్గీతను ఉపనిషత్సారమనీ వర్ణిస్తారు. వేదాంత సత్యాలను, బ్రహ్మసూత్ర విశేషాలను, ఉపనిషత్ విజ్ఞాన వివేకాలను, అంతరార్థ వివరాలను వేదవ్యాసుడే భగవద్గీత ద్వారా సులభ గ్రాహ్యం చేశారు. కాని భగవద్గీతకూ వివరణ అవసరం అయింది. గద్యంలో సామాన్య వివరణ, మార్గదర్శన కోసం రామానుజుడు విశిష్టాద్వైతపరమైన వ్యాఖ్యానం చేయాలని, తద్వారా ఈ విజ్ఞాన భాండాగారం సామాన్యులకు అందాలని యామునాచార్యులు సంకల్పించారు. -
కాలానికి భాష్యం చెప్పిన కార్టూనిస్ట్
‘అర పేజీ వార్త కూడా చెప్పలేని భావాన్ని, మూడుకాలాల చిన్న కార్టూన్ అద్భుతంగా చెప్పగలదు’ అన్నారు ప్రఖ్యాత పత్రికా రచయిత నండూరి రామమోహనరావు. డిసెంబర్ 26, 1989లో శంకర్ పిళ్లై కన్నుమూసినప్పుడు రాసిన సంపాదకీయంలో పంక్తులవి. నిజమే, కార్టూన్ అంటే కొన్ని కొంటె గీతల, రాతల మిశ్రమం కావచ్చు. కానీ అవి చరిత్రకు రెండో వైపు ఉన్న అదృశ్య వాస్తవికతను మన మెదడుకు ఆహ్లాదంగా అందిస్తాయి. ఉన్నత స్థానాలలోని వారి ఆలోచనలను నగ్నంగా మన ముందు ఆవిష్కరిస్తాయి. శంకర్ పిళ్లై ప్రతి వ్యంగ్య చిత్రం అలాంటి బాధ్యతను నిర్వర్తించినదే. కొన్ని కార్టూన్లను చూస్తే అర్ధ శతాబ్దపు సంక్షుభిత చరిత్రనీ, దాని పూర్వాపరాలనీ కూడా ఒకే కార్టూన్లో శంకర్ నిక్షిప్తం చేయగలరని చెప్పాలనిపిస్తుంది. 1941లో హిందుస్తాన్ టైమ్స్‌లో వచ్చిన కార్టూన్ అదే చెబుతుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. 1906లో దాదాభాయ్ నౌరోజీ కార్యదర్శిగా తొలిసారి కలకత్తా జాతీయ కాంగ్రెస్ సభలకు హాజరయ్యారు మహమ్మదలీ జిన్నా. ఆనాటికి ఆయన గుండె నిండా జాతీయవాదమే. 1916 నాటి లక్నో ఒప్పందం వేళకు సరోజినీనాయుడు దృష్టిలో ఆయన ‘అంబాసిడర్ ఆఫ్ హిందూ ముస్లిం యూనిటీ’. 1933లో ఇంగ్లండ్‌లో ఒక విందు ఏర్పాటు చేసి ప్రత్యేక పాకిస్తాన్‌ను కోరమంటూ చౌదరి రహమత్ అలీ ఖాన్ సూచిస్తే, ‘అది అసాధ్యం’ అంటూ లేచి వెళ్లిపోయిన వ్యక్తి జిన్నా. అప్పటికీ ఆయన ఆలోచన అఖండ భారతం గురించే. కానీ 1941కి ఆయన ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటుకు కృత నిశ్చయుడయ్యారు. ఈ మధ్యలో ఎన్నో విమర్శలు, చీత్కారాలు. ఆసియాలో, నిజానికి ప్రపంచ చరిత్రలో ప్రత్యేకమైన భారత విభజన ఘట్టంలోనే ఎంతో కీలకమైన ఈ మొత్తం చారిత్రక పరిణామాన్ని, వ్యక్తిత్వంలో వచ్చిన మార్పుని శంకర్ పిళ్లై ఒక్క కార్టూన్లో ఆవిష్కరించారు. ‘హిందుస్తాన్ టైమ్స్‌తో నీవు ఎదిగావా? లేకుంటే నీ వల్ల హిందుస్తాన్ టైమ్స్ ఎదిగిందా?’ అంటూ శంకర్‌కు రాసిన ఉత్తరంలో గాంధీ చాలా లోతైన, ప్రశంసాపూర్వకమైన ధర్మ సందేహం వ్యక్తం చేశారు. ‘శంకర్, నన్ను కూడా వదిలిపెట్టొద్దు!’ (డోన్ట్ స్పేర్ మీ, శంకర్) అన్నారు నెహ్రూ. నండూరి మాటలలోనే, ‘ఆనాటి చరిత్రపురుషులంతా శంకర్‌తో కార్టూనించుకోవాలని ఎదురుచూసినవారే’. అందుకే శంకర్ భారతీయ రాజకీయ వ్యంగ్య చిత్రకళకు ఆది శంకరుడని అంటారు. అది ఎంతో నిజం! శంకర్ పుట్టుకతోనే వ్యంగ్య చిత్రకారుడు. శ్రీరమణగారు అన్నట్టు ‘నాన్ రుషిః కురుతే కార్టూన్’. కేరళలోని కాయంకుళం గ్రామంలో విశాలమైన ఆ ఆవరణలో ఉన్న ఇంటికి నోట్ బుక్‌లో వేసిన ఒక బొమ్మ పట్టుకుని వచ్చాడు, ఆ ఊరి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అసలే మండిపడిపోతున్న ఆయనకు ఆ ఇంటి పెద్దాయన అన్నమాట మరీ ఒళ్లు మండించింది. ‘ఇది నా మనవడు వేశాడా? బావుంది కదా మాస్టారు!’ అని. శంకర్ తన లెక్కలు మాస్టారి మీద వేసిన వ్యంగ్య చిత్రమది. ఆ మాస్టారు పిల్లలకు అర్థమేటిక్ సమస్య ఇచ్చి, డ్రాయిర్ మీద కాళ్లు బారజాపుకుని గుర్రుపెట్టి నిద్రించేవాడట. అలాంటి భంగిమలో ఉన్న గురువుగారి బొమ్మను గీశాడు బాల శంకర్. అది చూడడంతోనే తరగతి గదంతా నవ్వులతో దద్దరిల్లిపోయింది. విషయం ప్రధానోపాధ్యాయుడి దాకా పోయింది. పక్షం పాటు శంకర్‌ని తరగతుల నుంచి బహిష్కరించాడాయన. అదీ చాలదన్నట్టు మనవడి కళాఖండాన్ని తెచ్చి ఆయన తాతయ్యకి చూపించాడు. కానీ శంకర్ మామయ్య మాత్రం అతడిలోని కళను ప్రోత్సహించాలని భావించారు. ఫలితమే ఒక గొప్ప కార్టూనిస్టు భారతదేశంలో రూపొందాడు. తాతయ్య ఇల్లు, ఆయన ప్రేమ, ఆ విశాల ఆవరణ, వర్షం వెలిసిన వెంటనే తోటి పిల్లలని చెట్ల కిందకి తీసుకెళ్లి కొమ్మల్ని ఊపడం, ఆ ఆవరణలో చెరువు, అందులో మొసలి, దానితో సరసాలు, ఆ సరసాలు అర్థంకాక అది ఒకసారి తీవ్రస్థాయిలో తిరుగుబాటు చేయడం, పాఠశాల ముచ్చట్లు ఇవన్నీ శంకర్ తన బాల్యం గురించి చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ వెలువరించిన పుస్తకంలో రాసుకున్నవే. శంకర్ పూర్తి పేరు ఇలికుళతు కేశవ శంకర్ పిళ్లై. జూలై 31, 1902లో కాయంకుళంలోనే పుట్టారు. తిరువనంతపురంలో డిగ్రీ పూర్తి చేసి, న్యాయశాస్త్రం చదవడానికి బొంబాయి వెళ్లారు. చదువుతూనే, ఫ్రిలాన్స్ కార్టూనిస్టుగా ఉంటూనే చిన్న చిన్న ఉద్యోగాలు చేశారాయన. ఆయన తన కార్టూన్‌కి మొదటిసారి తీసుకున్న పారితోషికం మూడు రూపాయలు. 29వ ఏట పెళ్లి చేసుకున్న తరువాత పూర్తిగా కార్టూన్ కళకు అంకితమయ్యారు. ఆయన తొలిదశ కార్టూన్లు ‘బాంబే క్రానికల్’, ‘ఫ్రీ ప్రెస్ జర్నల్’, ‘వీక్లీ హెరాల్డ్’ పత్రికలలో వెలువడేవి. అప్పుడు పరిచయమైనవారే పోతాన్ జోసెఫ్. జోసెఫ్‌కు తరువాత హిందుస్తాన్ టైమ్స్ ప్రధాన సంపాదకునిగా అవకాశం వచ్చింది. దీనితో ఆయన శంకర్‌ను ఆ పత్రిక ప్రధాన కేంద్రం ఢిల్లీకి