సాక్షి, ముంబై: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు భారీగా నష్టపోతోంది. విదేశీ బ్రోకింగ్ సంస్థ మక్వారీ సహా రెండు కంపెనీలు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో ఐటీసీ కౌంటర్ బలహీనపడింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఈ షేరు 2.25 శాతం క్షీణించి రూ. 275 దిగువకు చేరింది.
రెండు బ్రోకరేజ్ సంస్థలు సంస్థకు డౌన్ గ్రేడ్ ర్యాంక్‌ను ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన అమ్మకాలకు తెర తీసింది. మార్చి 2018 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 4శాతం తగ్గిపోతుందని బ్రోకరేజీలు అంచనా వేశాయి. ముఖ్యంగా సిగరెట్ అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఐటీసీకంటే హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) పెట్టుబడులకు అనుకూలమంటూ మెక్వారీ తాజాగా పేర్కొంది. గత రెండు నెలల్లో అంటే జూలై-ఆగస్ట్‌లలో సిగరెట్ అమ్మకాల పరిమాణం క్షీణించినట్లు తెలియజేసింది. దీంతో వచ్చే ఏడాదికి టార్గెట్ ధరను రూ. 340 నుంచి రూ. 304కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
కాగా ఐటీసీ సిగరెట్లు, హోటళ్ళు, కాగితపుఅట్టలు, స్పెషల్ పేపర్లు, ప్యాకేజింగ్, అగ్రి-బిజినెస్, ప్యాక్ చేసిన ఆహారాలు, మిఠాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్రాండెడ్ దుస్తులు, పర్సనల్ కేర్, స్టేషనరీ తదితర ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులతో పాటు ఐటీసీ సిగరెట్ల ఉత్పత్తిలో మార్కెట్ లీడర్‌గా ఉంది.