slips
-
మళ్లీ తడబడ్డ బైడెన్
మిల్వాయుకీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తడబాట్ల పరంపర అంతులేకుండా కొనసాగుతూనే ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి తర్వాత ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన మళ్లీ తప్పులు మాట్లాడారు. విభేదాలను బ్యాలెట్ బాక్సుల్లో పరిష్కరించుకుంటాం అనబోయి ‘బ్యాటిల్ (యుద్ధ) బాక్సుల్లో’ పరిష్కరించుకుంటామని అన్నారు. దాంతో ఆయన సొంత పార్టీ అయిన డెమొక్రాట్ నేతలు మరోసారి తలపట్టుకున్నారు. ట్రంప్‌పై దాడి నేపథ్యంలో ఇది రాజకీయంగా ఉద్రిక్తతలను తగ్గించుకోవాల్సిన సమయమని బైడెన్ అభిప్రాయపడ్డారు. ‘‘రాజకీయాలంటే యుద్ధ క్షేత్రం కాదు. పారీ్టలుగా నేతల మధ్య విభేదాలు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ మనం శత్రువులం కాదని, కలిసి పనిచేసే వారిమని, తోటి పౌరులమేనని గుర్తుంచుకోవాలి. చర్చలైనా, మరోటైనా శాంతియుతమైన జరగాలి. మన దేశంలో హింసకు తావు లేదు. జాతిగా మనమంతా ఒక్కటి కావాల్సిన సమయమిది’’ అంటూ పిలుపునిచ్చారు. -
కేదార్నాథ్ యాత్రలో అపశ్రుతి.. సెల్ఫీ తెచ్చిన ముప్పు..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో కేదార్నాథ్ యాత్రకు వెళ్తున్న ఓ వ్యక్తి నదిలో జారిపడ్డాడు. ట్రెక్కింగ్ మార్గంలో వెళ్తున్నక్రమంలో సెల్ఫీ తీసుకుంటుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కేధార్నాథ్ యాత్ర మార్గమధ్యలోని రాంబాడ సమీపంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో మందాకిని నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది మీదుగా యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు. అంతలోనే కాలు జారి నదిలో పడిపోయాడు. కొంచం దూరం కొట్టుకుపోయిన తర్వాత బండరాళ్లను పట్టుకుని ఆగిపోయాడు. Video: Kedarnath Pilgrim Slips Into River While Taking Selfie, Saved Later https://t.co/nvqy95fj1p pic.twitter.com/FeK21URcOY — NDTV (@ndtv) September 5, 2023 పరిస్థితిని గమనించిన స్థానికులు రంగంలోకి దిగారు. తాళ్లతో ఒకరినొకరు పట్టుకుని బాధితున్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ భయానక దృశ్యాలను చూసి నెటిజన్లు భారీగా స్పందించారు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
బిలియనీర్ గౌతం అదానీకి ఝలక్, 24 గంటల్లో..
న్యూఢిల్లీ: ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి బిలియనీర్, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, గౌతం అదానీ నాలుగో స్థానానికి పడిపోయారు. తాజా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో అదానీ ఈ జబితాలో మూడో స్థానం నుంచి ప్రస్తుతం నాల్గవ స్థానంలో ఉన్నారు. గత 24 గంటల్లో అదానీ నికర విలువ 872 మిలియన్ డాలర్లకు పడిపోయింది. గత ఏడాది (జనవరి 24, 2022) నుంచి అదానీ 683 మిలియన్ల డాలర్ల సంపదను కోల్పోయారు. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం, ఫ్రెంచ్ విలాసవంతమైన బ్రాండ్ లూయిస్ విట్టన్ వ్యవస్థాపకుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం నికర విలువ 188 బిలియన్ డాలర్లు టాప్‌లో ఉన్నారు. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ 45 బిలియన్ డాలర్లతో నికర విలువతో రెండో స్థానంలో ఉండగా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 121 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలోకి దూసుకొచ్చారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 84.7 బిలియన్ డాలర్లనికర విలువతో ప్రపంచంలోని పన్నెండవ సంపన్న వ్యక్తిగా నిలిచారు. అంతకుముందు ముఖేష్ అంబానీ తొమ్మిదో స్థానంలో ఉన్నారు. మరోవైపు చైనాలో మాంద్యం దెబ్బ చైనాకు చెందిన బిలియనీర్ హుయ్ కా యాన్‌ను గట్టిగా తాకింది. అతిపెద్ద రియల్ ఎస్టేట్ ఎవర్‌గ్రాండే గ్రూప్‌కు చైర్మన్ యాన్ సంపద ఏకంగా 93 శాతం కుప్పకూలింది. 42 బిలియన్ల డాలర్ల సంపద కాస్తా 3 బిలియన్ డాలర్లకు కరిగిపోవడం గమనార్హం. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల రోజువారీ జాబితాలో టాప్ టెన్‌లో నిలిచిన బిగ్ షాట్స్ బిల్ గేట్స్ (నికర విలువ 111 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్ (108 బిలియన్ డాలర్లు), లారీ ఎలిసన్ (99.5 బిలియన్ డాలర్లు), లారీ పేజ్ (92.3 బిలియన్ డాలర్లు), సెర్గీ బ్రిన్ (88.7 బిలియన్ డాలర్లు), స్టీవ్ బాల్మెర్ (86.9 బిలియన్ డాలర్లు). -
దలాల్ స్ట్రీట్ దంగల్: అదానీ, అంబానీ టాప్ ర్యాంకులు పాయే!