పిలిపించి స్టాఫ్ కార్టూనిస్ట్‌గా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి శంకర్ ఢిల్లీలోనే ఉండిపోయారు. కానీ తన కళను మెరుగు పరుచుకోవడానికి నిరంతరం పాటు పడ్డారు. అనేక ఫైన్ ఆర్ట్స్ కళాశాలల్లో చదివారు. ఇంగ్లండ్‌లో 14 మాసాలు ఉండి తర్ఫీదు కూడా తీసుకున్నారు. స్కాట్లాండ్ కార్టూనిస్ట్ డేవిడ్ లాను శంకర్ ఆదర్శంగా తీసుకునేవారు. ఆయన శిష్యులు అనతగిన అబూ అబ్రహాం, ఓవీ విజయన్, కుట్టీ, సామువేల్ వర్మలను కూడా డేవిడ్‌నే ఆదర్శంగా తీసుకోమని చెప్పేవారు. అనంతరకాలాలలో రాజీందర్ పురి, ఏసుదాసన్, బీఎం గఫూర్, మికీ పటేల్, రంగా, ప్రకాశ్ ఘోష్ వంటివారు శంకర్ దగ్గర శిష్యరికం చేశారు. కార్టూన్ల చుట్టూనే తిరిగిన శంకర్ జీవితంలోని ఘట్టాలను చూసినా అదే ప్రతిబింబిస్తూ ఉంటుంది. సహాయ నిరాకరణ ఉద్యమంలో భారతీయ పత్రికలలో సంపాదక వ్యాఖ్యలను సెన్సార్ చేసేవారు. కానీ కార్టూన్ల జోలికి వచ్చేవారు కాదు. అలాంటి సందర్భంలోనే నాటి వైస్రాయ్ దూత ఒకరు వచ్చి శంకర్‌కు అభివాదం చేసి, ‘మీ కార్టూన్లంటే వైస్రాయ్‌గారికి ఇష్టం. ఇవాళ ఆయన మీద మీరు వేసిన కార్టూన్ ఒరిజినల్ కాపీ ఇవ్వవలసిందిగా ఆయన కోరుతున్నారు, మీ సంతకంతో’ అని చెప్పాడు. మరొకసారి వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో (1936–1943)ను భద్రకాళిగా చిత్రించారు శంకర్. అది కూడా శ్మశాన వాటికలో కాలుతున్న ఒక శవం ఎదుట నిలిచి ఉన్నట్టు చిత్రించారు. అది ఆయన దృష్టికి వెళ్లింది. ఉదయం ఒకరు వచ్చి, ఆ కార్టూన్ ఒరిజినల్ వైస్రాయ్ కోరుతున్నారని చెప్పి తీసుకువెళ్లారు. భారత స్వాతంత్య్రోద్యమం మీద శంకర్ లెక్కలేనన్ని కార్టూన్లు గీశారు. శంకర్ గీసిన ఒరిజినల్స్ అడిగి తీసుకున్న వారిలో నెహ్రూ అగ్రగణ్యుడు. ప్రథమ ప్రధాని మీద శంకర్ నాలుగువేల కార్టూన్లు గీశారు. ‘జవహర్లాల్ ఎప్పుడూ నేను గీసిన ఒరిజినల్స్ అడిగేవారు. ఆయన రాజకీయ చర్యల గురించి వాటిలో నేను తీవ్రంగా వెక్కిరించేవాడిని. అందుకు ఆయన నన్ను అభినందించేవారు. తనలోని బలహీనతలను గురించి తెలుసుకోవడంలో సహకరించినందుకు కృతజ్ఞతలు చెప్పేవారు. పరిపూర్ణత ఏ మానవుడికీ సాధ్యం కాదు. ఈ విషయాన్ని నెహ్రూ గుర్తించేవారు’ అని నెహ్రూ గురించి శంకర్ రాశారు. చైనా యుద్ధం తరువాత నెహ్రూ తనలో తాను కుంగిపోయినా, దేశ రాజకీయ చిత్ర పటంలో మాత్రం ఆయనదే పైచేయిగా ఉండేది. ఆ విషయాన్ని శంకర్ తన కార్టూన్లో ఆవిష్కరించారు. అందులో లాల్‌బహదూర్‌శాస్త్రి, గుల్జారీలాల్ నందా, మొరార్జీ దేశాయ్, ఇందిర వంటివారంతా పరుగులు తీస్తూ ఉంటారు. ఒక కరదీపిక పట్టుకుని వారందరి కంటే ముందు (రేసులో అన్నమాట) ఉంటారు నెహ్రూ. ఇదే నెహ్రూ జీవించిఉండగా శంకర్ వేసిన చివరి కార్టూన్. తరువాత పది రోజులకు నెహ్రూ కన్నుమూశారు. స్వాతంత్య్రం వచ్చిన మరుసటి సంవత్సరమే శంకర్స్ ఈ దేశానికి మరొక ఘనత తెచ్చి పెట్టారు. 