Brokerages
-
రిలయన్స్‌కు షాకిచ్చిన బ్రోకరేజ్‌లు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలైన సీఎల్ఎస్ఏ, ఎడెల్వీజ్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు షాక్‌నిచ్చాయి. నిఫ్టీ ఇండెక్స్‌ను ముందుండి నడిపిస్తున్న రిలయన్స్ షేరుకు డౌన్‌గ్రేడ్ రేటింగ్‌ను కేటాయించాయి. మార్చి కనిష్టస్థాయి రూ.867.82 నుంచి రిలయన్స్ షేరు 150శాతం ర్యాలీ చేసి ఇటీవల రూ.2000 స్థాయిని అందుకుంది. ‘‘నిధుల సమీకరణ, రుణాన్ని తగ్గించుకోవడం, వ్యాపారాల వాల్యూ అన్‌లాక్ కావడంతో షేరు అధికంగా ర్యాలీ చేసింది. వాల్యూయేషన్లు అధికంగా ఉన్నాయి. ఈ పరిణామాలు అప్రమత్తతకు సంకేతాలు’’ అని రెండు బ్రోకరేజ్ సంస్థలు అభిప్రాయపడ్డాయి. ఇప్పుడు రిలయన్స్ షేరుపై ఆయా బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణలను చూద్దాం... ఎడెల్వీజ్ బ్రోకరేజ్: రిలయన్స్ షేరుకు ‘‘హోల్డ్’’ రేటింగ్‌ను కేటాయించింది. టార్గెట్ ధరను రూ.2105గా నిర్ణయించింది. రుణాలను తగ్గించుకోవడం, అసెట్ మోనిటైజేషన్, వ్యాపారంలో డిజిటల్ మూమెంట్ తదితర అంశాలు షేరును రూ.2000స్థాయిని అందుకునేందుకు తోడ్పడినట్లు ఎడెల్వీజ్ బ్రోకరేజ్ తెలిపింది. రిలయన్స్ షేరు ఏడాది ప్రైజ్ -టు -ఎర్నింగ్స్ 47.2రెట్ల నిష్పత్తి వద్ద ట్రేడ్ అవుతోందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ విలువ వాస్తవ విలువ కంటే అధికంగా ఉందని తెలిపింది. షేరు ధర పతనం ఒక క్రమపద్ధతిలో ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఈ బ్రోకరేజ్ సంస్థ 2016 నుంచి రిలయన్స్ షేరుపై పాజిటివ్‌గానే ఉంది. ఈ 4ఏళ్లలో షేరు 400శాతం ర్యాలీ చేసింది. సీఎల్ఎస్ఏ బ్రోకరేజ్: రిలయన్స్ షేరు రేటింగ్‌ను ‘‘అవుట్‌ఫెర్‌ఫామ్’’ నుంచి ‘‘బై’’కు కుదించింది. అయితే టార్గెట్ ధరను మాత్రం రూ.2,250కి పెంచింది. ఈ టార్గెట్ ధర షేరు ప్రస్తుత ధరకు అతి దగ్గరలో ఉంది. మార్చి 2022 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 220 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తుంది. అయితే షేరు ర్యాలీ స్వల్పకాలంలో ఆగిపోతుందని విశ్వసిస్తుంది. గడిచిన 4ఏళ్లలో షేరు 400శాతానికి పైగా ర్యాలీ చేసింది. 4నెలల్లో 150శాతం ర్యాలీ చేసింది. ఇప్పుడు స్టాక్ ర్యాలీ కొంతకాలం పాటు ఆగిపోవచ్చని సీఎల్ఎస్ఏ తన నివేదికలో తెలిపింది. -
వచ్చే 6నెలల్లో 26శాతం లాభపడే 7స్టాకులు ఇవే..!