సాక్షి,ముంబై: స్టాక్ మార్కెట్లో సోమవారం నాటి అమ్మకాలసెగ భారత కుబేరులను భారీ షాక్ ఇచ్చింది.ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో గౌతమ్ అదానీ మరోసారి మూడో స్థానానికి పడిపోయారు. అంతేకాదు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కూడా టాప్-10 నుండి నిష్క్రమించారు గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి పడిపోయారు. దలాల్ స్ట్రీట్ లో సోమవారం నాటి భారీ నష్టాలతో బిలియనీర్ అదానీ ఇప్పుడు టెస్లా చీఫ్ ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కంటే వెనుక బడి ఉన్నారు. గౌతమ్ అదానీ కంపెనీల షేర్ల క్షీణత కారణంగా అదానీ నికర విలువ 6.91 బిలియన్ డాలర్లు తగ్గి 135 బిలియన్ డాలర్లకు చేరుకుంది.ఆర్ఐఎల్ చీఫ్ నికర విలువ 82.4 బిలియన్ డాలర్లకు తగ్గడంతో 11వ స్థానానికి పడిపోయారు. ఈ నెల ప్రారంభంలో, బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోని రెండవ అత్యంత ధనవంతుడు, తొలి భారతీయుడు, తొలి ఆసియన్‌గా నిలిచారుఅదానీ. IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం గౌతమ్ అదానీ దేశంలో టాప్ ట్రిలియనీర్‌గా నిలిచారు. ప్రకారం లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్‌తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు కంపెనీలను నిర్మించిన ఏకైక భారతీయుడు గౌతమ్ అదానీ. పదేళ్లపాటు అత్యంత సంపన్న భారతీయ ట్యాగ్‌ను పట్టుకున్న అంబానీ ఈ ఏడాది రూ.7.94 లక్షల కోట్ల సంపదతో రెండో స్థానానికి పడిపోయారు. -
ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో మహిళ, క్షణాల్లో స్పందించిన కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: హడావిడిగా కదులుతున్న రైలు ఎక్కే క్రమంలో జారిపోయి, తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడే ఉన్న రైల్వే కానిస్టేబుల్ వేగంగా స్పందించి ఆ మహిళను వెనక్కిలాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దినేష్ సింగ్‌ను ప్రశంసిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సౌత్ సెంట్రల్ రైల్వే ట్వీట్ చేసింది. సికింద్రాబాద్ రైల్వె స్టేషన్ నుంచి బయలు దేరుతున్న ఎమ్ఎమ్ఆర్ స్పెషల్ రైలు ఎక్కేందుకు నసిమా బేగం అనే మహిళ పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే అదే సమయంలో రైలు కదలినప్పటికీ, పరుగున వెళ్లి ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పట్టు కోల్పోయి ప్లాట్ ఫామ్, రైలు మధ్యలో పడబోయింది. అయితే అక్కడే విధుల్లో ఉన్న దినేష్ ఆమెను ప్లాట్‌ఫాం మీదకు లాగేశారు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మరోవైపు రైలులో ఉన్నవారు చైన్ లాగడంతో రైలు ఐదు నిమిషాల పాటు నిలిచిపోయింది. ఆ మహిళను క్షేమంగా తిరిగి రైలు ఎక్కించారు. నసిమాను కాపాడిన కానిస్టేబుల్‌ను తోటి ప్రయాణీకులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలాగే సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడారంటూ సౌత్ సెంట్రల్ రైల్వే కూడా దినేష్‌ను అభినందించింది. Timely & Daring #LifeSaving act by RPF staff Aged woman passenger tried to board moving train at Secuderabad stn fell in the gap btwn coach & platform and was being dangerously dragged. On duty RPF constable Sri.Dinesh Singh acted immediately, pulled lady out & saved her life. pic.twitter.com/Me4z0SA7ZW — South Central Railway (@SCRailwayIndia) July 31, 2021 -
బీహెచ్‌ఈఎల్‌షేరు ఢమాల్: ఎందుకంటే