1948 మే మాసంలో ‘శంకర్స్ వీక్లీ’ ప్రారంభించారు. ఈ పత్రికను ప్రారంభించినదే నెహ్రూ. ఇందులో తన కార్టూన్లతో పాటు, ఇతరులు వేసిన కార్టూన్లకు కూడా చోటు కల్పించేవారు. ఇంగ్లండ్ నుంచి వెలువడిన ‘పంచ్’ తరహాలో పూర్తిగా కార్టూన్లతోనే వెలువడిన ఏకైక పత్రిక– – శంకర్స్ వీక్లీ. ముఖపత్రం మీద ఒక నాయకుడి కేరికేచర్‌తో ఇది వెలువడుతూ ఉండేది. చాలా బలమైన, స్పష్టమైన భాషతో శంకర్ సంపాదMీ యం రాసేవారు. శంకర్ కార్టూనిస్టు మాత్రమే కాదు. బాల సాహిత్యం కోసం చిల్ట్రన్స్ బుక్ ట్రస్ట్‌ను స్థాపించి ఎన్నో పుస్తకాలను కళాత్మకంగా అందించారు. పిల్లల కోసం జాతీయ స్థాయిలో పెయింటింగ్ పోటీలు పెట్టారు. తరువాత దానిని అంతర్జాతీయ స్థాయి పోటీగా మలచారు. ఢిల్లీలో ఆయన పెట్టిన బొమ్మల ప్రదర్శనశాల ఇప్పటికీ దర్శనీయ స్థలంగానే మిగిలి ఉంది. ‘రాజుగారి వంటి మీద గుడ్డలు లేవు, షేమ్ షేమ్’ అని దివ్యవస్త్రాల రాజుగారి కథలో ఎలుగెత్తి చాటే పిల్లవాడు గుర్తున్నాడా? దివ్యవస్త్రాలు లేదా దేవతావస్త్రాలు నేసి, కట్టిస్తాం, మీ కీర్తిని నలుదిశలా గుబాళింప చేస్తాం అంటూ, దిగంబరంగా రాజావారిని అంబారీ ఎక్కించి ఉరేగించిన దొంగల కథ అది. దొంగల మాయతో దేశం మొత్తం భ్రమలో పడినా ఆ పిల్లవాడు మాత్రం పడలేదు. ఫలితం– అంతర్లీనంగా ఉన్న గొప్ప నగ్నవాస్తవం బట్టబయలైంది. సరిగ్గా కార్టూన్ కూడా అలా ఎలుగెత్తి చాటే గొంతే! శంకర్ కుంచె అలాంటి వంద గొంతుకలకు నిలయం. కానీ 1975 జూన్ 25వ తేదీన ఇందిరా గాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితి ఈ వ్యంగ్య ధారకు అడ్డుకట్ట వేసింది. సెన్సార్ ఆంక్షలకు తలొగ్గడం ఇష్టం లేక శంకర్ తన వారపత్రికను స్వచ్ఛందంగా మూసి, తన పెన్ను కూడా మూసేశారు (1989లో కన్నుమూశారు). నెహ్రూ తన షష్టిపూర్తికి కుమార్తె ఇందిరకు ఒక అపురూపమైన బహుమతి ఇచ్చారు. అది తన మీద శంకర్ గీసిన 20 చిత్రాల ఆల్బమ్. ఆ సంగతి కూడా ఇందిర మరచిపోయారు. మీరు సరైన నిర్ణయం, అంటే పత్రిక మూసివేయాలన్న నిర్ణయం– తీసుకున్నారంటూ శంకర్‌కు ఉత్తరం రాశారు. ఇంగ్లండ్‌లో 1841లో ప్రారంభమైన ‘పంచ్’ పత్రిక 2002 వరకు కొనసాగింది. కానీ శంకర్స్ వీక్లీ పాతికేళ్లలోనే మూతపడింది. మన హాస్య, వ్యంగ్య ప్రియత్వానికి ఇదే గొప్ప నిదర్శనం. నెహ్రూ ప్రారంభించిన గొప్ప పత్రిక, ఆయన కుమార్తె నియంతృత్వం కారణంగా మూతపడటం ఒక చారిత్రక వైచిత్రి. ∙డా. గోపరాజు నారాయణరావు -
తప్పు చేశాడా..!