ఈ ఏడాది ద్వితీయార్థంలో 26శాతం వరకు ర్యాలీ చేసే 7స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సిఫార్సు చేసింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్, టోరెంటో, నాట్కో, ఎంసీఎక్స్, దీపక్ నైట్రేట్, ర్యాలీస్ ఇండియా, బజాజ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు ఇందులో ఉన్నాయి. ఈ షేర్లన్నీ మిడ్, స్మాల్ క్యాప్ రంగానికి చెందినవి కావడం విశేషం. దాదాపు రెండేళ్ల పాటు బేర్ ఫేజ్‌లో ఉన్న విస్తృత మార్కెట్ ఇప్పుడు బుల్ ఫేజ్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమైనట్లు అనేక ఛార్ట్లు సూచిస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో పేర్కోంది. జరగబోయే ఈ మార్కెట్ ర్యాలీలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ రంగ షేర్ల హావా కొనసాగుతుందని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. వచ్చే 6నెలల్లో 26శాతం లాభాలన్ని ఇచ్చే 7 స్టాక్‌లు 1. బాలకృష్ణ ఇండస్ట్రీస్: షేరు టార్గెట్ ధరను రూ.1535గా నిర్ణయించింది. ఈ ఏడాది చివరి కల్లా 22శాతం ర్యాలీ చేయవచ్చు. ఈ షేరును రూ.1230-1280 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ మొత్తం రూ.24472 కోట్లుగా ఉంది. 2. టోరెంటో: షేరు ఏడాది ద్వితీయార్థంలో 22శాతం ర్యాలీ చేయవచ్చు. షేరుకు టార్గెట్ ధర రూ.740గా నిర్ణయించడమైంది. రూ.585-620 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు.కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.23099 కోట్లుగా ఉంది. 3. నాట్కో ఫార్మా: ఈ షేరును రూ.770 టార్గెట్ ధరతో రూ.600-635 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది రెండో భాగంలో 23శాతం పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 11470 కోట్లుగా ఉంది. 4. దీపక్ నైట్రేట్: రానున్న 6నెలల్లో 21శాతం ర్యాలీ చేయవచ్చు. ఈ షేరును రూ.570 టార్గెట్ ధరగా రూ.450-485 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ మార్కెట్ రూ.6626 కోట్లుగా ఉంది. 5. ఎంసీఎక్స్: షేరు టార్గెట్ ధరను రూ.1515గా నిర్ణయించడమైంది. ఈ ఏడాది చివరి కల్లా 21శాతం ర్యాలీ చేయవచ్చు. ఈ షేరును రూ.1230-1280 శ్రేణిలో కొనుగోలు చేయవచ్చు. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ మొత్తం రూ.6361 కోట్లుగా ఉంది. 6. ర్యాలీస్ ఇండియా: షేరు ఏడాది ద్వితీయార్థంలో 26శాతం ర్యాలీ చేయవచ్చు. షేరుకు టార్గెట్ ధర రూ.330గా నిర్ణయించడమైంది. రూ.250-272 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.5208 కోట్లుగా ఉంది. 7. బజాజ్ ఎలక్ట్రానిక్స్: ఈ షేరును రూ.470 టార్గెట్ ధరగా రూ.370-390 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఏడాది రెండో భాగంలో 23శాతం పెరిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4489 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 13శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 9శాతం, సెన్సెక్స్ 14శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇదే కాలంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సిఫార్సు చేసిన 6 స్టాకులు స్థిరంగా రాణించాయి. అందులో అత్యధికంగా ర్యాలీస్ ఇండియా షేరు 60శాతం లాభపడింది. అలాగే దీపక్ నైట్రేట్ 28శాతం, బాలకృష్ట ఇండస్ట్రీస్ 28శాతం, ట్రెంట్ 17శాతం, బజాజ్ ఎలక్ట్రానిక్స్ 11శాతం, నాట్కో ఫార్మా ఇండెక్స్ 7శాతం ర్యాలీ చేశాయి. -
ఐటీసీ ఫలితాలు వచ్చాయ్... కొనాలా? అమ్మాలా?