సాక్షి, ముంబై: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) కు ఫలితాల షాక్ తగిలింది. క్యు3లో ఆర్థికఫలితాలు తీవ్రంగా నిరాశ పరచడంతో సోమవారం నాటి మార్కెట్లో బీహెచ్ఈఎల్ భారీ పతనాన్ని నమోదు చేసింది. గత వరుస 5 రోజులుగా లాభపడిన షేరు సోమవారం 8.5 శాతానికి పైగా నష్టపోయింది. ఫలితంగా కీలకమైన రూ. 40 దిగువకు చేరింది. ఇది ఇన్వెస్టర్ల సెంటి మెంటును మరింత దెబ్బ తీసింది. 2020 ఆర్థిక సంవత్సరం క్యు3లో 218కోట్ల నికర నష్టాలను నమోదు చేసిన కంపెనీ, మార్కెట్ వర్గాలను భారీగా నిరాశపర్చింది. అలాగే ఆదాయం క్యూ 3 లో రూ .4,532 కోట్లకు పడిపోయింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాప్ 14,067 కోట్ల రూపాయలకు చేరింది. మొత్తం ఆపరేటింగ్ నష్టాలు రూ.180కోట్లకు పెరిగాయి. మరోవైపు కరోనా మహమ్మారి సంక్షోభం, ఆర్డర్ల క్షీణత కూడా కంపెనీ లాభాలను దెబ్బతీసిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీంతో బ్రోకరేజ్ సంస్థ నోమురా ఈ షేరుకు సెల్ కాల్ ఇచ్చింది. రికవరీ ఆశలు కనిపించని నేపథ్యంలో బలహీనత కొనసాగుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. షేరు టార్గెట్ ధర రూ .25గా తెలిపింది. -
కరోనా ఎఫెక్ట్ : జీఎస్టీ వసూళ్లు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్ సంక్షోభంతో జీఎస్టీ వసూళ్లు భారీగా క్షీణించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం పన్ను వసూళ్లు జూలై మాసంలో 87,422 కోట్ల రూపాయలకు పడిపోయాయి. గత ఏడాది (జూలై 2019) ఇదే కాలలో 1.02 లక్షల కోట్లను రాబట్టింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయం 14.36 శాతం క్షీణించింది. జూన్ నెలలో 90,917 కోట్ల రూపాయలతో పోలిస్తే జూలైలో వసూలు 3.84 శాతం క్షీణించింది. (అయిదేళ్లలో 12 లక్షల ఉద్యోగాలు) 2020 జూలైలో వసూలు చేసిన స్థూల జీఎస్టీ ఆదాయం, 87,422 కోట్ల రూపాయలు. ఇందులో సీజీఎస్టీ 16,147 కోట్లు, ఎస్జీఎస్టీ 21,418 కోట్లు, ఐజీఎస్టీ 42,592 కోట్లు, సెస్ 7,265 కోట్లుగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 86 శాతం అని పేర్కొంది. గత నెలలో వచ్చిన ఆదాయాలు ప్రస్తుత నెల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 2020 లకు సంబంధించిన పన్నులను జూన్ నెలలో పెద్ద సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు చెల్లించారని పేర్కొంది. అలాగే 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు 2020 సెప్టెంబర్ వరకు రిటర్నులను దాఖలు చేసేందుకు సడలింపు ఉన్న విషయాన్ని గమనించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. (వాహన కొనుగోలుదారులకు ఊరట) -
గరిష్టాలనుంచి వెనక్కి తగ్గిన సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో గరిష్టం నుంచి మార్కెట్ 300 పాయింట్లు కుప్పకూలింది. మిడ్ సెషన్నుచి లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 122 పాయింట్ల నష్టంతో 40766 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు బలహీనపడి 12025 వద్ద కొనసాగుతున్నాయి. టెలికం రంగానికి ఇవ్వాల్సిన ఉపశమన చర్యలను సిఫార్సు చేసేందుకు ఏర్పాటైన కార్యదర్శుల కమిటీ కధ ముగిసిందని ప్రభుత్వాధికారి చెప్పడంతో టెల్కోల ఆశలు ఆవిరైపోయాయి. మరోవైపు ట్రేడర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. అటు జీ ఎంటర్టైన్ మెంట్ ఛైర్మన్ సుభాష్ చంద్ర రాజీనామాతో జీ షేర్లు కుప్పకూలాయి. దీంతో పాటు భారతి ఇన్ఫ్రాటెల్, ఎయిర్టెల్, గ్రాసిం, జెఎస్ డబ్ల్యూ స్టీల్, సన్‌ఫార్మా, బీపీసీఎల్ నష్టపోతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, ఐటీసీ, టాటా స్టీల్ లాభపడుతున్నాయి. -