‘పెదవి దాటిన మాట పృథ్వి దాటుతుంది’... మాటలతో కోటలు కట్టే రవిశాస్త్రికి ఈ విషయం తెలియనిది కాదు. ఆటగాడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న తర్వాత గత రెండు దశాబ్దాలుగా తనదైన శైలిలో కామెంటేటర్‌గా కూడా ఈ మాజీ కెప్టెన్ తన అభిప్రాయాలను వెల్లడించడంలో విజయవంతమయ్యాడు. వ్యాఖ్యకు ఉన్న విలువ తెలిసినవాడు కాబట్టే ఎక్కడా మాట తూలకుండా ఇంత కాలం నెగ్గుకొచ్చాడు. కానీ కోచ్ పదవి కోల్పోయిన అసహనం మాటల రూపంలో బయటకు రావడం అతడిని ఇబ్బందుల్లో పడేసింది. పేరుకు గంగూలీపై ఆగ్రహం కనిపిస్తున్నా... పరోక్షంగా బీసీసీఐ నిర్ణయాన్ని అతను ప్రశ్నించినట్లే. * రవిశాస్త్రిపై బీసీసీఐ అసంతృప్తి * కామెంటరీకీ దూరమయ్యే ప్రమాదం! సాక్షి క్రీడా విభాగం: మరో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌తో పాటు కొన్నాళ్ల క్రితం వరకు కూడా రవిశాస్త్రి బీసీసీఐ ‘పెయిడ్ కామెంటేటర్’గానే ఉన్నాడు. బోర్డులో ఎన్ని లోపాలున్నా, ఆటలో తప్పులు కనిపిస్తున్నా ఆహా, ఓహో అంటూ టీవీ ప్రసారాల్లో భజన చేయడమే వీరి పని. అందు కోసం భారీ మొత్తాన్ని వీరు అందుకున్నారు. గత 20 ఏళ్లలో బీసీసీఐలో శాస్త్రి వేర్వేరు కమిటీల్లో సభ్యుడిగా కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు గంగూలీపై చేసిన వ్యాఖ్యలు బోర్డు సీనియర్ అధికారులకు కూడా ఆగ్రహం తెప్పించాయి. కోచ్ ఎంపిక ప్రక్రియ ముగిసిపోయిన తర్వాత ఈ రకమైన వివాదం రేగడం వారికి నచ్చలేదు. గట్టిగా చెప్పకపోయినా సంయమనం పాటించమంటూ రాజీవ్ శుక్లా సూచన చేయడం వారి అసంతృప్తిని సూచిస్తోంది. బీసీసీఐలో గంగూలీ ఇప్పుడు చాలా బలమైన వ్యక్తిగా ఎదుగుతున్నాడని కూడా అర్థమైంది. ఏదో ఒక దశలో ఈ వివాదం శాస్త్రిని వెంటాడవచ్చు. ఎందుకీ తొందరపాటు! టీమ్ డెరైక్టర్‌గా తాను మంచి ఫలితాలు రాబట్టానని, కాబట్టి తనకు కొనసాగే అవకాశం ఉందని రవిశాస్త్రి గట్టిగా నమ్మాడు. అయితే అనూహ్యంగా కుంబ్లే సీన్లోకి రావడం, కోచ్ పదవి చేజారడం ఆయనను అసహనానికి గురి చేశాయనేది వాస్తవం. అయితే ఎంపిక కాకపోవడంతో కాస్త నిరాశ చెందానని, కుంబ్లేకు శుభాకాంక్షలు కూడా చెప్పానని మొదటి రోజు మామూలుగా స్పందించిన శాస్త్రి, తర్వాతి రోజునుంచి తన అసంతృప్తిని దాచుకోలేకపోయారు. గంగూలీ సమావేశంలో లేడంటూ బయటపెట్టిన ఆయన అక్కడితో ఆగిపోయినా సరిపోయేది. దీనికి గంగూలీ తనదైన వివరణ ఏదో ఇచ్చుకునేవాడు. కానీ ఆ తర్వాత సౌరవ్‌కు బాధ్యతలు గుర్తు చేయబోయి అనవసరంగా తనకు తాను చెడ్డ పేరు తెచ్చుకున్నారు. కమిటీ కుంబ్లేకు అనుకూలంగా పని చేసిందని స్పష్టంగా కనిపిస్తోంది. మరో వైపు వీడియో ద్వారా ఇంటర్వ్యూ ఇవ్వకూడదని కూడా ఎక్కడా నిబంధన విధించలేదు. ఇవన్నీ వాస్తవాలే అయినా ఒకసారి ఎంపిక పూర్తయిన తర్వాత శాస్త్రి ఆగిపోవాల్సింది. బోర్డు రాజకీయాల గురించి తెలిసి, అపార అనుభవం ఉండీ నిర్మొహమాటంగా మాట్లాడటం అతనే తప్పు చేసినట్లుగా బయట ప్రచారమైంది. నమ్మకం పోయింది... నిజానికి 2014లో శాస్త్రి జట్టు బాధ్యతలు తీసుకోవడం కూడా ఆశ్చర్యకర నిర్ణయం. జట్టుకు కోచ్ ఫ్లెచర్ ఉండగా డెరైక్టర్ పేరుతో మరో పాత్రను ప్రవేశపెట్టడం, అంతా నాకే రిపోర్ట్ చేయాలి అంటూ శాస్త్రి చెలరేగిపోవడం వరుసగా జరిగాయి. అయితే ఆ సమయంలో బీసీసీఐ అతడిని గట్టిగా (గుడ్డిగా) నమ్మింది. అద్భుతాలు జరగకపోయినా జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించడం, ఆటగాళ్లు కూడా బాగు బాగు అనడంతో శాస్త్రి 18 నెలల సమయం ఇట్టే ‘సక్సెస్ఫుల్’గా గడిచిపోయింది. ఇప్పుడు కూడా అతను అసమర్థుడు అని ఎవరూ చెప్పలేదు. అధ్యక్షుడు ఠాకూర్ కూడా ప్రశంసించారు. కుంబ్లేకు ఒక అవకాశం ఇద్దామని