ఐటీసీ కంపెనీ శనివారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికపు ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ4లో స్టాండ్అలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.3,797 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవతర్సంలో కంపెనీ ఆర్జించిన నికర లాభంతో పోలిస్తే ఇది 6.5శాతం అధికం. మార్చి చివరి వారంలో విధించి లాక్డౌన్ కారణంగా నిర్వహణ ఆదాయం 6.4శాతం క్షీణంచి రూ.11,420 కోట్లకు పరిమితమైంది. ఇదే క్వార్టర్లో ఈబీఐటీడీఏ 8.9శాతం క్షీణించి రూ.4,163.5 కోట్లుగా నమోదైంది. మార్చి క్వార్టర్ ఫలితాల ప్రకటన తర్వాత సోమవారం ఇంట్రాడేలో ఈ షేరు 4శాతం లాభపడి, చివరికి 1శాతం లాభంతో రూ.197 వద్ద సిర్థపడింది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్ సంస్థలు ఐటీసీపై అభిప్రాయాలను వెలువరిచాయి. 1.బ్రోకరేజ్ సంస్థ: జెఫ్పారీస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.240 విశ్లేషణ: కరోనా ప్రేరేపిత లాక్డౌన్ విధింపు ప్రభావంతో వార్షిక ప్రాతిపదికన సిగరెట్ అమ్మకాల వ్యాల్యూమ్స్ 10శాతం క్షీణతను చవిచూశాయి. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్స్ సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు మరింత దారుణంగా ఉండొచ్చు. ఏది ఏమైనా కంపెనీ డివిడెండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మార్చింది. 2. బ్రోకరేజ్ సంస్థ: మెక్వ్యెరీ రేటింగ్: అవుట్‌ఫెర్‌ఫామ్ టార్గెట్ ధర: రూ.232 విశ్లేషణ: కోవిడ్-19 తొలి దశ అమ్మకాలతో పోలిస్తే ఈ జూన్‌లో సిగరెట్ అమ్మకాల రికవరీ 85-90శాతంగా ఉండొచ్చు. తన ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఎంసీజీ వ్యాపారంలో అత్యుత్తమంగా రాణించవచ్చు. కంపెనీ డివిండ్ ఈల్డ్ 5శాతం ఉండటం షేరును ఆకర్షణీయంగా మరింత మార్చింది. 3. బ్రోకరేజ్ సంస్థ: సీఎల్ఎస్ఏ రేటింగ్: అవుట్‌ఫెర్‌ఫామ్ టార్గెట్ ధర: రూ.220 విశ్లేషణ: స్వల్ప కాలం పాటు కఠినమైన పరిస్థితులు ఎదుర్కోంటుంది. ఆర్థిక సంవత్సరం 2020లో ఒక్కొక్క షేరుకు డివిడెండ్ చెల్లింపు 88శాతానికి పెరగడం షేరు తదుపరి ర్యాలీకి ఉత్సాహాన్నిచ్చే అంశం. 4.బ్రోకరేజ్ సంస్థ: మోతీలాల్ ఓస్వాల్ సర్వీసెస్ రేటింగ్: న్యూట్రల్ టార్గెట్ ధర: రూ.190 విశ్లేషణ: ఆర్థిక సంవత్సరం 2020 నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాల కన్నా తక్కువగానే ఉన్నాయి. లాక్‌డౌన్‌తో సమయంతో పోలిస్తే ప్రస్తుత సిగరెట్ అమ్మకాల వాల్యూమ్స్ సాధారణ స్థితికి వచ్చాయి. అయితే రాబోయే కొద్ది నెలల్లో మరింత జీఎస్టీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. 1. ఐటీసీ మొత్తం లాభదాయకత కేవలం సిగరెట్లపై ఆధారపడి ఉంది. 2. జీఎస్టీ పెరుగుదల భయాలతో ఇప్పటికే ఎఫ్వై 20-22లో బలహీనమైన ఆదాయ వృద్ధి అంచనాల ప్రమాదం నెలకొంది. ఈ కారణాలతో షేరుకు న్యూట్రల్ రేటింగ్‌ను కేటాయించడమైంది. -
రిలయన్స్ షేరుపై బ్రోకరేజ్‌లకు ఎందుకంత మోజు..?