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, నిజామాబాద్ : మల్లారం గండి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సుకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. నిజామాబాద్ నుంచి బాన్సువాడ వెళ్తుండగా మార్గ మధ్యలో బస్సు అదుపు తప్పడంతో ఒక్కసారిగా రోడ్డు పక్కకు దిగిపోయింది. దీంతో భయబ్రాంతులకు గురైన ప్రయాణీకులు వెంటనే కిటికీల నుంచి కిందకు దిగారు. కాగా అడవిలోకి దూసుకుపోయి ఉంటే మరింత ప్రమాదం తలెత్తే అవకాశం ఉండేదని డ్రైవర్‌పై తోటి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
స్లిప్‌లో కామెంటేటర్
క్రికెట్ చరిత్రలో ఎన్నడూ కనిపించని అనూహ్య దృశ్యమిది... ఇప్పటి వరకు మైదానంలో ఉన్న ఆటగాడితో కామెంటేటర్లు మాట్లాడటమే చూశాం. కానీ కామెంటేటర్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫీల్డర్ల పక్కన నిలబడి కామెంటరీ ఇవ్వడం ఇప్పుడు కనిపించింది. గురువారం వెస్టిండీస్, వరల్డ్ ఎలెవన్ మధ్య జరిగిన టి20 ఛారిటీ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గేల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కీపర్, తొలి స్లిప్ ఫీల్డర్ మధ్య కాస్త వెనక్కు జరిగి నాసిర్ హుస్సేన్ కామెంటరీ ఇచ్చాడు. ఏదో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అయితే ఫర్వాలేదు గానీ... ఐసీసీ అధికారికంగా అంతర్జాతీయ టి20 హోదా ఇచ్చిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటన జరగడమే ఆశ్చర్యకరం! -
ఆరు నెలల కనిష్టానికి రూపాయి
సాక్షి, ముంబై: డాలర్ మారకంలో దేశీయ కరెన్సీ రూపాయ ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. ప్రారంభ లాభాలనుంచి కిందికి పడి రూపాయి 6పైసలు నష్టపోయింది. ప్రస్తుతం 11పైసలు క్షీణించి 65.60 వద్ద ట్రేడ్ అవుతోంది. వాణిజ్యలోటు పెరిగిపోతున్న నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ తగ్గుముఖం పట్టిందని డీలర్లు చెప్పారు. మరోవైపు దేశీయంగా ఏటీఎంలలో నగదు కొరత నేపథ్యంలో సెంటిమెంట్ దెబ్బతిందని మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. అటు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో డాలర్‌కు డిమాండ్ పెరిగింది. సోమవారం రూపాయి 65.44 వద్ద ముగిసింది. అటు దేశంలో నెలకొన్న నగదు కొరత సంక్షోభంపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. నగదుకొరత సమస్యను సమీక్షించామనీ, త్వరలోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చామని ట్విటర్ ద్వారా వెల్లడించారు. -
న్యూ ఇయర్లో పసిడి పరుగులు
సాక్షి, ముంబై: నూతన సంవత్సరంలో బంగారు ధరలు ఊపందుకున్నాయి. దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో బంగారం ధర రూ.30 వేల స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.50 లు ఎగిసి రూ. 30,450 కొనసాగుతోంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ. 42 ఎగసి రూ. 29,165 వద్ద ఉంది.సింగపూర్ మార్కెట్లో ఔన్స్ బంగారం 0.42 శాతం పెరిగి 1,308 డాలర్లకు చేరుకుంది. స్థానిక నగల విక్రయదారుల కొనుగోళ్లు, గ్లోబల్ మార్కెట్ల ధోరణితో బంగారం ధరలు పుంజుకున్నాయి. అయితే నిన్న(సోమవారం) పాజిటివ్‌గా ఉన్న వెండి ధర నేడు క్షీణించింది. కిలో వెండి రూ. 390 పతనమై 39,710 వద్ద కొనసాగుతోంది. పారిశ్రామిక యూనిట్లు, నాణెం తయారీదారుల డిమాండ్ తగ్గడంతో వెండి ధరలు తిరోగమనం దిశగా మళ్లాయి. దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ. 50 రూ. 30,450 వద్ద, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ. 30,300గా నమోదైంది. సావరిన్ గోల్డ్ (ఎనిమిది గ్రాములు) ధర రూ. 24,700 గా ఉంది. మరోవైపు, వెండి రూ. 390 క్షీణించి రూ. కేజీకి 39,710. వారపు ఆధారిత డెలివరీ కిలో వెండి ధర రూ. 39,040 గా ఉంది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో డాలర్ బలహీనపడడంతో బంగారం కొనుగోళ్లు పుంజకున్నాయి. ఉత్తర కొరియాతో తిరిగి పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో డాలరు బలహీనపడింది. దీంతో సంక్షోభ పరిస్థితుల్లో సురక్షితమైన స్వర్గధామ పెట్టుబడులుగా భావించే బంగారం బలపడిదని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు కన్సాలిడేషన్ బాటపట్టగా దేశీయ కరెన్సీ రూపాయి భారీగా లాభపడుతూ రెండున్నరేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది. -
ఐటీసికి డౌన్‌గ్రేడ్ షాక్
సాక్షి, ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు భారీగా నష్టపోతోంది. విదేశీ బ్రోకింగ్ సంస్థ మక్వారీ సహా రెండు కంపెనీలు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో ఐటీసీ కౌంటర్ బలహీనపడింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఈ షేరు 2.25 శాతం క్షీణించి రూ. 275 దిగువకు చేరింది. రెండు బ్రోకరేజ్ సంస్థలు సంస్థకు డౌన్ గ్రేడ్ ర్యాంక్‌ను ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన అమ్మకాలకు తెర తీసింది. మార్చి 2018 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 4శాతం తగ్గిపోతుందని బ్రోకరేజీలు అంచనా వేశాయి. ముఖ్యంగా సిగరెట్ అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ రంగంలో ఐటీసీకంటే హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) పెట్టుబడులకు అనుకూలమంటూ మెక్వారీ తాజాగా పేర్కొంది. గత రెండు నెలల్లో అంటే జూలై-ఆగస్ట్‌లలో సిగరెట్ అమ్మకాల పరిమాణం క్షీణించినట్లు తెలియజేసింది. దీంతో వచ్చే ఏడాదికి టార్గెట్ ధరను రూ. 340 నుంచి రూ. 304కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఐటీసీ సిగరెట్లు, హోటళ్ళు, కాగితపుఅట్టలు, స్పెషల్ పేపర్లు, ప్యాకేజింగ్, అగ్రి-బిజినెస్, ప్యాక్ చేసిన ఆహారాలు, మిఠాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్రాండెడ్ దుస్తులు, పర్సనల్ కేర్, స్టేషనరీ తదితర ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులతో పాటు ఐటీసీ సిగరెట్ల ఉత్పత్తిలో మార్కెట్ లీడర్‌గా ఉంది. -
తృటిలో తప్పిన ప్రాణాపాయం
-
ఇప్కా లాబ్స్‌కు యూఎస్ఎఫ్డీఏ షాక్
ముంబై: దేశీయ ఫార్మా సంస్థ ఇప్కా లేబ్స్ తయరు చేసిన మందును అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ షాక్ తగిలింది. రత్లాం, సిల్వస్సా, పీతంబూర్ మూడు యూనిట్లలో తయారయ్యే అన్ని రకాల ఔషధాల దిగుమతులపై యూఎస్ఎఫ్డీఏ బ్యాన్ విధించడంతో ఇప్కా లేబ్స్ షేర్ భారీ పతనాన్ని నమోదు చేసింది. బీఎస్ఈలో ఈ షేరు 15 శాతం కుప్పకూలింది. మధ్యప్రదేశ్‌లోని పీతంపూర్, రత్లాం, సిల్వస్సా (దాద్రా నగర్ హవేలి) లో తయరుచేసిన అన్ని ఔషధాలపై నిషేధం కొనసాగుతుందని ఇప్కా లాబొరేటరీస్ ఒక ప్రకటనలో తెలిపింది . ఈ తయారీ కేంద్రాల నుండి తయారైన ఔషధ ఉత్పత్తులు , అమెరికా మార్కెట్ కోసం ఉద్దేశించిన మందులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ప్రకటించేదాకా బ్యాన్ కొనసాగుతుందని పేర్కొంది. కాగా రత్లాం యూనిట్లో క్లోరోక్విన్ ఏపీఐ తయారీకి మాత్రం యూఎస్ఎఫ్డీఏ వెసులుబాటు కల్పించినట్లు కంపెనీ పేర్కొంది. అమెరికా మార్కెట్లో ఈ ఏపీఐకు కరవు ఏర్పడినా లేదా అవసరం ఏర్పడినా వీటి విక్రయాలను అనుమతించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేశీయ మార్కెట్లో పార్మా బలహీనత కొనసాగుతోంది. దీంతో ఫార్మాసెక్టార్కు దూరంగా ఉండాలని కూడా ఎనలిస్టులు సూచిస్తున్నారు. -
నాలుగు నెలల కనిష్టానికి డబ్ల్యుపీఐ
న్యూడిల్లీ: టోకుధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్ఠానికి దిగజారింది. ఏప్రిల్ నెల డబ్ల్యుపీఐ 3.85 శాతంగా నమోదైంది. పదార్ధాల తయారీ, వస్తువుల ధరల ధరలు చల్లబడడంతో ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం తగ్గింది. ఏప్రిల్‌లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం 2.99 శాతంగా నమోదైంది. మార్చ్‌లో ఇది 3.8 శాతంగా ఉంది. 2011-12 బేస్ ఇయర్‌గా టోకు ధరల ద్రవ్యోల్బణ కొత్త సిరీస్‌ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో మొత్తం 697 అంశాలను కలిగి ఉండగా, వీటిలో ప్రాథమిక వస్తువులు 117, ఇంధన మరియు శక్తికి 16, తయారీ ఉత్పత్తులు 564 ఉన్నాయి. ప్రభుత్వం నేడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 1.16 శాతంగా నమోదైంది. మార్చిలో 3.82 శాతం కన్నా తక్కువ. సీపీఐ ఫుడ్ ఇన్ఫ్లేషన్ 0.61 శాతానికి పరిమితం అయింది. గత నెలలో ఇది 1.93 శాతంగా ఉంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ ద్రవ్యోల్బణం 2.54 శాతం నుంచి 1.21 శాతానికి దిగి వచ్చింది. పప్పు ధాన్యాల ద్రవ్యోల్బణం 15.94 శాతానికి చేరుకుంది. కూరగాయల ధరలు మైనస్ 1.24 శాతం నుంచి -8.59 శాతానికి తగ్గాయి.ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 18.52 శాతంగా ఉండగా, తయారీ రంగ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 2.66 శాతం నమోదైంది. కొత్త సిరీస్ డేటా ప్రకారం ఫ్యూయల్ అండ్ లైట్ ఇన్ఫ్లేషన్ 5.56 శాతం నుంచి 6.13 శాతానికి పెరిగింది. క్లోతింగ్ అండ్ ఫుట్ వేర్ ద్రవ్యోల్బణం 4.6 శాతం నుంచి స్వల్పంగా తగ్గి 4.58 శాతంగా పరిమితమైంది. గ్రామీణ ద్రవ్యోల్బణం 3.75 శాతం నుంచి 3.02 శాతానికి దిగి రావడం విశేషం. హౌసింగ్ ఇన్ఫ్లేషన్ 4.86 శాతానికి చేరుకుంది. ఇక పాన్ అండ్ టుబాకో ఇన్ఫ్లేషన్ 6.23 శాతం నుంచి 6.05 శాతానికి తగ్గింది. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు మార్చి నెలలో 2.7 శాతానికి తగ్గింది, అంతకు ముందు సంవత్సరం ఇది 5.5 శాతంగా ఉంది. -
రిలయన్స్‌లో భారీ అమ్మకాలు: నష్టాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి సెబీ ఇచ్చిన షాక్ మార్కెట్లను బాగానే తాకింది. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్నుంచి నిషేధించడంతో ఆర్ఐఎల్ షేర్లలో మదుపర్ల అమ్మకాలకు తోడు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్‌కు నెగెటివ్ గా మారాయి. సెన్సెక్స్78 పాయింట్లు క్షీణించి 29,343వద్ద నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 9,081ను వద్ద కొనసాగుతోంది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,100 స్థాయి దిగువకు చేరింది. అటు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ బిల్లును నేడు పార్లమెంటులోప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో కొనసాగుతుండగా పీఎస్‌యూ బ్యాంకింగ్ లాభాల్లో ఉంది. 2 శాతం నష్టాలతో కోల్ ఇండియా, ఆర్ఐఎల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.బీవోబీ, పవర్‌గ్రిడ్, గెయిల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, గ్రాసిమ్ , మదర్ సన్ సుమి లాభాల్లోనూ, అరబిందో, ఐడియా, లుపిన్ తదితర షేర్లు నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి భారీగా లాభపడింది. 42పైసల లాభంతో రూ.65.11 వద్ద ఉంది. -
బంగారం @రూ.30 వేలు
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు వరుస సెషన్లలో పరుగులు పెడుతున్న డాలర్ బలపడటంతో బుధవారం గరిష్టస్థాయి నుంచి కొద్దిగా క్షీణించాయ. ట్రంప్ వివాదాస్పద నిర్ణయాల కారణంగా డాలర్ విలువ నేలచూపులు చూస్తుండడంతో ఈ విలువైన మెటల్ కు డిమాండ్ పుంజుకోవడంతో మంగళవారం మూడునెలల గరిష్టాన్ని తాకింది. స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి ఔన్స్ బంగారం ధర 1,234 డాలర్లు గా నమోదైంది. అయితే అమెరికా, యూరోప్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్తితుల కారణంగా డాలర్ బుధవారం కొద్దిగా బలపడింది. డాలర్ ఇండెక్స్ 0.2శాతం ఎగిసి 100.510వద్ద ఉంది. అమెరికాలో గోల్డ్ ఫ్యూచర్స్ లో 0.2 శాతం క్షీణించి 1,231డాలర్ల వద్ద ఉంది. వెండి ధరలు కూడా ఇటీవలి గరిష్టంనుంచి స్వల్పంగా 0.1శాతంక్షీణించి 17.69 డా డాలర్లుగా ఉంది. ప్లాటినం 0.6శాతం ఎగిసి 1,007.20 డాలర్లుగా ఉండగా పల్లాడియం 0.1 శాతం బలహీనంగా ఉంది. ట్రంప్ విధించిన ఏడు ముస్లిం మతం దేశాలనుంచి ప్రజలపై ట్రంప్స్ తాత్కాలిక వీసా బ్యాన్ నిషేధం వివాదం, రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఐరోపాలో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో డాలర్ డిమాండ్ క్షీణిస్తోంది. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిపై బులియన్ మార్కెట్లో ఆసక్తి నెలకొంది. అయితే జనవరి సీపీఐ డాటాపై పసిడి పరుగు ఆధారపడి ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇటు దేశీయం కూడా మూడునెలల గరిష్టాన్ని తాకిన బంగారం ధర పదిగ్రా. రూ.30వేల స్థాయిని తాకింది. బుధవారం డాలర్ బలపడడంతో మూడునెలల గరిష్టం నుంచి బంగారం ధరలు కొద్దిగా వెనక్కి తగ్గాయి. ముంబై మార్కెట్లో 22 కారెట్ల బంగారం ధర పది గ్రా. రూ. 28540 ఉండగా, 24 కారెట్ల ధర రూ. 30524 వద్ద ఉంది. ఢిల్లీలోరూ. 28400 ( 22 కారెట్లు పదిగ్రా.), రూ.30374 (24 కారెట్లు పదిగ్రా.) గా వుంది. హైదరాబాద్‌లో రూ. 28310 (22 కారెట్లు పదిగ్రా.) రూ. 30278 ( 24 కారెట్లు పదిగ్రా.)గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బుధవారం పసిడి పది గ్రా. రూ.47 నష్టపోయి రూ.29,285 పలుకుతోంది. -
డాలర్ స్లిప్.. రుపీ అప్
ముంబై: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తరువాత ప్రారంభ ఉపన్యాసంలో పన్ను కోతలు, ఇతర ఉద్దీపన వాగ్దానాల నేపథ్యంలో సోమవారం కరెన్సీ మార్కెట్ లో డాలర్ క్షీణించింది. విదేశాలతో అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నా యన్న అంశంపై కొంతమేర ఆందోళనలు నెలకొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ట్రాన్స్-పసిఫిక్ భాగస్వామ్యం (టీపీపీ) 12-దేశాలతో ఉన్న ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఉపసంహరించుకోవడానికి అంగీకారాన్ని ప్రకటించడంతో డాలర్ బలహీనపడిందని తెలిపారు. దీంతో దేశీయ కరెన్సీ సోమవారం భారీగా లాభపడింది. అమెరికా కరెన్సీ డాలర్ అమ్మకాలు పెరగడంతో ప్రారంభ వాణిజ్యంలో రుపీ బాగా బలపడింది. ఇతర కరెన్సీలతో డాలర్ బలహీనపడటంతో దేశీయ కరెన్సీ రూపాయికి మద్దతు లభించింది. డాలర్ తో పోలిస్తే రూపాయి 17 పైసలు లాభపడి రూ. 68.01 ని నమోదు చేసింది. ప్రస్తుతం 9 పైసల లాభంతో రూ. 68.10 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయల్ 0.2 శాతం ఎగిసింది. బ్యారెల్ ముడి చమురు రధ 55.58డాలర్ల వద్ద కొనసాగుతోంది. అయితే దేశీయ ఈక్విటీ మార్కెట్ లోని ప్రారంభ నష్టాలతో ప్రారంభలాభాలను స్వల్పంగా కోల్పోయినట్టు ఫారెక్స్ డీలర్లు తెలిపారు. గత ముగింపులో 5 పైసలు నష్టంతో రూ. 68.18 వద్ద ముగిసింది. వారం కనిష్ఠాన్ని నమోదుచేసింది. ప్రపంచ వ్యాపారం కుంచించనుందనే అంచనాల నేపథ్యంలో మార్కెట్లలోఆందోళన నెలకొందని టోక్యో స్టాండర్ట్ చార్టర్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోయిషీ యాషీకావా అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ అనుసరించినున్న పన్ను కోతలు , అవస్థాపన ఖర్చులు సహా ఇతర విధానాలు సెనేట్ ఆమోదం అంత సులభం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు. కాగా డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ఐదురోజుల నష్టాలకుబ్రేక్ వేసి లాభాలతో ముగిశాయి. అన్ని అంశాలలోనూ అమెరికన్లు, స్వదేశానికే ప్రాధాన్యమివ్వనున్నట్టు ట్రంప్ స్పష్టం చేయడంతో సెంటిమెంట్ బలపడింది. -
పబ్లిగ్గా ప్యాంటు లాగేసింది..!
-
పబ్లిగ్గా ప్యాంటు లాగేసింది..!
బీజింగ్: బస్సులో ప్రయాణిస్తున్న ఓ పురుషుడికి చెప్పుకోలేని అవమానం ఎదురైంది. తన పాటికి తాను బస్సులో నిలబడి ప్రయాణిస్తుండగా.. హఠాత్తుగా ఓ యువతి అతడి ప్యాంటును లాగింది. మోకాళ్ల కిందకు జారీపోయిన ప్యాంటుతో ఆ యువకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సరేలే అని సర్దుకున్నా.. సీసీ కెమెరాల పుణ్యమా అని అతడి వీడియో ఇప్పుడు అంతర్జాలంలో హాట్‌టాపిక్‌గా మారింది. చైనాలోని వూ షాన్లులో ఈ ఘటన జరిగింది. బస్సులో ఓ యువతి తన హ్యాండ్ బ్యాగులోని వస్తువులు కిందపడేసుకుంది. వాటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో యువతి బ్యాలెన్స్ తప్పి.. రక్షించుకునే క్రమంలో అక్కడే నిల్చున్న యువకుడి ప్యాంటు పట్టుకుంది. అదికాస్తా జారిపోవటంతో ఆ యువతి కిందపడక తప్పలేదు. ఈ దృశ్యాలపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సెటైర్లు వస్తున్నాయి. అయితే.. 'పాపం ఆ యువతి కావాలని లాగలేదు' అని కొందరు వెనుకేసుకొస్తున్నారు. -
ఏపీలో అడ్డగోలుగా ఇంటర్ పరీక్షలు
అర్ధవీడు: ఏపీలోని ప్రకాశం జిల్లాలో మండల కేంద్రమైన అర్ధవీడు ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పరీక్షలు మూడు స్లిప్పులు.. ఆరు సమాధానాలు అన్నట్లు సాగుతున్నాయి. పరీక్ష మొదలైన 20 నిమిషాలకే అధ్యాపకులు ప్రశ్నపత్రాన్ని బయటకు తెప్పించుకుని కార్బన్ పేపరు ఉపయోగించి స్లిప్పులు రాసి విద్యార్థులకు పంపుతున్నారు. ఈ విషయమై సమాచారం అందిన ‘సాక్షి’ విలేకరి గురువారం పరీక్ష కేంద్రానికి వెళ్లగా లెక్కలు-1బి ప్రశ్నపత్రానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్టాఫ్ రూంలో కాంట్రాక్టు అధ్యాపకులు డానియేలు, రాజు, జూనియర్ లెక్చరర్ వనిపాల్‌రెడ్డి కార్బన్ పేపర్లు పెట్టి జవాబులు రాస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే గదిలోనుంచి పరారయ్యారు. పరీక్షల చీఫ్ అయిన ప్రిన్సిపాల్ కుటుంబరావు, డిపార్ట్మెంటల్ అధికారి బి.శివలక్ష్మి కనుసన్నల్లో ఈ వ్యవహారం జరుగుతోందని, దీనికి ఆ ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు కూడా సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి. మరెలా పాస్ అవుతారు: ప్రిన్సిపాల్ మాస్ కాపీయింగ్ జరుగుతున్న తీరుపై ప్రిన్సిపాల్ కుటుంబరావును ‘సాక్షి’ అడగగా మారుమూల ప్రాంతంలో కాపీలు జరగకపోతే ఎలా పాస్ అవుతారు అని ప్రశ్నించారు. వెంటనే నాలుక్కరచుకొని ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం పరీక్షలు పకడ్బందీగా జరుగుతున్నాయని చెప్పారు. -
విద్యుత్ స్తంభం నుంచి జారిపడి వ్యక్తి మృతి
గార : విద్యుత్ స్తంభం నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం ఉప్పరపేటలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని సాలిహుండం గ్రామానికి చెందిన జల్లు వనజయ్య(48) అనే వ్యక్తి గ్రామంలో విద్యుత్ స్తంభాలకు లైట్లు బిగిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సులోనుంచి జారిపడి వ్యక్తిమృతి
-
మూసీనదిలోపడి వ్యక్తి మృతి