
క్రికెట్ చరిత్రలో ఎన్నడూ కనిపించని అనూహ్య దృశ్యమిది... ఇప్పటి వరకు మైదానంలో ఉన్న ఆటగాడితో కామెంటేటర్లు మాట్లాడటమే చూశాం. కానీ కామెంటేటర్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫీల్డర్ల పక్కన నిలబడి కామెంటరీ ఇవ్వడం ఇప్పుడు కనిపించింది. గురువారం వెస్టిండీస్, వరల్డ్ ఎలెవన్ మధ్య జరిగిన టి20 ఛారిటీ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
గేల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కీపర్, తొలి స్లిప్ ఫీల్డర్ మధ్య కాస్త వెనక్కు జరిగి నాసిర్ హుస్సేన్ కామెంటరీ ఇచ్చాడు. ఏదో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అయితే ఫర్వాలేదు గానీ... ఐసీసీ అధికారికంగా అంతర్జాతీయ టి20 హోదా ఇచ్చిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటన జరగడమే ఆశ్చర్యకరం!