దేశీయ ప్రైవేట్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఈ ఏడాది మార్చి కనిష్టస్థాయి నుంచి షేరు ఏకంగా 80శాతం పెరిగింది. కేవలం 3నెలల్లోనే 10 విదేశీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు రిలయన్స్ జియోలో దాదాపు రూ.1.04లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడం షేరు ర్యాలీకి కారణమైనట్లు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వారంలో మంగళవారం ఇంట్రాడే షేరు రూ.1647 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. ఈ షేరు ఇంత స్థాయిలో ర్యాలీ చేసినప్పటికీ.., రానున్న రోజుల్లో మరింత లాభపడేందుకు అవకాశాలున్నట్లు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలైన మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్‌మెన్ శాక్స్, సీఎల్‌ఎస్‌ఏలు రిలయన్స్ షేరుపై ఇప్పటికీ బుల్లిష్ వైఖరిని కలిగి ఉన్నాయి. ఈ షేరుపై ఆయా సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి... మోర్గాన్ స్టాన్లీ: ఆస్తుల అమ్మకాలు, ఇంధన విభాగంలో క్యాష్ ఫ్లోలు తిరిగి పుంజుకోవడం, రిటైల్ అమ్మకాలు పెరగడం, టెలికాం యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరగడం తదితర కారణాలతో షేరు రానున్న రోజుల్లో మరింత ర్యాలీ చేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. ‘‘ ఏడాది తర్వాత ప్రైస్-టు-ఎర్నింగ్ (పీ/ఈ), ప్రైస్-టు-బుక్ (పీ/బీ)లు ఇప్పుడు సైకిల్ లెవల్లో గరిష్టస్థాయి వద్ద ఉన్నాయి. అయితే ఈక్విటీపై రిటర్న్(ఆర్ఓఈ), వృద్ధి ఆదాయాలను తన సహచర కంపెనీలు(పీర్స్)తో పోలిస్తే అధికంగా ఉన్నాయి.’’ అని మోర్గాన్ స్టాన్లీ ఈక్విటి విశ్లేషకుడు మయాంక్ మహేశ్వర్ తెలిపారు. మోర్గాన్ స్లాన్టీ ఈ షేరుపై ఓవర్‌వెయిట్ రేటింగ్‌ను కొనసాగించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.1801కి పెంచింది. గోల్డ్‌మెన్ శాక్స్: బ్రోకరేజ్ అంచనాల ప్రకారం.... ఆఫ్‌లైన్ గ్రాసరీ స్టోర్ విస్తరణ-ఆధారిత మార్కెట్ వాటా, ఆన్లైన్ గ్రాసరీ మార్కెట్ విస్తరణతో రిలయన్స్ గ్రాసరీ రీటైల్ స్థూల వ్యాపారణ విలువ ఆర్థిక సంవత్సరం 2029 నాటికి 83బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. అంతేకాకుండా, రిటైల్ వ్యాపారం ఎబిడిటా ఎఫ్వై 20-29 మధ్య 5.6 రెట్ల వృద్ధిని సాధిస్తుందని బ్రోకరేజ్ సంస్థ ఆశిస్తోంది. గోల్డ్‌మెన్ శాక్స్ ''బై'' రేటింగ్ కేటాయించడంతో పాటు పాటు షేరు టార్గెట్ ధరను రూ.1755గా నిర్ణయించింది సీఎల్ఎస్ఏ: ఈ-కామర్స్ రంగంలో విజయవంతం కావడం, ఇన్విట్ టవర్ల వాటా అమ్మకం, జియో ఫ్లాట్‌ఫామ్‌లో మరింత వాటా విక్రయం, అరామ్కో ఒప్పందం తదితదర అంశాలు రిలయన్స్ షేరు తదుపరి ర్యాలీని నడిపిస్తాయని బ్రోకరేజ్ సంస్థ తెలిపింది. ఇటీవల ఫేస్‌బుక్‌తో ఒప్పందం జియో మార్ట్‌కు కలిసొస్తుంది. ఫేస్బుక్ అనుబంధ సంస్థ వాట్సప్ ద్వారా వినియోగదారులతో సత్సంబంధం పెంచుకోవడం, నిరంతరం వారికి అందుబాటులో ఉండటంతో వ్యాపార అభివృద్ధికి మరింత కలిసొస్తుందని సీఎల్ఎస్ఏ తెలిపింది. సీఎల్‌ఎస్‌ఈ బ్రోకరేజ్ సంస్థ సైతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరుపై బుల్లిష్ వైఖరిని కలిగి ఉంది. -
క్యూ4 ఫలితాల తర్వాత ఎస్బీఐ టార్గెట్ ధర తగ్గింపు
ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ గతవారంలో శుక్రవారం త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. ఫలితాలు అంచనాలకు మించి నమోదయ్యాయి. రుణ వృద్ధి స్తబ్దుగా ఉండటం, నికర వడ్డీ మార్జిన్లు ఇప్పటికీ ఒత్తిళ్లను ఎదుర్కోంటున్న నేపథ్యంలో పలు బ్రోకరేజ్ సంస్థలు ఎస్బీఐ షేరు టార్గెట్ ధరను తగ్గించాయి. అయితే తక్కువ వాల్యూయేషన్లు, మంచి అసెట్ నాణ్యతను కలిగి ఉండటంతో చాలా బ్రోకరేజ్ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి. యస్ బ్యాంక్ సంక్షోభం తర్వాత ఎస్బీఐ డిపాజిట్లు భారీగా పెరగడం కలిసొచ్చే అంశంగా ఉందని బ్రోకరేజ్ సంస్థలు చెప్పుకొచ్చాయి. డిపాజిట్లు, అండర్రైట్, డిజిటలైజేషన్ అంశాల కారణంగా ఎస్బీఐ అత్యుత్తమ ప్రమాణాలను కనబరుస్తోంది. అనుబంధ సంస్థల వాల్యూయేషన్లను అన్‌లాక్ చేయగల భారీ సామర్థ్యం, బ్యాంక్ నిర్వహణ లాభం 1.7-2.0 శాతంగా నమోదు కావడం తదితర సానుకూలాంశాలతో ఎస్బీఐ ఒత్తిళ్లను తట్టుకోగలుగుతుంది. ‘‘మార్చి తర్వాత ఎంసీఎల్ఆర్ 50బేసిస్ పాయింట్లు తగ్గడంతో నికర వడ్డీ మార్జిన్లకు మరింత ప్రమాదం పొంచి ఉంది. ఆకర్షణీయమైన వాల్యూయేషన్, బలమైన ఫ్రాంచైజీలు ఉన్నప్పటికీ.., ఆర్థిక / సామాజిక బాధ్యతల భారాన్ని భరించడంలో ముందంజలో ఉండటం ఎస్బీఐ మరింత ఒత్తిడిని పెంచుతుంది.’’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బ్రోకరేజ్ చెప్పుకొచ్చింది. మారిటోరియం పరిగణనలోకి తీసుకుంటే ఇతర రుణదాతలతో పోల్చితే ఎస్బీఐ తక్కువ కేటాయింపులు జరపడం నిరాశపరిచిందని ఎంకే గ్లోబల్ సంస్థ తెలిపింది. -
రికార్డ్ స్థాయికి ఆర్ఐఎల్
సాక్షి, ముంబై: అటు ఫలితాల జోష్, ఇటు ఎనలిస్టుల అంచనాల నేపథ్యంలో సోమవారం నాటి బుల్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కూడా రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్ఐఎల్ కౌంటర్లో కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీంతో ఇంట్రాడేలో రెండున్నర శాతం లాభపడి ఆల్‌టైమ్ గరిష్టానికి చేరింది. రూ. 1157వద్ద సరికొత్త రికార్డు ఆర్ఐఎల్ క్రియేట్ చేసింది. 1991, జనవరి తరువాత ఇదే అదిపెద్ద లాభమని విశ్లేషకులు తెలిపారు. మరోవైపు గోల్డ్‌మన్ సాచే, మోర్గాన్ స్టాన్లీ, మోతీలాల్, నోమురా, ఎడిల్వీస్ తదితర బ్రోకరేజ్ సంస్థ లన్నీ బై రేటింగ్‌ను ఇచ్చాయి. ఆర్ఐఎల్ షేరు ప్రైస్ టార్గెట్‌ను 1200నుంచి 1400వరకు జంప్ చేయవచ్చని అంచనా వేశాయి. కాగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ ఎనలిస్టుల అంచనాలను అధిగమిస్తూ 8శాతం స్టాండలోన్ నికరలాభాన్ని నమోదు చేసింది. ఆర్ఐఎల్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో క్యూ-1లో రూ.6.12 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించిన సంగతి తెలిసిందే. -
ఐటీసికి డౌన్‌గ్రేడ్ షాక్
సాక్షి, ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ షేరు భారీగా నష్టపోతోంది. విదేశీ బ్రోకింగ్ సంస్థ మక్వారీ సహా రెండు కంపెనీలు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేయడంతో ఐటీసీ కౌంటర్ బలహీనపడింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో ఈ షేరు 2.25 శాతం క్షీణించి రూ. 275 దిగువకు చేరింది. రెండు బ్రోకరేజ్ సంస్థలు సంస్థకు డౌన్ గ్రేడ్ ర్యాంక్‌ను ఇవ్వడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన అమ్మకాలకు తెర తీసింది. మార్చి 2018 తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 4శాతం తగ్గిపోతుందని బ్రోకరేజీలు అంచనా వేశాయి. ముఖ్యంగా సిగరెట్ అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ రంగంలో ఐటీసీకంటే హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) పెట్టుబడులకు అనుకూలమంటూ మెక్వారీ తాజాగా పేర్కొంది. గత రెండు నెలల్లో అంటే జూలై-ఆగస్ట్‌లలో సిగరెట్ అమ్మకాల పరిమాణం క్షీణించినట్లు తెలియజేసింది. దీంతో వచ్చే ఏడాదికి టార్గెట్ ధరను రూ. 340 నుంచి రూ. 304కు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఐటీసీ సిగరెట్లు, హోటళ్ళు, కాగితపుఅట్టలు, స్పెషల్ పేపర్లు, ప్యాకేజింగ్, అగ్రి-బిజినెస్, ప్యాక్ చేసిన ఆహారాలు, మిఠాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్రాండెడ్ దుస్తులు, పర్సనల్ కేర్, స్టేషనరీ తదితర ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులతో పాటు ఐటీసీ సిగరెట్ల ఉత్పత్తిలో మార్కెట్ లీడర్‌గా ఉంది. -
దళారులు దయతలిస్తేనే.. లోన్లు మంజూరు
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: ‘హలో...అన్నా నాకు బీసీ కార్పొరేషన్లో లోను కావాలి.. ఇప్పించగలవా?’ ‘అలాగా...ఎంత కావాలి....పేరు... ఏ యూనిట్‌కు రుణం కావాలో వివరాలు షాపు వద్ద ఇవ్వు. రెండు రోజులు తరువాత కనపడు. లక్షకు పన్నెండు వేలు ఖర్చవుద్ది.. సరేనా!’ఇదీ సంక్షేమ కార్యాలయంలో దళారుల దందా. బీసీ, ఎస్సీ కార్పొరేషన్లో యూనిట్ మంజూరు కావాలంటే లబ్ధిదారులు కార్యాలయానికి వెళ్లనక్కర్లేదు. దళారులను ఆశ్రయిస్తే చాలు.. అన్నీ వారే చూసుకుంటారు. కానీ మంజూరైన రుణం నుంచి లక్షకు రూ.పన్నెండు వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో అధికారులకు సైతం వాటాలుంటాయని దళారులు చెబుతూ దందాను సాగిస్తుండడంతో ఇచ్చుకోలేని లబ్ధిదారులు పనులు కాక లబోదిబోమంటున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం ప్రతి ఏటా ప్రభుత్వం రుణాలను మంజూరు చేస్తుంటుంది. ఒక్కో యూనిట్‌కు రూ.60 వేల నుంచి లక్ష రూపాయల వరకు అందించే రుణాలను వివిధ వృత్తుల వారు కూడా తీసుకుని లబ్ధిపొందుతుంటారు. అయితే, లబ్ధిదారుడు ఒక యూనిట్ నెలకొల్పడానికి రూ. ల క్ష రూపాయల రుణం కోసం బీసీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే పదివేల రూపాయలు కాంట్రిబ్యూషన్ చెల్లించాలి. బ్యాంకు రుణంగా రూ.60వేలను అందిస్తుంది. రాజీవ్ అభ్యుదయ యోజన పథకం కింద ప్రభుత్వం రూ.30వేలు సబ్సీడీని ఇస్తుంది. ఇలా మంజూరయిన యూనిట్‌ను లబ్ధిదారులు సక్రమంగా నడుపుకుని బ్యాంకు రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ప్రభుత్వం కార్పొరేషన్లకు రుణాలివ్వాలని లక్ష్యాలు నిర్దేశిస్తుంది. కానీ అధికారులు దళారులకు తలొగ్గి మార్చి చివరి వరకు వాస్తవ లబ్ధిదారులకు రుణాలు అందించరనే ఆరోపణ ఉంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలో 2,500 మందికి రుణం అందించాలనే లక్ష్యాన్ని అధికారుల ముందుంచింది. అయితే ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ చివరి వరకు నాలుగు వేల దరఖాస్తులు అందినా ఏ ఒక్కరికి కూడా రుణమంజూరుకు సహకరించకపోవడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. గతేడాది 872 యూనిట్లను మంజూరు చేయాలన్న లక్ష్యం ఉండగా మొదట్లో రుణంకోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను ఏడాది చివరి వరకు ముప్పుతిప్పలు పెట్టి, వివిధ రకాల కొర్రీలు పెడుతూ కార్యాలయాల చూట్టూ తిప్పించుకున్నారు. చివరకు లక్ష్యాన్ని చాలావరకు దళారుల సహకారంతో పూరించి, వాస్తవ లబ్ధిదారులకు మొండిచెయ్యి చూపించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇప్పుడు నేరుగా దరఖాస్తు చేసుకుంటే లాభం లేదని భావించిన పలువురు లబ్ధిదారులు తప్పనిపరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారు. అంతా వారిదే రాజ్యం... బీసీ, ఎస్సీ కార్పొరేషన్లో దళారుల రాజ్యమే కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి వెళ్లే లబ్ధిదారులకు చుక్కలు చూపించే అధికారులు దళారులు తీసుకొచ్చిన దరఖాస్తులను సునాయసంగా ఎంపిక చేస్తున్నారు. దీంతో చేసేదిలేక వాస్తవ లబ్ధిదారులు దళారులను ఆశ్రయిస్తున్నారు. పేరు, ఊరు, యూనిట్ వివరాలు చెబితే చాలు కార్పొరేషన్ లోను మంజూరు నుంచి బ్యాంకు అకౌంట్ వరకు అన్నీ వారే చూసుకుంటారు. ఈ తతంగానికి లబ్ధిదారుల నుంచి లక్షకు పన్నెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. ఇందులో అధికారులకు కూడా వాటాలున్నాయని దళారులే చెబుతున్నారని, నెల నెలా వేలాది రూపాయలు వేతనాలుగా తీసుకునే అధికారులు లబ్ధిదారులను ఏడిపించడం న్యాయం కాదని ఓ బాధితుడు ‘న్యూస్‌లైన్’ ఎదుట వాపోయాడు. అంతేకాక కార్పొరేషన్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, ఇదే అదునుగా భావించిన దళారులు నకిలీ, బినామీ పేర్లతో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కాజేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమదందా నుంచి కాపాడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ ఆంజనేయశర్మ ఏమంటున్నారంటే... ఈ ఏడాది బీసీ కార్పొరేషన్‌కు 2,500 లబ్ధిదారుల లక్ష్యంగా ఉంది. ఒక్కొక్కరికి సబ్సిడీ కింద రూ.30వేలు అందిస్తాం. మండలాల వారీగా యూనిట్లను కేటాయిస్తాం. ఎక్కడా అవినీతికి ఆస్కారం ఉండదు. ఎక్కడైనా అవినీతి జరుగుతుందని తెలిస్తే చర్యలు తీసుకుంటాం.లబ్ధిదారులు నేరుగా కార్యాలయానికి మాత్రమే రావాలి. దళారులను ఆశ్రయించొద్దు. నేనున్నంత కాలం కార్పొరేషన్లో అవినీతి జరకుండా చూసుకుంటా.