బోర్డు భావించి ఉండవచ్చు. ఏడాది తర్వాత కుంబ్లే మంచి ఫలితాలు రాబట్టకపోయినా, మరో కారణంతో పదవి వదిలేసినా మళ్లీ వచ్చేందుకు శాస్త్రికి ఏదో ఒక రూపంలో అవకాశం ఉండేది. అతను ఆశిస్తే బోర్డులో లెక్క లేనన్ని పదవులు సిద్ధం. కానీ ఇప్పుడు బోర్డు ఎంపికను ప్రశ్నించడంతో ఆ దారులు మూసుకుపోయినట్లే. అన్నింటికీ మించి తన బలమైన కామెంటరీకి కూడా దూరమయ్యే ప్రమాదం ఉంది. ప్రసారకర్తలు ఎవరైనా కామెంటేటర్లను బీసీసీఐనే ఎంపిక చేయడం ఆనవాయితీ. జట్టుకు అనుకూలంగా మాట్లాడలేదనే సాకుతో హర్షాభోగ్లేను ఒక్క వేటుతో తప్పించిన బోర్డుకు శాస్త్రిని తప్పించడం కూడా సమస్య కాదు. తన పాత పరిచయాలతో ఏమైనా రాజీ ప్రతిపాదన చేస్తే తప్ప రవిశాస్త్రికి తాజా పరిణామాలు పూర్తి వ్యతిరేకంగా పరిణమించడం ఖాయం! -
భారత్-పాక్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా అమితాబ్
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటికే తన గాంభీర్యమైన కంఠంతో చిత్రాల్లోనే కాకుండా కౌన్ బనేగా కరోడ్ పతీ కార్యక్రమం ద్వారా అభిమానులను అరలించిన అమితాబ్.. ప్రపంచకప్‌లో కామెంటేటర్‌గా మన ముందుకు రానున్నారు. నాలుగేళ్లకోకసారి జరిగే వరల్డ్ కప్ అంటే అందరికీ అత్యంత ఆసక్తి. అందులోనూ భారత్-పాక్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనూ ఉత్కంఠే. ఆదివారం జరిగే భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో అమితాబ్ తొలిసారిగా కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. మాజీ క్రికెటర్లు కపిల్‌దేవ్, షోయబ్ అక్తర్, హర్షబోగ్లే వంటి దిగ్గజాల సరసన అమితాబ్ కామెంటేటరీ చెప్పనున్నారు. తన షమితాబ్ చిత్రానికి ప్రమోషన్ గానే ఆయన కామెంట్రీ చెబుతారని అంటున్నారు. -
చూడలేడు... చెప్పగలడు!
కామెంటరీ ైబె కరమ్ విరాట్ కొహ్లీ వీర విహారపు బ్యాటింగ్ నెప్పుడూ చూడలేదతను. బౌన్సీ పిచ్‌లపై దూసుకొచ్చే ఇషాంత్ బంతులనూ గమనించలేడు. అసలు క్రికెట్ ఎలా ఆడతారో... జనసందోహంతో నిండిన స్టేడియం ఎలా ఉంటుందో కూడా తెలీదు! ఇంకా చెప్పాలంటే మనిషి రూపురేఖల గురించే తనకు స్పష్టత లేదు. ఎందుకంటే చూపులేదు. జన్మతః అంధుడు. అయితే ఇప్పుడు కరమ్‌వీర్ కుమార్ షెరావత్ చెప్పే క్రికెట్ కామెంటరీ నెట్లో హల్చ ల్ చేస్తోంది. ఆటపరమైన దృశ్యాన్ని ఊహించుకొని అతడు చేసే విశ్లేషణ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. వరల్డ్‌కప్ మూడ్‌లో ఉన్న జనాలకు ఈ దేశీయ కామెంటేటర్ తెగ నచ్చేశాడు! కరమ్‌వీర్ కామెంటరీ చెబుతున్నప్పుడు వింటుంటే, దృశ్యం కళ్ల ముందు కదలాడుతుంది. తన మాటలతో ఆటగాళ్ల వేగంతో పోటీపడినట్టుగా కామెంటరీ చెబుతాడు కరమ్‌వీర్. ఈ విషయంలో దేశీయ ఇంగ్లిష్ కామెంటరేటర్లు కూడా కరమ్ ముందు దిగదుడుపే ననిపిస్తుంది. చాలా సంవత్సరాల నుంచి ఢిల్లీ లోని క్యాపిటల్ బ్లైండ్ రిలీఫ్ సొసైటీలో ఆశ్రయం పొందుతున్నాడు కరమ్. వయసు పాతికేళ్లు. సహజంగానే క్రికెట్ అంటే అభిమానించే వాళ్లందరి మధ్య బతుకుతున్నందున కరమ్‌కు కూడా క్రికెట్ తో పరిచయం ఏర్పడింది. రేడియోలో క్రికెట్ కామెంటరీని వింటూ, టీవీలో క్రికెట్ చూసే వాళ్ల పక్కన కూర్చొవడం అలవాటైంది. అలా చెవిన బడే కామెంటరీ మదిలో నాటుకుపోయింది. దీంతో అలవోకగా కామెంటరీ చెప్పేస్తున్నాడు. కరమ్‌కు ఇంగ్లిష్ రాదు. చదువుకొన్నది కూడా లేదు. అయినా ఊహాత్మకంగా రోమాంచకతను మిళితం చేస్తూ ఇంగ్లిష్ కామెంటరీ చెబుతాడు. కరమ్ కామెంటరీ తీరును ఔత్సాహికులు వీడియోగా తీసి ఇంటర్నెట్కు అప్‌లోడ్‌చేశారు. వేలమంది ఫేస్బుక్ యూజర్లు ఆ వీడియోను షేర్ చేసుకొంటున్నారు. కరమ్ కేవలం కామెంటరీ మాత్రమే కాదు త్వరలో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్ విషయంలో ఆటగురించి విశ్లేషణ కూడా చేస్తాడు. తనకు ఇష్టమైన ఆటగాడు సచిన్ టెండూల్కర్ అని, అయితే సచిన్ వచ్చే ఈసారి వరల్డ్‌కప్‌లో ఆడటం లేదు కాబట్టి.. ప్రస్తుతానికి ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్‌వాట్సన్ తనకు ఫేవరెట్ అని చెబుతాడు. వైకల్యాన్ని పర్సెంటేజీ కొలతల్లో చెప్పే విధానంలో కరమ్‌ను వందశాతం అంధుడిగా ధ్రువీకరించారు. అయితే గ్రాహ్యశక్తి విషయంలో మాత్రం కరమ్ వందకువంద మార్కులు పొందుతాడు! - జీవన్ -
లక్ష కోట్ల పెట్టుబడులు కావాలి
సీమాంధ్రలోఇలా చేస్తే... వికేంద్రీకరణ: అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, విద్యా సంస్థలు, అలాగే వాణిజ్య కార్యకలాపాలను ఒకేచోట కాకుండా వేర్వేరుగా వివిధ నగరాల ఎంపిక. విద్యుత్: సీమాంధ్రలో విద్యుత్ సర్ప్లస్ ఉంటుంది. ప్లాంట్లను పూర్తిగా వినియోగించుకునేందుకు ఇప్పటికే ఉన్న, కొత్తగా నెలకొల్పుతున్న ప్లాంట్లకు బొగ్గు, గ్యాస్ సరఫరాకు ప్రభుత్వం హామీ ఇవ్వాలి. భవిష్యత్ పారిశ్రామిక అభివృద్ధి దృష్ట్యా నిరంతర విద్యుత్‌కు చర్యలు. సంప్రదాయేతర ఇంధన విధానం పటిష్టపర్చడం. బొగ్గు, గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు కొత్తగా లెసైన్సులు ఇవ్వకపోవడం. స్టాండలోన్ సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం. రవాణా: మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు. మరిన్ని దేశీయ విమానాశ్రయాలు. బందరు పోర్టు అభివృద్ధి వేగిరం. కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు అంతర్జాతీయ స్థాయికి చేర్చడం. పారిశ్రామిక వాడలను పోర్టులతో అనుసంధానించేందుకు రైల్వే లైన్లు. నగరాలను అనుసంధానిస్తూ పారిశ్రామిక వాడలకు రేడియల్ రోడ్లు. పారిశ్రామిక కారిడార్లు: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఔషధ, బల్క్ డ్రగ్, ఐటీ, ఐటీఈఎస్, నావికా రంగ ఆధారిత పరిశ్రమలు. తూర్పు, పశ్చిమ గోదావరిలో ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, ఎరువులు, రసాయనాలు, పురుగు మందుల తయారీ పరిశ్రము. గుంటూరు, కృష్ణాలో వాణిజ్యం, విద్య, ఆరోగ్యం, పరిశోధన, అభివృద్ధి, ఆర్థిక సంస్థలు. చిత్తూరు, అనంతపూర్, నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, తయారీ జోన్లతోపాటు ఈ జిల్లాలను చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌కు అనుసంధానం చేయడం. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విభజన తర్వాత ఏర్పడుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఒక్కో రాష్ట్రంలో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడులు అవసరం అవుతాయి. ఇందులో 30-40 శాతం తయారీ రంగంలో వచ్చినట్టయితే.. ఈ రంగంలో జాతీయ సగటు వృద్ధి రేటు 23-24 శాతానికి చేరుకుంటాం. ఇదే జరిగితే నాలుగేళ్లలో ఈ ఒక్క రంగంలో ఇరు రాష్ట్రాల్లో కలిపి 20 లక్షల మందికి ఉపాధి లభించడం ఖాయమని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర వెల్లడించారు. సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధికి రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు చేపట్టాల్సిన కార్యాచరణ నివేదికను ఫ్యాప్సీ బుధవారమిక్కడ విడుదల చేసింది. నివేదికను రూపొందించిన ఫ్యాప్సీ ఇండస్ట్రియల్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ మూర్తి, అసిస్టెంట్ డెరైక్టర్ టి.