ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి సెబీ ఇచ్చిన షాక్ మార్కెట్లను బాగానే తాకింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌నుంచి నిషేధించడంతో ఆర్‌ఐఎల్ షేర్లలో మదుపర్ల అమ్మకాలకు తోడు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు మార్కెట్‌కు నెగెటివ్ గా మారాయి. సెన్సెక్స్78 పాయింట్లు క్షీణించి 29,343వద్ద నిఫ్టీ 27 పాయింట్లు కోల్పోయి 9,081ను వద్ద కొనసాగుతోంది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 9,100 స్థాయి దిగువకు చేరింది. అటు కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్‌టీ బిల్లును నేడు పార్లమెంటులోప్రవేశపెట్టే అవకాశం ఉంది.
దాదాపు అన్ని రంగాలు నష్టాల్లో కొనసాగుతుండగా పీఎస్‌యూ బ్యాంకింగ్ లాభాల్లో ఉంది. 2 శాతం నష్టాలతో కోల్ ఇండియా, ఆర్‌ఐఎల్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.బీవోబీ, పవర్‌గ్రిడ్, గెయిల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్, గ్రాసిమ్ , మదర్ సన్ సుమి లాభాల్లోనూ, అరబిందో, ఐడియా, లుపిన్ తదితర షేర్లు నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి.
మరోవైపు డాలర్ మారకంలో రూపాయి భారీగా లాభపడింది. 42పైసల లాభంతో రూ.65.11 వద్ద ఉంది.