సుజాతతోపాటు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా, వైస్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్ రెడ్డి ఈ సందర్భంగా కీలక అంశాలను మీడియాకు వివరించారు. మంచి నాయకత్వం, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, నిరంతర విద్యుత్, రుణ సౌకర్యం, దీర్ఘకాలిక వ్యూహం ఆధారంగానే రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధికి ఫ్యాప్సీ వెన్నంటి ఉంటుందన్నారు. త్వరలో వివిధ పార్టీలకు ఈ నివేదికను అందజేయనున్నట్టు చెప్పారు. రంగాలు, అంశాల వారీగా ఫ్యాప్సీ సూచనలు ఇవే.. ఇరు రాష్ట్రాల్లో చేపట్టాల్సినవి.. పారిశ్రామిక అభివృద్ధి: రంగాల వారీగా పారిశ్రామిక విధానాల అమలు. అందుకుతగ్గ ప్రయోజనాలు, సౌకర్యాలు. అన్ని జిల్లాల్లో చిన్న పారిశ్రామిక వాడలు నెలకొల్పి లక్ష్యాలు నిర్ధేశించాలి. మౌలిక వసతులు: మౌలిక వసతులుంటే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. వసతుల కల్పనలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్ద పీట. కాలుష్యకారక పరిశ్రమల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడలు. వీటికి రోడ్డు, రైలు సౌకర్యం. ఆర్థిక సహాయం: సూక్ష్మ, చిన్న తరహా కంపెనీలకు ప్రతి పారిశ్రామిక వాడలో సహకార రుణ సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం. మార్కెటింగ్: మార్కెట్ తీరుతెన్నులు, అవకాశాల గురించి తాజా సమాచారం. సూక్ష్మ, చిన్న తరహా కంపెనీల కోసం కొనుగోలు-విక్రయదారుల సమావేశాలు, వస్తూత్పత్తుల ప్రదర్శన ల నిర్వహణ. వ్యవసాయం: వ్యవసాయంలో యాంత్రికీకరణ కారణంగా ఉత్పాదకతతోపాటు పారిశ్రామికీకరణ సాధ్యపడుతుంది. విరివిగా కోల్డ్ స్టోరేజీలు. వ్యవసాయ ఆధారిత, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రత్యేక ప్రయోజనాలు. మానవ వనరులు: విద్యార్థుల్లో పరిశ్రమకు అవసరమయ్యేవారి సంఖ్య 8-10 శాతానికి మించడం లేదు. అత్యుత్తమ మానవ వనరులను తీర్చిదిద్దేందుకు ఇంటెగ్రేటెడ్ స్టేట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్ అమలు. స్థానిక పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వృత్తి నైపుణ్య శిక్షణ. రియల్ ఎస్టేట్: భూముల ధరల నియంత్రణకు రియల్టీ కార్యకలాపాల కట్టడి. జిల్లాకో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటుద్వారా భూముల సద్వినియోగం. తెలంగాణలో ఇలా.. వికేంద్రీకరణ: హైదరాబాద్‌కున్న ఇమేజ్ కొనసాగుతుంది. అంతర్జాతీయ కంపెనీలు మరిన్ని వస్తాయి. ఇక నుంచి పరిశ్రమలు, విద్యా సంస్థలు మిగిలిన జిల్లాల్లో రావాలి. ప్రణాళిక ప్రకారం ద్వితీయ శ్రేణి నగరాల్లో పట్టణీకరణ. విద్యుత్: సీమాంధ్రలో విద్యుత్ ప్లాంట్లు ఎక్కువగా ఉండడంతో తెలంగాణలో 3,000 మెగావాట ్ల విద్యుత్ కొరత తలెత్తనుంది. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్లో కొత్తగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లు. సౌర, పవన, బయోమాస్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం. రవాణా: వరంగల్ విమానాశ్రయం పునరుద్ధరణ. నిజామాబాద్, ఖమ్మంలో విమానాశ్రయాలు. పారిశ్రామిక ప్రాంతాలతో ప్రధాన నగరాలకు రైల్వే కనెక్టివిటీ. నగరాలను అనుసంధానిస్తూ పారిశ్రామిక వాడలకు రేడియల్ రోడ్లు. పారిశ్రామిక కారిడార్లు: ఆదిలాబాద్, కరీంనగర్లో విద్యుదుత్పత్తి, వస్త్ర పరిశ్రమ. నిజామాబాద్‌లో ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధార పరిశ్రమలు, ఆరోగ్య రంగ సేవలు. మెదక్‌లో వాణిజ్య, ఇంజనీరింగ్, వాహన పరిశ్రమకు అవసరమయ్యే పరికరాల తయారీ. ఖమ్మం, వరంగల్‌లో ఖనిజాధార పరిశ్రమలు, ఐటీ-ఐటీఈఎస్. మహబూబ్‌నగర్, నల్గొండలో సిమెంటు, ఇంజనీరింగ్, వ్యవసాయాధార కార్యకలాపాలు, స్పిన్నింగ్, వస్త్రాల తయారీకి పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు.